danam nagendar
-
చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్
సాక్షి,హైదరాబాద్ : చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. ఎక్కడినుంచో బతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా? అంటూ చిందులు తొక్కారు. బుధవారం షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న నిర్మాణాల్ని అధికారులు కూల్చివేతలు చేపట్టగా, ఈ కూల్చివేతలపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఫైరయ్యారు. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని దానం హుకుం జారీ చేశారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తానంటూ దానం హెచ్చరిక జారీ చేశారు. -
ఎమ్మెల్యేల అనర్హతపై ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. అనంతరం, స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్ లేదని ధర్మాసనం తెలిపింది. పదో షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. ఇక హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లినట్టు అయ్యింది. పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయం తొందరగా తీసుకోవాలని బీఆర్ఎస్ పిటిషన్లు వేసింది. ఒకవేళ అనర్హత విధిస్తే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ఆశించింది. ఇదే విషయాన్ని పలుమార్లు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తావించారు. కానీ, అనూహ్యంగా హైకోర్టు.. తుది నిర్ణయాన్ని(పరిమిత సమయం లేకుండా) స్పీకర్‌కే వదిలేయడంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉండటంతో సెప్టెంబర్ 30న అప్పీళ్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరఫున ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్నది.ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, జంధాల రవిశంకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున జె. ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఈ నెల 12న వాదనలు ముగియడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖ లు వేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదుకు ప్రయతి్నంచినా.. స్పీకర్ సమ యం ఇవ్వడం లేదంటూ మహేశ్వర్‌రెడ్డి మరో పిటి షన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఉ త్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన
హైదరాబాద్: ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. కంగనాపై చేసిన వ్యాఖ్యలకు దానం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన చేపట్టింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ మహిళా మోర్చా మహిళా నేతలు. దానం చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా నేతలు మండిపడ్డారు.దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చౌకబారు వ్యాఖ్యలు తగదు. దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.సినిమా ఇండస్ట్రీలో బోగం వేషాలు వేసే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదంటూ దానం వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
అసెంబ్లీలో దానం దాదాగిరి
సాక్షి,హైదరాబాద్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహనం కోల్పోయారు. తీవ్ర పదజాలంతో బీఆర్ఎస్ సభ్యులపై ఫైరయ్యారు. ‘తోలు తీస్తా . మిమ్మల్ని బయటకు కూడా తిరగనివ్వం ఏం అనుకుంటున్నార్రా’ అంటూ బెదిరించారు. అయితే దానం వ్యాఖ్యల్ని బీఆర్ఎస్, ఎంఐఎంలు నేతలు ఖండించారు. దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.దీంతో దానం క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. తాను మాట్లాడింది హైదరాబాద్ లోకల్ భాష అని, ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. -
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
సాక్షి,హైదరాబాద్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈసారి 70 అడుగుల వినాయకుడి విగ్రహాన్నిపెట్టనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం(జూన్17) గణేశ్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహ ఏర్పాటు ప్రారంభించామని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని సందర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
దానం నాగేందర్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్ధి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని పిటిషనర్ తరపున సుంకర నరేశ్ కోర్టుకు తెలిపారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. దానంతోపాటు పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్, కోవా లక్ష్మి, మాగంటి గోపీనాథ్, కూనంనేని, మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు పంపింది. వీరంతా ఎన్నికల్లో తప్పుడు అఫడవిట్లు సమర్పించారని హైకోర్టులో వేర్వేరు పిటిషనలు దాఖలయ్యాయి. చదవండి: హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్? -
‘సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ కలవలేదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చిమరీ కలవకపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అపాయిట్మెంట్ ఇవ్వడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ వెళ్లారు. ఇంట్లో స్పీకర్ లేకపోవడంతో ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రెండున్నర గంటల పాటు స్పీకర్ నివాసం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరీక్షించి అయినప్పటికీ ఆయన రాకపోవటంతో వెనుదిరిగారు. తమను స్పీకర్ కలవకపోవటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే అసెంబ్లీ స్పీకర్ తమను కలవలేదని మండిపడ్డారు. రేపు మరోసారి స్పీకర్‌కు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారాయన. -
ఏర్పాటవుతున్న ఖైరతాబాద్ గణేష్ విగ్రహం
-
దానం నాగేందర్‌కు ఆరు నెలల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ ఘర్షణ కేసులో మాజీ మంత్రి దానం నాగేందర్‌కు ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో నెల రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి వరప్రసాద్ బుధవారం తీర్పునిచ్చారు. కాగా, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నెల రోజులపాటు నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. -
‘నాగేందర్‌కు తిక్కలేచి నాపై విమర్శలు చేస్తున్నాడు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ది చెప్పటం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ యువతకు కేసీఆర్ ద్రోహం చేశారని, వాళ్లు రగిలిపోతున్నారని ఆయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని, రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలనలో వారి ఆశలు నీరుగారాయని అన్నారు. తన ఇంట్లో అందరికి ఉద్యోగాలు నింపుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ నిరుద్యోగుల గురించి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థపై కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లోన్స్ మంజూరులో సర్కార్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నిరుద్యోగ భృతి అంటే అవహేళన చేసిన కేసీఆర్.. అధికారం నుంచి దిగిపోయే ముందు నిరుద్యోగ భృతి గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కాంట్రాక్టర్స్‌కు దోచిపెట్టడానికే కేసీఆర్‌కు సమయం సరిపోయిందని చెప్పారు. నాగేందర్‌కు తిక్కలేచి తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. భూకబ్జా దారులున తనపై విమర్శలు చేసే నైతికత ఎక్కడుందని, అతను ఎంతకు అమ్ముడు పోయాడో చెప్పాలని ప్రశ్నించారు. పిచ్చోడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. -
యువత కేసీఆర్‌కు బుద్ది చెప్పటం ఖాయం
-
దానం ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం.. సీత మృతి!
సాక్షి, హైదరాబాద్ : సీత అనే మహిళ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచింది. ఎనిమిది రోజుల కిందట మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఇంటివద్ద సీత ఆత్మహత్యాయత్నం చేసుకుందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. సీత మృతి నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రి వద్ద ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. దానం నాగేందర్ ఇంట్లో మూడేళ్ల క్రితం చనిపోయిన గిరిప్రసాద్ భార్యే సీత. గిరిప్రసాద్ కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గిరిప్రసాద్ కుటుంబాన్ని ఆదుకుంటానని దానం నాగేందర్ హామీ ఇచ్చారని, కానీ న్యాయం కోసం మూడేళ్లుగా దానం ఇంటిచుట్టూ సీత తిరుగుతున్నా.. ఆయన పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, సీత కుటుంబసభ్యుల ఆరోపణలను దానం నాగేందర్ ఖండించారు. -
డ్రగ్స్ కేసును నిర్వీర్యం చేస్తున్నారా : దానం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసును నిర్వీ ర్యం చేస్తున్నారని మాజీమంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో అధికారులపై ఒత్తిడి ఉందని అన్నారు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్‌ను వాడుతున్నారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి మూడుగంటల వరకు పబ్స్ ఎలా నడుస్తున్నాయని, డ్రగ్స్‌ను నియంత్రించడానికి నైజీరియన్, సొమాలియన్లపై ప్రభుత్వం నిఘా పెట్టిందా అని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో కేవలం సెలబ్రిటీల పేర్లే ఎందుకు బయటకు వస్తున్నాయని దానం అనుమానం వ్యక్తం చేశారు. -
దానం నాగేందర్‌తో మనసులో మాట
-
నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా: దానం
హైదరాబాద్ : తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఆ పార్టీలోనే కొనసాగుతానని మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలనే సంయమనం పాటిస్తున్నామని దానం వ్యాఖ్యానించారు. తనకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని ఆయన చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దానం నాగేందర్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దానం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఓ దశలో ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. -
గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ ప్రకటించారు. ఎన్నికల ఓటమి అనంతరం శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజీనామాను ఆదివారం నాడు పీసీసీకి, దిగ్విజయ్ సింగ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. ప్రజలు తమను విశ్వసించలేదని.. టీఆర్ఎస్ను బాగా విశ్వసించారని చెప్పారు. ఇంత పెద్ద మాండేట్ రావడం కనీ వినీ ఎరుగమని ఆయన అన్నారు. ప్రజలు వాళ్లను, వాళ్లు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను నమ్మారన్నారు. టీఆర్ఎస్ తమ మేనిఫెస్టోలో చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉచిత కరెంటు, నీటి బిల్లుల మాఫీ, 24 గంటల కరెంటు, హైదరాబాద్ నలుమూలలా ఆరు వెయ్యి పడకల ఆస్పత్రులు.. ఇవన్నీ స్వాగతించాల్సిన విషయాలే, వాటిని స్వాగతిస్తున్నామని అన్నారు. తాము ఇక మీదట నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. వాళ్లిచ్చిన వాగ్దానాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటామని చెప్పారు. వాటిని అమలు చేయలేకపోతే కారణాలేంటో చెప్పాల్సిన బాద్యత వాళ్లకు ఉంటుందని అన్నారు. నాకు బాధ్యత ఇవ్వలేదు గానీ.. ఇక తనకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించకపోయినా, ఈ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ చెప్పారు. ఇన్నాళ్లూ ఇచ్చిన అవకాశాలకు ధన్యవాదాలని.. ఇక సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలను పార్టీకి దూరం చేసుకుంటున్నామని అధిష్ఠానానికి తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. ఈ తీర్పు రావడానికి కూడా అదే ప్రధాన కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విశ్వసనీయతను కోల్పోయిందని భావిస్తున్నానన్నారు. గ్రూపు తగాదాల వల్ల ఈ రోజు జరిగిన నష్టం చాలా తీవ్రమని అన్నారు. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నామని.. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తాను చాలాసార్లు చెప్పానని తెలిపారు. ఓడిపోతున్నట్లు అభ్యర్థులకు ముందే చెప్పా ఎన్నికలు ముగిసిన తర్వాతే.. మనమంతా ఓడిపోతున్నామని అభ్యర్థులందరికీ చెప్పానని దానం నాగేందర్ అన్నారు. అప్పటికే ప్రజల మూడ్ చూస్తే విషయం స్పష్టంగా అర్థమైపోయిందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు చాలా తెలివిగా ఓట్లు వేశారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీకి చెందిన మేయర్ వస్తే నగర అభివృద్ధి కుంటుపడుతుందేమోనన్న ఆలోచనతో ఓట్లు వేశారని, వాళ్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. 1983లో టీడీపీ పెట్టినప్పుడు మొత్తం రాష్ట్రం స్వీప్ అయ్యిందని, తాము అతి కొద్దిమందిమే గెలిచినా మనోధైర్యాన్ని కోల్పోలేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరం కావాలని కోరుకునేవాళ్లలో తాము కూడా ఉంటామని, ఆ హామీని వాళ్లు విస్మరించినప్పుడు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంటామని తెలిపారు. -
కేవీఆర్ కారణంగానే కేసీఆర్ రాజీనామా
* దానం యూటర్న్‌తో విజయరామారావుపై టీఆర్ఎస్ కన్ను * టీడీపీకి రాజీనామా చేసిన విజయరామారావు హైదరాబాద్: చంద్రబాబు లెక్క ప్రకారం... ఒకప్పుడు విజయరామారావు వల్లే కేసీఆర్‌కు మంత్రిపదవి దక్కలేదు. సీబీఐ మాజీ డెరైక్టర్ కె.విజయరామారావును మంత్రిమండలిలోకి తీసుకున్నానన్న కారణం చూపి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి ఇవ్వకుండా కేసీఆర్‌ను దూరం పెట్టారు. కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిచ్చి సరిపెట్టారు. దాంతో అసంతృప్తికి గురైన కేసీఆర్ ఏకంగా పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఏర్పాటు చేశారు. ఇదంతా 2001 లో జరిగిన రాజకీయం. తటస్థులను పార్టీలోకి ఆహ్వానిస్తూ అప్పట్లో చంద్రబాబు సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసిన విజయరామారావును పార్టీలో చేర్చుకుని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. ఆ స్థానం నుంచి గెలిచిన విజయరామారావును చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ను కాదని విజయరామరావును కేబినేట్లోకి తీసుకుని రోడ్లు భవనాల శాఖ అప్పగించారు. ఆ పరిణామమే అప్పట్లో టీడీపీలో రాజకీయ చిచ్చుకు కారణమైంది. కొంతకాలం వేచిచూసినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రిపదవులు ఇవ్వలేనన్న కారణం చూపించి కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్‌పదవికి పరిమితం చేశారు. ఆ పరిణామమే టీఆర్ఎస్ ఆవిర్భవానికి కారణమైంది. అన్ని పదవులకు రాజీనామా చేసిన 2001 ఏప్రిల్ 27 న హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2004, 2009, 2014 ఇలా వరుసగా మూడుసార్లు సాధారణ ఎన్నికలు జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టారు. కాలం మారింది... దశాబ్దన్నర... కాలం మారింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయరామారావును ఇప్పుడు కేసీఆర్ ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి నాయకులను చేర్పించుకుంటున్న టీఆర్ఎస్ నాయకత్వం ఆ క్రమంలో రెండు మూడు రోజులుగా విజయరామారావుతో సంప్రదింపులు జరిపింది. కేసీఆర్ ఆహ్వానంగా మంత్రి హరీష్‌రావు ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. టీడీపీకి రాజీనామా టీఆర్ఎస్ నేతలతో చర్చల నేపథ్యంలో విజయరామారావు శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ పంపించారు. 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన విజయరామారావు ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 లో టీడీపీ ఆయనకు అవకాశమివ్వలేదు. అప్పటి నుంచి ఆయన టీడీపీ విషయంలో కొంత దూరంగా ఉంటూవస్తున్నారు. దానం యూటర్న్తోనే... జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌తో టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరిపారు. దానం షరతులకు టీఆర్ఎస్ అంగీకరించకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయిందేదో అయిందంటూ... కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. దానం నాగేందర్ వెనక్కి తగ్గడంతో మరో నాయకుడి వేటలో పడిన టీఆర్ఎస్ ఒక్కసారిగా దృష్టి విజయరామారావుపై పడింది. విజయరామారావుతో లాభమేంటి ఒక పెద్దమనిషి తరహాలో పార్టీలో ఉండటం వల్ల నష్టమేమీ లేదని భావనతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్కు బలమైన నాయకుడు లేకపోవడం కూడా విజయరామారావును చేర్పించుకోవాలన్న ఆలోచనకు కారణమైందని చెబుతున్నారు. కొసమెరుపు... విచిత్రమేమంటే... దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరతారన్న వార్తలొచ్చినప్పుడు నష్ట నివారణ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి విజయరామారావును పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా కొద్ది రోజుల కిందట విజయరామారావును కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. చివరికి జరిగిందేమంటే... దానం కాంగ్రెస్‌లోనే ఆగిపోయారు. విజయరామారావు టీఆర్ఎస్ వైపు మొగ్గారు. -
ముఖేష్ గౌడ్‌కు కీలక బాధ్యతలు?
హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమయ్యారు. త్వరలోనే ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. నగర కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా? లేక పీసీసీలో మరేవైనా బాధ్యతలు ఇస్తారా? అన్న అంశంపై ఏఐసీసీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రెండు రోజుల క్రితం పీసీసీ ముఖ్య నేతలు ముఖేష్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు విక్రమ్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ ముఖేష్ గౌడ్‌కు నగర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే... దానం నాగేందర్‌కు ఏఐసీసీ లేదా పీసీసీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. -
అయ్యిందేదో అయ్యింది.. ఇక సీరియస్‌గా పనిచేస్తా
గత కొంతకాలంగా తాను పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకపోవడం పొరపాటేనని కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ అంగీకరించారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిందని.. ఇక మీదట పార్టీ కోసం సీరియస్‌గా పనిచేస్తానని నాయకులకు ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ సన్నాహక సమావేశంలో దానం నాగేందర్ ఇతర సీనియర్ నాయకులకు ఇకపై గట్టిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. సేవ్ హైదరాబాద్ అనే నినాదంతో జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. -
'బరువు పెరిగి టీఆర్ఎస్ మునుగుతుంది'
హైదరాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని నేతలు పార్టీ మారడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(వీహెచ్) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి చెందిన నేతల ఫిరాయింపులు, తదితర అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సహించడం మంచిది కాదన్నారు. టీఆర్ఎస్ పెద్దలు సొంత క్యాడర్‌నే తయారుచేసుకోవాలని వీహెచ్ సూచించారు. కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుంటే బరువు పెరిగి టీఆర్ఎస్ మునుగుతుందని వ్యాఖ్యానించారు. పార్టీని వీడొద్దని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క పిలుపునివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సూచించారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించారని, అటువంటి వ్యక్తి పార్టీ మారుతాననడం సరికాదని వీహెచ్ హితవు పలికారు. -
గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ రద్దు?
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీని పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీపీసీసీ) నాయకత్వం ఉంది. గ్రేటర్ కాంగ్రెస్ నుంచి నాయకుల వలసలు పెరిగే అవకాశాలున్నాయన్న సమాచారంతో టీపీసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరడం ఖాయమైన తరుణంలో టీపీసీసీ నాయకత్వంలో కదలిక వచ్చింది. కమిటీలో కొనసాగుతున్న నాయకులు వెళ్లిపోవడం వల్ల పార్టీ బలహీనపడిందన్న అభిప్రాయం ఏర్పడుతుందని భావిస్తున్న టీపీసీసీ ముందుగానే ఆ కమిటీని పూర్తిగా రద్దుచేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కమిటీని రద్దు చేయడం వల్ల రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసే పనిలో టీపీసీసీ నేతలు తలమునకలయ్యారు. దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరడానికి ముందే కమిటీని రద్దు చేయడం మంచిదని పలువురు నేతలు ఒత్తిడి తెస్తుండటంతో టీపీసీసీ నేతలు ఈ విషయంపై హైకమాండ్‌ను ఆశ్రయించారు. టీఆర్ఎస్లో చేరాలన్న నిర్ణయానికి వచ్చిన దానం కమిటీ అధ్యక్షుడిగా ఇంకా కార్యక్రమాలు కొనసాగించే ఆస్కారం కల్పించడం పార్టీకి నష్టం చేకూర్చుతుందని, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గ్రేటర్ కమిటీని రద్దు చేయడమే మంచిదని ఏఐసీసీకి నివేదించారు. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి తగిన ఆదేశాలు రావొచ్చని టీపీసీసీ నాయకుడొకరు చెప్పారు. హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రస్తుత కమిటీని రద్దు చేసి జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ కోసం తాత్కాలికంగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో టీపీసీసీ నేతలు ఉన్నట్టు తెలిసింది. -
కాంగ్రెస్‌లో చెల్లక.... కారెక్కనున్న దానం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తన మాటే నెగ్గాలని దానం పెట్టిన షరతులను కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించకపోవడంతో ఇక ఆయన కారెక్కడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. సోమవారం మరో పది మంది కార్పొరేటర్ల అనుచర గణంతో టీఆర్ఎస్లో చేరడానికి కార్యక్రమం ఖరారైంది. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకత్వం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆయా పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా దానం నాగేందర్తోనూ మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. గురువారం రాత్రి కూడా టీఆర్ఎస్ నేతలు డి. శ్రీనివాస్, మంత్రి హరీష్‌రావులతో పాటు మరికొందరు నేతలు దానంతో సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. టీఆర్ఎస్ ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో దానం కాంగ్రెస్ నాయకత్వంతో బేరసారాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌లో కొనసాగాలంటే గ్రేటర్ ఎన్నికల్లో తన మాటే చెల్లుబాటు కావాలని, జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో కాంగ్రెస్ టికెట్లు ఖరారు చేసే బాధ్యత తనకే కట్టబెట్టాలని షరతు పెట్టారు. లేదంటే పార్టీ వీడివెళుతానన్న సంకేతాలు కాంగ్రెస్ నాయకత్వానికి పంపించారు. దానం పెట్టిన షరతులకు కాంగ్రెస్ ససేమిరా అంది. 150 డివిజన్ల పరిధికి చెందిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇంచార్జీలు ఉన్నారని, ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతలు అభ్యర్థులను సూచిస్తారని, ఆ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. దాంతో ఇక టీఆర్ఎస్లో చేరాలన్న నిర్ణయానికి దానం వచ్చారు. అయితే తనతో పాటు పార్టీలో చేరబోతున్న వారికి గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఖాయం చేయాలని దానం కోరగా అందుకు టీఆర్ఎస్ నేతలు అంగీకరించినట్టు సమాచారం. అందుకు టీఆర్ఎస్ సమ్మతించడంతో దానం శుక్రవారం తన అనుచరణగణంతో సమావేశమయ్యారు. తనకు సన్నిహితంగా ఉంటున్న దాదాపు 10 మంది మాజీ కార్పొరేటర్లను సమావేశపరిచి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కారెక్కడానికి సోమవారం ముహూర్తం నిర్ణయించుకున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇలావుండగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన 150 డివిజన్లకు సంబంధించి తన మాట చెల్లుబాటు కావాలని కోరిన విషయం నిజమేనని శుక్రవారం దానం మీడియా ముందు అంగీకరించారు. -
నా నిర్ణయం సోమవారం వెల్లడిస్తా..
సాక్షి,సిటీబ్యూరో: ‘కాంగ్రెస్ పార్టీని వీడాలనుకోవటం లేదు. పార్టీని నడపటం చేతకాని నాయకులే నాకు పొగపెడుతున్నారు. నేను పనిచేయటం లేదంటున్న నాయకులే నేరుగా పనిచేసి పార్టీని గెలిపించవచ్చు కదా... టీఆర్ఎస్ నుంచి నాకు ఆహ్వానం వచ్చిన విషయం వాస్తవమే అయినా నా నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తా’ అని మాజీ మంత్రి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం తన నివాసంలో తన అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో సమావేశమైన సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో ఫోన్లో మాట్లాడిన నాగేందర్.. పార్టీని వీడాలను కోవటం లేదని, ఇక పార్టీ కార్యకమాలను వేగిరం చేస్తానని చెప్పారు. ఈ రోజు సాయంత్రం ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడిన ఆయన తుది నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తానని పేర్కొన్నారు. పార్టీని నడిపించే సత్తా లేని నాయకులు తనను పొమ్మనలేక పొగబెడుతున్నారని చెప్పారు. పీసీసీ నాయకత్వం తీరు చూస్తుంటే పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించటం లేదని అన్నారు. శుక్రవారం నియోకజవర్గ కార్పొరేటర్లు, ముఖ్యులతో సమావేశం అవుతున్నానని, ఏ నిర్ణయమైనా సోమవారం ప్రకటిస్తానని చెప్పారు. -
‘హద్దు’ మీరితే ఊరుకోం!
‘దానం’ వ్యవహార శైలిపై డిగ్గీకి జిల్లా నేతల ఫిర్యాదు జిల్లాలో జోక్యం చేసుకుంటే సహించేదిలేదని స్పష్టీకరణ పరిధిపై ఏఐసీసీ లేఖను చూపిన నాయకులు హైదరాబాద్: కాంగ్రెస్‌లో సంస్థాగత పంచాయితీ అధిష్టానం పెద్దల దరికి చేరింది. శివారు ప్రాంతంలోని 48 జీహెచ్ఎంసీ డివిజన్లను తన పరిధిలోకి తేవాలని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ పునరుద్ఘాటించడం.. దీన్ని రంగారెడ్డి జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సారథ్యంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌రెడ్డి, నేతలు పి.కార్తీక్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్, రవికుమార్‌యాదవ్‌లు డి గ్గీని కలిసి మరోసారి తమ వాదనను గట్టిగా వినిపించారు. దానం వ్యవహారైశె లితో పార్టీకి చెడ్డపేరు వస్తోందని ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇదే వ్యవహారంపై పత్రికలకెక్కారని, అప్పట్లోనే దీనిపై భైగోళికంగా జిల్లా సరిహద్దులను విభజిస్తూ ఏఐసీసీ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యవహారాల్లో తలదూర్చాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని తెగేసి చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే మరోసారి వివాదాన్ని తెరమీదకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. సమష్టిగా ఉన్నాం.. రంగారెడ్డి జిల్లాలో సంస్థాగతంగా బలంగా ఉన్నామని, నేతల మధ్య సమన్వయం కూడా బాగా ఉందని దిగ్విజయ్‌కు జిల్లా నేతలు వివరించారు. చేవెళ్ల- ప్రాణహిత డిజైన్ మార్పుపై పెద్దఎత్తున చేసిన ఉద్యమంతో అధికారపార్టీ ఇరుకున పడిందని, రైతు ఆత్మహత్యలపై కూడా జిల్లాస్థాయిలో ఆందోళనలు చేశామని అన్నారు. ప్రభుత్వంపై పోరాడుతూ ప్రజల్లోకి వెళ్తున్నామని, పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శ్రేణులు కూడా అహర్నిషలు కృషి చేస్తున్నాయని డిగ్గీకి వివరించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టకుండా పొరుగు జిల్లాలో జోక్యం చేసుకోవాలని దానం చూడడం సరైన పద్ధతి కాదని అన్నారు. శివార్లను తన కనుసన్నల్లోకి తేకపోతే పార్టీ మారుతాననే దానం బెదిరింపులకు లొంగి.. 14 మంది నేతలను బలిచేయవద్దని పేర్కొన్నారు. జిల్లానేతల అభిప్రాయంతో ఏకీభవించిన దిగ్విజయ్.. గతంలోనే సంస్థాగత ఏఐసీసీ స్పష్టతనిచ్చినందున మరోసారి చర్చ అవసరంలేదని తేల్చిచెప్పారు. -
'తెలంగాణలో ఒక్క పార్టీ కూడా ఉండేది కాదు'
హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతోందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ విమర్శించారు. మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సంఘటనను సుమోటగా తీసుకుని విచారణకు ఆదేశించాలని కోరినట్లు దానం నాగేందర్ సోమవారమిక్కడ తెలిపారు. గతంలో తాము ఇదేవిధంగా వ్యవహరించి ఉంటే తెలంగాణలో ఒక్క పార్టీ కూడా ఉండేది కాదన్నారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి ఓపిక ఉండాలని దానం వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో రూ200 కోట్ల వృధా చేశారని, మెట్రో వాటర్ వర్క్స్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు. -
బీసీసీఐ గుర్తింపు సాధిస్తాం
వచ్చే నెలలో భారీ టోర్నీ క్యాట్ కొత్త అధ్యక్షుడు దానం నాగేందర్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామీణ క్రికెటర్లను గుర్తించి, తీర్చి దిద్దేందుకే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షుడు దానం నాగేందర్ తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంనుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. 2012లో ఏర్పాటైన క్యాట్ బుధవారం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. పలువురు రాజకీయ నాయకులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు టి.ప్రకాశ్ మాట్లాడుతూ... హెచ్‌సీఏ గతంలో అజహర్లాంటి ఆటగాడిని కూడా చిన్న చూపు చూసిందని, అయినా అపార ప్రతిభ వల్లే అతను జట్టులో కొనసాగాడని గుర్తు చేశారు. ఎవరికీ పోటీ కాదు: సునీల్‌బాబు క్యాట్ కార్యదర్శి సునీల్ బాబు మాట్లాడుతూ... తెలంగాణ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకే తాము కొత్త అసోసియేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. హెచ్‌సీఏ అవినీతిమయంగా మారిపోయిందని, ప్రతిభ గల వారికి అవకాశం లభించడం లేదని చెప్పారు. బీసీసీఐ గుర్తింపు కోసం తాము ఇచ్చిన దరఖాస్తు వారి పరిశీలనలో ఉందని, త్వరలోనే క్యాట్‌కు గుర్తింపు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఏర్పాటైన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు కూడా తాము పోటీ కాదని, రాష్ట్రంలో ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఎన్ని సంఘాలు వచ్చినా వారితో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మరో ఉపాధ్యక్షుడు పి. కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి ఆదిత్య రెడ్డి, ఎం. అనిల్‌కుమార్ యాదవ్, తుంగా పవన్ తదితరులు పాల్గొన్నారు. క్యాట్ కొత్త కమిటీ సలహా సంఘం సభ్యులలో మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్, రామచంద్రమూర్తి కూడా ఉన్నారు. -
టీఆర్ఎస్ ఏజెంట్ల్లా పోలీసులు: దానం
హైదరాబాద్ : పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లులా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో టీఆర్ఎస్ కార్యక్రమాలన్నింటికీ అనుమతులు ఇచ్చామని ఆయన శనివారమిక్కడ అన్నారు. కాంగ్రెస్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఛాతీ ఆస్పత్రిని తరలిస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని దానం అన్నారు. కాగా సచివాలయం, చెస్ట్ ఆస్పత్రి తరలింపును నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇవాళ పాదయాత్రకు సిద్ధమైంది. గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర చేసి గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అయితే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. -
భూకబ్జా గొడవలో.. దానం నాగేందర్‌పై కేసు
-
భూకబ్జా గొడవలో.. దానం నాగేందర్‌పై కేసు
కొండపల్లి సీతారామయ్య... పీపుల్స్ వార్ గ్రూప్ అగ్ర నాయకుడు. స్వయానా ఆయన మరదలైన కొండపల్లి హైమావతికి చెందిన భూమి కబ్జా విషయంలో ఓ వ్యక్తిని బెదిరించారంటూ మాజీ మంత్రి దానం నాగేందర్‌పై కేసు నమోదైంది. నాగేందర్‌తో పాటు కార్పొరేటర్ మహేష్ యాదవ్, సూరి, హేమా చౌదరి అనే వాళ్లపై కూడా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీ డెయిరీ మాజీ ఛైర్మన్ చంద్రమౌళిరెడ్డి భార్య అయిన కొండపల్లి హైమావతి గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో 889 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. ఆమె అల్లుడు జయేందర్ రెడ్డి ఎన్నారై. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఆయన తమ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. అయితే, ఈ భూమి హేమా చౌదరికి చెందినదని చెబుతూ కొంతమంది వచ్చి తమ నిర్మాణ పనులు ఆపేసి.. సైన్ బోర్డులను ధ్వంసం చేశారని జయేందర్ రెడ్డి తెలిపారు. వెళ్లి మాజీ మంత్రి దానం నాగేందర్‌తో మాట్లాడుకోవాలని వాళ్లు చెప్పడంతో తాము వెళ్లగా.. పనులు ఆపేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన బెదరించారన్నారు. దీంతో తాము హైదరబాద్ కమిషనర్‌కు మొరపెట్టుకోగా, ఆయన బంజారాహిల్స్ పోలీసులను తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. దాంతో దానం నాగేందర్, మహేష్ యాదవ్, హేమా చౌదరిలపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్లు ఆయన తెలిపారు. ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నారైలను ఆహ్వానిస్తూ బంగారు తెలంగాణ నిర్మిద్దామని పిలుపునిస్తుంటే.. మరోవైపు ఇక్కడ మాత్రం తమకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నట్లు జయేందర్ రెడ్డి వాపోయారు. -
నాపై టీఆర్ఎస్ ఆశలు వదులుకోవాల్సిందే
హైదరాబాద్ : తన విషయంలో టీఆర్ఎస్ ఆశలు వదులుకోవాల్సిందేనని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ తాను టీఆర్ఎస్లో చేరటం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తనకు పదవులపై ఆశ లేదని అన్నారు. గతంలో కూడా టీడీపీలోకి వెళ్లి ఇమడలేకే....మళ్లీ కాంగ్రెస్‌లోకే వచ్చానని దానం తెలిపారు. ప్రభుత్వం తనను ఇబ్బంది పెడితే...తాను కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం ...కాంగ్రెస్‌తో కలిసి వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమని దానం అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం పనిచేయదని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలే కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని దానం వ్యాఖ్యలు చేశారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటుందన్నారు. కాగా ఈనెల 19న ఇంటింటికి సమగ్ర సర్వేలో ఆటో డ్రైవర్లు, కూలీల పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని దానం డిమాండ్ చేశారు. ఇళ్లలో ఉండాలంటే వారికి ఆ మేరకు ప్రభుత్వం భత్యం ఇవ్వాలని అన్నారు. పొన్నాల లక్ష్మయ్యపై వ్యక్తిగత విమర్శలు తగవని దానం హితవు పలికారు. -
'సెటిలర్స్ కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు'
హైదరాబాద్ : హైదరాబాద్‌లో సెటిలర్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని ఆపార్టీ నేతలు దానం నాగేందర్, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ సెటిలర్స్‌కు భద్రత కల్పిస్తామన్నప్పటికీ వారు తమను విశ్వసించలేదన్నారు. ఇక కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని నష్టపరిచాయన్నారు. గతంలో టీఆర్ఎస్ కంటే పెద్ద పార్టీలనే ఎదుర్కొన్నామని, ప్రజా ఉద్యమాలు అంటే ఎలా ఉంటాయో రుచి చూపిస్తామని దానం, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటమి స్వయంకృతాపరాధమని, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. నామినేటెడ్ పదవులు రాక కార్యకర్తలు ఖాళీగా ఉన్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఓడించామే అని ప్రజలు పశ్చాత్తాప భావనలో ఉన్నారని వారు అన్నారు. టీడీపీ నుంచి కొందరు తెలంగాణ ద్రోహులు ఎన్నికల్లో గెలిచారని, తెలంగాణ ఇచ్చినప్పటికీ తాము ఓడిపోయామన్నారు. పార్టీ సీనియర్లు తామే ముఖ్యమంత్రి అవుతామనే భావనతో జనంలోకి వెళ్లలేకపోయారన్నారు. ఆ సమన్వయలోపం వల్ల కాంగ్రెస్ ఓటమి పాలైందన్నారు. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు వద్దన్న కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. దేశంలో చాలామంది ముస్లింలు పేదరికంలో బతుకుతున్నారని ఆయన అన్నారు. -
ఖైరతాబాద్‌లో దూసుకుపోతున్న విజయారెడ్డి
హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజయారెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు. కడపటి వార్తలు అందే సరికి 1200 ఓట్ల ఆధిక్యంలో ఆమె ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీజేపీ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీమంత్రి దానం నాగేందర్ బరిలో ఉన్నారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
అల్లర్లపై గవర్నర్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని సిక్చావ్ని ప్రాంతంలో జరిగిన అల్లర్లపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని మాజీమంత్రి దానం నాగేందర్ రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, నగర డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్‌తో కలిసి గురువారం దానం గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తనకు ఫోన్ చేసి సంఘటన వివరాలు తెలుసుకోవడంతోపాటు జరిగిన ఘటనపట్ల సానుభూతి వ్యక్తం చేశారని చెప్పారు. మరోవైపు టీపీసీసీ కిసాన్- ఖేత్ మజ్దూర్ యూనియన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి గురువారం గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్‌ను కలిసి తెలంగాణలో ఆకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతోపాటు కనీస మద్దతు ధర చెల్లించాలని కోరారు. విత్తనం కొరత లేకుండా సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు సరఫరా చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
‘దానం’పై కేసుల్లో చార్జిషీట్లు వేయండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై నమోదైన కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో దానంపై కేసుల్లో పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయట్లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. దానంపై నమోదైన కేసుల దర్యాప్తులో పురోగతీ లేదని, ఈ కేసులో దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని న్యాయవాది ఎ.తిరుపతివర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
దానంను అరెస్ట్ చేస్తాం
దాడి ఘటనలో హైకోర్టుకు గోపాలపురం ఏసీపీ నివేదిక పిటిషనర్ సహా ఇద్దరిపై దాడి వాస్తవమే ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం వల్లే దర్యాప్తు జాప్యం పక్షం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్, ఎన్ఎస్యూఐకి చెందిన వీర్‌వల్లభ్ 2011లో ఎం.శ్రవణ్‌కుమార్ సహా ఇద్దరిపై దాడి చేశారనే ఆరోపణల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్‌లోని గోపాలపురం డివిజన్ ఏసీపీ హైకోర్టుకు నివేదించారు. ఈ కేసులో దానం సహా ఇతర నిందితులను త్వరలోనే అరెస్టు చేయాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం కావడంవల్లే దర్యాప్తు సకాలంలో పూర్తి కాలేదని విన్నవించారు. 15 రోజుల్లో సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. దానం నాగేందర్‌పై తుకారాం గేట్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఇప్పటివరకు పురోగతి లేదని, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు చేయట్లేదని పేర్కొంటూ న్యాయవాది ఎ.తిరుపతివర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు... పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు గోపాలపురం ఏసీపీ, బంజారాహిల్స్ ఎస్సై వేర్వేరుగా నివేదికలను కోర్టు ముందుంచారు. 2011 అక్టోబర్ 16న తాము ఈస్ట్ మారేడ్‌పల్లికి వెళ్తుండగా అక్కడ ఆసుపత్రి ప్రారంభానికి వచ్చిన దానం నాగేందర్‌పై కొందరు కోడిగుడ్లు విసిరారని... అయితే అది తామే చేశామని నాగేందర్, వీర్‌వల్లభ్, మరికొందరు తమను కొట్టి గాయపరిచారంటూ శ్రవణ్‌కుమార్, నర్సింహయాదవ్ ఫిర్యాదు చేశారని గోపాలపురం ఏసీపీ నివేదించారు. దానం నాగేందర్ పోలీసు నుంచి లాఠీ తీసుకుని కొట్టారా? లేదా? అనేది నిర్ధారణకు వీడియో ఫుటేజీని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. అయితే అక్కడ తగిన సాంకేతిక పరిజ్ఞానం లేదని చెప్పడంతో గుజరాత్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఆ ల్యాబ్ రుసుం చెల్లింపునకు నిధులు విడుదల జాప్యమవడంతో ఆ ప్రభావం కేసు దర్యాప్తుపై పడిందని వివరించారు. 2013లో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందని, మీడియా ఫుటేజీలో ఎటువంటి మార్పులూ చేయలేదని తేలిందని నివేదించారు. దీంతో పాటు సాక్షులను విచారించడంతో పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. దాడి చేశారనడానికి ప్రాథమిక ఆధారాలు లభించాయని... దానం, ఇతర నిందితులను అరెస్టు చేయాలని చూస్తున్నామని ఏసీపీ వివరించారు. కాగా, తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో దానం నాగేందర్‌పై మూడు కేసులు ఉన్నాయని బంజారాహిల్స్ ఎస్సై తన నివేదికలో పేర్కొన్నారు. 2012లో నమోదైన కేసులో ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, అది రాగానే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టుకు నివేదించారు. 2013లో దాఖలైన మొదటి కేసులో చార్జిషీట్ దాఖలు చేశామని, రెండో కేసులో వైద్య నివేదిక రాగానే సంబంధిత కోర్టులో చార్జిషీట్ వేస్తామని విన్నవించారు. వారం రోజుల్లో ఈ రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని, ఆ మేర గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. -
'దానం’పై కేసులను దర్యాప్తు చేయండి
హైదరాబాద్: తాజా మాజీ మంత్రి దానం నాగేందర్‌పై నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదని, పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులను దర్యాప్తు చేయడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయవాది ఎ.తిరుపతివర్మ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, బంజారాహిల్స్ ఎస్హెచ్ఓ, తుకారంగేట్ ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గత మూడేళ్లలో దానంపై నాలుగు కేసులు నమోదయ్యాయని, ఈ కేసుల్లో ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి కాలేదని పిటిషనర్ తెలిపారు. దానం నాగేందర్ పోలీసులపై ఒత్తిడి తెస్తూ దర్యాప్తును అడ్డుకుంటున్నారని వివరించారు. 2013లో తనపై దాడి చేసినందుకు, 2011లో దళితుడిపై దాడి చేసినందుకు, మరో రెండు సందర్భాల్లో పోలీసులపై దాడికి దిగినందుకు దానంపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
'కలెక్షన్స్ కోసమే కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు'
-
హైదరాబాద్ జోలికొస్తే ఖబడ్ధార్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తే వచ్చేది దొరల పాలనే అని ఆయన అన్నారు. కేసీఆర్‌కు అధికారం ఇస్తే చెప్పులు నెత్తిన పెట్టుకొని నడవాల్సిందేనన్నారు. బతకటానికి హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ తమపై పెత్తనం చెలాయిస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రజలు తిరగబడితే ఏమవుతారో అనేది కేసీఆర్ ఆలోచించుకోవాలని దానం వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కలెక్షన్స్ కోసం కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. పెట్టుబడిదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. పారిశ్రామికవేత్తలు ఎవరూ టీఆర్ఎస్కు విరాళాలు ఇవ్వందని సూచించారు. పద్దతి మార్చుకోవాల్సిందే...లేకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. టీఆర్ఎస్కు 30 లేదా 40ని మించి సీట్లు రావని దానం జోస్యం చెప్పారు. ఇప్పటికే పార్టీలోకి కొడుకు, కూతురు, అల్లుడిని తెచ్చిన కేసీఆర్ ఇక మనవడిని కూడా తీసుకు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. అసలు తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కడ ఉందని దానం ప్రశ్నించారు. -
వేలు పెట్టడానికి దానం ఎవరు?
-
వేలు పెట్టడానికి దానం ఎవరు?
ఈసారి తాను అసెంబ్లీకి పోటీ చేయడంలేదని, మల్కాజిగిరి ఎంపీగానే పోటీ చేస్తానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తాను రాహుల్ గాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేయాలనుకుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. మాజీ మంత్రి దానం నాగేందర్‌పై సర్వే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో వేలు పెట్టడానికి దానం ఎవరని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్తో పొత్తుకు ఇప్పటికీ అవకాశం ఉందని సర్వే చెప్పారు. టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నందున టీఆర్ఎస్ కూడా తమతో కలిసపొచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. -
కేసీఆర్‌కు దిమ్మ తిరుగుతుంది: దానం
హైదరాబాద్ : ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని గర్నవర్ నరసింహన్‌ను కోరినట్లు మాజీ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఆయన మంగళవారం గవర్నర్ కలిసి ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. భేటీ అనంతరం దానం విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణలో దొరల రాజ్యం తేవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ ప్రయత్నాన్ని తాము అడ్డుకుంటామని దానం తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలతో కేసీఆర్‌కు దిమ్మ తిరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. -
సిట్టింగ్ సీట్లకు బైబై!
ఖైరతాబాద్, గోషామహల్లను వీడే యోచనలో దానం, ముఖేష్ నాంపల్లి, ముషీరాబాద్ నుంచి పోటీ? అప్జల్‌సాగర్‌లో రేపు దానం కీలక సమావేశం సాక్షి, సిటీబ్యూరో: స్థానికంగా వ్యతిరేకత.. గతం లో సహకరించిన మిత్రపక్షం దూరం కానుండ టం.. వెరసి నగర కాంగ్రెస్ పార్టీలో వీవీఐపీల పరి స్థితి డైలమాలో పడింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్లీ గెలవలేమన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ నాంపల్లిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బుధవారం నాంపల్లి నియోకజవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో అఫ్జల్‌సాగర్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాను ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన కోసం పనిచేసిన వారందరినీ ఈ సమావేశానికి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ నియోకజవరగలో గడిచిన ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టకపోవటం, స్థానిక నాయకుల ప్రవర్తన పార్టీకి పూర్తి స్థాయిలో చెడ్డపేరు తేచ్చింది. దీనికి తోడు మైనారిటీ, సీమాంధ్రుల మనోభావాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండటంతో దానం తనకు ఖైరతాబాద్ సురక్షితం కాదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖేష్ సైతం.. మరో తాజా మాజీ మంత్రి మూల ముఖేష్‌గౌడ్ సైతం ప్రస్తుత గోషామహల్ స్థానాన్ని వీడే అవకాశం కనిపిస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గత ఐదేళ్లలో గోషామహల్ వాసులకు అందుబాటులో ఉండకపోవటం ఆయనకు మైనస్ కానుంది. దీనికితోడు గత ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలపకుండా ముఖేష్‌కు సహకరించిన ఎంఐఎం, తదనంతర పరిణామాలతో ఆయన తీరుపై గుర్రుగా ఉంది. ఈ స్థానంలో ఎంఐఎం సహకారం లేకుండా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లే దు. ఈ కారణంగానే ముఖేష్ స్థానమార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల షెడ్యూల్ జారీ అయి పోలింగ్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ ముఖేష్ నియోకజవర్గంలో కార్యకర్తలు, నాయకులకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ఆయన కుమారుడు విక్రమ్‌గౌడ్ కొంతమంది నాయకులను కలిసి వెళ్తున్నారు. ముఖేష్‌గౌడ్ ఆశిస్తున్నట్లుగా సికింద్రాబాద్ లోక్‌సభ లేదా ముషీరాబాద్ శాసనసభ స్థానంలో ఏదో ఒకటి తనకు కేటాయించక, గోషామహల్ స్థానం నుంచి పోటీ చేయాల్సి వస్తే, తన కుమారుడు విక్రంగౌడ్‌ను బరిలోకి దించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు సైతం అంగీకరిస్తున్నారు. -
'నాకు పీసీసీ పదవి రాకుండా అడ్డుకుంది దొరలే'
హైదరాబాద్ : తెలంగాణలో దొరల పెత్తనం సాగనివ్వమని మాజీమంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్‌లోనూ దొరల హవానే సాగుతోందని విమర్శించారు. తనకు పీసీసీ పదవి రాకుండా అడ్డుకుంది దొరలేనని దానం వాపోయారు. బడుగు, బలహీన వర్గాల వారికే తెలంగాణ సీఎం పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
దానం ఆగడాలను అడ్డుకోండి
చట్టాలు, నిబంధనలన్నీ పాతరేస్తూ దౌర్జన్యంతో ప్రజాస్వామ్య వ్యవస్థను పాతరేయాలని చూస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్, కార్పొరేటర్ భారతిల ఆగడాలను అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేసింది. సోమవారం పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త పి.విజయారెడ్డితో పాటు నందీనగర్, దేవరకొండ బస్తీవాసులు లక్ష్మీ, విజయా నాయక్, నవీన్ నాయక్, ఇషాక్‌లతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. ఈ సందర్భంగా శాంతియుతంగా ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమం చేపట్టిన తమపై దానం నాగేందర్, భారతిల ప్రోద్బలంతో దాడి చేసిన తీరును వారు వివరించారు. తక్షణం వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వారు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. -
అన్న తిరుగొద్దన్నడు..!
బంజారాహిల్స్ ‘ఈ బస్తీలో మా అన్నతిరుగొద్దన్నడు..మీరు వెంటనే వెళ్లిపోండి.. లేకుంటే బాగుండదు..’ ఇవీ ఏ వీధి రౌడీయో అన్న మాటలు కావు. వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి తాజా మాజీమంత్రి దానం నాగేందర్ అనుచరుల హెచ్చరికలు. వద్దన్నా.. మీరు పర్యటిస్తారా.. అంటూ అనుచరులు వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి దిగారు. పాదయాత్ర చేస్తుంటే అడ్డుకోడానికి మీరెవరు.. అని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. సుమారు గంటపాటు దౌర్జన్యకాండ సాగినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించి చివరకు చర్యలు తీసుకునేలోపు అక్కడ్నుంచి జారుకున్నారు. ఇదంతా బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనేఉన్న వెంకటేశ్వరనగర్‌లో ఆదివారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గ కన్వీనర్ విజయారెడ్డి వెంకటేశ్వరనగర్‌లో పాదయాత్ర ప్రారంభించి గడపగడపకు పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారీసంఖ్యలో గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆమెకు స్వాగతం పలకగా యువత వందలాది సంఖ్యలో మద్దతుగా పాదయాత్ర చేస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని మాజీమంత్రి దానం నాగేందర్ అనుచరులు, స్థానిక కార్పొరేటర్ బి.భారతి కొడుకు భానుప్రకాష్, తమ్ముడు రామ్‌జీ, రాజేందర్, సంజీవ్‌నాయక్, యాదమ్మ తదితరులు విజయారెడ్డి పాదయాత్రను అడ్డుకున్నారు. ‘మా అన్న (దానం నాగేందర్) ఈ బస్తీలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను తిరగనివ్వవద్దని చెప్పారు..ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని కార్పొరేటర్ కొడుకు హెచ్చరించాడు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజల వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడానికి మీరెవరని మహిళా నాయకురాలు అనిత ప్రశ్నించగా కార్పొరేటర్ కొడుకు, తమ్ముడు, అనుచరులు ఆమెపై దాడిచేసి గాయపర్చారు. అడ్డొచ్చిన వారిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. సుమారు గంటపాటు దౌర్జన్యకాండ సాగడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు నచ్చజెబుతుండగానే కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతులకు పనిచెప్పారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేలోపు కాంగ్రెస్ నాయకులు అక్కడ్నుంచి జారుకున్నారు. కార్పొరేటర్ కొడుకు, తమ్ముడిపై కేసు నమోదు : వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నేతలపై దాడులకు పాల్పడిన బంజారాహిల్స్ కార్పొరేటర్ భారతి కొడుకు భానుప్రకాష్, తమ్ముడు రామ్‌జీ, అనుచరులు సంజీవ్‌నాయక్, రాజేందర్‌లపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341 (దౌర్జన్యం), సెక్షన్ 509 (మహిళలపై అసభ్యప్రవర్తన, అసభ్య పదజాలంతో దూషించడం), 506 (చంపుతానని బెదిరించడం) తదితర నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా పరారీలో ఉన్నారని, గాలిస్తున్నట్లు అదనపు సీఐ నయీముల్లా తెలిపారు. అరెస్టు చేయాలంటూ విజయారెడ్డి ఆందోళన : ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తుంటే దౌర్జన్యంగా అడ్డుకోవడమే కాకుండా దాడికి పాల్పడిన తాజామాజీమంత్రి దానం నాగేందర్ అనుచరులు, కార్పొరేటర్ కొడుకు, తమ్ముడు, బంధువులను తక్షణం అరెస్టు చేయాలని విజయారెడ్డి డిమాండ్‌చేశారు. అరెస్టు చేసేవరకు ఇక్కడ్నుంచి కదిలేదిలేదంటూ హెచ్చరించారు. తమ బ్యానర్లు చించేశారన్నారు. తన మంచితనంతో పీజేఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మారిస్తే..ఆయన పేరుతో గెలిచిన నాగేందర్ రౌడీల అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తేలేదని, ఎంత అణగదొక్కాలని చూస్తే తమ కార్యకర్తలు పులుల్లా వెంటబడి తరుముతారని విజయారెడ్డి దానం నాగేందర్‌ను హెచ్చరించారు. -
రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి దానం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ పార్టీ విలీనమైనా.. కాకున్నా, పొత్తు కుదిరినా.. కుదరకపోయినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఓ బస్తీకి చెందిన కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇస్తానని చెప్పిన సోనియాగాంధీ మాటకు కట్టుబడ్డారని, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ కూడా అదే రీతిలో మాటపై నిలబడాలని దానం కోరారు. -
గెలిచే సత్తా ఉంది: మంత్రి దానం
బంజారాహిల్స్, నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని మంత్రి దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ డివి జన్ పరిధిలో దీపం పథకం కింద మం జూరైన గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు ఆయన మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఏ డివిజన్లో ఎంత అభివృద్ధి చేశానో తాను నిరూపిస్తానని కొత్తగా వస్తున్న పార్టీల నాయకులు ఏంచేస్తారో చెబుతారా అని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా చివరకు గెలిచేది తానేనని, ఆ సత్తా తనకు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 250 మంది లబ్ధిదారులకు దీపం పథకం కింద కనెక్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బంజారాహిల్స్ కార్పొరేటర్ బి.భారతి, జీహెచ్ఎంసీ సర్కిల్-10 యూసీడీ డిప్యూటీ పీవో కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
'ఆ వాస్తవాలు అప్పుడే బయటపెట్టాల్సింది'
హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం తేలిపోయిందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. సీఎం తమను మభ్యపెట్టి, మోసం చేశారని సీమాంధ్ర మంత్రులే అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కిరణ్‌కు నైతిక విలువలు, సమైక్యవాదం గౌరవం ఉంటే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసేవారని దానం అన్నారు. రాజీనామా చేయకుంటే సాగనంపేవారని ఆయన వ్యాఖ్యానించారు. హైకమాండ్ నుంచి కిరణ్‌కు పూర్తి సంకేతాలున్నాయని అన్నారు. స్వార్థప్రయోజనాల కోసమే కిరణ్ డ్రామాలాడాన్నారు. సీమాంధ్ర ప్రజల క్రెడిట్ కోసం కిరణ్ రాజీనామా చేశారన్నారు. కేంద్రం ప్యాకేజీలు ఇస్తామన్నపుడు...ఆ వాస్తవాలు అప్పుడే బయట పెట్టాల్సిందనారు. ముఖ్యమంత్రి హడావిడి నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వంలో విచారణ చేయిస్తామని దానం తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. -
సిఎంతో విభేదాలున్నా అధిష్టానంతో సన్నిహితమే
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎంఐఎంకు విభేదాలు ఉన్నప్పటికి అధిష్టానంతో మాత్రం సన్నిహిత సంబంధాలే ఉన్నాయని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని శాసనసభా స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. ఎంఐఎంతో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఏఐసీసీ పరిశీలకురాలు విజయధరణి ఈరోజు గాంధీభవన్‌లో మంత్రి దానం నాగేందర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నానని చెప్పారు. అందరి అభిప్రాయాలను అధిష్టానానికి నివేధిస్తానన్నారు. -
సిగ్గుంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలి
హైదరాబాద్ : శ్రీధర్ బాబు శాఖ మార్పు దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత మంత్రులు అవకాశం దొరికినప్పుడల్లా తమ నోటికి పని చెబుతున్నారు. సిగ్గు ఉంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలని మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబును బలిపశువును చేశారని ఆయన అన్నారు. కాగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యలకు మంత్రి దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు రాజీనామా చేస్తే సీమాంధ్ర మంత్రులు కిరాణా దుకాణం పెట్టుకోవాలన్నారు. -
'హైదరాబాద్‌పై ఆంక్షలు తగవు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిపోయిందని ఈ పరిస్థితుల్లో అయోమయం అనవసరమని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌పై ఆంక్షలు తగవని, శాసనసభ వేదికగా తమ వాదన విన్పిస్తామని తెలిపారు. ఉమ్మడి రాజధానిగా జీహెచ్ ఎంసీ కాకుండా హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకు పరిమితం చేయాలన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ విభజన విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని శివసావహిస్తామని చెప్పారు. శాంతి భద్రతలు గవర్నర్ పరధిలో ఉంటే సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. -
బిల్లును గట్టెక్కించేందుకు ఎమ్మెల్యేలకు విప్ జారీ!
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం లేకపోలేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ బిల్లుకు అందరు డిమాండ్ చేస్తున్నారని, వీలు కాకపోతే ప్రత్యేక సమావేశాలు పెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌పై జీవోఎం పెట్టిన సూచనలపై ఉన్న అభ్యంతరాలపై గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, నాయకులతో సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ భేటీ కానున్నట్లు దానం తెలిపారు. -
కేంద్రం చేతిలో అధికారం ఉంటే మేము ఏం చేయాలి?
హైదరాబాద్ : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకునేది లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌పై ఏది పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమంటూ కొందరు చేస్తున్న వాదనలపై దానం మండిపడ్డారు. యూటీ అంటే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయన్నారు. కేంద్రం చేతిలో అధికారం ఉంటే.... ప్రజాప్రతినిధులుగా తాము ఏమి చేయాలని (చీపుళ్లు పట్టుకోవాలా) అని ఎద్దేవా చేశారు. కీలక అధికారాలు కేంద్రం పరిధిలో ఉంటే తమకు సమ్మతం కాదన్నారు. హైదరాబాద్ యూటీ అంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీఎల్పీలో తీర్మానం చేశామని దానం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు స్పీకర్‌గా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. -
వైఎస్ లేని లోటు తీర్చలేనిది: దానం
హైదరాబాద్ : రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఎన్నో వినూత్న పథకాలతో బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్న నాయకుడు వైఎస్ మాత్రమేనని అన్నారు. మహానేత వైఎస్ఆర్ నాలుగో వర్థంతి సందర్భంగా మంత్రులు దానం నాగేందర్, వట్టి వసంతకుమార్, ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు సోమవారం హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళుతూ సరిగ్గా నాలుగేళ్ల కిందట కానరాని లోకాలకు వెళ్లిపోయారని నాగేందర్ తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని... ఆ మహానేత అడుగుజాడల్లో తాము నడుస్తామని చెప్పారు. మరోవైపు గాంధీభవన్లోనూ వైఎస్ వర్థంతి కార్యక్రమం జరిగింది. -
నేడు ఢిల్లీ వెళ్ళనున్న హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు
-
హైదరాబాద్‌ను యూటీ చేస్తే అగ్నిగుండమే
హైదరాబాద్ : హైదరాబాద్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను తాము అంగీకరించేది లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అగ్నిగుండమే అవుతుందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని దానం తెలిపారు. ఆంటోనీ కమిటీ ముందు తమ వాదనలు వినిపిస్తామని దానం తెలిపారు. హైదరాబాద్‌పై అధిష్టానం పునరాలోచన చేస్తుందనే అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని దానం డిమాండ్ చేశారు. కాగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాల తీవ్రతను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని.. త్వరలోనే విభజన నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు నిన్న ఢిల్లీలో పేర్కొన్న విషయం తెలిసిందే. విభజన అనివార్యమైతే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాల్సిందేనన్నారు. -
'హైదరాబాద్ పై చాలా అనుమానాలున్నాయి'
హైదరాబాద్: హైదరాబాద్ నగరంపై ప్రజలకు చాలా అనుమానాలున్నాయని మంత్రి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ఇక్కడి సీమాంధ్రులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఈ అంశానికి సంబంధించి ఆంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నామని తెలిపారు. ఆంటోని కమిటీతో భేటీ అయ్యేందుకు ఈ నెల 19 వతేదీ కాకుండా మరో తేదీని కేటాయించాలని పీసీసీ చీఫ్ బొత్స ను కోరతామన్నారు. కాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో తెలంగాణ ప్రజా ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. బొత్సతో సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ కుమార్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో విస్తృతసాయి సమావేశాన్ని నిర్వహిస్తామని, 19 వ తేదీన తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఆంటోని కమిటీతో సమావేశమవుతారన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని యథావిధిగా అమలు చేయాలని కమిటీకి నివేదిస్తామన్నారు. సీడబ్యూసీ తీర్మానం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసే అవకాశం ఉండదని వారు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.