మాస్కో: రష్యాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మెరీనా లెబెదేవా వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందింది. ఆమె తన ముక్కు ఆకారాన్ని మార్చుకోవడానికి రైనోప్లాస్టీ సర్జరీ కోసం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఆర్టీబీట్ క్లినిక్‌లో చేరింది. తర్వాత ఆపరేషన్ ప్రక్రియలో భాగంగా మత్తుమందు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆమె శరీర ఉష్ణోగ్రత పెరిగిపోయింది.
మత్తుమందుకి ఆమె శరీరం ప్రతికూలంగా స్పందిస్తోందని వైద్యులు గ్రహించిన వెంటనే మరో ఆస్పత్రిలో చేర్చే క్రమంలో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు బాధ్యులపై క్రిమనల్ కేసు నమోదు చేశారు. ఒక వేళ నేరం రుజువైతే, సర్జన్లకు ఆరేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా మెరీనా లెబెదేవా మరణించే సమయంలో ఆమె భర్త వ్యాపార పర్యటనలో ఉన్నాడు. ఆమె మరణ వార్త తెలుసుకొని అతను సెయింట్ పీటర్స్‌బర్గ్ కు చేరుకున్నాడు
ఈ రకమైన పరిస్థితి "ఒక మిలియన్ శస్త్రచికిత్సలలో ఒకసారి" జరగడంతో వైద్యులు ఖంగుతిన్నారు. రైనోప్లాస్టీ శస్త్రచికిత్స చేయకముందే మెరీనా లెబెదేవాకు అన్నీ పరీక్షలు చేశామని ఆర్టీబీట్ క్లినిక్ డైరెక్టర్ అలెగ్జాండర్ ఎఫ్రెమోవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రిపోర్ట్‌ల ప్రకారం మెరీనా లెబెదేవా జన్యుపరమైన పరిస్థితి కారణంగా మరణించిందని క్లినిక్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.
చదవండి: Ravindra Jadeja: టీమిండియా ఓటమి.. ఆసుపత్రిలో చేరిన జడేజా
Comments
Please login to add a commentAdd a comment