Semen
-
వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్‌మార్టం నివేదిక బలపరుస్తోంది. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచి్చతంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు. ఒళ్లంతా గాయాలే నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో విస్మయకర వివరాలున్నాయి. ‘‘రేప్ చేశాక గొంతు నులిమి చంపారు. పెనుగులాట సందర్భంగా కదలకుండా తలను గోడకు బలంగా అదమడంతో వెనక వైపు పెద్ద గాయమైంది. ముఖమంతా గీసుకుపోయింది. కేకలు వేయకుండా నోరు మూసేశారు. గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్డిలేజ్ చితికిపోయింది. జననాంగాల వద్ద లోతైన గాయమైంది. లైంగికదాడే అందుకు కారణం. నడుము, పెదాలు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలున్నాయి. రెండు కళ్ల నుంచి, నోటి నుంచి రక్తస్రావమైంది. ముక్కు, నోరు గట్టిగా అదిమిపట్టి మూసేసినట్లు చర్మం కమిలింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘కాళ్లు పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి. కటిభాగం వద్ద ‘పెలి్వక్ గార్డిల్’ చీలిపోయింది. అంటే కాళ్లను పూర్తిగా పక్కకు విరిచేశారు’ అని వైద్యురాలి బంధువు ఒకావిడ విలపిస్తూ చెప్పారు. మూడు గంటలు బయటే నిలబెట్టారు మృతదేహాన్ని చూపించకుండా ఆస్పత్రి బయట మూడు గంటలు బయటే నిలబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ‘‘తర్వాత తండ్రిని అనుమతించారు. తన ఒంటిపై బట్టల్లేవు. కాళ్లు పక్కకు విరిచేసినట్లు ఫొటోలోకనిపిస్తోంది. కళ్లద్దాల ముక్కలు కంట్లో ఉన్నాయి. ఊపిరాడకుండా చేసి చంపేశారు’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. -
హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం
అమెరికాకు చెందిన ఒక గమ్మత్తయిన వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలోని రిట్జ్-కార్ల్టన్ హోటల్లో పనిచేసే ఓ ఉద్యోగి అదే హోటల్లో బస చేసేందుకు వచ్చిన ఒక మహిళకు వీర్యం కలిపిన నీటిని ఇచ్చాడు. ఆమె ఆ నీటిని తాగినప్పుడు, ఆ రుచి కొత్తగా అనిపించింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె ఆ హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఆ నీటికి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా, అందులో వీర్యం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ, ఆమె భర్త సదరు హోటల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితునిపై తక్షణంచర్యలు చేపట్టి, హోటల్ యాజమాన్యం నుంచి తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరుతోంది. జేన్, జాన్ డో దంపతులు తమ కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడానికి ఒక హోటల్‌కి వెళ్లారు. రిట్జ్-కార్ల్టన్ హోటల్లో తనకు ఫైవ్ స్టార్ హోటల్ తరహా స్వాగతం లభించిందని జేన్ తెలిపింది. అనంతరం హోటల్ ఫ్రంట్ డెస్క్ నుంచి ఆమె వాటర్ బాటిల్ ఆర్డర్ చేసింది. దీంతో ఒక మగ ఉద్యోగి ఐదు వాటర్ బాటిళ్లను వారి గదిలోకి తెచ్చి, వారికి ఇచ్చి వెళ్లిపోయాడు. తరువాత వారంతా నిద్రపోయారు. అర్ధరాత్రి దాహం వేయడంతో ఆమె ఆ బాటిల్లోని నీటిని తాగింది. అయితే ఈ నీటి రుచి కొత్తగా అనిపించడంతో ఆమె భర్తను నిద్ర నుంచి లేపి, విషయం చెప్పింది. దీంతో వారు ఈ విషయమై ముందుగా హోటల్ యాజమాన్యానికి, తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ హోటల్ ఉద్యోగి ఇచ్చిన నీటిని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. ఈ నీటిలో వీర్యం కలిసిందని నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ మహిళ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ అకృత్యానికి పాల్పడిన హోటల్ ఉద్యోగిపై ఇంకా చర్యలు తీసుకోలేదని, అతనికి త్వరగా శిక్ష పడకపోతే ఇలాంటి పనులను కొనసాగిస్తాడని అన్నారు. ఇది కూడా చదవండి: కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది! -
వీర్యం తారుమారు చేసినందుకు రూ.1.5 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించడమే ఇందుకు కారణం. అసిస్టెట్ రిప్రొడక్టివ్ టెక్నిక్(ఏఆర్టీ) విధానంలో సంతానం కోసం దంపతులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత 2009 జూన్‌లో వారికి కవలలు జని్మంచారు. శిశువులకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా, వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్లు స్పష్టమయ్యింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ దర్యాప్తు వారికి అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్ఏ ప్రొఫైల్‌ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. -
మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!
ఆవులు, గేదెల్లో ఏ దూడలు కావాలని కోరుకుంటారు... సహజంగా ఎవరైనా పెయ్య దూడలు (ఆడ) కావాలని ఆకాంక్షిస్తారు. కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తున్నా.. పుట్టేది ఆడదూడా.. మగదూడా అనేది తెలియని పరిస్థితి. ఇక నుంచి పాడి అభివృద్ధికి ఆడదూడలే పుట్టించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లింగ నిర్ధారణ వీర్యం (సార్టెడ్ సెక్స్ సెమన్) ద్వారా 95 శాతం పెయ్య దూడలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. కర్నూలు (అగ్రికల్చర్): పెయ్య దూడల జననం ద్వారా పాల దిగుబడిని, రైతు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. లింగనిర్ధారణ వీర్యం సాంకేతికతను కృత్రిమ గర్భధారణ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం, పాడి పరిశ్రమను మరింత అభివృద్ది చేసేందుకు దోహదపడుతోంది. నేడు విద్యావంతులైన నిరుద్యోగులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది జిల్లాలో 5,000 పశువులకు లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూది వేసి పెయ్య దూడలు అభివృద్ధి చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని రైతుల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. సబ్సిడీపై కృత్రిమ గర్భధారణ వీర్యం లింగనిర్ధారణ వీర్యాన్ని పూణే, అహమ్మదాబాద్ల్లోని వెటర్నరీ రీసెర్చ్ కేంద్రాల్లో అధిక పాలసార ఉన్న ఆంబోతుల నుంచి సేకరించారు. ఆడదూడలే పుట్టే విధంగా లింగనిర్ధారణ వీర్యాన్ని వృద్ధి చేశారు. రెండేళ్ల క్రితం జెర్సీ, హెచ్ఎఫ్ ఆవుల్లో ఈ ప్రయోగం చేశారు. 200 ఆవులకు ఇటువంటి వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయగా 52 దూడలు పుట్టాయి. ఇందులో 47 పెయ్యదూడలు ఉండటం విశేషం. తాజాగా మరింత సాంకేతికతతో అభివృద్ధి చేసిన లింగనిర్ధారణ వీర్యంతో ముర్రా గేదెలతో పాటు జెర్సీ, ఆవు జాతులైన గిర్, సాహివాల్, హెచ్ఎఫ్ ఆవులకు కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తారు. ఒక డోసు పూర్తి ధర రూ.700 ఉండగా... కేంద్రం రూ.450 సబ్సిడీ ఇస్తుంది. రైతు రూ.250 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5,000 పశువులకు సార్టెడ్ సెక్స్ సెమన్ ద్వారా సూదులు వేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. 95 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం లింగనిర్ధారణ వీర్యం ద్వారా 95 శాతంపైగా పెయ్యదూడలే పుట్టే అవకాశం ఉంది. ఒక ఆవు లేదా గేదెకు మూడు డోసుల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆవులు, గేదెలు ఎదకు రావడాన్ని గుర్తించి ఈ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఎదకు వచ్చిన 12 గంటల నుంచి 24 గంటలలోపు సూదులు వేయించాల్సి ఉంది. మొదటి డోసు వేసినపుడు చూడికట్టకపోతే రెండవసారి వేయంచవచ్చు. అపుడు కూడా చూడికట్టకపోతే మూడవ డోసు వేయించవచ్చు. ప్రతి డోసుకు రైతు సబ్సిడీ పోను రూ.250 చెల్లించాల్సి ఉంది. మూడు డోసులు వేసినా చూడికట్టకపోతే రూ.500 రైతుకు వెనక్కి ఇస్తారు. మూడు డోసుల సార్టెడ్ సెక్స్ సెమన్‌తో కృత్రిమ గర్భధారణ చేసినా మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు. ఈ సెమన్ ప్రధాన లక్ష్యం పెయ్యదూడల అభివృద్ధి. ఈ కార్యక్రమాన్ని గోపాలమిత్రలు అమలు చేస్తారు. సార్టెడ్ సెక్స్ సెమన్‌తో సూది వేస్తే రూ.100 ప్రోత్సాహకం ఇస్తారు. మొదటి డోసుతోనే చూడి కడితే రూ.150, రెండవ డోసుతో చూడి కడితే రూ.100 ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం లింగనిర్ధారణ వీర్యంతో ఒంగోలు జాతి మినహా మిగిలిన అన్ని ఆవు, గేదె జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. దీని ద్వారా 90 నుంచి 95 శాతం వరకు ఆడదూడలే పుట్టే అవకాశం ఉంది. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోంది. – రాజశేఖర్, కార్యనిర్వహణాధికారి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, కర్నూలు -
FSBS: వీర్యోత్పత్తిలో ఘన కీర్తి బనవాసి
ఎమ్మిగనూరు రూరల్: నాణ్యమైన పశు వీర్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది కర్నూలు జిల్లాలోని బనవాసి ఘనీకృత వీర్యోత్పత్తి కేంద్రం. మన రాష్ట్రంలో నంద్యాల, విశాఖపట్నం, బనవాసిలలో, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో ఘనీకృత పశు వీర్యోత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో బనవాసి కేంద్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏటా లక్షల డోసుల నాణ్యమైన పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడంతోపాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. దశాబ్దాలుగా మేలు జాతి పశు సంతతి అభివృద్ధికి ఈ కేంద్రం దోహదపడుతోంది. దీంతోపాటు గొర్రెలు–మేకల పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. త్వరలో యంగ్ బుల్ (ఒంగోలు జాతి ఎద్దులు) పెంపక కేంద్రం ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఐఎస్వో గుర్తింపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి ఫారంలో 1986వ సంవత్సరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 8.98 ఎకరాల్లో ఈ కేంద్రం విస్తరించి ఉంది. మేలు జాతి ఆబోతుల నుంచి నాణ్యత గల వీర్యాన్ని ఉత్పత్తి చేయటం, తద్వారా అధిక పాల దిగుబడినిచ్చే పశు సంతతిని అభివృద్ధి చేయటం, కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా నాణ్యమైన దూడలను ఉత్పత్తి చేయటం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం. బనవాసి ఆబోతు వీర్య కేంద్రానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ 2010 అక్టోబర్‌లో ఐఎస్వో సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అలాగే, 2020 మార్చిలో గ్రేడింగ్ చేయటానికి వచ్చిన కేంద్ర బృందం ఈ కేంద్రానికి ‘ఏ’ గ్రేడ్ ఇచ్చింది. మేలు జాతి పశు సేకరణ మొదలు పర్యవేక్షణ, వీర్య ఉత్పత్తి, వీర్యాన్ని భద్రపరచటం, సరఫరా చేయటం వంటి ప్రతి అంశం ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతుంది. ప్రత్యేక పర్యవేక్షణ బనవాసి వీర్యోత్పత్తి కేంద్రంలో ప్రధానంగా పశువుల వ్యాధి నిరోధకతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ పశువుల ఆరోగ్య పరిరక్షణను అనుభవజ్ఞులైన వైద్యాధికారులు, వీర్య సేకరణ పరీక్షలను నిపుణులైన శాస్త్రవేత్తలు చేపడుతున్నారు. ఆబోతులకు నాణ్యమైన దాణా సరఫరా చేయటం, క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయటం, గొంతు వాపు, గాలికుంటు వ్యాధి, తెలిరియస్, అంత్రాక్స్ వంటి వ్యాధులను నిర్ధారించేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించటం చేస్తుంటారు. వ్యాధి నిర్ధారణ కోసం రక్త నమునాలు, పేడ, మూత్రంను బెంగళూరులోని ఎస్ఆర్డీడీఎల్ ల్యాబ్‌కు పంపుతారు. అదే విధంగా రాష్ట్రంలోని వీబీఆర్ఐ–హైదరాబాద్, ఏడీడీఎల్–కర్నూల్ వారికి పంపి వ్యాధి నిర్ధారణ, పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. వీర్యోత్పత్తి – సరఫరా బనవాసి ఆబోతు వీర్య కేంద్రంలో నెలకు సరాసరి లక్షన్నర నుంచి రెండు లక్షల డోసుల వరకు నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. 2018–2019లో 21,59,442 వీర్యాన్ని ఉత్పత్తి చేయగా 20,44,098 డోసులను పంపిణీ చేశారు. 2019–2020లో 17,61,951 డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తే, 13,61,985 డోసులను పంపిణీ చేశారు. 2020–2021 (నవంబర్ వరకు)లో 14,48,713 డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేయగా, 13,28,803 లక్షల డోసులను పంపిణీ చేశారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి చేసిన వీర్యాన్ని గతంలో మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. కరోనా నేపథ్యంలో ఏడాది నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాలకు మాత్రమే వీర్యాన్ని సరఫరా చేస్తున్నారు. 87 రకాల పశువులు మేలి రకం జాతి సంతతి పశువులను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రంలో కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ జాతులకు చెందిన 87 రకాల పశువులు ఉన్నాయి. ఇందులో ముర్రా జాతి సంతతికి చెందిన 39 రకాలు, జెర్సీ జాతి రకాలు 12, హోల్స్టీమ్ ఫ్రీషిమన్ జాతి (హెచ్ఎఫ్) 9, క్రాస్ బీడ్ జెర్సీ జాతి (సీబీజేవై) 14, సీబీహెచ్ఎఫ్ రకాలు 7, జీఐఆర్ రకం 2, సహివాల్ రకం 1, మేహసన 3 చొప్పున మొత్తం 87 రకాల పశువులు ఇక్కడ ఉన్నాయి. మేలి రకం పశుగ్రాసం సాగు బనవాసి కేంద్రంలో వినియోగించే పశుగ్రాసం సాగుకు 400 ఎకరాల అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం 210 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. ప్రధానంగా మొక్కజొన్న, జొన్నతోపాటు సూపర్ నేపియర్, పారాగడ్డి వంటి నాణ్యమైన పశుగ్రాసాలను పండిస్తున్నారు. మంచి డిమాండ్.. దేశంలో బనవాసి ఘనీకృత ఆబోతు వీర్య కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న వీర్యానికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. మేలు జాతి పశువుల అభివృద్ధి, ఆబోతుల పరిరక్షణకు ప్రత్యేక పద్ధతులు పాటిస్తూ లక్ష్యాన్ని సాధిస్తున్నాం. – డిప్యూటీ డైరెక్టర్, బనవాసి ఆబోతు కేంద్రం -
కోవిడ్ కాలం.. అంకురం కోసం...
భర్త ప్రాణం తీసుకెళుతున్న యుముణ్ణి సంతాన వరం కోరి భర్తను కాపాడుకుని పురాణాల్లో నిలిచింది సావిత్రి. ఇప్పుడు వడోదరాలో ఇద్దరు స్త్రీలు ఈ కారణం చేతనే అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. కోవిడ్ వల్ల భర్త మరణించగా ముందే నిల్వ చేసిన అతని వీర్యంతో ఒక భార్య తల్లి కావాలనుకుంటూ ఉంటే కోవిడ్ వల్ల చావు అంచుల్లో ఉన్న భర్త వీర్యాన్ని హైకోర్టుకు వెళ్లి మరీ సేకరించి తల్లి కావాలని నిర్ణయించుకుంది మరో భార్య. మాతృత్వ భావన, సహచరుడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమ ఈ స్త్రీలను నేటి సావిత్రులుగా మార్చింది. వివాహం అయ్యాక భార్యాభర్తలు ఎన్ని ఊసులాడుకుంటారో ఎవరికి తెలుసు? పుట్టబోయే సంతానం గురించి ఎన్ని కలలు కంటారో ఎవరికి తెలుసు? పరస్పరం ఎంత అనురాగం పంచుకుంటారో ఎవరికి తెలుసు? వైవాహిక జీవితం సంతానం కలగడంతో ఫలవంతం అవుతుంది. మనిషి తన కొనసాగింపును సంతానం తో ఆశిస్తాడు. తన ఉనికి సంతానం ద్వారా వదిలిపెడతాడు. ఆ సంతానం కలిగే లోపే ఆ ఉనికి మరుగున పడిపోయే పరిస్థితి వస్తే? అతని సంతానం కావాలి మూడు రోజుల క్రితం గుజరాత్ హైకోర్టుకు అత్యవసర ప్రాతిపదికన ఒక మహిళ అప్పీలు చేసుకుంది. ‘నేను సంతానవతిని కాదల్చుకున్నాను. అందుకు నా భర్త నుంచి వీర్యం తీసి సంరక్షించుకునేందుకు అనుమతినివ్వండి’ అని. మంగళవారం (జూలై 20) కోర్టుకు వెళితే ఆ సాయంత్రానికే కోర్టు అనుమతినిస్తే అదే రోజు రాత్రి ఆమె భర్త నుంచి వీర్యాన్ని సేకరించి భద్ర పరిచారు డాక్టర్లు. వడోదరాలోని స్టెర్లింగ్ హాస్పిటల్లో ఈ ఉదంతం జరిగింది. ‘పేషెంట్‌కు కోవిడ్ వల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగింది. అతను ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నాడు. ప్రాణాలు దక్కే ఆశలు అతి స్వల్పం. అందుకే అతని భార్య అతని వీర్యం ద్వారానే కృత్రిమ పద్ధతిలో భవిష్యత్తులో సంతానవతి అయ్యే విధంగా వీర్యాన్ని సేకరించమని మమ్మల్ని కోరింది. భర్త కుటుంబం అందుకు అంగీకరించింది. అయితే అలా వీర్యాన్ని సేకరించాలంటే ఆ పురుషుడి అనుమతి ఉండాలి. అనుమతి ఇచ్చే స్థితిలో అతను లేడు. అందుకే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోమన్నాం. ఆమె కోర్టు నుంచి అనుమతి తీసుకురావడంతో వెంటనే వీర్యాన్ని సేకరించాం. అలా వీర్యాన్ని సేకరించే ప్రొసీజర్‌కు అరగంట సమయం పట్టింది’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మాతృత్వపు హక్కు ప్రతి స్త్రీకి ఉంటుంది. సహజంగా వీలు లేకపోతే కృత్రిమ పద్ధతి ద్వారా, సరొగసి ద్వారా ఆమె తల్లి కావచ్చు. కాని ఈ కోవిడ్ కాలంలో అన్నీ హటాత్తుగా జరిగిపోతున్నాయి. ఎన్నో ఆశలు, కలలు కన్న జీవన భాగస్వాములు రోజుల వ్యవధిలో అదృశ్యమవుతున్నారు. సంతాన కల నెరవేరక ముందే వారు మరణించే పరిస్థితి ఎన్నో కుటుంబాల్లో ఈ కోవిడ్ కాలంలో జరిగినా ఈ మహిళ మాత్రం భర్త ద్వారానే సంతానాన్ని కనడానికి ఈ విధం గా నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది. ఆమెను అర్థం చేయించే ప్రయత్నం చేస్తోంది. హైకోర్టు ఆమె నిర్ణయానికి మద్దతుగా ‘కృత్రిమ పద్ధతిలో ఆమె తల్లి అయ్యే విషయం లో మీ అభిప్రాయం ఏమిట’ని ప్రభుత్వాన్ని, ఆస్పత్రి వర్గాలని కూడా సమాధానం కోరుతూ నోటీసులు ఇచ్చింది. భర్త చనిపోయాక తల్లి కావాలని... అయితే ఇదే వడోదరాలో రెండు నెలలుగా మరో మహిళ కూడా ఇదే కారణంతో వార్తల్లో ఉంది. ఆమె పేరు హెలీ ఏర్కే. వయసు 36. వడోదరాలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఆమె భర్త సంజయ్ టీచర్‌గా పని చేసేవాడు. ఏప్రిల్ మొదటి వారంలో అతడు కోవిడ్ వల్ల మరణించాడు. ‘నా భర్త ఎంతో మంచివాడు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనాలని నాకు చెప్పేవాడు. నేనంటే ఎంతో ప్రేమ. నాకు 30 ఏళ్లకు పెళ్లయ్యింది. ఆయన నా కంటే పెద్ద. పెళ్లి సమయంలోనే మేము లేటు వయసు వల్ల గర్భధారణకు ఇబ్బంది వస్తుందా అని సందేహించాం. రెండు మూడు ఆస్పత్రులకు తిరిగి చివరకు ఒక ఆస్పత్రి లో మా ‘ఎంబ్రియో’ (అండం, వీర్యాల ఫలదీకరణం. దీనిని గర్భంలో ప్రవేశపెట్టాక పిండం అవుతుంది)లు ఐదారు సంరక్షించుకున్నాం. నా భర్త జీవించి ఉండగా ఒక ఎంబ్రియోతో గర్భం దాల్చడానికి ప్రయత్నించాను. నిలువలేదు. ఇప్పుడు నా భర్త లేడు. కాని అతని వారసుణ్ణి కనాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నా కుటుంబం సమాజం ఇందుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని హెలీ అంది. సంతానం కలిగితే ఆ సంతానంలో భర్తను చూసుకోవాలని ఆమె తపన. ‘నా గర్భాశయం గర్భం మోయడానికి అనువుగా లేదని డాక్టర్లు తేల్చేశారు. మా ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును నేను తల్లి కావడానికి వెచ్చిస్తాను. సరొగసీ ద్వారా నేను నా భర్త అంకురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నిస్తాను’ అని హెలీ అంది. కోవిడ్ ఎందరికో మరణశాసనాలు రాస్తోంది. కాని మనుషులు జీవించే ఆశను పునరుజ్జీవింప చేసే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఒక మనిషి మరణించినా అతడి సంతానం జన్మనెత్తే వినూత్న సమయాలను ఇప్పుడు మనిషి సృష్టిస్తున్నాడు. క్రిమి మరణిస్తుంది. మనిషి తప్పక జయిస్తాడు. హెలీ ఏర్కె, సంజయ్ -
Gyr Cattle: ‘విక్కీడోనర్’ వర్కవుట్ అయ్యేనా?
వెబ్‌డెస్క్ : పాడి రైతుల ఇంట కాసుల వర్షం కురిపించేందుకు సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్టు మహారాష్ట్ర సర్కారు చెబుతోంది. అందుకోసం బ్రెజిల్ నుంచి గిర్ జాతి గిత్తల వీర్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. అంతేకాదు బ్రెజిల్ బ్రీడ్ గిర్ గిత్తలను ఇండియాకు తీసుకువచ్చి స్థానిక గిర్ ఆవులతో సంకరం చేయించాలని నిర్ణయించింది. ఈ పథకానికి గోకుల్ మిషన్‌గా పేరు పెట్టింది. దీని ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ పథకం తీరు తెన్నులు, ఎందుకు ప్రవేశ పెట్టాల్సి వచ్చిందనే వివరాలు తెలుసుకుందాం రండి. -
మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’
గాంధీనగర్: గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ జిస్నూర్ దయారా రాష్ట్రం నుంచి వైద్య విద్యనభ్యసించిన తొలి ట్రాన్స్ వుమెన్‌గా రికార్డు సృష్టించారు. తాజాగా ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుని మరో సారి వార్తల్లో నిలిచారు. త్వరలోనే శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా మహిళగా మారనున్న దయారా సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ జన్మకు పరిపూర్ణ అర్థాన్ని చేకూర్చే మాతృత్వాన్ని అనుభూతి చెందడం కోసం తన వీర్యాన్ని భద్రపరుచుకున్నారు. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించి ఆమె బిడ్డను కనాలని భావిస్తున్నారు. ఇలా జన్మించే బిడ్డకు దయారానే తల్లి, తండ్రి అవుతారు. ఒకే జన్మలో ఆమె మగాడిగా, స్త్రీగా జీవించనున్నారు. అదే విధంగా తొలిసారి ఓ బిడ్డకు తల్లి, తండ్రి ఒక్కరే అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా దయారా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు ఆడవారిగా జీవించాలని ఉండేది. మా అమ్మ, అక్కలాగా చీర కట్టుకోవాలని.. లిప్‌స్టిక్ వేసుకోవాలని మనసు తహతహలాడేది. కానీ చుట్టూ ఉన్న సమాజానికి భయపడి.. నాలోని స్త్రీని బయటకు రానివ్వలేదు. ఇదిలా కొనసాగుతుండగానే.. ఎంబీబీఎస్ చదవడానికి నేను రష్యా వెళ్లాను. అక్కడ నాలాంటి వారు ఎంతో ధైర్యంగా.. తమకు నచ్చినట్లు బతకడం చూశాను. నాలో ధైర్యం వచ్చింది. భయాల్ని తొలగించుకున్నాను. నాకు నచ్చినట్లు బతకడం మొదలు పెట్టాను. చీర కట్టుకోవడం, లిప్‌స్టిక్ వేసుకోవడం నేర్చుకున్నాను. నన్ను చూసి మొదట నా తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం వారు నన్ను అర్థం చేసుకున్నారు. నా చుట్టు ఉన్న సమాజం కూడా నన్ను అంగీకరించడం ప్రారంభించింది’’ అంటూ చెప్పుకొచ్చారు దయారా. తల్లి అవ్వడం నా కల ‘‘ప్రస్తుతం ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్ష రాయబోతున్నాను. ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా నేను పూర్తిగా స్త్రీగా మారతాను. ఆడవారికి లభించిన అద్భుతమైన వరం ఓ జీవికి జన్మనివ్వడం. నేను కూడా ఆ వరాన్ని అందుకోవాలని భావిస్తున్నాను. మాతృత్వాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నాను. అందుకే లింగ మార్పిడి శస్త్రచికిత్సకు ముందే నా వీర్యాన్ని భద్రపరుచుకోవాలని భావించాను. ఇందుకు గాను అహ్మదాబాద్, ఆనంద్‌లోని ఓ ఐవీఎఫ్ ఆస్పత్రిని సంప్రదించి.. నా కోరికను వారికి చెప్పాను. నా నిర్ణయాన్ని గౌరవించిన వారు నా వీర్యాన్ని భద్రపరిచేందుకు అంగీకరించారు. వారికి ఎంతో రుణపడి ఉంటాను’’ అన్నారు దయారా. సరోగసి ద్వారా బిడ్డను కంటాను ‘‘కాళీ మాతా దయ వల్ల నేను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. అలా జన్మించే బిడ్డకు బయాలజీకల్గా నేనే తల్లి, తండ్రి. ఈ విషయం తలుచుకుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. బిడ్డను కనడం కోసం నేను సరోగసి విధానాన్ని ఎంచుకోబోతున్నాను. ఇందుకు నేనేం సిగ్గుపడటం లేదు. ట్రాన్స్ వుమెన్‌గా మారిన వ్యక్తి.. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో ధైర్యం కావాలి. చుట్టూ ఉన్న సమాజం కూడా ట్రాన్స్‌జెండర్స్ పట్ల దయతో వ్యవహరించాలి’’ అని కోరారు. ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం: నయనా పటేల్ ఇక దయారా వీర్యాన్ని భద్రపరిచిన ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ నయానా పటేల్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న మగాళ్లు, ఇంటికి దూరంగా ఉంటున్న సైనికులు, చాలా కాలం వరకు బిడ్డలు వద్దనుకునే దంపతుల్లోని మగవారు తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకుంటారు. ఆ తర్వాత బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఐవీఎఫ్, సరోగసి ద్వారా పిల్లల్ని కంటారు. కానీ మొదటిసారి ఓ ట్రాన్స్ఉమెన్ భవిష్యత్తులో తల్లి అవ్వడం కోసం తన వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకోవడం మా ఆస్పత్రిలో ఇదే మొదటిసారి’’ అన్నారు. చదవండి: చిన్ని తండ్రీ నిన్ను చూడక... ట్రాన్స్... అప్డేట్ వెర్షన్ -
మూత్రంలో ఇబ్బందా? ప్రోస్టేట్ పరీక్ష అవసరం!
పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌ను ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. ఈ గ్రంథి ‘వాల్నట్’ ఆకారంలో ఉంటుంది. మనకు వీర్యంలో కనపడే ద్రవపదార్థాన్ని ఇది తయారుచేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్లడానికి ఈ ద్రవం తోడ్పడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది పురుషుల్లో మాత్రమే కనిపించే అతి సాధారణ క్యాన్సర్. ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. మొదటిదశలో ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ పరిస్థితిలో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది లేదా అసలు అవసరమే రాకపోవచ్చు. అయితే కొన్ని రకాల ప్రోస్టేట్ క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తాయి. గ్రంథికి మాత్రమే పరిమితమైన దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ మొదటిదశలో ఎలాంటి లక్షణాలూ బయటపడకపోవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం, మూత్రం ధారగా రాకపోవడం, కాళ్లవాపు, ఎముకలలో నొప్పి, పొత్తికడుపులో ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కారణాలు : ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కచ్చితమైన కారణాలు తెలియదు. వయసు పెరగడం, కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండటం, స్థూలకాయం వంటివి క్యాన్సర్‌కు కారకాలు అయ్యే అవకాశం ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను విస్మరిస్తే అది ఇతర భాగాలకు వ్యాపించడం, అంగస్తంభన సమస్యలు మొదలైనవి రావడానికి అవకాశం ఉంది. యాభై ఏళ్లు నిండిన పురుషులు క్రమం తప్పకుండా ప్రోస్టేట్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోమ్మని ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. పరీక్షలు : డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (పీఎస్ఏ) పరీక్షలను చేయించుకోవడం వల్ల వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షల్లో రిపోర్ట్ ‘అబ్నార్మల్’గా వస్తే అల్ట్రాసౌండ్, బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలి. బయాప్సీలో పాజిటివ్ వస్తే గ్రేడింగ్ చేయించుకోవాలి. అంటే వ్యాధి తీవ్రత ఏ దశలో ఉందో గుర్తించాలి. ఇందుకోసం క్యాన్సర్ కణాలను, ఆరోగ్యంగా ఉన్న ప్రోస్టేట్ కణాలతో పోల్చిచూస్తారు. క్యాన్సర్ కణాలు ఆరోగ్యకరమైన కణాల కంటే ఎంత ఎక్కువగానూ, భిన్నంగానూ ఉంటే వ్యాధి అంత తీవ్రంగా ఉన్నట్లు లెక్క. వ్యాధి తీవ్రతను కొలిచే కొలమానాన్ని ‘గ్లీసన్ స్కోర్’ అంటారు. ఈ స్కోరు 2 నుంచి 10 వరకు ఉంటుంది. 2 ఉంటే తీవ్రత తక్కువగా ఉన్నట్లు. అదే 10 ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్పవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ దశలు : స్టేజ్ – 1 : మొదటి దశలో ఉందంటే క్యాన్సర్ చాలా ప్రాథమిక దశలో ఉందని అర్థం. మైక్రోస్కోప్‌తో చూడగలిగే పరిమాణంలోనే ఉందని అర్థం. స్టేజ్ – 2 : ఈ దశలో క్యాన్సర్ సులభంగా కనిపిస్తూ ఉంటుంది. అది ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. స్టేజ్ – 3 : ఈ దశలో క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంథిని దాటి వీర్యవాహికలు లేదా ఇతర సమీప కణజాలానికి పాకి ఉండవచ్చు. స్టేజ్ – 4 : ఈ దశలో క్యాన్సర్ లింఫ్ గ్రంథులు, ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు పాకి ఉంటుంది. చికిత్స : ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స ప్రక్రియ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు క్యాన్సర్ ఎంత వేగంగా వృద్ధి చెందుతోంది, ఎంత వేగంగా ఇతర అవయవాలకు పాకుతోంది, రోగి ఆరోగ్యస్థితి, చికిత్స దుష్ప్రభావాలు... ఇలా అనేక అంశాలపై ఆధారపడి చికిత్స ప్రక్రియను నిర్ణయిస్తారు. చికిత్స వెంటనే అవసరం పడకపోవచ్చు : క్యాన్సర్ మొదటి దశలో ఉన్నవారికి వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు రోగులను అప్రమత్తతతో వేచి ఉండమని సూచిస్తారు. అంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, పురీషనాళ పరీక్షలు, అవసరమైతే బయాప్సీ వంటివి చేయించుకుంటే శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం. అప్రమత్తతతో వేచి చూడటం అనేది క్యాన్సర్ చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతున్న వారికి, క్యాన్సర్ లక్షణాలు బయటపడని వారికి మాత్రమే. క్యాన్సర్ వేగంగా వృద్ధిచెందుతున్నట్లు గమనిస్తే ఆపరేషన్, రేడియోథెరపీ వంటి చికిత్స పద్ధతులను అనుసరించాల్సి రావచ్చు. రేడియేషన్ థెరపీ : ఈ థెరపీలో అధికశక్తి గత రేడియోధార్మిక కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను తుదముట్టిస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో రేడియేషన్‌ను రెండు రకాలుగా ఇస్తారు. శరీరం బయటనుంచి రేడియోధార్మికతను ఇవ్వడం. శరీరం లోపల రేడియో ధార్మికతను ఉంచడం. హార్మోన్ థెరపీ : హార్మోన్ థెరపీలో శరీరంలోని టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నిలిపివేస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో క్యాన్సర్ కణాలు టెస్టోస్టెరాన్ మీద ఆధారపడి వృద్ధిచెందుతుంటాయి. టెస్టోస్టెరాన్ సరఫరాను నిలిపివేయడం వల్ల క్యాన్సర్ కణాల వృద్ధి మందగించడం గానీ లేదా చనిపోవడం గానీ జరుగుతుంది. హార్మోన్ థెరపీని వివిధ రకాలుగా ఇవ్వవచ్చు. క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్నవారికి హార్మోన్ «థెరపీ సరిపోతుంది. హార్మోన్ థెరపీ వల్ల క్యాన్సర్ కణుతులు కుంచించుకుపోతాయి. ఆ తర్వాత రేడియేషన్ చికిత్స చేస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయి. శస్త్రచికిత్స : శస్త్రచికిత్స ద్వారా ప్రోస్టేట్ గ్రంథిని, దాని చుట్టుపక్కల కణజాలాన్ని, లింఫ్ గ్రంథులతో కొంత భాగాన్ని తొలగిస్తారు. అయితే దీనివల్ల అంగస్తంభన సమస్య, మూత్రవిసర్జన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కీమోథెరపీ : ఈ ప్రక్రియలో మందులతో క్యాన్సర్ కణాలను చంపడానికి యత్నిస్తారు. కీమోథెరపీలో మందులను ఇంజెక్షన్ల రూపంలోగానీ లేదా మాత్రల రూపంలోగాని ఇస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్ బాగా ముదిరి శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకినట్లయితే కీమోథెరపీని ఇస్తారు. నివారణ : నిత్యం వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ వ్యాప్తిని గుర్తించడం ఇలా క్యాన్సర్ వ్యాధి ప్రోస్టేట్ గ్రంథిని దాటి ఇతర అవయవాలకు వ్యాపించిందనే అనుమానం వస్తే ఎముకల స్కానింగ్, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. ఈ పరీక్షల వల్ల క్యాన్సర్ ఏ దశలో ఉందో నిర్ధారణ అవుతుంది. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
వీర్యంతో దాడులా?.. ఛాన్సే లేదు
సాక్షి, న్యూఢిల్లీ : హోలి వేడుకల్లో భాగంగా దేశ రాజధానిలో ఇద్దరు విద్యార్థినులపై చోటు చేసుకున్న వికృత దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీర్యంతో నింపిన బెలూన్లను వారిపై విసిరిన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు వివిధ కళాశాలల విద్యార్థినులు ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమీషన్ సైతం ఈ వ్యవహారంపై మండిపడటంతో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదసలు సాధ్యమయ్యే పనే కాదంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ దాడిని నీరసిస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అంతే కాదు పలు టీవీఛానెళ్లలో ఆమె చర్చా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఆమె తీరును ఖండిస్తూ సదరు వ్యక్తి ట్వీట్లు చేశారు. ‘అసలు అంత స్థాయిలో వీర్యాన్ని సేకరించటం సాధ్యమయ్యే పని కాదు. ఆరోగ్యవంతమైన మానవుడు 5 మిల్లిలీటర్ల కన్నా ఎక్కువ వీర్యాన్ని స్కలించలేడు. ఒకవేళ అంతస్థాయిలో సేకరించినా అది ఎంతో సేపు లిక్విడ్ స్టేజీలో ఉండలేదు.... ...వాటిని నిల్వ చేయాలంటే ప్రత్యేక పరికరాల్లో నింపాల్సి ఉంటుంది. పోనీ దానికి నీటిని కలిపి నింపారనుకున్నా.. దాని తత్వాన్ని అది కోల్పోతుంది. పైగా అసలు దానిని బెలూన్లలో నింపటం కుదిరే పని కాదు. పోనీ.. ద్రవరూప నైట్రస్ ఆక్సైడ్తో దానిని నింపారనుకున్న అందుకు ఆస్కారమే లేదు’’ అంటూ పలు కారణాలను వివరిస్తూ ఆ వాదనను ఖండించారు. కాలాతీథమ పేరుతో ‘ది గుడ్ డాక్టర్’ పేరిట ఆ ట్విట్టర్ అకౌంట్ ఉంది. పైగా అందులోని వ్యక్తి వైద్యుల మాస్కులు ధరించి ఉండటంతో బహుశా ఆతనో వైద్యుడయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే అతని ట్వీట్లను కొందరు ఖండిస్తున్నప్పటికీ.. మద్ధతుగా కూడా ట్వీట్లు చేసే వాళ్లు లేకపోలేదు. ప్రస్తుతం ఆయన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. -
పొగతాగే అలవాటుతో ‘కౌంట్ డౌన్’!
పరిపరిశోధన పొగతాగే అలవాటు వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు వచ్చేందుకు అవకాశాలు చాలా ఉన్నట్లు గతంలోనే తెలుసు. దీనికి తోడుగా వీర్యంలో శుక్రకణాల తగ్గుదల చాలా ఎక్కువ అనీ, దాంతో పాటు వీర్యం నాణ్యత కూడా తగ్గుతుందని నిర్ద్వంద్వంగా తేలింది. దాదాపు ఆరు వేల మందిపై నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలిందని పరిశోధకులు వెల్లడించారు. కేవలం వీర్యకణాల తగ్గుదల, వాటి చురుకుదనం తగ్గడమే గాక, అంగస్తంభనలు కూడా తగ్గుతాయని తెలిసింది. ఈ విషయాలన్నింటినీ యూరోపియన్ యూరాలజీ అనే మెడికల్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. -
పెళ్లయి చాలాకాలమైనా ....
పల్మునాలజీ కౌన్సెలింగ్ కుడి వైపున గుండె... లంగ్స్‌లో రంధ్రాలు..? నా వయసు 35 ఏళ్లు. పెళ్లయి చాలాకాలమైనా పిల్లల్లేరు. డాక్టర్ పరీక్షించి నా గుండె కుడివైపు, నా లంగ్స్‌లో రంధ్రాలు ఉన్నట్లు తెలిపారు. నా వీర్యంలో కౌంట్ చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఏమిటీ సమస్య? - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు చెబుతున్న అంశాలను బట్టి మీరు ‘కార్టెజెనెర్ సిండ్రోమ్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీకు సంక్రమించిన వ్యాధి కూడా ఊపిరితిత్తులకు వచ్చిన అతి అరుదైన వ్యాధి. ఇందులో శరీరంలోని అంతర్గత అవయవాలు తారుమారు కావచ్చు. ఇది రెండు రకాలైన అసాధారణ లక్షణాలతో ఇది కనిపిస్తుంది. మొదటిది... ప్రైమరీ సీలియరీ డైస్కినేసియా, రెండోది సైటస్ ఇన్వర్సస్. మొదటిదైన ప్రైమరీ సీలియరీ డైస్కినేసియా (పీసీడీ)లో ఊపిరితిత్తులను శుభ్రపరిచే సన్నటి వెంట్రుకల్లాంటివి సాధారణంగా ఉండాల్సిన రీతిలో ఉండవు. నిజానికి ఈ సీలియరీ అవయవాలు లంగ్స్, ముక్కు, సైనస్‌లను శుభ్రపరచడానికి ఉపయోగపడే మ్యూకస్ పొరల లైనింగ్. సాధారణంగా ఇవి కాలుష్య పదార్థాలను పై వైపునకు తోసేస్తూ ఉంటాయి. కానీ ప్రైమరీ సీలియరీ డైస్కినేసియా ఉన్నవారిలో ఈ సీలియరీ అవయవాల్లో కదలికలు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి చాలా తక్కువగా ఉండటమో, రివర్స్‌లో కదులుతుండటమో జరుగుతుంది. ఉంటాయి. హానిచేసే బ్యాక్టీరియా బయటకు పోకుండా ఊపిరితిత్తుల్లోనే ఉంటూ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ను కలగజేస్తాయి. దాంతో దీర్ఘకాలిక సైనసైటిస్‌తో పాటు ఊపిరితిత్తుల్లో శాశ్వతమైన మార్పులు కలుగుతాయి. ఈ కండిషన్‌ను బ్రాంకియాక్టాసిస్ అంటారు. బ్రాంకియాక్టాసిస్ వల్ల ఎడతెరిపి లేకుండా దగ్గు, తీవ్రమైన అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇక రెండో అసాధారణత అయిన సైటస్ ఇన్వెర్సస్ ఉన్నవారిలో వారు తల్లి గర్భంలో ఉండగానే అవయవాలు తాము ఉండాల్సిన ప్రదేశంలో ఉండకపోవచ్చు. రివర్స్‌లో ఉండవచ్చు. కార్టజెనెర్ సిండ్రోమ్ ఉన్నవారిలో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తుంటాయి. అవి దీర్ఘకాలిక సైనసైటిస్, బ్రాంకియాక్టాసిస్, అవయవాలు తమ పొజిషన్ మారే సైటస్ ఇన్వర్సస్. ఈ కండిషన్‌తో పుట్టిన వారికి పెద్దయ్యాక వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండవచ్చు. కొన్ని మందులు, టీకాలు, కార్టికోస్టెరాయిడ్స్‌తో ఈ వ్యాధిగ్రస్తుల్లో కొన్ని దీర్ఘకాలిక సమస్యలను అదుపులో ఉంచవచ్చు. మీరు ఒకసారి ఊపిరితిత్తుల నిపుణులను కలవండి. డా॥రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - సునీల్‌కుమార్, కందుకూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. కారణాలు: మానసిక ఒత్తిడి, ఆందోళన సరైన సమయంలో భోజనం చేయకపోవడం మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం చికాకు, కోపం. లక్షణాలు: మలబద్దకం / విరేచనాలు తరచూ కడుపునొప్పి రావడం కడుపు ఉబ్బరం విరేచనంలో జిగురు పడటం భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం. హోమియో చికిత్స: మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
మరోమారు టెస్ట్ చేయించడం మంచిది...
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. నేను, నా భార్య సంతానం కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఇటీవలే మేమిద్దరమూ వైద్యపరీక్షలు చేయించుకున్నాం. నా భార్యకు అంతా మామూలుగానే ఉందని డాక్టర్లు అన్నారు. నా వీర్యంలో శుక్రకణాలు లేవని చెప్పారు. దాంతో మాకు ఎటూ పాలుపోవడం లేదు. మాకు సంతానం కలిగే మార్గం లేదా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరుడు, హైదరాబాద్ ముందుగా మీరు మరోమారు మీ వీర్య పరీక్ష చేయించండి. అలా మరోసారి చేయించిన వైద్య పరీక్షలోనూ మీకు శుక్రకణాలు లేవని తెలిస్తే, దానికి కారణాలు అన్వేషించాల్సి ఉంటుంది. బహుశా అది మీ ఎండోక్రైన్ గ్రంథుల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లనా, వృషణాల పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లనా లేదా మీలోని ఏదైనా నాళంలో అడ్డంకుల వల్లనా అన్నది తెలుసుకోవాలి. ఒకవేళ మీ చిన్నతనంలో వృషణం కడుపులోనే ఉండిపోయి, కిందికి జారకపోవడం (అన్‌డిసెండెడ్ టెస్టిస్) సంభవించినా లేదా మీకు చిన్నప్పుడు జననావయవాల దగ్గర ఏదైనా సమస్య వచ్చి, శస్త్రచికిత్స జరిగిందా అన్న విషయాలూ డాక్టర్లకు తెలియజెప్పాలి. ఇలాంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని సమస్యను విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ సమయంలో డాక్టర్లు వృషణాల పరిమాణమూ లాంటి కొలతలూ తీసుకుంటారు. మీలో వేరికోసీల్ వంటి సమస్య ఏదైనా ఉందేమోనని కూడా చూడాల్సి రావచ్చు. అలాగే మీకు కొన్ని రక్తపరీక్షలూ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. మీకు జన్యుపరమైన సమస్యలు ఏవైనా ఉన్నట్లు తేలితే, అప్పుడు జెనెటిసిస్ట్ కౌన్సెలింగ్ కూడా అవసరం కావచ్చు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి ఆ తర్వాత వీర్యసేకరణ కోసం అవసరాన్ని బట్టి పలు ప్రక్రియలను అవలంబిచాల్సి వస్తుంటుంది. అలా వీర్యసేకరణ జరిపాక, అందులోని శుక్రకణాలను ఉపయోగించి ఐసీఎస్ఐ (ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) అనే ప్రక్రియను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియలో శుక్రకణాన్ని, మీ భార్య అండంలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇలా మీరు తండ్రి అయ్యే అవకాశం ఉంది. మరోసారి మీ దంపతులిద్దరూ మీ ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. నేను వర్క్‌ప్లేస్‌కు బైక్‌పై వెళ్తుంటాను. నా ఒక మోస్తరు జడ (మీడియమ్ లెంత్ హెయిర్) ఉంది. నేను హెల్మెట్ వాడుతున్నాను. హెల్మెట్‌కు బయట ఉండే జుట్టు దుమ్ముకూ, ఎండకూ ఎక్స్పోజ్ అవుతోంది. నా జుట్టు చివర్లు చిట్లుతున్నాయి. దాంతో జుట్టు అసహ్యంగా కనిపిస్తోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - భవాని, విజయవాడ మీరు చెప్పినట్లుగా వెంట్రుకల చివర్లు చిట్లడానికి మూడు అంశాలు సంయుక్తంగా ప్రభావం చూపుతాయి. అవి... దుమ్ము, కాలుష్యం, ఎండ. ఈ అంశాల దుష్ర్పభావం జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. మీ సమస్య తగ్గడానికి కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. టూవీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలను కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోండి రోజు విడిచి రోజు తల స్నానం చేయండి. తలస్నానం చేయడానికి మైల్డ్ షాంపూ మాత్రమే ఉపయోగించండి. తలస్నానం తర్వాత మీ జుట్టు పూర్తిగా ఆరకముందే ఈ కింద పేర్కొన్న పదార్థాలు ఉండే ‘హెయిర్ సీరమ్’ రాయండి. అవి... డైమిథికోన్ ట్రైజిలోగ్జేన్ విటమిన్ ఈ ఎసిటేట్ అహోబా ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్. పైన పేర్కొన్న సీరమ్ మీ వెంట్రుకలకు దుమ్ము, అల్ట్రావయొలెట్ కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి, హైదరాబాద్ కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. మా ఇంట్లో మా తాతగారు, మా అమ్మగారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణించారు. మన ఆహారపు అలవాట్లు, డయాబెటిస్, అధిక రక్తపోటు (హైబీపీ)తో పాటు జన్యుపరమైన కారణాలతో కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని విన్నాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి ఏవైనా ముందస్తు పరిష్కార మార్గాలున్నాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సుబ్బారావు, గుంటూరు మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతి పెద్దది డయాబెటిస్. మూత్రపిండాల వ్యాధులు రావడానికి సుమారు 40 నుంచి 40 శాతం వరకు ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇవేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బుల కారణంగా కూడా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే అది రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. కిడ్నీ వ్యాధులలో పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే కిడ్నీ జబ్బులను సెలైంట్ కిల్లర్స్‌గా పేర్కొంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటనిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలలో ఏమైనా అసాధారణంగా కనిపిస్తే మరింత లోతుగా సమస్యను విశ్లేషించేందుకు జీఎఫ్ఆర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు తోడ్పడతాయి. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబంలోగానీ, వంశంలో గానీ కిడ్నీ సంబంధిత జబ్బులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆకలి మందగించడం, నీరసం, మొహం వాచినట్లు ఉండటం, కాళ్లలో వాపు, రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, మూత్రంలో నురగ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధులలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మూత్రపిండాల సమస్య తీవ్రతరమవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మాంసాహారం మితంగా తీసుకోవడం, సాధ్యమైనంతవరకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్కు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్ -
తండ్రుల ద్వారానే స్థూలకాయం
పరిపరి... శోధన స్థూలకాయానికి అతి భోజనం, తక్కువ పని కారణాలే అయినా, పిల్లలు స్థూలకాయులుగా మారితే, అందుకు కారణం వారి తండ్రులేనని డెన్మార్క్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్థూలకాయానికి సంబంధించిన జన్యువులు తండ్రి వీర్యం ద్వారానే పిల్లలకు సంక్రమిస్తాయని తమ పరిశోధనల్లో తేలిందని కోపెన్హాగన్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ రోమన్ బారెస్ వెల్లడిస్తున్నారు. పిల్లలు స్థూలకాయులుగా మారకుండా ఉండాలంటే కొవ్వులు అతిగా తినకూడదని, మద్యానికి, పొగతాగడానికి దూరంగా ఉండాలని గర్భిణులకు నానా జాగ్రత్తలు చెబుతుంటారని, వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తండ్రులు స్థూలకాయులుగా ఉన్నట్లయితే, వారి పిల్లలు కూడా భవిష్యత్తులో అలాగే తయారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.