
సాక్షి, మెదక్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని తమ స్వగ్రామమైన చింతమడకలో సతీమణి శోభారాణితో కలిసి కేసీఆర్ ఓటు వేశారు. సీఎం రాక సందర్భంగా చింతమడకలో భారీగా బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తో పాటు మాజీమంత్రి హరీష్‌రావు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ జీహెచ్‌ఎంసీ కమ్యూటీహాల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ పోలింగ్ బూత్‌లో ఎంపీ కవిత దంపతులు ఓటేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment