చివరి నిమిషంలో ‘గూగ్లీ’.. అస్సలు ఊహించలేరు | Good Bad Ugly title change as Googly | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 5 2018 12:29 PM | Last Updated on Mon, Feb 5 2018 2:54 PM

Good Bad Ugly title change as Googly - Sakshi

సాక్షి, సినిమా : నటుడిగానే కాదు, ఇష్క్‌, మనం వంటి చిత్రాలతో రచయితగా కూడా హర్షవర్ధన్‌ మంచి పేరు సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితం డైరెక్టర్‌ అవతారంలోకి మారి గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం గతేడాది రిలీజ్‌ కావాల్సి ఉన్నప్పటికీ ఎందుకనో వాయిదా పడింది. ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధమైపోయింది. 

అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆ చిత్ర టైటిల్‌ను మార్చేశాడు దర్శకుడు హర్షవర్ధన్‌. ‘‘క్రికెట్‌లో గూగ్లీ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. మా చిత్రం కూడా అంతే. క్రికెట్ లో గూగ్లీని బ్యాట్స్ మెన్ ఏ విధంగా ఊహించరో.. అలాగే ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని, అందులోని పాత్రల తీరును అస్సలు ఊహించలేరు. అందుకే టైటిల్‌ను ఇలా మార్చేశాం’’ అని హర్ష చెప్పారు. 

శ్రీ ముఖి, కిషోర్‌, మురళీ కృష్ణ, ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ విలేజ్‌ డ్రామా ఫిబ్రవరి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement