harshavardan
-
సుధీర్‌బాబు కొత్త సినిమా..ఆగస్టులో ప్రారంభం
‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాలతో బిజీగా ఉన్న హీరో సుధీర్‌బాబు తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నటుడు, రచయిత హర్షవర్థన్ ఈ చిత్రానికి దర్శకుడు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. -
ఇకపై ఎప్పుడైనా కరోనా టీకా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ వేళలపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఇకపై రోజులో ఏ సమయంలోనైనా టీకా పొందవచ్చు. టీకా పంపిణీని మరింత వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధ్దన్ చెప్పారు. ప్రజలు వారి వెసులుబాటును బట్టి అనువైన వేళల్లో టీకా తీసుకోవచ్చని సూచించారు. ప్రజల ఆరోగ్యం, సమయం విలువను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఏ వేళలోనైనా టీకా పంపిణీ చేయవచ్చని వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల సామర్థ్యాన్ని బట్టి టీకా పంపిణీ వేళలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఈ వేళల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పారు. పెరుగుతున్న కొత్త కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో వచ్చిన కొత్త కేసుల్లో 85.95 శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు పేర్కొంది. గత వారంతో పోలిస్తే ఢిల్లీ, హరియాణాల్లోనూ కేసుల పెరుగుదల కనిపించినట్లు తెలిపింది. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్లో కరోనా నియంత్రణ చర్యల్లో ఆయా రాష్ట్రాల అధికారులకు సహకరించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపినట్లు పేర్కొంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా సంబంధిత మరణాలేవీ సంభవించలేదని స్పష్టం చేసింది. 14,989 కొత్త కేసులు దేశంలో గత 24 గంటల్లో 14,989 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 98 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,57,346 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,08,12,044 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 97.06 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,70,126 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 1.53% ఉన్నాయి. మరణాల శాతం 1.41 గా ఉంది. ఇప్పటివరకూ 21,84,03,277 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం 7,85,220 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70% మందిదీర్ఘకాలిక రోగాలు ఉన్నవారే. -
దేశమంతటా టీకా పండుగ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పండుగ వాతావరణం కనిపించింది. రంగురంగుల పూలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. టీకా తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సాదర స్వాగతం పలికారు. కొన్నిచోట్ల ప్రార్థనలు సైతం చేశారు. మిఠాయిలు పంచారు. వ్యాక్సిన్ బాక్సులకు పూలదండ చేసి, హారతి ఇచ్చిన దృశ్యాలు కూడా కనిపించాయి. మనీశ్ కుమార్ ఫస్ట్ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్ కుమార్(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో అతడికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. మనీశ్ కుమార్‌కు హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఇచ్చారు. తాను గత రాత్రి కంటినిండా నిద్రపోయానని, శనివారం ఉదయమే ఎయిమ్స్‌కు చేరుకున్నానని, తోటి పారిశుధ్య కార్మికులతో మాట్లాడానని, ఆ తర్వాత టీకా తీసుకున్నానని మనీశ్ కుమార్ చెప్పాడు. టీకా తీసుకోవడానికి చాలామంది భయపడ్డారని, అందుకే అధికారుల వద్దకు వెళ్లి తానే తొలి టీకా తీసుకుంటానని కోరానని అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. టీకా తీసుకోవడం పట్ల గర్వంగా ఉందన్నాడు. కరోనా టీకా విషయంలో తన తల్లి, భార్య భయపడ్డారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. థాంక్యూ మనీశ్ కుమార్ దేశంలో కరోనా టీకా తీసుకున్న మొదటి వ్యక్తి మనీశ్ కుమార్‌కు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కృతజ్ఞతలు తెలిపారు. అతడు తొలి టీకా తీసుకొని కరోనా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బలమైన సందేశం ఇచ్చాడని ప్రశంసించారు. అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేదానిపై సంబంధం లేకుండా కరోనాపై పోరాటంలో అతడు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఢిల్లీలో పారిశుధ్య కార్మికుడైన మనీశ్ కుమార్ కోవిడ్–19 జోన్లలోనూ నిర్భయంగా విధులు నిర్వర్తించాడు. టీకా తీసుకున్న ప్రముఖులు కరోనా టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేసేందుకు చాలా మంది ప్రముఖులు తొలిరోజు ఈ టీకా పొందారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా, పశ్చిమ బెంగాల్ మంత్రి నిర్మల్ మజీ తదితరులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. తొలిరోజు 1,91,181 మందికి.. దేశవ్యాప్తంగా శనివారం 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు తలెత్తి ఆసుపత్రిలో చేరినట్లు ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలిరోజు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1,91,181 మందికి టీకా మొదటి డోసు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిషీల్డ్ మాత్రమే ఇవ్వగా, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ కూడా అందజేశారు. -
3 కోట్ల మందికి ఉచిత టీకా
న్యూఢిల్లీ: దేశంలో తొలి విడత కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా 3 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకి వ్యాక్సిన్ ఇవ్వడంలో తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. కోటి మంది వైద్య సిబ్బంది, మరో 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి విడతలో టీకా వేస్తామని శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. టీకా తీసుకోవడానికి అర్హులైన 27 కోట్ల మందికి జూలైలోగా టీకా పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే టీకా లబ్ధిదారుల జాబితా రూపొందించడానికి కసరత్తు జరుగుతోందన్నారు. శనివారం ఢిల్లీలోని టీకా డ్రైరన్ కార్యక్రమ నిర్వహణను రెండు ఆస్పత్రుల్లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా టీకా భద్రతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసిన మర్నాడే ఆరోగ్య మంత్రి తొలి విడతలో ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వదంతులు నమ్మొద్దు దేశవ్యాప్తంగా కరోనా టీకా డ్రై రన్ జరుగుతున్న నేపథ్యంలో టీకా భద్రత, సామర్థ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని మంత్రి హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదేనని హామీ ఇచ్చారు. వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేసే ముందు దానిని పరీక్షించడంలోనూ, ప్రొటోకాల్ నిబంధనలు అనుసరించడంలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు. వ్యాక్సిన్ సైడ్ అఫెక్ట్‌లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. ఒకసారి వ్యాక్సినేషన్ మొదలయ్యాక టీకా భద్రతపైనున్న అనుమానాలు తొలగిపోయి నమ్మకం వస్తుందని మంత్రి అన్నారు. పోలియా వ్యాక్సిన్ సమయంలోనూ అందరిలోనూ సందేహాలు ఉండేవని, ఆ తర్వాత అన్నీ తొలగిపోయాయన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అత్యంత భారీగా టీకా పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడంలో భారత్‌కు బాగా అనుభవం ఉందని అన్నారు. మారుమూల గ్రామంలో నివసించే ప్రజలకి కూడా టీకా అందేలా పకడ్బందీగా ప్రణాలికలు సిద్ధం చేశామన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలూ సన్నద్ధంగా ఉన్నాయన్న హర్షవర్ధన్ వచ్చేవారంలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుందని చెప్పారు. డ్రైరన్ సక్సెస్ న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా డ్రై రన్ విజయవంతంగా పూర్తయింది. దేశంలో మొదలు కానున్న భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించడం కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ నిర్వహించారు. రాష్ట్రాల రాజధానుల్లో కనీసం మూడు ప్రాంతాల్లో టీకా డ్రై రన్ జరిగింది. టీకా పంపిణీ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కొరత ఉన్న కొన్ని రాష్ట్రాల్లో రాజధానులతో పాటు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ నాలుగు జిల్లాల్లో డ్రై రన్ నిర్వహిస్తే, కర్ణాటక, తమిళనాడు అయిదు జిల్లాల్లోనూ, రాజస్థాన్ ఏడు జిల్లాల్లోనూ నిర్వహించింది. ఈ పైలెట్ రన్లో అతి పెద్ద సమస్యలేవీ ఎదురు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. డిసెంబర్ 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అసోం, పంజాబ్‌లో డ్రైరన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదురైన సమస్యల్ని పరిష్కరిస్తూ శనివారం నాటి డ్రై రన్‌కు మార్గదర్శకాల్ని సవరించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ డ్రై రన్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తారు. -
‘ఇలా అయితే కరోనా గొలుసు తెంచలేం’
సాక్షి, న్యూఢిల్లీ: మాస్క్‌ను ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు అనుసరించకుండా ఉంటే కరోనా మహమ్మారి గొలుసును తెంచడం చాలా కష్టమని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అన్నారు. హెల్త్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన ఆయన... ఇప్పటికీ చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించలేదని అన్నారు. అలా అయితే కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం సాధ్యం కాదని అన్నారు. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తరువాత దాదాపు అన్ని సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు పునఃప్రారంభం అయ్యాయని, ఇలాంటి సమయంలో కరోనా మార్గదర్శకాలు పాటించడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెల్త్ వర్క్‌ల కృషిని అభినందించారు. వారి సేవ ఎన్నటికి మరవలేనిదని అన్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చదవండి: గుడ్‌న్యూస్ : జనవరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ -
కరోనాను కట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం
-
‘కరోనా చర్యలపై కేంద్రమంత్రి అభినందించారు’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ (కోవిడ్ 19)ను నియంత్రించే చర్యల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పడిన ఐదు కమిటీల విధివిధానాలపై చర్చించామని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కాకుండా మన దేశంలో విమానయానం చేసే వారికి కూడా ఎయిర్‌పోర్టుల్లో టెస్టులు చేయాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్ 95 మాస్కుల కొరత ఉందని, ఐసోలేషన్ వార్డుల్లో పనిచేసే వారికి ఈ మాస్క్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారని మంత్రి ఈటల చెప్పారు. ఆ వివరాలను వెల్లడించారు. ‘తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణకై తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలన్నిటినీ పాటిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. గాంధీలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌కు అనుగుణంగా మరొక ల్యాబ్ ఇవ్వాలని కోరాం. సోషల్ మీడియాలో బాద్యతా రహితంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు హాజరు కావొచ్చు. మాస్కుల లభ్యతపై కమిటీ వేశాం. ఎక్కువ ధరలకు మాస్కులు అమ్ముతున్న దుకాణాదారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఇవాళ రాత్రి గాంధీ ఐసోలేషన్ వార్డు సందర్శిస్తాం. ఇటలీ నుంచి వచ్చిన వరంగల్ వ్యక్తితో పాటు నిన్న ఖమ్మం నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు టెస్టులు చేశాం. ఆ రిపోర్టులు రేపు వస్తాయి’అని మంత్రి ఈటల పేర్కొన్నారు. -
మంత్రిపై దాడికి యత్నం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్రమంత్రి హర్షవర్థన్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కొట్టుకునే దాకా వెళ్లాయి. అసభ్యకరమైన రాహుల్ వ్యాఖ్యలను ఖండించేందుకు మాటలు చాలవంటూ కేంద్రమంత్రి హర్షవర్థన్ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ సభ్యుడు మాణిక్యం మంత్రిపై దాడి చేయబోయారు. అనంతరం రెండు పార్టీల సభ్యుల నిరసనల మధ్య సభ శనివారానికి వాయిదాపడింది. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ దేశంలో వైద్యకళాశాలల ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమాధానం ఇవ్వాల్సిన ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్..ముందుగా గురువారం ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో రాహుల్ ‘ఆరు నెలల తర్వాత నిరుద్యోగ యువత ప్రధాని మోదీని కర్రలతో కొట్టి దేశం నుంచి తరిమేస్తారు’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇటువంటి అసభ్యకర వ్యాఖ్యలను ఖండించేందుకు మాటలు చాలవని పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాగూర్ అధికార పక్షం వైపు దూసుకువచ్చారు. మంత్రిపై దాడి చేసేందుకు ఆయన యత్నించగా పలువురు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ సభ్యుల నిరసనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. -
కంచిలో షురూ
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, సమర్పిస్తున్న చిత్రం కంచిలో మంగళవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ‘హరేరామ్’ ఫేమ్ హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. రెయిన్బో మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శైలేష్ వసందాని నిర్మిస్తున్నారు. ప్రియాంక అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.శైలేష్ మాట్లాడుతూ–‘‘కామాక్షి అమ్మవారి దీవెనలతో కంచిలో మా సినిమాని లాంఛనంగా ప్రారంభించాం. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, విజయేంద్రప్రసాద్, హర్షవర్థన్, శైలేష్‌తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సంతోష్ శానమొని. -
బన్నీ సినిమా నుంచి రావు రమేష్ అవుట్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు రావూ రమేష్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రావు రమేష్ తప్పుకోవటం వెనకు ఎలాంటి వివాదాలు లేదు. కేవలం డేట్స్ సర్దుబాటు కానీ కారణంగానే ఆయన తప్పుకున్నారట. ముందుగా అనుకున్న సమయం కన్నా షూటింగ్ ఆలస్యం కావటంతో రావు రమేష్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. దీంతో ఆయన స్థానంలో హర్షవర్దన్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్, సుశాంత్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
హర్షవర్ధన్ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. మంత్రి అధికార నివాసంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ వివాహ వేడుకలో వధూవరులు మయాంక్, అంకితలను సీఎం ఆశీర్వదించారు. ఆయన వెంట టీఆర్ఎస్ ఎంపీలు కేకే, బి.వినోద్‌కుమార్, సంతోష్, బండ ప్రకాశ్ ముదిరాజ్ ఉన్నారు. సీఎం కేసీఆర్‌ను హర్షవర్ధన్ ఆలింగనం చేసుకుంటూ సాదరంగా ఆహ్వానించారు. వేడుకకు హాజరైన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వధూవరులను ఆశీర్వదిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్‌ను ఆత్మీయంగా పలకరించారు. వేడుకకు హాజరైన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తదితరులతో కేసీఆర్ ముచ్చటించారు. సాయంత్రం ఢిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్ తిరిగి రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. -
హర్షవర్ధన్‌ను విచారించిన ఎన్ఐఏ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విచారించారు. గత ఏడాది అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తి దూసి హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు ఫ్యూజన్‌ఫుడ్స్‌లో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందనేది అందరూ అనుమానించినా.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు హర్షవర్ధన్ జోలికే వెళ్లలేదు. సీఎం చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడైన హర్షవర్ధన్‌తో కనీసం మాట్లాడేందుకు సాహసించలేదు. అయితే ఎన్ఐఏ నోటీసులు అందుకున్న తర్వాత హర్షవర్ధన్ పత్తాలేకుండా పోయారు. ఇదే విషయమై సాక్షిలో వార్త వచ్చిన దరిమిలా.. తనకు యాక్సిడెంట్ అయి ఇంట్లోనే కదల్లేని స్థితిలో ఉన్నానని ఎన్ఐఎ అధికారులకు హర్షవర్ధన్ సమాచారమిచ్చారు. దీంతో ఎన్ఐఏ అధికారులే రెండు రోజుల కిందట గాజువాకలోని అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆయన చెప్పిన వివరాలను మొత్తం రికార్డు చేశారు. శ్రీనివాసరావు ఎలా పరిచయం, ఎన్వోసీ లేకుండా ఎలా ఉద్యోగంలోకి తీసుకున్నారు. అతను రెస్టారెంట్లోనే కత్తులు దాచినా ఎందుకు గమనించలేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. -
100 కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలకు కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ను కోరారు. హైదరాబాద్‌లో 188 అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, దీనికోసం అటవీ పునరుజ్జీవన నిధి నిర్వహణ సంస్థ(కంపా) నిధుల్లో కేంద్రం వాటా నుంచి రూ.100 కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు పర్యావరణ అనుమతులు సత్వరం వచ్చేలా చూడాలన్నారు. కంపా నిధులతో చేపట్టే పనుల్లో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం నిష్పత్తిని 70:30గా మార్చాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును, అటవీ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలను స్వయంగా చూసేందుకు మరోసారి రాష్ట్రంలో పర్యటించాలని హర్షవర్ధన్‌ను కేసీఆర్ కోరారు.దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు.హర్షవర్ధన్‌తో కలసి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యఅధికారులతో సమావేశమయ్యారు. మొక్కల పెంపకం, అడవుల రక్షణ, అటవీ భూభాగంలో అడవి పునరుజ్జీవం, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. అడవిని పునరుజ్జీవింపచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, సామాజిక వనాల పెంపుదల కోసం చేపట్టిన కార్యక్రమాలను అటవీశాఖ అధికారులు వివరించారు. దీన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అటవీ రక్షణ కోసం కొత్త చట్టం తేవడానికి కేంద్రం యత్నిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. చెట్ల పెంపకం అవసరంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రమంత్రి సూచించారు. తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతం పెంచేలా హరితహారం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఏటా వంద కోట్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఎక్కడైనా చెట్లు పోతే, అంతే విస్తీర్ణంలో మరోచోట అడవిని పెంచే చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం నిధులు కేటాయిస్తున్నామని సీఎం చెప్పారు. ‘అడవిలో దొరికే పూలతో నిర్వహించే బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ’అని కేసీఆర్ చెప్పారు.ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పి.కె.ఝా, సీసీఎఫ్ రఘువీర్, అడిషనల్ పీసీసీఎఫ్ శోభ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి సత్యనారాయణ, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంకవర్గీస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, ఇతర అధికారులతో కలిసి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టర్లకు మొక్కల సంరక్షణ బాధ్యతలు... హరితహారంలో కోట్లాది మొక్కలు నాటుతున్నామని, వాటికి నీరు పోసి పెంచి పెద్ద చేయడంతోపాటు, రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు. ప్రతీ గ్రామంలో ఇందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ ఎస్.కె.జోషికి సీఎం కేసీఆర్ చెప్పారు. ఉపాధి హామీ, కాంపా నిధులతోపాటు ఇతర నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రతీ పాఠశాల విద్యార్థులను అడవి సందర్శనకు తీసుకెళ్లాలని చెప్పారు. తద్వారా వారికి అడవులపై అవగాహన, చెట్ల పెంపకంపై ఆసక్తి కలుగుతాయని సీఎం వివరించారు. -
‘కళ్లు’గప్పి కడతేర్చే కుట్ర!
కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పి భవిష్యత్‌పై భరోసా ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది నవంబరులో ఇడుపులపాయ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు... సరిగ్గా అప్పుడే అమరావతి కేంద్రంగా ప్రతిపక్ష నేతను అడ్డు తొలగించుకునే నీచమైన ఎత్తుగడ పురుడు పోసుకుంది. టీడీపీ నేత, ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి ద్వారా విశాఖ విమానాశ్రయంలో కుట్ర కథ నడిపించారు. ప్రతిపక్ష నేత పాదయాత్ర ఈ ఏడాది ఆగస్టులో ఉత్తరాంధ్రలోకి ప్రవేశించగానే అంటే సరిగ్గా మూడు నెలల క్రితం కుట్ర అమలుకు ప్రభుత్వ పెద్దలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సరిగ్గా అప్పటి నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయం తాజాగా వెలుగులోకి రావడం కుట్ర కోణాన్ని బహిర్గతం చేస్తోంది. (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు కలిగిన విశాఖపట్నం విమానాశ్రయంలో భద్రతా వ్యవస్థ మూడు నెలలుగా పడకేసింది. విమానాశ్రయంలో సీసీ కెమెరాల ఫుటేజీ మూడు నెలలుగా లేదని స్వయంగా విశాఖ పోలీసులే హైకోర్టుకు నివేదించడం గమనార్హం. కీలకమైన ఎయిర్‌పోర్టులో నెలల తరబడి సీసీ కెమెరాలు ఆఫ్‌లో ఉన్నాయని పోలీసులు చెప్పడం అందరినీ విస్మయపరుస్తోంది. దొంగతనాలు, ఇతర నేరాల కట్టడికి అపార్టుమెంట్లు, చిన్న వ్యాపార సంస్థల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు తరచూ చెబుతుంటారు. అలాంటిది దేశ, విదేశ ప్రముఖులు, వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ముఖ్యమైన విమానాశ్రయంలో సీసీ కెమెరాలు కచ్చితంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే ధ్యాసే లేకపోవడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కావాలనే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని, కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగానే కెమెరాలు ఆఫ్.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర మూడు నెలల క్రితం ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఆయన ప్రతి వారం విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ చివరినాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగియాల్సి ఉంది. అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఉత్తరాంధ్రలో పాదయాత్ర షెడ్యూల్ ఉన్నందున ప్రతిపక్ష నేత విశాఖపట్నం విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా దీన్నే అవకాశంగా మలుచుకుని ఆయన్ను హత్య చేసేందుకు ఏడాది క్రితం కుట్ర పన్నారు. విశాఖ విమానాశ్రయం కేంద్ర స్థానంగా.. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ నిర్వాహకుడు, టీడీపీ నేత హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి ద్వారా ఈ కథ నడిపించారు. ఆయనతో విమానాశ్రయ భద్రతాధికారి వేణుగోపాల్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా వాడుకుని తమ పన్నాగాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఉపక్రమించారు. ఏడాది క్రితమే నిందితుడు శ్రీనివాసరావును రెస్టారెంట్ వెయిటర్ ముసుగులో విమానాశ్రయంలోకి ప్రవేశపెట్టారు. ఎయిర్‌పోర్టులో ప్రవేశించేందుకు అవసరమయ్యే ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో మాటు వేశాడు. కుట్రలో భాగంగానే మూడు నెలల క్రితం విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు స్పష్టమవుతోంది. దీన్ని ఎవరు చేశారు...? ఎలా చేశారు? అనేది అంతుచిక్కకుండా జాగ్రత్త పడ్డారు. అందువల్లే సీసీ కెమెరాల ఫుటేజీలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి నియంత్రణలో ఉన్నాయి? అన్న హైకోర్టు ప్రశ్నలకు పోలీసులు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. కెమెరాలు పనిచేస్తే బండారం బట్టబయలు.. విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర ఆధారసహితంగా వెంటనే బట్టబయలయ్యేదని పోలీసువర్గాలే చెబుతున్నాయి. హత్యాయత్నం జరిగిన అక్టోబరు 25వతేదీన నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయంలో ప్రవేశించడం, అతడికి సహకరించిన మరికొందరి చర్యలు, వీఐపీ లాంజ్‌వద్ద నిందితుడి ప్రవర్తన, అదను చూసి కత్తిదూయడం, ఆ వెంటనే నిందితుడికి సహకరించినవారి స్పందన మొదలైన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యి కేసులో కీలక ఆధారాలు వెంటనే లభించేవి. వారిని విచారిస్తే ఈ కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల బండారం బహిర్గతమయ్యేది. ఈ పరిణామాలను ముందుగా ఊహించే మూడు నెలల ముందు నుంచే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని ఓ రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
వైఎస్ జగన్‌పై హత్యయత్నం కుట్రలో కొత్త కోణం
-
సందడే సందడి
సెట్లో ఫన్ రెట్టింపు అయ్యింది. అక్కడంతా సందడే సందడి. ఎందుకంటే అక్కడ ఉంది కథానాయిక కాజల్ మరి. ఆ మాత్రం హంగామా ఉంటుందిలేండి. ఇంతకీ ఫన్ అంతా ఎక్కడ? అంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా లొకేషన్లో. శ్రీనివాస్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని నిర్మిస్తున్నారు. చాగంటి శాంతయ్య సహ నిర్మాత. ఇందులో కాజల్ కథానాయిక. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూట్లో కాజల్ పాల్గొం టున్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ప్రస్తుతం శ్రీనివాస్, కాజల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ. అబ్బూరి రవి మాటలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాకు చంద్రబోస్ సింగిల్ కార్డ్ రచయితగా పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ 9 కోట్ల 50లక్షలకు అమ్ముడు పోవడం విశేషం’’ అన్నారు చిత్రబృందం. ‘సత్యం’ రాజేశ్, కల్యాణి నటరాజన్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్. -
వేదాలు గొప్పవని హాకింగే చెప్పారు
ఇంఫాల్: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం(ఉ=ఝఛి2) కంటే మెరుగైన సిద్ధాంతం వేదాల్లో ఉన్నట్లు కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఇటీవల కన్నుమూసిన ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఇంఫాల్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు. ‘ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం కంటే మెరుగైన సిద్ధాంతం మన వేదాల్లో ఉండొచ్చని హాకింగ్ గతంలో పత్రికాముఖంగా తెలిపారు’ అని చెప్పారు. సమావేశం అనంతరం ఈ వాదనలకు ఆధారమేంటని విలేకరులు ప్రశ్నించగా.. వాటిని కనుక్కోవాల్సిన బాధ్యత మీదేనన్నారు. ‘హిందూ మతంలోని ఆచార, సంప్రదాయాల్లో సైన్స్ మెండుగా ఉంది. ఆధునిక భారత్‌లో ప్రతీ ఆవిష్కరణ మన పూర్వీకులు సాధించిన వాటికి కొనసాగింపే’ అని సమావేశం అనంతరం హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఇంతకుముందు 2015లో ముంబైలో జరిగిన 102వ సైన్స్ కాంగ్రెస్‌లోనూ భారత్‌లో 7,000 ఏళ్ల క్రితం విమానాలు ఉండేవనీ, వాటిద్వారా ప్రజలు వేర్వేరు దేశాలకు, గ్రహాలకు వెళ్లేవారని వేదాల్లో ఉన్నట్లు ఓ పత్రాన్ని దాఖలుచేయడం వివాదానికి దారితీసింది. -
చివరి నిమిషంలో ‘గూగ్లీ’.. అస్సలు ఊహించలేరు
సాక్షి, సినిమా : నటుడిగానే కాదు, ఇష్క్, మనం వంటి చిత్రాలతో రచయితగా కూడా హర్షవర్ధన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితం డైరెక్టర్ అవతారంలోకి మారి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం గతేడాది రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ ఎందుకనో వాయిదా పడింది. ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధమైపోయింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆ చిత్ర టైటిల్‌ను మార్చేశాడు దర్శకుడు హర్షవర్ధన్. ‘‘క్రికెట్లో గూగ్లీ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. మా చిత్రం కూడా అంతే. క్రికెట్ లో గూగ్లీని బ్యాట్స్ మెన్ ఏ విధంగా ఊహించరో.. అలాగే ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని, అందులోని పాత్రల తీరును అస్సలు ఊహించలేరు. అందుకే టైటిల్‌ను ఇలా మార్చేశాం’’ అని హర్ష చెప్పారు. శ్రీ ముఖి, కిషోర్, మురళీ కృష్ణ, ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ విలేజ్ డ్రామా ఫిబ్రవరి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఘనంగా గణతంత్ర వేడుక
నిజామాబాద్‌కల్చరల్ న్యూస్‌లైన్ : గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రద్యుమ్న జెండా ఎగురవేశారు. అనంతరం స్వా తంత్య్ర స్ఫూర్తి, దేశభక్తి, సామాజిక అంశాల మేళవింపుతో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ కట్టిపడేశాయి. ఉపాధ్యాయురాలు కళాలలిత వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాలు కొనసాగాయి. జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి, డీఐజీ అనిల్‌కుమార్, ఎస్పీ తరుణ్‌జోషి, వివిధ శాఖాధికారులు, పార్టీల నాయకులు, ప్రముఖులు తదితరులు వీక్షించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్య గీతాలు ఆకట్టుకున్నాయి. జిల్లాకేంద్రంలోని రామకృష్ణ విద్యాలయం, వాసవి, ఆర్చిడ్, ఆర్.బి.విఆర్.ఆర్, బ్లూమింగ్‌బర్డ్స్ పాఠశాలల విద్యార్థులతో పాటు ధర్మారం సాంఘిక సంక్షేమ పాఠశాల, సుద్దపల్లి సాం ఘిక పాఠశాల, ముబారక్‌నగర్ విజయహైస్కూల్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలతో అలరించారు. కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికలను అందుకున్నారు. శకటాల ప్రదర్శన జిల్లా చరిత్రలో మొదటిసారిగా 17శాఖల శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యాన, జిల్లానీటి యాజమాన్య సంస్థ, జిల్లాగ్రామీణాభివృద్ధి-క్రాంతి పథకం, జిల్లా గృహనిర్మాణ సంస్థ, 207 వజ్ర, అగ్నిమాపక, 108, జిల్లా వైద్యఆరోగ్య, పశుసంవర్ధక, గ్రామీణనీటి సరఫరా, జిల్లాపౌర సరఫరాల, నగరపాలక, మీసేవా, పర్యాటక, రాజీవ్ విద్యామిషన్ తదితర శాఖలు తమ పోటాపోటీగా తమ శకటాలను ప్రదర్శించాయి. గృహనిర్మాణ సంస్థ రూపొందించిన శకటాన్ని, నగరపాలక సంస్థ శకటాలను కలెక్టర్, ఎస్పీ, ఆయా శాఖాధికారులను అభినందించారు.