
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎలాగైనా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించిన ముఖేశ్ గౌడ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో పోలింగ్ బూత్‌కు తరలించారు. దీంతో ఆయన అబిడ్స్ పోస్టాఫీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ముఖేశ్ గౌడ్‌ని ఈ పరిస్థితుల్లో చూసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొనాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment