Anesthesia
-
NIMS: నిమ్స్ వైద్యురాలి ఆత్మహత్య!
హైదరాబాద్, సాక్షి: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్‌లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించారు. పక్కనే అనస్థీషియా మత్తు వాయిల్ పడి ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.అనస్థీషియా అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆమె చనిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రాచీ కర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు అయ్యింది. ప్రాచీ కర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, పలువురిని ప్రశ్నిస్తున్నారు. -
నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్ ఉండకూడదంటే..?
నాకిప్పుడు మూడో నెల. బరువు 96 కేజీలు. మూడో కాన్పు. మొదటి రెండు కాన్పులు సిజేరియనే. రెండో కాన్పు అప్పుడు అనెస్తీషియా రిస్క్ ఎక్కువగా ఉండింది. ఈసారి ఆ రిస్క్ లేకుండా ఏం చేయాలో దయచేసి చెప్పగలరు. – రమణి విశ్వం, పిడుగురాళ్ల మీ ఎత్తు, బరువును బట్టి బాడీ మాస్ ఇండెక్స్.. బీఎమ్‌ఐని కాలిక్యులేట్ చేస్తారు. బాడీ మాస్ ఇండెక్స్ సాధారణంగా 20– 25 మధ్య ఉంటే ప్రెగ్నెన్సీ, ప్రసవమప్పుడు సమస్యలు తక్కువగా ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ, అనెస్తీషియా, రికవరీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే 5–10 శాతం బరువు తగ్గితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పడు మీకు మూడోనెల అంటున్నారు కాబట్టి మీ బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి 30 కన్నా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ, బీపీ, సుగర్ వంటి పరీక్షలన్నీ చేసి.. ఫలితాలను నిర్ధారించి.. ప్రెగ్నెన్సీలోనే రక్తం పలుచబడడానికి మాత్రలు స్టార్ట్ చేస్తారు. దీనివల్ల మీకు డెలివరీ.. సర్జరీ సమయంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. మల్టీవిటమిన్స్, విటమిన్ డీ3, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. అంతేకాదు ప్రెగ్నెన్సీ సమయంలో క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలూ నేర్పిస్తారు. మీరు నిర్ధారిత బరువుకు రావడానికి డైట్ కౌన్సెలింగ్కీ వెళ్లాలి. లెగ్ మజిల్ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్, మసాజ్లను సూచిస్తారు. కంప్రెషన్ స్టాకింగ్స్ అనే సాక్స్‌లను కాళ్లకు వేసుకోవాలి. ప్రసవం తరువాత మీ బరువును బట్టి రక్తం పలుచబడడానికి వారం నుంచి పది రోజుల దాకా ఇంజెక్షన్స్‌ను ఇస్తారు. దీనివల్ల ఛాతీ, కాళ్లలో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. అనెస్తీషియా రిస్క్ కూడా తగ్గుతుంది. పూర్తి శరీరానికి ఇచ్చే జనరల్ అనెస్తీషియాకన్నా కూడా నడుముకు ఇచ్చే రీజనల్ అనెస్తీషియాలోనే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అధిక బరువు ఉన్న వారిలో మెడలో ఉండే థిక్నెస్ వల్ల శ్వాస సంబంధమైన, స్లీప్ ఆప్నియా సమస్యలు తలెత్తుతాయి. ఇవి జనరల్ అనెస్తీషియాలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఏ అనెస్తీషియా ఇవ్వాలి అనేది తొమ్మిదవ నెలలోనే అనెస్తెటిస్ట్ (మత్తు డాక్టర్) చూసి కౌన్సెల్ చేస్తారు. అధిక బీఎమ్‌ఐలో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతాయి. అనెస్తీషియా సమయంలో ఆ జాగ్రత్త తీసుకుంటారు. బీఎమ్ఐ అధికంగా ఉంటే కొన్ని పెయిన్ రిలీఫ్ మందులు సరిగా పనిచేయవు. హైరిస్క్ అనెస్తీషియా టీమ్ ఈ విషయాలను గమనించి.. అనెస్తీషియా తర్వాత సమస్యలు రాకుండా చూస్తుంది. మీరు పౌష్టికాహారం తీసుకుంటూ.. తగిన వ్యాయామం చేస్తూ క్రమం తప్పకుండా చెకప్స్‌కి వెళుతూ.. ఈసారి ప్రసవమప్పుడు రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..) -
ఆడుతూ, పాడుతూ ‘అమ్మ’
వీఏవీ రంగాచార్యులు, సాక్షి సెంట్రల్ డెస్క్ : మాతృత్వంలోని కమ్మదనం గురించి ‘అమ్మ’కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అయితే బిడ్డకు జన్మనిచ్చి తల్లి అవ్వడం అనేది ఆ ‘అమ్మ’కు పునర్జన్మేనని చెప్పవచ్చు. అంటే ఓ మహిళ గర్భం దాల్చి.. తొమ్మిది నెలలపాటు శిశువును మోయడం ఒక ఎత్తు అయితే, ఆ బిడ్డను బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడం మరోఎత్తు. ఈ క్రమంలో ఆ చివరి రోజు ఆ మహిళ పడే కష్టం, బాధ వర్ణణాతీతం. ఈ బాధ భరించలేక చాలా మంది సిజేరియన్ (ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం) చేయించుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఎక్కువ ఫీజు వస్తుందని మారు మాట్లాడకుండా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది సరికాదని, ఇతరత్రా ఎలాంటి సమస్యలు లేకపోతే నార్మల్ డెలివరీ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గట్టిగా చెబుతోంది. దీంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పీహెచ్‌సీల్లో నార్మల్ డెలివరీకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రిస్క్ తీసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులు సిద్ధంగా లేనందున అనవసర సిజేరియన్లు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తూనే ఉంది. ఎపిడ్యూరల్ విధానం ఒక వరం అభివృద్ధి చెందిన దేశాల్లో, మన దేశంలో ఎగువ మధ్య తరగతి, ధనికులు ఇప్పుడిప్పుడే ఈ విధానం ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా దృష్టి సారిస్తున్నారు. ఎపిడ్యూరల్ అంటే ఇదొక రకమైన అనస్థీషియా. మామూలుగా శరీరంలో ఒక భాగానికి నొప్పి తెలియకుండా ఉండేందుకు స్పైన్ (వెన్ను)కు మత్తు మందు ఇచ్చినప్పుడు ఆ భాగం నుంచి మెదడుకు నొప్పి సంకేతాలు వెళ్లవు. అదే సమయంలో మెదడు నుంచి మోటార్ సిగ్నల్స్ రావు. అప్పుడు ఆ భాగానికి సంబంధించి కండరాలు వదులవుతాయి. సిజేరియన్ కోసమైతే ఇలా చేయాలి. నొప్పి తెలియకుండా నార్మల్ డెలివరీ చేయాలంటే ఇందులో ఒకదాన్ని ఆపి, మరొకదాన్ని పని చేయించాలి. వైద్యులతో ముందే చర్చించాలి కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారిలో చాలా మంది నొప్పి తట్టుకోలేక సిజేరియన్ చేసేయండని అడుగుతున్నారని, ఇలాంటి సమయంలో ఎపిడ్యూరల్ విధానం పాటించాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. ఈ విధానానికి నిపుణుడైన అనెస్థీషియాలజిస్ట్ మాత్రమే అదనంగా అవసరం. అందువల్ల దాదాపు సిజేరియన్‌కు అయ్చే ఖర్చే అవుతుంది. ఇప్పటికే ఈ విధానం గురించి తెలిసిన వారు చాలా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యులతో ముందుగానే చర్చించి తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి సూచనల మేరకు నిత్యం వ్యాయామం చేస్తూ ఆడుతూ, పాడుతూ గడుపుతున్నారు. పురుటి నొప్పులు మొదలవుతాయనడానికి ముందుగానే ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరికి యాక్టివ్ లేబర్ కంటే (తీవ్రమైన నొప్పులు) ముందు నుంచే పెలి్వక్ (కండరాలు వదులయ్యేలా) ఎక్సర్సైజ్లు చేయిస్తారు. ఆ సమయంలో వేడి నీళ్లలో తడిపిన టవల్ ద్వారా ఒత్తిడి తేవడం, కొన్ని ఎక్సర్సైజ్ల ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా చూస్తారు. ఇటీవల సినీ నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఈ విధానంలోనే బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. కొన్ని ఆస్పత్రుల్లో ఐవీ అనాల్జీషియా, ఎంటొనాక్స్ (మాస్క్ ద్వారా గ్యాస్ ఇవ్వడం) తదితర పద్దతుల్లో కూడా నొప్పి లేకుండా ప్రసవాలు చేస్తున్నప్పటికీ ఎపిడ్యూరల్ మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. సిజేరియన్ కంటే ఇదే మేలు కాబట్టి, దీని గురించి అందరికీ తెలియాలని డబ్ల్యూహెచ్‌వో కోరుకుంటోంది. స్పైన్ పై భాగంలోనే మత్తు స్పైన్లోపలికి కాకుండా పై భాగంలో ఉన్న పొరలోకి మత్తు మందును తక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేస్తారు. ఇలా చేస్తే అనాల్జీషియా (నొప్పి లేకపోవడం) మాత్రమే పని చేస్తుంది. అంటే మెదడుకు ఆ భాగం నుంచి నొప్పి సంకేతాలు వెళ్లనందున నొప్పి తెలియదు. మెదడు నుంచి యథావిధిగా మోటార్ సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. అందువల్ల ఆ భాగంలో కండరాలు యథావిధిగా పని చేస్తాయి. దీంతో గర్భసంచి చుట్టూ ఒత్తిడి పెరిగి, కొద్ది కొద్దిగా బేబీ బయటకు వస్తుంది. ఇందుకోసం సర్జరీలకు వాడేంత డోస్ కాకుండా తక్కువ డోసులో మత్తు మందు వాడతారు. అన్ని అనెస్థీషియాల్లాగే దీనికీ కొంత సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి రాదు. మామూలుగా కంటే ఓ గంట సమయం ఎక్కువ పడుతుంది. మంచి బెనిఫిట్ ఉంటుంది ఎపిడ్యూరల్ వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెయిన్‌ను బాగా తగ్గించవచ్చు. బెనిఫిట్ చాలా బావుంటుంది. చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే విధానం కొనసాగుతోంది. పూర్వపు రోజుల్లో ఈ విధానం పట్ల మన దేశంలో కొంత అపోహ ఉండేది. ఇప్పుడు విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఆ అపోహలు తొలగిపోయాయి. లేబర్‌లో మూడు దశలు ఉంటాయి. రెండవ దశ నుంచి ఇది స్టార్ట్ చేయాలి. కొంచెం బీపీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతకు మించి పెద్ద సమస్యలు ఉత్పన్నం కావు. కాకపోతే తొమ్మిదవ నెల నుంచే గర్భిణిని ఇందుకు సమాయత్తం చేయాల్సి ఉంటుంది. ఈ విధానంపై కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశోధన కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పీజీ అనెస్థీసియా విద్యార్థులు పలు పేపర్లు కూడా ప్రెజెంట్ చేశారు. యువతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఖర్చు కూడా తక్కువే. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. గర్భిణికి అవగాహన ఉండి కోరితేనే చేస్తున్నారు. – ఎస్.మాణిక్యరావు, గైనకాలజీ హెచ్ఓడి, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి -
ఎంజీఎంలో బాలుడి మృతి.. తెలంగాణ ప్రభుత్వం సీరియస్
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మత్తుమందు అధిక మోతాదులో ఇవ్వడం వల్ల విహాన్ (8) అనే బాలుడు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. ఆందోళనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశించిన నేపథ్యంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఎంజీఎం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ అనిల్‌బాల్‌రాజు, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రంగస్వామిలతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆర్‌ఐసీయూలోని స్టాఫ్‌నర్సులు, అనస్తీషియా విభాగాధిపతి, ఆర్థో విభాగాధిపతులతో మాట్లాడారు. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. విహాన్ కేసు పూర్వాపరాలను మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం -
ఆపరేషన్ కోసం తీసుకొస్తే.. మత్తు మందే మింగేసింది
సాక్షి, వరంగల్: చేయి విరిగిన ఎనిమిదేళ్ల బాలుడిని ఆపరేషన్ కోసం తీసుకొస్తే ప్రాణం పోయింది. అధిక మోతాదులో అనస్తీషియా ఇవ్వడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా లింగానాయక్ తండాకు చెందిన భూక్యా విహాన్(8)కు కుడిచేయి విరిగింది. 4న ఎంజీఎం ఆస్పత్రి ఆర్థో వార్డులో అడ్మిట్ చేశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేసేందుకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో థియేటర్లోకి తీసుకెళ్లారు. అనస్తీషియా ఇవ్వాల్సిన డోస్ కన్నా ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో కార్డియాక్ అరెస్టయింది. ఉదయం 10 గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన వైద్యులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బయట వైద్యులను అడిగారు. అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్‌కు సిద్ధం చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని, ఆర్ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరికొద్దిసేపటికి బాబు మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో విహాన్ తల్లిదండ్రులు రోదిస్తూ ఆందోళనకు దిగారు. చదవండి: ప్రాణం తీసిన ప్రేమ పంచాయతీ ప్రత్యక్ష పోస్టుమార్టం: విహాన్ మృతదేహానికి సాయంత్రం 6 గంటల తర్వాత ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడు ఎలా మృతిచెందాడో నిర్ధారణ కావడానికి వీడియో చిత్రీకరణ మధ్య ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రి 7 గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, విహాన్ మృతి ఘటన వివరాలను వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయ సిబ్బంది.. ఎంజీఎం సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కమిటీ వేసి విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.. విహాన్ మృతి ఘటనపై విచారణకు అదేశించామని, దీనికోసం ద్విసభ్య కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు. -
ఆసుపత్రిలో దారుణం.. అనస్తీషియా అధిక డోస్ ఇవ్వడంతో..
లింగోజిగూడ(హైదరాబాద్): భుజం నొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్లో గురువారం జరిగింది. వైద్యులు అనస్తీషియా అధిక డోస్ ఇవ్వడం వల్లే అతను చనిపోయాడని ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురానికి చెందిన శ్రీపియల్ వెంకటేశ్వరరావు కుటుంబంతో సహా హయత్‌నగర్ సుబ్రహ్మణ్యనగర్‌లో నివాసం ఉంటూ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. చదవండి: మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా ఇతని కుమారుడు మణిచంద్ర (28) కూడా తండ్రితో పాటు కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం క్రికెట్ ఆడుతుండగా కుడి చెయ్యి నొప్పి వచ్చింది. పలు ఆసుపత్రుల్లో చూపించినా నొప్పి తక్కువగా కాలేదు. పలువురి సూచన మేరకు ఎల్బీనగర్లోని శ్రీకార ఆసుపత్రిలో చూపించారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో గురువారం శస్త్ర చికిత్స చేయడానికి మణిచంద్రను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన వైద్యులు కొద్ది సేపటి తర్వాత అతను మృతి చెందినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు. అనస్తీషియా (మత్తుమందు) అధిక మోతాదులో ఇవ్వడం వల్లే మణిచంద్ర చనిపోయాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను శాంతిపజేశారు. మృతి చెందిన మణిచంద్ర కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిస్తామని ఆసుపత్రి యజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. -
అమ్మా... అలసిపోతున్నా...
స్కూల్‌కు పంపిస్తున్నాం. ఇంటికి తిరిగొస్తున్న పిల్లలు ఒళ్లు నొప్పులు అంటున్నారు. నిద్రొస్తోంది అంటున్నారు. కొందరికి కడుపులో అనీజీనెస్. ఇన్నాళ్లు ఇంట్లో ఉండి ఇప్పుడు స్కూల్‌కు వెళ్లడం వల్ల వాళ్లు అలసిపోతున్నారు అని మనం అనుకుంటున్నాం. కాని అది ‘ఎమోషనల్ ఫెటిగ్’ (భావోద్వేగ అలసట) అని నిపుణులు అంటున్నారు. పాతకు తిరిగి కొత్తగా వెళ్లాల్సి రావడం వల్లే ఈ అలసట. ఏం చేయాలి? కేస్‌స్టడీ 1: విశ్వాస్ తొమ్మిదో క్లాసు. స్కూల్ తిరిగి మొదలయ్యాక వెళ్లడం మొదలెట్టాడు. కాని రెండు మూడు రోజులకే ఆకలి లేదని అనడం మొదలెట్టాడు. కడుపులో బరువు ఉంటోంది అంటున్నాడు. అలసటగా సోఫాలో వాలిపోతున్నాడు. ప్రయివేట్ స్కూల్ అది. భోజనం గతంలో చేసిందే. ఇప్పుడూ చేస్తున్నాడు. కాని ఆ అన్నం పడట్లేదు అంటున్నాడు. తల్లిదండ్రులు స్కూల్ వాళ్లకు ఫోన్ చేసి కేటరింగ్ ఏదైనా మార్చారా, వేరే రకంగా వండుతున్నారా అని ప్రశ్నలు సంధించారు. నిజానికి స్కూలు సజావుగానే ఉంది. విశ్వాస్ గత 14 నెలలుగా ఇంట్లో భోజనం తిన్నాడు. పైగా అమ్మ కొసరి కొసరి తినిపిస్తుంటే తిన్నాడు. ఇప్పుడు మళ్లీ కొత్తగా స్కూల్లో తినాల్సి వచ్చేసరికి అడ్జస్ట్ట్ కాలేకపోతున్నాడు. దానికి టైమ్ ఇవ్వాలి. ఆ టైమ్ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కేస్‌స్టడీ 2: జాహ్నవి 7వ క్లాసు. మాస్క్ పెట్టుకుని చక్కగా స్కూల్‌కు వెళుతోంది. కాని ఇంటికి వచ్చేసరికి పూర్తిగా అలసిపోతోంది. అసలు తిరుగు ప్రయాణంలో బస్ ఎక్కగానే నిద్రపోతోంది. ఇంట్లో వాళ్లు కంగారు పడి ‘వద్దులే.. ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది కదా. ఇంట్లోనే ఉండి చదువుకో’ అని స్కూల్‌కి పంపడం లేదు. కాని జాహ్నవికి కన్ఫ్యూజన్. స్కూల్‌కి వెళ్లాలా... ఇంట్లో ఉండాలా? ఆ పాప అలసిపోతోంది శారీరకంగా కాదు. మళ్లీ రియల్ క్లాసెస్‌ని అటెండ్ కావడానికి అడ్జస్ట్ అవలేకపోవడం వల్లే. ఈ రెండు కేసుల్లో పిల్లలు పడుతున్న అవస్థను నిపుణులు ‘ఎమోషనల్ ఫటీగ్’ అంటున్నారు. అది గబగబ చేయమని.. ఇదీ చేయమని ఆలోచించండి. పిల్లలు కరోనా కాలంలో ఎంత అవస్థ పడ్డారో. స్కూళ్లు మానేసి వాళ్లను త్వరత్వరగా ఆన్లైన్ క్లాసులకు అడ్జస్ట్ అవమన్నాం. చిన్న స్క్రీన్ ఉండే ఫోన్లలో, ల్యాప్‌టాప్‌లలో, కంప్యూటర్లలో వాళ్లను పాఠాలను వినమన్నాం. ఇంతకు మునుపు ఎప్పుడూ ఈ అనుభవం లేని పిల్లలు ఆ తెర మీద కనిపించే టీచర్‌ను చూడటానికి ఆ మైక్‌లో వినిపించే పాఠాలను అర్థం చేసుకోవడానికి అవస్థ పడ్డారు. వారిని ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయమంటే చాలామంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల, తోబుట్టువుల, పుస్తకాల సాయంతోనే ఆ పరీక్షలు రాసి పాస్ అయ్యారు. క్లాస్ జరుగుతుంటే కెమెరా ఆఫ్ చేసి ఆడుకున్నారు. క్లాస్‌ను గాలికి వదిలి గేమ్స్ ఆడుకున్నారు. ఇలా గడిచిపోయిన పిల్లలను ఇప్పుడు గబగబా మళ్లీ రియల్ స్కూల్‌కు అలవాటు కమ్మని చెప్పడం వల్లే వారు భావోద్వేగపరమైన అలసటకు గురవుతున్నారు. ఇన్నాళ్లు చిన్న చిన్న రూపాల్లో కనిపించిన క్లాస్‌రూమ్‌ను, టీచర్‌ను, క్లాస్‌మేట్స్‌ను వాళ్లు రియల్‌గా చూడాలి. రియల్‌గా మళ్లీ ఆ వాతావరణానికి అలవాటు పడాలి. పెద్దలు రోడ్డు మీద ఈ బస్సు ఆగిపోతే ఇంకో బస్సు ఎక్కినంత సులువుగా పిల్లలు ఈ అటుకులు చిటుకులు మారలేరు. వారి లోలోపల చాలా భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ వారిని ముప్పిరిగొంటాయి. దానివల్ల వచ్చే అలసటే ఇది అని అర్థం చేసుకోవాలి. సమయం ఇవ్వడం ప్రధానం కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే స్కూల్ మొదలైందిగా ఇంక అంతా నార్మల్ అయినట్టేనని ‘‘ఆ పాఠాలు చదివావా ఈ హోమ్ వర్క్ చేశావా అందులో ఒప్పజెప్పు... ఇది చేసి చూపించు’’ అని అడుగుతారు. టీచర్లు కూడా పరీక్షలు పెట్టేయొచ్చు, సిలబస్ గబగబా ముగించవచ్చు... పాత వైఖరిలోనే వ్యవహరించ వచ్చు అనుకుంటారు. కాని ఇప్పుడు క్లాసుల్లో ఉన్న పిల్లలు గతంలోని పిల్లలు ఏ మాత్రం కారు అని గ్రహించాలి. ఒక సంవత్సరన్నర కాలం వారిని చాలా గందరగోళానికి, ఒంటరితనానికి, భయానికి, ఆందోళనకు గురించి చేసింది. ఆ సమయంలో ఏం చదివామో ఏం చదవలేదో అన్న బెంగ వారికి ఉంది. ఇప్పుడు స్కూల్లో తాము పరీక్షలకు, టీచర్ల ప్రశ్నలకు ఏ మాత్రం నిలబడతామోనన్న కంగారు వారికి ఉంటుంది. దాంతో వారు అలసిపోతున్నారు. సరిగ్గా తింటున్నా, ఇంట్లో తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నా అలసిపోతున్నారు. వీరికి సమయం ఇచ్చి మెల్లగా అడ్జస్ట్ అవ్వండి అని పదేపదే చెప్పడమే మందు. అతి జాగ్రత్త.. అతి నిర్లక్ష్యమూ వద్దు తల్లిదండ్రులు పిల్లల పట్ల అతి జాగ్రత్త వద్దు... అలాగే అతి నిర్లక్ష్యమూ వద్దు. స్కూళ్లకు అందరు పిల్లలూ వెళుతున్నా మన పిల్లల్ని కేవలం ఆన్లైన్ ఆప్షన్ ఉంది కదా అని దానికే పరిమితం చేయవద్దు. అలాగే నిర్లక్ష్యంగా గుంపులో ఎక్కువ మంది పిల్లలు ఉండే ఆటోల్లో పంపవద్దు. జాగ్రత్తలు తీసుకోవాలి... అలాగే స్కూల్‌కు తిరిగి అలవాటు చేయాలి. పిల్లలు పిల్లల లోకంలో ఉండటమే కరెక్ట్. ఆ పిల్లల లోకంలో వారుండగా మార్కులు, డిసిప్లిన్, పాఠాలు... త్వరత్వరగా అంటే అలసిపోతారు. టైమ్ ఇవ్వండి. వారిని నవ్వనివ్వండి. కొంచెం ఆడనివ్వండి. తర్వాత ఎలాగూ చదవాల్సిందేగా. తల్లిదండ్రులు పిల్లల పట్ల అతి జాగ్రత్త వద్దు... అలాగే అతి నిర్లక్ష్యమూ వద్దు. స్కూళ్లకు అందరు పిల్లలూ వెళుతున్నా మన పిల్లల్ని కేవలం ఆన్లైన్ ఆప్షన్ ఉంది కదా అని దానికే పరిమితం చేయవద్దు. పిల్లలు పిల్లల లోకంలో ఉండటమే కరెక్ట్. -
అనస్తీషియా వైద్యుడు..సేంద్రియ రైతుగా ఎలా మారాడంటే..
వ్యవసాయం, పశుపోషణను రసాయనాల ‘మత్తు’ నుంచి విడిపించేందుకు ఓ సీనియర్ మత్తు వైద్యుడు సేంద్రియ రైతుగా మారారు. సుమారు రూ. పది కోట్ల పెట్టుబడితో, విలక్షణ సమీకృత సేంద్రియ సేద్యానికి నమూనాగా నిలిచేలా భారీ వ్యవసాయ క్షేత్రాన్ని సొంత డిజైన్‌తో నిర్మించారు. రసాయనిక అవశేషాల్లేని బియ్యం, కూరగాయలతోపాటు.. దేశీ ఆవులు / ముర్రా గేదెల పాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు 250 మంది వైద్యులు, మరెందరో ఆరోగ్యాభిలాషుల మనసులు దోచుకుంటున్నారు. ఆయన పేరు డాక్టర్ యు. శేషఫణి (56). కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అనస్తీషియా విభాగానికి అధిపతి. వైద్య విధుల్లో నిత్యం తీరిక లేకుండా గడిపే ఆయన డాక్టర్‌గా రాణిస్తూనే.. భారీ ప్రణాళికతో పెద్ద సమీకృత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. మహానంది మండలం గోపవరం గ్రామంలో సొంత ఆలోచనతోనే వ్యసాయ క్షేత్రాన్ని ఔరా అనిపించేలా డిజైన్ చేసుకున్నారు. భూగర్భంలో 2 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్‌ను నిర్మించి, అందులోకి ఆవులు/ గేదెల మూత్రం, పేడ, కడిగిన నీరు వెళ్లేలా ఏర్పాటు చేసి.. అక్కడే సులువుగా జీవామృతం తయారు చేసుకుంటున్నారు. సంపులో నుంచే నేరుగా పంట పొలాలకు 4 అంగుళాల పైపులతో జీవామృతాన్ని తోడి పోసే విధంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం విశేషం. సొంత భూమి 12 ఎకరాలు ఉండగా.. 25 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. 13 ఎకరాల్లో వరి, కూరగాయలతోపాటు పశుగ్రాసాలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు. పండించిన ధాన్యం 4 నెలలు మాగబెట్టిన తర్వాత బియ్యం పట్టించి గిట్టుబాటు ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. పంటలపై సస్యరక్షణకు అవసరాన్ని బట్టి వేస్ట్ డీకంపోజర్, గోమూత్రం, వేపనూనె పిచికారీ చేస్తారు. మామిడి, సపోట, బాదం, అంజూర, బత్తాయి, దానిమ్మ, నేరేడు, జామతో పాటు, కొబ్బరి, టేకు చెట్లు పెంచుతున్నారు. దేశీ ఆవులు, ముర్రా గేదెల నమూనా క్షేత్రం రసాయనాలు, ఆక్సీటోసిన్ ఇంజక్షన్లు వాడకుండా.. దేశీ ఆవులు, ముర్రా గేదెలతో నాణ్యమైన పాల ఉత్పత్తితోపాటు ప్రమాణాలతో కూడిన ఆవు, గేదెల సంతతిని వృద్ధి చేస్తున్నారు డా. శేషఫణి. 2016లో ఒక పశువైద్యుడి సలహాతో 4 దేశీవాళీ ఆవులు, 6 ముర్రా గేదెలతో ఫామ్ పెట్టారు. ఈ ఫామ్ నేడు విశేషంగా అభివృద్ధి చెందింది. 38 ఒంగోలు, 4 సాహివాల్ ఆవులతోపాటు 130 ముర్రా గేదెలను శ్రద్ధగా, ఆరోగ్యవంతంగా పోషిస్తూ రసాయనిక అవశేషాల్లేని పాలు ఉత్పత్తి చేస్తున్నారు. ప్యాకెట్లను ఇంటింటికీ అందిస్తున్నారు. 400 ఆవులు, గేదెలకు సరిపోయేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. 17 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేస్తున్నారు. 200 ఎకరాల వరి గడ్డి, జొన్న చొప్ప కొని భారీ గోదాములో నిల్వ చేసుకొని ఏడాది పొడవునా మేపుతున్నారు. సొంత దినుసులతోనే దాణా తయారు చేసుకొని ఖర్చు తగ్గించుకుంటూ సత్ఫలితాలు సాధిస్తుండటం విశేషం. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నందుకు సంతృప్తిగా ఉంది జాతి పశువులు అంతరించిపోకుండా ఉండాలనే లక్ష్యంతో దేశవాళీ ఆవులు, ముర్రా గేదెలతో ప్రత్యేక ఫామ్‌ను అభివృద్ధి చేశాం. నంద్యాల పరిశోధనా స్థానం నుంచి నాణ్యమైన ఒంగోలు గిత్తల సెమెన్ వాడుతున్నాం. సెక్స్డ్ సెమన్‌తో మేలు జాతి ముర్రా జాతి పశువులను ప్రత్యేక సొసైటీ ద్వారా శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నాం. ఆరోగ్యదాయకమైన ఎ2 పాలను, బియ్యం, ఇతర ఆహారోత్పత్తులను అందిస్తున్నాం. ఇటు గోసేవ, అటు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నందుకు సంతృప్తిగా ఉంది. – డా. శేషఫణి (94400 70234), గోపవరం, మహానంది మండలం, కర్నూలు జిల్లా -
సర్జరీలో విషాదం: ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మత్తుమందు ఇవ్వడంతో..
మాస్కో: రష్యాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మెరీనా లెబెదేవా వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందింది. ఆమె తన ముక్కు ఆకారాన్ని మార్చుకోవడానికి రైనోప్లాస్టీ సర్జరీ కోసం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఆర్టీబీట్ క్లినిక్‌లో చేరింది. తర్వాత ఆపరేషన్ ప్రక్రియలో భాగంగా మత్తుమందు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆమె శరీర ఉష్ణోగ్రత పెరిగిపోయింది. మత్తుమందుకి ఆమె శరీరం ప్రతికూలంగా స్పందిస్తోందని వైద్యులు గ్రహించిన వెంటనే మరో ఆస్పత్రిలో చేర్చే క్రమంలో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు బాధ్యులపై క్రిమనల్ కేసు నమోదు చేశారు. ఒక వేళ నేరం రుజువైతే, సర్జన్లకు ఆరేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా మెరీనా లెబెదేవా మరణించే సమయంలో ఆమె భర్త వ్యాపార పర్యటనలో ఉన్నాడు. ఆమె మరణ వార్త తెలుసుకొని అతను సెయింట్ పీటర్స్బర్గ్ కు చేరుకున్నాడు ఈ రకమైన పరిస్థితి "ఒక మిలియన్ శస్త్రచికిత్సలలో ఒకసారి" జరగడంతో వైద్యులు ఖంగుతిన్నారు. రైనోప్లాస్టీ శస్త్రచికిత్స చేయకముందే మెరీనా లెబెదేవాకు అన్నీ పరీక్షలు చేశామని ఆర్టీబీట్ క్లినిక్ డైరెక్టర్ అలెగ్జాండర్ ఎఫ్రెమోవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రిపోర్ట్‌ల ప్రకారం మెరీనా లెబెదేవా జన్యుపరమైన పరిస్థితి కారణంగా మరణించిందని క్లినిక్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. చదవండి: Ravindra Jadeja: టీమిండియా ఓటమి.. ఆసుపత్రిలో చేరిన జడేజా -
రిమ్స్‌లో కాన్పు కష్టాలు
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో అనస్తీషియా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రసవం కోసం చేరిన గర్భిణులు పురుటి నొప్పులతో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 58 మంది గర్భిణులు ఉన్నారు. శుక్రవారం అనస్తీషియా (మత్తు) వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో ప్రసవాలు నిలిచిపోయాయి. అత్యవసరంగా ఏడుగురికి కాన్పులు జరగాల్సి ఉన్నా వైద్యులు స్పందించలేదు. దీంతో ముగ్గురిని వారి కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో నలుగురు గర్భిణులు నొప్పులతో అవస్థలు పడుతూ ఆస్పత్రిలోనే ఉండిపోయారు. కాగా, దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి డైరెక్టర్ కరుణాకర్‌ను సంప్రదించగా, ముగ్గురు మత్తు వైద్యులకు గాను ఇద్దరు అనారోగ్య కారణాలవల్ల సెలవులో ఉన్నారని, మరో వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్నారని తెలిపారు. పెద్ద ప్రాణానికి ఏమవుతుందో: షౌకత్ మాది నార్నూర్ మండల కేంద్రం. గర్భిణి అయిన నా భార్య హసీనాకు కడుపు నొప్పి రావడంతో గురువారం రిమ్స్‌కు తీసుకొచ్చాను. ఆస్పత్రిలో స్కానింగ్ చేయించాము. కడుపులోనే పిండం చనిపోయిందని వైద్యులు చెప్పారు. చనిపోయిన పిండాన్ని డాక్టర్లు ఆపరేషన్ చేసి ఇంకా బయటకు తీయలేదు. ఎప్పుడు ఆపరేషన్ చేస్తారని అడిగితే మత్తు డాక్టర్ ఎప్పుడు వస్తే అప్పుడే అని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దీంతో పెద్ద ప్రాణానికి ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. -
‘మత్తు’ డాక్టర్లు కావలెను
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మత్తు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడు అనస్తీషియా వైద్యుల పోస్టులు ఉండగా ఒక్కరే అందుబాటులో ఉన్నారు. మిగిలిన ఆరుపోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖానాపూర్ సీహెచ్‌సీతో పాటు భైంసా ఏరియా ఆస్పత్రిలో మత్తు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సకాలంలో ఆపరేషన్లు చేయలేక వైద్యులు అవస్థలు పడుతున్నారు. శస్త్ర చికిత్స చేయాలంటే మత్తుమందు ఇచ్చే వైద్యుడు అందుబాటులో ఉండాల్సిందే. ఆపరేషన్ థియేటర్లో సర్జన్‌తో పాటు అనస్తీషియా వైద్యుడు తప్పనిసరి. వ్యాధి తీవ్రత, రోగి, ఆరోగ్య పరిస్థితిని బట్టి మత్తుమందు ఇస్తారు. మత్తు ఎక్కడ ఇవ్వాలనేది అనస్తీషియనే నిర్ణయిస్తాడు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మాత్రమే ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఇందులో ఒకరు ఒక వారం పాటు ప్రసూతి ఆస్పత్రిలో కూడా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 21 మందికి ఆరుగురు మాత్రమే జిల్లా వ్యాప్తంగా మొత్తం 21 అనస్తీషియా వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే పని చేస్తున్నారు. జిల్లాలో కీలకమైంది జిల్లా ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి. జిల్లా ఆస్పత్రి, బైంసా ఏరియా ఆసుపత్రుల్లో సివిల్ సర్జన్‌తో పాటు డిప్యూటీ సివిల్ సర్జన్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు ఉండాలి. కానీ ఇక్కడ ఇద్దరు మాత్రమే అసిస్టెంట్ సివిల్ సర్జన్ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో మరో అనస్తీషియా పోస్ట్ ఖాళీగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడుగురికి ఒక అసిస్టెంట్ సివిల్ సర్జన్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఖానాపూర్ సీహెచ్‌సీలో మూడు అనస్తీసియా పోస్టులకుగానూ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రులు నిర్మిస్తున్న ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు నిర్మిస్తున్నా, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నా పోస్టుల భర్తీపై సర్కారు దృష్టి సారించకపోవడంతో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు. వైద్యుల కొరతతో ఇబ్బందులు జిల్లాలోని ప్రసూతి ఆస్పత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు 4,676 ప్రసవాలు జరిగాయి. ఇందులో 3,688 సిజేరియన్లు, 988 సాధారణ కాన్పులు. జిల్లా ఆసుపత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు దాదాపు 2,150 ఆపరేషన్లు చేశారు. గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్లు 1089, గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు 2643. కానీ అనస్తీషియా వైద్యులు సరిపడా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఈ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించడానికి నోటిఫికేషన్ వేసినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో అనస్తీషియా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. అయినా ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో ఖాళీగా ఉన్న అనస్తీసియా పోస్టు కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – దేవేందర్‌రెడ్డి, డీసీహెచ్ఎస్ -
డాక్టర్ వాంగ్మూలాన్ని నమోదు చేయండి
సాక్షి, అమరావతి: మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న అనస్తీషియా వైద్యుడు సుధాకర్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని విశాఖపట్నం జిల్లా జడ్జిని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు వాంగ్మూలం నమోదు నిమిత్తం మేజిస్ట్రేట్‌ను సుధాకర్ వద్దకు పంపాలని సూచించింది. గురువారం సాయంత్రం కల్లా వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు డాక్టర్ సుధాకర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో క్లిప్పింగులను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరుస్తాం డాక్టర్ సుధాకర్ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, దీనిపై జోక్యం చేసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతోపాటు ఓ వీడియోను కూడా జత చేశారు. అయితే ఆ వీడియోను ఎడిట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫోటోను జత చేశారు. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ కేసులో ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద తెలిపారు. కౌంటర్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేశామని వివరించారు. డాక్టర్ సుధాకర్‌ను ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరు పరిచే పరిస్థితి లేదని, ఏడు గంటల పాటు ఆయన ప్రయాణం చేసే స్థితిలో లేరని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన్ను హాజరుపరుస్తామని కోర్టుకు నివేదించారు. ఈ అభ్యర్థనతో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశామన్నారు. కౌంటర్ కాపీ ప్రత్యక్షంగా తమ ముందు లేకపోవడంతో విచారణను వాయిదా వేయాలని ధర్మాసనం నిర్ణయించింది. కాగా, ఈ సమయంలో కోర్టు సహాయకారిగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలున్నాయో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆస్పత్రిలో వైద్యుడి వాంగ్మూలం నమోదు పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని విశాఖ జిల్లా కోర్టు సెషన్స్ జడ్జి శ్రీనివాసరెడ్డి బుధవారం సాయంత్రం నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న వైద్యుడి వద్దకు చేరుకుని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సెషన్స్ జడ్జి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి, మూడో పట్టణ సీఐ కె.రామారావు తదితరులున్నారు. -
అనస్థీషియా వైద్యుడి వీరంగం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/సీతమ్మధార (ఉత్తర): నర్సీపట్నం అనస్థీషియా (మత్తు) వైద్యుడు సుధాకర్ మరోసారి వీరంగమాడారు. జాతీయ రహదారిపై కారు ఆపి నానా హంగామా సృష్టించారు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తు డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సుధాకర్ శనివారం సాయంత్రం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని తన ఇంటికి వెళుతున్నారు. మార్గంమధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై తన కారాపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడటం ప్రారంభించారు. దీంతో వారు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా వారిపై తిరగబడ్డాడు. చొక్కా విప్పి నడిరోడ్డుపై పడుకుని పోలీసుల్ని, స్థానికుల్ని, ప్రజాప్రతినిధుల్ని నోటికొచ్చినట్టు తిట్టడం ప్రారంభించారు. డాక్టర్ ప్రవర్తనను వీడియో తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణ చేతిలోంచి సెల్‌ను లాక్కుని రోడ్డుకేసి కొట్టారు. వైద్యుడిని అదుపు చేసేందుకు పోలీసులు అతని చేతులను తాళ్లతో కట్టారు. మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించి ఎమ్ఎల్సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ రక్త నమూనాలు సేకరించి వైద్యులు రిఫర్ చేయడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించినట్టు ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ చెప్పారు. వైద్యుడిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, డాక్టర్‌ను లాఠీతో కొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్టు సీపీ ఆర్కే మీనా చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయాలి: చంద్రబాబు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్‌పై జరిగిన దాడి.. దళితులపై దాడి, వైద్య వృత్తిపై దాడి అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. -
ఇక గర్భ నిరోధానికి ఇంజెక్షన్లు!
అనవసరంగా గర్భం రాకూడదనుకుంటే ఆడవాళ్లకు టూబెక్టమీ ఆపరేషన్ సహా పలు మార్గాలు ఉన్నాయి. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్స్, నిరోధ్‌లు. టూబెక్టమీ మినహా మిగతా అన్నింటి వల్ల మహిళలకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మగవాళ్లకు వాసెక్టమీ ఆపరేషన్‌తోపాటు నిరోధ్‌లు ఉన్నాయి. నిరోధ్‌ల వల్ల భావ సంతప్తి కలగదనే భావం చాలా మందిలో ఉండడంతో ఆడవాళ్లకు తరహాలో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల కోసం భారత పరిశోధకులు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. చివరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఈ దిశగా 13 ఏళ్లపాటు ప్రయోగాలు నిర్వహించి ఇప్పుడు విజయం సాధించింది. గర్భ నియంత్రణ కోసం మగవాళ్లకు ఓ ఇంజెక్షన్‌ను కనిపెట్టింది. ఈ ఇంజెక్షన్‌ను వరి బీజాలకు ఇస్తారు. అందుకు నొప్పి తెలియకుండా అనెస్తీసియా ఇవ్వాల్సి ఉంటుంది. వరి బీజం నుంచి వీర్యం బయటకు రాకుండా ఈ ఇంజెక్షన్ అడ్డుకుంటుందని సీనియర్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. చట్టబద్ధమైన మూడు ట్రయల్స్‌ను ఐసీఎంఆర్ విజయవంతంగా పూర్తి చేసిందని పాతికేళ్లపాటు ఈ విషయంలో పరిశోధనలు సాగించిన శర్మ చెప్పారు. ఈ ఇంజెక్షన్ ఉత్పత్తికి లాంఛనంగా భారత్ లైసెన్స్‌తోపాటు ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్’ అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. మరో ఆరు నెలల్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి రానుంది. అమెరికాలాంటి దేశాల్లో మహిళలు గర్భం రాకుండా 70శాతం మంది మాత్రలు, ఇంజెక్షన్లు వాడుతున్నారు. 22 శాతం మహిళలు టూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. భారత్‌లో 50 శాతం మంది మహిళలు మాత్రమే గర్భనిరోధక మందులు, ఇంజెక్షన్లు వాడుతుండగా, మిగతా మహిళల్లో ఎక్కువ మంది మగవారి నిరోధ్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఏ నిరోధక సాధనాలను వాడని స్త్రీ, పురుషులు కూడా భారత్‌లో గణనీయంగా ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు కనుగొన్న ఇంజెక్షన్ ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ప్రపంచంలో గర్భ నిరోధానికి మగవారికి ఇంజెక్షన్ పద్ధతిని ప్రవేశపెడుతున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించబోతోందని డాక్టర్ శర్మ తెలిపారు. 303 మందికి ఈ ఇంజెక్షన్ ఇవ్వగా 97.3 శాతం మందికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆయన చెప్పారు. -
మత్తు మందిచ్చి దోపిడీ
సాక్షి, గుంతకల్లు: నేత్రావతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు మహిళా ప్రయాణికులకు అపరిచిత వ్యక్తి టీలో మత్తుమందు కలిపిచ్చి.. నిలువు దోపిడీకి చేశాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన మారియమ్మ, ఎలీసె అనే వృద్ధ మహిళలు స్వగ్రామం వెళ్లేందుకు గురువారం ఛత్రపతి శివాజీ టర్మినల్ – తిరువనంతపురం వెళ్లే నేత్రావతి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ – 16345) ఎక్కారు. బీ2 కోచ్‌లో 61, 65 నంబర్‌సీట్లలో కూర్చున్నారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో లోనవాలా రైల్వేస్టేషన్‌కు చేరిన సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వీరితో మాటామంతీ కలిపి మత్తుమందు కలిపిన టీ ఇచ్చాడు. టీ తాగిన తర్వాత ఇద్దరూ స్పృహ కోల్పోయారు. మారియమ్మ, ఎలీసె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపరిచిత వ్యక్తి దోచుకునివెళ్లాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఇద్దరు మహిళలను శుక్రవారం ఉదయం కొప్పగల్లు రైల్వేస్టేషన్లో తోటి ప్రయాణికులు గుర్తించి గుంతకల్లు రైల్వే అధికారులకు సమాచారమందించారు. రైలు 11.15 గంటలకు గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న టీటీఈ కిషోర్ కోచ్‌లోకి వెళ్లి స్పృహ కోల్పోయిన మారియమ్మ, ఎలీసెలను 108 వాహనంలో స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ బాధితులు అపస్మారక స్థితిలోనే ఉండటంతో నగల విలువ తెలియరాలేదు. 3 గంటలు అంబులెన్స్‌లోనే.... మత్తు మందు ప్రభావంతో స్పృహ కోల్పోయిన మారియమ్మ, ఎలీసెలను 11.30 గంటలకు 108 సిబ్బంది రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే సం బంధిత రైలులో విధి నిర్వహణలో ఉన్న టీటీఈ నుంచి ఎలాంటి సమాచారం అందనందున తాము వైద్య సేవలందించలేమని సిబ్బంది మొండికేశారు. నేత్రావతి ఎక్స్‌ప్రెస్ రైలు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గుంతకల్లు మీదుగా మళ్లించారు. దీంతో ఆ రైలులో టీటీఈలు కూడా ఎవరూ లేరని తెలిసింది. ఈ కారణంగానే కంట్రోల్ రూం కార్యాలయానికి ఫిర్యాదు అందలేదు. దీంతో మూడు గంటలపాటు బాధిత మహిళలకు 108 వాహనంలోనే సిబ్బంది చికిత్సలు అందించారు. రైల్వే ఉన్నతాధికారులు కల్పించుకొని ఆదేశాలివ్వడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వీరికి ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. -
వైద్యుడి నిర్వాకం !
వైద్యుడ్ని దేవుడితో సమానంగా భావిస్తాం. రోగాన్ని నయం చేస్తే అతన్ని జీవితాంతం గుర్తించుకుంటాం. డాక్టర్‌కు ఉన్న గౌరవం సమాజంలో ప్రత్యేకం. కానీ ఓ వైద్యుడు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళలకు మత్తు మందు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఈ సంఘటన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేష్ జోక్యం చేసుకొని.. అనకాపల్లి నుంచి మరో మత్తు వైద్యుడ్ని రప్పించి ఆపరేషన్లను చేయించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నర్సీపట్నం: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న మత్తు వైద్యుడు(ఎనస్తీషియా) సుధాకర్ వ్యవహారశైలి తరచూ వివాదాలకు కారణమవుతున్నారు. గతంలో కూడా విధులకు సమయానికి రావాలంటూ హెచ్చరించిన సూపరింటెండెంట్‌ను గదిలో బంధించి తలుపులకు గడియ పెట్టేశారు. ఈ ఉదంతంపై స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పట్లో సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు గడవక ముందే మరో వివాదానికి కారణమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఏడుగురు గర్భిణులకు సోమవారం సిజరైన్ ఆపరేషన్లు చేసేందుకు గైనికాలజిస్టు గౌతమి సోమవారం ఏర్పాట్లు చేసుకొని ఆపరేషన్ థియేటర్లో మత్తునిచ్చే డాక్టర్ సుధాకర్ కోసం వేచి చూస్తున్నారు. థియేటర్‌కు వచ్చిన డాక్టర్ సుధాకర్ ముగ్గురుకి మించి మత్తు ఇవ్వలేనని మొండికేశారు. అయితే వెంటనే అపరేషన్లు చేయకుంటే గర్భిణుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని గైనికాలజిస్టుకు నచ్చచెప్పినప్పటికీ ఆయన పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ప్రసవ వేదనతో బాధపడుతున్న జి.ఉమాదేవి, ఎం.స్పందన, పి.సునీత, సీహెచ్.దేవి, ఎస్.మీనాక్షి, జి.భవాని తదితరులను విశాఖ కేజీహెచ్‌కు తరలించేందుకు వైద్యులు సిద్ధపడడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో వైద్యులు లేకపోవటమేమిటని సిబ్బందిని నిలదీశారు. పరిస్థితిని బంధువులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మాకవరపాలెం మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి చేసుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణలను చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. బాధితుల బంధువులకు తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు. కావాలనే ఆస్పత్రిలో కొంత మంది ప్రభుత్వానికి, తనకు చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని సూపరింటెండెంట్‌పై అసహనం వ్యక్తం చేశారు. అక్కడ నుండే ఆయన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడి జరిగిన సంఘటనను, మత్తు డాక్టర్ నిర్వాకాన్ని వివరించారు. ఆస్పత్రిలో ప్రసవవేదనతో ఉన్న గర్భిణులకు అపరేషన్లు జరిగేలా చూడాలని కోరారు. డాక్టర్లు వచ్చే వరకు తాను ఆస్పత్రిలోనే ఉంటానని మంత్రికి వివరించారు. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి చెందిన గైనికాలజిస్టు, మత్తు డాక్టర్ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి చేరుకొని ఆపరేషన్లు చేసి పండంటి బిడ్డలకు జన్మనిచ్చచేలా చేశారు. దీంతో బంధువులు, ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఊపిరి పీల్చుకున్నారు. మూడు గంటల పాటు ఎమ్మెల్యే ఆస్పత్రిలోనే ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రికి చెందిన కొందరు కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి, తనకు చెడ్డు పేరు వచ్చే విధంగా వీరు వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మత్తు డాక్టర్ సుధాకర్‌పై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. ఏడుగురు మహిళలు సుఖప్రసవాలు పోసుకుని తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో ఆయన సంతోసం వ్యక్తం చేశారు. -
ఇంతింతై వృద్ధి చెందిన అనస్థీషియా
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): శస్త్రచికిత్సలో ఎంతో కీలకమైన అనస్థీషియాలో అత్యాధునిక వైద్యవిధానాలు అందుబాటులోకి వచ్చాయని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున తెలిపారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజిస్ట్ విశాఖ పట్నం సిటీ బ్రాంచ్, కేజీహెచ్ అనస్థీషియా విభా గం, ఆంధ్ర వైద్య కళాశాల సంయుక్తంగా జిల్లా పరిషత్ వద్దనున్న అంకోసా సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ‘సురక్షిత మత్తువైద్యం’ వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. గతంతో పోల్చితే మత్తువైద్యంలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పారు. మత్తు వైద్యుడు తప్పనిసరి అప్పుడే పుట్టిన శిశువు నుంచి వందేళ్ల వయసున్న వ్యక్తి వరకూ చేసే ఎటువంటి శస్త్ర చికిత్సకైనా మత్తు వైద్యుని అవసరం తప్పనిసరి అని సొసైటీ ప్రతినిధి డాక్టర్ కుచేలబాబు అన్నారు. గతంలో కంటే ప్రస్తుతం మత్తు వైద్యంలో రక్షణతో కూడిన శాస్త్రీయత పెరిగిందన్నారు. శస్త్ర చికిత్స చేయాల్సిన వ్యక్తి పూర్తి సమాచారాన్ని ముందుగా మత్తు వైద్యుడు సేకరించి, శస్త్రచికిత్స చేసే వైద్యునికి చేదోడువాదోడుగా ఆపరేషన్ థియేటర్లో ఉంటారని తెలిపారు. ఈ ప్రదర్శన ఈ నెల 9వ తేదీ వరకూ రోజూ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ప్రత్యక్షంగా తెలియజేసేందుకే.. కేజీహెచ్ అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ ఎ.సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలకు అత్యాధునిక వైద్య పద్ధతులను ప్రత్యక్షంగా తెలియజేయడమే ప్రదర్శన ముఖ్యోద్దేశం అన్నారు. ప్రారంభోత్సవంలో డాక్టర్ శశిప్రభ, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.పద్మావతి తదితర వైద్యులు పాల్గొన్నారు. అచ్చంగా ఆపరేషన్ థియేటర్లా.. శస్త్ర చికిత్స సమయంలో రోగి హార్ట్‌బీట్, రక్తంలో ప్రాణవాయువు నియంత్రణ, రక్తపోటు వంటి అంశాలను మత్తు వైద్యుడు ఏవిధంగా పరిశీలిస్తారో ఇక్కడి నిపుణులు వివరిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కృత్రిమ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశారు. ఈ గదిలోకి వెళ్తే మనం ఆస్పత్రిలో ఉన్న ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. గుండె శస్త్ర చికిత్సలు చేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలను ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే రోగికి ఆ సమయంలో ఎటువంటి ఆధునిక వైద్య సేవలు అందిస్తారో వివరంగా చెబుతున్నారు. -
చెన్నై లైంగిక దాడి కేసు : ఘోరమైన విషయాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఐనవరం బాలికపై లైంగిక దాడులకు సంబంధించి క్రమేణా అనేక ఘోరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలికపై మొదటిగా లైంగిక దాడికి పాల్పడిన రవికుమార్ (66).. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు వాడే అనస్తీషియా (మత్తు ఇంజెక్షన్)ను ప్రయోగించినట్లు అంగీకరించాడు. దీంతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మత్తు ఇంజెక్షన్, మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన ఫార్మసీ దుకాణ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఐనవరం, పెరంబూరు ప్రాంతాల్లోని మూడు ఫార్మసీల నుంచి వాటిని కొనుగోలు చేసినట్లు నిందితులు ఇచ్చిన సమాచారంతో వారిని పట్టుకున్నారు. రెగ్యులర్ ఖాతాదారులు కావడంతో అలవాటుగా ఇచ్చేశామని, వాటిని లైంగికదాడికి వినియోగిస్తారని తాము అనుకోలేదని ఫార్మసీ యజమానులు పోలీసుల వద్ద వాపోయినట్లు సమాచారం. శస్త్రచికిత్స సమయంలో రోగికి ఇచ్చే అనస్తీషియా ఇంజెక్షన్‌ను నిందితుడు రవికుమార్ కొనుగోలు చేసినట్లు తేలింది. నిందితులు పొడిచిన ఇంజెక్షన్ల వల్లనే బాలిక శరీరమంతా దద్దుర్లు ఏర్పడినట్లు తెలుసుకున్నారు. తగిన అర్హతకలిగిన వైద్యుడు జారీచేసిన ప్రిస్కిప్షన్ లేకుండా ప్రమాదకరమైన వస్తువులను అమ్మిన నేరానికి వారి లైసెన్సులు రద్దుచేసే అవకాశం ఉంది. బాధిత బాలికకు వైద్యపరీక్షల నిమిత్తం ఆరుగురితో కూడిన వైద్యుల బృందం ఏర్పాటైంది. మానసిక చికిత్స నిపుణుడు, కౌన్సెలింగ్ నిపుణుడు, బాలల వైద్య నిపుణుడు తదితరులు ఈ బృందంలో ఉన్నారు. కుటుంబ సభ్యులే సెక్యూరిటీ గార్డులు చెన్నై ఐనవరంలోని బాలికపై లైంగికదాడి సంఘటనతో ప్రయివేటు సెక్యూరిటీ గార్డులపైనే ప్రజల్లో నమ్మకం పోయింది. దీంతో సదరు అపార్టుమెంటు అసోసియేషన్ వారు 300 మంది కుటుంబాలతో గురువారం సమావేశమయ్యారు. తమ అపార్టుమెంటును తామే రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. చురుకుగా ఉండే పదిమంది ఆడవారికి తాత్కాలికంగా సెక్యూరిటీ బాధ్యతలను అప్పగించారు. నమ్మకమైన సెక్యూరీటీ గార్డుల సంస్థ దొరికేవరకు ఈ మహిళలతోపాటు కొందరు మగవారు కూడా అపార్టుమెంటు రక్షణ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. మూడు షిఫ్టుల్లో వారంతా పనిచేసేలా నిర్ణయించారు. వచ్చిపోయే వారిపై పలు ఆంక్షలు విధించారు. అనుమతిలేనిదే ఎవరినీ లోనికి పంపడం లేదు. -
అనెస్తీషియా..అదో మాయ!
మొన్న అసాధ్యం.. నిన్న కల.. నేడు ఆవిష్కరణ.. వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు. దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణానికి ముప్పు వస్తే కాపాడేది వైద్యుడే. తీవ్రతను బట్టి మందులు.. శస్త్రచికిత్సలతో పునర్జన్మను ఇస్తున్నారు. మానవ శరీరంలో అవయవాలు పాడైతే కృత్రిమమైనవి అమర్చి ప్రాణాలు నిలుపుతున్నారు. వైద్యుల్లో గుండెలు తీసిన బంట్లు ఉన్నారు. రికార్డు స్థాయిలో ఆపరేషన్లు చేసి చరిత్రకెక్కిన వారు ఉన్నారు. ఇలా ఎంతో మంది వైద్యులు ఉన్నా శస్త్రచికిత్సలో మత్తు మందు డాక్టర్ల పాత్ర ఎంతో కీలకం. రోగికి నొప్పి, బాధ తెలియకుండా గమ్మత్తుగా ఆపరేషన్లు చేయడం వైద్యశాస్త్రంలో ఓ అద్భుతమే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ అనెస్తీషియా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అనెస్తీషియా రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ప్రత్యేక కథనం. కర్నూలు (హాస్పిటల్): పూర్వం శాస్త్రీయ మత్తు విధానాలు అనుసరించకుండా అశాస్త్రీయ పద్ధతుల్లో శస్త్రచికిత్సలు నిర్వహించేవారు. అందువల్ల తక్కువ శాతం శస్త్రచికిత్సలు విజయవంతం అయ్యేవి. ఒకవేళ విజయవంతం అయినా ఆపరేషన్ తర్వాత రోగి కోలుకోవడంలో సమస్యలు ఉత్పన్నం అయ్యేవి. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మసెచ్యూసెట్ ఆసుపత్రిలో 1846 అక్టోబర్ 16వ తేదీన డబ్ల్యూటీజీ మోర్టాన్ అనే వైద్యులు గిల్బర్ట్ అబోట్ అనే రోగిపై ఈథర్ వాయువును ప్రయోగించారు. ఆ తర్వాత రోగి మెడపై ఉన్న కణితిని ఏ మాత్రం నొప్పి, బాధతెలియకుండా డాక్టర్ హెద్రీబెగ్లో అనే సర్జన్ విజయవంతంగా తొలగించారు. ఈ పరిణామం వైద్యశాస్త్రంలో అద్భుతం ఆవిష్కరించడమే గాకుండా మత్తు వైద్యవిభాగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది. ఆ తర్వాత పలు రకాలైన మత్తు ఔషధాలు, పరికరాలు ఆవిష్కరించడం ద్వారా పలు రకాలైన నూతన శాస్త్రీయ మత్తు విధానాలు అవలంంభించడం ద్వారా వైద్య శాస్త్రంలో మత్తు విభాగం ప్రాముఖ్యత విస్తరించి, కీలకమైన విభాగంగా ఆవిష్కరించింది. కర్నూలులో 1958 నుంచే.. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో 1958లో ఈ విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 26వేల మందికి ఆపరేషన్ సమయంలో మత్తు మందు ఇస్తున్నారు. సాధారణ శస్త్రచికిత్సలకే గాకుండా అన్ని రకాలైన స్పెషాలిటిస్కు సంబంధించిన శస్త్ర చికిత్సలతో పాటు మానసిక రుగ్మతలకు ఈసీటీ, జీర్ణకోశ విభాగంలో ఈఆర్సీపీ, రేడియాలజీ విభాగంలో సీజేఎంఆర్ఐ, న్యూరోసర్జరీ విభాగంలో పెయిన్ క్లినిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. కార్డియోథొరాసిక్ విభాగంలో 120కి పైగా కేసులకు విశిష్టమైన సేవలు అందిస్తోంది. ఇందులో 25 మందికి గుండె కవాటాల మార్పిడి, 30 మందికి కరొనరి బైపాస్‌లు, 9 మందికి గుండెలో రంధ్రాలు రిపేరి, 5గురికి రక్తనాళాలు, ఏడుగురికి ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెయిన్క్లినిక్ను ఆధునీకరించి మెరుగైన సేవలు అందించేందుకు గైనకాలజి విభాగంలో ప్రత్యేక ఐసీయు నెలకొల్పేందుకు, క్యాన్సర్ చికిత్సకు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఎస్ఏ రాష్ట్రస్థాయి సమావేశాలు విజయవంతంగా నిర్వహించారు. నొప్పులను తగ్గించే ‘పెయిన్ క్లినిక్‌లు’ =నొప్పి అనేది శరీరంలో జరిగే అసాధారణ చర్యలను సూచించే ఒక లక్షణం. నొప్పిని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి తీవ్రమైన నొప్పి, రెండు దీర్ఘకాలిక నొప్పి. దీర్ఘకాలిక నొప్పి వ్యవధి మూడు నెలలకు పైగా ఉంటుంది. దీని వల్ల మన శరీరం భావోద్రేక, ఇంద్రియ, హార్మోనల్ అసమతుల్యతకు లోనై మాంద్యము, మందులకు స్పందించకపోవడం, నిద్రలేమి వంటి వాటితో జీవితపు నాణ్యత లోపిస్తుంది. అందువల్ల నొప్పిని ఐదవ కీలక సూచనగా అభివర్ణిస్తారు. ఇలాంటి దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స చేయడానికి పెయిన్ క్లినిక్స్ అందుబాటులోకి వచ్చాయి. పెయిన్ క్లినిక్స్‌లో దీర్ఘకాల నొప్పులకు ఆధునిక పరికరాలు (ఎక్స్‌రే మిషన్, సిటి స్కానింగ్ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మిషన్)ను ఉపయోగించి కుట్లులేని ప్రత్యేకమైన ఇంజెక్షన్లు ద్వారా నొప్పి తగ్గిస్తారు. ఇందులో భాగంగా నడుంనొప్పికి, మోకాలునొప్పికి, మెడనొప్పికి, తలనొప్పికి, క్యాన్సర్ నొప్పులకు చికిత్స చేసి నొప్పి తగ్గిస్తారు. అలాగే సాధారణ కాన్పుల వల్ల కలిగే నొప్పులకు లేబర్ అనెల్జిషియా పద్ధతితో నొప్పిలేని కాన్పుగా చేస్తారు. ఆధునిక పరికరాల సహాయంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అనెస్తీషియా విభాగం ఆధ్వర్యంలో పెయిన్ క్లినిక్ స్థాపించి న్యూరోసర్జరీ ఆపరేషన్ థియేటర్లో చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక నెల వ్యవధిలో 20 మందికి ఈ చికిత్సలు చేశారు. నేడు అనెస్తీషియా దినోత్సవ వేడుకలు కర్నూలు సొసైటీ ఆఫ్ అనెస్తీషియా ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్స్ ఆధ్వర్యంలో వరల్డ్ అనెస్తీషియా డే వేడుకలను ఈ నెల 16వ తేదీ రాత్రి 8 గంటలకు స్థానిక బళ్లారి చౌరస్తాలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో నిర్వహిస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌లోని సెంచురీ హాస్పిటల్స్ చీఫ్ అనెస్తీషియాలజిస్ట్ డాక్టర్ టి. సునీల్ పాండ్య హాజరవుతారు. ఈ సందర్భంగా నిర్వహించే సైంటిఫిక్ సెషన్లో అనెస్తీషియా విభాగంలో వస్తున్న మార్పులపై ఆయన ప్రసంగిస్తారు. అంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ అనెస్తీషియాలజీ క్రిటికల్ కేర్ అండ్ పెయిన్ మెడిసిన్ ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో మధ్యాహ్నం 12 గంటలకు అనెస్తీషియా డే నిర్వహిస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముంబయిలోని లలితావతి హాస్పిటల్స్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ పి. జగన్నాథ్ హాజరుకానున్నారు. – డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, అనెస్తీషియా విభాగం హెచ్‌వోడి, కేఎంసీ, డాక్టర్ రామశివనాయక్ , అనేస్తీషియా వైద్యులు ఏటా 76 వేలకు పైగా రోగులకు శస్త్రచికిత్సలు జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్, ఆత్మకూరు, శ్రీశైలం, నందికొట్కూరు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిత్యం ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటన్నింటిలో ఆపరేషన్ థియేటర్లు అక్కడి అనెస్తీషియా విభాగం, వైద్యుల ఆధీనంలో ఉంటాయి. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ఏటా 26వేల శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. మిగిలిన మొత్తం ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 50వేలకు పైగానే ఉంటుంది. అంటే ఏడాదికి అన్ని ఆసుపత్రుల్లో కలిపి 76వేలకు పైగా రోగులకు ఆపరేషన్లు నిర్వహించడంలో అనెస్తీషియా వైద్యులే కీలక పాత్ర పోషిస్తారు. ఆపరేషన్ థియేటర్లలో రోగికి మత్తు ఇవ్వడమే గాక అత్యవసర విభాగాల్లో వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించడం, ఆఖరి క్షణాల్లో రోగులకు శ్వాస, రక్త ప్రసరణ పునరుద్ధరించడంలో మత్తు వైద్యసేవలు ప్రధాన భూమిక పోషించడం ద్వారా క్రిటికల్ కేర్ విభాగంలో కీలకంగా మారింది. ప్రమాదాలు సంభవించినప్పుడు ట్రామాకేర్లోనూ, ప్రకృతి విలయాల్లోనూ, మాస్ క్యాజువాలిటిల్లో ముఖ్యభూమిక పోషించడం ద్వారా వైద్యరంగంలో అనెస్తీషియా వైద్యులు కీలకంగా మారారు. -
ప్రసవ సమయంలో అనెస్తెటిస్ట్లదే కీలక పాత్ర
కర్నూలు(హాస్పిటల్): క్లిష్టతర ప్రసవ సమయంలో అనెస్తెటిస్ట్లదే కీలక పాత్ర అని అమెరికాలోని బాస్టన్‌కు చెందిన మత్తు మందు వైద్యులు డాక్టర్ భవానీ శంకర్ కొడాలి చెప్పారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్్స(ఐఎస్ఏ) ఆధ్వర్యంలో మూడురోజులుగా కర్నూలులో కొనసాగుతున్న మత్తు మందు వైద్యుల రాష్ట్ర సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు డాక్టర్ భవానీ శంకర్ కొడాలి మాట్లాడుతూ క్లిష్టతర ప్రసవ సమయంలో తల్లీబిడ్డలను ఇద్దరిని ఎలా కాపాడాలనే అంశంపై చర్చించారు. కాన్పుల సమయంలో అనెస్తెషియా ఎలా ఇవ్వాలి, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై విపులంగా వివరించారు. అనంతరం వివిధ అంశాలపై డాక్టర్ బాలవెంకట్(కోయంబత్తూర్), డాక్టర్ మహేష్ వాకమూడి, డాక్టర్ అరుణ(చెన్నై), డాక్టర్ పంకజ్కుంద్ర(జిప్మర్)లు ఉపన్యసించారు. చివరగా ఐఏఎస్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ రాజగోపాల్(విజయవాడ)ను ఎన్నుకున్నారు. ఆయనకు ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి(కర్నూలు) బాధ్యతలను అప్పగించారు. డాక్టర్ రాజగోపాల్ వచ్చే అక్టోబర్ నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు. కార్యక్రమంలో ఐఏఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఉమామహేశ్వర్, డాక్టర్ శాంతిరాజు, మత్తు మందు వైద్యులు డాక్టర్ శివరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వెంటిలేటర్ వినియోగంపై అవగాహన పెరగాలి
కర్నూలు(హాస్పిటల్): రోగులకు కృత్రిమ శ్వాసను అందించే వెంటిలేటర్ వినియోగంపై ప్రతి ఒక్క వైద్యుడు అవగాహన పెంచుకోవాలని ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు చెప్పారు. మత్తు మందు వైద్యుల రాష్ట్రసదస్సును పురస్కరించుకుని శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజిలో పలు వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా మెకానికల్ వెంటిలేషన్ అంశంపై డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు మాట్లాడుతూ పాయిజన్, గుండెపోటు, నరాల జబ్బుల్లో గాలిపీల్చుకోలేని స్థితిలో రోగి ఉన్నప్పుడు వెంటిలేటర్లు ఎలా వాడాలనే అంశంపై వివరించారు. గుండె ఆగిపోయినప్పుడు రీస్టార్ట్ చేసే పద్ధతుల గురించి వైద్యులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పీజీ విద్యార్థులు ఇలాంటి వర్క్‌షాప్‌లను సద్వినియోగం చేసుకుని సబ్జక్టులు నేర్చుకుని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె. వీరాస్వామి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అనెస్తీషియా వైద్యుల సదస్సు కర్నూలులో జరగడం గర్వకారణమన్నారు. వర్క్‌షాప్‌లు పీజీ విద్యార్థులు, అనెస్తెటిస్ట్‌లకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో కర్ణాటక మాజీ డీఎంఈ డాక్టర్ హర్సూర్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్స్ జాతీయ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎస్సి చక్రారావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, కార్యక్రమ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎం.ఉమామహేశ్వర్, కార్యదర్శి డాక్టర్ శాంతిరాజు, కోశాధికారి డాక్టర్ డివి రామశివనాయక్, సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ దమామ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మత్తుమందు వైద్యుల రాష్ట్ర సదస్సు
– హాజరుకానున్న నిష్ణాతులైన మత్తు వైద్యులు కర్నూలు(హాస్పిటల్): మత్తు మందు వైద్యుల(అనెస్తెటిస్ట్‌లు) రాష్ట్రస్థాయి సదస్సు ఈ నెల 16 నుంచి కర్నూలులో ప్రారంభం కానున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తెషీయాలజిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎం.ఉమామహేశ్వర్ తెలిపారు. గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అనెస్తీషియా విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. 16న కర్నూలు మెడికల్ కాలేజీలో నాలుగు వర్క్‌షాప్‌లతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సంఘం జాతీయ అధ్యక్షులు కామేశ్వరరావు, మాజీ అధ్యక్షులు డాక్టర్ చక్రారావు హాజరవుతారన్నారు. కళాశాలలోని మోర్టాన్ హాలు, కార్డియాలజి సెమినార్ హాలు, సర్జరీ సెమినార్ హాలు, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామన్నారు. 17న వెంకటరమణ కాలనిలోని తనిష్ కన్వెన్షన్ హాలులో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ యూనివర్శిటి వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజ్ హాజరవుతున్నారని తెలిపారు. 18న ప్రసవం, శిశువులకు మత్తు మందు ఇచ్చే అంశాలపై డాక్టర్ కె.భవానీశంకర్ కొడాలి(యుఎస్ఏ) ప్రసంగిస్తారన్నారు. సమావేశంలో కార్యక్రమ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ జి.శాంతిరాజు, కోశాధికారి డాక్టర్ డి.వి.రామశివనాయక్, కో ట్రెజరర్ డాక్టర్ ఎస్ఏ వరప్రసాద్, డాక్టర్ దమం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మత్తుమందుకు బదులు ఐప్యాడ్
లండన్: సర్జరీల సమయంలో రోగులకు మత్తుమందు ఇస్తారనే విషయం తెలిసిందే. చిన్నపాటి సర్జరీలకు లోకల్ అనస్తీషియా ఇస్తారు. అంటే సర్జరీ చేసే ప్రాంతంమాత్రమే మొద్దుబారిపోయేలా చేస్తుందన్నమాట. అయితే చిన్నపిల్లలకు ఇటువంటి సర్జరీలు చేసే సమయంలో మత్తుమందులకు బదులు వారి చేతిలో ఓ ఐప్యాడ్ పెడితే సరిపోతుందంటున్నారు పరిశోధకులు. వినడానికి విచిత్రంగానే ఉన్న ఈ ఆలోచన చాలా బాగా పనిచేస్తోందట. సర్జరీ సమయంలో ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు పిల్లలు అదోరకమైన ఆందోళనకు గురవుతారు. ఇటువంటి సమయంలో వారికి సంప్రదాయంగా వినియోగిస్తున్న మత్తుమందు ఇచ్చి సర్జరీ చేస్తారు. దీనికి బదులుగా వారి చేతికి ఓ ఐప్యాడ్‌ను ఇస్తే తల్లిదండ్రులు తమవద్ద లేరన్న ఆలోచన రాకుండా ఉంటుందని, అంతగా ఆందోళన చెందరని పరిశోధనలో తేలింది. సాధారణంగా సర్జరీకి ముందు ఇచ్చే మిడాజోలమ్తో పోలిస్తే ఐప్యాడ్ ఎంతవరకు ఆందోళనను తగ్గిస్తుందనే విషయంపై లండన్‌లోని మియర్ ఇన్ఫాంట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ డొమినిక్ పరిశోధనలు జరిపారు. దీంతో తల్లిదండ్రులతో పోలిస్తే పిల్లల్లో ఆందోళనను ఐప్యాడ్ గణనీయంగా తగ్గించిందని తేలింది. పదే పదే మత్తుమందుల వినియోగం కంటే ఇలాంటి పరిష్కారాలను వెతకడం అవసరమని, దీనివల్ల అనేక దుష్ఫలితాలను అధిగమించవచ్చని డొమినిక్ తెలిపారు. -
సంతానం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన మహిళ
-
పాయసంలో మత్తు మందు కలిపి దోపిడీ
ఖిలా వరంగల్: పెళ్లి రోజు వేడుకలని చెప్పి ఇంటి యజమానికి మత్తు మందు కలిపిన పాయసం ఇచ్చి నిలువు దోపిడీ చేసిన సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. స్తానికి ఖిలా వరంగల్ లో దాసరి కలావతి(65), కొమరయ్య(67) దంపతులు నివాసం ఉంటున్నారు. కాగా 20 రోజుల క్రితం ఓ జంట వారి ఇంట్లో అద్దెకు దిగారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆ జంట తమ పెళ్లి వేడుక అని చెప్పి వృద్ధ దంపతులకు మత్తు మందు కలిపిన పాయసాన్ని ఇచ్చారు. పాయసం తాగిన వారు మత్తులో పడిపోయారు. అనంతరం వారిని కొట్టి ఇంట్లో ఉన్న 7 తులాల బంగారం, నగదు, కలర్ టీవీని అపహరించుకుపోయారు. వృద్ధ దంపతుల పరిస్థితి విషయంగా ఉండటంతో స్థానికులు వారిని ఎమ్జీఎమ్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ చోరికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దంపతులు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేపడతామన్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. -
పాయసంలో మత్తు మందు కలిపి నిలువు దోపిడీ
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఇంటి యజమానికి మత్తు మందు కలిపిన పాయసం ఇచ్చి నిలువు దోపిడీ చేసిన సంఘటన గురువారం ఉదయం సిద్దిపేటలో వెలుగు చూసింది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ కథనం మేరకు.. పట్టణంలోని ఎన్సాన్పల్లి రోడ్డులో గల నల్లపోచమ్మ నగర్లో ఎర్వ రేణుక (58) నివాసముంటోంది. ఆమె కుమారుడు స్వామి కుమార్ కంగ్టి మండలం తడ్కల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రెం డు నెలల క్రితం గుంటూరు ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ (35), లక్ష్మి (52)లు తాము భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నామని ఇల్లు అద్దెకు కావాలని రేణుకను కోరారు. రూ. 800లతో అద్దెకు మాట్లాడుకుని అందులో నివాసముం టున్నారు. అయితే వీరు తరచూ రే ణుక ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లేవారు. అం దులో భాగంగానే బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఇంటిలో పాయసం చేశామని, తీసుకోవాలని ఆ మహిలలు రేణుకను కోరారు. దీనిని స్వీకరించిన ఆమె మత్తుతో పడిపోయింది. వెంటనే ఆ ఇద్దరు మహిళలు రేణుక మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలు, చేతులకు ఉన్న ఐదు తులాల బంగారు గాజులను, చెవికి ఒక వైపు ఉన్న ఒక తులం కమ్మ, కాళ్లకు ఉన్న 16 తులాల వెండి పట్టీలను అపహరించి ఇల్లు ఖాళీ చేసి పరారయ్యారు. రేణుక ఇంటిలోనే మరో గదిలో అద్దెకు ఉన్నవారు గురువారం ఉదయం తలుపు తట్టగా ఆమె లేచి బయటకి వచ్చే సరికి నిలువు దోపిడీ విషయం అర్థమైంది. విషయం తెలిసిన కుమారుడు స్వామి ఇంటికి చేరుకుని తల్లిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. స్వామి ఫిర్యాదు మేరకు తాము సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ కేవలం సెల్‌ఫోన్ రీచార్జ్ కార్డు మాత్రమే లభించినట్లు ఎస్ఐ వివరించారు. -
అనస్థీషియా వైద్యమే కీలకం: డాక్టర్ చక్రరావు
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైద్యరంగంలో అనస్థీషియా వైద్యం చాలా కీలకమైందని, విప్లవాత్మకంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దానిని వినియోగించుకోవాలని ఇండియన్ అనస్థీషియా సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ చక్రరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో మూడు రోజుల పాటు జరుగనున్న రాష్ర్టస్థాయి అనస్థీషియా వైద్యుల (ఐఎస్ఏ ఏపికాన్ 2013) సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో చక్రరావు మాట్లాడుతూ రోజురోజుకు వస్తున్న మార్పులను వైద్యులకు తెలియజేసేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతినిదులు నూతన వైద్య విధానాన్ని తెలుసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఏ చిన్న సర్జరీ చేయాలన్నా అనస్థీషియా ముఖ్యమని, ముందుముందు ఈ వైద్యం ప్రధాన భూమిక అవుతుందని అన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దయాల్‌సింగ్, డాక్లర్లు బి దామోదర్‌రావు, రాజగోపాల్రావు, మమత ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు, కిరణ్‌కుమార్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బాగం కిషన్‌రావు, బండారుపల్లి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మమత వైద్య కళాశాల చైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి జానిమియా, ప్రసాద్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. అనస్థీషియాలో వచ్చిన అనేక నూతన మార్పులపై శని, ఆదివారాల్లో జరుగనున్న కార్యక్రమాల్లో బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చిన డాక్టర్లు వివరించనున్నారు. రోగికి నొప్పిలేకుండా వైద్యం అందించడమే లక్ష్యం ఖమ్మం అర్బన్: రోగికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మత్తు (అనస్థీషియా) ఇంజక్షన్ కీలకమని, నూతన వైద్యం విధానంలో మత్తు వైద్యం అందించే విధానంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వైద్యులను తీర్చిదిద్దుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ఎస్సీ చక్రరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో జరుగనున్న అనస్థీషియా రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొనేం దుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో 20వేల మంది అనస్థీషియాలజిస్ట్‌లు ఉన్నారని, వైద్యరంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులపై వారికి అవగాహన కల్పిం చేందుకు ప్రతీ ఏడాది సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనస్థీషియా వైద్యం పై ప్రతీ ఏడాది నాలుగు రోజుల పాటు దేశస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ సారి డిసెంబర్ 25 నుంచి 29 వరకు గౌహతిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఈ సమావేశంలో ఇండియన్ అనస్థీషియా అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ దయాల్‌సింగ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్‌రావు, కార్యదర్శి వి.రాజగోపాల్, కిరణ్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ భాగం కిషన్‌రావు పాల్గొన్నారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో మూడు రోజుల పాటు జరుగనున్న రాష్ర్టస్థాయి అనస్థీషియా వైద్యుల (ఐఎస్ఏ ఏపికాన్ 2013) సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో చక్రరావు మాట్లాడుతూ రోజురోజుకు వస్తున్న మార్పులను వైద్యులకు తెలియజేసేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతినిదులు నూతన వైద్య విధానాన్ని తెలుసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఏ చిన్న సర్జరీ చేయాలన్నా అనస్థీషియా ముఖ్యమని, ముందుముందు ఈ వైద్యం ప్రధాన భూమిక అవుతుందని అన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దయాల్‌సింగ్, డాక్లర్లు బి దామోదర్‌రావు, రాజగోపాల్రావు, మమత ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు, కిరణ్‌కుమార్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బాగం కిషన్‌రావు, బండారుపల్లి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మమత వైద్య కళాశాల చైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి జానిమియా, ప్రసాద్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. అనస్థీషియాలో వచ్చిన అనేక నూతన మార్పులపై శని, ఆదివారాల్లో జరుగనున్న కార్యక్రమాల్లో బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చిన డాక్టర్లు వివరించనున్నారు. రోగికి నొప్పిలేకుండా వైద్యం అందించడమే లక్ష్యం ఖమ్మం అర్బన్: రోగికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మత్తు (అనస్థీషియా) ఇంజక్షన్ కీలకమని, నూతన వైద్యం విధానంలో మత్తు వైద్యం అందించే విధానంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వైద్యులను తీర్చిదిద్దుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ఎస్సీ చక్రరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో జరుగనున్న అనస్థీషియా రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొనేం దుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో 20వేల మంది అనస్థీషియాలజిస్ట్‌లు ఉన్నారని, వైద్యరంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులపై వారికి అవగాహన కల్పిం చేందుకు ప్రతీ ఏడాది సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనస్థీషియా వైద్యం పై ప్రతీ ఏడాది నాలుగు రోజుల పాటు దేశస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ సారి డిసెంబర్ 25 నుంచి 29 వరకు గౌహతిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఈ సమావేశంలో ఇండియన్ అనస్థీషియా అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ దయాల్‌సింగ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్‌రావు, కార్యదర్శి వి.రాజగోపాల్, కిరణ్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ భాగం కిషన్‌రావు పాల్గొన్నారు.