nims
-
పంజాగుట్ట నిమ్స్ దగ్గర ఉద్రిక్తత.. సిబ్బంది నిరసన
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్స్ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. నిన్న(గురువారం) ఓ పేషెంట్ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ పూర్తయిన తర్వాత చూడగా.. బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆ రోగి విధుల్లో ఉన్న వర్కర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.చివరకు ఆ బంగారు గొలుసు రోగి వద్దే లభించింది. విచారణలో భాగంగా నిమ్స్ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టారంటూ ఇతర సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పూర్తిగా నిర్థారణకు రాకుండానే చోరీ పేరుతో వర్కర్‌ను కొట్టారంటూ పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. అత్యవసర విభాగం వద్ద సిబ్బంది ఆందోళన చేపట్టారు.ఇదీ చదవండి: దీని వెనుక ఏదో మతలబు ఉంది -
కొత్త జన్యులోపం ‘సర్పినోపతి’
సాక్షి, హైదరాబాద్: కడుపులో ఉన్నప్పుడే పిల్లల్లో ఉండే జన్యుపరమైన లోపాన్ని(జెనెటిక్ డిజార్డర్) నిమ్స్ వైద్య బృందం కనుగొన్నది. నిమ్స్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) ఆధ్వర్యంలో ఐదేళ్లుగా జరిగిన పరిశోధన ద్వారా ఈ లోపం వెలుగులోకి వచ్చింది. నిమ్స్ మెడికల్ జెనెటిక్ విభాగ అధిపతి డాక్టర్ షాగున్ అగర్వాల్ ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ జెనెటిక్ విభాగం కూడా ఈ కొత్త జన్యులోపాన్ని నిర్ధారించినట్లు నిమ్స్ పరిశోధకులు వెల్లడించారు. వైద్యశాస్త్రంలో దాదాపు 6,000 నుంచి 7,000 జన్యుపరమైన లోపాలు ఉండగా, కొత్తగా ఇది కూడా చేరింది. తెలంగాణలో తొలి కేసు హైదరాబాద్‌కు చెందిన దంపతులు 2017లో ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డ పుట్టుకతోనే చనిపోయింది. ఆ తర్వాత 2018లో మళ్లీ ఆ దంపతులకు చెందిన మరో బిడ్డ కడుపులో ఉండగానే పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో జన్యుపర మైన సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ఆ బిడ్డ పుడితే బతకదని తేల్చారు. ఆ బిడ్డకు ఐదు నెలలు ఉన్నప్పుడే అబార్షన్ చేసి తీశారు.పోసు మార్టం ద్వారా అసాధారణమైన లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఏదో కొత్త వ్యాధిగా అనుమానించారు. దీంతో అప్పటినుంచి పరిశో ధన ప్రారంభమైంది. చర్మం నుంచి డీఎన్ఏ తీసుకొని పరీక్షలు చేశారు. అప్పుడు కొత్త జన్యు లోపం సర్పినోపతి–11గా నిర్ధార ణకు వచ్చా రు. మరోవైపు ఆ దంపతులు 2020లో మూడో సారి కూడా బిడ్డను కనేందుకు సిద్ధమయ్యారు. బిడ్డ కడుపులో ఉండగానే స్కానింగ్, జెనెటిక్ పరీక్షల్లో అరుదైన లక్షణాలు కనిపించాయి.ఐదు నెలలు ఉండగానే కడుపులో ఉన్న బిడ్డలో ఊపిరితిత్తులు, గుండె సహా ఇతర అవయ వాల్లో నీరు చేరింది. ఈ బిడ్డ కూడా బతకదని గుర్తించి అబార్షన్ చేశారు. ఆ బిడ్డకు కూడా అదే జన్యు లోపం ఉందని నిర్ధారించారు. మరోవైపు ఆ దంపతులకు కూడా ఆ జన్యులోపం ఉంద ని... ఇద్దరిలో సగం సగం ఉందని గుర్తించారు. వారిద్దరి నుంచి పిల్లలకు వ్యాపించిందని నిమ్స్ వైద్యులు కనుగొన్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన కడుపులోని ఇద్దరు బిడ్డలను అబార్షన్ చేసి పిండాలపై జెనెటిక్ విభాగంలో పరిశోధన చేశారు. ఈ జన్యులోపానికి సంబంధించిన ప్రధాన లక్షణం గుండె, ఊపిరితిత్తులు సహా ప్రతి అవయవంలో నీరు చేరిపోతుందని, దీనిని కనుగొన్న డాక్టర్ షగున్ అగర్వాల్ ’సాక్షి’కి చెప్పారు. సీడీఎఫ్‌డీ శాస్త్రవేత్తలు డాక్టర్ రష్నా భండారి, డాక్టర్ అశ్విన్ దలాల్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనలో పాల్గొన్నది. పరిశోధనలో నిమ్స్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందంటూ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశోధనలో పాల్గొన్న వైద్య బృందానికి అభినందనలు చెప్పారు.చికిత్సకు ఊతం: నిమ్స్ డైరెక్టర్ బీరప్పఇలాంటి జన్యులోపంతో ఇబ్బంది పడుతున్న వారికి చికిత్స అందించేందుకు ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడు తుందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలి పారు. రెండు పిండాలపై(ఫీటస్) డాక్టర్లు పరిశోధనలు చేయగా, శరీరంలో ఉండే ‘సెర్పినా11’ అనే జన్యువులో మ్యుటేషన్లు జరుగుతున్నాయని, ఈ మ్యుటేషన్ల వల్ల శరీరంలోని ఇతర టిష్యూస్ కూడా దెబ్బ తింటున్నాయని గుర్తించారని చెప్పారు. ఇలాంటి ఒక అరుదైన జన్యులోపాన్ని గుర్తించడం ప్రపంచంలోనే తొలిసారి అని క్లినికల్ జెనెటిక్స్ జర్నల్ ప్రకటించిందని బీరప్ప తెలిపారు. -
నిమ్స్‌లో హార్ట్ వాల్వ్ బ్యాంకు!
లక్డీకాపూల్: గుండెకు మరింత భరో సా కల్పించే దిశగా నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) అడుగులు వేస్తోంది. గుండె సమస్యలతో బాధపడుతున్న పేద రోగుల్లో అవసరమైన వారికి ఉచితంగా గుండె కవాటా(హార్ట్ వాల్వ్)లను అందించేందుకు నిమ్స్ సమాయత్తమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో గుండె సిరలు దెబ్బతిన్న వారికి కృత్రిమంగా తయారు చేసిన వాటిని అమరుస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న ఈ వాల్వ్‌ల మార్పిడి ఆపరేషన్ నిరుపేదలకు పెనుభారంగా తయారైంది. దీంతో పేదలకు ఉచితంగా అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్ వాల్వ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్థల పరిశీలన జరుగుతోంది. త్వరలోనే హార్ట్ వాల్వ్ బ్యాంక్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించాలని భావిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుంచి సేకరణ..బ్రెయిన్ డెడ్‌కు గురైన వాళ్ల నుంచి అవ యవాలను నిమ్స్ సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మృతుని కుటుంబసభ్యుల అంగీకారంతో కిడ్నీ లు, కాలేయం, కళ్లు, గుండె తదితర కీలక అవయవాలను సేకరిస్తోంది. అదే విధంగా బ్రెయిన్ డెత్‌కు గురైన వాళ్ల నుంచి గుండె కవాటాలను కూడా సేకరించి.. వాటిని భద్రపర్చేందుకు ప్రత్యేక విభాగాన్ని(హార్ట్ బ్యాంక్) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ బ్యాంకులో భద్రపరిచిన కవాటాలను పూర్తిగా ఉచితంగా అందించడంతో నిమ్స్‌కు వచ్చే రోగులు చాలా తక్కువ ఖర్చుతోనే శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ తెలిపారు. -
ఆయుష్.. నొప్పులు మాయం
లక్డీకాపూల్: జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో నగర ప్రజలు వివిధ రకాల నొప్పులతో సతమతమవుతున్నారు. అవే పెద్ద సమస్యలుగా భావించి చాలా మంది కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తొలనొప్పి, కండరాల, మోకాళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, మిటమిన్స్ లోపం, అధిక బరువు వంటి సాధారణ సమస్యలను కూడా చాలా మంది పెద్ద జబ్బులుగా భావిస్తున్నారు. దీంతో రిఫరల్ అస్పత్రి అయిన నిమ్స్ సైతం రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతోనే సహజ సిద్ధమైన వైద్య చికిత్సలతో నొప్పులకు ఉపశమనం కలి్పంచాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయూష్ శాఖ నిమ్స్‌లో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నారు. సంప్రదాయ వైద్యమైన ఆయుష్ సేవలకు ప్రాచుర్యం కలి్పంచేందుకు దృష్టిని కేంద్రీరించింది. లోపించిన శారీరకశ్రమ..మనిషి కూర్చునే భంగిమని బట్టి కూడా ఈ నొప్పులు చోటుచేకుంటాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో శారీరశ్రమ లోపించింది. చెప్పాలంటే.. శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. విటమిన్ల లోపం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతుంటే పోషకాహార లోపం వల్ల మరికొంత మంది అనార్యోగం పాలవుతున్నారు. ఆస్పత్రికి వచి్చన రోగులకు ప్రకృతి వైద్యం పట్ల అవాగాన కల్పిస్తూ.. భవిష్యత్తులో వారు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా చూసేందుకే ఈ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కృషి చేస్తుంది. – డా.నాగలక్షి్మ, ప్రకృతి వైద్యనిపుణురాలు అలోపతికి సమాంతరంగా...అలోపతి వైద్యానికి సమాంతరంగా ఆయుష్ సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్, ప్రసూతి సమస్యలు, కీళ్ల నొప్పులు తదితర అన్ని రకాల సమస్యలకూ ప్రకృతి వైద్య చికిత్స అందుబాటులో ఉండడమే కాకుండా వ్యాధి మూలాలపై పనిచేసి, పునరావృతం కాకుండా చేయడమే సహజ వైద్య చికిత్సల లక్ష్యమని నిపుణులు పేర్కొంటున్నారు. నరగంలో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి స్థాయిలు, ఆందోళన మొదలైన పర్యావరణ మార్పులకు దారితీసింది. అటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఏకైక మార్గం ప్రకృతి వైద్య చికిత్సలు. సాధారణ నొప్పులతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తక్కువ ఖర్చుకే సహజమైన పద్ధతిలో మెరుగైన సేవలు అందిస్తున్నారు. అలోపతి వైద్య పద్దతిలో లొంగని వ్యాధులకు సైతం ఆయుష్ ఉపశమనం కలి్పస్తుంది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ సహజ వైద్య చికిత్సల పట్ల ఆసక్తి చూపుతున్నారు.నామమాత్రపు రుసుము..పంచకర్మ చికిత్సల్లో భాగంగా స్నేహకర్మ, నదిస్వేదం, పిండిస్వేదం, కతివస్తి, జనువస్తి, నాశ్యకర్మ, శిరోధార, డెటాక్స్ థెరపీ, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నిర్మూలన, బాడీ మసాజ్, మైగ్రేన్ వంటి సేవలతో పాటు ప్రకృతి వైద్య సేవల్లో భాగంగా జనరల్ మసాజ్, స్టీమ్‌బాత్, డైట్ కౌన్సిలింగ్, కోల్డ్ బ్లాంకెట్ ప్యాక్, తల, కండరాలు, నడుం, భుజాలు, మోకాళ్ల నొప్పులకు చికిత్సలు అందిస్తుంది. ఆక్యుపంక్చర్, యోగ వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచింది. రోగులు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చికిత్సను అందిస్తుంది. ఎంపిక చేసుకున్న చికిత్స, సేవలు, సిట్టింగ్ ఆధారంగా నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నారు. చికిత్స పొందాలంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. వాస్తవానికి సహజ వైద్య చికిత్సలను ప్రణాళికబద్ధంగా అనుసరించాల్సిందే. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక స్లాట్‌గా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకూ మరో స్లాట్‌గా నిర్ణయించారు. -
నిమ్స్ అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకర్ ఆత్మహత్య
-
NIMS: నిమ్స్ వైద్యురాలి ఆత్మహత్య!
హైదరాబాద్, సాక్షి: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్‌లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించారు. పక్కనే అనస్థీషియా మత్తు వాయిల్ పడి ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.అనస్థీషియా అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆమె చనిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రాచీ కర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు అయ్యింది. ప్రాచీ కర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, పలువురిని ప్రశ్నిస్తున్నారు. -
తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం
లక్డీకాపూల్ (హైదరాబాద్): తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పేద ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ, సంస్థకు మంచి గుర్తింపు తేవడానికి నిమ్స్ వైద్యులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శుక్రవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డీఎస్ఏ ల్యాబ్, యూఎస్ ఎయిడ్ సంస్థ సహకారంతో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్‌లతో పాటు రూ.2 కోట్ల విలువైన సీటీఐసీయూను ప్రారంభించారు. స్కిల్ ల్యాబ్‌లో సీపీఆర్ విధానాన్ని ఆయన స్వయంగా చేసి మెళకువలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్‌కు జాతీయస్థాయిలో బ్రాండ్ ఇమేజ్ ఉందని.. దాని కొనసాగింపునకు తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ, ఆసుపత్రులతో పాటు నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తోందని వివరించారు. నిమ్స్‌లో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ సిల్క్ లాబ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం కొత్తగా నియుక్తులైన 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 300 మంది స్టాఫ్ నర్సులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగం అధిపతి సాయి సతీశ్, యూఎస్ ఎయిడ్ డాక్టర్ వరప్రసాద్, హైదరాబాద్‌లోని అమెరికా కౌన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నిమ్స్, ప్రభుత్వ అనుసంధానకర్త డాక్టర్ మార్త రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్స్‌ను సందర్శించిన నిజాం మనవడు
సాక్షి, సిటీబ్యూరో: నిజాం మనవడు నవాబ్ నజీఫ్ అలీ ఖాన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సల శిబిరాన్ని విజయవంతం చేసినందుకు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అభినందించారు. యూకే నుంచి వచ్చిన కార్డియోథెరపిక్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద రోగులు, సమాజానికి ప్రయో జనం చేకూరేలా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇంచార్జ్, ఆర్ఎంఓ డాక్టర్ సల్మాన్ పాల్గొన్నారు. -
పుట్టిన 24 గంటలకే బైపాస్ సర్జరీ
లక్డీకాపూల్: గుండెలో రంధ్రంతో పుట్టిన ఒక రోజు వయసుగల ఆడశిశువుకు మంగళవారం నిమ్స్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. యూకేకు చెందిన ఆల్డర్ హే ఆస్పత్రి కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలోని వైద్య బృందం నిమ్స్ కార్డియోథిరాసిక్ సర్జన్ డాక్టర్ ఎ. అమరేశ్‌రావు, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్‌తో కలసి ఈ సర్జరీ చేపట్టింది. నిజామాబాద్ జిల్లా చిట్టాపూర్‌కు చెందిన ప్రశాంత్ గ్రూప్–2 ప్రిపరేషన్ కోసం తన భార్య సమీర శ్రావణితో కలసి హైదరాబాద్ వచ్చి ఇబ్రహీంపట్నంలో ఉంటున్నాడు. ఆయన భార్య సోమవారం ఉదయం ఆడశిశువు (సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా)కు జన్మనివ్వగా శిశువుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. అప్పటికే గుండె సంబంధ జబ్బులతో బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులకు చార్లెస్ హార్ట్ హీరోస్ పేరిట నిమ్స్‌లో యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని (ఈ నెల 24 మొదలు 30 వరకు) నిర్వహిస్తుండటంతో వారి ఆధ్వర్యంలో శిశువుకు బైపాస్ సర్జరీ చేశారు. కాగా, హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ (ఏపీ–తెలంగాణ) మంగళవారం నిమ్స్‌ను సందర్శించి డాక్టర్ రమణ, ఆయన బృందాన్ని కలిసి అభినందించారు. అలాగే గుండె సర్జరీ అనంతరం కోలుకుంటున్న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన చిన్నారి నిత్యను గారెత్ పరామర్శించారు. నవజాత శిశువులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. -
నిమ్స్‌లో చిన్నారుల గుండె ఆపరేషన్లు విజయవంతం
హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) చార్లీస్ హార్ట్ హీరోస్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో తొలి రోజు నలుగురు చిన్నారులకు ఉచితంగా గుండె సంబందిత శస్త్ర చికిత్సలు చేశారు. సోమవారం లండన్‌కు చెందిన గుండె వైద్యనిపుణులు డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలో నిమ్స్ కార్డియా థొరాసిక్ సర్జరీ విభాగం వైద్యులు నీలోఫర్ వైద్యులతో కలిసి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన లింగాల అవని(04), చత్తీస్‌ఘడ్‌కు చెందిన నిత్య(03), భువనగిరికి చెందిన యోగేష్(07), సిరిసిల్లకు చెందిన లక్ష్మీ ప్రసన్న(07)లకు ఆపరేషన్లు చేశారు. అనంతరం వారిని వార్డుకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నిరుపేద చిన్నారుల ప్రాధాన్యత క్రమంలో శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు నిమ్స్ కార్డియా థోరాసిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి డాక్టర్ ఎం. అమరేష్‌రావు అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మరో ముగ్గురికి గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. -
‘నిమ్స్ ది గ్రేట్’ : మంత్రి హరీష్‌రావు ప్రశంసలు..!
హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు. ఇందులో 61 లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్‌రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు. గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్‌బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం. హరీష్‌రావు మంత్రి ప్రశంసలు.. అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు. ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా.. ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్ -
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్‌లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్‌లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
‘తెలంగాణలో ఎప్పుడో సెల్ఫ్ డిక్లరేషన్ జరిగింది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్టీలు. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘‘ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దీని ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ద చూపిన సీఎస్ శాంతి కుమారి గారికి అభినందనలు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారి. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ మరియు ప్రకృతివైద్యం యొక్క అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయి. నిపుణులైన ఆయుష్ వైద్యుల ఆధ్వర్యంలో ఆయుర్వేద, ప్రకృతివైద్య ప్రక్రియలు, చికిత్సలను నిర్వహించడానికి అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. నిమ్స్ వెల్ నెస్ సెంటర్ ద్వారా విశ్రాంత సివిల్ సర్వెంట్లు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుతం వివిధ హోదాల్లో విధులను నిర్వర్తిస్తున్న వారు వైద్యం పొందుతున్నారు ప్రభుత్వం అలోపతి వైద్యంతో పాటు, ఆయుష్ వైద్యం ను ఎంతో ప్రోత్సహిస్తున్నది. ఇటీవల రూ. 10 కోట్లతో నేచర్ క్యూర్ ఆసుపత్రిని అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు వైద్య రంగం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అరోగ్య రంగం దిన దినాభివృద్ది చెందుతోంది. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ తుది దశకు చేరింది. ఒకే రోజు ఒకే వేదిక నుండి సీఎం గారి చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాం. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 26కు చేరుతుంది. కొత్తగా 900 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 2014లో 850 ఎంబిబిఎస్ సీట్ల నుంచి నుండి ఇప్పుడు 3915 సీట్లు పెరుగుదల ఉంది. అంటే 6 రెట్లు అధికంగా సీట్లు అందుబాటులోకి వచ్చాయి. హెల్త్ హబ్ గా తెలంగాణ మారుతున్నది. వైద్యంతో పాటు, వైద్య విద్య కు తెలంగాణ చిరునామా అవుతోంది. మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఎం సి హెచ్ లు, బస్తీ దవాఖానలు ఇలా పట్టణం నుండి పల్లె దాకా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశాం. రాబోయే రోజుల్లో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతున్నది. కాంగ్రెస్,బీజేపీలు కేవలం నినాదాల పార్టీలు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ. నకిలీ హామీలు వెకిలి చేష్టలతో ఆ రెండు పార్టీలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయి. అమిత్ షా ,ఖర్గేలు పర్యాటాకుల్లా వచ్చి పోయారు ..అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారు. అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంటు కష్టాల గురించి ప్రతి రోజూ పేపర్ లో వార్తలే. గుజరాత్ లో బీజేపీ గుడ్డి పాలన ను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారు. కర్ణాటక లో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయింది. కర్ణాటక లో బీజేపీకి ప్రత్యమ్నాయంగా వేరే పార్టీ లేక కాంగ్రెస్ ను ఓటర్లు నమ్మారు. ముందు ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలి. తెలంగాణలో కేసీఆర్ ను విమర్శించాలంటే తమ తమ రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేసి ఉండాలి. తమ రాష్ట్రాల్లో ఏది చేసినా చెల్లుతుందని ఇక్కడకొచ్చి ఏది మాట్లాడినా జనాలు నమ్ముతారు అనుకుంటే పొరపాటు. తెలంగాణ ప్రజలు మీ మాయ మాటలకు లొంగే పరిస్థితి లేదు. మీ డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ..ప్రజలు బీఆర్ఎస్ కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు. అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. -
నిమ్స్‌కు రూ.1,800 కోట్ల రుణం మంజూరు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిజాం వైద్య విజ్ఞా న సంస్థ (నిమ్స్) విస్తరణ పనులకు రూ. 1,800 కోట్లు రుణాన్ని మహారాష్ట్ర బ్యాంక్ మంజూరు చేసింది. నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించతలపెట్టిన 2 వేల పడకల దశాబ్ది బ్లాక్‌కు సీఎం కేసీఆర్ జూన్ 14న భూమి పూజ చేశారు. నిమ్స్‌కు కేటాయించిన 33 ఎకరాల్లో విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు. ఇందుకు ఆర్అండ్బీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ఈనెల 31న టెండర్లను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ రుణ మొత్తాన్ని నిమ్స్ నిరీ్ణత కాల వ్యవధిలో బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు చేస్తున్న కృషిలో భాగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు నిమ్స్ ప్రత్యేకంగా ఓ రిటైర్డ్ ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. -
చావుకబురు చల్లగా.. చేతులెత్తేసిన వైద్యులు..
హనమకొండ: రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం అది. రోజువారీగా కూలీకి వెళ్తేనే వారికి పూట గడిచే ఆ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఇందులో రెండో కుమారుడు కుటుంబ కలహాలతో ఇటీవల పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు రూ. 8 లక్షల వరకు ఖర్చు అయింది. దీంతో దిక్కుతోచని పరిస్థితి.. పైగా చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి..ఈ క్రమంలో తండ్రి ఎవరిని అప్పు అడిగిన లభించలేదు. దీంతో తన కుమారుడి ఆరోగ్యం కంటే ఏదీఎక్కువ కాదని భావించి గ్రామంలో తమకున్న తాతల నాటి ఆస్తి 30 గుంటల భూమిని అమ్మకానికి పెట్టాడు. వచ్చిన డబ్బుతో సరాసరి ఆస్పత్రికి వెళ్లి చెల్లించాడు. అయితే డబ్బు తీసుకున్న అనంతరం ఆస్పత్రి యాజమాన్యం చావు కబురు చల్లగా చెప్పారు. క్షతగాత్రుడికి వైద్యం చేయలేమని చేతులేత్తేశారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో చేసేది లేమీ లేక మరో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూమిజాగా అమ్మినా బతుకలేకపోతివి కదా కొడుకా అంటూ తల్లిండ్రులు మృతదేహంపై రోదించిన తీరు ప్రతీ ఒక్కరిని కదలించింది. బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన చెవుల నర్సయ్య, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. రెండో కుమారుడు చెవుల సురేష్(27) హైదరాబాద్‌లో పెయింటింగ్ పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం హైదరాబాద్ మల్కాజిగిరి కౌపూర్ గ్రామానికి చెందిన ప్రియాంకను వివాహం చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 28న కుటుంబ కలహాల నేపథ్యంలో గడ్డి మందు తాగగా వాంతులు విరేచనాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సురేష్‌ను హైదరాబాద్ ఈసీఎల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ రూ.8 లక్షల వరకు ఖర్చు అయింది. దీంతో తండ్రి నర్సయ్య గ్రామంలో తమకున్న 30 గుంటల భూమిని విక్రయించి ఆస్పత్రి బిల్లు చెల్లించాడు. అయితే బిల్లు చెల్లించిన అనంతరం అక్కడి వైద్యులు చేతులు ఎత్తివేశారు. దీంతో వెంటనే సురేష్‌ను పంజాగుట్టలోని నిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స ఆదివారం పొందుతూ మృతి చెందాడు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేసీఆర్ తవ్వగా.. హరీశ్ ఎత్తగా..
సాక్షి, సిటీబ్యూరో/లక్డీకాపూల్: ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) ప్రాంగణంలో ‘దశాబ్ది’ బ్లాక్ నిర్మాణ పనులకు బుధవారం ఉదయం 11.44 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సీఎం గడ్డపారతో తవ్వగా మంత్రి హరీశ్‌రావు పారతో మట్టిని ఎత్తారు. కేసీఆర్ చేతుల మీదుగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పునాదిరాళ్లను వేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన వైద్యారోగ్య దినోత్సవ సభలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, సోమేష్‌కుమార్, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ముఖ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, డాక్టర్ మార్త రమేష్ తదితరులు పాల్గొన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల కోసం రూపొందించిన తొమ్మిది రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం నగరానికి చెందిన గర్భిణులు పార్వతమ్మ (ఉదయ్ నగర్ కాలనీ), ఫర్వీన్ (బాలానగర్), శిరీష (ఎన్బీటీనగర్), తేజస్వీ (ప్రతాప్‌నగర్), సుజాత (శ్రీరాంనగర్), రేణుక (అంబేడ్కర్‌నగర్)లకు కిట్లను ఆయన అందజేశారు. అధునాతన చికిత్సలకు కేరాఫ్ అడ్రస్‌గా నిమ్స్: డైరెక్టర్ బీరప్ప తెలంగాణ ఉద్యమానికి నిమ్స్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, చావు నోట్లో తలపెట్టిన సమయంలో నిమ్స్ తన వంతు సేవలు అందించింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో నిమ్స్‌లో 900 పడకలు ఉండేవి. ఆ తర్వాత 1,500 పడకలకు చేరాయి. చికిత్సలు 108 శాతం పెరిగాయి. బోధన సిబ్బంది సంఖ్య 111 నుంచి 306కు పెరిగింది. పీజీ సీట్లు 82 నుంచి 169కు చేరాయి. కొత్తగా ఆరు విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీలో అత్యధిక చికిత్సలు అందిస్తున్న సంస్థ నిమ్సే. అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయి. గుండె, కిడ్నీ, బోన్మ్యా రో, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయి. జీవితకాలం ఉచితంగా మందులు అందజేస్తున్నాం. తుంటి, కీళ్లు చికిత్సలు, గూని వంటి ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దక్షణాదిలో అత్యధికం. డయాలసిస్ సేవలు 30 వేల నుంచి 1.20 లక్షలకు చేరుకున్నాయి. ఆస్పత్రిలో నెలకు 1.50 లక్షల రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. డైరెక్టర్‌గా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోను. మేం కిట్లు పంచుతుంటే.. వాళ్లు తిట్లు పంచుతున్నారు: మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ నగరం ప్రస్తుతం వ్యాక్సిన్, ఫార్మా హబ్‌గా ఉంది. రాబోయే రోజుల్లో హెల్త్ హబ్‌గా మారబోతోంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు వైద్య విద్య కోసం చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లేవారు. ప్రస్తుతం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది. గతంలో 2,853 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్యను 8,340కి పెంచాం. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను కూడా 50 వేలకు పెంచాం. వచ్చే ఏడాది మరో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్నాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ సహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఫార్మా, నర్సింగ్ వంటి అనుబంధ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు, రక్తహీనతతో బాధపడే గర్భిణులకు మేం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు ఇస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తిట్లు పంచుతున్నాయి. -
దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిలలో ఒకటిగా నిమ్స్
-
నిమ్స్‌లో బ్యాటరీ కార్లు
లక్డీకాపూల్ : నిమ్స్‌లో చికిత్సకు వచ్చే రోగుల సౌకర్యార్థం బ్యాటరీ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద కార్లను ఏర్పాటు చేయనున్నారు. నిమ్స్ లోపలికి ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని నియంత్రించే క్రమంలో బ్యాటరీ కార్లను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఆటోలు, క్యాబ్‌లను నియంత్రించేందుకు యాజమాన్యం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఆస్పత్రి ప్రాంగణంలో జటిలంగా తయారైన ట్రాఫిక్ సమస్యను సైతం చక్కదిద్దే క్రమంలో వినూత్న చర్యలకు ప్రణాళికలను సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా జూన్ మొదటి వారంలో అందుబాటులో రానున్న బ్యాటరీ కార్లు రోగుల అవసరాలను తీర్చే విధంగా దోహదపడతాయి. ఈ కార్ల సేవలు నగరంలో ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రి రంగంలో తొలిసారిగా నిమ్స్ ప్రవేశపెట్టనుంది. ఆంధ్రా బ్యాంకు అయిదు బ్యాటరీ కార్లను సమకూర్చనుంది. కొంత మంది దాతలు ఈ కార్లను సమకూర్చేందుకు ముందుకు వస్తున్నారని, ఇప్పటికి కొన్ని సేవలకు సిద్ధంగా ఉన్నాయని నిమ్స్ ఇన్‌చార్జిర్జి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, నిమ్స్ ఏపీఆర్ సత్యాగౌడ్ తెలిపారు. ఎర్రమంజిల్ కాలనీలో రవీంద్రనాథ్ ఠాకూర్ స్కూల్ కొనసాగిన ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 2 వేల పడకల బహుళ అంతస్తుల సముదాయానికి వచ్చే నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేస్తారని చెప్పారు. -
నిమ్స్ లో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు
-
నాలుగు నెలలు 50 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు
లక్డీకాపూల్ : అరుదైన రికార్డులకు చిరునామాగా నిలిచే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్) మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత నాలుగు నెలల్లో 50 మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15 లక్షలు ఖర్చయ్యే సర్జరీని పైసా ఖర్చు లేకుండా చేయడం విశేషం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం సాధ్యం కాని ఈ అవయవ మార్పిడి ఆపరేషన్లతో 50 మంది జీవితాల్లో వెలుగులు నింపినట్లయింది. 2014 నుంచి ఇప్పటివరకు 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి.గత ఏడాది 93 ఆపరేషన్లు జరగ్గా, ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే 50 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూత్రపిండ మార్పిడి ఆపరేషన్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నారు. నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో వైద్య బృందం విశేషమైన సేవలు అందిస్తూ నిమ్స్ ఖ్యాతిని మరింత పెంచడంతో సఫలీకృతులవుతున్నారు. కాగా, 4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి, పునర్జన్మను ప్రసాదించిన నిమ్స్ వైద్యులను మంత్రి హరీశ్ రావు అభినందించారు. -
చీమలపాడు దుర్ఘటనలో మరొకరు మృతి
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ నెల 12న బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం సందర్భంగా బాణాసంచా కాల్చే క్రమంలో సిలిండర్ పేలిన ఘటనలో మృతులసంఖ్య నాలుగుకు చేరింది. ఘటన జరిగిన రోజే ముగ్గురు మృతి చెందగా, రెండుకాళ్లు కోల్పోయి తీవ్రంగా గాయపడిన చిందివారి సందీప్(36) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అతడికి భార్య మమత అలియాస్ మొమీన్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేయి తాలూకా మింగరి గ్రామానికి చెందిన చిందివారి సందీప్ బతుకుదెరువు కోసం పదిహేనేళ్ల క్రితం తెలంగాణకు వచ్చాడు. తల్లిదండ్రులు, సోదరి పోషణ బాధ్యతలు సందీప్ చూసు కుంటున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సందీప్ సుతారీ పనులు చేసే క్రమంలో ఒడిశా ప్రాంతానికి చెంది మొమీన్ పరిచయం కావటంతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కృష్ణ ఉన్నాడు. ఏడాది క్రితం పొట్ట చేతపట్టుకొని కారేపల్లి మండలం చీమలపాడుకు సందీప్, మొమీన్ వచ్చారు. భార్య గ్రామంలో వ్యవసాయకూలీ పనులకు వెళ్తుండగా, సందీ ప్ సుతారీ పనులు చేసేవాడు. ఈ నెల 12న మొమీన్ మిర్చి తోటలో పనికి వెళ్లగా, గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి సందీప్ హాజరయ్యాడు. ఆరోజు గుడిసె కాలి పోతుండటంతో అందరితోపాటు మంటలు ఆర్పే క్రమంలో సిలిండర్ శకలాలు దూసుకురావడంతో సందీప్ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తొలుత ఖమ్మం ప్రభు త్వ ఆస్పత్రికి, తర్వాత నిమ్స్‌కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. ఊరుగాని ఊరిలో భర్తను కోల్పోయిన మొమీన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
కాటేస్తున్న కల్తీ కల్లు.. వణికిపోతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కల్తీ కల్లు ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరుకి చెందిన హరిజన ఆశన్న (58) మృతిచెందగా.. బుధవారం మరో మహిళ, మరో యువకుడు మరణించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స చేసినా ఫలితం లేక.. మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్ (29) ఈ నెల ఏడో తేదీన వింతగా ప్రవర్తిస్తూ జిల్లా ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం వెంటనే అతడిని వైద్యులు ఇంటికి పంపించారు. అయితే తెల్లారి కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో బంధువులు మళ్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచీ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. విష్ణుప్రకాశ్ భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో పోస్టల్ శాఖ ఏబీపీఎంగా ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చిన్నతనంలోనే చనిపోగా.. తపాలా శాఖలోనే పనిచేసే తండ్రి కూడా కొన్నాళ్ల క్రితమే మరణించాడు. తండ్రి స్థానంలో విష్ణుప్రకాశ్ ఉద్యోగంలో చేరాడు. అయితే అతనికి పెళ్లి కాకపోవడం, ఒంటరితనంతో మందు కల్లుకు బానిస అయినట్లు తెలుస్తోంది. అయితే ఫిట్స్ (మూర్ఛ) రావడంతో విష్ణుప్రకాశ్‌ను ఆస్పత్రిలో చేర్పిం చగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని మేనత్త భువనేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్ రూరల్ మండలం దొడ్డలోనిపల్లికి చెందిన రేణుక (55) కూడా బుధవారం రాత్రి మృతి చెందింది. మరోవైపు జడ్చర్ల మండలం మల్లెబోనిపల్లికి చెందిన రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. కాగా జనరల్ ఆస్పత్రిలోని సాధారణ వార్డుల్లో మరో పది మంది వరకు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో మెటబాలిక్ ఎన్సెఫలోపతి లక్షణాలు ఉన్నాయని.. పోస్టుమార్టం అనంతరం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తెలిపారు. ఆస్పత్రిలో చేరాలంటే చెప్పినట్లు వినాలి..! కల్తీ కల్లు అలవాటుతో మహబూబ్‌నగర్ మండలంలోని దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లి, కోయనగర్, అంబేడ్కర్ నగర్ కాలనీలతో పాటు జడ్చర్ల, నవాబ్‌పేట మండలాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వ చ్చారు. తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు వారిలో ఉ న్నాయి. ఇది గమనించిన వైద్యులు బాధితులతో వచ్చి న సహా యకులకు ముందస్తు సూచనలు చేసినట్లు సమాచారం. ‘ఎవరడిగినా కల్తీ కల్లు కాదు.. ఎండదెబ్బ తాకింది.. కడుపునొప్పి, ఫిట్స్‌తో వచ్చి నట్లు చెప్పాలి.. అలా అయితేనే చికిత్స అందజేస్తాం.. లేకుంటే వేరే హాస్పిటల్‌కు వెళ్లొచ్చు..’అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆశన్న, విష్ణుప్రకాశ్ బంధువులు కూడా డాక్టర్ల సూచన మేరకే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బాధితులు! కల్తీ కల్లుకు అలవాటు పడిన పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది 40 నుంచి 50 మంది వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చేరితే బయటకు తెలుస్తుందని.. పరువు పోతుందనే కారణంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. -
హైదరాబాద్ నిమ్స్ కు బలగం మొగిలయ్య తరలింపు..
-
సర్కార్ సర్జరీ సూపర్.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యం
సాక్షి హైదరాబాద్ : భాగ్యనగరంలోని ప్రభుత్వాస్పత్రులు ఆధునిక చికిత్సలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా’కు అనే స్థాయి నుంచి ‘పోదాం పద సర్కారు దవాఖానాకు’ అనే దశకు చేరుకున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా క్లిష్టమైన ఆపరేషన్లను సైతం చేస్తూ రోగులకు పునర్జన్మనిస్తున్నాయి. నిష్ణాతులైన వైద్య బృందాలతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో కొంతకాలంగా అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఉస్మానియా, గాందీల్లో పూర్తి ఉచితంగా నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా తక్కువ మొత్తంలో ఆపరే షన్లు చేస్తున్నారు. కుటుంబసభ్యుల అవయవదానం, జీవన్‌దాన్ ద్వారా రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వాటిల్లో కొన్నింటిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 8 నెలల చిన్నారికి అరుదైన వైద్యం జగిత్యాల జిల్లాకు చెందిన నారాయణ, ప్రేమలత దంపతులది మేనరిక వివాహం. వారి 8 నెలల పాప నిస్ సిండ్రోమ్ అనే అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో నిలోఫర్‌కు వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు వెళ్లమన్నారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పాపకు పునర్జన్మను ప్రసాదించారు. ఇలాంటి వ్యాధి ప్రపంచంలోనే నాలుగోది కాగా, భారత్‌లో మొదటిదని వైద్యులు తెలిపారు. లక్షలు ఖరీదుచేసే ఆపరేషన్‌ను రూపాయి కూడా తీసుకోకుండా 28 మంది వైద్యులు దాదాపు 18 గంటలపాటు సర్జరీ పూర్తి చేసి తమ పాపకు మళ్లీ జీవం పోశారని ఆ చిన్నారి తల్లి పేర్కొంది. 2 నెలల్లో 70 కిలోలు తగ్గింపు గుడిమల్కాపూర్‌కు చెందిన శివరాజ్‌సింగ్ కుమారుడు మునీందర్‌సింగ్ ఐదేళ్ల ప్రాయం నుంచి అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నాడు. 23 ఏళ్లకు దాదాపు 220 కిలోలతో నడవలేని స్థితికి చేరాడు. కుటుంబసభ్యులు అతడిని ఉస్మానియాలో చేర్పించారు. చిన్నతనం నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తోపాటు శ్వాస సమస్యలు ఉన్నాయి. ఉస్మానియా వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. 2 నెలల్లోనే దాదాపు 70 కిలోల బరువు తగ్గాడు. ‘నన్ను చూసి చాలా మంది హేళన చేసేవారు. ఉచితంగా సర్జరీ చేసిన ఉస్మానియా వైద్యులకు కృతజ్ఞతలు’అని మునీందర్‌సింగ్ సంతోషంగా చెప్పాడు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో.. బోరబండకు చెందిన మల్లెల వాణి కాలేయంలో కుడివైపు పెద్ద కణితితో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతాయనడంతో ఆమె ఉస్మానియాకు వెళ్లింది. సాధారణంగా ఎడమ వైపు కణితి ఏర్పడే అవకాశం ఉండగా వాణికి కుడివైపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. లాపరోస్కోపీ ద్వారా శస్త్రచికిత్సను పూర్తి చేయడంతో రోగి వారంలోనే కోలుకుంది. ఓ ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. రోజువారీ పని చేసుకుంటూ జీవిస్తున్న తనకు ఆపరేషన్ ఉచితంగా చేయడం పూర్వజన్మ సుకృతమని వాణి పేర్కొంది. ఆరోగ్యశ్రీతో గుండె మార్పిడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నర్సింహులు కుమారుడు వరుణ్‌తేజ్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు ఆ స్కూల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వరుణ్‌తేజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు వస్తే ఆపరేషన్ చేస్తామనడంతో కుటుంబసభ్యులు వరుణ్‌ను తీసుకెళ్లారు. ఒక్కరోజుకే అక్కడ రూ.10 వేలు ఖర్చవడంతో బంధువుల సలహా మేరకు వారు నిమ్స్‌ను ఆశ్రయించారు. కార్డియో థొరాసిక్ విభాగం వైద్యులు వరుణ్‌తేజ్‌కు ఆరోగ్యశ్రీ కింద గత నెల 28న గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం కుదుటపడటంతో రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేశామని నిమ్స్ సీటీ సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ అమరే‹శ్ మాలెంపాటి తెలిపారు. ఒకే నెలలో 15 కిడ్నీల మార్పిడి దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను చేసి నిమ్స్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా యురాలజీ, నెఫ్రాలజీ, అనస్తీషియా విభాగాలను మంత్రి హరీశ్‌రావు ఇటీవలే అభినందించారు. 2014 నుంచి ఇప్పటివరకు కిడ్నీ మార్పిళ్లు 839 (నిమ్స్), 700 (ఉస్మానియా) కాలేయ మార్పిళ్లు 25 (నిమ్స్), 26 (ఉస్మానియా) జరిగాయి. నిమ్స్‌లో గుండె (10), ఊపిరితిత్తుల మార్పిడి (01) శస్త్రచికిత్సలు జరిగాయి. దక్షిణాదిలోకెల్లా రికార్డు.. స్కోలియోసిస్ (గూని)తో ఇబ్బంది పడేవారికి చేసే వెన్నుపూస సర్జరీ చాలా క్లిష్టమైనది. సుమారు 12–14 గంటలు పడుతుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ రోగి రెండు కాళ్లు చచ్చుబడే ప్రమాదముంటుంది. నిమ్స్‌లో మూడేళ్లుగా 200 మందికి ఈ సర్జరీలు చేశారు. గత ఏడాదిలో ఏకంగా 80 సర్జరీలు నిర్వహించి దక్షిణాదిలో రికార్డు సొంతం చేసుకుందని ఆర్థోపెడిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగేష్ తెలిపారు. నిజాం కాలంలో బొక్కల దవాఖానా (ఆర్థోపెడిక్)గా ప్రారంభమైన నిమ్స్ నేడు వేర్వేరు సర్జరీలకు వేదికైందన్నారు. ఏడాదికి హిప్, నీ రీ ప్లేస్మెంట్లు 350, వెన్నెముక 80, ట్రామా 3వేలు, ఆంకాలజీ 60 చొప్పున సర్జరీలు నిర్వహిస్తూ తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటోందని నాగేశ్ తెలిపారు. 18 గంటలపాటు శ్రమించి.. కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఎక్కలూరు సత్యమయ్య (61) పోస్టల్ శాఖలో రికరింగ్ డిపాజిట్ ఏజెంట్. ఏడాది క్రితం కాళ్లు, చేతులు వాచిపోవడంతో కుటుంబసభ్యులు కర్నూలులోని ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. సత్యమయ్యకు హెపటైటీస్ బి, లివర్ సిర్రోసిస్, కాలేయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించి కాలేయ మార్పిడి చేయాలన్నారు. వెస్ట్ మారేడుపల్లికి చెందిన అభిజిత్ (20) అనే యువకుడు బ్రెయిన్‌డెడ్ అవడంతో అవయవదానానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో నిమ్స్, ఉస్మానియా వైద్యులు సంయుక్తంగా 18 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సత్యమయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. గాందీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ గాందీలో రూ.35 కోట్లతో స్టేట్‌ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. 4 ఆత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, స్టెప్‌డౌన్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు లు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఒకేచోట గుండె, మూత్రపిండాలు, తుంటి, కీళ్ల మార్పిడి, ఊపిరితిత్తులు, కాలేయం శస్త్రచికిత్సలు, కాక్లియర్ వంటి కృత్రిమ అవయవాల ఏర్పాటుతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. రెండోదశలో రొబోటిక్ ఆపరేషన్ థియేటర్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం. –ప్రొ.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్రీతి కేసులో ట్విస్ట్.. కళ్లకు టేప్ ఎందుకు వేశారు: ప్రీతి సోదరుడు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ విద్యార్థిని ప్రీతీ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో ఎలాంటి విషపదార్థాలు డిటెక్ట్ కాలేదని రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. దీంతో, కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇక, ఆసుపత్రిలో ప్రీతి ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసిందే. ఇక, టాక్సికాలజీ రిపోర్టుపై ప్రీతి కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు. ప్రీతిది హత్యే అని వారు చెబుతున్నారు. ఇక, ప్రీతి సోదరుడు పృధ్వీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘ప్రీతికి నిమ్స్‌లో బ్లడ్ డయాలసిస్ చేసి, ప్లాజ్మా కూడా చేశారు. దీని వల్లే రిపోర్టులో విష పదార్ధాలు ఏమీ లేదని వచ్చింది. శరీరం మొత్తం క్లీన్ చేసి రిపోర్టు తీస్తే ఏం ఉంటుంది. గవర్నర్ రాక ముందే డయాలసిస్ చేశారు. మాకు తెలియని విషయాలు కూడా పోలీసులు మాకు చెప్పారు. ప్రీతి కళ్లకు టేప్ ఎందుకు వేశారు. ఆ నాలుగు గంటల పాటు ఏమైందో మాకు ఎందుకు చెప్పడం లేదు. మాకు ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే డీజీపీ వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫోన్ కూడా చేశారు. -
100 రోజులకు చేరిన నిమ్స్ ఉద్యోగుల నిరసన
లక్డీకాపూల్ : తమకు న్యాయం చేయాలని కోరుతూ నిమ్స్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకుంది. తమను జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) కిందకు తీసుకురావాలని డిమాండ్ వంద రోజులుగా హధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేస్తున్నారు. పెన్షన్ సదుపాయాన్ని ఈపీఎఫ్ నుంచి నిమ్స్‌కు మార్చాలని డిమాండ్ డిమాండ్ చేశారు. గతంలో నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది 32 మంది, డాక్టర్లు 12 మందికి కల్పించిన విధంగానే తమకు కూడా నిమ్స్ పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ బాధితుల ప్రతినిధులు, శాంతి కుమారి, మధు కుమార్ తదితరులు మాట్లాడారు. -
ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే..
వైద్యవృత్తితో పది మందికి సేవా చేయాలనే కోరికతో, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం ప్రీతి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకర ఘటనపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రీతి ఇలా చేయడానికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగింది? జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వలస వచ్చారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్ 18న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్ క్లాస్‌లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజెక్షన్ కావాలని స్టాఫ్ నర్సును అడిగింది. అయితే, ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్‌తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్‌డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్‌కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ వాయిల్స్ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్‌లో సక్సినైల్‌కోలిన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే.. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్‌కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ..సైఫ్ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. నిమ్స్ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన నిమ్స్ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కల్పించుకుంటూ ‘అయితే.. డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. రిమాండ్‌లో ఉన్న నిందితుడు ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. -
చర్చలు సఫలం.. గాంధీ ఆస్పత్రికి ప్రీతి మృతదేహం తరలింపు
వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ప్రీతి మరణానికి గల కారణాలు వివరించాలని.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రీతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మంత్రులు వారితో చర్చలు జరిపారు. చివరికి బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అయితే ఎట్టకేలకు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రీతి డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేయనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రీతి తల్లిదండ్రులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును విచారణ చేపడతామని తెలిపింది. -
నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డాక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం
వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాత్రి 9.10 గంటలకు ఆమె తుదిశ్వస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ప్రీతికి చికిత్స అందించిన నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆమె మృతి చెందిన విషయాన్ని చెప్పేందుకు తల్లిదండ్రులను ఐసీయూలోకి రావాలని వైద్యులు సూచించారు. కానీ ప్రీతి ఎలా చనిపోయిందన్న విషయాన్ని చెప్పాలని అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని తేల్లి చెప్పారు ఆమె తల్లిదండ్రులు. హెచ్వోడిపై కేసు నమోదు చేయాలని ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తనని లోపలికి అనుమతించడం లేదని ప్రీతి సోదరుడు వాపోయారు. ఐసీయూ వద్ద ప్రీతి తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతోంది. అయితే కాసేపట్లో ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రీతి మరణవార్త విన్న తెలియడంతో ఆమె గ్రామంలో ఆందోళనకు దిగారు గ్రామస్థులు. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వపరంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్ట చేశారు. -
మెడికో ప్రీతి కన్నుమూత.. మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని
సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) కన్నుమూసింది. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రాణాలు విడిచినట్టు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీనితో ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పాలని, నిందితుడు సైఫ్, కాకతీయ మెడికల్ కాలేజీ అనస్తీíÙయా విభాగం హెడ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు చేపట్టేదాకా మృతదేహాన్ని తరలించబోమంటూ నిమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. దీనితో ఆదివారం అర్ధరాత్రి తర్వాతా నిమ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలేం జరిగింది? జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిరి్నతండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వలస వచ్చారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్ 18న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్ క్లాస్‌లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీíÙయా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజెక్షన్ కావాలని స్టాఫ్ నర్సును అడిగింది. అయితే ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్‌తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్‌డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్‌కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ వాయిల్స్ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్‌లో సక్సినైల్‌కోలిన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే.. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్‌కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయతి్నంచారు. కానీ ఫలితం లేకపోయింది. రిమాండ్‌లో ఉన్న నిందితుడు ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ..సైఫ్ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. అవయవాలన్నీ దెబ్బతినడంతోనే.. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించిందని, అయినా ఫలితం లేకపోయిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ప్రీతి డ్యూటీలో ఉండగా తన వద్ద ఉన్న సక్సినైల్‌కోలైన్ ఇంజక్షన్ తీసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని, ఆస్పత్రికి తీసుకొచి్చన తర్వాత వెంటిలేటర్‌పై, ఎక్మో యంత్రంపై అత్యవసర వైద్యసేవలు అందించామని తెలిపారు. మొత్తంగా ఆమె నాలుగు సార్లు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)కు గురైందని, అందులో నిమ్స్‌కు రాకముందే రెండుసార్లు వచ్చిందని వివరించారు. ప్రీతి తీసుకున్న మత్తు ఇంజక్షన్ కారణంగా గుండె రక్తం పంప్ చేసే సామర్థ్యం (ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ హార్ట్) 28శాతానికి పడిపోయిందని.. గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటిస్, ఊపిరితిత్తుల సమస్య ఏర్పడినట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ప్రీతి అప్పటికే థైరాయిడ్, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టు గుర్తించామని వివరించారు. నిమ్స్ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన నిమ్స్ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కలి్పంచుకుంటూ ‘అయితే.. డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. నిమ్స్ వద్ద ఆందోళన.. ఉద్రిక్తత ప్రీతి మృతి చెందినట్టుగా ప్రకటించిన నిమ్స్ వైద్యులు మృతదేహాన్ని నేరుగా వరంగల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చి మృతదేహాన్ని చూసి సంతకం పెట్టాలని తల్లిదండ్రులను కోరారు. కానీ ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు దీనికి నిరాకరించారు. ప్రీతి మృతికి అసలు కారణమేంటో తేల్చాలని, ఏ ఇంజెక్షన్ తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆర్ఐసీయూ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్పటిదాకా మృతదేహాన్ని తరలించనివ్వబోమన్నారు. ప్రీతిని వేధించిన సైఫ్, మరో ఏడుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కేఎంసీ అనస్తీషియా విభాగం హెడ్‌ను సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారికి వైద్య విద్యార్థులు, గిరిజన సంఘాల నేతలు, కార్యకర్తలు, ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాలు, బీజేపీ నేతలు మద్దతుగా నిలవడంతో ఆదివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గిరిజన సంఘాల నేతలు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయతి్నంచినా ఎవరూ ఆందోళన విరమించలేదు. దీనితో భారీగా బలగాలను మోహరించారు. మృతదేహాన్ని బయటికి తెచ్చి.. మళ్లీ లోపలికి.. నిమ్స్‌లో ఓ వైపు ఆందోళన జరుగుతుండగానే.. మరోవైపు వైద్యులు, పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయతి్నంచారు. దీంతో ఆందోళనకారులు అక్కడికి వచ్చిన అంబులెన్స్ ముందు బైఠాయించి, దానిని వెనక్కి పంపారు. దీనితో అధికారులు మరో అంబులెన్స్‌ను తీసుకురాగా.. మృతదేహాన్ని ఆర్ఐసీయూ నుంచి బయటికి తీసుకురాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆర్ఐసీయూ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిమ్స్‌లో రోగులకు వైద్య సేవలు అందించడంలో అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆందోళన విరమించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం వచ్చే రోగులకు ఇబ్బందికలుగుతోందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రికి మృతదేహం సోమవారం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. -
ప్రీతి కేసు.. ఠాగూర్ సినిమాలెక్కుంది!
సాక్షి, హైదరాబాద్: పీజీ డాక్టర్ ప్రీతికి అందుతున్న చికిత్స విషయంలో నిమ్స్ వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇది ఠాగూర్ సినిమా లెక్కుందని ఆమె బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. ఇక.. నిన్నటిదాకా ఆమె బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, ఇవాళేమో హఠాత్తుగా బ్రెయిన్‌డెడ్ అయ్యిందని చెప్తున్నారని ఆమె తండ్రి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కాసేపట్లో ప్రీతి ఆరోగ్య స్థితిపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డాక్టర్లు మాకేమో ఒకటి చెప్తున్నారు. ఆస్పత్రి చుట్టూ పోలీసులను పెడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి మా అమ్మాయిని బతికించాలనే ఉద్దేశం ఉంటే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేది. కానీ, అలా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఠాగూర్ సినిమా లెక్కే ఉంది అని ప్రీతి బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. మరోవైపు ప్రీతికి నిమ్స్‌లో సరైన చికిత్స అందడం లేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రీతి కుటుంబ సభ్యులకు పరామర్శ సందర్భంగా మీడియా ముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెరుగైన చికిత్స పేరిట వరంగల్ ఎంజీఎం నుంచి ప్రీతిని హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స అందిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగానే ఉందటూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు. అయితే తమకు మాత్రం ప్రీతి బ్రతుకుతుందనే భరోసా ఇస్తూ.. ఇప్పుడు హఠాత్తుగా బ్రెయిన్ డెడ్, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పడంపై ఆమె కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గాంధీకి ప్రీతి! ఇదిలా ఉంటే నిమ్స్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో.. ఏ క్షణమైనా ప్రీతిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఏది అనేది కాసేపట్లో నిమ్స్ వైద్యులు విడుదల చేసే బులిటెన్.. కీలక ప్రకటనపైనే ఆధారపడి ఉంది. -
ప్రీతి బ్రెయిన్‌డెడ్!.. నిమ్స్ వద్ద భారీగా పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ర్యాంగింగ్ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయడం, గత ఐదురోజులుగా నగరంలోని నిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ ఆమె ఆరోగ్య స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బ్రెయిడ్ డెడ్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేది. కానీ, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆశలు వదిలేసుకున్నాం ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. ‘‘ప్రీతిని సైఫే హత్య చేశాడు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూను హెచ్‌వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారు. సరికదా.. ఘటన తర్వాత కూడా మాకు టైంకి సమాచారం అందించలేదు. ప్రీతి మొబైల్లో వాళ్లకు కావాల్సినట్లుగా సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల’’ని డిమాండ్ చేశారాయన. కాసేపట్లో ప్రీతి హెల్త్ బులిటెన్‌పై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిమ్స్ డైరెక్టర్, పోలీసులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే! అని ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారాయన. ఇక ప్రీతి ఘటన బాధాకరమన్న మంత్రి.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పూర్తిగా బంద్ కాలేదు : ఈటల
-
ప్రీతి ఘటనపై న్యాయ విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో పీజీ డాక్టర్ ప్రీతికి సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అంతేకాదు ప్రీతి ఘటనపై న్యాయ విచారణ జరపాలని తెలంగాణ సర్కార్‌ను డిమాండ్ చేశారాయన. ఆదివారం నిమ్స్‌కు వెళ్లిన ఆయన.. ప్రీతి తల్లిదండ్రుల్ని పరామర్శించి, ఆమె ఆరోగ్యస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఈటల కామెంట్స్.. మెడికల్ యూజీ.. పీజీ కాలేజీల్లో ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో సరిపడా వైద్యులు లేరు.. భారమంతా పీజీ విద్యార్థులపైనే పడుతోంది. ప్రీతి ఘటనను ఈ ప్రభుత్వం సీరియస్‌గా భావించాలి. గిరిజన విద్యార్థిని అయిన ప్రీతిపై.. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ వేధించాడు. ఆ కారణంగా ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. హెచ్‌వోడీ, ప్రిన్సిపాల్, పేరెంట్స్ సహా అందరికీ సైఫ్ వేధింపుల గురించి ప్రీతి చెప్పింది. అంటే.. వైద్య కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ వేధింపులు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. పైఅధికారులు ప్రీతి హారస్మెంట్ గురించి చెప్పినపుడు స్పందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. మరోవైపు పోలీసులు కూడా పట్టించుకోలేదు. ప్రీతి ఇష్యూ పై సమగ్ర విచారణ జరపాలి. ఆమెకు ఇంకా మెరుగైన వైద్యం అందించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి అని ఎమ్మెల్యే ఈటల.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి ఆరోగ్యం అత్యంగా విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాంగింగ్ వేధింపులు భరించలేక మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికీ ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వెంటిలేటర్ చికిత్స అందుతోందని బులిటెన్ ద్వారా వైద్యులు వెల్లడించారు. మల్టి డిసిప్లినరీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందుతోందని నిమ్స్ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు ప్రీతి బీపీ కూడా మెయింటేన్ అవ్వటం లేదని, కిడ్నీ పనితీరు సరిగ్గా లేదని కిందటి హెల్త్ బులెటిన్‌లో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జరిగింది ఇదే.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. ఆ వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ సీనియర్ విద్యార్థులు సైఫ్‌ను అరెస్టు చేయొద్దని ధర్నాకు దిగారు. -
వేధింపులు నిజమే..మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నం!
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో నిందితుడైన సైఫ్‌ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. వాట్సాప్ గ్రూపులో వేధింపులతో.. 2022 నవంబర్‌లో పీజీ వైద్య విద్యార్థినిగా చేరిన ప్రీతిపై డిసెంబర్ నుంచే సైఫ్ వేధింపులకు పాల్పడినట్టు వాట్సాప్ గ్రూపుల పరిశీలనలో తేలింది. డిసెంబర్ 6న సైఫ్, ప్రీతి మధ్య చాటింగ్ వార్ నడిచింది. తర్వాత కూడా రెండు, మూడుసార్లు చిన్న గొడవలు జరిగినా సద్దుమణిగాయి. అయితే అనస్తీషియా విభాగానికి సంబంధించి 31 మందితో ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూపులో ఈనెల 18న చేసిన పోస్టుతో గొడవ ముదిరింది. ఓ హౌస్ సర్జన్ విద్యార్థితో కేస్ షీట్ రాయించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ప్రీతికి సరైన బ్రెయిన్ లేదు.. బుర్ర తక్కువ మనిషి’అంటూ సైఫ్ కామెంట్ పెట్టాడు. దీనిని అవమానంగా భావించిన ప్రీతి.. ‘యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్’అంటూ వ్యక్తిగతంగా సైఫ్‌కు మెసేజ్ పెట్టింది. ఏదైనా ఉంటే తమ హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని, గ్రూపులో తనపై మెసేజ్‌లు పెట్టవద్దని సూచించింది. అంతటితో ఆ వివాదం సమసిపోకపోవడంతో.. ఈ నెల 20న విషయాన్ని తన తండ్రి నరేందర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఏసీపీకి, మట్టెవాడ ఎస్సైలకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు 21న ఉదయం మొదట సైఫ్‌తో, తర్వాత ప్రీతితో మెడికల్ కాలేజీ హెచ్ఓడీలు మాట్లాడారు. కానీ ప్రీతి అవమానభారంతోనే ఉండిపోయింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శైలేష్ అనే సహ విద్యార్థితో ప్రీతి మాట్లాడుతూ.. ‘‘సైఫ్ వేధింపుల విషయంలో నాకు ఎవరూ సపోర్టు చేయడం లేదేం’’అని అడిగింది. ఆ తర్వాత 7.30 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. నిందితుడి అరెస్టు.. రిమాండ్ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి నిందితుడు ఎంఏ సైఫ్‌ను మట్టెవాడ పీఎస్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సైఫ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆధారాల కోసం పరిశీలించారు. పలు అంశాలపై ప్రశ్నించారు. తర్వాత వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అయితే బాధితురాలికి వరంగల్ ఎంజీఎంలో చేసిన చికిత్స రిపోర్టులు, ఆమె ఆరోగ్య స్థితిపై తాజా వైద్య నివేదికలు సమర్పించలేదంటూ.. నిందితుడిని రిమాండ్‌కు పంపేందుకు జడ్జి చాముండేశ్వరీ దేవి తొలుత తిరస్కరించారు. తర్వాత పోలీసులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ జారీ చేసిన పత్రికా ప్రకటనను జడ్జికి సమర్పించారు. బాధితురాలి తల్లిదండ్రుల అంగీకారంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినట్టు వివరించారు. అయితే ఈ సమయంలో జడ్జికి తన వాదన వినిపిస్తానని నిందితుడు సైఫ్ కోరాడు. జడ్జి పోలీసులు, న్యాయవాదులు అందరినీ కోర్టు హాల్‌నుంచి బయటికి పంపి నిందితుడు చెప్పిన వివరాలను విని, నోట్ చేసుకున్నారు. తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు సైఫ్‌ను ఖమ్మం జైలు తరలించేందుకు ప్రయత్నించినా.. అప్పటికే రాత్రికావడంతో తాత్కాలికంగా పరకాల జైలుకు తీసుకెళ్లారు. శనివారం ఉదయం ఖమ్మం జైలుకు తరలించనున్నారు. డీఎంఈకి సీల్డుకవర్లో నివేదిక? ఎంజీఎం ఆస్పత్రి, కేఎంసీలో జరిగిన ఘటనలపై గురు, శుక్రవారాల్లో విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ.. తమ నివేదికను వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)కు సీల్డ్ కవర్లో సమర్పించినట్టు తెలిసింది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజన్‌కుమార్ శుక్రవారం ఆరా తీసినట్టు తెలిసింది. ప్రీతి ప్రశ్నించేతత్వాన్ని తట్టుకోలేక వేధింపులు: సీపీ రంగనాథ్ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్, హెచ్ఓడీలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టామని తెలిపారు. ప్రీతి తెలివైన అమ్మాయి అని, ఇటీవలే వైద్య విభాగానికి సంబంధించి యూపీఎస్సీ ఇంటర్వూ్యకు కూడా హాజరైందని వివరించారు. ఆమెకు ప్రశ్నించే తత్వం ఉందని.. దీనిని తట్టుకోలేకనే సీనియర్ అయిన సైఫ్ ఆమెను టార్గెట్ చేసి వేధించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు తోటి విద్యార్థులు సపోర్ట్ చేయడం లేదని మనస్తాపానికి గురైన ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తేలిందని వివరించారు. నిందితుడు సైఫ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, సోషల్ మీడియాలో దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం: నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. ఆమెకు ఎక్మో, సీఆర్ఆర్టీ చికిత్స అందిస్తున్నామని నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ఆమె బ్రెయిన్ ఎంత చురుగ్గా ఉందో తెలుసుకునేందుకు బ్రెయిన్ మ్యాపింగ్ కూడా చేస్తున్నామని వివరించారు. మంత్రి హరీశ్‌రావు ప్రీతి ఆరోగ్యంపై నిరంతరం ఆరా తీస్తున్నారని చెప్పారు. ఇక మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రీతి తల్లిదండ్రులు శారద, ధరావత్ నరేందర్‌లతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉష ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పూల మాలతో నిమ్స్‌కు గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతి ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, గవర్నర్ తమిళిసై నిమ్స్ పర్యటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. నిమ్స్‌కు గవర్నర్ తమిళిసై వచ్చినప్పుడు వాహనంలో పూలమాల ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై గవర్నర్ కార్యాలయం స్పందించి వివరణ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై ఇతర ప్రాంతాల నుంచి రాజ్‌భవన్‌కు వచ్చిన ప్రతీసారి ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రీతి త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రార్థించారు. ఆలయం నుంచి గవర్నర్ తమిళిసై నేరుగా నిమ్స్‌కు వచ్చారు. గవర్నర్ నిమ్స్ పర్యటనలో ఎలాంటి దురుద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. -
NIMS Hospital: ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ క్రిటికల్.. నో మోర్
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆపరేషన్ చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నిమ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రసూల్‌పురాకు చెందిన నవాజ్(41)ను బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్ కోసం తీసుకెళ్లారు. సాయంత్రం ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు. అయితే రోగిని మాత్రం చూపించలేదు. ఆ తరువాత పేషెంట్ క్రిటికల్ అని హడావిడి చేశారు. గురువారం తెల్లవారుజామున ఐసీయూకు తరలించారు. 4.30 గంటలకు నో మోర్ అని చెబుతూనే ఉదయం 7.30 గంటల వరకు వైద్యం చేశారు. వైద్యులు చెపుతున్న పొంతలేని సమాదానాలతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు నిలదీయడంతో ఉదయం 8.31 గంటల ప్రాంతంలో మృతి చెందాడని వెల్లడించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి చనిపోయాడంటూ బాధితుల ఆందోళన వ్యక్తం చేశారు. గుండెపోటు రావడంతో రోగి చనిపోయాడని నిమ్స్ కార్దియోథోరాసిక్ విభాగం వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది తెల్సా..? కొత్త వేడుకల వేళ జాగ్రత్త సుమా..! -
ఏం ఇంట్లో చూసినా మందు గోళీలే! పారేస్తే పాతరేసినట్టే! మరేం చేయాలి?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌కు ముందేమో గాని, తర్వాత ప్రతీ ఇల్లూ చిన్నపాటి క్లినిక్‌లా మారింది. వాడినా, వాడకున్నా రకరకాల మాత్రలు ఇంట్లో పేరుకుంటున్నాయి. అయితే వాడని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైన పనికాదంటున్నారు వైద్యులు. దానికి బదులుగా వాటిని పడేసేందుకు తొలిసారిగా డ్రాప్ బాక్స్‌లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. జలుబో, జ్వరమో మరొకటో.. చిన్నా చితకా వ్యాధులకు కూడా డాక్టర్ల నుంచి చాంతాడంత మందుల చిట్టీలు తప్పడం లేదు. ఎందుకైనా మంచిదని మనం వాటిని కొనకా తప్పడం లేదు. అయితే సాధారణంగా ఒకటి రెండు రోజులకే స్వస్థత చేకూరిన పరిస్థితిలో మందులు ఆపేసేవారే ఎక్కువ. అలాంటి వాటిలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా ఉండడం సాధారణమే. వీటిని సరైన పద్ధతిలో నిర్మూలించాలి లేదా గడువు ముగియకపోతే అవసరార్థులకు అందించాలే తప్ప ఎలా పడితే అలా పడేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. పారేస్తే.. పాతరేసినట్టే.. బెల్జియం లాంటి దేశాల్లో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ విషయంలో కఠినమైన డ్రగ్ పాలసీ ఉంది. అక్కడ వీటిని హానికారక వ్యర్థాల కోవలో లెక్కిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలొస్తాయి. ఉపయోగించనవి, అదనంగా ఉన్నవి నిర్లక్ష్యంగా పారవేయడంతో అవి నీటిలోకి చేరి కెనాల్స్ ద్వారా పంట పొలాల వరకూ చేరుతున్నాయి. దీంతో ఇది అంతిమంగా యాంటీమైక్రోబయాల్ నిరోధకత/యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్)కు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు.. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో నిమ్స్‌కు చెందిన క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ (సీపీటీ) విభాగం ఆస్పత్రి ఆవరణలో రెండు డ్రాప్ బాక్స్‌లను అమర్చింది. అవుట్ పేషెంట్స్ బ్లాక్‌లో, స్పెషాలిటీ బ్లాక్‌లో మరొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. వీటిని చోరుల నుంచి కాపాడే క్రమంలో బాక్స్‌లకు తాళాలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది మొదలుకుని, రోగులు, సంబంధీకులు ఎవరైనా సరే ఇంట్లో అనవసరంగా కొనుగోలు చేసిన, ఉపయోగించని లేదా గడువు ముగిసిన యాంటీబయాటిక్స్ ఉన్నట్లయితే ఈ డ్రాప్ బాక్స్‌లో వేయవచ్చని తద్వారా ఈ బాక్స్‌లకు వచ్చే స్పందనను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భస్మం.. క్షేమం.. ‘తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే మొదటిది. వీటి ద్వారా హానికారక రసాయనాలు కాలుష్యానికి కారణం కాకుండా నిరోధించవచ్చు’ అని చెప్పారు నిమ్స్ డీన్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.బీరప్ప. ‘డ్రాప్ బాక్స్‌ల ద్వారా పోగుపడిన మందులను సేకరించి వాటిని 1200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో భస్మం చేయిస్తాం’ అని నిమ్స్ లెర్నింగ్ సెంటర్ ప్రొఫెసర్ సీపీటీ విభాగాధిపతి పి.ఉషారాణి చెప్పారు. -
నిమ్స్‌కు మునుగోడు గ్రహణం
సాకక్షి, హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)కు మునుగోడు ఉప ఎన్నికల గ్రహణం పట్టింది. ఫలితంగా ఆస్పత్రిలో పాలనాపరంగా ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదు. నిమ్స్‌కు కొత్త డైరెక్టర్‌ను నియమించనున్న నేపథ్యంలో ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో వైద్యశాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఆ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, డీఎంఈ డాక్టర్ కె.రమేష్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ సెర్చ్ కమిటీ సమావేశం అయ్యేందుకు ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక అడ్డంకిగా మారింది. అంతేగాకుండా తన అనారోగ్య కారణంగా డైరెక్టర్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు మనోహర్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల నెలరోజుల పాటు సెలవుపై వెళ్లిన ఆయన గుండె సంబంధిత సమస్యకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకున్న చికిత్స వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి విధులకు హాజరైనప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక్క ఫైల్ కదలడం లేదు. ఒకటో రెండో ఫైల్స్ మినహా మిగిలిన ఫైళ్లన్నీ డైరెక్టర్ టేబుల్‌పైనే పేరుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా 2015లో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మనోహర్ ఇప్పటి వరకూ కొనసాగింపు నిమ్స్ నియమనిబంధనలకు పూర్తి విరుద్ధమని ఓ అధికారి స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం కొత్త డైరెక్టర్‌ను నియమించాలన్న నిర్ణయానికి వచి్చంది. ఆ మేరకే ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసింది. ఆరుగురు వైద్యుల ప్రయత్నాలు నిమ్స్ సంచాలకుడి పదవిని దక్కించుకునేందుకు ఆరుగురు వైద్యులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నిమ్స్ రేడియాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఎస్.రామ్మూర్తి, నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, నిమ్స్ డీన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ నగరి బీరప్పతో పాటు డీఎంఈ డాక్టర్ కె.రమేష్‌రెడ్డితో మరో ఇద్దరు వైద్యులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నిమ్స్ డైరెక్టర్ పదవికి అర్హులైన వారిని సెర్చ్ కమిటీ నిర్ణయించాల్సి ఉంది. కానీ మునుగోడు ఉప ఎన్నిక కారణంగా ఇంతవరకు సమావేశం జరగని పరిస్థితి. అయితే నిమ్స్ డీన్‌గా వ్యవహరించిన రామ్మూర్తి పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్చార్జి డైరెక్టర్‌గా ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ మెప్పు పొందారు. నిమ్మ సత్యనారాయణకు కూడా ఆస్పత్రి పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉంది. అవయవ మారి్పడి ఆపరేషన్‌లో గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బీరప్ప ఇటీవలే నిమ్స్ డీన్ బాధ్యతలను చేపట్టారు. డీఎంఈ రమేష్‌రెడ్డిపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త డైరెక్టర్ ఎవరు వస్తారనే అంశంపై వైద్య, ఉద్యోగవర్గాల్లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. -
నిమ్స్ పగ్గాలు ఎవరికో..!
సాక్షి, హైదరాబాద్/లక్డీకాపూల్: నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)కు కొత్త డైరెక్టర్ ను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే వార్తలు రావడంతో ఈ విషయమై పలు ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త డైరెక్టర్ నియామకం కోసం ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేయనున్నట్టు సమాచారం. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత నిమ్స్‌కు కొత్త డైరెక్టర్ నియమితులవుతారు. ప్రస్తుత డైరెక్టర్ మనోహర్ అనారోగ్యం దృష్ట్యా కొనసాగలేనని చెప్పడంతో కొత్త డైరెక్టర్ నియామకం అనివార్యంగా మారింది. ప్రతిష్టాత్మక సంస్థ..ప్రతిష్టాత్మక పదవి! ప్రతిష్టాత్మక నిమ్స్‌కు తొలిసారిగా 1985లో నాటి ప్రభుత్వం డైరెక్టర్‌ను నియమించింది. అప్పటి నుంచి ఆ పదవి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. తొలి డైరెక్టర్‌గా కాకర్ల సుబ్బారావు (1985–1990) నియమితులు కాగా, ఆ తర్వాత 1997–2004 మధ్య కూడా రెండుసార్లు ఆయనే డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన కాకుండా డా.ప్రసాదరావు (2004–2010) కూడా ఐదేళ్లకు పైబడి డైరెక్టర్‌గా ఉన్నారు. మిగిలిన డైరెక్టర్లు, ఇన్చార్జి డైరెక్టర్లు ఏడాది నుంచి 3 ఏళ్ల కాలవ్యవధి వరకు మాత్రమే పదవిలో కొనసాగారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న మనోహర్ 2015 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా చూస్తే ఆయన లాగా ఏకబిగిన ఎక్కువ కాలం (ఏడేళ్లు) డైరెక్టర్ పదవిలో కొనసాగిన వారు మరొకరు లేకపోవడం గమనార్హం. సమస్యాత్మకం కూడా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు నిమ్స్‌లో వైద్య సేవలకు తరలివస్తుంటారు. నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉండే నిమ్స్ డైరెక్టర్ పదవి ఎంత ప్రతిష్టాత్మకమో అంతే సమస్యాత్మకం కూడా. సంపన్నుల నుంచి నిరుపేదల వరకు అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బృహత్తర బాధ్యతలు ఒకపక్క, ఎప్పటికప్పుడు అనుభవంలోకి వచ్చే పాలనాపరమైన ఇబ్బందులు మరోపక్క.. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ ఒకరకంగా కత్తి మీద సామే చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ పదవిలో నియమించే వ్యక్తిని ఆచితూచి ఎంపిక చేస్తుంది. అయినప్పటికీ పెద్ద, ప్రతిష్టాత్మక సంస్థ కావడంతో డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రముఖ వైద్యులు ఆసక్తి చూపిస్తుంటారు. పోటా పోటీ ప్రస్తుతం నిమ్స్ డైరెక్టర్ పోస్టు కోసం పలువురు రేసులో ఉన్నట్టు వినిపిస్తోంది. నిమ్స్ డీన్ డాక్టర్ రామమూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ ఎన్.సత్యనారాయణ, కార్డియాక్ సర్జన్ డా.ఆర్వీ కుమార్, డాక్టర్ బీరప్ప (సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ), న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ ఎం.విజయసారథి, నెఫ్రాలజీ హెడ్ గంగాధర్‌లు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైద్యవిద్య డైరెక్టర్(డీఎంఈ) రమేష్‌రెడ్డి పేరు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకా లంగా నిమ్స్ అందిస్తున్న వైద్య సేవల విషయంలో పలు విమర్శలు వినిపిస్తు న్నాయి. దిగువస్థాయి సిబ్బందిలో నిర్ల క్ష్యం బాగా పెరిగిందని అంటున్నారు. రోగులకు పడకలు సహా వసతుల కొర త ఉందని, ఆరోగ్యశ్రీ సేవల్లో లోపాలు సమస్యగా మారుతున్నాయని తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో సిబ్బంది అవినీతిపై రోగుల ఆరోపణలూ వినవస్తున్నాయి. కొత్తగా వచ్చే డైరెక్టర్ వీటిపై దృష్టిసారించి పనిచేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్స.. ప్రభుత్వ ఆసుపత్రులపై చిన్నచూపు?
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ మనోహర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరడం వివాదాస్పదంగా మారింది. ప్రతిష్టాత్మక ఆసుపత్రికి డైరెక్టర్‌గా ఉన్న మనోహర్... తమ దవాఖానాను కాదని ప్రైవేటులో చికిత్స పొందుతుండడం చర్చనీయాంశంగా మారింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి ప్రతిష్టను మసకబార్చే చర్యగా నిమ్స్ ఉద్యోగులతో పాటు వైద్యరంగంలోని వారు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరు ఏ ఆసుపత్రిలోనైనా.. మరెక్కడైనా చికిత్స పొందవచ్చు. అయితే సాక్షాత్తూ ఒక ఆసుపత్రికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తే ఆ ఆసుపత్రిని కాదని మరో చోట వైద్యసేవలు పొందడం సామాన్య ప్రజలకు అది ఎలాంటి సందేశం ఇస్తుంది? అంటూ పలువురు నిమ్స్ డైరెక్టర్ చికిత్స ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ నిమ్స్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం చర్చకు దారి తీసింది. అయితే ఈ దఫా ఏకంగా డైరెక్టరే నిమ్స్‌ను కాదని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించడం మరింత వివాదంగా మారింది. వ్యక్తిగత, కుటుంబ వైద్యుడు అపోలోలో పనిచేస్తుండడం వల్లనే అక్కడ చికిత్సకు వెళ్లినట్టుగా డైరెక్టర్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తిగత వైద్యులే నిమ్స్‌కు వచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చిన దాఖాలాలున్నాయని మరికొందరు అంటున్నారు. నిజానికి నిమ్స్ కార్డియాలజీ విభాగానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు నిమ్స్‌కు వచ్చి చికిత్స తీసుకుని కోలుకుని వెళుతుంటారు. చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం ఈ పరిస్థితుల్లో సాక్షాత్తూ నిమ్స్ డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం ఆసుపత్రి పేరు ప్రతిష్టలకు నష్టం కలుగజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో బుధవారం రోజంతా చర్చోపచర్చలు నడిచాయి. ఎక్కువ మంది డైరెక్టర్ చేరికను తప్పుపట్టగా కొందరు సమర్థిస్తూ కూడా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పిల్లలు చదవకపోవడం లాంటి పోలికల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్నే ఆశ్రయిస్తుండడం దాకా ఈ చర్చల్లో భాగమయ్యాయి. ఏదేమైనా ఈ తరహా ఉదంతాలు పునరావృతం కాకుంటే మేలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై, ఉన్నతాధికారులపై ఉందని, వారు వ్యక్తిగత చికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రులను ఎంచుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తిని అందించాలని అందరూ కోరుకుంటున్నారు. -
హైదరాబాద్ ఆస్పత్రుల్లో తీవ్రమైన రక్తం కొరత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం కొరత తీవ్రంగా ఉంది. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం సరిపడా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. పలు కారణాలతో దాతలు రక్తం దానం చేయడానికి ముందుకు రావడం లేదు. ► అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ► ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. ► బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది. నిలోఫర్‌లో సర్జరీలు వాయిదా నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం లేని కారణంగా శుక్రవారం అత్యవసర విభాగంలో నిర్వహించాల్సిన సర్జరీలు వాయిదా పడ్డాయి. సకాలంలో రోగులకు అవసరమైన రక్తం దొరక్క అటు రోగి బంధువులు, ఇటు వైద్యాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గాంధీ ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. బి పాజిటివ్ 4 ప్యాక్డ్ సెల్స్, ఏడు ప్లాటింగ్ ప్యాక్చర్స్ (క్రయోన్స్) పాకెట్లను ఒక్కొక్కటి రూ.650 వెచ్చించి గాంధీ ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. రక్తాన్ని తెచ్చేంత వరకు రోగి, వైద్యులు ఆపరేషన్ థియేటర్లో వేచి చూశారు. నిత్యం నిలోఫర్ ఆసుపత్రిలో ఏదో ఒక రకమైన బ్లడ్ గ్రూపు కొరత ఉంటోంది. రోగులు బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లడం, అక్కడ రక్తం దొరక్క ఇబ్బందులు పడటం సర్వసాధారణమైపోతోంది. దాతలు ముందుకు రావడం లేదు కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేక పోయాం. ఇటీవల నిర్వహిస్తున్నా..ఒకరిద్దరికి మించి ముందుకు రావడం లేదు. ఎండలకు భయపడి దాతలు కూడా ముందుకు రావడం లేదు. పరీక్షల సమయం కావడంతో కాలేజీ విద్యార్థులు కూడా రక్తదానానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ‘ఒ’ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కూడా కనీస సేవలు అందించ లేకపోతున్నాం. – లక్ష్మీరెడ్డి, అధ్యక్షురాలు, బ్లడ్‌బ్యాంక్స్ అసోసియేషన్ బ్లడ్ బ్యాంక్‌లన్నీ తిరిగాను మాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. పరీక్షించిన వైద్యులు ఐదు యూనిట్ల రక్తం ఎక్కించాలని చెప్పారు. వైద్యులు రాసిచ్చిన చీటి పట్టుకుని నగరంలోని ప్రముఖ బ్లడ్ బ్యాంకులన్నీ తిరిగాం. అయినా దొరకలేదు. చివరకు మా బంధువుల్లో అదే గ్రూప్‌కు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రక్తం తీసుకోవాల్సి వచ్చింది. – సీహెచ్.లక్ష్మి, బడంగ్పేట్ -
ఏడున్నరేళ్లు..742 ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిమ్స్‌లో రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు 25 ఏళ్లలో కేవలం 649 మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడున్నరేళ్లలో ఏకంగా 742 ఆపరేషన్లు జరగడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులోకి తేవడంతో శస్త్రచికిత్సలు పెరిగాయ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్కో శస్త్రచికిత్సకు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి చికిత్సలో 97 ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించగా, అందు లో 90 ఆరోగ్యశ్రీ ద్వారానే నిర్వహించడం గమనార్హం. జీవితాంతం ఉచితంగా మందులు... ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7,800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతోపాటు అనంతరం అవసరమయ్యే మందులను జీవితకాలానికి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇలా ఉచితం గా మందులు అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, యంత్రాలను గాంధీ, నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు: హరీశ్‌రావు ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా వ్యవహరిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణగా మన రాష్ట్రం మారుతోందన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడంలో రికార్డు సాధించామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు ప్రాణదానం చేయాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా వైద్య సేవలుండాలన్నారు. అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
నిమ్స్‌లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను కలిగిన నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లోనే మొట్టమొదటి సారిగా నిమ్స్ సిటీ సర్జన్ డాక్టర్ ఎం.అమరేష్ రావు వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. ఏపీలోని కర్నూలుకి చెందిన డి.శేఖర్ కుమార్తె కళ్యాణి (17)కి కొంతకాలంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. బాత్రూమ్కు కూడా ఆక్సిజన్ లేకపోతే వెళ్లలేని పరిస్థితి. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా క్షీణదశకు చేరుకోవడంతో సెప్టెంబర్11న నిమ్స్‌లో చేరింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు నిర్థారించారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. కళ్యాణికి ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేసేందుకు నిమ్స్ వైద్యులు సమాయత్తమై ఊపిరితిత్తుల దాత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ తాడ్‌బన్‌కు చెందిన సుశీల(47) గత నెల 27న బోయినపల్లిలో రోడ్ క్రాస్ చేస్తుండగా బైక్ వచ్చి ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. జీవన్‌దాన్ కార్యక్రమంలో ఆమె అవయవాలను దానం చేసేందుకు బంధువులు ముందుకు వచ్చారు. ఈ విషయం తెలిసి జీవన్‌దాన్ కో–ఆర్డినేటర్ సుశీల అవయవాలను సేకరించారు. ఆమె ఊపిరితిత్తులను నిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. హైదరాబాద్ పోలీసుల సహకారంతో ఊపిరితిత్తులను మాదాపూర్ నుంచి పంజగుట్ట నిమ్స్ ఆస్పత్రికి 11 నిమిషాల్లోనే అంబులెన్స్‌లో చేర్చారు. బుధవారం ఉదయం 7.51 నిమిషాలకు అంబులెన్స్ నిమ్స్ మిలీనియం బ్లాక్‌కు చేరుకుంది. అక్కడ కళ్యాణికి ఊపిరితిత్తుల మార్పిడి చేయడానికి నిమ్స్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఊపిరితిత్తుల మార్పిడిని మొదలుపెట్టి 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం కళ్యాణి అబ్జర్వేషన్లో ఉన్నట్లు డాక్టర్ అమరేష్‌రావు తెలిపారు. -
3డీ మ్యాపింగ్.. ‘గుండె’ నార్మల్
లక్డీకాపూల్(హైదరాబాద్): గుండె కవాటం మూసుకుపోయి బాధపడుతున్న 56 ఏళ్ల మహిళకు నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ (నిమ్స్) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రమాదకర స్థాయిలో కొట్టుకుంటున్న గుండెలో సమస్యను 3డీ మ్యాపింగ్, బెలూన్ వాల్వ్ సాంకేతికత సాయంతో పరిష్కరించారు. ఖరీదైన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ కింద నిర్వహించడం గమనార్హం. నిమిషానికి 250 సార్లు గుండె కొట్టుకుని.. కామారెడ్డి జిల్లాలోని రెడ్డిపేటకు చెందిన బాలమణి పొలం పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మూడు నెలల క్రితం ఆమె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. గుండె దడదడలాడడం, కడుపు ఉబ్బరం, ఆయాసం మొదలయ్యాయి. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా ఏమీ తేలలేదు. చివరికి నిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆమెకు పరీక్షలు చేసిన నిమ్స్ వైద్యులు.. ఆమె గుండె నిమిషానికి 250 సార్లు కొట్టుకుంటోందని, గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం పంప్ చేసే కవాటం మూసుకుపోయిందని గుర్తించారు. ఈ నెల 17న 3డీ మ్యాపింగ్, బెలూన్ వాల్వ్ విధానంలో శస్త్రచికిత్స చేశారు. తొడ భాగంలోని రక్త నాళం నుంచి ప్రత్యేక పరికరాల ద్వారా బెలూన్ను గుండె వద్దకు పంపి.. మూసుకుపోయిన కవాటాన్ని తెరిచారు. కార్డియాలజీ ప్రొఫెసర్ సాయి సతీశ్ ఆధ్వర్యంలో వైద్యులు హేమంత్ హరీశ్, అర్చన, మణికృష్ణ తదితరుల బృందం ఈ క్లిష్టమైన చికిత్సను పూర్తి చేసింది. -
ఆందోళన బాటలో తెలంగాణ జూనియర్ డాక్టర్లు
-
జీతాలు పెంచకపోతే సమ్మె: జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూడాల డిమాండ్ చేశారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే.. నిమ్స్‌లో వైద్యం అందించేలా జీఓ అమలు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. అంతేకాక కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. చదవండి: వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్! -
నిమ్స్‌లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, పంజగుట్ట: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి నిమ్స్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నిమ్స్ ఆసుపత్రి మిలీనియం బ్లాక్ వెనకభాగంలో పార్కింగ్ వద్ద ఉన్న చెట్టుకు సోమవారం ఉదయం ఓ వ్యక్తి లుంగీతో ఉరివేసుకొని వేలాడుతుండటం స్థానికులు గుర్తించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. ఆధారాలకోసం చూస్తే ఎలాంటి గుర్తింపు కార్డులు కనిపించలేదు. అతని వయస్సు సుమారు (45) ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: పెళ్లి కావడం లేదని.. మాట్లాడితే మర్డరే ! సాక్షి, సిటీబ్యూరో: సిటీతో పాటు శివార్లలో వరుసగా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. పూటకోచోట విచ్చుకత్తుల వేట చోటు చేసుకుంటుండటంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో ఎనిమిది హత్యలు జరగడంతోపాటు కొన్ని వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు ఒకే రోజు రెండేసి చొప్పున బయటపడ్డాయి. తాజాగా ఆదివారం రాజేంద్రనగర్‌లో రెండు దారుణ హత్యలు బయటపడ్డాయి. కొన్ని కేసుల్లో నిందితులు చిక్కగా... మరికొన్నింటిలో గుర్తించాల్సి ఉంది. చదవండి: విద్యార్థినిపై మాజీ ఎమ్మెల్యే లైంగిక దాడి! తిన్న వాటికి డబ్బు అడిగినందుకు.. షాకబ్ అలీ కేపీహెచ్‌బీ ప్రాంతంలో తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. ఈ నెల 4న ఇద్దరు వ్యక్తులు ద్రాక్షలు తిని, పైనాపిల్ కొన్నారు. కొన్న దానికే డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుండగా... తిన్న వాటికీ డబ్బు అడిగాడు. దీంతో ఇద్దరూ కలిసి అతడిపై దాడి చేయడంతో చనిపోయాడు. అదే రోజు కూకట్‌పల్లిలోని చెరువులో పూల వ్యాపారి కృష్ణ మృతదేహం లభించింది. ఎక్కడో చంపేసిన దుండగులు గోనె సంచిలో కట్టి తీసుకువచ్చి చెరువులో పడేశారు. మద్యం మానమన్నందుకు... కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలో స్రవంతితో వెంకటేశ్వర్లు ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఈమెను ఐదున హత్య చేసిన వెంకటేశ్వర్లు డబ్బాలో పార్సిల్ చేసి మృతదేహం మాయం చేయాలని భావించాడు. అది సాధ్యం కాకపోవడంతో తన సొంత ఇంటిలోనే మృతదేహాన్ని వదిలి పారిపోయాడు. మద్యం తాగవద్దని పదేపదే చెప్పడంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ నెల 5న ఈ దారుణం జరిగింది. తాగేందుకు డబ్బు ఇవ్వలేదని... ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే సంతోష్ మద్యానికి బానిస అయ్యాడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఈ నెల 9న తన తల్లి సంగీతను దారుణంగా చంపేశాడు. ఒకే రోజు మరో రెండు... ఆదివారం నగర శివార్లలో రెండు హత్యలు వెలుగు చూశాయి. డబ్బు కోసం బెదిరిస్తుండటం, ఒకరి సోదరికి వేధిస్తుండటంతో ఇద్దరు పాత నేరగాళ్ళు తమ స్నేహితుడు రియాజ్‌ను హత్య చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘాతుకంలో మృతదేహాన్ని సూట్‌కేసులో తెచ్చి రాజేంద్రనగర్ డెయిరీ ఫామ్ వద్ద పడేశారు. ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రాత్రి 11.45 గంటలకు మరో ఘోరం చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్న రూ.11 లక్షలు, వడ్డీ కోసం ఒత్తిడి చేస్తూ, హోటల్ తన పేరుతో రాసి ఇవ్వమని డిమాండ్ చేస్తుండటంతో ఎంఐఎం నేత ఖలీల్‌ను హతమార్చారు. ఇతడి వద్ద అప్పుతీసుకున్న హోటల్ యజమాని, అతడి వద్ద పని చేసే ఇద్దరితో కలిసి హత్య చేశారు. జూబ్లీహిల్స్, మియాపూర్ పోలీసుస్టేషన్ల పరిధి నుంచి అదృశ్యమైన ఇద్దరు ఈ నెల 7న శవాలుగా తేలారు. జూబ్లీహిల్స్‌లో పని చేసే వెంకటమ్మ గత నెల 30న బయటకు వెళ్ళింది. ఈమె మృతదేహం ఘట్కేసర్లో కాలిన స్థితిలో కనిపించింది. జనప్రియ కాలనీ నుంచి ఏటీఎంకి అంటూ వెళ్ళిన రామకృష్ణ మృతదేహం ఖైత్లాపూర్ డంపింగ్ యార్డ్‌లో దొరికింది. దుండగులు ఒక చెవి, కుడి చేతి రెండు వేళ్ళు కోసేశారు. చట్టం కఠినంగా మారాలి.. అందరిలో మార్పు రావాలి వర్తమాన పరిస్థితులతో పాటు సినిమా ప్రభావంతో ఇటీవల కాలంలో యువతలో యాంటీ సోషల్ పర్సనాలిటీ పెరుగుతోంది. ఈ కారణంగానే చిన్న కారణాలకు చంపేసే వరకు వెళ్తున్నారు. మరోపక్క మద్యానికి బానిసైన వాళ్ళు ఆ మత్తు కోసమూ ఘాతుకాలు చేస్తున్నారు. మత్తు, ఆస్తి కోసమూ అనుమానంతోనో తమ వాళ్ళనే అంతం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగే ఘర్షణల్లో ఎదుటి వారు చనిపోతుండటంతో అవి సాంకేతిక హత్యలుగా మారుతున్నాయి. చట్టం మరింత కఠినంగా మారడంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తేనే ఈ పరిస్థితులు మారేది. – డాక్టర్ రాజశేఖర్, మానసిక నిపుణులు -
వారియర్స్‌కు వ్యాక్సిన్... అక్కర్లేదు
కరోనా వ్యాక్సిన్ దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు దాదాపు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. అందుకు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే వ్యాక్సిన్ల సామర్థ్యంపై, అది ఎవరికి వేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందరికీ అవసరం లేదని ఇప్పటికే భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి.. ఎవరు వేసుకోకూడదు.. దాని పనితీరు తదితర అంశాలపై నిమ్స్ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ మధుమోహన్రావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యాక్సిన్ల రక్షణ ఎన్నాళ్లు? అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తమ వ్యాక్సిన్ పనితీరు 3 నెలలేనని ‘న్యూ ఇంగ్లండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్’అనే జర్నల్‌లో ప్రకటించింది. 190 మందిపై పరీక్షిస్తే మూడు నెలలే యాంటీబాడీలు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత యాంటీబాడీలు పడిపోయాయి. ఇతర కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ల పనితీరు ఎంతకాలం అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కాబట్టి వ్యాక్సిన్‌పైనే పూర్తిగా ఆధారపడలేం. ఒకవేళ ఎక్కువ కాలం రక్షణ కావాలంటే ఎక్కువ డోసులు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల దుష్ఫలితాలు వస్తాయన్న అనుమానాలూ ఉన్నాయి. వ్యాక్సిన్ల సామర్థ్యంపైనే అందరికీ అనుమానాలు ఉన్నాయి. కంపెనీలు చెబుతున్నట్లుగా 90 శాతం పనిచేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ర్యాండమ్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరగట్లేదు. కంపెనీలు వ్యాక్సిన్ల భద్రతపై దృష్టి పెడుతున్నాయే కానీ, సామర్థ్యంపై దృష్టి పెట్టట్లేదు. అందరికీ ఒకేలా పనిచేయవు.. వ్యాక్సిన్ అందరికీ ఒకేలా పని చేయదు. మన శరీరంలోకి ప్రవేశించే వైరస్ ఒకటే కానీ, మన శరీరం స్పందించే తీరు వేర్వేరుగా ఉంటుంది. మన డీఎన్ఏలో ఉండే వ్యత్యాసాలే ఇందుకు కారణం. ప్రతి మనిషిలో ఒక్కో రకమైన జన్యుపదార్థం ఉంటుంది. వైరస్ మన జన్యు పదార్థంతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి వ్యాక్సిన్ సామర్థ్యం ఉంటుంది. శరీరంలో కొన్ని జన్యువులు రోగ నిరోధక శక్తిని నిర్ధారిస్తాయి. వాటిలో ముఖ్యంగా హెచ్ఎల్ఏ (హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్) జన్యువులు వైరస్‌తో అతుక్కునే విధానమే వ్యత్యాసాలకు కారణం. ఇదే టీకా సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. భారతీయుల హెచ్ఎల్ఏ సమాచారం ఉంటే.. వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని ముందే అంచనా వేయొచ్చు. హెచ్ఎల్ఏ జీన్స్‌ను దేశంలో ర్యాండమ్‌గా సేకరించి సీక్వెన్సింగ్ చేయడం వల్ల మన వాళ్లలో ఏది ఎక్కువ రిస్క్, ఏది తక్కువ రిస్క్ కలిగిన జీన్స్ అనేది అంచనా వేయవచ్చు. దాన్ని బట్టి ఎవరికి వ్యాక్సిన్ అవసరమో లేదో తేల్చొచ్చు. వ్యాక్సిన్ అందరికీ అవసరం లేదా? వ్యాక్సిన్లు అందరికీ అవసరం ఉండదు. ఒక్కొక్కరి రోగనిరోధక శక్తి ఒక్కోరకంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే వ్యాక్సిన్లు అవసరం. స్టెరాయిడ్స్ వాడుతున్న వారు, ఇతర మందులు వాడుతున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వయసు పైబడిన వారు, పోషకాహార లోపం ఉన్న వారిలో రిస్క్ ఎక్కువ. కొన్ని సందర్భాల్లో పెద్ద వయసు వారికంటే తక్కువ వయసు వారు కరోనాతో మరణించారు. దీనికి హెచ్ఎల్ఏ జీన్స్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయినా ఐసీఎంఆర్ కూడా అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదని తేల్చి చెప్పింది. వారికి వ్యాక్సిన్ అవసరమే లేదు.. కరోనా వచ్చిన వారికి వ్యాక్సిన్ అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ల శరీరం అప్పటికే వైరస్‌పై పోరాటం చేసింది. వారిలో యాంటీబాడీలు లేకపోయినా మెమరీ టీ–సెల్స్ ఉంటాయి. అవి ఉండటం వల్ల రీ ఇన్ఫెక్షన్ వచ్చే చాన్స్ చాలా తక్కువ. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే రీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు తమలో యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని భయపడతున్నారు. కానీ టీ సెల్స్ ఉన్న సంగతి గుర్తించాలి. అవి చాలా పవర్ఫుల్. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. టీ–సెల్స్ రెస్పాన్స్‌ను టెస్ట్ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు భయపడుతున్నారు. రికవరీ అయిన వారికి ప్రత్యేక పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేయాల్సి వస్తే యాంటిబాడీ చెకప్ అవసరం. ఒకవేళ ఎక్కువ యాంటీబాడీస్ ఉంటే వ్యాక్సిన్ వద్దే వద్దు. పెద్ద జబ్బులతో బాధపడుతూ, స్టెరాయిడ్స్ వాడేవాళ్లు ఒకసారి వైరస్ బారినపడినా, వైద్యుల సలహా మేరకు వ్యాక్సిన్ తీసుకుంటే కొంత ఉపశమనం ఉండొచ్చు. పైగా వైరస్ వచ్చి తగ్గిన వారు కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. యాంటీబాడీ డిపెండెంట్ సెల్యులార్ సైటోటాక్సిసిటీ (ఏడీసీసీ) వచ్చే ప్రమాదం ఉంది. ఏడీసీసీల వల్ల మన కణాలు మన శరీరంపైనే దాడి చేస్తాయి. ఫలితంగా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయి కణాలు విచ్ఛిన్నం అవుతాయి. అలాగే కరోనా సోకి నయం అయిన వారిపై వ్యాక్సిన్ ప్రభావంపై పరిశోధనలు కూడా చాలా తక్కువగా జరిగాయి. కాగా, 17 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ అవసరమే లేదు. వాళ్లలో వైరస్ ప్రవేశించే మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వారిలో వైరస్ లోడ్ తక్కువగా ఉంటుంది. వాళ్లల్లో ఇతరత్రా అనారోగ్య సమస్యలున్న వారు, స్టెరాయిడ్స్ వాడే వారికి మాత్రం వ్యాక్సిన్ అవసరం ఉండొచ్చు. ఎవరికి ఇవ్వాలో గందరగోళం.. అనారోగ్య సమస్యలున్నవారు.. 55 ఏళ్లకు పైబడినవారు.. రోగనిరోధక శక్తి తక్కువున్న వారు.. ఫ్రంట్‌లైన్ కార్మికులు, వైద్యులు, ఇతర సిబ్బంది.. ఇప్పటివరకు కరోనా బారినపడని వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఎవరు? లక్షణాలు లేకుండానే కరోనా బారినపడిన వారున్నారు. వారికి అవసరంలేదనుకుంటున్నాం. కానీ వారెవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారిలో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదో.. మిలియన్ డాలర్ ప్రశ్న. అది తెలుసుకోవాలంటే రోగనిరోధక శక్తి సామర్థ్యం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే హెచ్ఎల్ఏ సీక్వెన్సింగ్ డేటా కావాలి. అది లేదు కాబట్టి ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. ఐజీజీ పరీక్షల యాంటీబాడీలను నమ్మొచ్చా? చాలామంది ఐజీజీ యాంటీబాడీ పరీక్షలు చేయించుకుని తాము సురక్షితం అనుకుంటున్నారు. అది నిజం కాదు. న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ స్థాయి పరీక్ష చేసుకుంటారో వారికే నిర్దిష్టమైన సమాచారం వస్తుంది. ఐజీజీ యాంటీబాడీలు ఏ వైరస్‌తోనైనా రావొచ్చు లేదా రాకపోవచ్చు. ఆ యాంటీబాడీలు కోవిడ్ సంబంధిత యాంటీబాడీలుగా గుర్తించలేం. ఏది నిజమైన వ్యాక్సిన్? టీకాల్లో లైవ్ అటెన్యుయేటెడ్, ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు చాలా సమర్థమైనవి. లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్‌ను కోడ్ డీ ఆప్టిమైజేషన్ టెక్నాలజీతో లైవ్ వైరస్ ద్వారా తయారు చేస్తారు. ఇది దీర్ఘకాలం పనిచేస్తుంది. ఇది చాలాకాలం రోగనిరోధక శక్తిని ఇస్తుంది. మిగతా పద్ధతిలో తయారు చేసే వ్యాక్సిన్ల పనికాలం తక్కువ ఉంటుంది. కొన్ని కంపెనీలు డీఎన్ఏ, ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. అవి మన డీఎన్ఏలోకి చొచ్చుకుపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమే గాక, జెనెటిక్ మార్పులు వస్తాయి. వైరల్ వెక్టార్ ఆధారిత వ్యాక్సిన్లు దీర్ఘకాలికంగా మన శరీరంలోని డీఎన్ఏతో అనుసంధానం అయితే కొన్ని దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వైరస్ కన్నా కూడా డ్రగ్స్‌పై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. -
నిమ్స్‌లో కోవాగ్జిన్ ఫేజ్–2 ట్రయల్స్ షురూ
సాక్షి, లక్టీకాపూల్: నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కొనసాగుతున్న కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఫేజ్–2 టీకా ప్రయోగం మొదలైంది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలోనే ఫార్మా దిగ్గజమైన భారత్ బయోటెక్ ఫార్మాసూటికల్ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో నిమ్స్ ఆస్పత్రి కూడా ఒకటి కావడం విదితమే. ఆయా ఆస్పత్రిలన్నీ క్లినికల్ ట్రయల్స్ ఫేజ్–1ను విజయవంతం చేశాయి. టీకా తీసుకున్న వలంటీర్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ క్రమంలో ఫేజ్–2 ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఫేజ్–2 టీకాలు వేయడం ఆరంభించారు. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్ పర్యవేక్షణలో నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు. వీళ్లందరిని నాలుగు గంటల అబ్జర్వేషన్ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. అదే విధంగా బుధవారం మరో 15 మందికి టీకా ప్రయోగం చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది. ఈ ప్రక్రియ మూడు రోజుల పాటు ఈ కొనసాగించేందుకు సన్నాహాలు చేపట్టినట్టు సమాచారం. కాగా ఈ టీకా ప్రయోగం ప్రక్రియలో భాగంగా ఆదివారం దాదాపుగా 80 మంది వాలంటీర్లకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. -
కోవిడ్–19 మొదటి అంకం ముగిసింది
లక్డీకాపూల్ : నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కొనసాగుతున్న కొవాక్జిన్ క్లినికల్ ట్రయిల్స్‌లో మొదటి అంకం విజయవంతంగా ముగిసింది. ఈ ప్రక్రియలో 50 మంది వలంటీర్లపై ఈ వ్యాక్సిన్ టీకాలను ప్రయోగించారు. ప్రస్తుతం నిమ్స్ వైద్యులు పరిశీలనలో నిమగ్నమయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆదేశాల మేరకు దాదాపుగా 60 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 50 మందికి సంబంధించి రక్త నమూనాలను సేకరించి సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్ సైతం పరీక్షలు నిర్వహించి ఆయా వలంటీర్ల ఫిట్నెస్ను నిర్ధారించింది. ఈ మేరకు కోవిడ్–19ను నియంత్రించే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజమైన భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్(బీబీఐఎల్) సంస్థ తయారు చేస్తున్న కోవాక్జిన్ ఫేజ్–1 హ్యూమన్ క్లినికల్ ట్రయిల్స్‌కు శ్రీకారం చుట్టారు. తొలుత ఇద్దరు ఆరోగ్యకమైన వలంటీర్లకు మొదటి మోతాదు టీకా ప్రయోగం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఈ నెల మొదటి వారంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత 14 రోజులకు అదే కోడ్‌కు సంబంధించిన బూస్టర్ డోస్‌ను కూడా ఇచ్చారు. ఈ ప్రక్రియను కూడా ఇటీవలే పూర్తి చేసినట్టు నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె. మనోహర్ పర్యవేక్షణలో క్లినికల్ ఫార్మకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులతో పాటు జనరల్ మెడిసిన్, ఆనస్తీషియా, రెస్పిరేటరీ మెడిసిన వైద్యులు సమన్వయంతో ఈ ట్రయిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా వలంటీర్లంతా తమ తమ ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఇందులో భాగంగా 28 రోజుల తర్వాత రెండవ మోతాదు టీకా ప్రయోగానికి నిమ్స్ క్లినికల్ ట్రయిల్ నోడల్ అధికారి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎవాల్యూషన్ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ వ్యాక్సిన్ వల్లలో శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. వలంటీర్ల ఆరోగ్యాన్ని పరిక్షించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే రెండవ మోతాదు టీకా ప్రయోగానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఫలించిన పోరాటం
లక్డీకాపూల్ : నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేతనాలు పెరిగాయి. దీంతో దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఒక్కో కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ. 4 నుంచి 6వేల వరకు జీతం పెరిగింది. దీని వల్ల యాజమాన్యానికి రూ. కోటికి పైగా ఆదనపు భారం పడుతోంది. పెంచిన వేతనాలను ఏప్రిల్ నెల నుంచి అమలు పరుస్తున్నట్లు నిమ్స్ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జులై నెలకు సంబంధించి జీతాలను చెల్లించనున్నారు. వేతన పెంపును వెంటనే అమలు చేయాలని గత నెల5 నుంచి అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘటిత పోరాటం చేపట్టారు. వేతనాలు పెంచేంత వరకు వెనక్కి తగ్గేది లేదని యాజమాన్యానికి ముందుగానే ఆల్టిమేటం ఇచ్చారు. సమ్మె నోటీసు ఇచ్చిన 9వ రోజు నుంచి ఆందోళనకు దిగారు. ఇందుకు నిమ్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, నిమ్స్ కాంట్రాక్ట్ నర్సుల యూనియన్, తెలంగాణ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, నిమ్స్ కాంట్రాక్ట్ టెక్నీషియన్ ఎంప్లాయీస్ యూనియన్లతో ఏర్పడిన జేఏసీ జూన్ 28న నిమ్స్ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. వేతనాలు పెంచేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపినన్పటికీ ఏడాదిగా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 విజృంభిస్తున్న తరుణంలో గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు రూ.28వేలు చొప్పున వేతనం చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ పెంచిన వేతనాలను చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన వేతనాలు ఇలా.. నిమ్స్‌లో పని చేస్తున్న 400 మంది కాంట్రాక్ట్ నర్సులకు ఇక నుంచి రూ.25వేలు చొప్పున వేతనాలు అందుకోనున్నారు. ఇప్పటి వరకు వారికి రూ. 17వేలు చెల్లిస్తున్నారు. 300 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కూడా రూ.25 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఇప్పటి వరకు వీరు రూ. 18వేలు చొప్పున వేతనాలు పొందుతున్నారు. 150 మంది ఒజేటీ( ఆన్ జాబ్‌టైనీస్) బేసిడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు రూ. 25వేలు చొప్పున చెల్లిస్తారు. సెమిస్కిల్డ్ ఔట్‌సోర్స్ ఉద్యోగులు 350 మందికి రూ. 24,600 చొప్పున వేతనం అందుకోనున్నారు. వాస్తవానికి వీరికి రోజువారీ వేతనం రూ. 840.62 చెల్లిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో ఈ మొత్తం రూ. 1102.79లకు పెరిగింది. అన్‌స్కిల్డ్ కార్మికుల వేతనాలను రూ. 12 వేల నుంచి రూ. 14,717 పెంచారు. అవుట్సోర్స్ కాంట్రాక్ట్ విధానంలో పని చేసే వీరికి జీవో నెం.14, 108లు ప్రకారం రోజువారీ వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ప్రకారం జీవో నెం.14 కింద కార్మికులకు రోజుకు రూ. 551.71 నుంచి రూ. 681.55కి, జీవో నెం.108 కింద రూ. 558.46ల నుంచి రూ. 681.55కి పెరిగింది. వీళ్లకు 26 రోజుల చొప్పున వేతనాల చెల్లించనున్నారు. వేతనాలు పెరగడంతో నిమ్స్ కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
నిమ్స్ ట్రయల్స్ .. తొలి అడుగు సక్సెస్
లక్డీకాపూల్ (హైదరాబాద్): కరోనా వ్యాక్సిన్ క్లినిక ల్ ట్రయల్స్ దిశగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తొలి అడుగు విజయవం తమైంది. కరోనా వైరస్ నిరోధానికి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవాక్జిన్‌ను సోమవారం నిమ్స్‌లో ఇద్దరు వలంటీర్లకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో మంగళవారం డిశ్చార్జి చేసినట్టు నిమ్స్ వైద్యులు తెలిపారు. 14 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని నిమ్స్‌లోని కొవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రోజూ ఫోన్, వీడియో కాల్స్ ద్వారా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని, తర్వాత మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తామన్నారు. టీకాలోని అచేతన (అన్‌యాక్టివేటెడ్) వైరస్ వల్ల శరీరంలో యాంటీబాడీస్ ఏ మేరకు వృద్ధి చెందాయి, సమస్యలున్నాయా అనేది పరిశీలిస్తామన్నారు. అంతా సవ్యంగా ఉంటే వారికే రెండో డోస్ టీకా ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం టీకా తీసుకున్న వారిలో అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు లేవన్నారు. కొవాక్జిన్ టీకా మానవ ప్రయోగంలో తొలి ప్రయత్నం విజయవంతమైందని నిమ్స్ క్లినికల్, ఫార్మకాలజీ విభాగం వైద్యులు హర్షం వ్యక్తంచేశారు. నేడు మరో ఇద్దరికి! క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నిమ్స్ వైద్యులు 13 మంది వలంటీర్ల రక్త నమూనాలను ఢిల్లీలోని ఐసీఎంఆర్ ఆమోదించిన ల్యాబ్‌కు పం పించారు. వీరిలో 8 మందికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ అయినట్టు తెలిసింది. ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే బుధవారం మరో ఇద్దరికి టీకా డోస్ ఇవ్వనున్నారు. దీంతో టీకా తీసుకున్న వారి సంఖ్య నాలుగుకి చేరనుంది. వాస్తవానికి మంగళవారం కూడా ట్రయల్స్ నిర్వహించా ల్సి ఉన్నా.. వలంటీర్లు ఎవరూ రాని కారణం గా టీకా ఇవ్వలేదని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ చెప్పారు. ఈ ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యవంతమైన 60 మందిపై మొదటి, రెండో దశ ప్రయోగాలను నిర్వహించనున్నారు. మూడో దశలో వంద మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఐదు డోస్‌ల మేరకు టీకా ఇస్తారు. టీకా ప్రయోగాన్ని 2 – 3 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. పరీక్షలు విజయవంతమైతే ఈ ఏడాది చివరికి లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. -
డాక్టర్ సుల్తానాను నిమ్స్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : ఫీవర్ ఆస్పత్రి డీఎంవో డాక్టర్ సుల్తానాను చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో ఆమెకు ఉచితంగా వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఆదేశాలు ఇచ్చారు. కాగా కరోనా లక్షణాలతో డాక్టర్ సుల్తానా నిన్న (శనివారం) చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పేరుతో తుంబే ఆస్పత్రి యాజమాన్యం 24 గంటలకు రూ.లక్షా 15 వేలు బిల్లు వేసింది. దీంతో బిల్లు ఎక్కువ వేశారని ప్రశ్నించినందుకు డాక్టర్ సుల్తానాను తుంబే యాజమాన్యం నిర్బంధించింది. కరోనా క్లిష్ట సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్‌గా సేవలందించిన తన పట్ల తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుల్తానా సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (చదవండి : దారుణం: బిల్లులపై ప్రశ్నించిన డాక్టర్ నిర్బంధం) -
కరోనా: 7నుంచి నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలై 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయన్నారు. క్లినికల్ ట్రయల్స్‌కు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందని, వ్యాక్సిన్ ఇచ్చాక రెండు రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తామని మనోహర్ పేర్కొన్నారు. (చదవండి : ఆగస్టు 15 నాటికి కరోనా టీకా!) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతు చూసే వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్ఐవీ) కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్‌ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్ ఉన్నాయి. -
నిమ్స్‌లో చికిత్స అందించాలి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 బారిన పడ్డ వైద్యులు, సిబ్బందికి నిమ్స్‌లో మెరుగైన చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. కరోనాపై యుద్ధం చేస్తున్న వారిలో వైద్యులు, వైద్య సిబ్బంది ముందు వరుసలో ఉన్నారని, వీరికి వైరస్ సోకితే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను పలుమార్లు కలవగా ఆయన సానుకూలంగా స్పందించి నిమ్స్‌లో చికిత్సకు అంగీకరించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దీనదయాళ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలను కూడా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. -
‘కరోనా’పై చేతులెత్తేసినట్లుంది..
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వానికి పట్టు సడలినట్లుందని.. ఎక్కడో ఏదో లోపం ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎవరి ప్రాణాలు వారే రక్షించుకోవాలి తప్ప, తామేం చేయలేనట్లు చేతులెత్తేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయంది. 72 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారని, 400 మంది సిబ్బంది క్వారంటైన్లో ఉన్నారని, డాక్టర్లు, సిబ్బంది రక్షణ కోసం కిట్లున్నాయని చెప్పడానికి, వాటిని వారికి అందచేయడానికి ఎంతో తేడా ఉందని తెలిపింది. డాక్టర్లపై భౌతిక దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని, ప్రతి వార్డుకు, ప్రతీ డాక్టర్‌కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు తెలిపింది. ఆసుపత్రుల్లో ఎంత మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.. ఎందరికి పరీక్షలు చేశారు.. ఏఏ మౌలిక సదుపాయాలున్నాయి.. డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత భద్రత పరికరా (పీపీఈ) లున్నాయా.. వంటి వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించాలని గాంధీ, నిమ్స్, కింగ్స్ కోఠి, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులకు తగినన్ని పీపీఈ కిట్లు, మాస్క్‌లు ఇతర రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ న్యాయవాది సమీర్ అహ్మద్ హైకోర్టుకు లేఖ రాయగా, దీన్ని కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఆసుపత్రుల్లో పరిస్థితులు, రక్షణ పరికరాల సరఫరాపై నివేదికలివ్వాలని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను కోరినా ఇప్పటివరకు స్పందించకపోవడంపై ధర్మాసనం ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేసింది. గాంధీలో పరిస్థితి ఆందోళనకరం.. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు 7 లక్షల రక్షణ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారని, అందుబాటులో ఉండటానికి, వాటిని డాక్టర్లకు, సిబ్బందికి ఇవ్వడానికి ఎంతో తేడా ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. డాక్టర్లు, సిబ్బందికి వాటిని పూర్తిస్థాయిలో అందజేయకపోవడం వల్లే వారు కూడా కరోనా బారిన పడుతున్నారంది. ఆసుపత్రుల్లో కరోనా రావడం లేదని, సిబ్బంది ఉంటున్న హాస్టళ్లలోనే వస్తోందని శ్రీనివాసరావు చెబుతుండటాన్ని ఎలా చూడాలని ప్రశ్నించింది. తమపై భౌతిక దాడుల గురించి జూనియర్ డాక్టర్లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా, వారి రక్షణ కోసం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ విషయంలో తాము గతంలో ఇచ్చిన ఆదేశంపై ఎందుకు స్పందించలేదంది. తమ ఆదేశాలను ఇలా ఉల్లంఘిస్తూ పోతే అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. కోర్టు హాళ్ల వద్ద ఎలా రక్షణ కల్పించారో, డాక్టర్లకు, ఆయా వార్డుల వద్ద అలానే రక్షణ కల్పించాలని తేల్చి చెప్పింది. జిల్లాకో కరోనా ఆసుపత్రి ఏమైంది..? ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాబోయే 10 రోజుల్లో 50 వేల పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణలో పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని ధర్మాసనం తెలిపింది. ఒక్క రోజులోనే 200కి పైగా కేసు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చునంది. జిల్లాకో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఎంత వరకు కార్యరూపం దాల్చాయని ప్రశ్నించింది. ఇప్పటికే ఆసుపత్రులను గుర్తించామని, ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై గురువారం విచారణ జరగనుందని ఏజీ వివరించారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్ప్లుయెంజాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినప్పుడు, కరోనాను ఎందుకు తీసుకురాకూడదని ప్రశ్నించింది. మే 16న ఇచ్చిన కరోనా బులిటెన్ అంతకుముందు రోజు ఇచ్చినట్లే ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. చైనాలో రక్షణ శాఖ వైద్యుల సాయంతో అతి తక్కువ సమయంలో ఆసుపత్రి నిర్మించారని, ఇక్కడ కూడా రక్షణ శాఖ వైద్యుల సాయం ఎందుకు తీసుకోవడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. తాము లేవనెత్తిన అన్ని అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని అంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
నిమ్స్‌లో భయం భయం: వైద్య సిబ్బందికి కరోనా
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రి కరోనా భయంతో వణికిపోతోంది. ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి చెందిన నలుగురు రెసిడెంట్ వైద్యులు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లకు తాజాగా కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో వారిని ఆస్పత్రి మిలీనియం బ్లాక్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఓ రోగికి స్టెంట్ వేసే క్రమం లో వీరికి వైరస్ సోకినట్లు తెలిసింది. కార్డియాలజీ విభాగంలో 10 మంది రోగులు ఉండగా, వీరిలో ఇద్దరిని మినహా మిగిలిన వారందరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వైద్యులకు కరోనా సోకడంతో వారితో కలసి హాస్టల్ మెస్‌లో భోజనం చేసిన వారు.. గదిలో కలసి ఉన్న వారు.. కలసి చదువుకున్న వైద్యుల్లో ఆందోళన నెలకొంది. అంతేకాదు వీరితో చికిత్సలు చేయించుకున్న రోగులు సైతం భయంతో వణికిపోతున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ స్టాఫ్ నర్సు సహా మరో ల్యాబ్ టెక్నీషియన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆస్పత్రులపై కరోనా దాడి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులను కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతోంది. వివిధ రుగ్మతలతో బాధపడుతూ అత్యవసర చికిత్సల కోసం ఆస్పత్రికి వస్తున్న రోగుల్లో ఎవరికి వైరస్ ఉందో.. ఎవరికి లేదో.. గుర్తించడం కష్టంగా మారింది. ఓపీ, ఐపీ రోగులను ముట్టుకోకుండానే వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. కానీ ఆపరేషన్ థియేటర్లో రోగిని ముట్టుకోకుండా సర్జరీ చేయలేని పరిస్థితి. సర్జరీల్లో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి రోగుల నుంచి వైరస్ సోకుతోంది. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సహా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చెందిన ఒక ప్రొఫెసర్ సహా 23 మంది పీజీలు ఇప్పటికే వైరస్ బారిన పడ్డారు. -
నిమ్స్‌లో నిర్లక్ష్యం!
లక్డీకాపూల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యసేవలను అందించే నిమ్స్ ఆస్పత్రి మాత్రం నిబంధనలను పాటించడం లేదన్న విమర్శ వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బందికి భద్రత కల్పించే విషయంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ విభాగంలో పని చేసే ముగ్గురు వైద్యులను, నలుగురు నర్సులను హోం క్వారంటైన్‌కు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఓ నర్సుకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో యాజమాన్యం ఔట్ పేషెంట్లకు కరోనా స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహిస్తుంది. ఈ తరుణంలో వైద్యులకు, సిబ్బందికి తగిన విధంగా భధ్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా లాక్డౌన్ కారణంగా విధులకు హాజరయ్యే విషయంలో సిబ్బంది అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సిబ్బంది రాకపోకలకు గానూ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకు మేఘ ఇంజనీర్స్ సంస్థ ఆర్థిక సహకారాన్ని అందించింది. దాంతో నగర వ్యాప్తంగా ఉన్న నిమ్స్ సిబ్బంది సౌకర్యార్థం ఏడు రూట్లు విభజించి అందుకు అనుగుణంగా బస్సు సదుపాయాన్ని కల్పించింది. దీంతో పాటుగా టీఎస్ ఆర్టీసీ కూడా మరో రెండు బస్సులను సమకూర్చింది. అయినప్పటికీ మూడు షిఫ్ట్‌లు విధులను నిర్వహించే నిమ్స్ సిబ్బంది సంఖ్యకు తగిన విధంగా బస్సులను సమకూర్చకపోవడంతో సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక బస్సులను కూడా సర్వీసు బస్సులుగా నిర్వహించడం ఎంత వరకు సమంజసమని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ ఎమర్జెన్సీ సర్వీసు అయిన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో విధులకు వస్తున్నామని, అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాస్తవానికి సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటుగా వర్కర్లకు మాస్క్‌లు, గ్లౌస్లు, హెల్త్‌కేర్ సిబ్బందికి పీపీఇ కిట్లను అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. -
అత్యాధునిక వైద్యం.. నిమ్స్ సొంతం
లక్డీకాపూల్ : నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో సామాన్యుడికి సైతం అత్యాధునిక వైద్యం అందుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్న నిమ్స్ ఎప్పటికప్పడు కొత్త పద్ధతులను అవలంబిస్తోంది. నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యజామాన్యం దృష్టి పెట్టింది.ఈ క్రమంలో భాగంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ సూట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 28 విభాగాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ప్రతిష్టాత్మకంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలను నిర్వహిస్తుంది. ఇప్పటికే లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలను ఆరోగ్య శ్రీ రోగులకు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎనిమిది ట్రాన్స్‌ప్లాంటేషన్ సూట్లను ఏర్పాటు చేశారు. ఆరోగ్య శ్రీ రోగులకు సైతం ఈ సూట్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ సూట్స్‌ను మిలీనియం బ్లాక్‌లో నిర్మించారు. బోన్ మ్యారో చికిత్సలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. యూరాలజీ విభాగం పర్యవేక్షణలో కొనసాగే స్టెమ్ సెల్స్ విభాగాన్ని రూ. 20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. దీనిని మిలీనియం బ్లాక్‌లోని ఐదవ అంతస్తులో ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు స్టెమ్ సెల్స్ యూనిట్.. దశాబ్దకాలంలో ప్రతిపాదన దశలో ఉన్న ఈ యూనిట్ ఎట్టకేలకు కార్యరూపంలో వచ్చింది. ఈ విషయంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తం మీద నిమ్స్‌లో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్య సేవలు పేదల ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో యాజమాన్యం ఉంది. ఇప్పటికే సాధారణ అవుట్ పేషెంట్ విభాగంతో పాటు ఈవినింగ్ ఓపీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రూ. 500 స్పెషల్ ఓపీలో వైద్య సేవలను అందుకుంటున్నారు. ఒక విభాగానికి ఓపీ కార్డు తీసుకుని దాంతో పాటు మరో విభాగంలో వైద్య సలహాలు పొందాలంటే మరో రూ. 200లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ఆ కార్డు కాల పరిమితిని 14 రోజుల పాటు ఉంటుంది. ఈ విధంగా వైద్య సేవలను సరళతరం చేస్తున్నారు. హెల్త్ చెకప్ ప్యాకేజీలు.. హెల్త్ చెకప్ ప్యాకేజీలు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. నిమ్స్ ఓల్డ్ బిల్డింగ్‌లోని గతంలో క్యాథ్‌ల్యాబ్ విభాగాన్ని నిర్వహించిన ప్రాంతంలో ఈ పరీక్షలనున ఇర్వహిస్తున్నారు. ఓపీ కౌంటర్లతో ప్రమేయం లేకుండానే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో వెల్నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. దానికి అదనంగా ఆయుష్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రకృతి వైద్య విభాగానికి చెందిన ఈ ఆయూష్ కేంద్రంలో రోగులకు ఆహారపు అలవాట్లు పట్ల అవగాహన కల్పించడమే కాకుండా యోగ ద్వారా దీర్ఘ కాలిక వ్యాధులకు సైతం స్వస్ధత చేకూరే విధంగా వైద్య సేవలను అందిస్తున్నారు. ఆ విధంగా వెల్నెస్ సెంటర్ పేరుతో కొనసాగుతున్న విభాగంలో ఆయూష్, హెల్త్ చెకప్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆధునాత పద్ధతుల్లో ఫుడ్ కోర్డ్‌ను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ విషయంలో డైరెక్టర్ మనోహర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. -
మాస్టర్ @2800
లక్డీకాపూల్:నిమ్స్‌లో కార్పొరేట్ తరహాలోవైద్యపరీక్షల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదలకు మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకితీసుకురావాలన్న ఉద్దేశంతో సరళతరమైన రీతిలో 12 రకాల హెల్త్ చెకప్ ప్యాకేజీలను రూపొందించారు. వీటి వివరాలను నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్బుధవారం నిమ్స్‌లో ఏర్పాటుచేసినవిలేకరుల సమావేశంలో వెల్లడించారు.హెల్త్ చెకప్ బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సైతం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యసేవలనుఅందించేందుకు ప్రత్యేక దృష్టినికేంద్రీకరించినట్టు తెలిపారు. అందులో భాగంగానేరూ.2800కే మాస్టర్ హెల్త్ చెకప్ చేయనున్నామన్నారు. తెలియని వ్యాధుల నిర్ధారణకు.. తెలియని కొన్ని రకాల వ్యాధులను నిర్ధారించుకునేందుకు వైద్య పరీక్షలు ఎంతో అవసరం. ఈ క్రమంలో అతి తక్కువ ధరలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు 12 రకాల హెల్త్ చెకప్ ప్యాకేజీలను రూపొందించారు. ముఖ్యంగా మహిళల హెల్త్ ప్రొఫైల్, సీజనల్ జ్వరాలు వంటి అంశాలలో గతంలో రూపొందించిన మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీకి రోగుల నుంచి పెద్దగా స్పందన కానరాలేదు. ఆయా ప్యాకేజీలలో కొన్ని అవసరం లేని పరీక్షలు ఉన్నందున ఆయా ప్యాకేజీలకు ఆదరణ కరువైందని డైరెక్టర్ చెప్పారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించామని వివరించారు. ఆయా ప్యాకేజీలలో హెల్త్ చెకప్‌ను నేరుగా గతంలోని క్యాత్ ల్యాబ్‌లోకి వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి. మాస్టర్ హెల్త్ చెకప్: రూ.2,800 నిమ్స్ మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో హెచ్‌బీ, పీసీవీ, ఎంసీవీఎంహెచ్సీ, ఎంసీహెచ్‌సీ, టీఎస్సీ, డీసీ, పీఎల్టీ, రీటిక్, ఎస్ఆర్, పీఎస్ టెస్టులు చేస్తారు. అంతే కాకుండా సియూఈ, సిరమ్ యూరియా, సిరమ్ క్రియాటినైన్, ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్, హెచ్‌బీఏ1సి పరీక్షలు కూడా ఉంటాయి. డయాబెటిక్ హెల్త్ చెకప్: రూ.2100 డయాబెటిక్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి. ఉమెన్ వెల్నెస్ చెకప్:రూ.4700 ఉమెన్ వెల్నెస్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లు, టీఎస్‌హెచ్, ఈసీజీ, సీఎక్స్ఆర్–పీఏ రివ్యూ, యుఎస్‌జీ – అబ్డామన్, మామోగ్రఫీ వంటి పరీక్షలతో పాటు కన్సల్టేషన్ ఉంటాయి. ఫీవర్ ప్రొఫైల్: రూ.4500 ఫీవర్ ప్రొఫైల్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, మలేరియా స్ట్రీప్, విడాల్ లిట్రేస్, డెంగ్యూ సెరాలాజీ, వెల్ప్లెక్స్/స్క్రబ్ టైప్స్ రాపిడ్ ఐసిటీ, లెప్టొస్పిరా యాంటీబాడీస్ పరీక్షలు ఉంటాయి. ఎనీమియా టెస్ట్:రూ.2000 ఎనీమియా టెస్ట్ ప్యాకేజీలో హీమోగ్రామ్, ఐరన్ స్టడీస్, విటమిన్ బి12, ఎస్‌డిహెచ్, బైల్యురోబిన్ (టోటల్+కన్సల్టేషన్) పరీక్షలు ఉంటాయి. రెస్పిరేటరీ హెల్త్ చెకప్:రూ.1500 రెస్పిరేటరీ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్ పరీక్షతో పాటుగా అబ్సల్యూట్ కౌంట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఇమ్యునాల్జాబులిన్ పరీక్షలు ఉంటాయి. బోన్ అండ్ జాయింట్ హెల్త్ చెకప్: రూ.2400 బొన్ అండ్ జాయింట్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్–డి, యూరిక్ యాసిడ్, టీఎస్‌హెచ్, ఈఎస్ఆర్ పరీక్షలతో పాటు కన్సల్టేషన్ సేవలు పొందవచ్చు. కార్డియాక్ హెల్త్ చెకప్: రూ.3800 కార్డియాక్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2డి ఈకో, సీఎక్స్ఆర్–పీఏ రివ్యూ, టీఎంటీ పరీక్షలతో పాటు కన్సల్టేషన్ సేవలు పొందవచ్చు. కిడ్నీ హెల్త్ చెకప్: రూ.1900 కిడ్నీ హెల్త్ చెకప్ ప్యాకేజీలో సెరమ్ యూరియా, సియూఈ, సెరమ్ క్రియేటినైన్, సెరమ్ కాల్షియం, సెరమ్ యూరిక్ యాసిడ్, యూరిన్ మైక్రో అల్బుమిన్, సెరమ్ ఆల్బుమిన్(టోటల్) పరీక్షలతో పాటుగా కన్సల్టేషన్ సేవలు పొందవచ్చు. కేన్సర్ స్క్రీనింగ్: రూ.2000 (పురుషులు) కేన్సర్ స్క్రీనింగ్ పురుషుల ప్యాకేజీలో పీఎస్ఏ, యుఎస్‌జీ– అబ్డామిన్, సీఎక్స్ఆర్–పీఏ రివ్యూ, సెరమ్ క్రియేటినైన్, సీబీపీ, హీమోగ్రామ్, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు ఉంటాయి. కేన్సర్ స్క్రీనింగ్: రూ.3500 (మహిళలు) కేన్సర్ స్క్రీనింగ్ మహిళలు ప్యాకేజీల మామోగ్రఫీ, పీఎస్ఏ, హిమోగ్రఫీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి. టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్: రూ.2500 టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్ ప్యాకేజీలో టి3, టి4, టిఎస్హెచ్, యాంటీ థైరాయిడ్, యాంటీ బ్యాడీ, హెచ్ఆర్యుఎస్ నెక్ పరీక్షలు చేస్తారు. లివర్ ప్రొఫైల్: రూ.2200 లివర్ ప్రొఫైల్ ప్యాకేజీలో లివర్ ఫంక్షన్ టెస్ట్‌తో పాటుగా సెరమ్ జీజీటీపీ, హెచ్ఐవీ ఈఎల్ఎఫ్ఏ, హెచ్‌బీఎస్‌ఏజీ ఈఎల్ఎఫ్ఏ, హెచ్‌సీవీ ఈఎల్ఐఎస్ఏ, యుఎస్‌జి అబ్డామిన్ పరీక్షలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్: రూ.7000 (పురుషులు) ఈ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. అదే ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ మహిళలు ప్యాకేజీలో రూ.8000 చెల్లించాలి. వివరాలకు 040–23489023 ఫోన్ నెంబర్లో సంప్రదించాలి. -
జీతాలు పెంచితేనే..విధుల్లో చేరుతాం
లక్డీకాపూల్: నిమ్స్‌లో ఒప్పంద నర్సులు చేపట్టిన ఆందోళన ఆదివారం మూడో రోజుకు చేరింది. వివిధ విభాగాల హెచ్ఓడీలతో కూడిన కోర్ కమిటీ చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. వేతనాలు పెంచేంత వరకు రాజీపడే ప్రసక్తే లేదని నర్సులు తేల్చిచెబుతున్నారు. విద్యార్థులకు చెల్లిస్తున్న విధంగా స్టైపెండ్ రూపంలో నామమాత్రంగా వేతనాలు అందజేస్తూ.. యాజమాన్యం తమ శ్రమను దోచుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలను పెంచి, ఎరియర్స్‌ను కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా జరిపిన కోర్ట్ కమిటీ చర్చలు ఫలించలేదు. ఆందోళన కొనసాగకుండా విధులకు హాజరయ్యేలా కోర్ కమిటీ ఎంత ప్రయత్నించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఒప్పంద నర్సులకు మద్దతుగా నిమ్స్ ఉద్యోగ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నగర శాఖ అధ్యక్షుడు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. నిమ్స్ నర్సెస్ యూనియన్ ప్రధాన కార్యదర్శులు విజయకుమారి, పారా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శిరందాస్ శ్రీనివాసులు, తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు రాజ్ కుమార్‌లు సైతం ఒప్పంద నర్సులకు సంఘీభావం ప్రకటించారు. పరిస్థితి అధ్వానం.. విద్యార్థులకు చెల్లించే స్టైపెండ్ లెక్కన వేతనాలు చెల్లిస్తున్నారు. ఏళ్ల తరబడి చేస్తున్న తమ సర్వీసు ఎందుకూ పనికి రాని విధంగా తయారైంది. సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ల కన్నా మా పరిస్థితి అధ్వానంగా మారింది. ఆస్పత్రిలో కీలకమైన సేవలు అందజేస్తున్న మమ్మల్ని యాజమాన్యం శ్రమదోపిడీ చేస్తోంది. ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. – అరుణ కుమారి, ఒప్పంద నర్సు మంత్రి ఆదేశాలూ బేఖాతరు.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలను కూడా యాజమాన్యం లెక్కడ చేయడం లేదు. నిమ్స్ బడ్జెట్ నుంచి వేతనాలను ఇవ్వాలని మంత్రి ఈటల చెప్పారు. కానీ యాజమాన్యం మాత్రం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే ఇస్తామంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమతో పాటు చేరిన ఒప్పంద నర్సులకు కొంత మందికి రూ.35 వేల చొప్పున చెల్లిస్తున్నారు. మా విషయానికి వచ్చేసరికి ఉత్తర్వులు అంటూ దాటవేస్తోంది. – దేవేందర్, ఒప్పంద మేల్ నర్సు నాటి హామీలేమయ్యాయి.. వేతనాలు పెంపుదల విషయమై 2005లో ఆందోళన చేపట్టినప్పడు ప్రస్తుత మంత్రి, నాడు ఎమ్మెల్యే హోదాలో మా డిమాండ్లను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో చర్చించి పే స్లిప్‌తో కూడిన వేతనాలు పెంచేందుకు, మెటర్నటీ లీవ్‌లు మంజూరు చేసేందుకు తీర్మానించారు. ఐదు సంవత్సరాలు సర్వీసు ఉన్న వాళ్లకి రూ. 25 వేలు చొప్పున, ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్న వాళ్లకి రూ.30 వేలు చొప్పున చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. కనీసం పీఎఫ్, మెడికల్ అలవెన్స్ కూడా లేని దీన స్థితిలో విధులు నిర్వర్తిస్తున్నాం. – మంజుల, ఒప్పంద నర్సు -
ఒక రోగి ఎన్ని ఓపీ కార్డులు తేవాలి..?
సాక్షి, సిటీబ్యూరో: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రోగులు దోపిడీకి గురవుతున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలను అందిస్తున్న దృక్ఫథంతో తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ ఆసుపత్రిని ప్రత్యేక తరహాలో నిర్వహిస్తోంది. అయితే స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఈ ఆసుపత్రిలో పాలకులు చిత్తం వచ్చినట్టు నియమ నిబంధనలు విధించడంతో రోగుల పాలిట శాపంగా మారింది. అభివృద్ధి పేరిట, ప్రభుత్వం వద్ద తాము ఆదాయం వనరులను చూపించే క్రమంలో ఆసుపత్రి యాజమాన్యం తమకు తోచిన విధంగా రూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శ లేకపోలేదు. పెరుగుతున్న రోగులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన యాజ మాన్యం వారికి భారంగా తయారైందనే వ్యాఖ్యలు సర్వత్రా వినవస్తున్నాయి. ఓపీ కార్డులు తీసుకోవాల్సిందే.. ఆస్పత్రి ఒక్కటే అయినప్పటికీ రెండు మూడు ఓపీ కార్డులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఏ డిపార్టుమెంట్‌కు ఆ డిపార్టుమెంట్ ఓపీ కౌంటర్లో ఓపీ కార్డు తీసుకోవాల్సిందేనని నిమ్స్ ఉద్యోగులు హుకుం జారీ చేస్తున్నారు. బుధవారం ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగయ్య అనే రోగి శస్త్ర చికిత్స నిమిత్తం నిమ్స్‌ను వచ్చాడు. సర్జకల్ ఆంకాలజీ విభాగంలో ఓపీ కార్డు తీసుకొని వైద్యుడిని సంప్రదించారు. ఆయనను పరీక్షించిన ఆ విభాగం వైద్యులు. కేసు క్రిటికల్‌గా ఉంది. ఒకసారి కార్డియాలజీ విభాగంలో చూపించుకోవాల్సిందిగా సూచించారు. దాంతో అక్కడి వైద్యుడిని కలవడానికి వెళ్లగా ఓపీ కార్డు తీసుకురమ్మని సిబ్బంది ఆదేశించారు. అదేంటి ఓపీ కార్డు తీసుకున్నాం కదా అని.. సర్జికల్ ఆంకాలజీ విభాగానికి సంబంధించి తీసుకున్న ఓపీ కార్డును సంగయ్య సహాయకురాలు చూపించారు. ఇది.. కార్డియాలజీ ఓపీలో కార్డు తీసుకురావాలని చెప్పారు. ఒక రోజుకు ఒకే రోగి రెండు, మూడు ఓపీ కార్డులను తీసుకోవడమంటే ఎంత వరకు సమంజమని రోగి సహాయకులు ప్రశ్నిస్తున్నారు. నిమ్స్ యాజమాన్య వైఖరిపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్‌చెరువుకు చెందిన రోగి సహయకుడు సంజయ్ అభిప్రాయపడుతున్నారు. గతంలో అయితే.. గతంలో అయితే ఒకసారి ఓపీ కార్డు తీసుకుంటే ఆ కార్డు మీద దాదాపుగా 15 రోజులు వైద్యులను సంప్రందించడానికి అవకాశం ఉండేది. అప్పట్లో ఓపీ కార్డు కూడా కేవలం రూ. 50లకే జారీ చేసేవాళ్లు. దాంతోనే ఆసు పత్రిలోని 28 సూపరు స్పెషాలిటీ విభా గాలల్లోనూ ఆయా వైద్యులను కలుసుకునే వెలుసుబాటు రోగులకు ఉండేది. అలాంటిది.. యాజమాన్యం తాజాగా తీసుకున్న నిర్ణ యాల వల్ల ఓపీ కార్డు కూడా మొబైల్‌కి వచ్చే ఓటీపీ చందంగా తయారైందని పలువురు రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా ఈ విధమైన వైఖరి లేదనీ, ఇక్కడ అంతకు మించి దోపిడీ జరుగుతుందన్నారు. ఏ విభాగానికి ఆ ఓపీ కార్డు ప్రత్యేకం.. ఓపీ కార్డు విషయమై సంబంధిత ఆర్ఎంఓని సంప్రదించగా ఆసుపత్రి వైద్యసేవలన్నీ కంప్యూటీకరణ చేయడం జరిగిందని చెప్పారు. దాని వల్ల ఏ డిపార్టుమెంట్‌కు ఆ డిపార్టుమెంట్‌కు సంబంధించి విధిగా ఓపీ కార్డు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఆయా విభాగాలలో ప్రత్యేకంగా ఓపీ కార్డులను జారీ చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఆసుపత్రి పరిపాలనా అధికారి కూడా ధ్రువీకరించడం గమనార్హం. -
గంటా చక్రపాణికి పితృవియోగం
సాక్షి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న చక్రపాణి తండ్రి మొగలయ్య కన్నుమూశారు. 8 రోజుల నుంచి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొగలయ్య శుక్రవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. మొగలయ్య భౌతికకాయాన్ని వారి స్వస్థలం కరీంనగర్ జిల్లాకు తరలిస్తున్నారు. -
నిమ్స్‌లో జగదీశ్ రెడ్డికి కేటీఆర్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హై ఫీవర్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంత్రిని పరామర్శించిన కేటీఆర్... ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు పలువురు పార్టీ నేతలు జగదీశ్ రెడ్డిపి పరమర్శించారు. -
చీదరింపులు.. చీత్కారాలు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ప్రస్తుతం తన ’ప్రభ’ను కోల్పోతుంది. రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. చీదరింపులు.. చీత్కారాలు షరా మామూలయ్యాయి. రోగుల బంధువులను టెస్టులు, జిరాక్స్ కాపీల కోసం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఇలా ఆస్పత్రి మొత్తం తిప్పుతున్నారు. ఫలితంగా నగదు చెల్లింపు రోగులు ఆస్పత్రికి దూరం అవుతున్నారు. ఒకప్పుడు కాసులతో గలలాడే ఆస్పత్రి ఖజనా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ముందు మోకారిల్లాల్సిన పరిస్థితి నెలకొంది. 2014కి ముందు పేయింగ్ రోగులు 55 శాతం ఉంటే, ఆరోగ్యశ్రీ రోగులు 45 శాతం మంది ఉండేవారు. ప్రస్తుతం 80 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉంటే, 20 శాతం మంది మాత్రమే పేయింగ్ రోగులు వస్తున్నారు. మంచి హస్తవాసి ఉన్న అనేక మంది సీనియర్ వైద్యులు పదవీ విరమణ చేయడం, అంతో ఇంతో నైపుణ్యం ఉన్న వైద్యులు కూడా ఆస్పత్రిలోని అంతర్గత కుమ్ములాటలను తట్టుకోలేక బయటికి వెళ్లిపోయారు. అప్పటి వరకు హస్తవాసి, నైపుణ్యం ఉన్న వైద్యులను వెతుక్కుంటు వచ్చిన రోగులు కూడా వారినే వెతుక్కుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రికి నగదు చెల్లింపు రోగుల సంఖ్య తగ్గింది. సిబ్బంది వేతనాల చెల్లింపు, ఆస్పత్రి నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. అడిగితే చెప్పే వారేరీ.. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ బ్లాక్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, మిలీనియం బ్లాక్, మెట్టురంగారెడ్డి భవనం, కేన్సర్ బ్లాక్, ఓపీడీ బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్కో విభాగం ఒక్కో బ్లాక్‌లో ఉన్నాయి. డయాగ్నోస్టిక్ లేబోరేటరీ, రక్తనిధి కేంద్రం, ఆరోగ్యశ్రీ కౌంటర్, మెడికల్ షాపులు వేర్వేరుగా ఉన్నాయి. ఓపీ కార్డు తీసుకుని, వైద్యుడికి చూపించుకుంటారు. వ్యాధి నిర్ధారణ కోసం వైద్యుల రక్త, మూత్ర పరీక్షలతో పాటు కొంత మందికి సీటీ, ఎంఆర్ఐ, ఈసీజీ, 2డిఎకో, ఆల్ట్రాసౌండ్ వంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. అయితే ఏ స్పెషాలిటీ ఏ బిల్డింగ్‌లో ఉంది? ఏ డాక్టర్ ఏ నెంబర్ గదిలో ఉంటారు? ఏ నెంబర్ గదిలో ఏ పరీక్ష చేస్తారు? వంటి వివరాలు చెప్పివారు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలియక ఎవరైనా సిబ్బందిని అడిగితే..చీదరింపులు..చీత్కారాలు తప్పడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో నిమ్స్‌కు వచ్చే రోగులకు కూడా మంచి వైద్య సేవలతో పాటు ఇతర సమాచారాన్ని అందజేసేందుకు ప్రజాసంబంధాల పేరుతో ఇప్పటికే తొమ్మిది మందిని నియమించారు. కానీ పీఆర్ఓల పేరుతో ఆస్పత్రిలో చేరిన వారిలో ఎవరు? ఏ వార్డులో పనిచేస్తున్నారు? వంటి కనీస సమాచారం కూడా అధికారుల వద్దలేకపోవడం గమనార్హం. -
నిమ్స్‌లో ‘గేమ్స్’
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఏర్పడ్డాయి. నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తుండగా అంతర్గత కుమ్ములాటలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వేతనాలు చాలా తక్కువగా ఉండటంతో మరికొంత మంది ఆస్పత్రిని వీడుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేస్తున్నప్పటికీ..ఇక్కడ పని చేసేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. వచ్చిన వారు కూడా రెండు మూడేళ్ల తర్వాత ఆస్పత్రిని వీడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుతం 311 పోస్టులకు గాను 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిíషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు..రోగుల చికిత్సలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ వైద్యులు లేకపోవడంతో ఆ భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. పదవీ విరమణ చేసిన కొంత మంది సీనియర్ వైద్యులు ఆ తర్వాత కూడా ఇక్కడ పని చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ వారిని తీసుకునేందుకు యాజమాన్యం విముఖత ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. ఇమడలేక వీడుతూ.. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జీఎస్‌ఎన్‌రాజు, ప్రముఖ అనెస్తీయన్ డాక్టర్ గోపినాథ్ సహా మరో వైద్యురాలు ఇటీవల పదవీ విరమణ చేశారు. కొంత మంది వైద్యుల మధ్య నెలకొన్ని అంతర్గత విభేధాల వల్ల న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానసపాణిగ్రహి, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ కూడా ఆస్పత్రిని వీడారు. పరిపాలనా పరమైన వేధింపులే ఇందుకు కారణమని డాక్టర్ ప్రవీణ్ అప్పట్లో తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీనామా తర్వాత మోకాలి చికిత్సలు 10 నుంచి 15 శాతానికి పడిపోయాయి. రుమటాలజీ విభాగం, హెమటాలజీ విభాగం, ఎండోక్రైనాలజీ విభాగాల్లో చికిత్సలు గగనమయ్యాయి. యూరాలజీ, నెఫ్రాలజీ విభాల్లోనే ఇదే పరిస్థితి. ఇదిలా ఉంటే అనస్తీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. అనస్తీషియన్ల కొరత వల్ల పలు ఆపరేషన్ థియేటర్లు కూడా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో తెలుసుకోవచ్చు. కాలేయ మార్పిడి, గుండె మార్పిడి చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. వైద్యు లను ప్రోత్సహించి చికిత్సల సంఖ్యను పెంచాల్సిన ఉన్నతాధికారులే వీటికి అడ్డుపడుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. రెసిడెంట్లపైనే భారం.. పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్లలో నిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మాకమైంది. 1986లో పడకల సామర్థ్యం 500 ఉండగా, ప్రస్తుతం 1500 చేరింది . ఉద్యోగుల పదవీ విరమణలతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ వివిధ విభాగాల్లో 423 మంది రెసిడెంట్ డాక్టర్లు చదువుతున్నారు. చదువుకునే సమయంలో ఏ విద్యార్థి అయినా ఒత్తిడికి గురవుతుండటం సహజమే. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులను నియమించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి పెరగడం, వారి నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల రెసిడెంట్లపై పని భారం పడుతోంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పని చేయాల్సి వస్తుంది. రెసిడెంట్లకు కనీస విశ్రాంతి, పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లేకపోవడం, పని ప్రదేశంలో అహ్లదకరమైన వాతావరణం లేకపోవడం కూడా మానసిక ఒత్తిడికి గురువుతున్నారు. గత రెండేళ్ల క్రితం నిమ్స్‌లో వెలుగు చూసిన ఓ రెసిడెంట్ డాక్టర్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ రాజారెడ్డి కమిటీ కూడా ఇదే అంశాన్ని గుర్తించి, 18 సూచనలు కూడా చేసింది. కానీ వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవని రె సిడెంట్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. -
ఎంతమందిని అడ్డుకుంటారు!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెల్త్ బులిటెన్ విడుదల చేయాలంటూ సీపీఐ కార్యకర్తలు నిమ్స్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సాంబశివరావును పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేర్చి రెండురోజులవుతున్న ఇప్పటివరకు సాంబశివరావు హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదని సీపీఐ నేతలు మండిపడ్డారు. వెంటనే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కును పోలీసులు పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇది కోరి కోట్లాడీ సాధించుకున్న తెలంగాణ అన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... నిరసన తెలిపితే పోలీసులు ఉద్యమాన్ని అడ్డుకుంటాం అంటే మరింత ఉదృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ నిరసన చేసినా అక్కడ అడ్డుకుంటామని పోలీసులు అనుకుంటే ఎంతమందిని అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. -
అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట
ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామి సంస్థ మేఘా ఇంజనీరింగ్ సామాజిక సేవలోనూ ముందుంటోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. మరోవైపు క్యాన్సర్ బాధిత చిన్నారులను అక్కున చేర్చుకుని, వారికి మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర సామగ్రిని అందిస్తోంది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో అత్యాధునిక వసతులతో క్యాన్సర్ బాధితుల కోసం అంకాలజీ భవనాన్ని నిర్మించి ఇచ్చింది. అంతేకాకుండా అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట కార్యక్రమాన్ని కూడా ఎంఇఐఎల్ నిర్వహిస్తున్నది. అలాగే ఎంఇఐఎల్ తన సేవా కార్యక్రమాలను గ్రామాలకు విస్తరించింది. ఎలాంటి రాజకీయ ఎజెండా లేకుండా.. కేవలం గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ గ్రామాలను దత్తత తీసుకొని వాటి వికాసానికి తనవంతు తోడ్పడుతోంది. ఏపీ, తెలంగాణలోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జములపల్లిలో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఆధునీకరించి, ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే సోలార్ ప్లాంట్ తోపాటు రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాలోని డోకిపర్రు, ఖాజా గ్రామాలను దత్తత తీసుకున్న ఎంఇఐఎల్ ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. డోకిపర్రులో కళ్యాణ మండపం, దేవాలయం నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు అందించింది. అలాగే రాయలసీమ ప్రాంతంలో నాగులాపురం,గంజిగుంటపల్లి గ్రామాలను దత్తత తీసుకుంది. ద ఇక తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని పస్పుల, మురహరిదొడ్డి గ్రామాలను దత్తత తీసుకుని,రహదారులను నిర్మించడంతో పాటు సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఎంఇఐఎల్ భోజనామృతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తొలివిడతలో నీలోఫర్‌తోపాటు ఉస్మానియాలో రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. ఇలా సంత్సరంలో దాదాపు 10 లక్షల మంది ఆకలి తీరుస్తున్నది. అలాగే ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిచేస్తోంది. దీంతోపాటు ప్రాణం ఫౌండేషన్‌కు చెందిన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యంతో పాటు, సద్దిమూట కార్యక్రమం ద్వారా సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ యార్డ్ లలో రైతులు, హమాలీల ఆకలి తీరుస్తున్నది. నిమ్స్‌లో అత్యాధునిక అంకాలజీ భవనం నిమ్స్‌లో అత్యాధునిక సదుపాయాలతో అంకాలజీ ఆసుపత్రి భవనాన్ని మేఘా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలను ఎంఇఐఎల్ కల్పించింది. ఇందులో ప్రత్యేక వార్డులతో పాటు.. ఐసీయూ, బెడ్లు, ఆక్సిజన్ సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయం, బెడ్ లిఫ్ట్ సౌకర్యం గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చింది. -
ప్లాస్టిక్ కవర్లో చుట్టి...ముళ్లపొదల్లో పసికందు
సాక్షి, హైదరాబాద్ : తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన ఓ చిన్నారి ముళ్ల పొదలపాలైంది. కన్న మమకారం మరిచిన తల్లి అప్పుడే పుట్టిన ముక్కపచ్చలారని తన కూతుర్ని ముళ్లపొదల్లో విసిరేసింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం నిమ్స్ ఆవరణలో బయట పడింది. నిమ్స్ మిలినియం బ్లాక్ వెనుక ప్రహరివద్ద చిన్నపాటి ఏడుపు శబ్ధం వినిపిస్తుంది. దీంతో అవుట్ పోస్ట్ పోలీసులు ఏడుపు వినిపిస్తున్న ప్రాంతానికి వెళ్లి చూడగా, ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉన్న చంటిపాప కనిపించింది. వెంటనే ఆ చిన్నారిని నిమ్స్ అత్యవర చికిత్సా విభాగానికి తరలించారు. చికిత్స అనంతరం బిడ్డ సంరక్షణకు శిశువిహార్‌కు తరలించనున్నట్లు పంజగుట్ట పోలీసులు చెప్పారు. అయితే ఆ బిడ్డను ఎవరు వదిలి వెళ్లారన్న దానిపై సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆడపిల్ల కావడంతోనే ఆ బిడ్డను వదిలి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు స్పందిస్తూ నవజాత శిశువులను రోడ్లపై వదిలేయడం నెలలో ఇది మూడో ఘటన అని అన్నారు. పిల్లలకు బతికే హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఓ పథకం రూపొందించాలని, లేదా ఊయల పథకాన్నిసమర్థవంతంగా నిర్వహించేలా స్త్రీ శిశు సంక్షేమ శాఖను ఆదేశించాలని కోరారు. -
పోయిన వస్తువులు తిరిగొచ్చాయి..
పంజగుట్ట: నిమ్స్ న్యూరో సర్జన్ ఆపరేషన్ థియేటర్లో సర్జరీకి సంబంధించిన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయం గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోయాయనున్న వస్తువులు శుక్రవారం తెల్లవారు జామున యథాస్థానంలో కనిపించడం విశేషం. పోలీసులు, నిమ్స్ సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిమ్స్ అత్యవసర విభాగం మూడో అంతస్తులోని న్యూరో సర్జన్ ఆపరేషన్ థియేటర్ (ఎన్ఎస్ఓడీ)లో సర్జరీకి సంబంధించిన కత్తెర్లు, రాడ్లు, మరికొన్ని వస్తువులు గత ఆదివారం రాత్రి చోరీకి గురయ్యాయి. మర్నాడు దీనిని గుర్తించిన సిబ్బంది విభాగాధిపతికి సమాచారం అందించారు. ఆయన నిమ్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టడంతో భయపడిన నిందితుడు శుక్రవారం తెల్లవారు జామున ఎవరూ లేని సమయంలో నల్లకలర్ బ్యాగ్‌లో చోరీకి గురైన వస్తువులు తెచ్చి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిదొంగ పనే ... బయటివ్యక్తులు అత్యవసర విభాగంలోకి వెళ్లడం అసాధ్యం. ఆస్పత్రి సిబ్బందే చోరీకి పాల్పడి ఉండవచ్చునని, పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో భయపడి తిరిగి తెచ్చి పెట్టి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. చోరీ జరిగిన సమయంలో కేసు నమోదు చేయాలని కోరిన నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు కేసు వద్దని తమ వస్తువులు ఇచ్చేయాలని కోరడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులెవరో తేలుస్తామని, సదరు వస్తువులు కోర్టుకు సమర్పించనున్నట్లు అధికారులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్స్ ఎమర్జెన్సీలో వైద్యం గగనమే!
సోమాజిగూడ: నిమ్స్‌లోని అత్యవసర వైద్యసేవల విభాగానికి వచ్చే రోగులు నరకాన్ని చవిచూస్తున్నారు...దూర ప్రాంతాల నుంచి అడ్మిషన్ కోసం వచ్చే రోగులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వీరిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దాంతో నిమ్స్ ప్రతిష్ట మసక బారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అత్యవసర విభానికి వచ్చిన రోగులకు సకాలంలో అడ్మిషన్లు దొరకడంలేదు. బెడ్స్ ఖాళీ లేవంటూ చెప్పడంతో చికిత్స కోసం వచ్చిన వారు తాము వచ్చిన వాహనంలోనే గంటల తరబడి వైద్యుల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వారం రోజుల క్రితం విషం తాగి చావు బతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తిని మహేశ్వరం నుంచి తీసుకురాగా.. వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో గంట పాటు అతను అలాగే వాహనంలో పడి ఉన్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళను మంగళవారం అత్యవసర విభాగంలో చికిత్స కోసం తీసుకు రాగా.. అక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడి సిబ్బందితో సదరు పేషెంట్ బంధువులు వాగ్వాదానికి దాగారు. ఇలా నిత్యం నిమ్స్ ఎమర్జెన్సీ వార్డు వద్ద వైద్యసేవల విషయంలో రోగుల బంధువులు వైద్యులు, అక్కడి సిబ్బందితో ఘర్షణకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర విభాగంలో అడ్మిషన్ దొరకపోతే కొన్ని సందర్భాల్లో పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. స్ట్రెచర్స్ లేవంటూ... నిమ్స్ అత్యవసర విభాగానికి చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రోజుకు సుమారు 100 మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు, విషం తాగిన వారు, ఇతర వ్యాధుల బారిన పడిన వారు... ఇలా ఎందరో రోగులు నిమ్స్‌లో చికిత్స కోసం వస్తుంటారు. దాంతో అత్యవసం విభాగం రోగులతో కిక్కిరిసిపోతోంది. అలా చికిత్సకు వచ్చిన వారిలో 50 మంది రోగులకు మాత్రమే అడ్మిషన్ దొరుకుతోంది. మరికొందరికి స్ట్రెచర్ సైతం దొరక పోవడంతో మిగతా రోగులు వెనుదిరగాల్సి వస్తోంది. సిబ్బంది అవసరం... అత్యవసర వైద్యసేవల విభాగంలో అవరానికి అ నుగుణంగా దిగువ స్థాయి సిబ్బంది లేక పోవడం తో వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వెంటిలేటర్ల సంఖ్య కూడా తక్కువే. ఉన్నవాటిలో ఐదు మూలన పడ్డాయి. రోగుల సం ఖ్య కు అనుగుణంగా సిబ్బందిని పెంచడంతో పా టు మరో 10 వెంటిలేటర్లను అదనంగా సమకూర్చాల్సిన అవసరం ఉంది. నిమ్స్ యాజమాన్యం ఎమర్జెన్సీ వార్డులో రోగుల చికిత్సకు అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచాలి. -
భట్టి దీక్ష భగ్నం, నిమ్స్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు సోమవారం ఉదయం భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా నిమ్స్‌కు తరలించారు. భట్టి విక్రమార్క బీపీ, షుగర్ లెవల్స్, ఎర్ర రక్తకణాలు పడిపోవడంతో తక్షణమే వైద్యం అందించాలని ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు ...ఆయనను అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించగా, వైద్యం చేయించుకునేందుకు భట్టి నిరాకరిస్తున్నారు. -
ట్రాలీల్లేక తిప్పలు!
సోమాజిగూడ: చేవెళ్లకు చెందిన కిషన్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్సనందించిన అనంతరం కుటుంబసభ్యులు బుధవారం నిమ్స్‌కు తీసుకొచ్చారు. అయితే ట్రాలీలు లేని కారణంగా అతడు దాదాపు గంటన్నర అంబులెన్స్‌లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి వైద్యులకు ఎంత మొరపెట్టుకున్నా ‘ట్రాలీలు ఖాళీ అయ్యే వరకు ఉండండి. లేని పక్షంలో వెళ్లిపోండంటూ’ చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. ఇటాంటి సంఘటనలు నిమ్స్ అత్యవసర విభాగం వద్ద నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడనే కాదు నిమ్స్‌లో నిత్యం ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంది. నిన్నటి వరకు నీటి కొరతతో సర్జరీలు నిలిపివేసిన విషయం విదితమే. ఇక ఇప్పుడు ట్రాలీలు సరిపడా లేక రోగికి నిమ్స్ అత్యవసర సర్వీసు విభాగంలో అడ్మిషన్ దొరకడం లేదు. గతరెండు రోజులుగా నిమ్స్ అత్యవసర విభాగానికి రోగుల తాకిడి పెరిగింది. దూరప్రాంతాల నుంచి ఇక్కడికి చికిత్సకు వచ్చిన రోగులు గంటల తరబడి వారు వచ్చిన వాహనంలోనే ఉండాల్సి వస్తోంది. సకాలంలో రోగికి వైద్యం అందకపోవడంతో బంధువులు వైద్యులతో ఘర్షణకు దిగుతున్నారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన నిమ్స్ ఆసుపత్రిలో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి కారణం ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని తెలుస్తోంది. 30 ట్రాలీలు ఫుల్... ఎవరైనా ఆత్మహత్మలకు పాల్పడినా, ప్రమాదానికి గురైనా మరేదైనా సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందించి నిమ్స్‌కు తీసుకొస్తారు. అలా వచ్చిన వారంతా అత్యవసర విభాగంలో అడ్మిషన్ పొందుతారు. అడ్మిషన్ పొందిన రోగి సుమారు 10 రోజులు ట్రాలీపైనే ఉంటున్నాడు. ముందుగా అడ్మిషన్ పొందిన రోగి డిశ్చార్జ్ కాకపోవడంతో ఈ సమస్య తెలెత్తుతోంది. అత్యవసర విభాగానికి వచ్చిన రోగిని ట్రాలీలపై లోపలకు తీసుకెళ్తారు. సంబంధిత రోగిని ట్రాలీపైనే ఉంచి వైద్యం అందిస్తారు. అప్పటికే అక్కడ బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగి డిశ్చార్జ్ అయితేనే ట్రాలీ నుంచి బెడ్డుకు మార్చుతారు. ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చిన రోగులు ఎక్కువ రోజులు చికిత్స పొందడం, ఉన్న బెడ్స్, ట్రాలీలు ఖాళీ కాకపోవడంతో కొత్తగా వస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర విభాగానికి రోజుకు సుమారు 30 మంది రోగులు వస్తుంటారు. అయితే మంగళవారం అత్యవసర సర్వీసు విభాగానికి వివిధ కారణాలతో సుమారు 50 మంది రోగులు వచ్చారు. దాంతో అక్కడనున్న ట్రాలీలు సరిపోకపోవడంతో మరో 20 ట్రాలీలను ఓపీ నుంచి తీసుకొచ్చారు. -
నిమ్స్‌లో నీటి చుక్క కరువాయె!
సాక్షి, సిటీబ్యూరో/సోమాజిగూడ: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లోని రోగులకు నీటి కష్టాలు తప్పడం లేదు. దాహమేస్తే తాగేందుకే కాదు...సర్జరీ తర్వాత చేతులు కడుక్కునేందుకు నీరులేక పోవడంతో సోమవారం పలు విభాగాల్లో చికిత్సలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎండాకాలంలో నీటి అవసరాలపై అధికారులు ముందే ఓ అంచనాకు రాలేక పోవడం, సంపుల్లోకి చేరుతున్న నీటిని, వాటి నిల్వలను పరిశీలించక పోవడం, సరఫరా అయిన నీటిని కూడా సద్వినియోగం చేసుకోక పోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం. నీటికోసం ఆస్పత్రి నెలకు రూ. 50 లక్షల చొప్పున ఏడాదికి రూ.ఆరు కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. కానీ రోగుల నిష్పత్తికి తగినంత నీటిని అందించలేక పోతోంది. ఫలితంగా రోగులే బయటి నుంచి బాటిళ్లను కొనుగో లు చేయాల్సి వస్తుంది. ఇలా ఒక ఐదు లీటర్లకు రూ. వంద వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆశతో వచ్చి..నిరాశతో వెనుతిరిగిన రోగులు నిజానికి శని, ఆదివారాల్లో రోగుల రద్దీ తక్కువగా ఉంటుంది. ప్రతి సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. జలమండలి నుంచి వచ్చే నీటి సరఫరా, ట్యాంకుల్లో నిల్వల పరిశీలన, వార్డులకు సరఫరా కోసం ఆస్పత్రిలో ఆరుగురు సిబ్బందిని నియమించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నీటిసంపులోని నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించక పోవడం వల్ల ఆదివారం సాయంత్రం నుంచి కుళాయిల్లో నీటిసరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలియక అప్పటికే సర్జరీలకు ప్లాన్ చేసుకున్న వైద్యులు, చికిత్సల కోసం ఉదయం ఐదు గంటలకే ఆపరేషన్ థియేటర్ల ముందుకు చేరుకున్నారు. తీరా చికిత్స తర్వాత వైద్య సిబ్బంది చేతులకు శుభ్రం చేసుకునేందుకు నీరు లేదని తెలిసి చికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూ రో సర్జరీ, కార్డియాలజీ, తదితర విభాగాల్లో చిన్నాపెద్ద అన్ని కలిపి 60 సర్జరీల వరకు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సగం మంది వైద్యులు వేసవి సెలవుల్లో ఉన్నారు. నీరులేక ఉన్నవాళ్లు కూడా సర్జరీలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఉగ్గబట్టుకోవాల్సిందే ఉస్మానియా, గాంధీ వంటి ఇతర ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్ కొంత భిన్నమైంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మాత్రమే కాదు దీనికి చైర్మన్‌గా స్వయంగా సీఎం కొనసాగుతుంటారు. కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే..ఇక్కడ వైద్య ఖర్చులు తక్కువగా ఉండటం, మెరుగైన వైద్యసేవలు అందుతుండటం, అనేక మంది నిపుణులు అందుబాటులో ఉండటంతో రోగులు ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. 1500 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగానికి రోజుకు సగటున రెండు వేల మందికిపైగా వస్తుంటారు. పదిహేను వందలకుపైగా రోగులు ఇన్‌పేషంట్లు చికిత్సలు పొందతుంటారు. ఒక్కో రోగికి ఒక సహాయ కుడు ఉంటారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు కూడా నీటి సరఫరా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతు న్నాయి. జనరల్ వార్డుల్లోనే కాదు పేయింగ్ రూమ్‌ల్లోనూ ఇదే దుస్థితి. మూత్రశాలలు కంపుకొడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఉగ్గబట్టుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా రోగులు, వైద్యులు రోజంతా నీరు లేక ఇబ్బంది పడటంతో అధికారులు మేల్కొని సాయంత్రానికి సమస్యను పరిష్కరించారు. మంగళవారం నుంచి సమస్య రాకుండా చూస్తామని పేర్కొన్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. అవసరమైతే నిమ్స్ తరహాలో సాయంత్రం వచ్చే రోగుల నుంచి నామమాత్రంగా ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తోంది. ఫలితంగా రోగులకు వైద్య సేవలు విస్తరించడంతో పాటు, వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపై దృష్టిపెట్టకుండా నివారించొచ్చని భావిస్తోంది. అంతేకాదు సాయంత్రం ఓపీ సేవలు విస్తరిస్తే అనేకమంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని సర్కారు భావిస్తోంది. ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రులన్నింటిలోనూ ఓపీ సేవలను సాయంత్రం విస్తరించే అంశంపై ఇటీవల వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు షిఫ్ట్‌ల విధానం.. ఉన్న వనరులతోనే ప్రభుత్వ ఆసుపత్రు లను అత్యంత మెరుగ్గా నడపాలని సర్కారు యోచిస్తోంది. ప్రస్తుతం నిమ్స్‌లో మధ్యాహ్నం వరకు ఓపీ ఉంటుంది. సాయంత్రం మళ్లీ ఓపీ నిర్వహిస్తారు. ఉదయం ఓపీ ఉచితం. సాయంత్రం మాత్రం కన్సల్టెంటు ఫీజు కింద ప్రతి రోగి నుంచి రూ.500 వసూలు చేస్తారు. అందులో సగం అంటే రూ.250 డాక్టర్‌కు ఇస్తారు. అయితే మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ మధ్యాహ్నమే ముగుస్తుంది. అందుకే సాయంత్రం ఓపీ సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగుల కోసం సాయంత్రం ఓపీ తెరవాలని గతంలోనే నిర్ణయించారు. కానీ అది అమలు కావట్లేదని అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఇతరులకూ సాయంత్రం వైద్య సేవలు అందించేలా, నామమాత్రపు ఫీజు వసూలు చేసేలా చేయాలని భావిస్తున్నారు. అయితే సాయంత్రం ఓపీ పద్ధతిని కొందరు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం ప్రైవేటు ప్రాక్టీసు ఉన్న వైద్యులకు షిఫ్ట్ విధానం ఇబ్బందిగా మారనుంది. -
కార్లు నీడలో.. ‘అన్నపూర్ణ’ఎండలో!
సోమాజిగూడ :పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నపూర్ణ పథకం నిమ్స్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో విమర్శలకు గురవుతోంది. వివరాలు.. రెండేళ్ల క్రితం నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో అన్నపూర్ణ పథకం క్యాంటిన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు 720 మంది పేదలు భోజనం చేస్తుంటారు. మూడు నెలల క్రితం క్యాంటిన్‌ను పార్కింగ్ ఉన్న మరో ప్రాంతానికి తరలించారు. గతంలో చెట్ల నీడలో పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటిన్ ప్రస్తుతం మండుటెండల్లోకి మారడంతో అక్కడే కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నిమ్స్‌లోని అధికారులు తమ వాహనాలను చెట్ల నీడలో పెట్టేందుకు.. ఇక్కడి ప్రైవేట్ క్యాంటిన్‌నిర్వాహకులతో మిలాఖత్ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. -
ఫార్మా సిటీ.. వెరీ పిటీ
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు హైదరాబాద్ సమీపంలోని 18,304 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తొలి సమీకృత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) పరిధిలో ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ‘హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్’పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాలు పూర్తి చేసి.. 2019 నాటికి ఔత్సాహిక ఫార్మా సంస్థలకు భూ కేటాయింపులు, అనుమతులు ఇచ్చేలా టీఎస్ఐఐసీ షెడ్యూలు రూపొందించింది. తొలి విడతలో 9,212 ఎకరాలకు గాను 6,719 ఎకరాలను సేకరించగా, మిగతా భూమిని సేకరించడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టింది. తొలి విడత భూ సేకరణకు హడ్కో ద్వారా టీఎస్ఐఐసీ రూ.725 కోట్లు రుణం తీసుకోవడంతో పాటు, ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల కోసం ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)కు ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి) హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం (డిప్) 2017 ఏప్రిల్‌లో సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నయా పైసా విదల్చని ‘డిప్’ హైదరాబాద్ ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా దక్కడంతో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం ‘డిప్’కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు నాటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ వినతిపత్రం కూడా ఇచ్చారు. తొలి విడతలో రూ.1,500 కోట్లు విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినా, రెండేళ్లుగా ఫార్మా సిటీకి కేంద్రం నుంచి నయాపైసా విదల్చలేదు. ఫార్మా సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్ హోదా ద్వారా కనీసం రూ.6 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకుని మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో 2019 మే నాటికి ఔత్సాహికులకు ఫార్మాసిటీలో భూ కేటాయింపులు చేస్తామనే ప్రకటన ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వడివడిగా టీఎస్ఐఐసీ అడుగులు... ఫార్మాసిటీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ మొదట్లో వడివడిగా అడుగులు వేసింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టింది. మరోవైపు పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, సింగపూర్‌కు చెందిన సుర్బాన జురోంగ్ కన్సల్టెంట్స్ ద్వారా సమీకృత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రణాళిక తుది దశలో ఉంది. సమీకృత కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు (సీఈటీపీ), జీరో లిక్విడ్ డిశ్చార్జి (జడ్ఎల్డీ) ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను 2017లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించి, 8 కంపెనీలను వడపోతలో ఎంపిక చేశారు. జహీరాబాద్ నిమ్జ్‌పైనా ప్రభావం... దేశ వ్యాప్తంగా మొత్తం 22 భారీ పారిశ్రామిక వాడలకు నిమ్జ్ హోదా దక్కగా, ఇందులో రాష్ట్రంలో రెండు ఉన్నాయి. ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా సూత్రప్రాయంగా దక్కగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్‌కు తుది ఆమోదం లభించింది. అయితే జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3 వేల కోట్లివ్వాలని టీఎస్ఐఐసీ ప్రతిపాదించినా కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో ఫార్మాసిటీ తరహాలో జహీరాబాద్ నిమ్జ్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. కేంద్రం నుంచి స్పందన కరువు... ఫార్మా సిటీకి నిమ్జ్ హోదా నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులివ్వాల్సిందిగా టీఎస్ఐఐసీ కేంద్రాన్ని కోరింది. జీరో లిక్విడ్ డిశ్చార్జి గ్రాంటు కోసం కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగానికి ప్రతిపాదనలు సమర్పించింది. సీఈటీపీ నిధుల కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. గ్రీన్‌క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ఫండ్ ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖకూ లేఖ రాసింది. అయితే ప్రతిపాదనలు పంపించి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి నిధుల విడుదల విషయంలో కనీస స్పందన కానరావడం లేదు. కేంద్రం నుంచి గ్రాంటు విషయంలో స్పష్టత లేకపోవడంతో సీఈటీపీ, జడ్ఎల్డీ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఎంపిక చేసిన 8 కంపెనీల వడపోత ప్రక్రియను టీఎస్ఐఐసీ నిలిపివేసింది. ఫార్మాసిటీ ప్రత్యేకతలు.. పెట్టుబడుల అంచనా: రూ.64 వేల కోట్లు ఫార్మా ఎగుమతులు (ఏటా): రూ.58 వేల కోట్లు ప్రత్యక్ష ఉపాధి: 1.70 లక్షల మందికి పరోక్ష ఉపాధి: 3.90 లక్షల మందికి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు, మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, క్వాలిటీ సర్టిఫికేషన్ ల్యాబ్, లాజిస్టిక్ హబ్, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఎన్విరాన్ మేనేజ్మెంట్ సెల్, సమీకృత నివాస గృహాల సముదాయం, ఫార్మా ఉత్పత్తి యూనిట్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితో పాటు ఫార్మా సిటీ ప్రాంగణంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. -
కీళ్ల నొప్పులు.. టోకెన్ తిప్పలు..!
కీళ్లనొప్పులతో బాధపడుతున్న రోగులకు నిమ్స్‌లో నిలువుకాళ్ల జపం తప్పట్లేదు. ఓపీ టోకెన్ కోసం అర్ధరాత్రి 2 గంటలకే ఆస్పత్రికి చేరుకుని క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. నొప్పుల బాధను దిగమింగుకుని గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా.. తీరా ఓపీ వేళకు నిరాశే మిగులుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు నిమ్స్ ఆస్పత్రికి కీళ్ల నొప్పులతో బాధపడే రోగులు రోజుకు దాదాపు 150 మందికిపైగా వస్తుంటారు. అయితే 60 మంది రోగులకు మించి వైద్య సేవలు అందించలేని పరిస్థితి అక్కడ నెలకొంది. కీళ్లనొప్పుల బాధితుల కోసం 1994లో ప్రత్యేకంగా రుమటాలజీ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రొఫెసర్ జి.నరసింహులు ఆస్ట్రేలియాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు. అప్పటివరకు ప్రైవేటులో ఎక్కడా రుమటాలజీ వైద్యుల్లేకపోవడంతో ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. దీంతో 2001లో రుమటాలజీ విభాగం కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో మరింత మంది స్పెషలిస్టులను తయారు చేసేందుకు 2005లో డీఎం రుమటాలజీ కోర్సు ఏర్పాటు చేయగా, 2007లో దీనికి గుర్తింపు లభించింది. అనేక పరిశోధనలు, మెరుగైన వైద్యసేవలు, అత్యుత్తమ వైద్యవిద్య బోధనతో దేశంలోనే ఓ వెలుగు వెలిచిన రుమటాలజీ విభాగం ప్రస్తుతం కనీస వైద్యసేవలు అందించలేకపోతోంది. ఒక్కొక్కరూ వీడిపోవడంతో ప్రొఫెసర్ నరసింహులు కూడా పదవీ విరమణ చేసిన తర్వాత రోగుల నిష్పత్తికి తగ్గట్లు ఆ విభాగాన్ని అభివృద్ధి చేయకపోవడం, అంతర్గత కుమ్ములాటలు, నిమ్స్‌తో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేతనాలు రెట్టింపు స్థాయిలో ఉండటంతో వైద్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రిని వీడారు. ఇప్పటివరకు ఇక్కడ 45 మంది వరకు రుమటాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తిచేయగా, వీరి సేవలను వినియోగించుకోవడంలో పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉస్మానియా, గాంధీ సహా జిల్లా కేంద్రాల్లోనూ రుమటాలజీ వైద్యుల్లేకపోవడం, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ చికిత్సలు ఖరీదు కావడం, కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్‌లో మరింత మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. 2011 వరకు ఐదుగురు ఫ్యాకల్టీ వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరికి పడిపోయింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ వేళలు కొనసాగుతుండటం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో రోజుకు సగటున 60 మందికి మించి చూడలేకపోతున్నారు. ఎలాగైనా ఇక్కడ వైద్యం చేయించుకోవాలనే ఆశతో అర్ధరాత్రి రెండు గంటలకే ఓపీ కౌంటర్‌కు చేరుకుంటున్నారు. తీరా ఉదయం టోకెన్లు దొరక్క తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే.. కీళ్లవాతం బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేరు. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా కింగ్‌జార్జ్, కోల్‌కతా, చండీగఢ్, వేల్లూర్, ముంబై, నిమ్స్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ల నుంచి ఏటా 45 మంది మాత్రమే సూపర్ స్పెషాలిటీ వైద్యులు బయటికి వస్తున్నారు. రుమటాలజీలో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన వైద్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ డిమాండ్ ఉంది. వేతనం కూడా నిమ్స్‌లో కన్నా రెట్టింపు ఉంది. పాలకులు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల నిమ్స్ సహా ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరిపైనే భారం పడుతోంది. –ప్రొఫెసర్ జి.నరసింహులు, విశ్రాంత వైద్యుడు, నిమ్స్