
‘‘తమ్ముడు సప్తగిరి సినిమా ఇది. ఒక హాస్యనటుడు సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను’’ అన్నారు బ్రహ్మానందం (Brahmanandam). సప్తగిరి లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘పెళ్లికాని ప్రసాద్’. ఈ చిత్రంలో ప్రియాంకా శర్మ హీరోయిన్. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో కేవై బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది.
పవిత్రమైన వృత్తి
హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను పది కాలాల పాటు నవ్వించాలని తపన పడేవాడు హాస్యనటుడు. హాస్యనటుడిది మనల్ని నవ్వించే వృత్తి. నిజంగా ఇది పవిత్రమైనది. ‘పెళ్లికాని ప్రసాద్’ సినిమా కోసం సప్తగిరి చాలా కష్టపడ్డాడు. నెల రోజుల నుంచి ఏకాకిగా తిరిగాడు. కనిపించే, కనిపించని దేవుళ్లందరికీ మొక్కుకున్నాడు.
మంచి జీవితం ఇవ్వండి
ఈ సినిమా సక్సెస్ అయితే ఈ ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చినందుకు హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతానన్నా అన్నాడు. కమెడియన్ ఎప్పుడూ ఒంటరి కాకూడదు. ఈ సినిమాను హిట్ చేసి, హాస్య నటుడికి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది’’ అని మరో ముఖ్య అతిథి, దర్శక–నిర్మాత మారుతి తెలిపారు. ‘‘ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్‌లో చూడండి’’ అని పేర్కొన్నారు కేవై బాబు.
పెళ్లి కాని ప్రసాద్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment