2024 Kolkata rape and murder incident
-
ఆర్జీకర్ ఘటనలో తీర్పు.. కోర్టు హాలులో కన్నీటి రోదనలు
కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో తీర్పు వెలువడింది. నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది సీల్దా కోర్టు. మొత్తం 160 పేజీలతో కూడిన తీర్పు కాపీని రూపొందించారు. అయితే జడ్జి తీర్పు చదువుతుండగా.. ఒకవైపు దోషి సంజయ్, మరోవైపు బాధితురాలి తండ్రి, బంధువుల కన్నీటి రోదనలతో కోర్టు హాలు మారుమోగింది.‘‘నేను ఈ పని చేయలేదు. ఈ కేసులో నన్ను ఇరికించారు. తప్పు చేసినవాళ్లను ఎందుకు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు?. ఏ తప్పూ చేయని నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు?’’ అంటూ గట్టిగా రోదించాడు. ఆ సమయంలో జడ్జి అనిర్బన్ దాస్ కలుగజేసుకుని చేసుకుని ‘‘నువ్వేమైనా మాట్లాడదల్చుకుంటే సోమవారం శిక్ష ఖరారు చేసే సమయంలో అవకాశం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో సంజయ్ సైలెంట్ అయ్యాడు.మరోవైపు.. తీర్పు వెలువడుతున్న టైంలోనే బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ‘‘న్యాయాన్ని రక్షించి.. మీపై నాకున్న నమ్మకం నిలబెట్టుకున్నారు. మీరు మీ గౌరవాన్ని కాపాడుకున్నారు సర్’’ అంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాధితురాలి తరపున వచ్చినవాళ్లంతా చప్పట్లు కొట్టారు. దీంతో.. జడ్జి నిశబ్దం పాటించాలంటూ అంటూ గావెల్(సుత్తి)తో మందలించారు.తీర్పు వెలువడక ముందు సీల్దా(Sealdah) కోర్టు ప్రాంగణంలో గంభీరమైన వాతావరణం నెలకొంది. సంజయ్‌ను గట్టి భద్రతా మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. లాయర్లంతా కోర్టు బయట ఉండి సంఘీభావం ప్రకటించారు. అయితే.. తీర్పు అనంతరం బాధితురాలి తరఫున పోరాడిన సంఘాలు, ఇతరులు లాయర్లతో కలిసి స్వీట్లు పంచడంతో సందడి కనిపిచింది.కోల్‌కతాలోని రాధా గోబిందా కర్(RG Kar) మెడికల్ కాలేజీ సెమినార్లో కిందటి ఏడాది ఆగష్టు 7వ తేదీన ఓ వైద్యవిద్యార్థిని(31) అర్ధనగ్నంగా విగతజీవిగా కనిపించింది. ఈ ఘోరం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. వైద్య సిబ్బంది దేశవ్యాప్త నిరసనలకు దారి తీసింది. మూడు రోజుల తర్వాత(ఆగష్టు 10న) సంజయ్ రాయ్ అనే వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈలోపు ఘటనాస్థలంలోకి నిరసనకారులు దూసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నమేననే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు.. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జి అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది.కేసు తీవ్రత దృష్ట్యా కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును బదిలీ చేసింది. బాధితురాలికి అండగా దేశం మొత్తం కదలడంతో.. నిర్భయ ఘటన స్ఫూర్తితో ఈ కేసును ‘అభయ’గా మీడియా అభివర్ణించడం మొదలుపెట్టింది. ఇక.. ఈ ఘటనలో రాయ్ ఒక్కడే లేడని, ఇంకొందరి ప్రమేయం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తూ వస్తోంది. అయితే ఇటు కోల్‌కతా పోలీసులు, ఆపై సీబీఐ కూడా రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించాయి. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. అయితే బాధిత కుటుంబ విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ అంశాన్ని కూడా పరిశీలించింది. మరోవైపు.. అక్టోబర్ 7, 2024 సీల్దా కోర్టులో దాఖలైన ఛార్జ్ షీట్ ఆధారంగా సీల్దా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. నవంబర్ 12వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ దాకా.. నిందితుడి ఇన్‌కెమెరా ట్రయల్ జరిగింది. ఆ టైంలో 50 మంది సాక్షులను విచారించారు. చివరకు.. ఆర్జీకర్ హత్యాచార కేసులో వలంటీర్‌గా పని చేసే సంజయ్ రాయ్ పాత్రను సీబీఐ నిర్ధారించగా.. సీల్దా కోర్టు ఇవాళ దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ కోల్‌కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్నాడు. మొదటి నుంచి తాను అమాయకుడినేంటూ వాదిస్తున్నాడు. అంతేకాదు.. ఓ పోలీస్ ఉన్నతాధికారికి అన్నివిషయాలు తెలుసంటూ చెబుతున్నాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను పట్టించుకోలేదు. బీఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద అత్యాచారం, హత్య నేరాల కింద సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది కోర్టు. దీంతో సంజయ్‌కు మరణశిక్షగానీ, జీవితఖైదుగానీ పడే అవకాశాలే ఉన్నాయని జడ్జి వెల్లడించారు. -
ఆరోపణ రుజువైతే సందీప్ ఘోష్‌కు మరణశిక్ష!
కోల్‌కతా ఆర్జీ కర్ ఘటనలో.. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు భారీ షాకిచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం గనుక రుజువైతే మరణశిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఆగష్టు 9వ తేదీన ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్లో యువ వైద్యురాలిపై అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని సందీప్ ఘోష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోందాల్పై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఘటన వెలుగుచూసిన అనంతరం ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ వెల్లడించింది. ఇద్దరూ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం, కప్పి పుచ్చేందుకు యత్నించడం వంటివి చేశారని ఆరోపిస్తూ.. అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరూ బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని(సీల్దా కోర్టు కాంప్లెక్స్) ఆశ్రయించారు. కేసులో తన క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని.. తప్పుడు ఉద్దేశంతో ఈ కేసులో ఇరికించారని ఘోష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. కోర్టు మాత్రం బెయిల్ అభ్యర్థతను తోసిపుచ్చింది. ‘‘సందీప్ ఘోష్‌పై ఉన్న నేరారోపణ తీవ్రమైంది. ఈ కేసులో ఆయన్ని బెయిల్‌పై విడుదల చేయడం న్యాయపరంగా వీలు కాదు. ఒకవేళ ఆయనపై ఆరోపణ రుజువైతే గనుక.. అత్యంత అరుదైన కేసుగా భావించి మరణశిక్ష విధించాల్సి వస్తుంది’’ అని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వ్యాఖ్యానించారు. అలాగే.. అభిజిత్ మోందాల్ బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. నిందితుల కస్టడీ కోరింది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీదాకా కస్టడీకి అనుమతించింది కోర్టు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్టయ్యాక మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడటంతో పాటు.. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. మరోపక్క, ఘోష్.. పాలిగ్రాఫ్ పరీక్ష, లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌లో కీలక ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు తేలింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL).. ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. ఇక..ఆయనపై నమోదైన నేరారోపణల దృష్ట్యా.. ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది.కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. -
సందీప్ ఘోష్ తండ్రి నివాసంలో ఈడీ సోదాలు
కోల్‌కతా: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన అనంతరం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు గురువారం ఉదయం కోల్‌కతా, సబర్బన్ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తండ్రి సత్య ప్రకాశ్ నివాసంలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.West Bengal | Enforcement Directorate carrying out search operation in connection with RG Kar Medical College & Hospital financial irregularities case at several places in Kolkata and suburban areas including the residence of former principal of RG Kar Medical College & Hospital…— ANI (@ANI) September 12, 2024 మరోవైపు.. డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ డార్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక.. హత్యాచార ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు సందీప్ ఘోష్ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.చదవండి: జూనియర్ డాక్టర్ల షరతులు.. కుదిరే పనికాదన్న సర్కారు -
RG Kar Case: చర్చలపై సందిగ్ధం
కోల్‌కతా: ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై 33 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న వైద్యులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం సచివాలయం(నబన్న)లో ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే.. చివరి నిమిషంలో(5.23ని. టైంలో) ఆ భేటీని లైవ్ టెలికాస్ట్ చేయించాలని వైద్యులు ప్రభుత్వానికి మెయిల్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రతినిధులు హాజరుకావాలని నిరసన చేపట్టిన వైద్యులు ప్రధాన షరతుగా పెట్టారు. ఈ చర్చలను బహిరంగ వేదికగా జరపాలని మరో కండీషన్‌గా పెట్టారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ చర్చలకు హాజరుకావాలని.. వీటిని లైవ్‌లో ప్రసారం చేయాలని కోరారు. చర్చల్లో పారదర్శకత కోసమే తాము ఇలా కోరుతున్నట్లు స్పష్టం చేశారు. వైద్యులలో 12 నుంచి 15 మందితో కూడిన ప్రతినిధుల బృందం ఈ సమావేశానికి రావాలంటూ సీఎస్ మనోజ్ పంత్ పేరిట ఆహ్వానం వెళ్లింది. అయితే 30 మంది బృందం చర్చలకు వెళ్తామని వైద్యులు అంటున్నారు. ఈ డిమాండ్లతో సాయంత్రం 6గం. లకేప్రారంభం కావాల్సిన చర్చలపై సందిగ్ధం నెలకొంది. అంతకంటే ముందే.. సీఎం మమతా బెనర్జీతో చర్చలకు తామూ సిద్ధమంటూ వైద్యులు ప్రకటన చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్న అభయ ఘటన ప్రతిష్టంభనకు తెరదించేలా చర్చలు ఉండాలని, అందుకోసం అపాయింట్మెంట్ కోరుతూ సీఎంవోకు మెయిల్ పంపారు. దీంతో.. వెంటనే ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయానికి రావాల్సిందిగా ప్రభుత్వం బదులిచ్చింది. ఇదీ చదవండి: అభయ ఘటన. నిందితుడి గురించి షాకింగ్ విషయాలు -
దుర్గాపూజ లిస్ట్.. చిన్న కత్తి పెప్పర్ స్ప్రే!
కోల్‌కత్తాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన ‘మహిళల భద్రత’ అంశాన్ని మరోసారి చర్చల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో శ్రేయసి బిస్వాస్ అనే ఇన్ఫ్లూయెన్సర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘రాబోయే దుర్గా పూజ కోసం మీ షాపింగ్ లిస్ట్‌లో ఉండాల్సిన ఐటమ్స్’ అనేది వీడియో సారాంశం. ఇన్ఫ్లూయెన్సర్స్ శ్రేయసి ‘దుర్గా పూజా జాబితా’లో పండగకు అవసరమైన వస్తువులతో పాటు చిన్న కత్తి, పెప్పర్ స్ప్రే, అలారమ్ కీచైన్... లాంటివి జత చేసింది. ‘పెప్పర్‌స్ప్రే, అలారమ్ కీచైన్ల మీద వీడియో చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కోల్‌కతా దుర్ఘటన నేపథ్యంలో తప్పకుండా చేయాలనిపించింది. మహిళల భద్రత ప్రమాదంలో పడింది. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో మహిళలు తమ భద్రత గురించి తామే జాగ్రత్త పడాలి. బ్యాగులో సెల్ప్–డిఫెన్స్ టూల్స్ తప్పనిసరిగా ఉండాలి’ అంటుంది శ్రేయసి బిస్వాస్. సెల్ఫ్–డిఫెన్స్ టూల్స్‌ను ప్రేక్షకులకు చూపుతూ వాటి వల్ల ఉపయోగం ఏమిటో చెప్పింది శ్రేయసి. ‘ఈ సెల్ఫ్–డిఫెన్స్ ్రపాడక్ట్స్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. జస్ట్ సెర్చ్ చేయండి చాలు’ అని సలహా కూడా ఇచ్చింది. ఈ వీడియో 7.6 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘కోల్‌కతా దుర్ఘటన తరువాత కొత్త వాళ్లు ఎవరైనా మిల్లీ సెకన్ నా వైపు చూసినా చాలా భయంగా ఉంది’ అని ఒక యూజర్ రాసింది. ‘మా పరిస్థితి కూడా అదే’ అన్నారు చాలామంది. ‘భయపడితే ఎలా! మహిళలలో దుర్గాదేవి అంశ ఉంది. దుర్మార్గుల అంతు చూసే అపార శక్తి ఉంది’ అని ఒక యూజర్ రాశారు. -
Kolkata Incident: ఏం జరిగిందో చెప్పండి!
కోల్‌కతా: కన్నబిడ్డను కోల్పోయిన విషయం తెలిస్తే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయే తల్లిదండ్రులను ఓదార్చుతూ ధైర్యం చెప్పాల్సిందిపోయి వారిని గందరగోళపరుస్తూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం వైఖరి తాజాగా బహిర్గతమైంది. కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యోదంతం మర్నాడు ఉదయం ఆస్పత్రి యాజమాన్యం ఆమె కుటుంబానికి చేసిన ఫోన్‌కాల్స్ డేటా తాజాగా మీడియాకు వెల్లడైంది. దీంతో సున్నితమైన అంశం పట్ల ఆస్పత్రి యాజమాన్యం ఎంత నిర్దయగా వ్యవహరించిందో అందరికీ అర్థమైంది. ఆగస్ట్ 9న ఉదయం 10 గంటలకు ఆస్పత్రి మహిళా అసిస్టెంట్ సూపరింటెండెంట్ చేసిన మూడు ఫోన్‌కాల్స్ వివరాలు ఇవీ..మొదటి ఫోన్‌కాల్ ఉదయం 10.53 నిమిషాలకు..వైద్యురాలి తండ్రి: అసలేం జరిగింది?అవతలి వ్యక్తి: ఆమె ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదు. ఆస్పత్రిలో చేర్పించాం. త్వరగా వచ్చేయండివైద్యురాలి తండ్రి: దయచేసి చెప్పండి. అక్కడేం జరిగింది?అవతలి వ్యక్తి: ఆ వివరాలన్నీ డాక్టర్ చెప్తారు. మీ నంబర్ దొరికితే ఫోన్ చేశాం. ముందు మీరు బయల్దేరండివైద్యురాలి తండ్రి: అసలు మీరెవరు?అవతలి వ్యక్తి: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. డాక్టర్‌ను కాదు.వైద్యురాలి తండ్రి: అక్కడ వైద్యులే లేరా?అవతలి వ్యక్తి: మేమే నీ బిడ్డను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చాం. వచ్చి మమ్మల్ని కలవండివైద్యురాలి తల్లి: ఆమెకు ఏమైంది?. డ్యూటీ లో లేదా? జ్వరం వచ్చిందా?వైద్యురాలి తండ్రి: ఆమెకు సీరియస్‌గా ఉందా?అవతలి వ్యక్తి: అవును. మీరు వీలైనంత త్వరగా వచ్చేయండిఐదు నిమిషాల తర్వాత రెండో ఫోన్‌కాల్.. అవతలి వ్యక్తి: ఆర్జీ కర్ ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నావైద్యురాలి తల్లి: చెప్పండిఅవతలి వ్యక్తి: బయల్దేరారా లేదా?వైద్యురాలి తల్లి: బయల్దేరాం. ఇప్పుడు ఆమె ఎలా ఉంది?అవతలి వ్యక్తి: ముందయితే రండి. వచ్చాక మాట్లాడుకుందాం. ఆస్పత్రిలో ఛాతీ విభాగాధిపతి ఆఫీస్‌కే నేరుగా రండివైద్యురాలి తల్లి: సరేనండిమూడో ఫోన్‌కాల్...వైద్యురాలి తండ్రి: హలో చెప్పండిఅవతలి వ్యక్తి: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుంది. చనిపోయిందని అనుకుంటున్నాం. పోలీసులు కూడా వచ్చేశారు. ఆస్పత్రి వాళ్లం కూడా ఇక్కడే ఉన్నాం. త్వరగా రండి అని చెప్పడానికే మీకు ఫోన్ చేశాంవైద్యురాలి తండ్రి: నేరుగా అక్కడికే వస్తున్నాంవైద్యురాలి తల్లి: నా కూతురు నాకిక లేదు (బోరున విలపిస్తూ). -
కోల్‌కతా నిందితుడి గురించి విస్తుపోయే విషయాలు
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌కు సంబంధించి కోల్‌కతా పోలీసు వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. హత్యాచార ఘటన జరిగిన ఆగస్టు 8 రాత్రి నిందితుడు కోల్‌కతాలోని సోనాగాచి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు అర్ధరాత్రి ఆర్జీ కర్ హాస్పిటల్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు. హత్యాచారం జరిగిన ఆస్పత్రి సెమినార్ హాల్లో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ అత్త ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భార్యను తీవ్రంగా కొట్టేవాడని తెలిపారు. తీవ్రంగా కొట్టటంతో మూడు నెలల గర్భిణీ అయిన ఆయన భార్య గర్భస్రావానికి కారణమయ్యాడని ఆరోపణలు చేశారు. సంజయ్ మంచివాడు కాదని, చాలా రాక్షసంగా ప్రవర్తించేవాడని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన సంజయ్‌ను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు నిందితుడి పెళ్లిళ్ల విషయంలో కూడా చర్చ జరుతుగుతోంది. మరోవైపు.. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్, నిందితుడు సంజయ్ రాయ్, కోల్‌కతా పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ అనూప్ దత్తా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. -
మరో అత్యాచారం, హత్య జరిగేదాకా వేచి చూడలేం... కోల్‌కతా వైద్యురాలి హత్య ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం! ఇంకా ఇతర అప్డేట్స్..
-
కోల్‌కతా ఘటనపై నిరసన.. ఏపీ సర్కారు నోటీసులు
విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో.. ఉద్యోగులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా.. వైద్య, ఆరోగ్య సిబ్బందికి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా.. సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారని నోటీసులు పంపించింది. ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. పలు జిల్లాల్లో వైద్య సిబ్బందికి కోల్‌కతా ఘటనకి సంఘీభావం తెలిపారని నోటీసులు జారీ చేసింది. ఇందులో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ౩౩ మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకి నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారని, 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో పేరిట ఆ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళా సిబ్బందే ఉండడం గమనార్హం. కేవలం ఐఎంఏ పిలుపు మేరకు కోల్ కత్తా ఘటనపై నిరసనగా ర్యాలీ నిర్వహించామని, ఉద్దేశపూర్వకంగా తామేమీ తప్పు చేయలేదని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వాపోతున్నారు. ఇక.. సత్యసాయి జిల్లాలో వైద్య సిబ్బందిపై మరో తరహా వేధింపులకు దిగింది. సమస్యలేవైనా ఉంటే.. వాటిని మంత్రులు, కలెక్టర్ల దృష్టికి అస్సలు తీసుకెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. అలా చేస్తే చర్యలు తప్పవని, శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులెవరైనా తమ సమస్యలని మెడికల్ ఆఫీసర్ల స్థాయికి మాత్రమే చేరవేయాలని స్పష్టం చేసింది. ఆ వినతుల్ని పైకి పంపించే బాధ్యత మెడికల్ ఆఫీసర్లకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలంటూ బెదిరింపులు జారీ చేసింది. ఎన్నికల ముందు ఉద్యోగులకి అండగా ఉంటామని చంద్రబాబుతో పాటు లోకేష్ గొప్పలు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు దిగారు. దీంతో.. కూటమి ప్రభుత్వ తీరుపై వైద్య ఆరోగ్య శాఖలో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ఆర్జీ కార్ ఆస్పత్రి.. మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌పై కేసు నమోదు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కేసు నమోదైంది. ఆర్జీ కార్ ఆస్పత్రి హత్యోదంతంలో సందీష్ ఘోష్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సందీష్ ఘోష్ ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయా? అన్న కోణంలో కోల్‌కతా పోలీసులు దృష్టి సారించారు. అయితే ఆస్పత్రిలో సందీష్ ఘోష్ తన అధికారాన్ని ఉపయోగించి అవినీతికి పాల్పడ్డారంటూ ఈ ఏడాది జూన్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ అంశం పరిశీలనలో ఉండగా.. తాజాగా కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. సందీష్ ఘోష్ 2021లో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో అవినీతి జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిట్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఇన్స్పెక్టర్ జనరల్ ప్రణబ్ కుమార్ నేతృత్వంలోని సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఆగస్టు 9న ఆర్జీ కార్లో జరిగిన దారుణంతో సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదంగా మారింది. దుర్ఘటన జరిగిన రెండు రోజులకే ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేయడం.. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోల్‌కతా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు గత నాలుగు రోజులుగా సందీప్ ఘోష్‌ను 53 గంటల పాటు విచారించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే కోల్‌కతా పోలీసులు సందీప్ ఘోష్ అవినీతికి పాల్పడ్డారంటూ కేసు నమోదు చేయడం మరింత ఉత్కంఠగా మారింది. సందీష్ ఘోష్ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసినప్పటికీ అతని చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు ఘోష్‌ను మరే ఇతర వైద్య కళాశాలలో నియమించవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖను కోల్కత్తా హైకోర్టు ఆదేశించింది. -
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
న్యూఢిల్లీ,సాక్షి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హత్యాచార ఘటన, కేసు దర్యాప్తు, ఆస్పత్రిలో దాడిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటన చోటు చేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితురాలి వీడియోలు, ఫోటోలు బయటకు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ల రక్షణకు తాము చర్యలు తీసుకుంటామని తెలిపింది.డాక్టర్ హత్యాచారం కేసు నమోదులో జాప్యంపై కోర్టు ఆగ్రహించింది. మృతదేహానికి ఆ రోజు రాత్రి 8.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయ. మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రిన్సిపాల్ చిత్రీకరించారు. దుండగులను కట్టడి చేయటంతో బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మృతురాలి తల్లిదండ్రులను 3 గంటల పాటు ఎందుకు వేచిచూసేలా చేశారని ప్రశ్నించింది. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని, ఆయన్ను తొలిగించి, మళ్లీ ఎందుకు నియమించారని ప్రశ్నించింది. ఈ నెల 22లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.డాక్టర్ల రక్షణకు నేషనల్ టాస్క్ ఫోర్స్..డాక్టర్ల రక్షణకు పది మంది ప్రముఖ డాక్టర్లతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి శరిన్, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. అదేవిధంగా అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్టు తయారు చేయాలి. అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలి. మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో పూర్తి నివేదికను సమర్పించాలని జాతీయ టాస్క్ ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఈనెల 22 లోపు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దుహత్యాచార ఘటనపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేవారిపై అధికారం చెలాయించవద్దని బెంగాల్ ప్రభుత్వానికి సీజేఐ ఆదేశించారు. డాక్టర్లు, విద్యార్థులు, పౌరసమాజాన్ని అడ్డుకోవద్దని సూచించారు.ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన తర్వాత.. అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అక్కడ పని చేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ఆందోళనకారుల పేరిట కొందరు భౌతిక దాడులకు దిగారు. పోలీసుల రక్షణ కల్పించినప్పటికీ.. వాళ్లంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే వాళ్ల ఆవేదనను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఓ యువలాయర్. ప్రొటెక్ట్ ది వారియర్స్ తరఫున అపరాజిత అనే న్యాయవాది ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం వద్ద ప్రస్తావించారు. ఓ సీల్డ్ కవర్లో ఇందుకు సంబంధించిన వివరాల్ని ఆమె అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన సీజేఐ .. ఆస్పత్రిలో పరిస్థితి తీవ్రంగానే ఉందన్న అభిప్రాయంతో ఏకీభవించారు.కేసు వివరాలు..ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పోలీసులకు అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదం కావడంతో కలకత్తా హైకోర్టు స్పందించింది. సందీప్ ఘోష్ సుదీర్ఘ సెలవులో ఉండాలని ఆదేశించింది. మృతురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేట్టిన కోల్‌కతా హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది.ఘటన జరిగిన సమయంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌ను కొద్దిరోజులుగా సీబీఐ విచారిస్తోంది. ఆయనపై సీబీఐ పలు ప్రశ్నల సంధించింది. వాటిలో కొన్ని ప్రశ్నలు జాతీయ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ‘హాస్పిటల్లో చోటుచేసుకున్న మృతిని ఆత్మహత్యగా ప్రకటించాల్సిన తొందరేమొచ్చింది?. ఎవరి సలహా మేరకు ఘటన సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు? అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు?. నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచడం ముఖ్యమని మీకు అనిపించలేదా?. క్రైమ్‌సీన్‌లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు తెలుసు. మరి విచారణ పూర్తి అయ్యేవరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు?. బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరిగింది..? మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించటంలో ఎందుకు ఆలస్యం చేశారు?’ అని సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. -
కోల్‌కతా డాక్టర్ కేసు : సీబీఐ విచారణలో అనుమానాస్పదంగా మాజీ ప్రిన్సిపల్ తీరు
కోల్‌కతా : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ దుర్ఘటనలో ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో సందీష్ ఘోష్ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడం లేదని సమాచారం. గత మూడు రోజులుగా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంపై సందీప్ ఘోష్‌ను అర్ధరాత్రి వరకు విచారించిన సీబీఐ ఈ రోజు ఆయనకు సమన్లు పంపింది. విచారణలో ఘోష్‌కు సీబీఐ పలు ప్రశ్నలు సంధించిందని, ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.👉ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారని అంత తొందరగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది?👉మీరు డాక్టర్ కదా.. నేరం జరిగిన స్థలాన్ని, అందులో ఆధారాల్ని సురక్షితంగా ఉంచాలని మీరు అనుకోలేదా?👉ఎవరి సలహా మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అందులో వాస్తవాలు ఎందుకు లేవు?👉నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు బాగా తెలుసు. అయినప్పటికీ, విచారణ పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాన్ని ఎందుకు భద్రంగా ఉంచలేదు?👉కొన్ని గంటల తర్వాత డాక్టర్ కుటుంబానికి ఎందుకు సమాచారం అందించారు?👉మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించడంలో ఎందుకు జాప్యం జరిగింది?👉ఆసుపత్రిలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి?ఘటన జరిగిన వెంటనే ఎందుకు రాజీనామా చేశారు? దాని వెనుక కారణం ఏమిటి? సీబీఐ అధికారులు ప్రశ్నించగా..ఈ ప్రశ్నలకు మాజీ ప్రిన్సిపాల్ సందీష్ ఘోష్ సమాధానం చెప్పలేదని అధికారులు సూచిస్తున్నారు. -
కోల్‌కతా డాక్టర్ కేసు : నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్!
కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన దారుణ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో మంగళవారం (ఆగస్ట్20న) సీబీఐ అధికారులు సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన పశ్చిమబెంగాల్‌ను కుదిపేస్తోంది. రోజులు గడిచే కొద్ది రోజుకో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెపై సామూహికంగా దారుణం జరిగి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మృతదేహంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించినట్లు తేలడంతో ఈ దారుణంలో తలెత్తుతున్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో రోజులు గడస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆగస్ట్ 13న కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోల్‌కతా హైకోర్టను సీబీఐ కోరింది. తాజాగా అందుకు అంగీకరించిన కోర్టు.. కేసు తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది. -
కోల్‌కతా ఘటన: కొనసాగుతున్న ఆందోళనలు.. రేపు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతోంది. ఈ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. డాక్టర్ల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో అసలైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట డాక్టర్లు ఆందోళన చేపట్టారు. దీంతో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అవుట్ పేషెంట్ సేవలూ నిలిచిపోయాయి. గవర్నర్ అత్యవసర సమావేశంవైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఇప్పటి వరకూ విచారణ వేగవంతం కాకపోవడాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. దీనిపై వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌భవన్ కార్యాలయాన్ని ఆదేశించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఆనంద బోస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు. ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ రోజు మహిళలు భయపడుతూ బతుకుతున్నారు’’ అని మండిపడ్డారు. ఈ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.సీబీఐ దర్యాప్తు ముమ్మరంఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఆర్జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్‌ను వరుసగాా నాలుగోరోజు విచారిస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్‌కు సైకాలాజికల్ బిహేవియర్ అనాలసిస్ చేశారు. ఆదివారం ఆయన్ను విచారించిన సందర్భంగా సంఘటనకు ముందు, తరువాత చేసిన ఫోన్‌కాల్స్ వివరాలపైనే ప్రశ్నించారు.సుప్రీం విచారణమరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ ఘటనపై మంగళవారం విచారణకు సిద్ధమైంది. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. నిందితులను ఉరి తీయాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. ఇక కోల్‌కతా పోలీసులు ఆగస్టు 18 నుంచి ఆగస్టు 24 వరకు ఆర్జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు. -
కోల్‌కతా ఘటన: ప్రధానికి 70 మంది ‘పద్మ’ వైద్యుల లేఖ
కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. తాజాగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. అలాగే వైద్య సిబ్బంది భద్రతను కోరుతూ పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన వారిలో ప్రముఖ వైద్యులు హర్ష్ మహాజన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సరిన్ తదితరులు ఉన్నారు.ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్ధీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. మరోవైపు కోల్‌కతా పోలీసులు ఆగస్టు 18 నుండి ఆగస్టు 24 వరకు ఆర్జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు. -
కోల్‌కతా డాక్టర్ హత్యోదంతం : సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో కీలక పరిణామ చోటు చేసుకుంది. జూనియర్ డాక్టర్ కేసును అత్యున్నత న్యాయ స్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన (మంగళవారం) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ అంశం విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించనుంది. సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు వెలువడొచ్చనేది తీవ్ర ఉత్కంఠతను రేపిస్తున్నాయి. -
కోల్‌కతా డాక్టర్ కేసు: ‘ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వండి’
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై సీబీఐకు దర్యాప్తు కొసాగిస్తోంది. -
కోల్‌కతా డాక్టర్ కేసు: ఇద్దరు డాక్టర్లు, బీజేపీ నేతకు నోటీసులు
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్దఎత్తున నిసన తెలియజేస్తున్నారు. అయితే మరోవైపు.. హత్యాచార ఘటనప తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. తాజాగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు ఆదివారం ఇద్దరు ప్రముఖ వైద్యులు, సీనియర్ బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హత్యాచారం కేసు దర్యాప్తు, పోస్ట్‌మార్టం నివేదికకు సంబంధించి డాక్టర్ సర్కార్, డాక్టర్ గోస్వామి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ సుబర్ణ గోస్వామి.. ఈ ఘటను సామూహిక అత్యాచారమని పేర్కొన్నారు. 150 మిల్లీగ్రాముల వీర్యం, శరీరంలో పలు ఎముకలు విరిగిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదిక తెలిజేస్తోందని ఆయన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. హత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారనే ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ, లాకెట్ ఛటర్జీపై కోల్‌కతా పోలీసులు ఆరోపణలు చేశారు. బాధితురాలి పేరు, చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు పోలీసులు ఆమెను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. పోలీసులు చేసిన నోటీసులపై లాకెట్ ఛటర్జీ స్పందించారు. ‘కోల్‌కతా పోలీసులు బాధితురాలికి న్యాయం చేయడం కంటే సోషల్ మీడియా పోస్ట్‌లను చూడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’అని ఆరోపించారు.ఇక.. ఇప్పటికే జూనియర్ డాక్టర్‌పై వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని కోల్‌కతా పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు. -
వైద్యుల భద్రతపై కమిటీ
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. తదనంతరం దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన, నిరసన కార్యక్రమాల ఉధృతం అవుతుండడం, ఆసుపత్రల్లో వైద్య సేవలు నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచి్చంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి తగిన భద్రత కలి్పంచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. వారి భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు, ఇతర భాగస్వామ్య పక్షాలన్నీ ఈ కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వొచ్చని, అభిప్రాయాలు తెలియజేయవచ్చని వెల్లడించింది. వైద్య సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని, రోగులకు చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్న సమయంలో డాక్టర్లు అందుబాటులో వైద్య సేవలు నిలిపివేయడం సరైంది కాదని సూచించింది. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి: ఐఎంఏ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలియజేసింది. అ న్ని రాష్ట్రాల్లోని తమ ప్రతినిధులతో చర్చించి, తమ నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టంచేసింది. హాస్పిటల్స్‌ను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వైద్య సిబ్బందిపై హింస జరగకుండా ఒక చట్టం తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల విషయలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరింది. రెండో రోజు విచారణకు హాజరైన సందీప్ ఘోష్ జూనియర్ డాక్టర్ పట్ల జరిగిన అమానవీయ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అనుమానితులను పిలిపించి ప్రశి్నస్తోంది. ఘాతకం జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వరుసగా రెండో రోజు శనివారం కూడా సీబీఐ ఎదుట హారయ్యారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్‌కి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అదికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల కోసం ఢిల్లీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ బృందం కోల్‌కతాకు చేరుకుంది. దేశవ్యాప్తంగా స్తంభించిన వైద్య సేవలు ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం రోడ్డెక్కారు. తమకు భద్రత కలి్పంచాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అత్యవసరం కాని ఇతర వైద్య సేవలను నిలిపివేశారు. ఢిల్లీ, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడి శా తదితర రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు చాలావరకు నిలిచిపోయాయి. -
కోల్‌కతా డాక్టర్ కేసు: 42 డాక్టర్లపై బదిలీపై బీజేపీ ఫైర్
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆదేశాల మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు కూడా నిలిపివేశారు. మరోవైపు.. 42 మంది డాక్టర్లను సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం బదిలీపై చేయటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిస్పందిస్తూ బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మండిపడ్డారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా మెడికల్ కాలేజీ, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆమె ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా నిరసలను తెలపడానికి ఈ రెండు మెడికల్ కాలేజీలు కేంద్రాలుగా ఉన్నాయి. అందుకే వాటిని సీఎం మమత టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు మెడికల్ కాలేజీల నుంచి ఐదుగురు ప్రొఫెసర్లు బదిలీ చేయబడ్డారు. ఇది సీనియర్ డాక్టర్ల సంఘాన్ని భయపెట్టేలనే ప్రయత్నం. మమతా బెనర్జీ ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు?. ఆగస్టు 16న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8 పేజీల బదిలీ ఉత్తర్వుల జాబితాను జారీ చేసింది. ఇది ఇప్పటికే గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది’’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఇక.. బదిలీ చేయబడిన 42 మంది డాక్టర్లలో ఇద్దరు డాక్టర్ల సంగీతా పాల్, డాక్టర్ సుప్రియా దాస్ గతంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో పని చేశారు. -
సమ్మెలో డాక్టర్లు.. దేశవ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జీకార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె ప్రారంభమైంది. యువ డాక్టర్ హత్యకు నిరసనగా ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. ఇందులో భాగంగా శనివారం(ఆగస్టు17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో అవుట్‌పేషెంట్(ఓపీ) సేవలు ఆగిపోయాయి. మళ్లీ ఆదివారం ఉదయం 6 గంటల తర్వాతే డాక్టర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నంలో నిలిచిపోయిన వైద్య సేవలుజూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్నిరసనలో పాల్గొననున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులువిశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం.. మద్దతు పలకనున్న అన్ని ప్రజా సంఘాలు..అనంతపురంలో వైద్యుల సమ్మె..కలకత్తాలో జరిగిన యువ వైద్యురాలి అత్యాచారం, హత్య నిరసిస్తూ వైద్య సేవలు నిలిపివేసిన అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు. జీజీహెచ్‌లో అవుట్‌పేషెంట్ సేవల నిలిపివేత. విజయవాడలో ఆగిన ఓపీ సేవలుకోల్ కతాలో జూనియర్ డాక్టర్ దారుణహత్య ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళనవిజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లునేడు ఓపీ సేవలు పూర్తిగా నిలుపుదలఅత్యవసర సేవలకు మినహాయింపుజూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్తిరుపతిలో డాక్టర్ల నిరసన రుయా హాస్పిటల్ వద్ద ఏపి జూడాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్అసోషియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసనబహిరంగ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్న జూడాలుతిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజి మెడికల్ విద్యార్థులు, జూడాలు ఆద్వర్యంలో నిరసనసీబీఐ దర్యాప్తు ముమ్మరంఆర్జీ కార్ ఆసుపత్రిలో యువ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో అదే ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు జూనియర్ వైద్యులు, ఇతర సీనియర్ వైద్యుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామంటూ తల్లిదండ్రులు చెప్పినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో బాధితురాలితోపాటు కలిసి పనిచేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టంచేశారు. 30 మందిని పిలిపించి, విచారించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. ఆసుపత్రి వైద్యులను, పోలీసు అధికారులను ప్రశ్నించబోతున్నామని చెప్పారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా, ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన గదిలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ గదిని పరిరక్షించాల్సి ఉండగా, కొందరు లోపలికి వెళ్లి శుభ్రం చేశారని పేర్కొంది. కోల్‌కతాలోని డాక్టర్ హత్యాకాండను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు శుక్రవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. -
దీదీ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ దుశ్చర్యను ఖండిస్తూ.. ఓవైపు వైద్యులు, విద్యార్ధులు తీవ్ర నిరనసలువ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఘటన జరిగిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. తాజాగా దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పోలీసులే తమను తాము రక్షించుకోలేకపోతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు నిర్భయంగా ఎలా విధులు నిర్వర్తించగలగరని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది.ఒకవేళ రాష్ట్ర పోలీసులు వైద్యులకు రక్షణ కల్పించలేకపోతే అవసరమైతే ఆసుపత్రిని మూసివేసి.. అక్కడి రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తామని హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలోనే పోలీసులను మందలించింది. ‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. కానీ ఇంత గొడవ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతాన్ని మీరు ఎందుకు చుట్టుముట్టలేదు. ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? 7000 మంది ప్రజలు నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం కదా? అంటూ మండిపడింది. ఇలాంటి సంఘటనలు వైద్యులు, వైద్య సిబ్బంది నైతికత, విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయిఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. హింసకు భయపడకుండా వైద్యులు, ఇతర సిబ్బంది తమ విధులను నిర్వహించే వాతావరణాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి’ అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.అదే విధంగా ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను వివరంగా సీబీకి తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆసుపత్రిపై దుండగుల దాడి ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. తమ కేసు విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను దాఖలు చేయాలని సీబీఐను కోర్టు కోరింది.అయితే దుండగుల దాడిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన గదిలో సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించిన నేపథ్యంలో క్రైమ్‌సీన్ చెక్కుచెదరకుండా ఉందని నిరూపించే ఫొటోలను చూపించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు..? 7 వేల మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం. ఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. వైద్యులు, మెడికల్ సిబ్బంది తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సందర్భంగా ఆస్పత్రిలో విధ్వంసానికి పాల్పడిన 19 మందిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ప్రకారం బుధవారం అర్థరాత్రి 40 నుంచి 50 మంది వ్యక్తుల గుంపు ఆసుపత్రి ఆవరణలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. -
కార్ ఆసుపత్రిలో విధ్వంసం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. యువ వైద్యురాలు శవమై కనిపించిన ప్రభుత్వ ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో దుండగులు వీరంగం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు. అడ్డొచ్చిన నర్సులను నెట్టేశారు. కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో వార్డుల్లో విధ్వంసానికి దిగారు. ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్స్ వార్డులు, నర్సింగ్ స్టేషన్, మెడిసిన్ స్టోర్‌లో పరికరాలు, ఔషధాలను చిందరవందర చేశారు. హత్య కేసు ఆధారాలు చెరిపేసేందుకు ప్రయతి్నంచారు. సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్న వేదికను సైతం ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు పరిమిత సంఖ్యలోనే ఉండడంతో విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. పై అధికారులకు సమాచారం చేరవేయడంతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసుల రాకను గమనించిన దుండగులు రాళ్లు విసిరారు. దాంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. 40 మందికిపైగా దుండగులు నిరసనకారుల రూపంలో ఆసుపత్రిలోకి ప్రవేశించారని పోలీసు అధికారులు చెప్పారు. రాళ్ల దాడిలో పోలీసు వాహనంతోపాటు మరో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. కొందరు పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. ఇప్పటిదాకా 12 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రోగుల హాహాకారాలు ఆసుపత్రి వార్డుల్లో దుండగులు వీరవిహారం చేస్తుండడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. చికిత్స పొందకుండానే కొందరు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. విలువైన వైద్య పరికరాలు, ఔషధాలను దండుగులు ఎత్తుకుపోయినట్లు తెలిసింది. విధ్వంసం జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలో విధుల్లో ఉన్న పోలీసులు చేతులెత్తేశారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. నర్సులకు కేటాయించిన వార్డుల్లో ఆశ్రయం పొందారు. తమను దాచిపెట్టండి అంటూ ఇద్దరు పోలీసులు వేడుకున్నారని ఓ నర్సు చెప్పారు.నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు, నర్సులు ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగుల వీరంగం పట్ల డాక్టర్లు, నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో బైఠాయించారు. తమకు భద్రత కలి్పంచాలని డిమాండ్ చేశారు. తమపై దాడులను సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. పోలీసుల సమక్షంలోనే దుండగులు రెచ్చిపోయారని, తమపై చెయ్యి చేసుకున్నారని ఆరోపించారు. తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఉద్యమాన్ని విరమించుకొనేలా చేయాలన్నదే వారి ప్రయత్నమని చెప్పారు. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.దుమ్మెత్తిపోసుకున్న మమత, బీజేపీఆస్పత్రి విధ్వంసంపై మమత, బెంగాల్ బీజేపీ నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. సీపీఎం, బీజేపీ కార్యకర్తలే విధ్వంసానికి పాల్పడ్డారని మమత ఆరోపించగా, అది ఆమె పంపిన తృణమూల్ గూండాల పనేనని బీజేపీ తిప్పికొట్టింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆస్పత్రి విధ్వంస ఘటన పౌర సమాజానికి సిగ్గుచేటని బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించారు.రేపు వైద్యుల దేశవ్యాప్త సమ్మెవైద్యురాలి హత్యకు నిరసనగా శనివారం వైద్యుల దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచి్చంది. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. మరోవైపు దీనిపై నిరసనలు కొనసాగించాలని ఫోర్డా నిర్ణయించింది. తమ డిమాండ్లను పరిష్కారంపై కేంద్ర మంత్రి నుంచి జేపీ నడ్డా లిఖితపూర్వక హామీ ఇవ్వనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.సీబీఐ దర్యాప్తు వేగవంతం వైద్యురాలి కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. గురువారం బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి హత్యపై వివరాలు సేకరించారు. ఆమె స్నేహితుల గురించి ఆరా తీశారు. కార్ ఆసుపత్రి వైద్యులతోనూ మాట్లాడారు. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, ఛెస్ట్ డిపార్టుమెంట్ చీఫ్‌ను విచారించారు. -
కోల్‌కతా ఉదంతం: క్రైమ్ సీన్‌ను నాశనం చేశారా? పోలీసులేమన్నారంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. ఈ ఘటనను విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలతో దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని కోల్‌కతా పోలీసులు అంటున్నారు.ఆర్జీ కర్ హాస్పిటల్ ముందు నిన్న (బుధవారం) ‘స్వాతంత్రం వచ్చిన అర్థరాత్రి మహిళల స్వాతంత్రం కోసం’ పేరుతో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. గుంపుగా కొంతమంది ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అయితే తాజాగా.. ఈ ఘటనకు పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యాచార జరిగిన స్థలం ఎటువంటి ధ్వంసానికి గురికాలేదని వెల్లడించారు."Crime Scene not disturbed," says Kolkata Police after vandalism at RG Kar Medical CollegeRead @ANI Story | https://t.co/EiRtFIht5H #RGKarMedicalcollege #doctor #murder #rape #KolkataPolice pic.twitter.com/cYUsPKJrcq— ANI Digital (@ani_digital) August 15, 2024 ‘‘నిరసనల ముసుగులో దాదాపు 40-50 మంది గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రి ఆవరణలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జి చేసినట్లు తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని కోల్‌కతా పోలీసులు వెల్లడించారు.#WATCH | Aftermath of vandalism by mob in Emergency Department of RG Kar Medical College and Hospital in Kolkata last night pic.twitter.com/d7HI8crQ4l— ANI (@ANI) August 15, 2024 ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజీ అధికారం ఘటనను, దాడిచేసిన మరికొందరి కదలికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆస్పత్రిలో చొరబడి ఇటువంటి దారుణమైన ధ్వంసానికి పాల్పడటంపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఈ) అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడింది. డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువ వైద్య విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దుండగుల గుంపు దాడి చేసిందని ఐఎంఈ పేర్కొంది.జూనియర్ డాక్టర్ హత్య కేసును విచారిస్తున్న సీబీఐ బృందం గురువారం బాధితురాలి నివాసానికి చేరుకుంది. ఆస్పత్రిలో సీజ్ చేసిన ఘటనాస్థలం విధ్వంసంపై తనిఖీ చేయడానికి దర్యాప్తు సంస్థ అర్జీ కర్ ఆసుపత్రిని కూడా సందర్శించనుంది. మరోవైపు.. ఆస్పత్రిలో దుండగుల గుంపు చేసిన విధ్వంసానికి వ్యతిరేకంగా నర్సులు గురువారం ఉదయం నిరసన తెలిపారు. నేరం జరిగిన సెమినార్ గదిలోకి దుండగులు చొరబడాలని ప్రయత్నించారని నర్సుల్లో ఒకరు తెలిపారు.#WATCH | West Bengal | Visuals of the aftermath from RG Kar Medical College and Hospital campus in Kolkata. A scuffle broke out when a mob entered the campus last night and damaged the property. pic.twitter.com/qf0rO5eVm2— ANI (@ANI) August 15, 2024ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ సీఎం మమత ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సాక్ష్యాలను తారుమారు చేయటం కోసం టీఎంసీ గూండాలు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణుల చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.ప్రచారం: బాధితురాలి ఒంట్లో ముగ్గురి వీర్యం ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతుండడం.. దాని ఆధారంగా మీడియా, సోషల్ మీడియా కథనాలుశవపరీక్షలో అలాంటి విషయం తేలేది లేదని కోల్‌కతా పోలీసుల స్పష్టీకరణప్రచారం: కాలర్(మెడ) బోన్, పొత్తి కడుపు కింది భాగంలో ఎముక విరిగిపోయిందన్న ప్రచారంఅలాంటిదేం జరగలేదన్న పోలీసులుప్రచారం: బాధితురాలి తండ్రికి ఓ పోలీస్ అధికారి డబ్బును ఆశ చూపించి.. కేసును చల్లబర్చే ప్రయత్నం చేశారనే ప్రచారంఅంతా ఉత్తదేనన్న కోల్‌కతా పోలీసులుప్రచారం: బాధిత కుటుంబానికి ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కోల్‌కతా పోలీసులు చెప్పారనే ప్రచారం.. అలాంటిదేం జరగలేదని, అసలు కోల్‌కతా పోలీసుల నుంచి అలాంటి కాల్ రాలేని స్వయంగా బాధిత కుటుంబం ద్వారా వివరణ ఇప్పించిన కోల్‌కతా పోలీసులు -
జూనియర్ డాక్టర్‌పై జరిగింది సామూహిక హత్యాచారామే? : వైద్యులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కోల్‌కతా పోలీసుల విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా, ఈ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.బాధితురాలిపై ఒకరి కంటే ఎక్కువ మంది సామూహిక హత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి అటాప్సీ రిపోర్ట్‌ను పరిశీలించిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి మాజీ విద్యార్థి అఖిల భారత ప్రభుత్వ వైద్యుల సమాఖ్య అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి.. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆమెపై ఒకటి కంటే ఎక్కువసార్లు అత్యాచారం జరిగి ఉండొచ్చని అభిప్రాయడ్డారు.శవపరీక్ష నివేదిక ఆమె ఎదుర్కొన్న క్రూరత్వానికి రుజువు. ఒకరు కంటే ఎక్కువ మంది నిందితులు ఆమెను లైంగికంగా వేధించారు. ఇది అత్యంత దారుణం అని పీటీఐతో అన్నారాయన. దీంతో పాటు బాధితురాలిపై జరిగిన హత్యాయత్నానికి గురైన గాయాలు యాంటిమార్టం అని, అంటే ఆమె మరణానికి ముందు సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. హత్య చేసిన తర్వాత ఆమెపై హత్యాచారం జరిగిందన్న వాదనలను కొట్టిపారేశారు. ఆమె మరణించిన సమయం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఉండవచ్చని చెప్పారాయన.#EXCLUSIVE: Kolkata rape and murder case Dr Subarno Goswami, who examined the victim's body speaks to @shreyadhoundial and says, "Postmortem reports hints that there might be involvement of more than one rapist" #TheUrbanDebate #JusticeForDevi #KolkataDoctorDeath pic.twitter.com/nnJMSfRvpA— Mirror Now (@MirrorNow) August 14, 2024బాధితురాలి తల్లిదండ్రులు సైతం ఆమె శరీంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారని, ఇదే విషయాన్ని కోల్కత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్లో ఆరోపించారు.బాధితురాలు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువువుతున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో గత గురువారం ఆమె ఎప్పటిలాగే విధులకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ కేసులో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్‌మార్టం నివేదిక బలపరుస్తోంది. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచి్చతంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు. ఒళ్లంతా గాయాలే నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో విస్మయకర వివరాలున్నాయి. ‘‘రేప్ చేశాక గొంతు నులిమి చంపారు. పెనుగులాట సందర్భంగా కదలకుండా తలను గోడకు బలంగా అదమడంతో వెనక వైపు పెద్ద గాయమైంది. ముఖమంతా గీసుకుపోయింది. కేకలు వేయకుండా నోరు మూసేశారు. గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్డిలేజ్ చితికిపోయింది. జననాంగాల వద్ద లోతైన గాయమైంది. లైంగికదాడే అందుకు కారణం. నడుము, పెదాలు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలున్నాయి. రెండు కళ్ల నుంచి, నోటి నుంచి రక్తస్రావమైంది. ముక్కు, నోరు గట్టిగా అదిమిపట్టి మూసేసినట్లు చర్మం కమిలింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘కాళ్లు పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి. కటిభాగం వద్ద ‘పెలి్వక్ గార్డిల్’ చీలిపోయింది. అంటే కాళ్లను పూర్తిగా పక్కకు విరిచేశారు’ అని వైద్యురాలి బంధువు ఒకావిడ విలపిస్తూ చెప్పారు. మూడు గంటలు బయటే నిలబెట్టారు మృతదేహాన్ని చూపించకుండా ఆస్పత్రి బయట మూడు గంటలు బయటే నిలబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ‘‘తర్వాత తండ్రిని అనుమతించారు. తన ఒంటిపై బట్టల్లేవు. కాళ్లు పక్కకు విరిచేసినట్లు ఫొటోలోకనిపిస్తోంది. కళ్లద్దాల ముక్కలు కంట్లో ఉన్నాయి. ఊపిరాడకుండా చేసి చంపేశారు’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. -
కోల్‌కతా: సంచలన రిపోర్టు.. డాక్టర్‌పై సామూహిక అత్యాచారం?
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ‘ఈ కేసుపై విచారణ చేపట్టాం. ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ వైద్య బృందాలు వచ్చాయి’అని సీబీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. మరోవైపు.. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదికతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు జూనియర్ డాక్టర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి.#WATCH | After reaching RG Kar Medical College and Hospital in Kolkata earlier today, a CBI official says "We have taken over the investigation. FSL team and medical teams have come from Delhi..." pic.twitter.com/LnEERH5ymN— ANI (@ANI) August 14, 2024 జూనియర్ డాక్టర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించినట్లు తెలుస్తోంది. తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు కోల్‌కతా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించిన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం రిపోర్టు వెల్లడించిన అంశాలు.. ఆమెపై సామూహిక హత్యచారం జరిగే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
కోల్‌కతా వైద్యురాలి ఘటనపై మౌనం వీడిన రాహుల్.. ఏమన్నారంటే!
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైద్యరంగంలో మహిళల్లో అభద్రతాభావం పెంచుతోందన్నారు. విద్యా, వైద్య సంస్థల్లో భద్రతా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించడంలో స్థానిక అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.‘భాదితులకు న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే ప్రయత్నం చూస్తుంటే.. ఆసుపత్రి, స్థానిక పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మెడికల్ కాలేజీ లాంటి చోట డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువుల కోసం బయటకి ఎలా పంపుతారనే ఆలోచనను రేకెత్తిస్తోంది. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాయి’ అని ప్రశ్నించారు.‘హత్రాస్ నుంచి ఉన్నావ్ వరకు.. కథువా నుంచి కోల్‌కతా వరకు మహిళలపై నిరంతరం పెరుగుతున్న అరాచకాలపై ప్రతి పార్టీ, సమాజంలోని ప్రతి వర్గం తీవ్రమైన చర్చలు జరపాలి. వీటిని నిరోధించేందుకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.कोलकाता में जूनियर डॉक्टर के साथ हुई रेप और मर्डर की वीभत्स घटना से पूरा देश स्तब्ध है। उसके साथ हुए क्रूर और अमानवीय कृत्य की परत दर परत जिस तरह खुल कर सामने आ रही है, उससे डॉक्टर्स कम्युनिटी और महिलाओं के बीच असुरक्षा का माहौल है।पीड़िता को न्याय दिलाने की जगह आरोपियों को…— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2024మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం.. కోల్‌కతా వైద్యురాలి ఘటన భయానకమైనదిగా పేర్కొ న్న విషయం తెలిసిందే. దీనిని హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. పని ప్రదేశంలో మహిళల భద్రత అనేది ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనికి తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.శుక్రవారం తెల్లవారుజామున ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందేఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. -
కోల్‌కతా డాక్టర్ కేసు: ‘నిందితుల రక్షణకు దీదీ ప్రయత్నం’
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపోతుంది. దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీ, ఆస్పత్రి విద్యార్థులు, జూనియార్ డాక్టర్లు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రతిపక్ష బీజేపీ ఈ కేసులో సీఎం మమత నిందితులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం బీజేపీ నేత, అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడారు. ‘‘ పశ్చిమ బెంగాల్లో మహిళలకు భద్రత కల్పించటంలో సీఎం మమత విఫలం అయ్యారు. మీరు (మమతా బెనర్జీ) మీ నైతిక బాధ్యతను నిర్వర్తించలేదు. తక్షణమే రాజీనామా చేయాలి. అదీకాక.. ఈ కేసుల ఆమె నిందితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. సీబీఐ సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా చేస్తుందనే విశ్వాసం ఉంది. ఇటీవల దీదీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తానని అన్నారు. అది సాక్ష్యాలను తారుమారు చేసే వ్యూహాత్మక చర్య. దర్యాప్తులో మొదటి 48 గంటలే చాలా కీలకం. ఆలస్యం చేయటం వల్ల సరైన న్యాయం జరగకపోవచ్చు. దీదీ ప్రభుత్వంలో బెంగాల్లో శాంతిభద్రతలు కుప్పకూలాయి’’ అని విమర్శలు చేశారు. -
కోల్‌కతా డాక్టర్ హత్య కేసు.. ఆస్పత్రిపై ఆరోపణలు
కలకత్తా : కలకత్తా ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం,హత్య ఘటనపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ దారుణం గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వచ్చామని, ఆస్పత్రిలో తమ కుమార్తె డెడ్ బాడీని చూసేందుకు మూడు గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.బాధితురాలి తల్లిదండ్రులు కుమార్తె మరణంపై ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ఆగస్ట్ 9న ఆస్పత్రి అధికారులు నాకు ఫోన్ చేసి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వెంటనే రావాలి అని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన వెంటనే తమ కుమార్తె ముఖాన్ని చూపించమని హాస్పిటల్ అధికారులను వేడుకున్నాం. కానీ చూపించలేదు. మూడు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అని ఆరోపిస్తున్నారు. మూడు గంటల తర్వాత తండ్రిని లోపలికి వెళ్లి ఆమె మృతదేహాన్ని చూడటానికి అనుమతించారు. ఒక ఫొటో తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు.ఆమె శరీరంపై దుస్తులు లేవు. ఆమె కాళ్ళు 90 డిగ్రీల కోణంలో మెలి తిరిగి ఉన్నాయి. ‘కటి వలయంలో రెండు కాక్సల్ ఎముకలు(హిప్ ఎముకలు)ఉంటాయి. అవి విరిగితేనే కాళ్లు అలా ఉంటాయి’ అని బంధువులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జికార్ ఆస్పత్రికి సీబీఐ అధికారులుమరోవైపు జూనియర్ డాక్టర్‌పై అత్యంత పాశవికంగా దాడి జరుగుతుందటే ఆస్పత్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలియపోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి పోలీసులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు న్యాయ స్థానాన్ని కోరారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించింది. బుధవారం ఉదయం 10గంటల్లోపు కేసుకు సంబంధించిన అన్నీ ఆధారాల్ని సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ప్రధానన్యాయ మూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ ధర్మాసనం పోలీసులకు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు బుధవారం ఉదయం ఆర్జీకార్ ఆస్పత్రికి చేరుకున్నారు. -
ట్రైనీ డాక్టర్ హత్య కేసు: సీబీఐ దర్యాప్తు ప్రారంభం
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో అత్యంత భయానకంగా జరిగిన ట్రైనీ మహిళా డాక్టర్ హత్యకేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది.దర్యాప్తు కోసం సీబీఐ పోలీసులు బుధవారం(ఆగస్టు14) ఉదయాన్నే కలకత్తా చేరుకున్నారు. ఇప్పటివరకు కేసు దర్యాప్తు చేసిన కలకత్తా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు తీరుపై పశ్చిమబెంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు మంగళవారమే కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో మరుసటిరోజే సీబీఐ రంగంలోకి దిగింది. ఇటీవల కలకత్తాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. అన్ని రాష్ట్రాల్లోజూనియర్‌డాక్టర్లు ఆందోళనలు నిర్వహించారు. కేంద్రవైద్యశాఖ మంత్రి జేపీనడ్డా హామీతో తమ ఆందోళనలు విరమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. -
వైద్యురాలి కేసు సీబీఐకి
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్యురాలి హత్యాచారం కేసు విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశాలిచి్చంది. అనంతరం గంటల వ్యవధిలోనే ఫోరెన్సిక్, వైద్య నిపుణులతో కూడిన సీబీఐ ప్రత్యేక బృందం హుటాహుటిన కోల్‌కతా చేరుకుంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారించడమే గాక క్రైం సీన్‌ను రిక్రియేట్ చేయనుంది. మరోవైపు తమ ప్రధాన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో దేశవ్యాప్త సమ్మెను విరమిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న ఓ ప్రబుద్ధుడు గత గురువారం రాత్రి ఓ ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి దారుణంగా హతమార్చడం తెలిసిందే. దీనిపై వైద్యులు, వైద్య సిబ్బంది భగ్గుమన్నారు. ఇందులో ఇతరుల హస్తమూ ఉందని, అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ పక్కాగా చెరిపేశారని ఆరోపించారు. దోషులందరికీ కఠిన శిక్షలు పడాలంటూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనలకు తెర తీశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్‌పై కలకత్తా ౖహైకోర్టు మంగళవారం విచారించింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. ప్రిన్సిపల్ తీరు క్షమార్హం కాదు ఈ ఉదంతంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరు దారుణమంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం మండిపడ్డారు. ‘‘కాలేజీ క్యాంపస్ లోపల ఏకంగా మహిళా డాక్టర్‌ను రేప్ చేసి దారుణంగా హతమార్చినా ఆయన సత్వరం స్పందించలేదు. హత్య జరిగిందంటూ కనీసం సకాలంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ఇది క్షమార్హం కాదు’’ అంటూ తీవ్రంగా తలంటారు. వైద్య విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఘోష్ రాజీనామా చేయడం తెలిసిందే. మమత సర్కారు దాన్ని ఆమోదించకపోగా ఆయనను కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ (సీఎన్ఎంసీహెచ్)కు బదిలీ చేయడంపై సీజే విస్మయం వెలిబుచ్చారు. తక్షణం సెలవుపై వెళ్లాలని ఘోష్‌ను ఆదేశించారు. తదుపరి ఆదేశాలిచ్చే దాకా ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేశారు.డిమాండ్లకు కేంద్రం ఒప్పుకొంది: ఫోర్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ (ఫోర్డా) మంగళవారం రాత్రి ప్రకటించింది. ‘‘మంత్రితో భేటీ అయ్యాం. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు ఉద్దేశించిన కేంద్ర రక్షణ చట్టంపై ఫోర్డా సహకారంతో కమిటీ వేయాలనే ప్రధాన డిమాండ్‌ను 15 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు’’ అని తెలిపింది. -
ట్రైనీ డాక్టర్ కేసు.. ఆర్జీకార్ మాజీ ప్రిన్సిపల్‌పై కోల్‌కతా హైకోర్ట్ ఆగ్రహం
కోల్‌కతా: జూనియర్ డాక్టర్ మరణంపై కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీర్ఘకాలిక సెలవు తీసుకోవాలని సూచించింది. జూనియర్ డాక్టర్ మరణంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బాధితురాలు తల్లిదండ్రులుతో పాటు పలువురు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇవాళ (ఆగస్ట్ 13 న) చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థిని అత్యాచారం, హత్యపై సందీష్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్జీకార్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశంపై సందీష్ ఘోష్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆయన తీరుపై మండిపడింది. డాక్టర్ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. విద్యార్ధులు, ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. కానీ సందీష్ ఘోష్ ఎలాంటి స్పందన లేకపోవడాన్ని కోర్టు గుర్తించింది. ఈ సందర్భంగా ‘ఆర్జీ కార్ కాలేజీ విద్యార్ధులకు ప్రిన్సిపల్ సంరక్షకుడు .. అతను సానుభూతి చూపకపోతే ఎవరు చూపిస్తారు? ఆయన ఎక్కడా పని చేయకుండా ఇంట్లోనే ఉండాలి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం వ్యాఖ్యానించారు. ఏ వ్యక్తి చట్టానికి అతీతులు కారు. మధ్యాహ్నం 2 గంటలలోపు డాక్టర్ ఘోష్ రాజీనామా లేఖను కోర్టుకు అందజేయాలి. ఆ లేఖలో ఘోష్ ఏం రాశారో మేం చదవాలని అనుకుంటున్నామని ఆదేశాలు జారీ చేశారు. -
ట్రైనీ డాక్టర్ హత్య కేసు.. మరొకరి ప్రమేయం ఉందా?
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకేసులో పలు అనుమానాలు, అటాప్సీ రిపోర్ట్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం (ఆగస్ట్13) ట్రైనీ డాక్టర్ ఆటాప్సీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అటాప్సీ రిపోర్ట్ ఆధారంగా..నిందితుడు సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రాణాలు తీసినట్లు తేలింది. అమానుషంగా లైంగిక దాడి కారణంగా బాధితురాలి అంతర్గత శరీర భాగాల్లో ఏర్పాడిన గాయాల కారణంగా రక్త స్త్రావమైంది. ఆగస్టు 9 తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య హత్య, అత్యాచారం జరిగి ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.నిందితుడి సంజయ్ రాయ్ నుంచి తప్పించుకునేందుకు ట్రైనీ డాక్టర్ ప్రతిఘటించడంతో ఆమె ఉదరం, పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై గాయాలయ్యాయని, నిందితుడు నుంచి చెరనుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిలువరించేందుకు ఆమె తలను గోడకు బాదాడు. దారుణానికి ఒడిగట్టే సమయంలో అరుపులు వినపడకుండా ఉండేందుకు నోరు, గొంతు బిగించాడు. దీంతో ఆమె మెడ ఎముకలు విరిగినట్లు పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. అయితే, ఆమె కంటికి గాయం కావడానికి గల కారణాల్ని ఇంకా గుర్తించలేదు.ఆత్మహత్య చేసుకుందంటూ ఫోన్ కాల్మరోవైపు దారుణం వెలుగులోకి వచ్చిన రోజు ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ కాల్ చేసింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని మీడియా కథనాలు చెబుతున్నాయి. సంజయ్ రాయ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా?దీంతో ఇదే అంశంపై సూపరింటెండెంట్‌ను విచారించేందుకు పోలీసులు ఇవాళ లాల్‌బజార్ పీఎస్‌కు పిలిపించారు. తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులకు ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజయ్ రాయ్‌తో పాటు ఇంకెవరైనా ఉన్న అన్న కోణంలో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. -
కోల్‌కతా వైద్యురాలి కేసు: సీఎం మమతకు ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణంపై జూనియర్ వైద్యులు, నర్సులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఇది హృదయవిదారకమైన ఘటనగా అభివర్ణించారు. ఈ కేసు దర్యాఫ్తును వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని అన్నారు. మహిళలు పని చేసే ప్రదేశంలో భద్రత అనేది పెద్ద సమస్యగా మారిందని వాపోయారు. మహిళల భద్రత కోసం తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.कोलकाता के आरजी कर मेडिकल कॉलेज में ट्रेनी डॉक्टर के साथ दुष्कर्म और हत्या की घटना दिल दहलाने वाली है। कार्यस्थल पर महिलाओं की सुरक्षा देश में बहुत बड़ा मुद्दा है और इसके लिए ठोस प्रयास की जरूरत है। मेरी राज्य सरकार से अपील है कि इस मामले में त्वरित और सख्त से सख्त कार्रवाई…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2024చదవండి: కోల్‌కతా వైద్యురాలి కేసు.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నిందితుడు -
కోల్‌కతా వైద్యురాలి కేసు.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నిందితుడు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణంపై జూనియర్ వైద్యులు, నర్సులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో డాక్టర్‌పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ అసలు ఆసుపత్రి ఉద్యోగి కాదని వెల్లడైంది. కానీ ఆసుపత్రిలోని అన్ని బిల్డింగ్‌లలో తరుచూ తిరుగుతుంటాడని తేలింది. అతడు కోల్‌కతా పోలీసులతో కలిసి పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. 2019లో కోల్‌కతా పోలీసుల డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్‌లో వాలంటీర్‌గా చేరాడు. తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. అనంతరం ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌కు మారాడు. అక్కడ క్యంపస్లోని బిల్డింగ్‌లలో అన్ని విభాగాల్లో ప్రవేశించడానికి అతడికి అనుమతి ఉంది.ఈ క్రమంలోనే సంజయ్ రాయ్ పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అడ్మిషన్ కోసం, రోగుల బంధువులకు సైతం ప్రభుత్వాసుపత్రిలో పడక దొరక్కపోతే దగ్గర్లోని నర్సింగ్‌హోమ్‌లలో ఏర్పాటు చేసేదుకు డబ్బులు వసూలు చేసేవాడని తేలింది. సంజయ్ అధికారిక పోలీస్ కానప్పటికీ తన పరిచయాలను ఆసరాగా చేసుకొని కొన్నిసార్లు పోలీస్ బ్యారక్‌లోనే ఉండేవాడు. కోల్ కతా పోలీస్ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి తిరిగేవాడు. అతని బైక్‌కు కూడా కేపీ(కోల్‌కతా పోలీస్) అనే ట్యాగ్ ఉంది. ఇతర పౌర వాలంటీర్లకు తనను తాను కోల్‌కతా పోలీస్ సిబ్బందిగా పరిచయం చేసుకునేవాడు.ఏం జరిగింది?కోల్‌కతాలో ఆర్జీ కర్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడికి ఆగస్టు 23 వరకు పోలీసు కస్టడీ విధించారు.కావాలంటే ఉరి తీయండి..ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం పోలీసులు రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. అయితే అతనిలో ఏమాత్రం తప్పు చేసిన పశ్చాత్తాపం కనిపించలేదు. అంతేగాక మీకు కావాలంటే నన్ను ఉరి తీయండంటూ పోలీసులపైకి రుబాబుగా ప్రవర్తించినట్లు తెలిసింది. అతని మొబైల్ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అత్యవసర భవనంలోకి ప్రవేశించడం కెమెరాలో రికార్డయ్యింది. కొన్ని గంటల తర్వాత అదే భవనంలో వైద్యురాలి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్‌ఫోన్ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్ రూమ్‌లో దొరికింది. అదే అతడిని పట్టించింది. ఎమర్జెన్సీ భవనంలోకి వెళ్తున్నప్పుడు బ్లూటూత్ డివైజ్ అతని మెడలో ఉంది. కానీ అతను బయటకు వచ్చేసరికి అది కనిపించలేదు. మృతదేహం పక్కన ఉన్న హెడ్సెట్ కూడా అతని ఫోన్‌తో పెయిర్ చేసి ఉంది.మహిళా డాక్టర్‌పై హత్యాచారం చేసి తర్వాత నిందితుడు తాపీగా గదికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయినట్లు తేలింది. తెల్లారిన తర్వాత తన దుస్తులపై రక్తపు మరకలను శుభ్రం చేసుకున్నట్లు తెలిసింది, అయితే అతని షూస్‌కు అంటిన రక్తపు మరకల ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. .అయిత ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. సంజయ్ రాయ్‌కు ఇదివరకే నాలుగు పెళ్లిళ్లు అవ్వగా.. ముగ్గురు భార్యలు అతడిని వదిలి వెళ్లిపోగా. నాలుగో భార్య గత ఏడాది మరణించింది. ఎవరీ పోలీస్ పౌర వాలంటీర్లుఈ వాలంటీర్లు ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందనతో సహా వివిధ పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియమించినన కాంట్రాక్టు సిబ్బంది. నెలకు దాదాపు రూ.12,000 చెల్లిస్తుంటారు. అయితే ఈ వాలంటీర్లకు సాధారణ పోలీసు సిబ్బందికి ఉండే సౌకర్యాలేవి ఉండవు -
కోల్‌కతా డాక్టర్ ఘటన: పోలీసులకు దీదీ డెడ్‌లైన్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యోదంతంపై వైద్యులు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పలు వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార టీఎంసీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును పోలీసులు వచ్చే ఆదివారం లోపు పరిష్కరించకపోతే.. అనంతరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ)కి అప్పగిస్తామని అన్నారు. ఈ మేరకు ఈ ఘటనను పరిష్కరించాలని పోలీసులకు డెడ్‌లైన్ విధించారు. ఈ కేసులో ఎక్కువ మంది నిందితులు ఉంటే.. ఆదివారం లోపు అందరినీ అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పోలీసులు చేసే దర్యాప్తు వేగంగా లేకపోతే కూడా సీబీఐకి అప్పగిస్తామని అన్నారు.చదవండి: చంపేశాడు... ఇంటికొచ్చి నిద్రపోయాడు! -
చంపేశాడు... ఇంటికొచ్చి నిద్రపోయాడు!
న్యూఢిల్లీ: కోల్‌కతాలో ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యోదంతంపై వైద్యులు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పలు వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా ఆదివారం ప్రకటించింది. దీంతో సోమవారం దేశంలో పలు రకాలైన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేశాడనే ఆరోపణపై అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు ఇంటికి వచ్చిన అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు తన దుస్తుల్ని ఉతికి పడుకున్నాడని తేలింది. అయితే, నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.పారదర్శకంగా దర్యాప్తుజూనియర్ డాక్టర్ హత్య కేసులో నేరానికి కారకులైన వారిని త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగతున్నాయి. ఈ తరుణంలో నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భేటీలో ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తు పారదర్శకంగా ఉందని, పుకార్లను నమ్మొద్దని కోరారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు..‘నేరం చేసిన తర్వాత, నిందితుడు తిరిగి తన ఇంటికి వెళ్లి శుక్రవారం తెల్లవారుజాము వరకు నిద్రపోయాడు. నిద్రలేచిన తరువాత, సాక్ష్యాలను నాశనం చేసేందుకు అతను ధరించిన బట్టలు ఉతికాడు. అతడి షూపై రక్తపు మరకల్ని గుర్తించాము’ అని చెప్పారు. వైద్యురాలు హత్యకేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా..ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, పూర్తి స్థాయి అటాప్సీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ఆధారాలు సేకరిస్తున్న పోలీసులుగురువారం రాత్రి విధుల్లో ఉన్న వ్యక్తులతో మరుసటి రోజు ఉదయం వరకు మాట్లాడుతున్నామని, సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఆదివారం నాడు ఫోరెన్సిక్ యూనిట్‌తో పాటు సిట్‌లోని పోలీసు అధికారుల బృందం ఆసుపత్రిలోని సెమినార్ హాల్ నుండి నమూనాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.డిమాండ్స్ నెరవేర్చే వరకు ఆందోళన తప్పదుఅయితే ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు, తాము పూర్తిగా సంతృప్తి అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని, భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి పలు రకాల వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. -
ట్రైనీ డాక్టర్ హత్య.. నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు!
కోల్‌కతా : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసు సంచలనంగా మారింది. ఆర్జీ కార్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. దీంతో నిందితుల్ని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్లు, విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా.. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సంజయ్ రాయ్ తల్లి మాలతీ రాయ్ మాత్రం ‘నా కొడుకు నిర్ధోషి.పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును చేసినట్లు ఒప్పుకున్నాడని’ అన్నారు.అరెస్ట్ అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు నిందితుడు నివాసం ఉంటున్న ప్రాంతాల్ని, స్థానికులు, బంధువుల్ని ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని, దుష్ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతన్ని విడిచిపెట్టినట్లు తెలిపారు. నాలుగో భార్య గతేడాది క్యాన్సర్‌తో మరణించింది. నిందితుడు తాగిన మత్తులో తరచూ అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడని స్థానికులు చెప్పారు. సూపరింటెండెంట్ తొలగింపు మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్యతో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ని ఆ పదవి నుండి తొలగిస్తూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా ఆసుపత్రికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వశిష్టను తొలగించారు. అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. Prof. Dr Sanjay Vashisth now employed as MSVP, RGkar Medical College to act until further order as a Professor in the Department of Physiology, Calcutta National Medical College, Kolkata and Prof. Dr Bulbul Mukhopadhyay, now employed as Professor, of Physiology, at RGkar Medical… pic.twitter.com/Kn9mQs6ojh— ANI (@ANI) August 11, 2024 బాధ్యులైన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, వైద్య విద్యార్థులు కొనసాగుతున్న నిరసనల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది.నాలుగు పేజీల ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఆర్జీ కార్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ నాలుగు పేజీల ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఆమె కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలయ్యాయి. ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలింది. -
ట్రైనీ డాక్టర్ హత్యకేసు : వెలుగులోకి సంచలన విషయాలు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యకేసులో ఒళ్లు గగుర్పొడిచేలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోల్‌కతా ప్రభుత్వ ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో దారుణ హత్యకు గురైన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో విస్తుపోయేలా రిపోర్ట్ వచ్చింది. నిందితులు బాధితురాల్ని దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు పోలీస్ అధికారులు పీటీఐకి తెలిపారు.#Kolkata Police sources have confirmed that Sanjay Roy, a civic volunteer and the accused in the alleged murder and sexual assault of a woman trainee doctor at RG Kar hospital, has confessed to the crime. He admitted to throttling the doctor after she put up a struggle. pic.twitter.com/KrY1FKCXas— Beats in Brief (@beatsinbrief) August 11, 2024ఆసుపత్రిలోని ఓ వైద్యుడు పీటీఐతో మాట్లాడుతూ..ప్రభుత్వ ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే వైద్యురాలు గురువారం రాత్రి విధులకు హాజరయ్యారు. ఆమె తెల్లవారు జామున 2 గంటలకు తన జూనియర్లతో కలిసి డిన్నర్ చేశారు. అనంతరం రెస్ట్ తీసుకునేందుకు ఆస్పత్రిలో రూంలు ఖాళీగా లేకపోవడంతో సెమినార్ గదికి వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి అర్ధనగ్నంగా శవమై కనిపించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి శవపరీక్ష (అటాప్సీ)నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమికంగా బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు చెప్పారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకువైద్యురాలి రెండు కళ్ళు, నోటి నుండి రక్తం, ముఖం, గోరుపై గాయాలు ఉన్నాయి. బాధితురాలి ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రామైంది. ఆమె ఉదరం, ఎడమ కాలు..మెడ, ఆమె కుడి చేతిలో,ఉంగరపు వేలు,పెదవులపై గాయాలు ఉన్నాయి’ అని ఓ పోలీసు అధికారి పీటీఐకి చెప్పారు. ఆమెది ఆత్మహత్య కాదు..ముమ్మాటికి హత్య. అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఆమె మెడ ఎముక విరిగింది. మొదట గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి అటాప్సీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం’ అని సదరు పోలీస్ అధికారి చెప్పారు. నిందితుల్ని ఉరితీయాలిఈ ఘటనపై బీజేపీతో పాటు ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో రాజకీయ దుమారం రేపింది. దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ ఏ ఏజెన్సీ ద్వారానైనా విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. అటువంటి కేసుల్లో దోషులుగా తేలిన వారికి ఉరిశిక్ష లేదంటే ఎన్కౌంటర్ దీదీ మేనల్లుడు తృణమూల్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. Kolkata's R G Kar Medical College & Hospital Incident Case, West BengalTMC (@AITCofficial) Nat'l Gen Secy & MP Shri Abhishek Banerjee (@abhishekaitc) on #RGKar says, "If we don't change the law, nothing will change. A strict law should be brought for a speedy trial in 7 days.… pic.twitter.com/KYmxFZDbqR— Dipankar Kumar Das (@titu_dipankar) August 10, 202414 రోజుల పోలీస్ కస్టడీలో హంతకుడుకాగా,జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పోలీసులు ఓ బ్లూటూత్‌ను గుర్తించారు. వెంటనే ఆస్పత్రిలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. ఆ పుటేజీ ఆధారంగా ఓ వాలంటీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని హంతకుడిగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడికి 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. నిందితునిపై భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) 64 (అత్యాచారం), 103 (హత్య ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ఆగస్టు 23 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించారని అన్నారు. -
రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేత : ఫోర్డా
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఓ మహిళా జూనియర్ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె హత్యకు నిరసనగా వైద్యుల సంఘం ‘ది ఫెడరరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)’ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 12 (సోమవారం) నుండి దేశంలోని అన్ని ఆసుపత్రులలో పలు రకాల వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 9న ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (PGT) డాక్టర్ హత్యకు గురయ్యారు. ఆమెకు సంఘీభావంగా వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వైద్యురాలి హత్యని రాజకీయం చేయకుండా నిందితుల్ని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫోర్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసింది. 🚨 We shall begin our Nationwide agitation from tomorrow! (Monday 12th August)We stand with our beaten, manhandled, deeply hurt colleagues of R G Kar Medical College, Kolkata. We urge authorities to not make it political and color it bad- It’s humanity which is at stake here.… pic.twitter.com/pPg2ifpBqI— FORDA INDIA (@FordaIndia) August 11, 2024తక్షణ చర్య: ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి. నిరసనకారులకు రక్షణ: జూనియర్ వైద్యులి మరణంపై న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేస్తున్న వైద్యుల పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూదని హామీ ఇవ్వాలి. సత్వర న్యాయం, పరిహారం: హత్యకు గురైన వైద్యుని కుటుంబానికి సత్వర న్యాయం, తగిన పరిహారం అందించాలి. మెరుగైన భద్రతా ప్రోటోకాల్‌లు: అన్ని ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కఠినమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసి, అమలు చేయాలని వైద్యుల సంఘం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. నిపుణుల కమిటీ ఏర్పాటు: సెంట్రల్ హెల్త్‌కేర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను వేగవంతం చేయడానికి వైద్య సంఘాల ప్రతినిధులతో సహా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. అని డిమాండ్ చేస్తూ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. ఖండిస్తున్న వైద్యులు కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణాన్ని దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న డాక్టర్లు ఖండిస్తున్నారు. జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా కేరళలోని వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోలు, మెడికల్ టీచర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిరసనలు తెలపనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకుల సంఘం కేజీఎంసీటీఏ వైద్యుల్ని హత్యను త్రీవంగా ఖండించింది. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొంటున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా నైట్ డ్యూటీ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డ్యూటీ వర్క్‌లో భాగమైన మహిళా వైద్యుల భద్రత ఎప్పుడూ ఆందోళన కలిగిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది. తమ పనిని నిర్భయంగా నిర్వర్తించగలిగేలా సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం ఆయా ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంది. -
ట్రైనీ డాక్టర్‌పై దారుణం.. అవసరమైతే నిందితులను ఉరితీస్తాం: సీఎం మమతా
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ట్రైయినీ డాక్టర్ హత్యాచారం ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆసుప్రతిలోనే వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడటం, ఆపై హత్య చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.తాజాగా ట్రైయినీ డాక్టర్ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, వైద్యుల నిరసనలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా వారి డిమాండ్లను అంగీకరించారని అన్నారు. అరెస్ట్ చేసిన నిందితులు అసుపత్రిలోనే పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే నిందితులను ఉరితీస్తారని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును వేగంగా విచారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.అయితే నిరసన చేస్తున్న వారికి రాష్ట్ర పరిపాలనపై నమ్మకం లేదని భావిస్తే, వారు మరేదైనా దర్యాప్తు సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. దానితో తనకు ఎలాంటి సమస్యలేదన్నారు. ఈ కేసులో సరైన, సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే డాక్టర్లు తమ నిరసనలను కొనసాగిస్తూనే రోగులకు చికిత్స అందించాలని సూచించారు.కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యకు గురైంది. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో శవమై కనిపించింది. అంతేగాక ఆమెను హత్య చేసే ముందు లైంగికదాడికి పాల్పడినట్లు తాజాగా పోస్టుమార్టంలో తేలింది. బాధితురాలి ముఖం,కుడి చేయి, మెడ, ఎడమకాలు,పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె కళ్లు, నోటి నుంచి, ప్రేవేటు భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు శనివారం వెల్లడించారు.ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాంగా ఈ ఘోరానికి పాల్పడిని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుడు ఆసుపత్రిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా, అతడికి హాస్పిటల్‌లోని పలు విభాగాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉన్నట్లు గుర్తించారు.