దానం ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం.. సీత మృతి! | woman died who attempted suicide at danam nagendar house | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 13 2018 3:28 PM | Last Updated on Sat, Jan 13 2018 6:23 PM

woman died who attempted suicide at danam nagendar house - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీత అనే మహిళ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచింది. ఎనిమిది రోజుల కిందట మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌ ఇంటివద్ద సీత ఆత్మహత్యాయత్నం చేసుకుందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. సీత మృతి నేపథ్యంలో నిమ్స్‌ ఆస్పత్రి వద్ద ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి.

దానం నాగేందర్‌ ఇంట్లో మూడేళ్ల క్రితం చనిపోయిన గిరిప్రసాద్‌ భార్యే సీత. గిరిప్రసాద్‌ కరెంట్‌ షాక్‌తో చనిపోయినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గిరిప్రసాద్‌ కుటుంబాన్ని ఆదుకుంటానని దానం నాగేందర్‌ హామీ ఇచ్చారని, కానీ న్యాయం కోసం మూడేళ్లుగా దానం ఇంటిచుట్టూ సీత తిరుగుతున్నా.. ఆయన పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, సీత కుటుంబసభ్యుల ఆరోపణలను దానం నాగేందర్‌ ఖండించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement