
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతి ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాగా, గవర్నర్ తమిళిసై నిమ్స్ పర్యటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. నిమ్స్‌కు గవర్నర్ తమిళిసై వచ్చినప్పుడు వాహనంలో పూలమాల ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై గవర్నర్ కార్యాలయం స్పందించి వివరణ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై ఇతర ప్రాంతాల నుంచి రాజ్‌భవన్‌కు వచ్చిన ప్రతీసారి ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రీతి త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రార్థించారు. ఆలయం నుంచి గవర్నర్ తమిళిసై నేరుగా నిమ్స్‌కు వచ్చారు. గవర్నర్ నిమ్స్ పర్యటనలో ఎలాంటి దురుద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.