
హైదరాబాద్, సాక్షి: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది.
డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్‌లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించారు. పక్కనే అనస్థీషియా మత్తు వాయిల్ పడి ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
అనస్థీషియా అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆమె చనిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రాచీ కర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు అయ్యింది. ప్రాచీ కర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, పలువురిని ప్రశ్నిస్తున్నారు.
