
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ఉన్నట్లు సీరియల్స్‌కి కూడా మంచి క్రేజ్ ఉంది. అందులోని నటీనటుల్ని కూడా మనవాళ్లు అంతే ఆదరిస్తుంటారు. అలా 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషి సర్ పాత్రలో నటిస్తూ అలరిస్తున్న ముఖేశ్ గౌడ.. ఇప్పుడు తెలుగు సినిమా హీరో అయిపోయాడు. తాజాగా ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!)
ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్ నిర్మిస్తున్న సినిమా 'గీతా శంకరం'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దీపావళి కానుకగా శుక్రవారం విడుదల చేశారు.
'దీపావళి కానుకగా నా తొలి సినిమా ఫస్ట్‌లుక్ లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు నన్ను హీరోగా సెలక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. లవ్ అండ్ ఎఫక్షన్‌తో ఈ సినిమా తీశారు. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది' అని ముఖేష్ గౌడ అలియాస్ రిష్ చెప్పాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment