హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వివిధ రాజకీయ పార్టీల నేతల వారసుల్లో కొందరిని అదృష్టం వరించగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ వారసులు ఓటమి చవిచూశారు. ముఖేష్ గౌడ్ కుమారుడు, కుమార్తె కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా జాంబాగ్లో పోటీ చేసిన విక్రమ్ గౌడ్ ఎంఐఎం అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. ఇక గన్ ఫౌండ్రీ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కుమార్తె శిల్పకు కూడా నిరాశే మిగిలింది.
గెలిచిన వారసుల వివరాలు:
ముషీరాబాద్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి
బంజారాహిల్స్లో కేశవరావు కుమార్తె విజయలక్ష్మి
ఖైరతాబాద్ నుంచి దివంగత కాంగ్రెస్ నేత పీ జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి
మోహదీపట్నం నుంచి మాజీ మేయర్ మాజిద్
అల్వాల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి
మరోవైపు ఓడిపోయినవారిలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి
ఆర్కె పురం నుంచి తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి
వారసుల సంగతేంటి?
Published Fri, Feb 5 2016 7:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM
Advertisement
Advertisement