
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, సమర్పిస్తున్న చిత్రం కంచిలో మంగళవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ‘హరేరామ్’ ఫేమ్ హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. రెయిన్‌బో మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శైలేష్ వసందాని నిర్మిస్తున్నారు. ప్రియాంక అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.శైలేష్ మాట్లాడుతూ–‘‘కామాక్షి అమ్మవారి దీవెనలతో కంచిలో మా సినిమాని లాంఛనంగా ప్రారంభించాం. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, విజయేంద్రప్రసాద్, హర్షవర్థన్, శైలేష్‌తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సంతోష్ శానమొని.
Comments
Please login to add a commentAdd a comment