Maldives Row: విదేశాంగ మంత్రి జై శంకర్‌ కీలక వ్యాఖ్యలు | Jaishankar Says Cant Guarantee Every Country Support Us | Sakshi
Sakshi News home page

Maldives Row: ‘రాజకీయం.. రాజకీయమే అందులో మార్పులేదు’

Published Mon, Jan 15 2024 7:31 PM | Last Updated on Mon, Jan 15 2024 9:41 PM

Jaishankar Says Cant Guarantee Every Country Support Us - Sakshi

భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశి విధానాల్లో రాజకీయం.. రాజకీయమేనని అన్నారు.  మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మొదటిసారిగా భారత్‌-మాల్దీవుల దౌత్యపరమైన వివాదంపై స్పందించారు.

ఏ దేశమైనా తప్పనిసరిగా భారత్‌ దేశానికి మద్దతుగా ఉంటుందని చెప్పలేమని అన్నారు. మాల్దీవులతో నెలకొన్న వివాదం నేపథ్యంలో విదేశి ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేకుండా భారత్‌ ప్రయోజనాలను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. పొరుగు దేశం మొదటి ప్రాధాన్యం ఏంటో తెలుసుకొని దాని ప్రకారమే దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.

అందుకే రాజకీయం అంటే రాజకీయమేని.. ఇందులో ఎటువంటి మార్పు ఉండదని తెలిపారు. ప్రతి దేశం కూడా భారతదేశంతో సఖ్యత, మద్దతుగా ఉంటుందని తాను హామీ ఇవ్వలేని స్పష్టం చేశారు. గత పదేళ్ల కాలంలో భారత్‌.. మాల్దీవులతో పటిష్టమైన సంబంధాలను ఏర్పరిచిందని తెలిపారు.

ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం మారిందని రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చాయని తెలిపారు. అయినప్పటికీ అక్కడి ప్రజల్లో భారత్‌-మాల్దీవల మధ్య ఉన్న సంబంధాలపై మంచి అభిప్రాయమే ఉందని తెలిపారు. తమ దేశం నుంచి భారత భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు ఆదివారం సూచించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించిన విషయం తెలిసిందే.

చదవండి: అయోధ్య: ‘డబ్బులు తీసుకోకుండా ఆశీర్వదిస్తాం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement