Trainee
-
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్‌ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్‌ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె. చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్ఐసీలో ఉద్యోగం చేసేది.అక్క డిప్రెషన్‌తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష. -
సర్కారు ‘షోకాజ్’ కొరడా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్ బుక్ టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛనూ హరిస్తోంది. హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో ఇప్పటికే రాక్షసానందం పొందుతున్న టీడీపీ– జనసేన– బీజేపీ సర్కారు ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు, అన్యాయంపై ప్రశ్నించే గొంతుకకు తావులేదన్నట్లుగా తన తీరును, భావ దారిద్య్రాన్ని నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఇందుకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ.దేశాన్ని కుదిపేసిన కోల్‌కత ఆర్జీ కార్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైద్యశాఖకు సంబంధించిన 33 మంది మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ)లు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పైఅధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇందులో పాల్గొన్నందుకు డీఎంహెచ్ఓ డాక్టర్ జమాల్ బాషా వీరికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు బాషా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని.. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా అందులో హెచ్చరించారు. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళలే ఉండటం గమనార్హం. నిజానికి.. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సంఘీభావం ప్రకటించి సానుభూతి చూపించాల్సిన ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా చీమకుట్టినట్లు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో రిషితేశ్వరి.. ఇప్పుడు తాజాగా ఈ రెండు నెలల్లో ముచ్చుమర్రి, హోంమంత్రి వంగలపూడి ఇలాకా అనకాపల్లి జిల్లాల్లో బాలికల దారుణ హత్యలపై చలనంలేని మొద్దుబారిన కూటమి సర్కారు.. కోలకత ఘటనపట్ల స్పందించకపోగా అందుకు నిరసన వ్యక్తంచేసిన వారిపై కక్షసాధింపునకు దిగడాన్ని పౌరహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. -
వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్‌మార్టం నివేదిక బలపరుస్తోంది. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచి్చతంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు. ఒళ్లంతా గాయాలే నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో విస్మయకర వివరాలున్నాయి. ‘‘రేప్ చేశాక గొంతు నులిమి చంపారు. పెనుగులాట సందర్భంగా కదలకుండా తలను గోడకు బలంగా అదమడంతో వెనక వైపు పెద్ద గాయమైంది. ముఖమంతా గీసుకుపోయింది. కేకలు వేయకుండా నోరు మూసేశారు. గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్డిలేజ్ చితికిపోయింది. జననాంగాల వద్ద లోతైన గాయమైంది. లైంగికదాడే అందుకు కారణం. నడుము, పెదాలు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలున్నాయి. రెండు కళ్ల నుంచి, నోటి నుంచి రక్తస్రావమైంది. ముక్కు, నోరు గట్టిగా అదిమిపట్టి మూసేసినట్లు చర్మం కమిలింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘కాళ్లు పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి. కటిభాగం వద్ద ‘పెలి్వక్ గార్డిల్’ చీలిపోయింది. అంటే కాళ్లను పూర్తిగా పక్కకు విరిచేశారు’ అని వైద్యురాలి బంధువు ఒకావిడ విలపిస్తూ చెప్పారు. మూడు గంటలు బయటే నిలబెట్టారు మృతదేహాన్ని చూపించకుండా ఆస్పత్రి బయట మూడు గంటలు బయటే నిలబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ‘‘తర్వాత తండ్రిని అనుమతించారు. తన ఒంటిపై బట్టల్లేవు. కాళ్లు పక్కకు విరిచేసినట్లు ఫొటోలోకనిపిస్తోంది. కళ్లద్దాల ముక్కలు కంట్లో ఉన్నాయి. ఊపిరాడకుండా చేసి చంపేశారు’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. -
ట్రైనీ డాక్టర్ హత్య.. నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు!
కోల్‌కతా : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసు సంచలనంగా మారింది. ఆర్జీ కార్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. దీంతో నిందితుల్ని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్లు, విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా.. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సంజయ్ రాయ్ తల్లి మాలతీ రాయ్ మాత్రం ‘నా కొడుకు నిర్ధోషి.పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును చేసినట్లు ఒప్పుకున్నాడని’ అన్నారు.అరెస్ట్ అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు నిందితుడు నివాసం ఉంటున్న ప్రాంతాల్ని, స్థానికులు, బంధువుల్ని ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని, దుష్ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతన్ని విడిచిపెట్టినట్లు తెలిపారు. నాలుగో భార్య గతేడాది క్యాన్సర్‌తో మరణించింది. నిందితుడు తాగిన మత్తులో తరచూ అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడని స్థానికులు చెప్పారు. సూపరింటెండెంట్ తొలగింపు మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్యతో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ని ఆ పదవి నుండి తొలగిస్తూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా ఆసుపత్రికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వశిష్టను తొలగించారు. అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. Prof. Dr Sanjay Vashisth now employed as MSVP, RGkar Medical College to act until further order as a Professor in the Department of Physiology, Calcutta National Medical College, Kolkata and Prof. Dr Bulbul Mukhopadhyay, now employed as Professor, of Physiology, at RGkar Medical… pic.twitter.com/Kn9mQs6ojh— ANI (@ANI) August 11, 2024 బాధ్యులైన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, వైద్య విద్యార్థులు కొనసాగుతున్న నిరసనల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది.నాలుగు పేజీల ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఆర్జీ కార్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ నాలుగు పేజీల ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఆమె కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలయ్యాయి. ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలింది. -
ట్రైనీ డాక్టర్‌పై దారుణం.. అవసరమైతే నిందితులను ఉరితీస్తాం: సీఎం మమతా
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ట్రైయినీ డాక్టర్ హత్యాచారం ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆసుప్రతిలోనే వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడటం, ఆపై హత్య చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.తాజాగా ట్రైయినీ డాక్టర్ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, వైద్యుల నిరసనలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా వారి డిమాండ్లను అంగీకరించారని అన్నారు. అరెస్ట్ చేసిన నిందితులు అసుపత్రిలోనే పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే నిందితులను ఉరితీస్తారని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును వేగంగా విచారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.అయితే నిరసన చేస్తున్న వారికి రాష్ట్ర పరిపాలనపై నమ్మకం లేదని భావిస్తే, వారు మరేదైనా దర్యాప్తు సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. దానితో తనకు ఎలాంటి సమస్యలేదన్నారు. ఈ కేసులో సరైన, సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే డాక్టర్లు తమ నిరసనలను కొనసాగిస్తూనే రోగులకు చికిత్స అందించాలని సూచించారు.కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యకు గురైంది. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో శవమై కనిపించింది. అంతేగాక ఆమెను హత్య చేసే ముందు లైంగికదాడికి పాల్పడినట్లు తాజాగా పోస్టుమార్టంలో తేలింది. బాధితురాలి ముఖం,కుడి చేయి, మెడ, ఎడమకాలు,పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె కళ్లు, నోటి నుంచి, ప్రేవేటు భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు శనివారం వెల్లడించారు.ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాంగా ఈ ఘోరానికి పాల్పడిని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుడు ఆసుపత్రిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా, అతడికి హాస్పిటల్‌లోని పలు విభాగాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉన్నట్లు గుర్తించారు. -
గుడ్ న్యూస్: ప్రముఖ కంపెనీలో భారీగా ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది పైచిలుకు ఇంజినీరింగ్ ట్రెయినీలను తీసుకున్నట్లు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) వెల్లడించింది. వీరిలో తాజా గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రిక్రూట్ చేసుకున్న 1,067 మందితో పోలిస్తే ఈసారి ట్రెయినీల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు వివరించింది. మహిళా ఇంజినీర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 248 నుండి 1,009కి చేరినట్లు ఎల్అండ్టీ తెలిపింది. మొత్తం సిబ్బందిలో ప్రస్తుతం మహిళా ఉద్యోగుల వాటా 7.6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
Indian Navy: ఉమెన్–ఫ్రెండ్లీ ధీర... : అగ్నివీర
శిక్షణ కఠినంగా ఉండాలి. అదే సమయంలో అవసరాలు, సౌకర్యాల విషయంలో కరుణతో వ్యవహరించాలి. కళింగ గడ్డ మీద ఉన్న సువిశాల ‘ఐఎన్ఎస్ చిలికా’ శిక్షణా కేంద్రం ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్ ఉమెన్ ట్రైనీలను దృష్టిలో పెట్టుకొని ‘ఉమెన్–ఫ్రెండ్లీ’ విధానానికి శ్రీకారం చుట్టింది... అగ్నివీర్ చుట్టూ రగిలిన వివాదాల మాట ఎలా ఉన్నా సైన్యంలోని వివిధ విభాగాల్లో పని చేయాలనే ఆసక్తి, ఉత్సాహాన్ని ఆ వివాదాలు అంతగా ప్రభావితం చేయలేకపోయాయి. నేవీలో 3,000 ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీలోకి దిగారు. వీరిలో 82,000 మంది మహిళలు ఉన్నారు. భువనేశ్వర్‌కు సమీపంలోని ప్రసిద్ధ ‘ఐఎన్ఎస్ చిలికా’ శిక్షణా కేంద్రంలోకి నేవి అగ్నివీర్ ఫస్ట్ ఉమెన్ బ్యాచ్‌కు చెందిన 600 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. దాంతో మహిళా శిక్షణార్థుల అవసరాలు, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఐఎన్ఎస్. సువిశాలమైన ఐఎన్ఎస్ శిక్షణాకేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకమైన గదులు, డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని టాయిలెట్లను నిర్మిస్తున్నారు. శానిటరీ పాడ్ వెండింగ్, డిస్పోజల్ యంత్రాలను, సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. వర్కర్స్, స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా మహిళలనే నియమిస్తారు. ఉమెన్ ఆఫీసర్స్ ట్రైనీలకు సంబంధించి శిక్షణపరమైన పర్యవేక్షణ బాధ్యతలతో పాటు వారి వ్యక్తిగత ఇబ్బందులు, అసౌకర్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తారు. ‘ప్రైవసీతో సహా మహిళా శిక్షణార్థులకు సంబంధించి రకరకాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన మార్పులు చేయనున్నాం’ అంటున్నారు నేవీ ఉన్నతాధికారి ఎం.ఏ.హంపిహోలి. స్త్రీ, పురుషులకు సంబంధించి ట్రైనింగ్ కరికులమ్‌లో తేడా అనేది లేకపోయినా తప్పనిసరి అనిపించే ఫిజికల్ స్టాండర్డ్స్‌లో తేడాలు ఉంటాయి. అగ్నిపథ్ తొలిదశలో పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంక్(పిబివోఆర్) క్యాడర్లో మహిళలను రిక్రూట్ చేస్తున్న తొలి విభాగం నేవి. ‘సెయిలర్స్’గా మహిళలకు తొలిసారిగా అవకాశం కల్పించడం ఒక చారిత్రక అడుగు. ‘భవిష్యత్ అవసరాలు, స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని నావికాదళం ప్రగతిశీలమైన అడుగులు వేస్తుంది’ అంటుంది కమాండర్ గౌరీ మిశ్రా. కొన్ని నెలలు వెనక్కి వెళితే... నేవీకి చెందిన ఆల్–ఉమెన్ టీమ్ ‘నావిక సాగర్ పరిక్రమ’ పేరుతో ప్రపంచ నౌకాయాత్ర చేసి చరిత్ర సృష్టించింది. ‘ఇది మా వ్యక్తిగత సంతోషానికి, సాహసానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు... ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చి సాహసంతో ముందుకు నడిపే చారిత్రక విజయం’ అన్నారు ‘నావిక సాగర్ పరిక్రమ’లో భాగం అయిన అయిదు మంది మహిళా అధికారులు. కొన్ని రోజులు వెనక్కి వెళితే... ఉత్తర అరేబియా సముద్రంలో సర్వైవలెన్స్ మిషన్‌లో భాగం అయిన ‘ఆల్–ఉమెన్ క్రూ’ మరో సంచలనం. తాజా విషయానికి వస్తే... భవిష్యత్ పనితీరుకు శిక్షణ సమయం పునాదిలాంటిది. అది గట్టిగా ఉండాలంటే సౌకర్యాలు, అవసరాల విషయంలో తగిన శ్రద్ధ చూపాలి. ఇప్పుడు మహిళా ట్రైనీల విషయంలో ‘ఐన్ఎన్ఎస్ చిలికా’ చేస్తున్నది అదే. -
Aircraft Crashes: కుప్పకూలిన ఆర్మీ ట్రైనర్ హెలికాప్టర్
న్యూఢిల్లీ: ఆర్మీ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్‌కు గురవటం కలకలంగా మారింది. ఈ ప్రమాదం బిహార్‌లోని బోధ్ గయా బ్లాక్‌లో చోటు చేసుకుంది. కాగా, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్.. ట్రైనింగ్‌లో భాగంగా ఇద్దరు ట్రైనీలకు ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ నిస్తుంది. దీనిలో భాగంగా వీరు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ గయా సమీపంలో కుప్పకూలింది. ట్రైనీ ఉద్యోగులు.. హెలికాప్టర్ టెకాఫ్‌కు ప్రయత్నించిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో.. హెలికాప్టర్ అక్కడే ఉన్న పొలాల్లో దూసుకుపోయిందని సీనియర్ అధికారి తెలిపారు. కాగా, హెలికాప్టర్ కిందపడటాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే సంఘటన స్థలానికి పరుగున వెళ్లి చేరుకున్నారు. హెలికాప్టర్ చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రైనీలకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని ఆర్మీ సిబ్బంది తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు గల కారణాలపై విచారణ చేపట్టామని తెలిపారు. #WATCH | An aircraft of the Indian Army’s Officers’ Training Academy in Gaya, Bihar today crashed soon after taking off during training. Both the pilots in the aircraft are safe. Video source: Local village population pic.twitter.com/gauLWCrfxN — ANI (@ANI) January 28, 2022 చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’ -
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్,కంప్యూటర్ సైన్స్(ఐటీ). ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► స్టయిపండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021 ► వెబ్సైట్: hpclcareers.com -
ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపులు: ఎస్సై సస్పెండ్..
వరంగల్: వరంగల్ కమిషనరేట్ పరిధిలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా అర్బన్ ఎస్సై శ్రీనివాసరెడ్డి.. తనను లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఎస్సై పోలిస్ కమిషనర్ తరుణ్‌జోషికి ఫిర్యాదు చేసింది. ఎస్సై ట్రైనింగ్పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కన్నీటి పర్యంతమయ్యింది. కాగా, ప్రజలను కాపాడాల్సిన అధికారిపైనే.. ఫిర్యాదు రావడంతో పోలీస్ ఉన్నతా అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందించి పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఎస్సై శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీ నాగిరెడ్డి తాజాగా ఉత్తర్వులను జారీచేశారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎన్ఎండీసీలో జాబ్స్; 304 ఖాళీలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 304 » పోస్టుల వివరాలు: ఫీల్డ్ అటెండెంట్(ట్రెయినీ)–65, మెయింటెనెన్స్ అసిస్టెంట్ (మెకానికల్)(ట్రెయినీ)–148, మెయింటెనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)(ట్రెయినీ)–81, బ్లాస్టర్ గ్రేడ్–2(ట్రెయినీ)–01, ఎంసీఓ గ్రేడ్–3(ట్రెయినీ)–09. » ఫీల్డ్ అటెండెంట్(ట్రెయినీ): బీఐఓఎల్ కిరండల్ కాంప్లెక్స్–35, బీఐఓఎల్ బచేలీ కాంప్లెక్స్–30. అర్హత: మిడిల్ పాస్/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » మెయింటెనెన్స్ అసిస్టెంట్(మెకానికల్) (ట్రెయినీ): బీఐఓఎల్ కిరండల్ కాంప్లెక్స్ –76, బీఐఓఎల్ బచేలీ కాంప్లెక్స్–72. అర్హత: వెల్డింగ్/ఫిట్టర్/మెషినిస్ట్/మోటార్ మెకానిక్/డీజిల్ మెకానిక్/ఆటో ఎలక్ట్రీషియన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » మెయింటెనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)(ట్రెయినీ): బీఐఓఎల్ కిరండల్ కాంప్లెక్స్ –49,బీఐఓఎల్ బచేలీ కాంప్లెక్స్–32. అర్హత: ఎలక్ట్రికల్ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » బ్లాస్టర్ గ్రేడ్–2(ట్రెయినీ): అర్హత: బ్లాస్టర్ ట్రేడులో మెట్రిక్/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. మైనింగ్ మేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. బ్లాస్టింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. » ఎంసీఓ గ్రేడ్–3(ట్రెయినీ): అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. » వయసు: 15.04.2021 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి రాతపరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగా.. మిగిలిన పోస్టులకి రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. » పరీక్షా విధానం: ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ 70 మార్కులు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. మిగతా పోస్టులకి 130 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్(సంబంధిత ట్రేడు) 30 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 70 మార్కులు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును పోస్ట్ బాక్స్ నెం.1383, పోస్ట్ ఆఫీస్, హుమాయూన్ నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, పిన్–500028 చిరునామాకు పంపించాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021 » దరఖాస్తు హార్ట్కాపీలను పంపడానికి చివరి తేది: 15.04.2021 » వెబ్సైట్: https://www.nmdc.co.in/Careers/Default.aspx ఎన్ఎండీసీలో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు -
ఎన్ఎండీసీలో జాబ్స్; నోటిఫికేషన్ విడుదల
భారత ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ), హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ).. ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 63 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఎండీసీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎండీసీ).. ఇనుప ఖనిజం, రాగి, రాక్ఫాస్పెట్, సున్నపురాయి, డోల్మైట్, జిప్సం, మాగ్నసైట్, డైమండ్ వంటి ఖనిజాల అన్వేషణ చేస్తోంది. ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి, ఎగుమతి చేయడంలో ఎన్ఎండీసీ దేశంలోనే అగ్రగామీ సంస్థ. అంతేకాకుండా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో ఎన్ఎండీసీ 3.0 ఎమ్‌టీపీఏ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఎప్పటిప్పుడు మానవ వనరుల అవసరాలకు అనుగుణంగా ఖాళీల ను భర్తీచేసే ఎన్ఎండీసీ.. తాజాగా జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టుల వివరాలు జూనియర్ ఆఫీసర్(మైనింగ్) ట్రైనీ–28 : » విద్యార్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్ మోటాలిఫెరస్ మైన్‌కు సంబంధించిన ఫోర్మెన్స్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. లేదా మైనింగ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్ మోటాలిఫెరస్ మైన్‌కు సంబంధించిన మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్‌ను పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఆఫీసర్ (మెకానికల్ ) ట్రైనీ –17 » విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)ట్రైనీ –13 : » విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్ట్రికల్ సూపర్వైజరీ సర్టిఫికేట్(మైనింగ్)/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఆఫీసర్(సివిల్) ట్రైనీ–05 : » విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల/సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. » వయసు: 32ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు–05ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్టంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్‌ను ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ పద్దతిలో మొత్తం100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని సూపర్వైజరీ టెస్ట్‌కు పిలుస్తారు. ఈ పరీక్ష కూడా 100 మార్కులకు ఉంటుంది. సూపర్వైజరీ టెస్ట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా రూపొందించి.. నియామకం ఖరారు చేస్తారు. ముఖ్యమైన సమాచారం » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. » దరఖాస్తు చివరి తేదీ : 23.03.2021 » వెబ్సైట్ : https://www.nmdc.co.in/Careers/Default.aspx హెచ్‌పీసీఎల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి -
ట్రైనీ ఐఏఎస్‌లతో సీఎం సమావేశం
-
నగ్నంగా నిల్చోబెట్టి వైద్య పరీక్షలు
సూరత్: ‘పీరియడ్స్’లో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు కాలేజ్ హాస్టల్లో వారి లోదుస్తులను విప్పించిన అమానవీయ ఘటన మరవకముందే.. అదే రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)లోని ట్రైనీ మహిళా క్లర్క్‌లను అందరినీ ఒకే చోట నగ్నంగా నిల్చోబెట్టి అవమానించారు. దీనిపై శుక్రవారం సూరత్ మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్‌లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది మహిళలు, నిబంధనల్లో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి గైనకాలజీ విభాగంలో వైద్యులు, సిబ్బంది వారిని ఒకే గదిలో వివస్త్రలుగా నిల్చోబెట్టి పరీక్షించారు. అవివాహితులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిని అభ్యంతరకర ప్రశ్నలతో అవమానించారు. ఈ ఘటన ‘సూరత్ మున్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో గురువారం జరిగింది. దీనిపై వారు సూరత్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో, విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషనర్ కమిటీని నియమించారు. ట్రైనీ క్లర్క్‌లపై జరిగిన ఈ అమానవీయ ఘటన∙విమర్శలకు కారణమైంది. శిక్షణ అనంతరం విధులను నిర్వర్తించేందుకు అవసరమైన శారీరక సామర్ధ్యం వారికి ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఎస్ఎంసీలో క్లర్క్‌లుగా ఎంపికైనవారికి తప్పని సరిగా చేస్తారు. అయితే, వైద్య పరీక్షలకు తాము వ్యతిరేకం కాదని, కానీ పరీక్షలు జరిపిన తీరే అభ్యంతరకరంగా ఉందని ఎస్ఎంసీ ఉద్యోగ సంఘం విమర్శించింది. ప్రతీ మహిళకు ప్రత్యేకంగా, ఒంటరిగా పరీక్షలు జరపడం పద్ధతి. అక్కడి డాక్లర్లు అభ్యంతరకర రీతిలో గర్భధారణపై ప్రశ్నలు అడిగారని సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పారు. -
కూడెడ్తావనుకుంటే.. కాటికెళ్లావా..
– ట్రైనీ ఎస్ఐ కిరణ్ ఆత్మహత్యతో మిర్యాలగూడలో విషాదం – మిన్నంటిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు – ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్న ఎస్పీ ‘‘కోరుకున్న ఉద్యోగానికి అర్హత సాధించానని సంబరపడ్డావు.. ఇక కష్టాలన్నీ తీరాయంటివి.. అమ్మా బాగా చూసుకుంటానని చెబితివి.. ముసలితనానికి ఇంత ముద్ద పెడతావనుకుంటే.. నువ్వే కాటికెళ్లావా కొడుకా’’ అంటూ ఆ తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోస్టింగ్ ఇవ్వలేదని మనస్తాపంతో తమ్మడబోయిన కిరణ్ బలవన్మరణానికి పాల్పడడంతో మిర్యాలగూడ పట్టణంలో విషాదం అలుముకుంది. అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. – మిర్యాలగూడ, మిర్యాలగూడ అర్బన్ మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన మణెమ్మకు అర్జున్, కిరణ్ ఇద్దరు కుమారులు. భర్త చనిపోవడంతో కష్టపడి పిల్లలను పెంచింది. చిన్నతనం నుంచి రవి చదువులో బాగా రాణించేవాడని, కష్టపడి ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తానని చెబుతుండేవాడని స్థానికులు పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా.. కిరణ్ మొదట్లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూనే రైల్వే ఎస్ఐగా ఉద్యోగం సాధించాడు.ఆ శిక్షణ పొందుతున్న సమయంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. దాంతో రైల్వే ఎస్ఐగా శిక్షణను వదులుకుని సివిల్ ఎస్ఐ శిక్షణకు వెళ్లాడు. శిక్షణ పూర్తి కాగానే ఎస్ఐగా పోస్టింగ్ వస్తుందని భావించాడు. అంతే కాకుండా ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. సివిల్ ఎస్ఐ శిక్షణలో ఉన్న సమయంలో ఏడాదిన్నర క్రితం సూర్యాపేటకు చెందిన కల్యాణితో వివాహం జరిగింది. కిరణ్ భార్య కళ్యాణి డెలివరీ కోసం వెళ్లి బాబు పుట్టిన తర్వాత ఐదు నెలలుగా అక్కడే ఉంది. కన్నీరుమున్నీరవుతున్న బంధువులు, స్నేహితులు: కిరణ్ మృతి వార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు రవీంద్రనగర్‌కు చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.సూర్యాపేటలో ఉన్న భార్య కళ్యాణి తన ఐదు నెలల బాలుడిని తీసుకుని మిర్యాలగూడకు చేరుకుంది. ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని సందర్శించారు. రూరల్ సీఐ రవీందర్, ఎస్ఐ సర్ధార్‌నాయక్, వన్‌టౌన్ ఎస్ఐ విజయ్‌కుమార్ వచ్చి కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి సోదరుడు తమ్మడబోయిన అర్జున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ రవీందర్ తెలిపారు. -
విహార యాత్రలో విషాదం
జీపు బోల్తాపడి ఒకరి మృతి కూనవరం : విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి పాపికొండల విహారయాత్రకు బయలుదేరగా, మార్గంమధ్యలో ఒకరిని మృత్యువు కబళించింది. స్థానిక పొట్లవాయిగూడెం సమీపంలో కల్వర్టు వద్ద మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టె¯Œæ్త బ్యాచ్‌కు చెందిన మొత్తం 9 మంది స్నేహితులు కలిసి మంగళవారం ఉదయం భద్రాచలంలో రామాలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి పాపికొండలు పర్యాటక ప్రదేశాలను తిలకించి, తిరుగుపయనమయ్యారు. వీరి వాహనం పొట్లవాయిగూడెం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన ఆజ్మీర శివశర్మ(24) అక్కడికక్కడే మరణించగా, జాదవ్ చైతన్యకు చేయి విరిగింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. ఉట్నూరుకు చెందిన జాదవ్ చైతన్య గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. మృతుడు శివశర్మ ఎస్సై సెలెక్ష¯Œæలో ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణుడైనట్టు తెలిసింది. స్నేహితుల్లో ఏడుగురిది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గ్రామానికి చెందినవారు కాగా, ఒకరు టేకులపల్లి, మరొకరు భద్రాచలం ఐటీడీఏ ప్రాంతానికి చెందినవారు. వీరు హైదరాబాద్‌లో ఉన్నత విద్యను చదువుతున్నారు. టేకులపల్లిలో స్నేహితుడి చెల్లెలు శుభకార్యం కోసం వీరు వచ్చారు. సీఐ వీరయ్యగౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై రాజేష్కుమర్ దర్యాప్తు చేస్తున్నారు. -
ఖిల్లాను సందర్శించిన ఐఆర్ఎస్ బృందం
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి ఖిల్లాను శనివారం ట్రైనీ ఐఆర్ఎస్ బృందం సందర్శించింది. 35 మంది సభ్యులతో కూడిన బృందం నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఆర్కెటిక్స్ విభాగం మర్రిచెన్నారెడ్డి భవనం హైదరాబాద్ నుంచి భువనగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బృందంలోని పలువురు రాక్‌క్లైంబింగ్ చేశారు. -
ఆసుపత్రిలో ట్రైనీ నర్స్పై అత్యాచార యత్నం
-
పోలీస్ శిక్షణలో మిస్సింగ్!
గరివిడి, న్యూస్‌లైన్: ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికై ఐదవ బెటాలియన్ చింతలవలసలో శిక్షణ పొందుతున్న తన కుమారుడు గేదెల బాలబాబు ఈ నెల 3వ తేదీ నుంచి కనిపిండడం లేదని అతని తల్లి వాపోతోంది. ఈ సంఘటనపై గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన గేదెల సావిత్రమ్మ తన కుమారుడి ఫొటోతో సహా పత్రికలకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 3న బెటాలియన్‌కు చెందిన కొంతమంది కానిస్టేబుళ్లు కోడూరులోని తమ ఇంటికి వచ్చి మీ అబ్బాయి బాలబాబు ఇంటికి వచ్చాడా? అని అడిగారని ఆమె పేర్కొన్నారు. దీనిపై కంగారు పడి 4వ తేదీన చింతలవలస బెటాలియన్‌కు వెళ్లి అక్కడి ఎస్ఐని తమ అబ్బాయి ఏమయ్యాడని అడిగానని తెలిపారు. తమ అబ్బాయి బాలబాబుకి జ్వరం రావడంతో గౌరీశంకర్ అనే కానిస్టేబుల్‌ను ఎస్కార్ట్‌గా ఇచ్చి తిరుమల ఆస్పత్రికి పంపించామని తిరిగి మీ అబ్బాయి బెటాలియన్‌కు రాలేదని ఎస్ఐ సమాధానం ఇచ్చారన్నారు. దీనిపై బెటాలియన్ డీఎస్పీకి ఫిర్యాదు చేయగా బాలబాబును వెతుకుతున్నామని ఆచూకీ తెలిసిన వెంటనే సమాచారం ఇస్తామని ఆయన చెబుతున్నారని సావిత్రమ్మ వాపోయారు. తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలని పోలీస్ అధికారులను ఆమె వేడుకుంటున్నారు.