కోల్‌కతా : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసు సంచలనంగా మారింది. ఆర్‌జీ కార్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. దీంతో నిందితుల్ని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్లు, విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా.. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే సంజయ్ రాయ్ తల్లి మాలతీ రాయ్ మాత్రం ‘నా కొడుకు నిర్ధోషి.పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును చేసినట్లు ఒప్పుకున్నాడని’ అన్నారు.
అరెస్ట్ అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు నిందితుడు నివాసం ఉంటున్న ప్రాంతాల్ని, స్థానికులు, బంధువుల్ని ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని, దుష్ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతన్ని విడిచిపెట్టినట్లు తెలిపారు. నాలుగో భార్య గతేడాది క్యాన్సర్‌తో మరణించింది. నిందితుడు తాగిన మత్తులో తరచూ అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడని స్థానికులు చెప్పారు.
సూపరింటెండెంట్ తొలగింపు
మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్యతో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్‌ని ఆ పదవి నుండి తొలగిస్తూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా ఆసుపత్రికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వశిష్టను తొలగించారు. అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
Prof. Dr Sanjay Vashisth now employed as MSVP, RGkar Medical College to act until further order as a Professor in the Department of Physiology, Calcutta National Medical College, Kolkata and Prof. Dr Bulbul Mukhopadhyay, now employed as Professor, of Physiology, at RGkar Medical… pic.twitter.com/Kn9mQs6ojh
— ANI (@ANI) August 11, 2024
బాధ్యులైన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, వైద్య విద్యార్థులు కొనసాగుతున్న నిరసనల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది.
నాలుగు పేజీల ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో
ఆర్‌జీ కార్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ నాలుగు పేజీల ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఆమె కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలయ్యాయి. ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment