సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ ఎం.ఉమామహేశ్వర్
నేటి నుంచి మత్తుమందు వైద్యుల రాష్ట్ర సదస్సు
Published Thu, Sep 15 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
– హాజరుకానున్న నిష్ణాతులైన మత్తు వైద్యులు
కర్నూలు(హాస్పిటల్): మత్తు మందు వైద్యుల(అనెస్తెటిస్ట్‌లు) రాష్ట్రస్థాయి సదస్సు ఈ నెల 16 నుంచి కర్నూలులో ప్రారంభం కానున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తెషీయాలజిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎం.ఉమామహేశ్వర్ తెలిపారు. గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అనెస్తీషియా విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. 16న కర్నూలు మెడికల్ కాలేజీలో నాలుగు వర్క్‌షాప్‌లతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సంఘం జాతీయ అధ్యక్షులు కామేశ్వరరావు, మాజీ అధ్యక్షులు డాక్టర్ చక్రారావు హాజరవుతారన్నారు. కళాశాలలోని మోర్టాన్ హాలు, కార్డియాలజి సెమినార్ హాలు, సర్జరీ సెమినార్ హాలు, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామన్నారు. 17న వెంకటరమణ కాలనిలోని తనిష్ కన్వెన్షన్ హాలులో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్శిటి వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజ్ హాజరవుతున్నారని తెలిపారు. 18న ప్రసవం, శిశువులకు మత్తు మందు ఇచ్చే అంశాలపై డాక్టర్ కె.భవానీశంకర్ కొడాలి(యుఎస్‌ఏ) ప్రసంగిస్తారన్నారు. సమావేశంలో కార్యక్రమ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ జి.శాంతిరాజు, కోశాధికారి డాక్టర్ డి.వి.రామశివనాయక్, కో ట్రెజరర్ డాక్టర్ ఎస్‌ఏ వరప్రసాద్, డాక్టర్ దమం శ్రీనివాసులు పాల్గొన్నారు.
Advertisement