'హైదరాబాద్పై ఆంక్షలు తగవు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిపోయిందని ఈ పరిస్థితుల్లో అయోమయం అనవసరమని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్పై ఆంక్షలు తగవని, శాసనసభ వేదికగా తమ వాదన విన్పిస్తామని తెలిపారు. ఉమ్మడి రాజధానిగా జీహెచ్ ఎంసీ కాకుండా హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకు పరిమితం చేయాలన్నారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ విభజన విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని శివసావహిస్తామని చెప్పారు. శాంతి భద్రతలు గవర్నర్ పరధిలో ఉంటే సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు.