casting vote
-
ఓటర్లకు జార్ఖండ్ సీఎం విజ్ఞప్తి
రాంచి (జార్ఖండ్): లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ వివిధ రాష్ట్రాల్లో చరుగ్గా సాగుతోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ సరైకేలా ఖర్సవాన్ జిల్లా జిలింగోరాలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.జిలింగ్‌గోరాలోని ఉత్క్రమిత్ మధ్య విద్యాలయలో 220 నంబర్ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం చంపయి సోరెన్.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఏఎన్ఐతో అన్నారు.తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశకు పోలింగ్ జరుగుతుండగా, ఉదయం 9 గంటల వరకు మొత్తం 10.35 ఓటింగ్ శాతం నమోదైంది. -
ఓటు వేసిన ప్రముఖులు వీరే...
-
ఓటు హక్కు వినియోగించుకున్న రాజగోపాల్ రెడ్డి
-
ఓటు హక్కు వినియోగించుకున్న పాల్వాయి స్రవంతి
-
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఈ విషయాలు తెలుసా?
ప్రస్తుతం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కొత్తగా ఎంతోమంది ఓటర్లుగా నమోదయ్యారు. గట్టిపోటీ నెలకొన్నందువల్ల రెండో ప్రాధాన్యత ఓటు కీలకమవుతుందనే అంచనాలున్నాయి. కాబట్టి ఓటు ఎలా వేయాలి, ప్రాధాన్యతలను ఎలా ఇచ్చుకుంటూ వెళ్లాలి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందనేది తెలియాలి. ఓటర్ల అవగాహన కోసం ఆ వివరాలు క్లుప్తంగా.... 1. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. రాజకీయ పార్టీల తరఫున పోటీచేస్తున్నా... వారి పేర్ల పక్కన పార్టీ గుర్తులు ఉండవు. పార్టీల అభ్యర్థులు గెలిస్తే వారికిచ్చే ధ్రువపత్రంలో ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది రాస్తారు. 2. ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి ఉంటుంది. తాము ఎవరికైతే ఓటు వేయదలచుకున్నారో వారి పేరు పక్కన ఉన్న గడిలో 1 అంకె వేయాలి. టిక్ చేయకూడదు. అలాగే ఇతరత్రా మరే పద్ధతిలోనూ ఓటును మార్క్ చేసినా అది చెల్లదు. అంకె (నెంబర్) మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాసినా ఓటు చెల్లకుండా పోతుంది. 3. పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉంటే... ఓటరు అన్ని ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చు అంటే ఉదాహరణకు ఈసారి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి తమ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు... అంటే 1, 2, 3, 4.... ఇలా అభ్యర్థుల పేర్ల పక్కన తాము వారికిచ్చే ప్రాధాన్యతను అంకె రూపంలో వేయవచ్చు. అలా 93 వరకూ ప్రాధాన్యత ఇవ్వొచ్చు. 4. మొదటి ప్రాధాన్యత (నంబర్ 1) ఇవ్వకుండా... మీరెన్ని ప్రాధాన్యతలు ఇచ్చినా ఆ ఓటు చెల్లదు. 5. ఒక్కరికే తొలి ప్రాధాన్యత ఓటు వేసి ఆపేయవచ్చు లేదా తాము ఎన్ని అనుకుంటే అన్ని పాధాన్యత ఓట్లు వేసి (ఉ దాహరణకు 10 వరకు మాత్రమే వేసి) ఆపేయవ చ్చు. అయితే ప్రాధ్యానతను ఇచ్చే క్రమంలో వరుస తప్పకూడదు. ఉదాహరణకు మొదటి ప్రాధాన్యతకు 1 ఇచ్చి తర్వాత క్రమం తప్పి 3, 4, 5 వేస్తూ పోయారనుకోండి... అప్పుడు ద్వితీయ ప్రాధాన్య త ఓట్లను లెక్కించాల్సిన అవసరం వస్తే మీ ఓటు చెల్లదు. మొదటి ప్రాధాన్యత వరకే మీ ఓటు ను పరిగణనలోని తీసుకొని... తర్వాత పక్కన పెట్టేస్తారు. 6. ఒకే నంబరును ఇద్దరు అభ్యర్థులకు ఇచ్చినా...ఓటు చెల్లకుండా పోతుంది. 7. బ్యాలెట్ పేపరుపై అంకెలు వేయడానికి పోలింగ్ స్టేషన్లో ఇచ్చే స్కెచ్ పెన్నే వాడాలి. 8.బ్యాలెట్ పేపర్‌పై పేర్లు రాయడం, సంతకం చేయడం, వేలిముద్ర వేయడం... చేయకూడదు. అంకెలతో ఓటు ను మార్క్ చేయడం తప్పితే బ్యాలెట్‌పై ఏం రాసినా... దాన్ని చెల్లని ఓటుగా పరిగణిస్తారు. 9. విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రదేశా ల్లో ఉంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. దీనికి నిర్ణీ పద్ధతి ఉంటుంది. అదీకృత అధికారి అటెస్టేషన్ అవసరం. 1. విజేతను తేల్చడానికి ఒక ఫార్ములాను అనుసరిస్తారు అయితే టెక్నికల్‌గా కాకుండా స్థూలంగా చెప్పాలంటే... పోలైన వాటిలో చెల్లుబాట్లయ్యే ఓట్లలో 50 శాతం + ఒక ఓటు రావాలి. ఉదాహరణకు 3,60,020 ఓట్లు చెల్లుబాటు అయ్యాయనుకోండి... అందులో సగం 1,80,010 ఓట్లు + 1 రావాలి. కనీసం 1,80,011 మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తే గెలిచినట్లు. 2. అభ్యర్థులెవరికీ నిర్ణీత తొలి ప్రాధాన్యత ఓట్లు రాకపోతే... అప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం అవుతాయి. 3. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన ముందు పోటీనుంచి తప్పిస్తారు. అతనికి పడ్డ ఒక్కో ఓటును తీసి... అందులో ద్వితీయ ప్రాధాన్యత (నెంబరు 2) ఎవరికి ఉంటే వారికి ఆ ఓటును బదలాయిస్తారు (కలుపుతారు). ఒకవేళ సమాన ఓట్లతో ఆఖరిస్థానంలో ఇద్దరు ఉన్నారనుకోండి... అప్పుడు ఎవరిని ముందు ఎలిమినేట్ చేయాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు. 4.ఇలా అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ మొదలవుతుంది. చివరి అభ్యర్థి తర్వాత... అతని పైస్థానంలో ఉండే అభ్యర్థి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కింపునకు తీసుకుంటారు. అంటే కింది నుంచి క్రమంగా పైకి వెళతారు. 5. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ మార్క్‌కు సమీప దూరంలో నిలిచిపోయిన అభ్యర్థులకు (అత్యధిక ఓట్లు పొందిన తొలి ఇద్దరు– ముగ్గురు అభ్యర్థులు) ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల బదలాయింపు జరిగితే వారి ఓట్ల సంఖ్య పెరుగుతుంది. అలా విజయానికి చేరువవుతారు. ఎవరైనా ఒకరికి నిర్ణీత ఓట్లు (50 శాతం + ఒక ఓటు) వచ్చే దాకా ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది (ఒకరు నిర్ణీత ఓట్లను సాధించిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయరు. ఆ రౌండ్లో ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థికి సంబంధించిన మొత్తం ఓట్ల లెక్కింపును పూర్తిచేసి కౌంటింగ్‌ను నిలిపివేస్తారు). రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా కలుపుకొని మ్యాజిక్ మార్క్‌కు చేరుకున్న వారిని విజేతగా ప్రకటిస్తారు. – సాక్షి, హైదరాబాద్ -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలా? ఇవి ఫాలో అవండి
సత్తుపల్లి: ఈ నెల 14న నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఓటింగ్ సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం. ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. పోలింగ్ అధికారి బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. పేపర్‌పై పోటీ చేసిన అభ్యర్థుల పేరు, ఫొటో, పార్టీ లేదా స్వతంత్ర తదితర వివరాలు ఉంటాయి. బ్యాలెట్ పేపర్‌పై వారిచ్చే పెన్నుతోనే నంబర్ వేయాలి. ఈ సారి ఎన్నికల్లో 71 మంది బరిలో ఉన్నారు. మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్న అభ్యర్థి పేరు ఎదురుగా ఉండే బాక్సులో 1 అని నంబర్ వేయాలి. ఇలాగే రెండో ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థికి 2, మూడో ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థికి 3 అని అంకెలు వేయాలి. ఇలా 71 మందికీ మీ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయొచ్చు. లేకపోతే కొందరికైనా వేయొచ్చు. అయితే ప్రాధాన్యత క్రమం తప్పవద్దు. ఉదాహరణకు ఒక ఓటరు నలుగురికి ఓటువేద్దామనుకుంటే.. ఒకరికి 1, ఇతరులకు 2, 3, 4 ఇలా నంబర్లు వారి పేరుకు ఎదురుగా గల బాక్స్‌ల్లో రాయాలి. కౌంటింగ్ ఇలా.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పెద్ద ప్రహాసనం. రెండు, మూడు రోజులు కౌంటింగ్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కౌంటింగ్‌కు ఏజెంట్‌కు వెళ్లాలంటేనే కనీసం రెండు రోజులు గడుపుతామనే భావన ఉంటుంది. మొత్తం పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు 100 ఓట్లు పోలైతే 51 తొలి ప్రాధాన్యత ఓట్లు ఎవరికొస్తాయో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ‘ఏ’అనే అభ్యర్థికి 46, బీ అనే అభ్యర్థికి 34 ఓట్లు, సీ అనే అభ్యర్థికి 10 ఓట్లు వచ్చాయనుకోండి. పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ రాలేదు. కాబట్టి వీరిలో ఎవరినీ విజేతగా ప్రకటించరు. ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అతి తక్కువగా ఓట్లు పోలైన సీ అనే అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, అతని ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికిచ్చారనే అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. రెండో ప్రాధాన్యంలో ‘ఏ’అనే అభ్యర్థికి 2 ఓట్లు, బీ అనే అభ్యర్థికి 18 ఓట్లు వచ్చాయనుకోండి. మొత్తం ‘ఏ’అనే అభ్యర్థికి 46+2=48 ఓట్లు, బీ అనే అభ్యర్థికి 34+18=52 ఓట్లు వచ్చినట్టు లెక్క. దీంతో బీ అనే అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. గెలుపులో రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకంగా ఉంటాయి. సెలవులు కలిసొచ్చేనా..! పట్టణ ఓటర్లు ఓటు వేయాలంటే అంతగా ఆసక్తి చూపించరనేది ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కన్పించింది. మార్చి 14న జరిగే ఎమ్మెల్సీ పోలింగ్‌కు ముందు వరుసగా నాలుగురోజులు సెలవులు వచ్చాయి. ఈ ప్రభావం పట్టణ ఓటర్లపై పడుతుందేమోనని ఒకింత ఆందోళన నెలకొంది. 11న మహాశివరాత్రి, 12న ష మేరాజ్(ఆప్షనల్ హాలీ డే), 13న రెండో శనివారం, 14న ఆదివారం రావటం అభ్యర్థులకు టెన్షన్‌కు గురిచేస్తోంది. పట్టణ ఓటర్లు సహజంగా వరుస సెలవులు వస్తే టూర్లకు వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు వరుస సెలవులతో ఇంటికి వచ్చి ఓటు వేస్తారనే మరో అంచనా కూడా లేకపోలేదు. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ తదితర పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న పట్టుభద్రులు వరుస సెలవులతో ఇంటికి వచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటినుంచే వారితో ఆయా పార్టీల నాయకులు ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు. 1,2,3.. నంబర్లే రాయాలి రోమన్ అంకెలు రాస్తే ఓటు చెల్లదు. ఒకటి, రెండు అని తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూలో రాసినా, టిక్ చేసి న ఓటు చెల్లదు. బ్యాలెట్ పేపర్ మీద ఎటువంటి రాతలు రాసినా, సంతకం పెట్టినా ఓటు చెల్లదు. కేవలం 1,2,3 అని నంబర్లు మాత్రమే రాయాలి. చదవండి : (ఎవరి లెక్కలు వారివే.. ఎవరి ధీమా వారిదే..) (తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ హాట్ సీటే టార్గెట్) -
గ్రేటర్ పోలింగ్ 46.55%
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ లెక్కలు తేలాయి. మొత్తం 74,12,601 మంది ఓటర్లలో 34,50,331 మంది ఓట్లు వేశారని, 46.55 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు ప్రకటించారు. పోలింగ్ శాతంపై ఒకటో తేదీ అర్ధరాత్రి దాటాక కూడా విభిన్న గణాంకాలు వెల్లడిస్తూ వచ్చారు. దాంతో కొంత గందరగోళం నెలకొంది. అంతిమంగా 46.55 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ బుధవారం స్పష్టం చేశారు. గురువారం రీపోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓల్డ్ మలక్‌పేటను మినహాయించి ఈ వివరాలు వెల్లడించారు. పోలింగ్ జరిగిన 149 వార్డుల్లో అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్లో 67.71 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా యూసుఫ్‌గూడలో 32.99 శాతం ఓట్లు పోలయ్యాయి. 60% దాటిన డివిజన్లు 3 డివిజన్ పోలింగ్ ఆర్సీపురం 67.71 పటాన్చెరువు 65.77 భారతీనగర్ 61.88 -
ఏ బాక్సులో...ఏముందో
గ్రేటర్ వార్ ముగిసింది. నాయకుల్లో మరో టెన్షన్ మొదలైంది. ఓటింగ్ శాతం తగ్గడం ఎవరిని ముంచుతుందో... అనే ఆందోళన ఒకవైపు నెలకొంది. మరోవైపు నిక్షిప్తమైన ఓటరు తీర్పు ఎటువైపనే భయం వెంటాడుతోంది. ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్చార్జిల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. తేడా వస్తే అధిష్టానం దృష్టిలో పలుచనవుతామని భయపడుతున్నారు. ఎప్పటిలాగా కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి ఒక ఊపుమీద జరిగాయి. ప్రచారంలో చాలామంది కనిపించినా ఓటింగ్‌కు మాత్రం నగర యువత దూరంగా ఉంది. ఓటింగ్ శాతం భారీగా తగ్గడంతో మెజారిటీ దేవుడు ఎరుగు... గట్టెక్కితే చాలనే అభిప్రాయంతో డివిజన్ల ఇన్చార్జిలు ఉన్నారు. ఓటర్ అంతరంగం అంతుపట్టడం లేదంటున్నారు. అభివృద్ధి మీద కాకుండా... మతం, దేశం పేరిట భావోద్వేగాలతో పార్టీలు ప్రచారం ముగించాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరి అంచనాలు తారుమారవుతాయి, ఎవరికి దెబ్బపడుతుందనేది... ఈనెల 4న బాక్సులు తెరిచి ఓట్లు లెక్కిస్తే తేలనుంది. అప్పటిదాకా వేచిచూడాల్సిందే. –సాక్షి, హైదరాబాద్ సమయమే లేదు... ప్రచారానికి కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే చిక్కింది. పెద్దగా సమయం లభించలేదు. ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించుకొని పూర్తిస్థాయిలో కార్యరంగంలోకి దిగేసరికి ప్రచారం గడువు ముగిసింది. ప్రతీ ఓటర్ను కలిసి ఓటు అడిగే సమయం దొరకలేదని అభ్యర్థులు, నాయకులు అంటున్నారు. టీఆర్ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్ బాధ్యతను అప్పగించింది. గ్రేటర్ ప్రచారబాధ్యత తీసుకున్న కేటీఆర్ అన్నీ తానై రోడ్‌షోలు నిర్వహించారు. వివిధ సంఘాలతో, వాణిజ్యవర్గాలతో భేటీ అయ్యారు. చివర్లో... నవంబర్ 28న జరిగిన సీఎం సభ టీఆర్ఎస్లో జోష్ నింపిందని చెప్పొచ్చు. బీజేపీ కూడా ముఖ్యులకు డివిజన్ల బాధ్యతలు అప్పగించినా... ఎక్కువగా స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంపైనే ఆధారపడింది. అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి, జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు ప్రచారానికి ఊపు తెచ్చారు. అయితే పార్టీని చివర్లో ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లలేకపోయారనే భావన నెలకొందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రచారం నిర్వహించినా... ఎంఐఎం ప్రధానంగా ఎమ్మెల్యేలపై భారం మోపింది. పాతబస్తీలో పట్టు నిలుపుకునేందుకు శ్రమించింది. వరదల కారణంగా బస్తీల్లో కొంత వ్యతిరేకత వచ్చినా... అది పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించదనే భావనలో మజ్లిస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇళ్లు సర్దుకొని రంగంలోకి దిగేసరికి ప్రచారం ముగింపుకొచ్చింది. పెద్ద నాయకులు విస్తృతంగా తిరగకపోవడం, పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం కాంగ్రెస్‌కు ప్రతికూలమని చెప్పొచ్చు. ఎంతచేసినా... ఓటింగ్ పెరగలేదు ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్చార్జీల్లో గుబులు మొదలైంది. గ్రేటర్ పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఇన్చార్జీలు తమ సొంత నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ను దింపి మరీ ప్రచారం చేయించారు. ప్రచారంలో ఉన్న జోష్ ఓటింగ్‌లో లేకపోవడం... వీరికి ఇబ్బందిగా మారింది. స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించినా... ఓటింగ్ శాతాన్ని పెంచలేకపోయామని మధనపడుతున్నారు. ఫలితంలో తేడా వస్తే... తమ రాజకీయ జీవితంపై ఇదొక రిమార్క్‌గా ఎక్కడ మారుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పోటీ ముఖ్యంగా టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 31 మంది ఎక్స్అఫీషియో సభ్యుల బలంతో టీఆర్ఎస్ మేయర్ రేసులో ముందుంటుందని భావిస్తున్నారు. -
ఈ నగరానికి ఏమైంది ?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసేందుకు నగర ప్రజలు బద్ధకించడం, పోలింగ్ ఆద్యంతం మందకొడిగా సాగడం పట్ల సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ శాతం తగ్గిపోవడం పట్ల కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తే, ఓటేయకపోవడం కూడా అసమ్మతి ప్రకటనే, దాన్ని గౌరవిద్దామని మరికొందరు పేర్కొన్నారు. ఇంకొంతమంది హైదరాబాదీల బద్ధకంపై జోకులను పేల్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగడం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఈ నగరానికి ఏమైంది.. ఎందుకు ఇంత తక్కువ పోలింగ్.. సాఫ్ట్వేర్ వాళ్లే కాదు, పాతబస్తీలో కూడా ఇంత తక్కువ పోలింగ్..’అని నెటిజన్ శ్రీశైల్‌రెడ్డి పంజుగుల ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాలు తమను ఎన్నుకునే ప్రక్రియ (పోలింగ్)లో పాల్గొనని వారికోసం పనిచేస్తా యని జీహెచ్ఎంసీ ఎన్నికలు రుజువు చేశాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్త జీవీ రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. సంపన్న వర్గాలు ఓటింగ్‌కు దూరంగా ఉంటారని, ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని ఆయన పాలకుల తీరుపై పరోక్షంగా చురకలంటించారు. ‘గలీజు ప్రచారాలకు ఖాండ్రించి ఉమ్మేసిన హైదరాబాద్ సగటు ఓటరు’ అని ఆర్జేవై నవీన్ రాజకీయ పార్టీల వైఖ రిపై మండిపడ్డారు. ‘రూ.10వేల వరద సహాయానికై మీసేవ కేం ద్రాల వద్ద వరద వెల్లువలా పోటెత్తిన సిటిజన్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటెత్తలేదెందుకూ..?’ అని బొగ్గుల శ్రీనివాస్ ప్రశ్నించారు. సాయంత్రం 6 కాకుండానే నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో మూసి ఉన్న మద్యం దుకాణం ముందు బారులు తీరిన జనం మొబైల్ పోలింగ్ బూత్‌లు పెట్టుకోవాలే! ‘మొబైల్ పోలింగ్ బూత్‌లు పెట్టుకోవాల్నేమో ఇగ..’ అని వేదుల పవన్‌కుమార్ ఎన్నికల సంఘానికి కొత్త ఐడియా ఇచ్చారు. ‘ఒక్క రెండు గంటలు హైదరాబాద్‌లో నెట్ బంద్ చేయండ్రి. కలుగులో ఎలుకల్లా పోలింగ్ బూత్‌లకు వస్తరని ప్రజల మొబైల్ ఫోన్ల వ్యవసనంపై రేగుంట రాజేశ్వర్ సెటైర్ వేశారు. ‘మిట్ట మిధ్యాహ్నం అవుతున్నా.. నగరం నిద్రపోతున్న వేళ, లేసి ఓటేయకపోతే జనాభా లిస్టులో ఉన్నా లేనట్లే..’అని గోనె మార్కండేయులు హైదరాబాదీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఓటేయాలని ఒత్తిడి చేయడం, ఓటేయని వాళ్లను అవమానించడం కూడా ఫాసిజమే. ఓటేయకపోవడం కూడా నిరసనే..’ అని పి.మోహన్ అనే చిత్రకారుడు అభిప్రాయపడ్డారు. ‘ఓటేయకపోవడం అసమ్మతి ప్రకటనే.. దాన్ని గౌరవిద్దాం.. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకపోయినా రాజ్యాంగ హక్కులు పౌరులకు అందుతాయి. ఓటేసినా, వేయకున్నా ప్రశ్నించే హక్కు వారికి ఉంటుంది. అతిగా ఆవేశపడి వాట్సాప్ యూనివర్సిటీల్లో చదువుకున్నట్టు ట్రోలింగ్ చేయకండి..’అని అరుణాంక్ లత పేర్కొన్నారు. రాజకీయ పార్టీల దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాల తరహాలో కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై నెటిజన్లు ప్రజాస్వామ్యంగా, మర్యాదపూర్వకంగా చర్చించుకోవడం విశేషం. -
అదే తీరు.. అత్తెసరు
సాక్షి, హైదరాబాద్: ఓటుపై కరోనా కాటు పడింది. గ్రేటర్ సమరంలో జనం భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అధికార యంత్రాంగం తీసుకున్న కోవిడ్ జాగ్రత్తలు... ఓటర్లలో విశ్వాసాన్ని పెంచలేకపోయాయి. ఎందుకు వెళ్లడం, అంటించుకోవడం... లేని పోని ‘రిస్క్’మనకొద్దు అనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్‌కు భయపడి.. ‘సేఫ్’జోన్లో ఉండిపోయారు. జనం గుమిగూడే చొటుకు వెళ్లడానికి జంకారు. ఓటేయడానికి ముందుకు రాలేదు. వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారైతే అసలు పోలింగ్ కేంద్రాల వైపు చూడలేదు. ఫలితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం అనుకున్నంతగా పెరగలేదు. 2016లో గ్రేటర్లో 45.29% పోలింగ్ నమోదు కాగా.. ఇప్పుడు అదే అత్తెసరు పోలింగ్ నమోదైంది. నిజానికి ఈసారి పోలింగ్ పెరుగుతుందని అందరూ ఆశించారు. గ్రేటర్లో హోరాహోరీగా ప్రచారం జరగడం.. పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. చతురంగ బలాలను మోహరించి సర్వశక్తులూ ఒడ్డడం.. జాతీయస్థాయి నేతలు, కేంద్రమంత్రులు, సీఎంలు రంగంలోకి దిగడం వంటి పరిణామాలతో.. ఓట్లు పోటెత్తుతాయని భావించారు. కానీ కరోనా దెబ్బేసింది. 2016 పోలింగ్ కంటే కేవలం 0.42%మాత్రమే అధికంగా 45.71% పోలింగ్ నమోదైంది. సాధారణంగా సంపన్నవర్గాలు ఓటేయడానికి ఆసక్తి చూపవు. ఈసారి అందుకు భిన్నంగా హైదరాబాద్‌లో అత్యధికంగా ఉండే బస్తీవాసులు, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా మొహం చాటేశారు. టెకీలూ దూరంగా ఉన్నారు. ప్రధాన కారణం కరోనా భయం. వరుస సెలవులు, వర్క్ ఫ్రం హోం వంటివి కూడా ఓటింగ్‌శాతం తగ్గిపోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తాము ఎంతగా ప్రయత్నం చేసినా జనం ఇళ్లు విడిచి బయటకురాకపోవడంతో నాయకులు తలలుపట్టుకుంటున్నారు. పడిన ఓట్లు ఎవరికనేది... ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారు. కరోనా... డర్: బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్ కావడంతో పలుచోట్ల చేతులతో తాకాల్సి ఉంటుంది. బ్యాలెట్‌పై వేసే ఎన్నికల ముద్రను ఓట్లు వేసేందుకు వచ్చే వారంతా చేతులతో పట్టుకుంటారని, దాంతో కరోనా వస్తుందేమోనని అనేక మంది భయపడ్డారు. పోలింగ్‌బూత్‌ల వద్దకు ఎక్కువమంది జనం వస్తారని, కరోనా వ్యాప్తికి ఆస్కారమున్న చోటికి వెళ్లడం శ్రేయస్కరం కాదని భావించినట్లు కొంతమంది చెప్పుకొచ్చారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి చాలామంది వయోవృద్ధులు ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావట్లేదు. ఇంట్లో కూడా మిగిలిన కుటుంబ సభ్యులతో దూరం పాటిస్తున్నారు. ఓటేసేందుకు వేళ్తే కరోనా సోకే ప్రమాదముందని భయంతో వయోవృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించకపోవడానికి ప్రధాన కారణం కరోనా భయమే అని చర్చ జరుగుతోంది. ప్రచారంలో నువ్వానేనా అన్నట్లు మాటల యుద్దం చేసిన నాయకులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో విఫలమయ్యారు. కరోనా వల్ల హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారంతా గ్రామాల్లోనే ఉండిపోయారు. దీనికి తోడు వరుసగా మూడు రోజులు సెలవులు రావడం సైతం జీహెచ్ఎంసీ పోలింగ్ శాతం తగ్గడానికి కారణమైంది. గత నెల 29న ఆదివారం, 30న గురునానక్ జయంతి,, ఈ నెల 1న (మంగళవారం) జీహెచ్ఎంసీ ఎన్నికల రూపంలో వరుసగా మూడు రోజులు (టెకీలకు అయితే శనివారంతో కలిపి నాలుగు రోజులు) సెలవులు లభించడంతో చాలామంది నగర ప్రజలు పల్లెలకు వెళ్లిపోయారు. వర్క్‌ఫ్రం హోం... నగరానికి దూరం నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధికంగా ఉండే శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఓటింగ్‌శాతం భారీగా పడిపోవడానికి కారణం వర్క్‌ఫ్రం హోం అని రాజకీయ నాయకులు వాపోతున్నారు. ఐటీ రంగంలో పనిచేసే 5.5 లక్షల మందిలో దాదాపు లక్ష మందికి ఓటు హక్కు ఉన్నా.. వారిలో 90 శాతం మంది గత కొన్ని నెలలుగా వర్క్ ఫ్రం హోం చేస్తూ తమ స్వస్థలాల్లోనే ఉండిపోయారు. కార్తీక పౌర్ణమికి సోమవారం ఉపవాసాలతోనే గడిపి.. మరునాడు నగరానికి వచ్చి ఓటేసే చొరవ తీసుకోలేకపోయారు. వర్క్‌ఫ్రం హోం విధానం తమ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభావితం చేయలేకపోయిన హామీలు రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, భావోద్వేగ ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయి. ఈసారి పార్టీలు పోటీపడి ప్రజాకర్షక పథకాలు ప్రకటించాయి. వరదసాయం టీఆర్ఎస్ రూ.10 వేలు ఇస్తే... బీజేపీ రూ.25 వేలు, కాంగ్రెస్ రూ.50వేలు ఇస్తామన్నాయి. ఇందులో బీజేపీ ఓ అడుగు ముందుకేసి వరదల్లో బైకు, కారు కొట్టుకుపోతే... కొత్తవి ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవేవీ జనాన్ని ఆకట్టుకోలేకపోయాయని పోలింగ్ శాతాన్ని బట్టి స్పష్టమవుతోంది. కానుకలు పంచినా.. కనికరించలే! పలు పార్టీలు సోమవారం ఓటర్లను ప్రసన్నం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఓటరు స్లిప్పుల రూపంలో ఇంటింటికీ కానుకలు, చీరలు, నగదు, మద్యం బాటిళ్లు విపరీతంగా పంచారు. అంతేకాకుండా కార్తీక భోజనాలు, బర్త్‌డేలు, గెట్ టు గెదర్‌ల పేరుతో భారీ విందులు ఏర్పాటు చేశారు. వీటికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్ట్‌ల రూపంలో విలువైన కానుకలు అందజేశారు. ఇవి తీసుకున్న ఓటర్లలో సగం మందికి పైగా నేతలకు హ్యాండిచ్చారు. ఇంటి నుంచి బయటికి రాకుండా నేతలకు ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. రూ.లక్షలు పోసి ఓట్లను కొందామనుకుంటే.. ఈ స్థాయిలో ఓటర్ల నుంచి పరాభవం ఎదురవుతుందని ఊహించలేదని పలువురు వాపోతున్నారు. సోషల్ మీడియాలోనే చైతన్యం ఎవరు గెలిచినా ఏం లాభం .. అంతా ఒక తాను ముక్కలేనని సంపన్నవర్గాలతో పాటు విద్యావంతుల్లో సైతం ఓ అభిప్రాయం ఉంది. నగరంలో రోడ్ల దుస్థితి, రోడ్లపై డ్రైనేజీ ప్రవాహం, విద్యుత్ సరఫరాకు అంతరాయం, నీటి సరఫరా బంద్... సమస్య ఏదైనా సరే వీరు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఫిర్యాదు చేయకుండా కేవలం సోషల్‌మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. వీరు సామాజిక మాధ్యమాల్లో... పోస్టింగుల్లో చూపే చైతన్యం ఓటుకు వచ్చేసరికి చూపలేదని చర్చ జరుగుతోంది. -
చేతులు కడగండి.. పాలిటిక్స్‌ను కూడా!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. బాధ్యతాయుత పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసి వచ్చేందుకు కొన్ని నిమిషాల సమయం పడుతుంది. ఆ కొద్దిసేపు జాగ్రత్తగా ఉండాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలు ప్రజలకు విన్నవించాయి. పోలింగ్స్టేషన్లోకి ప్రవేశించేప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్లాలి. లేకపోతే లోనికి అనుమతించరు. అలాగే పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూలైన్లలో ఒకరికొకరికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా వృత్తాకార గుర్తులు ఏర్పాటు చేశారు. వాటిల్లోనే నిలబడి బూత్‌లోకి లైన్‌గా వెళ్లాలి. బూత్‌లో పలుచోట్ల తాకాల్సి ఉంటుంది.. అక్కడ ఏర్పాటు చేసిన శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాక బూత్‌లోకి ప్రవేశించాలి. బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు వేయాల్సి ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బూత్లోనికి వెళ్లగానే మొదటి పోలింగ్ అధికారి ఓటర్ జాబితాలో పేరుందా లేదా చూస్తారు. అందుకోసం ఓటర్ తమ గుర్తింపు కార్డును అధికారికి ఇవ్వాలి. ఆ అధికారి గుర్తింపు కార్డును పట్టుకొని చూసి తిరిగి ఇచ్చేస్తారు. అధికారి తాకిన కార్డును తిరిగి తీసుకున్నప్పుడు కాంటాక్ట్ ఏర్పడుతుంది. తర్వాత రెండో అధికారి వద్దకు వెళ్లాలి. అక్కడ ఓటర్ ఎడమ చూపుడు వేలుపై సిరా మార్క్ వేస్తారు. మూడో పోలింగ్ అధికారి బ్యాలెట్ పత్రం ఇస్తారు. దాన్ని ఇచ్చేముందు బ్యాలెట్ కౌంటర్ పాయింట్‌పై ఓటర్ సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. తర్వాత బ్యాలెట్ పేపర్‌తోపాటు ఓటు వేసేందుకు ఇంకు అద్దిన రబ్బర్ స్టాంప్‌ను ఓటర్‌కు ఇస్తారు. అప్పుడు కూడా ఇతరులు వాడిన, అధికారి పట్టుకున్న స్టాంప్‌ను తీసుకోవడం ద్వారా కాంటాక్ట్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లోకి వెళ్లి ఇష్టమైన అభ్యర్థి గుర్తుపై ముద్ర వేయాలి. తర్వాత దాన్ని మడతబెట్టి బయటకు వచ్చి ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉన్న బ్యాలెట్ పెట్టెలో వేయాల్సి ఉంటుంది. ఇలా వివిధ దశల్లో పలుసార్లు చేతులతో వివిధ ప్రాంతాల్లో తాకాల్సి ఉంటుంది. అధికారి అనేకమంది ఓటర్లతో కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ఓటేసి బయటకు వచ్చాక తక్షణమే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. అందుకోసం అవసరమైతే సొంతంగా శానిటైజర్‌ను దగ్గర ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లు పెట్టుకుంటారు. పైగా బూత్‌లోకి ఒక్కరినే అనుమతిస్తారు. వారు ఓటేసి వెళ్లిపోయాక మరొకరిని లోనికి అనుమతిస్తారు. కరోనా బాధితులకు గంటపాటు ప్రత్యేక ప్రవేశం ► కరోనా పాజిటివ్ బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఓటేయడానికి ప్రత్యేక సమయం, ప్రత్యేక ద్వారం కేటాయించారు. వారికి మాస్క్‌లు, ఫేస్‌షీల్డులు అందజేస్తారు. అదే సమయంలో ఇతర ప్రవేశమార్గాల్లో సాధారణ ఓటర్లు ఓటేయవచ్చు. ► నవంబర్ ఒకటో తేదీ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్‌కు కూడా అవకాశం కల్పించారు. ► బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లే సిబ్బందికి, బ్యాలెట్ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇస్తారు. ► ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► పోలింగ్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే, తక్షణమే వారిని మార్చడానికి రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ► భౌతికదూరాన్ని పర్యవేక్షించేందుకు వాలంటీర్లను నియమించారు. ► సిబ్బంది, ఏజెంట్ల కోసం పోలింగ్స్టేషన్లలో భౌతికదూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ► బూత్‌లో అధికారులు ఓటరును గుర్తించేందుకు ఒకసారి మాస్క్‌ను తొలగించి వెంటనే పెట్టుకోవచ్చు. -
‘సిటీని అద్భుతంగా తీర్చిదిద్దే వారికే ఓటు’
సాక్షి, హిమాయత్‌నగర్ : వేగంగా విస్తరిస్తున్న మన హైదరాబాద్ సిటీలో మరిన్ని కొత్త కట్టడాలు రావాల్సిన అవసరం ఉంది. విదేశాల్లోని సిటీల్లా, రీసెంట్గా ప్రారంభించిన దుర్గం చెరువు ఫ్లైఓవర్ లాంటివి ఏర్పాటు చేస్తే సిటీ కొత్త కొత్తగా ఉంటుంది. టెక్నాలజీతో పాటు, శానిటేషన్ వంటి వాటిలో కూడా మార్పులు ఎంతో అవసరం. ఈ ఎన్నికల్లో సిటీని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే వారికి ఓటువేసి ఎన్నుకుందాం. - సుహాసిని, బుల్లితెర నటి ఓటు వేస్తేనే భారతీయుడు లక్డీకాపూల్: ఓటు ప్రజల హక్కు.. తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. ఏ పార్టీ వారికైనా కానివ్వండి.. కానీ ఓటు మాత్రం కచ్చితంగా వేయాలి. ఓటు వేసినప్పుడే ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఓటు వేస్తేనే మనం భారతీయులం.. ఓటు వేయని వాళ్లు భారతీయులే కాదన్నది నా అభిప్రాయం. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్కి వెళ్తే ఏదో అబ్రాడ్‌లో ఉన్నట్లు ఉంటుంది. సిటీలో రోడ్లపై దృష్టి పెట్టాలి. రోడ్లను వెడల్పు చేసి ట్రాఫిక్ని తగ్గించగలిగితే ఇంకా గొప్ప సిటీ అవుతుంది. – సప్తగిరి, సినీనటుడు -
‘రాహుల్‌ని వ్యతిరేకిస్తున్నారు.. ఓటు వేయలేదు’
పట్నా : ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మీద బీజేపీ, జేడీయూ పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కారణం ఏంటంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం బిహార్‌లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వీ ఓటు వేయలేదు. దీనిపై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తుంది. ‘తేజస్వీ కుటుంబం నుంచి ప్రధాని బరిలో ఎవరూ లేరు. అందుకే ఆయన ఓటు వేయలేదు. దీన్ని బట్టి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది’ అంటూ ఆరోపణలు చేసింది. ఆయన తల్లి, సోదరి, ఆఖరికి తేజ్ ప్రతాప్ కూడా తాను బలపరుస్తున్న అభ్యర్థి కోసం ఓటు వేశారని.. కానీ తేజస్వీ మాత్రం ఓటు వేయలేదని బీజేపీ విమర్శించింది. జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘తేజస్వీ జైల్లో ఉన్న తన తండ్రి గురించి ఆలోచించి అయిన ఓటు వేయాల్సిందిగా జనాలను అభ్యర్థించాడు. కానీ చివరకు ఆయనే ఓటు వేయలేదు. ఎంత ఆశ్చర్యం’ అన్నారు. ఈ విమర్శలపై ఆర్జేడీ నాయకుడు శివానంద్ తివారీ స్పందిస్తూ.. ‘నాకు తెలిసిన దాని ప్రకారం ఓటరు లిస్ట్‌లో తేజస్వీ పేరు పక్కన వేరే వ్యక్తి ఫోటో పడింది. దాంతో ఆయన ఓటు వేయలేకపోయార’ని తెలిపారు. అయితే ఇది పెద్ద సమస్య కాదని.. ఒక వేళ తేజస్వీ ఓటర్ ఐడీ తీసుకుని పోలీంగ్ కేంద్రానికి వస్తే.. అక్కడికక్కడే ఈ సమస్యను పరిష్కరించేవాళ్లమని ఈసీ తెలిపింది. మరో సమాచారం ఏంటంటే.. శుక్రవారం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తేజస్వీ ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాడని... పోలింగ్ నాటికి తిరిగి బిహార్ చేరుకోలేకపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఓటింగ్‌కి.. బోటింగ్‌కి తేడా తెలీడం కోసం తీసుకొచ్చా’
వాణిజ్య రాజధాని ముంబైతో సహా దేశవ్యాప్తంగా 71 నియోజకవర్గాల్లో సోమవారం నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో సినీ, వ్యాపార ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో బాద్షా షారుక్ ఖాన్ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చేటప్పుడు తమతో పాటు ఐదేళ్ల తన కుమారుడు అబ్రాంను కూడా పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు షారుక్. ఈ విషయంపై స్పందిస్తూ ‘మా చిన్నారికి ఓటింగ్‌కు.. బోటింగ్‌కు తేడా తెలీక ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం గురించి తనకు పూర్తిగా అర్థం కావడం కోసమే ఇలా తీసుకొచ్చాం’ అంటూ ట్వీట్ చేశారు షారుక్. దాంతో పాటు భార్య, కొడుకు అబ్రాంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. షారుక్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. Little one was a bit confused between ‘Boating’ and Voting, so took him along to experience the difference. pic.twitter.com/8X6DsTP8bc — Shah Rukh Khan (@iamsrk) April 29, 2019 -
అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేశారు..
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎలాగైనా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించిన ముఖేశ్ గౌడ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో పోలింగ్ బూత్‌కు తరలించారు. దీంతో ఆయన అబిడ్స్ పోస్టాఫీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ముఖేశ్ గౌడ్‌ని ఈ పరిస్థితుల్లో చూసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొనాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. -
పైకి ధీమా.. లోలోన భయం!
సాక్షి, జగిత్యాల: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలలో గెలుపుపై అభ్యర్థులు లోలోన భయపడుతున్నా.. పైకి మాత్రం ధీమాగా కనిపిస్తున్నారు. దేశంలో ఎప్పుడూ.. ఎన్నడూ లేని విధంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడం.. అందులో అత్యధికం 178 మంది రైతులే ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో భయం మొదలైంది. వీరి పోటీ ఎవరి ఓట్లకు ఎసరు పెడుతుందనే ఆందోళన మొదలైంది. పదిహేను రోజులపాటు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. స్థానిక సమస్యలైన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధరపై చర్చ జరగాలనే ఉద్దేశంతో అత్యధిక సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏదైతే లక్ష్యంతో వారు నామినేషన్లు వేశారో.. అది దాదాపు విజయవంతంగా చేరుకున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం రైతుల ప్రధాన డిమాండ్లు అయిన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధరలపై హామీలు ఇచ్చారు. అయితే నిజామాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న రైతుల ఓట్లు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తాయనే ఆందోళనలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఓట్ల చీలికపై కూడా భయం పట్టుకుంది. అందరి దృష్టి వారిపైనే.. తమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ బరిలో నిలవాలని పసుపు, ఎర్రజొన్న రైతులు సంకల్పించుకున్నారు. అనుకున్నట్లుగానే పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించారు. రైతుల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు రావడం, ఉపసంహరించుకోకపోవడంతో ఒకదశలో ఎన్నిక వాయిదా పడుతుందని.. పేపరు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించ వచ్చనే చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఎం3 తరహా ఈవీఎంలతో ఎన్నికలను నిర్వహిస్తామని చాలెంజ్‌గా తీసుకుంది. దీంతో ఒకటికి బదులుగా 12 ఈవీఎంల బ్యాలెట్ యూనిట్ ద్వారా ప్రత్యేకమైన ఎన్నికలు ఇక్కడ జరుగబోతున్నాయి. ఎన్నికలకు ముందు రైతులంతా తమ ఓట్లు తమకే వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు మంగళవారం ఆర్మూర్‌లో రైతు ఐక్యత వేదిక ద్వారా తీర్మానించుకున్నారు. రాజకీయపార్టీల అభ్యర్థులకు కాకుండా అభ్యర్థులుగా ఉన్న రైతులకే తమ ఓట్లు వేయాలని ప్రకటించారు. వీరి నిర్ణయంతో ఎవరి ఓట్లకు గండి పడనుందోనని టెన్షన్ మొదలైంది. -
చింతమడకలో ఓటేసిన కేసీఆర్
సాక్షి, మెదక్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని తమ స్వగ్రామమైన చింతమడకలో సతీమణి శోభారాణితో కలిసి కేసీఆర్ ఓటు వేశారు. సీఎం రాక సందర్భంగా చింతమడకలో భారీగా బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తో పాటు మాజీమంత్రి హరీష్‌రావు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ జీహెచ్ఎంసీ కమ్యూటీహాల్లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ పోలింగ్ బూత్‌లో ఎంపీ కవిత దంపతులు ఓటేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటేయాలని అన్నారు. -
ఓటు సిరామరక కాదు.. మన హక్కు
ప్రజలందరికీ ఓటుహక్కు కోసం పోరాడిన బాబాసాహెబ్ అంబేడ్కర్ సార్వత్రిక ఓటింగ్ హక్కు ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు. కానీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లాంటి వాళ్ళు ఒప్పుకోకుండా ఆర్టికల్ 326గా ఉంచారు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థితులేర్పడ్డాయి. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు. మగధ రాజ్యంలోని రాజగృహంలో విశ్రాంతి తీసుకొంటున్న శాక్యముని గౌతమ బుద్ధుని దగ్గరికి మగధ దేశరాజు ప్రసేనజిత్తు తన ప్రధాన వస్సకరను పంపించారు. ‘‘వజ్జి రిపబ్లిక్ మీద దాడిచేసి వాళ్ళకు తగు గుణపాఠం చెప్పాలని ప్రసేన జిత్తుకు ఆలోచన ఉందని, ఆ విష యమై మీ సలహా కావాలని రాజు కోరుతున్నారు.’’ అని వస్సకర బుద్ధునితో ప్రస్తావించారు. వజ్జి రిపబ్లిక్ స్వతంత్రంగా పాలన సాగి స్తున్నది. అందువల్ల దానిని జయించి, మగధలో కలుపుకోవాలని ప్రసేన జిత్తు పథకం వేశారు. వస్సకర అడిగిన సలహాకు గౌతమ బుద్దుడు నేరుగా సమాధానం చెప్పలేదు కానీ తన ప్రథమ శిష్యుడైన ఆనందునితో చర్చించాడు. ఈ çసందర్భంగా గౌతమ బుద్ధుడు ఆనందుడిని ఏడు ప్రశ్నలు అడిగాడు. అవి... 1) వజ్జి రిపబ్లిక్ ప్రజలు క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతుంటారా? 2) ఏకపక్షంగా కాకుండా చర్చల ద్వారా సమష్టి నిర్ణయాలు తీసుకుంటారా? 3) మోసంతో కాకుండా, మంచి మార్గంలో వ్యాపారాలను, వృత్తులను సాగిస్తున్నారా? 4) ఒకసారి సమష్టిగా తీసు కున్న నిర్ణయాలను ఉల్లంఘన లేకుండా అమలు చేస్తున్నారా? 5) పెద్దలను గౌరవించి, వారి మాటలకు విలువనిస్తున్నారా? పూర్వకాలం నుంచి తమ పెద్దలు నిర్మించిన ప్రార్థనామందిరాలను కాపాడుకుంటు న్నారా? 6) మహిళలనూ, పిల్లలనూ గౌరవిస్తూ, బాధ్యతగా చూసుకుం టున్నారా? 7) జ్ఞానులకు, గురువులకు రక్షణ కల్పిస్తూ, వారిని గౌర విస్తూ వారు సూచించిన మార్గాలను అనుసరిస్తున్నారా? అని బుద్దుడు, ఆనందుడిని ప్రశ్నించారు. దానికి ఆనందుడు ‘అవును’ అని సమాధా నమిచ్చాడు. మీరు అడిగిన విషయాలన్నింటిలోనూ వారు అగ్రగామి గానే ఉన్నారని ఆనందుడు బదులిచ్చాడు. ఇది విన్న బుద్ధుడు ‘‘వజ్జి ప్రజలు ఆ విషయాలను పాటిస్తున్నంత కాలం వారిది ప్రగతి పథమే తప్ప వారికి పతనం అనేదే లేదని తేల్చి చెపుతాడు. వారిని ఎవరూ జయించలేరని కూడా స్పష్టం చేస్తాడు. మగధరాజు ప్రసేన జిత్తు ప్ర«ధాని వస్సకరకు బుద్ధుని అంతరంగం అర్థమైపోయింది. అదే విషయాన్ని మగధ రాజుకు చెప్పి, వజ్జి రిపబ్లిక్ మీద దాడిని నిలిపి వేశారు. ఒకదేశం గానీ, రాజ్యంగానీ, ప్రాంతంగానీ ప్రగతిదారిలో వెళ్లా లన్నా, విజేతగా నిలబడాలన్నా ప్రజలే కేంద్రబిందువుగా పరిపాలన సాగాలి. అదేవిధంగా పాలనలో ప్రజలు భాగస్వాములు కావాలి. పాలకులకు ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ప్రజాక్షేమం కోసమే రాజ్యాలు, ప్రభుత్వాలు పనిచేయాలనేది బుద్ధుడి బోధన ఉద్దేశ్యం. ఇటువంటి పాలన కోసం ప్రపంచ చరిత్రలోనూ, భారత రాజకీయ ప్రస్తానంలోనూ ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అటువంటి అనుభవాన్నే మనకు సామ్రాట్ అశోకుని పాలన కూడా అందించింది. అయితే చాలా వందల ఏళ్ళు మన దేశాన్ని నియంతృత్వం, అరాచకం రాజ్యమేలాయి. వాటన్నింటినీ దాటుకొని, అనేకానేక అవరోధాలను అధిగమించి ఈ రోజు భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో తన మను గడను కొనసాగిస్తున్నది. అయితే ఇందులో కూడా అనేక లోపాలూ, పరిమితులూ ఉండవచ్చు కానీ ప్రజాస్వామ్య ఆలోచనలతో ఒక నిర్మా ణాత్మకమైన రాజ్యాంగం వెలుగులో మనం పాలన సాగిస్తున్నామన్నది మాత్రం వాస్తవం. అలాంటి ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల ప్రక్రియ కీలకం. అందులో భాగంగానే మన దేశ పార్లమెంటులో భాగమైన లోక్ సభకు పదిహేడవ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఓటింగ్ ఒక ముఖ్యమైన అంశం. మన దేశంలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఓటు హక్కు అందరికీ లేదు. అది కొందరి హక్కుగానే ఉండేది. మనదేశంలో మొదటిసారిగా 1920లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కేవలం విద్యావంతులూ, భూములూ, వ్యాపారాలూ, ఆస్తిపా స్తులూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అయితే సామా న్యుడి ఓటు హక్కుకోసం సార్వత్రిక ఒటింగ్ (వయోజన ఓటింగ్) వచ్చేవరకూ నిరంతరం తపించిన మహానుభావుడు అంబేడ్కర్. భారత ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే ఉద్దే శ్యంతో బ్రిటిష్ పాలకులు సౌత్‌బరో అనే రాజకీయ నిపుణుని నాయ కత్వంలో 1919లో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫారసులకు అను గుణంగా బ్రిటిష్ పాలకులు 1920లో ఎన్నికలు నిర్వహించారు. అంట రాని కులాలలో పుట్టి అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును అభ్యసించి, తన జాతి రక్షణే జీవిత లక్ష్యంగా తుది శ్వాస వరకూ పోరాడిన వ్యక్తి డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్. కేవలం 28 ఏళ్ల వయస్సులో తన జాతి జనుల విముక్తికోసమే కాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలకోసం పరితపించారు అంబేడ్కర్. 1919లో సౌత్‌బరో కమి టీకి సమర్పించిన వినతిపత్రంలో యువ అంబేడ్కర్ తన ప్రజాస్వామ్య తాత్వికతకు పునాదులు వేశారు. ఆ పునాదులే భారతదేశ ప్రజాస్వామ్య సాధనమైన రాజ్యాంగాన్ని రచించడానికి ఆధారమయ్యాయి. అవే పునా దులు నేటికీ మన దేశ ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టడానికి సాధనా లవుతున్నాయి. ప్రజాస్వామ్యమంటే ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలనీ, ఏదో కొద్ది మందికి మాత్రమే ఉండే ఓటు హక్కు నియంతృత్వానికి, కొద్ది మంది ఆలోచనల ప్రకారమే పాలన సాగించే నిరంకుశ విధానానికీ మాత్రమే ఉపయోగపడుతుందనీ అంబేడ్కర్ వాదించారు. అంతేకాకుండా, అంట రానితనం, వివక్షతో తరతరాలుగా దాస్యాన్ని అనుభవిస్తున్న అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని కూడా ఆయన వాదించారు. కానీ సౌత్ బరో కమిటీ ఆ ప్రాధాన్యతలను తోసిపుచ్చింది. ఆ తర్వాత 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ ఛైర్మన్‌గా మరొక కమిటీని భార తదేశానికి పంపించింది. ఆ కమిషన్‌ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిం చింది. అయితే స్వాతంత్య్రం రావాలనే లక్ష్యంతో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నమూనా రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో 1928 మే నెలలో ఒక కమిటీని వేసింది. అందులో అన్ని పక్షాలకు అవకాశాలను కల్పించారు. సర్ అలీ అమన్, తేజ్ బహదూర్ సఫ్రూ, సుభాష్ చంద్రబోస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి జవహర్ లాల్ నెహ్రూ కార్యదర్శిగా పనిచేశారు. ఇదే కమిటీలో జయకర్, అనీబి సెంట్ కొంత ఆలస్యంగా చేరారు. అయితే ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత ఆ విషయం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ బీఆర్ అంబేడ్కర్ 1928లో మళ్ళీ ఒకసారి సైమన్ కమిషన్ ముందు హాజరై అందరికీ ఓటు హక్కు కల్పించాలనే విషయమై మరింత శక్తివంతంగా వినిపించారు. అంతే కాకుండా 1930, 31 సంవత్సరాలలో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో అణగారిన వర్గాలతోపాటు అందరికీ పాలనలో భాగస్వామ్యం దక్కాలని వాదించారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ ఓటు హక్కు అనే విషయాన్ని పట్టించుకోలేదు. 1935లో మొదటి సారిగా వచ్చిన ‘భారత చట్టం’లోనూ సార్వత్రిక ఓటింగ్‌కు అవకాశం రాలేదు. 1937లో, 1946లో జరిగిన ఎన్నికల్లో కూడా విద్యా వంతులకు, వ్యాపారులకు, భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. వాళ్ళ ప్రతినిధులు మాత్రమే పార్లమెంటులో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం సాధించడంతో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకునే అవకాశం మనకు దక్కింది. అనేక దేశాల్లో వచ్చిన విప్లవాలు, మార్పులు, పరిణామాలను అర్థం చేసుకొని ఒక రాజ్యాంగం ఆవశ్యకతను గుర్తించి, దాన్ని యుద్ధప్రాతిపదికన లిఖిం చడం మొదలైంది. ఆ రాజ్యాంగ రచనకు అంబేడ్కర్ నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. 1919 నుంచి ఎంతో తపనతో ప్రతి పాదిస్తూ వచ్చిన సార్వత్రిక ఓటింగ్ విధానానికి సుదీర్ఘకాలం తరువాత అవకాశం లభించింది. అంబేడ్కర్ ఆ ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ 1928లో రూపొందిం చిన రాజ్యాంగానికి భిన్నంగా పటేల్ వ్యవహరించారు. సార్వత్రిక ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చకుండా, ఆర్టికల్ 326గా ఉంచారు. దీనివల్ల కలిగిన నష్టాన్ని తరతరాలుగా సామాన్యుడు భరిస్తూ వస్తున్నాడు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంద న్నది తాజా పరిస్థితులను చూస్తే అర్థం అవుతుంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థి తులేర్పడ్డాయి. కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు. అసలీ దుర్మా ర్గపుటాలోచనలకు అవకాశం ఉండేదే కాదు. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే, రాజ్యాంగంలో 226వ ఆర్టికల్ ప్రకారం ఎవరైనా ఓటు హక్కును కోల్పోయి ఉన్నా ఓటరు లిస్టులో తమ పేరు గురించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న ఓట్ల గల్లంతు వివాదానికి న్యాయపరమైన పరిష్కారం లభించేది. మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల్లో చేర్చిన విషయాలపట్ల మాత్రమే హైకోర్టు, సుప్రీంకోర్టులు బాధ్యత వహిస్తాయి. ఆనాడు అంబేడ్కర్ చేసిన ఆలో చనను ఈసారి కొలువుదీరే పార్లమెంటు చర్చించి, సార్వత్రిక ఓటింగ్‌ను ప్రాథమిక హక్కుల్లో చేర్చే ప్రయత్నం చేయాలి. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
‘గణతంత్రం’లో ఆదివాసీ స్ఫూర్తి
మౌలిక ప్రజాస్వామిక, గణతంత్ర వ్యవస్థ సంప్రదాయానికి అలవాటుపడిన మన ఆదివాసీ గిరిజనులు తమ ఓటింగ్ ఎంపికను స్వేచ్ఛగా ప్రకటించడానికి.. ఏ రోడ్డు రవాణా, వాహన సౌకర్యాలు లేని ప్రాంతంలోనే 12 నుంచి 16 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నూటికి 94 మందికి పైగా ఆదివాసీలు తమ ఓటు విలువను కాపాడుకోగలిగారు! ఆధునికులమనుకునే మనందరికీ ఆ గిరిజనుల చైతన్యం ఒక చెంపపెట్టు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి రక్షించగల గణతంత్ర గిరిజన సంస్కృతి మిణుకు మిణుకుమంటూ సుదూరంగా కొండకోనల్లో మనగలుగుతూండటం ఒక మరవరాని ఆనవాలు కాదా? ‘‘ఓటర్ల జాబితా నుంచి వేలాదిమంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఇలా ఓటర్ల పేర్లను గల్లంతు చేసినందున నిజాయితీగా ఎన్నికలు జరపడానికి రాష్ట్రం (తెలంగాణ) స్థిరంగా లేని సమయంలో ఎన్నికలొ చ్చాయి. ఈ పరిణామానికి ప్రధాన ఎన్నికల అధికారి క్షమాపణ చెప్పు కోవాలి’’ – ఇందుకు కారకులైన రాజకీయ శక్తుల్ని పేర్కొనకుండా కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన ప్రకటన (08–12–2018) ‘నేను ఓటేయకపోతే నేను చచ్చిపోయినట్లుగా భావిస్తారు. అందుకే గత నలభై ఏళ్లుగా వోటు వేస్తున్నాను’ అని అవిభక్త ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, ఆదివాసీయేతర గిరిజన మండలాలకు చెందిన ఆదివాసీ రాజగోండ్ ఓటరు కుడిమేత భీంబాయి చెప్పింది– కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల ఉన్న మేటి గూడ గ్రామవాసి. అలాగే ఇదే జిల్లాకు చెందిన గడిగూడ నార్నూర్ మండలాల్లో మొత్తం 31,317 మంది ఓటర్లలో 29,317 మంది (రాష్ట్రం లోనే 94.27 శాతంమంది) వోట్లు వేశారు. కాగా ఖనామార్, ఇంద్రవెల్లి గిరిజన ప్రాంతాల్లో 71.41 శాతం మంది వోటింగ్‌లో పాల్గొన్నారు. పోల్ అయిన ఓట్ల శాతం పెరగడానికి గిరిజన ఆదివాసీల ప్రజాస్వామ్య భావన కారణమైంది‘ ‘‘ది హిందు’’ ; 9–12–18 తెలంగాణ అసెంబ్లీకి అర్ధంతరంగా 9 మాసాలు ముందే జరిగిన ఎన్ని కల్లో ఫలితాలు ప్రకటించకముందు పోటీలో ఉన్న నాలుగు ప్రధాన రాజ కీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల్లో 181 మంది నేరస్థులుగా ఆరో పణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులు వీరిపైన అయిదేళ్లకు పైగా నాను తూనే ఉన్నాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ క్రిమినల్ కేసుల గురించి పదేపదే హెచ్చరిస్తూ ఉండే కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు గానీ ఏళ్లో పూళ్లోగా స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. పైగా కొన్ని అసెంబ్లీల (ఆంధ్ర–తెలంగాణ శాసనసభల) స్పీకర్లు సైతం అధికార, ప్రతిపక్షాల మధ్య స్వేచ్ఛగా జరుగుతూండే ఫిరాయింపుదార్లపైనగానీ ఉన్న చట్టాలను గౌరవించి చర్యలు తీసుకోవడం లేదు! ఓటు విలువకు పట్టం కట్టిన సంస్కృతి ఈ దారుణ పరిస్థితుల్లో 70 ఏళ్లకు పైగా కొట్టుమిట్టాడుతున్న ధనిక (పెట్టుబడిదారీ) వ్యవస్థలో సైతం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి రక్షించగల మూలవాసులైన గణతంత్ర ఆదివాసీ గిరిజన సంస్కృతి మిణుకుమిణుకుమంటూ రాష్ట్రంలో సుదూరంగా కొండకోనల్లో మన గలుగుతూండటం ఒక మరవరాని ఆనవాలు కాదా? అది ప్రాచీన గణతంత్ర వ్యవస్థ కాబట్టే ఇంకా మన మైదానప్రాంతాల దోపిడీ వ్యవస్థా సంస్కృతికి భిన్నంగా–ప్రజాస్వామ్య విలువలకు ఒక ప్రతీకగా ఆదివాసీ గిరిజన జనాభాలో నూటికి 94 మందికి పైగా తమ ఓటు విలువను కాపాడుకోగలిగారు! కటిక దారిద్య్రంలో కాలం గడుపుతున్నప్పటికీ ప్రయివేట్ ఆస్తులకు కోటికి పడగలెత్తని వారిని గురించి దక్షిణాఫ్రికా గాంధీగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దక్షిణాఫ్రికా విమోచన ప్రదాత నెల్సన్ మండేలా అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి. ‘‘బానిస త్వంలా, జాతి వివక్షలాగా దారిద్య్రం అనేది ఆకస్మికంగా రుద్దబడే ఘటన కాదు – దారిద్య్రాన్ని సృష్టించేది మానవుడే. దాన్ని నిర్మూలిం చడం అనేది మానవమాత్రుల నిశ్చయాత్మకమూ, నిర్మాణా త్మకమైన చర్యల ద్వారానే సాధ్యం, సుసాధ్యం’’ అన్నాడు. కనుకనే ఈ రాష్ట్ర లేదా దేశవ్యాపిత ఎన్నికలనే కాదు, ధనికవర్గ వ్యవస్థ జనాభాలోని కొద్దిమంది లేదా కొన్ని సంపన్నవర్గాల ప్రత్యేక ప్రయోజనాలకు ఎప్పుడు రక్షణ కవచంగా నిలబడుతుందో, అప్పుడు బీఆర్ అంబేడ్కర్ లాంటి రాజ్యాంగ నిర్ణేతలు రూపొందించిన సెక్యులర్ రాజ్యాంగమూ, దాని విలువలూ ఆచరణలో ప్రజా బాహుళ్యానికి దూర మైపోతూ ఉంటాయి. మన దేశంలో కాంగ్రెస్–బీజేపీ పాలకవర్గాల మూలంగా రాజ్యాంగ విలువలు దఫదఫాలుగా పతనమవుతూ, వీలును బట్టి ఆ పరిమిత లౌకిక రాజ్యాంగ స్వచ్ఛత కూడా రానురాను మసక బారిపోయి, ప్రజా ప్రయోజనాలకు హానికరంగా మారుతోంది. ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చేసి ఏనాడూ ‘హిందూ రాజ్య’ భావనను ప్రతిపాదిం చని వైదిక నీతిని వదిలేసి, ‘హిందు’ పదమే ‘సింధు’ పదానికి అపభ్రం శమని చెప్పి, మనది సర్వమత సమ్మేళనను ప్రబోధించి ‘సర్వజనులు సుఖశాంతులతో’ వర్ధిల్లాలి (సర్వేజనాః సుఖినోభవంతు) అని, ‘ప్రపం చం నలుమూలల నుంచి వచ్చే సకల భావధార’ను ఆహ్వానించాలని బోధిం చిన పూర్వ వైదిక ధర్మం మాత్రమే మనదనీ చాటిన ఆదిశంకరుల నీతిని సహితం పక్కకు తోసిపుచ్చుతున్నాయి బీజేపీ–ఆరెస్సెస్ వర్గాలు. ఈ దశలో ప్రధానంగా కాంగ్రెస్–బీజేపీల పాలనా కాలంలోనే 1580 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రిమినల్ నేరారోపణలను తీవ్ర స్థాయిలో ఎదుర్కొనవలసి వచ్చిందని మరవరాదు. అయినా అత్యున్నత న్యాయస్థానం, అనేక ప్రజా ప్రయోజనాల రక్షణకు వీలైన ఎన్నికల చట్ట నిబంధనలను, అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన చట్టాలనూ తీవ్ర నేరా రోపణలున్న లెజిస్లేటర్లపైన (అభ్యర్థులపైన) ఎన్నికల్లో పోటీ చేయ కుండా రాజకీయ అనర్హులుగా ప్రకటించడానికి ఆరోపణలను వాడరా దని చెప్పడం (ఇండియాటుడే: 25.9.2018) ఎంతవరకు సమంజసమో చర్చనీయాంశం కావాలి. ప్రస్తుత లోక్‌సభలో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు 35 శాతం ఉన్నారని సాధికార ఏడీఆర్ నివేదిక పేర్కొన్నప్పుడు కూడా సుప్రీం చర్యకు దిగకపోవడం, ఆ పనిని పార్ల మెంట్ నిర్ణయానికి వదిలిపెట్టడం సబబా? బ్రూట్ మెజారిటీ పేరుతోనో లేదా రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో కూడిన రాజకీయ పార్టీలు అధి కారంలో ఉన్నప్పుడు న్యాయస్థానం సహృదయంతో చేసిన ప్రతిపాద నకు ఎంతవరకు వీలు ఉంటుంది? ఆలోచించాలి. దీనికితోడు కుల వ్యవ స్థను, అసమానతల సమాజాన్ని దేశంలో పెంచి పోషిస్తున్న పాలకులు కుల, మత, వర్గ వివక్షకు తావులేని సామాజిక వ్యవస్థ స్థాపనకు కనీస ప్రజాస్వామ్య విలువలను కూడా కాపాడలేని దుర్గతికి చేరుకున్నారు. నేరమయ రాజకీయాలు, నేరారోపణలు చివరికి దేశ పాలకులు కొందరు ఓటింగ్ మిషన్ల లోపాలను సరిచేయకుం డానే వాడకంలోకి పెట్టి వాటంగా వాడుకోజూస్తున్న ఘటనలు ఎన్నో ప్రచారంలో ‘వైరల్’ అవుతున్నాయి. వేలు, లక్షల సంఖ్యలోనే పలుచోట్ల ఓటర్లు తమకు ఫొటో–ఓటర్ చీటీలు అందలేదని, ఓటర్లయినా ‘స్లిప్స్’ లేకపోయినా, ఆధార్ కార్డులున్న వారిని కూడా పోలింగ్ బూత్ నుంచి వెనక్కి తిప్పి పంపించేస్తున్న ఫిర్యాదులూ లక్షల్లోనే ఉంటున్నాయి. అసలు తాము ఓటు వేసే పోలింగ్ బూత్స్ ఉన్న ప్రాంతాలు స్పష్టంగా తెలియక పలు బూత్స్ తిరిగినా ఎక్కడా తమ పేర్లు కనిపించక పోయే సరికి హతాశులై వెనక్కి మళ్లిన వారి సంఖ్య కూడా అసంఖ్యాకంగా నమో దైంది. వీరిలో సరైన వయస్సులో వారే కారు, వృద్ధులు కూడా ఉన్నారు. పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్ ఓటు వేసిన తర్వాత అది నమోదైన తీరును చూసుకునే అవకాశమివ్వాల్సిన వివిపాట్స్ యంత్రాలు అనేక చోట్ల మొరాయించి 2–3 గంటలపాటు పనిచేయక పోవడంతో ఓటర్లు తమ ఓటు వినియోగించుకోకుండానే వెనుదిరిగిపోయారు. కొన్ని చోట్ల యితే అసలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా మార్చేయడంతో ఓటర్లు అయోమయంలో పడ్డారు. ఇదీ మన ప్రజాస్వామ్యపు ‘మేడిపండు’ గాథ. కనుకనే చూసి, చూసి ఈ అధర్మ, అరాచక వ్యవస్థను కొంత వరకైనా గాడిలో పెట్టే సదుద్దేశంతోనే సుప్రీం ధర్మాసనం ఓటింగ్ సరళిని ‘ప్రజాస్వామికం’ చేసేందుకు పార్టీలు, అభ్యర్థులు వారి ఓటు గుర్తులున్న జాబితాలో ‘పై అభ్యర్థులెవరూ మాకిష్టం లేదు’ (నోటు–ఎబౌ–నోటా) అన్న ఇంటూ సింబల్‌ను కూడా ఆఖర్లో చేర్చారు. ప్రజాస్వామ్యమా? ‘వంచనా’ స్వామ్యమా? ఇటీవల కొంతకాలంగా ఈ ‘నోటా’కు ఓటు వేసే వారి సంఖ్య డజన్ల స్థాయినుంచి, వందలకు, ఆపైన వేలకు, ఇటీవల కాలంలో లక్షల సంఖ్య లోకి పెరుగుతోందని పత్రికల సమాచారం. ఇటీవల కొన్ని ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ‘నోటా’ ఓటర్ల సంఖ్య పెరగ డాన్ని పత్రికలు నమోదు చేశాయి. అంటే, ప్రజాస్వామిక భావాలకు, పౌర సమాజ సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛకూ పాలకుల నుంచి రోజు రోజుకు ఎదురవుతున్న ఆంక్షలకు, బెదిరింపులకు సమాధానంగా ఒక ప్రజాస్వామిక నిరసనగా ఈ ‘నోటా’ విలువ పరిమితమైనది. కానీ మౌలిక ప్రజాస్వామిక సంప్రదాయానికి, గణతంత్ర వ్యవస్థ సంప్రదా యానికి అలవాటుపడి ఇప్పటికీ ఆ ప్రజాస్వామిక సంప్రదాయం ప్రకారం తమ ఎంపికను స్వేచ్ఛగా ప్రకటించడానికి ఏ రోడ్డు రవాణా, వాహన సౌకర్యాలు లేని ఆదివాసీ గిరిజనులు 12 నుంచి 16 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనడం... ఆధునికమని చెప్పు కునే మన నేటి స్వార్థపూరిత ధనికవర్గ సమాజంలో మనందరికీ ఒక చెంప పెట్టు. కాగా, శ్రీశ్రీ అన్నట్టుగా ‘నేటి రివల్యూషనరీ రేపటి రియా క్షనరీ’ అయితే ఎలా ఉంటుందో ప్రజాయుద్ధ నౌక, దళిత కవి గద్దర్ మనకు నమూనాలా కనిపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం గద్దర్ ఏ చంద్రబాబు తుపాకీ గుండు దెబ్బతిన్నాడో అదే చంద్రబాబు నేడు ఆ గద్దర్ దృష్టిలో ‘ప్రజాస్వామ్య రక్షకుడి’గా కన్పించడం సృష్టిలోపమా, దృష్టిలోపమా, మనకు తెలియదు. అందుకే దేశంలో నేడున్నది ప్రజాస్వామ్యమా? లేక ఆ పేరుతో ప్రబోధాలతో ప్రజాశక్తుల్ని దశలవారీగా లొంగదీసుకోవడా నికి వేగంగా ప్రయత్నిస్తున్న వంచనా స్వామ్యమా అన్నది శేష ప్రశ్న. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఓటు వేయడానికి తనతో రాలేదని...
లక్నో: భార్య మీద కోపంతో క్షణికావేశంతో ఒంటికి నిప్పంటించుకున్నాడో భర్త. ఉత్తరప్రదేశ్ డోరియా జిల్లాలో గ్రామ ప్రధాన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు రమ్మని భార్యను కోరాడు మహేంద్ర చౌహాన్. దీనికి భార్య నిరాకరించడంతో పాటు పక్కింటి మహిళతో ఓటింగ్ కేంద్రానికి వెళ్లింది. ఇది చూసి కోపోద్రిక్తుడైన మహేంద్ర భార్యపై దాడికి దిగాడు. ఆమెను తీవ్రంగా కొట్టడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న పెద్దలు ఇద్దరినీ వారించి ఇంటికి పంపేశారు. ఇంటికి చేరిన తర్వాత మహేంద్ర ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 40 శాతం గాయాలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలోచికిత్స పొందుతున్నాడు.