సాక్షి, హిమాయత్‌నగర్ : వేగంగా విస్తరిస్తున్న మన హైదరాబాద్ సిటీలో మరిన్ని కొత్త కట్టడాలు రావాల్సిన అవసరం ఉంది. విదేశాల్లోని సిటీల్లా, రీసెంట్‌గా ప్రారంభించిన దుర్గం చెరువు ఫ్లైఓవర్ లాంటివి ఏర్పాటు చేస్తే సిటీ కొత్త కొత్తగా ఉంటుంది. టెక్నాలజీతో పాటు, శానిటేషన్ వంటి వాటిలో కూడా మార్పులు ఎంతో అవసరం. ఈ ఎన్నికల్లో సిటీని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే వారికి ఓటువేసి ఎన్నుకుందాం. - సుహాసిని, బుల్లితెర నటి
ఓటు వేస్తేనే భారతీయుడు
లక్డీకాపూల్: ఓటు ప్రజల హక్కు.. తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. ఏ పార్టీ వారికైనా కానివ్వండి.. కానీ ఓటు మాత్రం కచ్చితంగా వేయాలి. ఓటు వేసినప్పుడే ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఓటు వేస్తేనే మనం భారతీయులం.. ఓటు వేయని వాళ్లు భారతీయులే కాదన్నది నా అభిప్రాయం. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కి వెళ్తే ఏదో అబ్రాడ్‌లో ఉన్నట్లు ఉంటుంది. సిటీలో రోడ్లపై దృష్టి పెట్టాలి. రోడ్లను వెడల్పు చేసి ట్రాఫిక్‌ని తగ్గించగలిగితే ఇంకా గొప్ప సిటీ అవుతుంది.
– సప్తగిరి, సినీనటుడు
Comments
Please login to add a commentAdd a comment