కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఓ మహిళా జూనియర్ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె హత్యకు నిరసనగా వైద్యుల సంఘం ‘ది ఫెడరరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)’ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 12 (సోమవారం) నుండి దేశంలోని అన్ని ఆసుపత్రులలో పలు రకాల వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆగస్ట్ 9న ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఓ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (PGT) డాక్టర్ హత్యకు గురయ్యారు. ఆమెకు సంఘీభావంగా వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వైద్యురాలి హత్యని రాజకీయం చేయకుండా నిందితుల్ని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫోర్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసింది.
🚨 We shall begin our Nationwide agitation from tomorrow! (Monday 12th August)
We stand with our beaten, manhandled, deeply hurt colleagues of R G Kar Medical College, Kolkata.
We urge authorities to not make it political and color it bad- It’s humanity which is at stake here.… pic.twitter.com/pPg2ifpBqI— FORDA INDIA (@FordaIndia) August 11, 2024
తక్షణ చర్య: ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి.
నిరసనకారులకు రక్షణ: జూనియర్ వైద్యులి మరణంపై న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేస్తున్న వైద్యుల పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూదని హామీ ఇవ్వాలి.
సత్వర న్యాయం, పరిహారం: హత్యకు గురైన వైద్యుని కుటుంబానికి సత్వర న్యాయం, తగిన పరిహారం అందించాలి.
మెరుగైన భద్రతా ప్రోటోకాల్‌లు: అన్ని ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కఠినమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసి, అమలు చేయాలని వైద్యుల సంఘం కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
నిపుణుల కమిటీ ఏర్పాటు: సెంట్రల్ హెల్త్‌కేర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను వేగవంతం చేయడానికి వైద్య సంఘాల ప్రతినిధులతో సహా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. అని డిమాండ్ చేస్తూ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది.
ఖండిస్తున్న వైద్యులు
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణాన్ని దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న డాక్టర్లు ఖండిస్తున్నారు. జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా కేరళలోని వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోలు, మెడికల్ టీచర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిరసనలు తెలపనున్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకుల సంఘం కేజీఎంసీటీఏ వైద్యుల్ని హత్యను త్రీవంగా ఖండించింది. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొంటున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా నైట్ డ్యూటీ, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ డ్యూటీ వర్క్‌లో భాగమైన మహిళా వైద్యుల భద్రత ఎప్పుడూ ఆందోళన కలిగిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది. తమ పనిని నిర్భయంగా నిర్వర్తించగలిగేలా సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం ఆయా ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment