
వెబ్‌డెస్క్ : పాడి రైతుల ఇంట కాసుల వర్షం కురిపించేందుకు సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్టు మహారాష్ట్ర సర్కారు చెబుతోంది. అందుకోసం బ్రెజిల్ నుంచి గిర్ జాతి గిత్తల వీర్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. అంతేకాదు బ్రెజిల్ బ్రీడ్ గిర్ గిత్తలను ఇండియాకు తీసుకువచ్చి స్థానిక గిర్ ఆవులతో సంకరం చేయించాలని నిర్ణయించింది. ఈ పథకానికి గోకుల్ మిషన్‌గా పేరు పెట్టింది. దీని ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ పథకం తీరు తెన్నులు, ఎందుకు ప్రవేశ పెట్టాల్సి వచ్చిందనే వివరాలు తెలుసుకుందాం రండి.