mukesh goud
-
టాలీవుడ్ హీరోగా 'గుప్పెడంత మనసు' రిషి.. ఆ సినిమాతో ఎంట్రీ
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ఉన్నట్లు సీరియల్స్‌కి కూడా మంచి క్రేజ్ ఉంది. అందులోని నటీనటుల్ని కూడా మనవాళ్లు అంతే ఆదరిస్తుంటారు. అలా 'గుప్పెడంత మనసు' సీరియల్లో రిషి సర్ పాత్రలో నటిస్తూ అలరిస్తున్న ముఖేశ్ గౌడ.. ఇప్పుడు తెలుగు సినిమా హీరో అయిపోయాడు. తాజాగా ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) ముఖేష్గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్ నిర్మిస్తున్న సినిమా 'గీతా శంకరం'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దీపావళి కానుకగా శుక్రవారం విడుదల చేశారు. 'దీపావళి కానుకగా నా తొలి సినిమా ఫస్ట్‌లుక్ లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు నన్ను హీరోగా సెలక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. లవ్ అండ్ ఎఫక్షన్‌తో ఈ సినిమా తీశారు. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది' అని ముఖేష్ గౌడ అలియాస్ రిష్ చెప్పాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ముఖేశ్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ కన్నీటి వీడ్కోలు పలికింది. మంగళవా రం మధ్యాహ్నం గాంధీభవన్‌కు ఆయన పార్థివ దేహాన్ని తీసుకువచ్చి పార్టీ జెండా కప్పి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ డిప్యూటీ æసీఎం దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నేతలు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, వి.హన్మంతరావు, కూన శ్రీశైలంగౌడ్, అనిల్, వినోద్‌రెడ్డి, బొల్లు కిషన్, ఇందిరాశోభన్, కుమార్‌రావు తదితరులు ఆయనకు నివాళుర్పించినవారిలో ఉన్నారు. అనంతరం ముఖేశ్ పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనం లో రాయదుర్గం గౌడ్స్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అండగా సిటీ నేతలు ముఖేశ్‌గౌడ్ మరణవార్త విన్న దగ్గర నుంచి పార్టీలకతీతంగా నగర నేతలు ఆయన కుటుంబాన్ని వెన్నం టే ఉన్నారు. బంజారాహిల్స్, జాంబాగ్‌లోని ఆయన నివాసాల వద్ద మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నీ తానై నడిపించారు. గాంధీభవన్ నుంచి ప్రత్యేక వాహనంలోకి ముఖేశ్ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న సమయంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్ పాడె మోశారు. ముఖేశ్ తనయుడు, టీపీసీసీ కార్యదర్శి విక్రమ్‌గౌడ్‌కు తోడుగా పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, ముఖేశ్ అభిమానులు తరలిరాగా జనసందోహం మధ్య గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర సాగింది. చితికి నిప్పంటించిన విక్రమ్‌గౌడ్ ముఖేశ్‌గౌడ్ అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య రాయదుర్గం గౌడ్స్ శ్మశానవాటికలో నిర్వహించారు. ముఖేశ్‌గౌడ్ చితికి కుమారుడు విక్రమ్‌గౌడ్ నిప్పంటించారు. రాయదుర్గంకే చెందిన ముఖేశ్‌గౌడ్ నగరంలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నప్పటికీ తన సొంతూరుతో ఉన్న అనుబంధంతో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీలు టి.దేవేందర్‌గౌడ్, వి.çహన్మంతరావు, మధుయాస్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు గీతారెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంతోష్ కుమార్, పలువురు కార్పొరేటర్లు తదితర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అండగా ఉంటుంది: ఉత్తమ్ తమతో కలిసి సుదీర్ఘ కాలం పనిచేసిన పార్టీ సభ్యుడు మరణించడం తీవ్రబాధ కలిగించిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. ముఖేశ్‌గౌడ్ కుటుంబానికి కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ముఖేశ్ చొరవతోనే వరంగల్‌లో బీసీ గర్జన జరిగిందని, తన సహచరుడి మృతి కలచివేసిందని పొన్నాల అన్నారు. -
ముగిసిన ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు
-
మాస్ లీడర్ ముఖేష్‌గౌడ్
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ గ్రేటర్‌పై తనదైన ముద్ర వేశారు. యూత్ కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగ్రేటం చేసిన ముఖేష్‌గౌడ్.. 1986లో కాంగ్రెస్ తరఫున జాంబాగ్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1989, 2004, 2009లలో ఎమ్మెల్యేగా విజయం సాధించి..రెండుసార్లు మంత్రిగా సేవలందించారు. గ్రేటర్ కాంగ్రెస్ ప్రముఖుల్లో ఒకరైన ముఖేష్‌గౌడ్..మాస్ లీడర్‌గా గుర్తింపు పొందారు. పీజేఆర్ మరణానంతరం గ్రేటర్లో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ మంత్రి, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానంనాగేందర్‌తో కలిసి పార్టీని ముందుకునడిపించారు. అందుకే వీరిద్దరినీ ‘హైదరాబాద్ బ్రదర్స్’గా పిలిచేవారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వీరికి మంత్రి పదవులు ఇచ్చారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నేత రాజాసింగ్ చేతిలో ఓటమి పాలైన ముఖేష్‌గౌడ్.. తర్వాత కేన్సర్ వ్యాధితో వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఏడు శస్త్రచికిత్సలు చేసినా ఆయన ఆరోగ్యంమెరుగుపడకపోగా... శరీరం వైద్యానికిసహకరించకపోవడంతో ముఖేష్‌గౌడ్ సోమవారం తుది శ్వాస విడిచారు. సుల్తాన్‌బజార్: కాంగ్రెస్‌నేత, మాజీ మంత్రి మూల ముఖేష్ గౌడ్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్ను మూయడంతోగోషామహల్ నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ముఖేష్ గౌడ్ కేన్సర్ వ్యాధికి అపోలో ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో బలమైన నాయకుడిని కోల్పోయినట్టయింది. 1959 జూలై 1న జన్మించిన ముఖేష్‌గౌడ్‌కు విక్రంగౌడ్, విశాల్‌గౌడ్, కుమార్తె శిల్ప సంతానం. ఆయన కుమారుడు విక్రంగౌడ్ పీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా, ఆయన మృతి వార్త తెలుసుకున్న అభిమానులు, పలువురు నాయకులు, రాజకీయ ప్రముఖులు ముఖే ష్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
తెలంగాణ కాంగ్రెస్‌కు కష్టాలు
-
ముఖేశ్ గౌడ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.ముఖేశ్ గౌడ్ (60) సోమ వారం మధ్యాహ్నం కన్నుమూశారు. కేన్సర్‌తో చికిత్స పొందుతున్న ఆయనను ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చేర్చి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ.. ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఒకవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతుండగానే.. మరో వైపు ముఖేశ్ గౌడ్ కన్నుమూశారనే వార్త పార్టీలో విషాదం నింపింది. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ కోల్పోయినట్లయింది. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతన్న ముఖేశ్ గౌడ్ ఆరోగ్యం.. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మరింత క్షిణించింది. దీంతో అప్పటినుంచి అపోలో ఆస్పత్రి వైద్యుల సంరక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు 7 శస్త్రచికిత్సలు జరిగాయి. చివరకు చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో ఆయన మృతి చెందారు. ముఖేశ్ గౌడ్ 1959 జూలై ఒకటిన జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు విక్రమ్ గౌడ్, విశాల్ గౌడ్, కుమార్తె శిల్పా ఉన్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖేశ్ కన్నుమూసినట్టు సమాచారం తెలియగానే కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు.. హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని ఆసుపత్రికి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం ముఖేశ్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీలోని స్వగృహానికి తరలించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకొని నివాళురు అర్పించారు. నేడు అధికారికంగా అంత్యక్రియలు ముఖేశ్ గౌడ్ భౌతికకాయానికి మంగళవారం ఉదయం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని నగరంలోని జాంబాగ్ మార్కెట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం అంతిమ యాత్ర బయల్దేరుతుంది. ఫిల్మ్‌నగర్‌లో జేఆర్సీ ఫంక్షన్ హాల్ సమీపంలోని గౌడ్ శ్మశాన వాటిలో మంగళవారం ఉదయం 10.30గంటలకు ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మాస్‌లీడర్ ముఖేశ్ గౌడ్ గ్రేటర్ హైదరాబాద్‌లో ముఖేశ్ గౌడ్ మాస్‌లీడర్‌గా గుర్తింపు పొందారు. జన హృదయాలను గెలిచిన ప్రజానాయకుడు ముఖేశ్.. నగరంలో వేళ్ళ మీద లెక్కించ దగ్గ కాంగ్రెస్ నాయకుల్లో ఆయన ఒకరు. యూత్ కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగ్రేటం చేసి కార్పొరేటర్‌గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కార్పొరేటర్ నుంచి.. ముఖేశ్ గౌడ్ 3దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చారు. ఆది నుంచి కాంగ్రెస్ భావజాలానికి ఆకర్షితులైన ఆయన విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐలో పనిచేశారు. యువజన కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించారు. 1986లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన జాంబాగ్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 1989లో మహారాజ్‌గంజ్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మజ్లిస్ కంచుకోట అయిన ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపి మాస్‌లీడర్‌గా గుర్తింపు పొందారు. అయితే.. 1994,1999లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం 2004లో అక్కడినుంచే మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేశ్ గౌడ్ తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. 2009లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఐదేళ్ల పూర్తి కాలం పనిచేశారు.హైదరాబాద్ ›బ్రదర్స్‌లో ఒకడిగా గుర్తింపు పొందిన ముఖేశ్ హైదరాబాద్ నగర రాజకీయాల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీచేసి, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించకుండానే కన్నుమూశారు. ముఖేశ్ మృతిపై కేసీఆర్, వైఎస్ జగన్‌ల సంతాపం సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ మరణంపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ముఖేశ్ గౌడ్ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని తెలి యజేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖేశ్‌గౌడ్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియాలతోపాటు టీపీసీసీ ముఖ్య నేతలు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రముఖుల సంతాపం మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియాలతోపాటు టీపీసీసీ ముఖ్య నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. -
కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతి
-
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతి
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి ఎం.ముఖేశ్ గౌడ్(60) సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ముఖేష్ గౌడ్ సోమవారం మధ్యాహ్నం మరణించారు. 1959 జూలై 1న జన్మించిన ముఖేశ్ గౌడ్.. 1989, 2004లో మహారాజ్‌గంజ్ నుంచి, 2009లో గోషామహల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2007లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేశ్ గౌడ్ బాధ్యతలు నిర్వహించారు. 2009లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేష్ గౌడ్, బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురైన ముఖేశ్ గౌడ్.. అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. ముఖేశ్ గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వైఎస్ జగన్ సంతాపం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ముఖేష్ గౌడ్ మృతి గురించి తెలిసిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ముఖేష్ గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ముఖేష్ గౌడ్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఆయన స్వగృహానికి తరలించారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు వంటి సీనియర్ నేతలు ముఖేష్ గౌడ్ ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. రేపు సాయంత్రం అంత్యక్రియలు.. మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తొలుత రేపు ఉదయం 10-11గంటల వరకూ కార్యకర్తల దర్శనార్థం ముఖేష్ గౌడ్ మృతదేహాన్ని గాంధీభవన్‌లో ఉంచనున్నారు. ఆపై 11-12గంటల వరకూ మొజాంజాహి మార్కెట్లోని ఇంటి వద్ద ఉంచనున్నట్లు సమాచారం. సాయంత్రం 3గంటలకు షేక్‌పేటలోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ సమీపంలోని గౌడ సమాజ్‌లో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు సమాచారం. -
అత్యంత విషమంగా ముఖేష్ గౌడ్ ఆరోగ్యం..
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.ముఖేష్ గౌడ్ (60) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయానికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. -
విషమంగా ముఖేష్ గౌడ్ ఆరోగ్యం.. చికిత్స నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. కొన్ని నెలలుగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలిసింది. అతని శరీరం వైద్యానికి సహకరించపోవడంతో వైద్యులు చికిత్స నిలిపివేశారు. కాగా ఎన్నికల సమయంలో ఆయన అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నా ఇప్పటి వరకూ ఆయన కోలుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ముఖేశ్ గౌడ్‌ని ఈ పరిస్థితుల్లో చూసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. -
అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేశారు..
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎలాగైనా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించిన ముఖేశ్ గౌడ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో పోలింగ్ బూత్‌కు తరలించారు. దీంతో ఆయన అబిడ్స్ పోస్టాఫీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ముఖేశ్ గౌడ్‌ని ఈ పరిస్థితుల్లో చూసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొనాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. -
బుజ్జగింపులు షురూ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. గతంలో రాష్ట్ర మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఇతర ముఖ్య పదవుల్లో పనిచేసి ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న వారిని మళ్లీ పార్టీ లో క్రియాశీలం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జిలుగా నియమితులయిన ముగ్గురు కార్యదర్శులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇన్చార్జిగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు మంగళవారం మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అలాగే వారం క్రితం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ముగ్గురు కార్యదర్శులు కలిసినట్టు తెలుస్తోంది. మెదక్ మాజీ ఎంపీ విజయశాంతితో కూడా బోసురాజు నేడో, రేపో సమావేశమవుతారని సమాచారం. ఆ రెండు జిల్లాల నేతలకేనా ప్రాధాన్యం? బోసురాజుతో భేటీ సందర్భంగా మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తన అసంతృప్తికి గల కారణాలను వివరించారు. పార్టీలో కేవలం రెండు జిల్లాల నాయకుల మాటే చెల్లుబాటు అవుతోందని, మిగిలిన నేతలను కనీసం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలే సర్వం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి నేతలను అసలు పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారతారనే ప్రచారం గత రెండేళ్లుగా జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని, తాను అసంతృప్తితో ఉన్నానని తెలిసి కూడా ఏ ఒక్క నాయకుడూ తనతో మాట్లాడలేదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 డివిజన్లలో తాను విస్తృతంగా పర్యటించానన్నారు. తన అసంతృప్తి వెనుక ఉన్న కారణాలను పట్టించుకునే ప్రయత్నం టీపీసీసీ నేతలు చేయలేదని ముఖేశ్ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బోసురాజు ముఖేశ్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తనకు అన్ని పరిస్థితులు తెలుసునని, అన్ని విషయాలను రాహుల్‌కు చెప్పానని, పార్టీలోనే కొనసాగాలని పేర్కొన్నారు. రాహుల్ రాష్ట్ర పర్యటనలో ఆయనతో మాట్లాడిస్తానని హామీ ఇస్తానని చెప్పినట్టు ముఖేశ్ సన్నిహితుల ద్వారా తెలిసింది. మరోవైపు వారం రోజుల క్రితం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో ముగ్గురు కార్యదర్శులు దాదాపు 2 గంటలు సమావేశమయ్యారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పార్టీ పట్ల తనకున్న అసంతృప్తిని వారి ముందు రాజనర్సింహ కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. సముద్రం లాంటి పార్టీలో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయని, అన్నింటిని పరిష్కరించుకుని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేద్దామని కార్యదర్శులు దామోదరకు సూచించినట్టు తెలిసింది. స్థానిక నేతలను వదిలి.. నియోజకవర్గాల పరిధిలో నేతల మధ్య సమన్వయం కోసమే నియమించిన కార్యదర్శులపైనే రాహుల్ నమ్మకం ఉంచినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలను టీపీసీసీ నేతలకు కాకుండా కార్యదర్శులకే అప్పగించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తితో ఉన్న నేతల జాబితాను తయారు చేసుకున్నట్టు సమాచారం. ఈ జాబితా ప్రకారం క్రమంగా ఒక్కో నేతను కలిసి రాహుల్ పర్యటన నాటికి పార్టీలో అందరినీ క్రియాశీలం చేయాలనే కార్యాచరణ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ పర్యటన అనంతరం రాష్ట్ర పార్టీలో అసంతృప్తులు లేకుండా చేయాలనే ధ్యేయంతోనే కార్యదర్శులు ముందుకెళ్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌లోనే ఉన్నా: ముఖేశ్‌గౌడ్ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో సమావేశం అనంతరం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తన ఇల్లు గాంధీభవన్‌కు కూతవేటు దూరంలో ఉందని, తాను ఇంట్లో ఉన్నా గాంధీభవన్‌లో ఉన్నట్టేనని వ్యాఖ్యానించారు. బోసురాజు ఇచ్చిన సలహాలను స్వీకరించానని చెప్పారు. బోసురాజు మాట్లాడుతూ ముఖేశ్‌తో అన్ని విషయాలు చర్చించినట్టు చెప్పారు. -
కారెక్కే వార్తలపై క్లారిటీ ఇచ్చిన ముఖేష్
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కారెక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను క్రియాశీలకంగా కాంగ్రెస్‌లోనే పనిచేస్తున్నానని, ఈ పార్టీలోనే ఉండబోతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ముఖేష్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుతో చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో పార్టీ కోసం పర్యటించానని, తన ఇళ్లు గాంధీభవన్ పరిసరాల్లోనే ఉందని, కావున ఇంట్లోనే ఉన్నా గాంధీ భవన్లో ఉన్నట్టేనని అన్నారు. తాను ప్రస్తుతం బోసు రాజు సలహాలు, సూచనలు తీసుకున్నానని చెప్పారు. ఇంకా మరింత మంది పార్టీ నేతలతో చర్చించి, కాంగ్రెస్‌ను మరింత బలపడేలా చేస్తానని తెలిపారు. పార్టీ ఇంఛార్జ్, పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేతలతో ముఖేష్ టచ్‌లోనే ఉన్నాడని బోసు రాజు కూడా చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని ముఖేష్‌కు తాను సూచించానని బోసు రాజు తెలిపారు. ఈ భేటీతో గత కొన్ని రోజులుగా ముఖేష్, టీఆర్ఎస్లో చేరబోతున్నాడనే వార్తలకు కళ్లెం పడింది. మరోవైపు రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై ముగ్గురు సెక్రటరీలతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాల్లో కాంగ్రెస్‌కు అనుకూలత కనిపిస్తోందని రాహుల్‌కు వివరించినట్టు ఏఐసీసీ కార్యదర్శి ఎన్ఎస్ బోసురాజు తెలిపారు. మండల స్థాయి నుంచి పీసీసీ వరకు పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ సెక్రటరీలకు సూచించినట్టు తెలిసింది.తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని అధిష్టానం నుంచి అందిస్తామని రాహుల్ తెలిపారని బోసు రాజు చెప్పారు. -
ఊగిసలాటలో ముఖేశ్..!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ఉండాలా..? అధికార టీఆర్ఎస్లో చేరాలా? అనే విషయంపై మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నా రు. కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం లేని కారణంగా పార్టీని వీడాలని దాదాపు నిర్ణయం తీసుకున్నా.. వేచిచూసే ధోరణిలో ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీని వీడొద్దంటూ కాంగ్రెస్ నుంచి వస్తున్న ఒత్తిడితో పాటు టీఆర్ఎస్ నుంచి స్పష్టమైన ఆహ్వానం, హామీ రాకపోవడంతో తొందర వద్దనే భావనలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి తోడు ముఖేశ్ టీఆర్ఎస్లోకి రాకుండా నగరానికి చెందిన ఓ కీలక మంత్రి అడ్డుపుల్ల వేస్తుండటం కూడా ఆయనకు ఇబ్బందిగా మారుతోంది. అయితే, నగరానికే చెందిన ఓ ఎంపీ ఆయన్ను పార్టీ మారాలని ప్రోత్సహిస్తుండటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోకి ముఖేశ్ వెళ్లిపోయారు. వాస్తవానికి తన జన్మదినం సందర్భంగా ఆదివారమే ఓ నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. జన్మదిన వేడుకల్లో హడావుడి.. తన రాజకీయ భవితవ్యంపై జన్మదినం సందర్భంగా అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని, అక్కడే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని ముఖేశ్‌గౌడ్ తొలుత భావించారు. అయితే ఆదివారం ఉదయం నుంచి జాంబాగ్‌లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలకు నేతలు, కార్యకర్తల రాకతో హడావుడి నెలకొంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి డి.కె.అరుణ, ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి తదితరులు వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్ ముఖేశ్‌తో కొంతసేపు మాట్లాడారు. పార్టీ మారవద్దని, ఏదైనా ఉంటే గాంధీభవన్‌లో మాట్లాడి పరిష్కరించుకుందామని సూచించారు. అయితే, అంతకుముందే గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు ముఖేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి.. 45 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. త్వరలోనే ముఖేశ్ పార్టీలోకి వస్తారని, పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామని అక్కడ ఉన్న ముఖేశ్ అనుచరులతో బహిరంగంగానే చెప్పి వెళ్లిపోయారు. కొనసాగుతున్న సస్పెన్స్ ప్రస్తుతానికి ముఖేశ్ గౌడ్ గందరగోళంలో ఉన్నారు. పార్టీలో చేరాలని ఆహ్వానించిన మైనంపల్లి నుంచి ఎలాంటి స్పష్టతా రాకపోవడం, తాను పార్టీలోకి రాకుండా ఓ మంత్రి అడ్డుకుంటుండటంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ముఖేశ్ గౌడ్ అనుచరుడైన బీజేపీ కార్పొరేటర్ ఒకరిని పార్టీలోకి తీసుకువచ్చి గోషామహల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించాలని ఆ మంత్రి ప్రయత్నిస్తున్నారని ముఖేశ్ గౌడ్ వర్గం అంటోంది. కానీ, నగరానికే చెందిన ఓ ఎంపీ మాత్రం ముఖేశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి రావాలని, తద్వారా తనకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా మేలు కలుగుతుందనే ఆలోచనలో ఉన్నారని, ఆయన చొరవతోనే ముఖేశ్ గౌడ్ పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా.. టీఆర్ఎస్ పార్టీలో చేరతారా అనే సస్పెన్స్ ఇంకొన్ని రోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. -
పార్టీ మారడంపై ముఖేష్‌గౌడ్ క్లారిటీ!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తన రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ప్రకటించేశారు. కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఆదివారం తన జన్మదినం సందర్భంగా జాంబాగ్‌లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలతో చర్చించిన అనంతరం పార్టీ మారడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. అనేక మంది బీసీ నేతలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు ముఖేష్‌గౌడ్ తెలిపారు. నేటి నుంచి నియోజక వర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేసి.. చివరగా కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, వి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కాంగ్రెస్‌లో క్రియాశీలక నాయకునిగా, మాజీ మంత్రిగా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు జరిగిన ప్రచారంపై ఆయన స్పందించ లేదని సమాచారం. గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు కూడా చాలాకాలంగా హాజరుకావడం లేదన్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షకు కూడా తండ్రీతనయులు గైర్హాజరయ్యారు. -
టీఆర్ఎస్లోకి ముఖేశ్‌గౌడ్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తన రాజకీయ భవితవ్యంపై నేడు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఆదివారం తన జన్మదినం సందర్భంగా జాంబాగ్‌లోని క్యాంపు కార్యాలయంలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కార్యకర్తలతో చర్చించి ఆయన కాంగ్రెస్‌లో కొనసాగాలా.. లేక టీఆర్ఎస్లోకి వెళ్లాలా.. అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ముఖేశ్ ఇప్పటికే టీఆర్ఎస్లో చేరాలనే ఆలోచనతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్‌లో క్రియాశీలక నాయకునిగా, మాజీ మంత్రిగా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయనతో పాటు కుమారుడు విక్రంగౌడ్ కూడా పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు. గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు కూడా చాలాకాలంగా హాజరుకావడం లేదు. శనివారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షకు కూడా తండ్రీతనయులు గైర్హాజరయ్యారు. అయితే, పార్టీ సమావేశాలకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం లేదని అనుచరుల వద్ద చెప్పుకుంటున్న ముఖేశ్ టీఆర్ఎస్లోకి వెళ్లడం దాదాపు ఖరారయినట్టేనని రాజకీయ వర్గాలంటున్నాయి. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు సంస్థాగతంగా పెద్దగా బలం లేనప్పటికీ, వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం–టీఆర్ఎస్ రాజకీయ అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉందని, దీంతో ముస్లిం ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే అంచనాతోనే ఆయన కారు వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆదివారం కార్యకర్తలతో సమావేశమయిన తర్వాత ముఖేశ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. -
మద్యం మత్తులో మాజీ కార్పొరేటర్ కొడుకు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు తల్లి విగ్రహం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు హిమాయత్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలివి.. మద్యం మత్తులో ఓ వ్యక్తి ర్యాస్ డ్రైవింగ్ చేయడంతో కారు ప్రమాదానికి గురైంది. ఆ కారు నడిపిన వ్యక్తి మాజీ కార్పొరేటర్ మధు గౌడ్ కుమారుడు అక్షయ్ కుమార్ గౌడ్ అని గుర్తించారు. మధు గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తమ్ముడు. మద్యం సేవించిన అక్షయ్ బాధితులను పట్టించుకోకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ప్రమాదంలో గాయపడిన వారు కావాడిగూడకు చెందిన సాయి, ఆకేశ్ గౌడ్లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారెక్కనున్న ముఖేష్?
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మూల ముఖేష్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. గత ఏడాదిన్నర కాలంగా సందిగ్ధంలో ఉన్న ముఖేష్ ఎట్టకేలకు కారెక్కేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నగరానికి చెందిన ఓ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాయబారం నడిపి చేరికకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: గోషామహల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాల నేపథ్యంలో స్థానిక కార్యకర్తల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముఖేష్ ఈ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేష్‌గౌడ్ 47 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సర కాలం నుంచి ముఖేష్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతోంది. ఎంపీ రాయబారంతో గ్రీన్ సిగ్నల్... తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీ అధ్యక్షుడు, నగరానికి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు ముఖేష్‌గౌడ్‌ను టీఆర్ఎస్లో చేర్పించేందుకు కేసీఆర్ వద్ద రాయబారం నడిపినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఆ ఎంపీ కేసీఆర్‌కు నచ్చజెప్పడంతో ముఖేష్‌గౌడ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంజే మార్కెట్లోని తన కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన ముఖేష్‌గౌడ్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశం కానున్నారు. అనంతరం టీఆర్ఎస్లో చేరే తేదీని ప్రకటిస్తారని తెలిసింది. -
విక్రమ్ గౌడ్ డైరెక్షన్లో కాల్పుల డ్రామా
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసులో మిస్టరీ ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అనంతపురానికి చెందిన నలుగురు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు, విక్రమ్ గౌడ్‌కు గతంలోనే పరిచయం ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అంతేకాకుండా ఈ కాల్పుల సూత్రధారి విక్రమ్ గౌడేనని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సానుభూతి కోసమే విక్రమ్ కాల్పుల పథకం రచించినట్లు తెలుస్తోంది. తనకు తెలిసినవారితోనే తతంగం నడిపినట్లు సమాచారం, తన ఇంటి వెనుక కొత్త చెరువులో గన్ పడేసినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మరోపక్క ఆర్థిక ఇబ్బందులు, ఆయుధ లైసెన్స్ పునరుద్ధరణ, కుటుంబానికి దగ్గర కావడం తదితర కారణాల నేపథ్యంలో ఈ కథ మొత్తానికీ విక్రమ్‌గౌడే సూత్రధారా అన్న కోణాన్నీ పరిగణలోకి తీసుకుని ఆరా తీశారు. ఉదంతం జరిగిన విక్రమ్‌గౌడ్ ఇంటికి సమీపంలోనే ఆపోలో ఆస్పత్రి సైతం ఉండటంతో ఇంటినే స్పాట్‌గా ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో విక్రమ్ ప్రమేయం బయటపడి, ఆయన ప్లాన్ ప్రకారమే కాల్పులు జరిగినట్లు లేదా కాల్చుకున్నట్లు తేలితే ఆయనతో పాటు సంబంధం ఉన్న వారిపైనా కేసుల నమోదుకు నిర్ణయించారు. అగంతకులు వాడిని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్న అతడు ఈ కాల్పుల డ్రామాకు తెరతీశాడు. కాగా పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు విక్రమ్‌తో పాటు అతడి భార్య షిపాలీపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. -
వీడని విక్రమ్‌గౌడ్ కాల్పుల మిస్టరీ
-
ఆ ఆయుధం ఎక్కడ?
ముమ్మరంగా వెతుకుతున్న పోలీసు బృందాలు - ఇద్దరు వచ్చి కాల్చారని చెప్పిన విక్రమ్‌గౌడ్ - అతని వాంగ్మూలంపై పోలీసులకు అనుమానాలు - అవసరమైతే విక్రమ్‌కు నిజనిర్ధారణ పరీక్షలు - నా భర్త అన్ని వివరాలు చెప్పారు: షిపాలి - నిలకడగా విక్రమ్ ఆరోగ్యం: అపోలో వైద్యులు సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ కాల్పుల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాల్పులు జరిపిన ఆయుధంపై ప్రస్తుతం దృష్టి సారించారు. దీనికోసం ముమ్మరంగా వేట సాగిస్తున్న ప్రత్యేక బృందాలు.. అది అక్రమ ఆయుధమా? లైసెన్స్డ్ ఆయుధం దుర్వినియోగమా? అనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. మరోవైపు విక్రమ్ ఎట్టకేలకు శనివారం నోరు విప్పారు. అయితే తనపై ఆగంతకులు కాల్పులు జరిపారంటూ అతను చెప్తున్న విషయాలను పోలీసులు విశ్వసించట్లేదు. ఈ నేపథ్యంలో అవసరమైతే విక్రమ్‌కు నిజనిర్థారణ పరీక్షలు చేయాలని యోచిస్తున్నారు. ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, క్లూస్, ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈ కాల్పులు మరో వ్యక్తి పాల్పడినవి కాదని, విక్రమ్ తనంతట తానుగా కాల్చుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయం అధికారికంగా నిర్ధారించడానికి అతడి చేతుల నుంచి సేకరించిన గన్ షాట్ రెసిడ్యూ(జీఎస్సార్) స్వాబ్స్ పరీక్షలు పూర్తయి నివేదిక రావాల్సి ఉంది. ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స నిమిత్తం వైద్యులు విక్రమ్ శరీరంతో పాటు చేతులపై ఉన్న రక్తాన్ని శుభ్రం చేశారు. దీంతో జీఎస్సార్ నమూనాలు లభించే ఆస్కారాలు తక్కువని భావిస్తున్న పోలీసులు.. కాల్పులకు వాడిన ఆయుధంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించాక అతడిని బంధువులు, స్నేహితుల్లో ఎవరెవరు కలిశారు? వారిలో ఎవరైనా తుపాకీ తీసుకువెళ్లారా? అనే అంశంపై దృష్టి పెట్టిన పోలీసులు ఆస్పత్రిలో రికార్డు అయిన సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు విక్రమ్ ఇంటి వెనుక ఉన్న రాళ్లు, తుప్పల్లోనూ ఆయుధం కోసం గాలించినా ఫలితం దక్కలేదు. అక్రమమా? దుర్వినియోగమా? కాల్పులకు వినియోగించిన ఆయుధానికి సంబంధించి పోలీసులు రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రాథమికంగా ఎవరిదైనా లైసెన్స్డ్ ఆయుధం దీనికి వినియోగించి తుపాకీని దుర్వినియోగపరిచారా? లేదంటే అక్రమ ఆయుధాన్ని తీసుకువచ్చి వాడారా? అనేది పరిశీలిస్తున్నారు. తుపాకీ దొరికితేనే ఈ వ్యవహారంలో అనేక చిక్కుముడులు వీడుతాయని చెప్తున్నారు. విక్రమ్ ఇంటి వాచ్మెన్ శ్రీనివాస్‌ను పోలీసులు రెండో రోజూ విచారించారు. ఘటనాస్థలిలో రక్తపు మరకలు ఎందుకు తుడిచారు? అలా చేయమని ఎవరైనా చెప్పారా? తదితర అంశాలను ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన బుల్లెట్ ముందుభాగం ఆధారంగా పరిశీలన జరిపిన ఫోరెన్సిక్ నిపుణులు అది నాటు తుపాకీ అయి ఉండచ్చని అభిప్రాయ పడ్డారు. ఉదం తానికి సంబంధించి విక్రమ్ భార్య షిపాలి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు తప్పని తేలితే ఆమెపైనా కేసు నమోదు చేయాలని యోచిస్తున్నారు. శుక్రవారం రాత్రి విక్రమ్ ఓ పబ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఏం జరిగిందనే అంశంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఇద్దరు వచ్చి కాల్చారన్న విక్రమ్.. విక్రమ్‌గౌడ్ శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సరైన వివరాలు చెప్పలేదు. పోలీసులు ఎన్నిసార్లు అడిగినా తనను కాల్చింది ఎవరో తనకు తెలుసని, ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక చూసుకుంటానని చెప్తూ వచ్చాడు. విక్రమ్ కాస్త కోలుకున్న నేపథ్యంలో శనివారం పోలీసులు గట్టిగా ప్రశ్నించగా.. నోరు విప్పిన విక్రమ్ ఓ కథనాన్ని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున తాను డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చారని, ఒకరు హెల్మెట్ పెట్టుకుని ఉండగా.. మరొకరు ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నారని వివరించారు. హెల్మెట్ ధరించిన వ్యక్తి తొలి రౌండ్ కాల్చగానే తాను కింద పడిపోయానని, ఆపై రెండో రౌండ్ కాల్చాడని తెలిపారు. మరో రౌండ్ కాల్చడానికి ప్రయత్నించగా వారి తుపాకీ స్ట్రక్ అయిందని చెప్పారు. తాను అరవటం, తన భార్య వస్తుండటం గమనించి వారు పారిపోయారని పేర్కొన్నారు. భూ, ఆర్థిక, రాజకీయ వివాదాల్లో ఏదైనా దీనికి కారణమై ఉండొ చ్చని పోలీసులకు తెలిపారు. అయితే ఈ కథనాన్ని పోలీసులు విశ్వసించట్లేదు. విక్రమ్ ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయ్యే లోపు తుపాకీ ఆచూకీ లేకపోయినా, కేసు కొలిక్కి రాకున్నా అవసరమైన అనుమతుల తర్వాత అతనికి నిజనిర్ధారణ పరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. పోలీసులు ఆయన భార్య షిపాలిని మరోసారి విచారించగా తాను ఫిర్యాదులో పేర్కొన్నదే వాస్తవమంటూ చెప్పారు. నా భర్త అన్ని వివరాలు చెప్పారు: షిపాలి కాల్పుల ఘటనకు సంబంధించి విక్రమ్ భార్య షిపాలి శనివారం స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను విక్రమ్ పోలీసులకు తెలిపారని, పోలీసు శాఖపై తమకు పూర్తి నమ్మకముందని, ఘటనపై పోలీసులే అన్ని వివరాలు చెబుతారని అన్నారు. తన భర్తపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని మీడియాను కోరారు. ముకేశ్‌గౌడ్ పిస్టల్ స్వాధీనం.. కాల్పుల ఘటనలో దొరికిన తూటా, షెల్స్ 7.65 క్యాలిబర్‌కు చెందినవి. వీటిని .32 పిస్టల్‌లోనూ పెట్టి పేల్చే అవకాశం ఉందని బాలిస్టిక్ నిపుణులు స్పష్టం చేశారు. విక్రమ్ తండ్రి వద్ద ప్రస్తుతం ఈ క్యాలిబర్ లైసెన్స్డ్ పిస్టల్ ఉంది. దీంతో ఆయనకు తెలియకుండా పిస్టల్‌ను ఇంట్లో నుంచి తెచ్చుకుని ఉంటాడా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి శుక్రవారం అర్ధరాత్రి ముఖేష్‌గౌడ్ ఇంటి నుంచి పిస్టల్‌ను తెప్పించిన పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ప్రాథమిక పరిశీలన బట్టి విక్రమ్ కాల్పుల ఉదంతంలో ఈ ఆయుధం వాడలేదని గుర్తించినట్లు తెలిసింది. శనివారం సాయంత్రానికి ఈ ఉదంతంపై పోలీసులు ఓ స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఆదివారం అధికారికంగా ప్రకటించే ఆస్కారం ఉందని సమాచారం. నిలకడగా విక్రమ్‌గౌడ్ ఆరోగ్యం విక్రమ్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శనివారం సాయంత్రం విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌బులెటిన్ విడుదల చేసిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయనకు నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే విక్రమ్ శరీరంలో ఉన్న బుల్లెట్‌ను ఇంకా వెలికితీయలేదన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా విక్రమ్ వైద్య ఖర్చుల బిల్లులు చెల్లించాల్సిందిగా తండ్రి ముఖేష్‌గౌడ్‌కు ఆస్పత్రి బిల్లును అందజేసింది. ఇప్పటి వరకు రూ.2.90 లక్షల బిల్లు అయిందని వెంటనే చెల్లించాలని ముఖేష్‌ను కోరింది. -
కాల్పులు ఎవరు జరిపారో అంతు చిక్కలేదు.
-
సంచలన విషయాలు వెల్లడించిన షిపాలి
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. గంటగంటకు ఈ కేసులో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలో తాజాగా విక్రమ్ భార్య షిపాలి పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఇదరు ఆగంతకులు తమ ఇంటికి వచ్చి.. విక్రమ్‌పై కాల్పులు జరిపి పారిపోయారని ఆమె చెప్పారు. 'అర్ధరాత్రి తర్వాత ఇద్దరు ఆగంతకులు బైక్‌పై మా ఇంటికి వచ్చారు. అందులో ఒకరు హెల్మెట్ ధరించారు. మరొకరు మాస్క్ ధరించారు' అని ఆమె తెలిపారు. అయితే, షిపాలీ చెప్పిన విషయాలకు, విక్రమ్‌గౌడ్ చెప్పిన వివరాలకు మధ్య ఎక్కడ పొంతన లేకపోవడంలో పోలీసులను అయోమయానికి గురిచేస్తోంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి తనపై కాల్పులు జరిపారని, అనంతరం కారులో పారిపోయారని విక్రమ్ చెప్పారు. అయితే, అందుకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు ఒకరు హెల్మెట్ ధరించి.. మరొకరు ముసుగు ధరించి బైక్‌పై వచ్చారని షిపాలి చెప్పడంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. దాదాపు పది పోలీసు ప్రత్యేక బృందాలు ఈ కేసు దర్యాప్తును ముమ్మరంగా చేపడుతున్నా.. కాల్పులు ఎవరు జరిపారనేది అంతుచిక్కడం లేదు. విక్రమ్ గౌడ్ నివాసం సమీపంలో ఉన్న పలు సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించినా.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు రావడం గానీ, ఒకరు ముసుగు ధరించి రావడంగానీ పోలీసులకు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులకు కూడా ఈ కేసులో అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులకు విక్రమ్‌గౌడ్ వాంగ్మూలం!
హైదరాబాద్: తనపై జరిగిన కాల్పుల విషయంలో మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తనపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. కాల్పులు జరగ్గానే తాను కిందపడిపోయానని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక గట్టిగా అరిచానని తెలిపారు. తన అరుపులు విని భార్య షిపాలి కిందకు వచ్చిందని, 108కు ఫోన్ చేయాలని తానే ఆమెకు సూచించానని చెప్పారు. అంబులెన్స్ రాకపోవడంతో కారులోనే ఆస్పత్రికి భార్య తీసుకొచ్చిందని, ఆమెకు డ్రైవర్, వాచ్మెన్ సహకరించారని తెలిపారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన మాట వాస్తవమేనని విక్రమ్ గౌడ్ స్పష్టం చేశారు. నొప్పి ఎక్కువగా ఉండటం వల్లే నిన్న పోలీసులతో మాట్లాడలేకపోయానని చెప్పారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. శుక్రవారం తెల్లవారుజామున విక్రమ్ గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుడి, ఎడమ భుజాల్లోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పటికే మీడియాతో మాట్లాడిన విక్రమ్ గౌడ్ భార్య షిపాలీ.. కాల్పుల విషయంలో మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. తమకు మంచి చేయకపోయినా పర్వాలేదుకానీ దుష్ర్పచారం చేయకండని ఆమె కోరారు. కాగా, విక్రమ్ గౌడ్ వెన్నుపూస భాగంలో బుల్లెట్ దిగిందని ఎంఆర్ఐ స్కానింగ్‌లో వైద్యులు గుర్తించారు. -
విక్రమ్‌పై వస్తున్న కథనాలు అవాస్తవం: షిఫాలీ
హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కాగా కాల్పుల ఘటనకు సంబంధించి తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని విక్రమ్ గౌడ్ భార్య షిఫాలీ తెలిపారు. మీడియాలో విక్రమ్‌పై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు చెప్పామని, విక్రమ్‌పై ఎవరు దాడి చేశారో పోలీసులే గుర్తించాలన్నారు. తమకు మంచి చేయకపోయినా దుష్ప్రచారం చేయవద్దని షిఫాలీ విజ్ఞప్తి చేశారు. పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని షిఫాలీ చెప్పారు. మరోవైపు సంఘటన జరిగి 24 గంటలు దాటినప్పటికీ పోలీసులు ఎలాంటి నిర్థారణకు రాలేకపోతున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు పలుదఫాలుగా ప్రశ్నించినప్పటికీ విక్రమ్ గౌడ్ నోరు మెదపనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విక్రమ్ భార్య షిఫాలీని ఇవాళ పోలీసులు మరోసారి విచారణ చేశారు. కాగా కాల్పుల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేదని నిర్ధారించిన పోలీసులు, విక్రమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అలాగే విక్రమ్ తండ్రి ముఖేష్ గౌడ్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా 2015లోనే రెన్యువల్ ముగిసినప్పటికీ అనధికారికంగా రెండేళ్లుగా ముఖేష్ వద్దే తుపాకీ ఉన్నట్లు సమాచారం. -
విక్రమ్ గౌడ్‌కు పూరీ జగన్నాథ్ పరామర్శ
హైదరాబాద్ : కాల్పుల్లో గాయపడ్డ విక్రమ్ గౌడ్‌ను దర్శకుడు పూరీ జగన్నాథ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా విక్రమ్‌గౌడ్ సినిమా ప్రొడ్యూసర్‌గా కూడా చిత్రపరిశ్రమకు పరిచయం. సినీ హీరో నితిన్ సోదరి నిఖితారెడ్డితో కలిసి ఆయన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఇష్క్, గుండెజారి గల్లంతైయ్యిందే సినిమాలను నిర్మించారు. అలాగే విక్రమ్‌గౌడ్...కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విక్రమ్‌గౌడ్‌ను మేయర్ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. మరోవైపు అలంపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా విక్రమ్ గౌడ్‌ను పరామర్శించారు. గత కొద్దిరోజులుగా విక్రమ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. -
‘నా భర్తను ఎవరో చంపడానికి యత్నించారు’
హైదరాబాద్ : కాల్పుల ఘటనలో గాయపడ్డ విక్రమ్‌గౌడ్ భార్య శిఫాలి మాత్రం తన భర్తపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. దర్గాలో అన్నదానం కోసం ఉదయం రెండున్నర గంటలకు నిద్ర లేచామని తనకంటే ముందు భర్త హాల్లోకి వెళ్లారని తెలిపారు. ఇంతలోనే కాల్పుల శబ్ధం రావడంతో.... కిందకు దిగానని అప్పటికే విక్రమ్ గౌడ్ రక్తపు మడుగులో ఉన్నారని చెప్పరు. ఒక వ్యక్తి కాల్పులు జరిపాడని భర్త విక్రమ్‌గౌడ్ తనతో చెప్పాడని శిఫాలి చెప్పారు. తన భర్తను ఎవరో చంపడానికి యత్నించారని ఆరోపించిన ఆమె, కాల్పులు జరిపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని... బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా విక్రమ్ గౌడ్‌కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం కిందటే గన్ లైసెన్స్ కోసం అప్లయి చేయగా పోలీసులు తిరస్కరించారన్నారు. తెలిసినవాళ్లే కాల్పులు జరిపారని, ఒక్కరే వచ్చి కాల్పులు జరిపినట్లు విక్రమ్ చెప్పాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. విక్రమ్ కోలుకున్న తర్వాత నిందితుడి పేరు చెబుతాడన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం: సీపీ
హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేందర్ రెడ్డి కాల్పుల ఘటన వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. రోజు తెల్లవారుజామున 3 గంటలకు కాల్పులు జరిగాయన్నారు. ఆ సమయంలో వాచ్మెన్, అతని భార్య, ఇంకో పనిమనిషితో పాటుగా భార్యాభర్తలు (విక్రమ్ గౌడ్, శిఫాలీ) మాత్రమే ఉన్నారని, సంఘటన జరగటం బాధాకరమని,ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. విక్రమ్ శరీరంపై రెండు గాయాలున్నాయని, ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా వెస్ట్ జోన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ కూడా విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. విక్రమ్ గౌడ్ నివాసంలో ఆధారాలు సేకరించామని, క్లూస్‌టీమ్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. తెల్లవారుజామున పెద్దమ్మ గుడికి వెళ్లే సమయంలో కాల్పుల శబ్ధం వినిపించిందని విక్రమ్ భార్య తెలిపారని, ఆస్పత్రికి తీసుకు వచ్చిన సమయంలో విక్రమ్ స్పృహలోనే ఉన్నారని సీపీ పేర్కొన్నారు. ఏం జరిగిందనేది కొంత సమయం తర్వాత చెబుతానన్నాడని, విక్రమ్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇక కాల్పుల సమయంలో ఫ్లోర్‌పై రక్తం పడి ఉందని, తుడిచి వేసినట్లుగా కనిపిస్తోందన్నారు. తెలియక తుడిచానని వాచ్మెన్ చెబుతున్నాడని సీపీ చెప్పారు. విక్రమ్ వద్ద ఎలాంటి ఆయుధం లేదని, సమీపంలోని అన్ని సీసీ ఫుటేజ్‌లు సేకరించామన్నారు. వాహనాల కదలికలను పరిశీలిస్తున్నామని, నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. కాగా ఘటన జరిగి ఏడు గంటలు దాటుతున్నా....కాల్పుల కారణాలపై పోలీసులు నిర్దారణకు రాలేకపోతున్నారు. బయట వ్యక్తులే తమ వాడిపై కాల్పులు జరిపాడని...విక్రమ్‌గౌడ్ బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. కొన్ని రోజులుగా విక్రమ్‌గౌడ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అని కూడా బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిగితేకానీ ఏమీ చెప్పలేమంటున్నారు. అయితే ఆగంతకులే కాల్పులు జరిపారనే దాన్ని తోసిపుచ్చుతున్నారు. ఆ మేరకు ఆధారాలు లభించనందు వల్లే పోలీసులు ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో ఆగంతకులకు సంబంధించిన ఎలాంటి విజువల్స్ రికార్డు కాలేదని తెలిసింది. ఒక సమయంలో ఆత్మహత్యాకోణంపైనే పోలీసులు ఎక్కువుగా దృష్టి సారించారు. అయితే ఈ కోణంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఆయుధం ఏమూంది? దాన్ని ఎవరు మాయం చేశారు?. ఆత్మహత్యే అయితే దాన్ని దాచాల్సిన అవసరం బంధువులకు ఎందుకొచ్చింది? అనేది కీలకంగా మారింది. ఇదిలా ఉంటే అసలు విక్రమ్‌గౌడ్‌కు లైసెన్స్ వెపనే లేదని పోలీసులు చెబుతున్నారు. మరి లైసెన్స్ గన్ లేకపోతే కాల్పులకు కారణమైన గన్ ఎవరిది?. విక్రమ్‌గౌడ్ అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారా? మరెవరిదైనా ఇంట్లో పెట్టుకున్నారా? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు కాల్పులు జరిగింది పిస్టల్తోనో, రివాల్వర్తోనూ అనేది కూడా అంతుపట్టడం లేదు. అయితే తాము అన్ని కోణాల్లో శాస్త్రీయ విచారణ చేసిన తర్వాతే ఒక నిర్ణయానికొస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. విక్రమ్‌గౌడ్‌పై ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపినట్టు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. బెదిరింపు కాల్స్ విక్రమ్‌కు వచ్చాయా లేదా అనేది తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మిస్టరీగా మారిన కాల్పుల కేసులో అన్ని కోణాల్లో విచారిస్తున్నామంటున్న డీసీపీ తెలిపారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశామని, సీసీ కెమెరా, ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనలో పలు అనుమానాలు!
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విక్రమ్ గౌడ్‌కు అసలు లైసెన్స్ ఆయుధమే లేదని పోలీసులు చెబుతున్నారు. పటిష్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి బయటి నుంచి దుండగులు వచ్చినట్లు ఆనవాళ్లు లభించలేదు. అంతేకాకుండా సంఘటనా స్థలంలో భార్యాభర్తలే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో ఔట్ హౌస్‌లో సెక్యూరిటీ గార్డు ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్‌పై కాల్పులు జరిపిందెవరు?. బయట నుంచి ఎవరు రాకుంటే లోపల ఉన్నదెవరు? ఇంట్లోనే ఉన్నవారు కాల్పులు జరిపారా? లేక విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇక తన ఫిర్యాదులో కూడా విక్రమ్ భార్య శిఫాలీ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. అలాగే ఘటనా స్థలంలో రక్తం మరకలు తుడిచేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేం.. కాల్పుల ఘటనపై విచారణ చేస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ‘కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో ఇద్దరు (భార్యభర్తలు) మాత్రమే ఉన్నారు. బయట వ్యక్తులు వచ్చి కాల్పులు జరపటానికి అవకాశాలు లేవు. కాల్పులకు వాడింది...7.9 ఎమ్ఎమ్ పిస్తోలుగా అనుమానిస్తున్నాం. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇక కాల్పుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. విక్రమ్ గౌడ్‌కు ఆయుధాల లైసెన్స్ లేదు. ఇక దాడి ఎలా జరిగిందనే విషయాన్ని విక్రమ్ చెప్పలేకపోతున్నారు’ అని డీసీపీ వెల్లడించారు. కాగా విక్రమ్ పలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల ఘటనలో గాయపడిన విక్రమ్ గౌడ్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల్లో విక్రమ్ గౌడ్ చేయి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతడి శరీరం నుంచి రెండు బుల్లెట్లను వైద్యులు వెలికితీశారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యపరిస్ధితి నిలకడగా ఉంది. ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ మరోవైపు సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. షార్ట్ వెపన్‌కు సంబంధించి రెండు ఖాళీ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలం నుంచి ఎటువంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని డీసీపీ చెప్పడం గమనార్హం. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా విక్రమ్ గౌడ్ ఇంటి పరిసరాల్లోనే తచ్చాడినట్లు సమాచారం. స్నానం చేసి వచ్చేసరికి కాల్పులు: శిఫాలీ ఈ కాల్పుల సంఘటనపై విక్రమ్ గౌడ్ భార్య శిఫాలీ మాట్లాడుతూ...‘శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయమే గుడికి వెళ్లాలనుకున్నాం. నేను స్నానం చేసి వచ్చేసరికి కాల్పులు జరిగాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చాను.’ అని తెలిపారు. గత తొమ్మిది నెలలుగా ఫిల్మ్‌నగర్‌లో ఉంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, తమ కుటుంబంలో ఎవరికీ కలహాలు లేవని విక్రమ్ బాబాయ్ మధు గౌడ్ చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారు ఎవరో తెలియదని అన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనలో పలు అనుమానాలు!
-
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
-
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
హైదరాబాద్: నగరంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విక్రమ్ గౌడ్‌పై జరిగిన దాడిలో ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ తర్వాత దుండగులు ఘటనాస్ధలి నుంచి పారిపోయారు. విక్రమ్ నివాసంలోనే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. నెత్తురోడుతున్న ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో విక్రమ్ గౌడ్ చేయి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అత్యవసర విభాగానికి ఆయన్ను తరలించిన వైద్యులు రెండు బుల్లెట్లను శరీరంలో నుంచి వెలికితీశారు. విక్రమ్ ఆరోగ్యపరిస్ధితి నిలకడగా ఉన్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. దాడి ఎలా జరిగిందనే విషయాన్ని విక్రమ్ చెప్పలేకపోతున్నారని వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత విక్రమ్ ఇంటికొచ్చారని చెప్పారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం ఉందని, గుడికి వెళ్దామని భార్యతో చెప్పినట్లు వెల్లడించారు. రెడీ అయి గుడికి బయల్దేరుతున్న సమయంలో దాడి చేసిన దుండగులు విక్రమ్‌ను తీవ్ర గాయపరిచారని చెప్పారు. కుటుంబ కలహాలే కాల్పులకు కారణమని భావిస్తునట్లు తెలిపారు. కాగా, తమ కుటుంబంలో ఎవరికీ కలహాలు లేవని విక్రమ్ బాబాయ్ మధు గౌడ్ చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారు ఎవరో తెలియదని తెలిపారు. -
వారసుల సంగతేంటి?
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వివిధ రాజకీయ పార్టీల నేతల వారసుల్లో కొందరిని అదృష్టం వరించగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ వారసులు ఓటమి చవిచూశారు. ముఖేష్ గౌడ్ కుమారుడు, కుమార్తె కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా జాంబాగ్‌లో పోటీ చేసిన విక్రమ్ గౌడ్ ఎంఐఎం అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. ఇక గన్ ఫౌండ్రీ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కుమార్తె శిల్పకు కూడా నిరాశే మిగిలింది. గెలిచిన వారసుల వివరాలు: ముషీరాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి బంజారాహిల్స్‌లో కేశవరావు కుమార్తె విజయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి దివంగత కాంగ్రెస్ నేత పీ జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి మోహదీపట్నం నుంచి మాజీ మేయర్ మాజిద్ అల్వాల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి మరోవైపు ఓడిపోయినవారిలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆర్కె పురం నుంచి తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి -
ముఖేష్ గౌడ్‌కు కీలక బాధ్యతలు?
హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమయ్యారు. త్వరలోనే ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. నగర కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా? లేక పీసీసీలో మరేవైనా బాధ్యతలు ఇస్తారా? అన్న అంశంపై ఏఐసీసీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రెండు రోజుల క్రితం పీసీసీ ముఖ్య నేతలు ముఖేష్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు విక్రమ్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ ముఖేష్ గౌడ్‌కు నగర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే... దానం నాగేందర్‌కు ఏఐసీసీ లేదా పీసీసీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. -
ఏదీ అనుసం‘దానం?’
హైదరాబాద్ నగర కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం పార్టీని నడిపించే నాయకుల కోసం ఎదురుచూపు హైదరాబాద్: ఓ వైపు ముంచుకొస్తున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు.. మరో వైపు అంటీ ముట్టనట్లుగా పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ వ్యవహారంతో నగర కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంతో నగరమంతటా విజయం సాధించిన పార్టీ 2014 ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. మెజారిటీ చోట్ల మూడోస్థానానికి పడిపోయింది. పోయిన పరువుతో పాటు మళ్లీ విజయతీరం చేర్చే నాయకుల కోసం పార్టీ వెతుకుతోంది. అధికారంలో ఉన్న సమయంలో అన్నీ తామై వ్యవహరించిన మాజీ మంత్రులు దానం నాగేందర్, మూల ముఖేష్‌గౌడ్‌లు ఏడాదిన్నర కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరమై సొంత పనుల్లో బిజీ అయ్యారు. దానం అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటూ... అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న తీరు పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. దీంతో త్వరలోనే పీసీసీ, సీఎల్పీ నాయకులను కలిసి గ్రేటర్‌కు పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేసే అవకాశం ఉంది. దానం..అయోమయం టీఆర్ఎస్ నుంచి రాని క్లియరెన్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరాలని భావిస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్ ఒకింత అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా క్రియాశీలకంగా వ్యవహరించలేక... మరో వైపు టీఆర్ఎస్లోకి వెళ్లే ముహూర్తం ఖరారు కాక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నగర మంత్రులు తలసాని, పద్మారావులతో పాటు టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న హరీష్‌రావు, కేటీఆర్‌లతో దానం పలుమార్లు భేటీ అయినట్లు తెలిసింది. పార్టీలోకి తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీరించినప్పటికీ... ఏ హోదా కల్పించాలన్న అంశం అధినేత కేసీఆర్ మాత్రమే నిర్ణయిస్తారని చెప్పడంతో ఆయన అటూ ఇటూ కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. నగర మేయర్ లేదా ఎంఎల్సీ పోస్టుల్లో ఏదైనా ఒకటి తనకు కేటాయిస్తే గౌరవప్రదంగా ఉంటుందన్న ప్రతిపాదనను టీఆర్ఎస్ ముఖ్య నేతల ముందుంచినట్లు సమాచారం. బీజేపీ వైపు.. ముఖేష్ చూపు నగర కాంగ్రెస్‌లో మరో ముఖ్య నాయకుడు మూల ముఖేష్ గౌడ్ బీజేపీలో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటి వరకూ ప్రకటించనప్పటికీ... సనత్‌నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు గతంలో విజ్ఞప్తి చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరే అంశాన్ని కూడా ముఖేష్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తన సోదరుడు, మాజీ కార్పొరేటర్ మధుగౌడ్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన చేరికను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకించినప్పటికీ పార్టీ ఖాతరు చేయలేదు. అదే దారిలో ముఖేష్‌గౌడ్ బీజేపీలో చేరేందుకు సంకేతాలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
టీడీపీలోకి ముఖేశ్ గౌడ్
-
టీడీపీలోకి ముకేశ్ గౌడ్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మూల ముకేశ్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఆయన బుధవారం రాజ్యసభ సభ్యుడు, తన సమీప బంధువైన టి.దేవేందర్ గౌడ్‌తో కలసి టీడీపీ అధ్యక్షుడు బాబును కలిశారు. సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ముకేశ్ చేసిన విజ్ఞప్తికి బాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదే జరిగితే.. వియ్యంకుల మధ్యే పోటీ ముకేశ్ గౌడ్ సోదరుని కుమార్తెను, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు వివాహం చేసుకోవడంతో వరుసకు వారిద్దరూ వియ్యం కులు అవుతారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరిన తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఎన్నిక అనివార్యం. ఈసారి తలసాని టీఆర్ఎస్ అభ్యర్థిగా, టీడీపీ తరఫున ముకేశ్‌గౌడ్ బరిలో దిగితే వీరి మధ్య పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సనత్‌నగర్ బరిలో టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు కూన వెంకటేశ్ గౌడ్ ‘సాక్షి’తో చెప్పారు. -
‘గ్రేటర్’ ఆకర్ష్!
* దానం, ముఖేష్‌గౌడ్, సుధీర్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యలకు టీఆర్ఎస్ గాలం * ఆయా నేతలతో హరీశ్‌రావు రహస్య మంతనాలు * కాంగ్రెస్‌లోనే ఉంటామన్న దానం, సుధీర్! సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసేందుకు టీఆర్ఎస్ ‘గ్రేట్’ ఆకర్ష్‌ను ప్రారంభించింది. శాసనమండలిలో ఆధిపత్యం కోసం ప్రయోగించిన అస్త్రం పూర్తిగా విజయవంతం కావడంతో.. ఇప్పుడు కీలకమైన రాజధానిపై కన్నేసింది. మరో ఆరు నెలల్లో గ్రేటర్ ఎన్నికలు రాబోతుండడంతో ఇక్కడ ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలనే యోచనతో పావులు కదుపుతోంది. గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఆయా నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రాజధానిలో పార్టీ కొంత బలహీనంగా ఉండటం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే నేపథ్యంలో.. ఇక్కడ సంస్థాగతంగా పట్టున్న ఇతర పార్టీల నేతలపై ‘ఆకర్ష్’ మంత్రాన్ని ప్రయోగించే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమైంది. జీహెచ్ఎంసీపై గులాబీ జెండాను రెపరెపలాడించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా బలహీనపర్చడమనే ద్వి ముఖ వ్యూహంతో పావులు కదుపుతోంది. మంత్రులు టి.హరీశ్‌రావు, కె.తారకరామారావు ఈ విషయంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇందులో భాగంగా హరీశ్‌రావు కొద్దిరోజులుగా మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్గౌడ్తో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డిలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని, టీఆర్ఎస్లో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ఆయా నేతలకు రకరకాల తాయిలాలు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్.కృష్ణయ్య టీఆర్ఎస్లో చేరితే మెదక్ ఎంపీ సీటిచ్చి గెలిపించుకుంటామని.. ఒకవేళ ఓడినా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణయ్య పార్టీలోకి వస్తే ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని దింపి గెలిపించుకోవచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. సుధీర్‌రెడ్డితో చర్చల సందర్భంగా హరీశ్‌రావు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో హుడా చైర్మన్‌గా ఉన్న సుధీర్‌రెడ్డిపై గతంలో ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాటిపై విచారణ జరిపిస్తామని ఆ పార్టీ నేతలు కొందరు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొనసాగితే టీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశముందని, అదేదో గులాబీ జెండా కప్పుకుంటే మేలని సుధీర్‌రెడ్డిపై ఆయన సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి దానం నాగేందర్‌పై కూడా ఇదే తరహాలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. దానంపై అనేక భూఅక్రమణ ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దాంతో టీఆర్ఎస్లో చేరితే ఎలాంటి ఇబ్బందీ ఉండదని, పైగా గ్రేటర్‌పై తన ముద్ర వేయవచ్చని దానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హరీశ్‌తో చర్చల సందర్భంగా దానం పలు ప్యాకేజీలను డిమాండ్ చేయడంతో వాటిపై టీఆర్ఎస్ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. మాజీమంత్రి ముఖేష్గౌడ్తోనూ టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. తన కుమారుడు విక్రమ్‌గౌడ్‌ను రాజకీయంగా బలోపేతం చేయాలని భావిస్తున్న ముఖేష్ గత ఎన్నికల్లో తన కుమారుడికి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. టీఆర్ఎస్లో చేరితే గ్రేటర్ ఎన్నికల్లో విక్రమ్‌గౌడ్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన టీఆర్ఎస్వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయా నేతల తో ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని, ఇంకా ఒక కొలిక్కి రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం: దానం, సుధీర్‌రెడ్డి దానం, సుధీర్‌రెడ్డి సహా పలువురు గ్రేటర్ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ కొన్నిచానళ్లలో వార్తలు రావడంతో.. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆయా నేతలతో గాంధీభవన్‌లో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం దానం, సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. టీఆర్ఎస్లోకి రమ్మని ఆ పార్టీ నేత లు మీతో మాట్లాడారా? లేదా? అని విలేకరులు ప్రశ్నిం చినా.. వారు సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఆర్.కృష్ణయ్య సైతం తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని పేర్కొన్నారు. నాయకత్వ లోపంవల్లే: జానారెడ్డి, జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రజల ముందుంచలేకపోయామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి సైతం జీవన్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థిం చారు. హైకమాండ్ హడావుడి నిర్ణయంతో లోపం జరిగిందని, అదే ఇప్పుడు గుణపాఠమైందన్నారు. త్వరలో హైకమాండ్‌తో సమీక్షించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. -
రాజధానిలో కాంగ్రెస్ ఖాళీ
24 శాసనసభా స్థానాల్లో ఒక్కటీ గెలవని వైనం డిపాజిట్ కోల్పోయిన వీహెచ్ పోటీ ఇవ్వని దానం, ముఖేష్ సాక్షి, సిటీబ్యూరో : రాష్ట్ర రాజధాని ఓటర్లు వైవిధ్యమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానంలోనూ అవకాశం ఇవ్వకపోగా.. పలు నియోజకవర్గాల్లో మూడవ స్థానానికే పరిమితం చేశారు. అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వి.హన్మంతరావు, జయసుధలకు డిపాజిట్ గల్లంతవడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన దానం నాగేందర్ (ఖైరతాబాద్‌లో), మూల ముఖేష్‌గౌడ్ (గోషామహల్లో) భారీ తేడాతో ఓటమి పాలుకాగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి, ఎల్బీనగర్లో సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, కుత్బుల్లాపూర్‌లో శ్రీశైలంగౌడ్‌లు మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. తెలుగుదేశం, బీజేపీ కూటమి గణనీయంగా పుంజుకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం తొమ్మిది, బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎం పార్టీ తిరిగి తనకున్న ఏడు స్థానాలను నిలబెట్టుకుంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, పటాన్చెరు అసెంబ్లీ స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది. రికార్డు మెజారిటీలు: నగరంలో బహుదూర్‌పురా నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి మౌజంఖాన్ 95,023 రికార్డు మెజారిటీతో విజయం సాధించగా, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గాంధీ 75,904, అంబర్‌పేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి 62,548 మెజారిటీతో తమ సమీప ప్రత్యర్థులపై విజయం సాధించారు. -
ముఖేష్ గౌడ్ కుమారుడు పై కేసు నమోదు
-
ముఖేష్ తనయుడి వీరంగం, కేసు నమోదు
మాజీ మంత్రి, గోషామహల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బుధవారం గౌలిగూడలో వీరంగం వేశాడు. తన తండ్రికి అనుకూలంగా ఓటు వేయ్యలేదంటూ బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగాడు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లలోకి వచ్చి విక్రమ్ గౌడ్ తమపైన, తమ కుటుంబసభ్యులపైన దాడి చేశాడని వారు అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దాంతో విక్రమ్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోడ్ ఉల్లంఘన కేసులో ముఖేష్‌గౌడ్ అరెస్ట్
హైదరాబాద్ : ఎన్నికల నామినేషన్ సందర్భంగా కోడ్ ఉల్లంఘించిన మాజీమంత్రి ముఖేష్ గౌడ్ ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అతని సహ కార్పోరేటర్ శంకర్ యాదవ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనపై గురువారం కేసు నమోదు అయ్యింది. అనుమతి లేకుండా ముఖేష్ గౌడ్ బైక్ ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టికేలకు అరెస్టు చేశారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ముఖేష్ గౌడ్ భారీ ర్యాలీగా వెళ్లారు. దీనికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకపోవడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా నేతలు వాటిని పెడచెవిన పెట్టడంతో తిప్పలు తప్పడం లేదు. ఇంతకుముందు మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలోని 29వ వార్డు పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి గందరగోళం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కి బెయిల్ రద్దయింది. పోలింగ్ సిబ్బందితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లపై కూడా తీవ్ర ఆగ్రహం చేసి అక్కడ ఉన్న ఈవీఎంలను చెల్లాచెదురు చేయడంతో అతనిపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి బెయిల్ ను గురజాల కోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. -
ముఖేష్ గౌడ్‌కు అనుమానమేల?
మాజీ మంత్రి, హైదరాబాద్ నగర రాజకీయాల్లో ఎన్నాళ్లనుంచో ఆరితేరిన యోధుడు ముఖేష్‌గౌడ్‌కు ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం వచ్చినట్లుంది. శుక్రవారం నాడు మంచిరోజని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ముఖేష్.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొకటి నామినేషన్లు దాఖలు చేశారు. ఇది అందరినీ అనుమానంలో పడేసింది. వాస్తవానికి ఈసారి ముఖేష్.. తన కుమారుడు వికాస్ గౌడ్‌ను కూడా రాజకీయాల్లోకి దించాలనుకున్నారు. దాంతో ముఖేష్ పార్లమెంటుకు వెళ్లి, తన కుమారుడిని అసెంబ్లీ బరిలో దింపుతారనే కథనాలు కూడా ఇంతకుముందు వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ఒక కుటుంబానికి ఒకటే పదవి అనే నినాదాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం వెలుగులోకి తెచ్చింది. దాంతో సీనియర్ నాయకుల ఆశలన్నీ అడియాసలుగా మారిపోయాయి. అందుకే ముఖేష్ గౌడ్ నేరుగా అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధపడ్డారని సమాచారం. అంతవరకు బాగానే ఉన్నా, ఆయన ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా, మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా రెండు నామినేషన్లు దాఖలుచేయడంపైనే అనుమానాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు టికెట్ వస్తుందో లేదోనన్న అనుమానం ఏమైనా ముఖేష్‌కు ఉందా అని పలువురు అంటున్నారు. -
సిట్టింగ్ సీట్లకు బైబై!
ఖైరతాబాద్, గోషామహల్లను వీడే యోచనలో దానం, ముఖేష్ నాంపల్లి, ముషీరాబాద్ నుంచి పోటీ? అప్జల్‌సాగర్‌లో రేపు దానం కీలక సమావేశం సాక్షి, సిటీబ్యూరో: స్థానికంగా వ్యతిరేకత.. గతం లో సహకరించిన మిత్రపక్షం దూరం కానుండ టం.. వెరసి నగర కాంగ్రెస్ పార్టీలో వీవీఐపీల పరి స్థితి డైలమాలో పడింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్లీ గెలవలేమన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ నాంపల్లిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బుధవారం నాంపల్లి నియోకజవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో అఫ్జల్‌సాగర్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాను ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన కోసం పనిచేసిన వారందరినీ ఈ సమావేశానికి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ నియోకజవరగలో గడిచిన ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టకపోవటం, స్థానిక నాయకుల ప్రవర్తన పార్టీకి పూర్తి స్థాయిలో చెడ్డపేరు తేచ్చింది. దీనికి తోడు మైనారిటీ, సీమాంధ్రుల మనోభావాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండటంతో దానం తనకు ఖైరతాబాద్ సురక్షితం కాదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖేష్ సైతం.. మరో తాజా మాజీ మంత్రి మూల ముఖేష్‌గౌడ్ సైతం ప్రస్తుత గోషామహల్ స్థానాన్ని వీడే అవకాశం కనిపిస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గత ఐదేళ్లలో గోషామహల్ వాసులకు అందుబాటులో ఉండకపోవటం ఆయనకు మైనస్ కానుంది. దీనికితోడు గత ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలపకుండా ముఖేష్‌కు సహకరించిన ఎంఐఎం, తదనంతర పరిణామాలతో ఆయన తీరుపై గుర్రుగా ఉంది. ఈ స్థానంలో ఎంఐఎం సహకారం లేకుండా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లే దు. ఈ కారణంగానే ముఖేష్ స్థానమార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల షెడ్యూల్ జారీ అయి పోలింగ్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ ముఖేష్ నియోకజవర్గంలో కార్యకర్తలు, నాయకులకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ఆయన కుమారుడు విక్రమ్‌గౌడ్ కొంతమంది నాయకులను కలిసి వెళ్తున్నారు. ముఖేష్‌గౌడ్ ఆశిస్తున్నట్లుగా సికింద్రాబాద్ లోక్‌సభ లేదా ముషీరాబాద్ శాసనసభ స్థానంలో ఏదో ఒకటి తనకు కేటాయించక, గోషామహల్ స్థానం నుంచి పోటీ చేయాల్సి వస్తే, తన కుమారుడు విక్రంగౌడ్‌ను బరిలోకి దించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు సైతం అంగీకరిస్తున్నారు. -
ఫిబ్రవరి మూడోవారంలో తెలంగాణ: ముఖేష్
విజయవాడ : ఫిబ్రవరి మూడో వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని మంత్రి ముఖేష్ గౌడ్ జోస్యం చెప్పారు. శనివారం ఆయన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు అడ్డుకున్నా తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. ముఖ్యమంత్రి అధిష్టానాన్ని ధిక్కరించారనటం సరికాదని, ఆయన తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహిస్తున్నారని ముఖేష్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో బీజేపీ సహకరిస్తే తెలంగాణ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. -
మళ్లీ తెర మీదకు ‘మార్కెటింగ్’ అవినీతి
=అవినీతి భాగోతంపై అసెంబ్లీలో చర్చ =నలుగురు అధికారులపై చర్యలు? గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : గుడ్లవల్లేరు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రైతు శిక్షణా భవనాల పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలు ఈ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలో అవినీతి నిరోధక శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విచారణలో గుంటూరుతో పాటు గుడ్లవల్లేరు వ్యవసాయ మార్కెట్ యార్డు పేరు ఈ భాగోతంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో లేవనెత్తారు. మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేష్ గౌడ్ ఈ విషయమై వివరణ ఇస్తూ ఇందుకు బాధ్యులైన నలుగురు అధికారులపై చర్యలు తీసుకోనున్నామని సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళితే... గుడ్లవల్లేరు రైతు శిక్షణా కేంద్రం భవన నిర్మాణానికి 2008లో రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిధులు మంజూరయ్యాయి. అయితే ముడి సరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో పనుల డిజైన్‌తో సంబంధం లేకుండా రెట్టింపు స్థాయిలో అంచనాలను తయారుచేసి మార్కెటింగ్‌శాఖకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారులు అంచనా ఖర్చు, తదితర వివరాలను పరిశీలించకుండానే 2010లో రూ. 20 లక్షల నిధులు మంజూరు చేశారు. పైగా ఓ వైపు అంచనాలను పెంచుతూనే మరోవైపు ప్రస్తుతం ఉన్న అంచనాలకన్నా తక్కువ మొత్తంలోనే ప్రతిపాదనలు పంపి ప్రభుత్వానికి ఆదా చేసినట్లు చూపుతూ రికార్డులను నిర్వహించారు. 2011లో భవన నిర్మాణం పూర్తయిపోయింది. అయితే 2013లో ఏసీబీ సాధారణ తనిఖీలు నిర్వహించడంతో ఈ భవన నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విషయం బట్టబయలయ్యింది. దాదాపు పనులు జరిగిన మూడేళ్ల కాలంలో ప్రామాణికమైన ధరల్ని నిర్ధారిస్తూ ఎన్నడూ అధికారులు నివేదిక తయారు చేయలేదని ఏసీబీ విచారణలో తేటతెల్లమైంది. ముడి సరుకులు పెరిగిపోయాయని అంచనాలను వేసి, ప్రభుత్వానికి లాభం చేకూర్చినట్లుగా అధికారులు వ్యవహరించిన హాస్యాస్పదమైన తీరును ఏసీబీ తన నివేదికలో తప్పుపట్టింది. కేవలం నిర్వాహకులకు మేలు చేసేందుకే ఈ శాఖలోని ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ అధికారులు ఎంతో ఉదాసీనంగా ఇష్టానుసార అంచనాలతో నిధుల్ని కేటాయించినట్లు ఏసీబీ అధికారులు నివేదిక ఇచ్చారు. నిబంధనల్ని తుంగలో తొక్కి, నిర్మాణ పనులకు నిధుల్ని కేటాయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరారు. గుడ్లవల్లేరుతో పాటు గుడివాడ తదితర మార్కెట్ యార్డుల్లో జరిగిన నిర్మాణాలపై విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని రైతులు చెబుతున్నారు. -
'హైదరాబాద్‌పై ఆంక్షలు తగవు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిపోయిందని ఈ పరిస్థితుల్లో అయోమయం అనవసరమని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌పై ఆంక్షలు తగవని, శాసనసభ వేదికగా తమ వాదన విన్పిస్తామని తెలిపారు. ఉమ్మడి రాజధానిగా జీహెచ్ ఎంసీ కాకుండా హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకు పరిమితం చేయాలన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ విభజన విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని శివసావహిస్తామని చెప్పారు. శాంతి భద్రతలు గవర్నర్ పరధిలో ఉంటే సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. -
‘గ్రేటర్’ ప్రత్యేక రాష్ర్టం కావాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడాన్ని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలే తప్ప హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులకు రక్షణ ఉండదని హైకమాండ్ భావిస్తే గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్(హెచ్ఎండీఏ) పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను వారు తెరపైకి తెస్తున్నారు. మొత్తం 55 మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్‌లోని 16, రంగారెడ్డిలోని 22, మెదక్‌లోని 10, నల్లగొండలోని 5, మహబూబ్‌నగర్‌లోని 2 మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. వీటిలో 849 గ్రామాలు కూడా ఉన్నాయి. సుమారు కోటి మందికిపైగా జనాభా కలిగిన హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 25 శాతం మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారున్నారని గ్రేటర్ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మొత్తం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే సీమాంధ్రులతోపాటు హైదరాబాద్‌లో నివసిస్తున్న వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారికి ఎలాంటి భయమూ ఉండదని హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సిక్కిం, మణిపూర్, మేఘాలయా వంటి రాష్ట్రాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రం సంఖ్యాపరంగా చాలా పెద్దదని చెబుతున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, నలుగురు పార్లమెంటు సభ్యుల సంతకాలు కూడా తీసుకునే పనిలో పడినట్లు సమాచారం. గ్రేటర్ బ్రదర్స్‌గా పిలుచుకునే మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ ఈ బాధ్యత తీసుకున్నారు. ఈనెల 28న వీరిద్దరు ఢిల్లీ వెళ్లి ఏకే ఆంటోనీ కమిటీని కలిసి ఆయా నేతల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయాలని భావిస్తున్నారు. ఇదే విషయంపై గ్రేటర్ సీనియర్ నాయకుడొకరు మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజల రక్షణ మాకు ముఖ్యం. అందుకోసం కచ్చితమైన హామీ కావాలి. సీడబ్ల్యూసీ చేసిన తెలంగాణ తీర్మానాన్ని గౌరవిస్తున్నామే తప్ప యూటీ చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేస్తే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. 28న గ్రేటర్ మంత్రులు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలిసి అన్ని విషయాలపై మాట్లాడతారు’’అని చెప్పారు. ఈ ప్రతిపాదనపట్ల హైకమాండ్ పెద్దలు సానుకూలంగా స్పందిస్తారా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే తాము చేసే ప్రతిపాదనవల్ల హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర నేతల ఆందోళనను హైకమాండ్ పెద్దలు అర్థం చేసుకుని తగిన విధంగా గట్టి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఉల్లి ధరల నియంత్రణపై సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరల అదుపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శనివారం మంత్రులు ముఖేష్ గౌడ్, శ్రీధర్ బాబు పౌరసరఫరా, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రోజువారీ ధరల సమీక్ష, నియంత్రణకోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ధరల నియంత్రణకు రూ.100 కోట్ల నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉల్లిపాయలు, కూరగాయల ధరలు అందుబాటులో ఉంచడానికి మార్కెటింగ్‌శాఖ అధికారులు నేరుగా రైతుల వద్ద నుంచి సరుకు కొనుగోలు చేసి రైతు బజార్లలో సరసమైన ధరలకు విక్రయించాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.