న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ) రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించడమే ఇందుకు కారణం. అసిస్టెట్ రిప్రొడక్టివ్ టెక్నిక్(ఏఆర్‌టీ) విధానంలో సంతానం కోసం దంపతులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత 2009 జూన్‌లో వారికి కవలలు జని్మంచారు.
శిశువులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించగా, వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్లు స్పష్టమయ్యింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ ఎన్‌సీడీఆర్‌సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ దర్యాప్తు వారికి అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment