
కథా రచయిత విజయేంద్ర ప్రసాద్
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ అందించిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ త్వరలో ఓ కామెడీ హీరో సినిమాకు కథ అందించనున్నారట. బాహుబలి, భజరంగీ బాయ్‌జాన్ లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ తెలుగుతో పాటు పరభాషా చిత్రాలకు కూడా కథ అందిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ కామెడీ స్టార్ సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఆయన కథ అందించనున్నారట. ఈ సినిమాకు స‍్వర్ణ సుబ్బారావ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.