జననాంగంలో భారీ పరిమాణంలో వీర్యం
కాళ్లు విరిచేశారన్న పోస్ట్‌మార్టం నివేదిక
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్‌మార్టం నివేదిక బలపరుస్తోంది.
మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచి్చతంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు.
ఒళ్లంతా గాయాలే
నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో విస్మయకర వివరాలున్నాయి. ‘‘రేప్ చేశాక గొంతు నులిమి చంపారు. పెనుగులాట సందర్భంగా కదలకుండా తలను గోడకు బలంగా అదమడంతో వెనక వైపు పెద్ద గాయమైంది. ముఖమంతా గీసుకుపోయింది. కేకలు వేయకుండా నోరు మూసేశారు. గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్డిలేజ్ చితికిపోయింది. జననాంగాల వద్ద లోతైన గాయమైంది. లైంగికదాడే అందుకు కారణం. నడుము, పెదాలు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలున్నాయి. రెండు కళ్ల నుంచి, నోటి నుంచి రక్తస్రావమైంది. ముక్కు, నోరు గట్టిగా అదిమిపట్టి మూసేసినట్లు చర్మం కమిలింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘కాళ్లు పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి. కటిభాగం వద్ద ‘పెలి్వక్ గార్డిల్’ చీలిపోయింది. అంటే కాళ్లను పూర్తిగా పక్కకు విరిచేశారు’ అని వైద్యురాలి బంధువు ఒకావిడ విలపిస్తూ చెప్పారు.
మూడు గంటలు బయటే నిలబెట్టారు
మృతదేహాన్ని చూపించకుండా ఆస్పత్రి బయట మూడు గంటలు బయటే నిలబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ‘‘తర్వాత తండ్రిని అనుమతించారు. తన ఒంటిపై బట్టల్లేవు. కాళ్లు పక్కకు విరిచేసినట్లు ఫొటోలోకనిపిస్తోంది. కళ్లద్దాల ముక్కలు కంట్లో ఉన్నాయి. ఊపిరాడకుండా చేసి చంపేశారు’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment