private hospital
-
నీ భార్యతో ఉన్నా.. ఏం చేస్తావో చేయ్!
ఇంద్రవెల్లి (మంచిర్యాల): ఓ వివాహిత ఓ యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఆ ప్రియుడు ఆ భర్తను రెచ్చగొట్టాడు. రగిలిపోయిన ఆ భర్త.. భార్యతోపాటు అత్త, వాళ్ల తరఫు బంధువులపై కూడా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. మండలకేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన సంజీవాణికి దనోరా(బి) గ్రామానికి చెందిన గుట్టె అంకుష్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. భర్త అంకుష్ గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో.. వారం క్రితం సంజీవాణి పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే.. మంగళవారం మధ్యాహ్నం సంజీవాణి ప్రియుడు రాహుల్ అంకుష్‌కు ఫోన్ చేశాడు. ‘‘నీ భార్యతో ఆమె ఇంట్లోనే ఉన్నా.. ఏం చేస్తావో చేయ్..అంటూ సవాల్ విసిరాడు. అంకుష్ కోపంతో అత్తగారింటికి వచ్చాడు. భార్యపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తల్లి అనిత, అమ్మమ్మ రాధాబాయిలపై దాడి చేయగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన సంజీవాణితోపాటు ఇద్దరిని స్థానికులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.భర్త స్నేహితునితో భార్య అనైతిక సంబంధం.. భర్త ప్రాణత్యాగం -
రక్తం మారింది... ప్రాణం పోయింది
జగ్గంపేట: ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది మిడిమిడి జ్ఞానం ఓ విద్యార్థిని ఉసురు పోసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 16 ఏళ్ల బాలికకు.. వేరే గ్రూపు రక్తం ఎక్కించి ఆమె ప్రాణాలు పోవడానికి కారకులయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ బాలిక కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పోలీస్‌స్టేషన్ వెనుక ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో ఆమెను రెండు రోజుల క్రితం జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే, ఆ సమయానికి ఆస్పత్రి వైద్యుడు రాజమహేంద్రవరంలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఇచ్చిన సలహాలతో జగ్గంపేట ఆస్పత్రి సిబ్బంది రక్తం ఎక్కించారు. అయితే బాధిత బాలిక బ్లడ్ గ్రూపు ఒకటి అయితే, సిబ్బంది మరో గ్రూపు రక్తం ఎక్కించడంతో ఆరోగ్యం వికటించింది. ఈ క్రమంలో మూత్రంలో నుంచి, నోటి నుంచి రక్తం రావడంతో సిబ్బంది కంగారు పడి, రాజమహేంద్రవరంలో ఉన్న డాక్టర్‌కు సమాచారమిచ్చారు. ఆ డాక్టర్ సూచన మేరకు ఆ బాలికను తక్షణం రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంగళవారం రాత్రి బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఆమె బంధువులు ఆందోళన చేయడంతో రాజమహేంద్రవరానికి చెందిన ఒక టీడీపీ నేత ఎటువంటి కేసులు లేకుండా సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
తమిళనాడులోని దిండిగల్ లో ఘోర అగ్ని ప్రమాదం
-
ఆక్సిజన్ సిలిండర్‌తో.. నడి రోడ్డుపై..
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం తమ కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కైకలూరు మండలం దేవిచింతపాడు గ్రామానికి చెందిన తానేటి నాగమణి 2 నెలల క్రితం ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో కడుపులో కణితి ఉందని శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆపరేషన్ అనంతరం ఆమె ఇంటికి వెళ్ళగా కొద్ది రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను వేరే హాస్పిటల్‌కు తీసుకువెళ్ళగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిపారని చెప్పారు. క్యాన్సర్ కణితిని శస్త్ర చికిత్స చేయటంతో ఇన్ఫెక్షన్ అయిందని, అది తీవ్ర అనారోగ్యానికి దారితీసిందని వైద్యులు చెప్పారని వివరించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలు నాగమణిని శనివారం సాయంత్రం.. ముందుగా ఆపరేషన్ చేసిన హాస్పిటల్‌కు తీసుకురాగా, తమకు సంబంధం లేదని, వైద్యం చేయబోమంటూ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా చెప్పింది. రాత్రి 10.35 గంటల వరకూ ఆరున్నర గంటల పాటు రోడ్డుపైనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. -
ప్రాణం పోయమంటే... పేగులు తోడేశారు
అనంతపురం మెడికల్: జీవి పుట్టుకకు దేవుడు కారణమైతే... ఆ జీవి ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం గడిపేందుకు వైద్యులు కారణమై దేవుడితో సమానంగా ఖ్యాతి దక్కించుకున్నారు. అయితే కొందరు వైద్యుల కారణంగా ఈ ఖ్యాతి కాస్త అపఖ్యాతిగా మారుతోంది. ఇందుకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో సర్జరీ విభాగం సేవలే నిదర్శనం. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న ఓ వృద్ధుడికి శస్త్రచికిత్స చేసి వార్డుకు తరలిస్తే పేగులు బయటపడ్డాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా...కణేకల్లు మండలం బెన్నికల్కు చెందిన వృద్ధుడు హనుమప్ప కడుపునొప్పితో బాధపడుతుంటే కుటుంబసభ్యులు ఆ చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు గత నెల సర్వజనాస్పత్రికి పిలుచుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు గత నెల 25న యూనిట్ 2 కింద అడ్మిట్ చేసుకుని వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇంటర్ స్టైనల్ ఇన్ఫెక్షన్ కారణంగా కడుపు నొప్పి వస్తోందని గుర్తించి లాపరోటమీ సర్జరీ (పొత్తికడుపు ఓపెన్ సర్జరీ) చేసి ఎస్ఐసీయూకు తరలించారు. ఐసీయూకు తరలించిన అదే రోజు హనుమప్పకు సర్జరీ వైద్యులు వేసిన కుట్లు తెరుచుకుని కడుపులో నుంచి పేగులు బయటపడ్డాయి. దీంతో కుటుంబీకులు, పక్కనే ఉన్న రోగులు, వారి సహాయకులు భయభ్రాంతులకు గురయ్యారు.వార్డులోని సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడి విషయాన్ని వెంటనే వైద్యులు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే అనస్తీసియా నుంచి బయటపడిన హనుమప్ప నొప్పి భరించలేక కేకలు వేస్తుండడంతో ఎస్ఐసీయూలో భయానక వాతావరణం నెలకొంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వైద్యులు వెంటనే తమ తప్పును సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు. ఇదేమిటని బాధిత కుటుంబసభ్యులు వైద్యులను ఆరా తీస్తే హనుమప్పకదలడం, ఆయాసం అధికంగా కావడంతో పేగులు బయట పడ్డాయని నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాక ఈ అంశం వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హనుమప్ప కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. కాగా, యూనిట్ 2 వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శస్త్రచికిత్స విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. సర్జరీ విభాగంలో సరైన ప్రమాణాలను వైద్యులు పాటించడం లేదని ఆస్పత్రి వర్గాలే బాహటంగా చెబుతున్నాయి. సీనియర్లు చేయాల్సిన సర్జరీని పీజీ వైద్య విద్యార్థులతో చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సర్వజనాస్పత్రిలో సర్జరీ విభాగం వైఫల్యాలపై ఆస్పత్రి పాలక వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు
కామారెడ్డి టౌన్: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. ఈ చర్యతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. -
ప్రాణదానం చేసి.. ప్రాణాలు విడిచింది
బొమ్మనహళ్లి: ఓ మహిళ సామాజిక సేవలో ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చినా సహాయంగా నిలుస్తారు. అదే మాదిరిగా బంధువుకు కాలేయం పాడైపోతే, సదరు మహిళ తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి గొప్ప మనసును చాటుకుంది. కానీ ఆరోగ్యం విషమించి ఆమే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక సంఘటన బెంగళూరులో జరిగింది. మృతురాలు అర్చనా కామత్ (34).బంధువుకు బాగా లేదంటే..వివరాలు.. ఉడుపికి చెందిన అర్చనా కామత్ మంగళూరులో ఓ మేనేజ్మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. తమ బంధువైన వృద్ధురాలు (69)కి కాలేయం పాడైపోయి ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్యకర వ్యక్తి నుంచి కొంత కాలేయ భాగం తీసి అమర్చితే కోలుకోవచ్చని వైద్యులు సూచించారు. అనేకమందికి రక్త పరీక్షలు చేసినా సరిపోలేదు. అర్చన బ్లడ్ గ్రూప్‌తో సరిపోయింది. దీంతో అర్చన కాలేయ దానానికి ముందుకొచ్చింది. 12 రోజుల క్రితం బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అర్చనకు శస్త్రచికిత్స చేసి లివర్ భాగాన్ని తీసి వృద్ధురాలికి అమర్చారు. మూడురోజుల తరువాత అర్చన డిశ్చార్జ్ అయింది. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అర్చనకు రెండురోజుల కిందట ఆకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో వెంటనే బెంగళూరులో ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక కన్నుమూసింది. ఆమెకు భర్త చేతన్ కామత్ తో పాటు నాలుగేళ్ల తనయుడు ఉన్నారు. ఆమె లివర్‌ను పొందిన వృద్ధురాలు మాత్రం ఆరోగ్యంగా ఉండడం విశేషం. -
జ్వర భద్రం
డెంగీ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇంతకుముందులా కాకుండా ‘మిక్స్డ్ ఇన్ఫెక్షన్ల’తో జనాల ఆరోగ్యాన్ని నిలువునా పీలి్చపిప్పిచేస్తోంది. రెండు, మూడు రకాల వైరస్లు సోకుతుండటం ప్రమాదకరంగా మారుతోంది. జ్వరంతోపాటు తీవ్ర నీరసం, ఒళ్లంతా నొప్పులతో.. కనీసం బెడ్‌పై నుంచి లేచి నడవలేనంతగా బాధపెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే తగిన వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ‘నిలువు దోపిడీ’ సమరి్పంచుకోలేక.. శారీరకంగానే కాదు, మానసికంగానూ జనం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. విషజ్వరాలతో పరిస్థితి దారుణంగా మారుతున్నా, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం జ్వరాలతో మంచాన పడింది. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులు చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. పెరుగుతున్న డెంగీ తీవ్రత రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే జరుగుతోంది. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 6,051 డెంగీ కేసులు, 164 చికున్‌గున్యా కేసులు, 197 మలేరియా కేసులు నమోదయ్యాయి. కానీ లెక్కలోకి రాని కేసులు భారీ స్థాయిలో ఉన్నాయనే అంచనా. ముఖ్యంగా డెంగీ దడ పుట్టిస్తోంది. జూలై, ఆగస్టు రెండు నెలల్లోనే ఏకంగా 3,317 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 1,267 కేసులు, నల్లగొండ జిల్లాలో 276 కేసులు, ఖమ్మం జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరిగినా.. అధికారికంగా నమోదవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడం, టెస్టింగ్ కిట్ల కొరత ఇబ్బందికరంగా మారింది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షలదాకా వసూళ్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు వసూలు చేస్తున్నాయని డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులు వాపోతున్నా రు. ముఖ్యంగా డెంగీ వచ్చి ఆస్పత్రిలో చేరితే చాలు.. పరిస్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చికిత్సల కోసం వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిక్కడంలో వైద్యశాఖ యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల నియంత్రణ, బాధితులకు చికిత్స అందించడంపై దృష్టిపెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేస్తూ, పరిస్థితిని చక్కదిద్దడంపై ఫోకస్ చేస్తున్నా.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రికార్డు స్థాయిలో రోగులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే అత్యధికంగా 2,680 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. హైదరాబాద్‌లోని ఉస్మానియాకు 2,566 మంది, గాం«దీకి 2,192 మంది, వరంగల్ ఎంజీఎంకు 2,385 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. ఓపీ నమోదైంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది.ప్లేట్లెట్స్ టెస్టు కోసం బయటికి.. నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఆస్పత్రిలో మూడు రోజులుగా వైద్యం తీసుకుంటున్నా. నా భర్తకు కూడా జ్వరమే. ఆస్పత్రిలో ప్లేట్లెట్ టెస్ట్ చేసే సదుపాయం లేదని టెస్టుల కోసం బయటికి పంపించారు. – కె.లక్ష్మీతిరుపతమ్మ, సత్తుపల్లి మందులు సరిగా ఇవ్వడం లేదు నేను నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. వైద్యులు పారాసెటమాల్ 650 ఎంజీ మాత్రలు రాశారు. కానీ సిబ్బంది 500 ఎంజీ మాత్రలు, అదీ రెండు రోజులకు సరిపడానే ఇచ్చారు. 650 ఎంజీ మాత్రలు బయట కొనుక్కోవాలని చెప్పారు. – మశమ్మ, నాగర్కర్నూల్మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావంసీరో టైప్–1, 2 డెంగీ వేరియంట్లతో ఆరోగ్యం సీరియస్.. కోవిడ్ వచ్చి తగ్గినవారిలో నీరసం మరింత ఎక్కువఅడిషనల్ డీఎంఈ రాజారావు వెల్లడి ‘‘ఏ వైరల్ జ్వరం అయినా వీక్నెస్ ఉంటుంది. కోవిడ్ వచి్చపోయిన వారిలో నీరసం మరింత ఎక్కువగా ఉంటోంది. వైరల్ జ్వరం వచ్చిన వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. డెంగీలో సీరో టైప్–2 అనేది మన వద్ద ఎక్కువగా వ్యాపిస్తోంది. మిగతా డెంగీ వేరియంట్ల కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తీవ్రత మరింత పెరుగుతుంది. ఎవరికైనా సీరో టైప్–1 డెంగీ ఒకసారి వచి్చ, రెండోసారి సీరో టైప్–2 వస్తే.. మొదటిదాని యాంటీబాడీస్, రెండో టైప్ ఇన్ఫెక్షన్ క్రాస్ రియాక్షన్ వల్ల ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఇక డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం కంటే.. ప్లాస్మా లీకేజీ చాలా ప్రమాదకరం. రక్తంలోని నీరు రక్తనాళాల నుంచి లీక్ అవడమే ప్లాస్మా లీకేజీ. దీనివల్ల పల్స్, బీపీ పడిపోవడం, తర్వాత తీవ్ర కడుపునొప్పి, వాంతులు రావడం, చెమటలు పట్టడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, అవయవాలు విఫలమయ్యే కూడా వెళ్తుంది. అయితే వంద మందికి డెంగీ వస్తే.. అందులో ఐదుగురికి మాత్రమే ప్లాస్మా లీకేజీ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం సాధారణ లక్షణమే. చాలా మందిలో వాటంతట అవే పెరుగుతాయి. ఒకవేళ రక్తస్రావం జరుగుతున్నా, 20 వేలకన్నా తక్కువకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయినా.. ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్లెట్ టెస్టులను పెథాలజిస్ట్ చూసి నిర్ధారించాలి. మిషన్‌లో లెక్కిస్తే.. ఉన్నదానికంటే తక్కువగా చూపించే చాన్స్ ఉంటుంది. – ప్రొఫెసర్ ఎం.రాజారావు, అడిషనల్ డీఎంఈఏ ఆస్పత్రిలో చూసినా అవే సమస్యలు.. ⇒ మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు పీహెచ్సీలలో మందుల కొరత ఉంది. అన్ని రకాల యాంటీ బయాటిక్స్ అందుబాటులో లేవు. జలుబు సిరప్, కంటి చుక్కల మందులు, క్లేవమ్ వంటి మందులు కూడా లేవు. ఇంజక్షన్లు అందుబాటులో లేవు. వైద్యులు ఐదారు రకాల మందులు రాస్తే వాటిలో రెండు, మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతావి బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో జ్వరం, ఇతర జబ్బులకు కేవలం రెండు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. ⇒నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. వారం రోజులకు మందులు రాస్తే.. మూడు రోజుల మందులే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు లేకపోవడంతో బయట కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ⇒బోధన్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో వరండాలో బెడ్స్ వేసి వైద్యం అందిస్తున్నారు.డెంగీతో ఇద్దరి మృతిపాపన్నపేట(మెదక్)/సిద్దిపేట అర్బన్: వేర్వేరు జిల్లాల్లో డెంగీతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్‌కు చెందిన వడ్ల రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు హర్షిత్చారి (11)కి వారం రోజుల క్రితం డెంగీ సోక గా.. కుటుంబ సభ్యులు మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ డబ్బులు కట్టలేక, నిలోఫర్‌కు తరలించగా.. హర్షిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లికి చెందిన సుతారి కనకలక్ష్మి జ్వరంతో బాధ పడుతుండటంతో సిద్దిపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా నయం కాకపోవడంతో నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపుతాం ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహఅడ్డగోలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు బాధితులు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫీసు కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయొచ్చు ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహసాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచి్చందని.. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు టాస్‌్కఫోర్స్ పనిచేస్తోందని.. ఇప్పటికే చాలా ప్రైవేట్ ఆస్పత్రులను పరిశీలించిందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై శనివారం సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. డెంగీని గుర్తించేప్పుడు టెస్టు రిపోర్టులు సరిగా ఉంటున్నాయా లేదా పరిశీలిస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఆస్పత్రులు డెంగీ పరీక్షలు చేసిన, నిర్ధారణ అయిన వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయండి: ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం ఉన్నా, లేకున్నా టెస్టులు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్ రూం నడుస్తోందని.. విషజ్వరాల బాధితులు తమ సమస్యలపై దానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ‘‘సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులంతా ఆస్పత్రుల పర్యటనకు వెళ్లాలని ఆదేశించాం. జిల్లాలో కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించాం. మందుల కొరత ఉండకూడదని చెప్పాం..’’ అని మంత్రి వెల్లడించారు. కోఠి ఆస్పత్రిలోని వెక్టార్ బార్న్ డిసీజెస్ విభాగం కంట్రోల్ రూం నంబర్ 94404 90716 -
24 గంటలు ఓపీ వైద్యసేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతాలో యువ పీజీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపి వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర వైద్య సేవలను మినహాయించింది. కోల్‌కతాలో వైద్యురాలి హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నేత డాక్టర్ నరహరి తీవ్రంగా ఖండించారు.శనివారం తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే ఒక గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. కోల్‌కతా ఘటనను తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఖండించారు. జూడాలు చేస్తున్న ధర్నాలకు హాజరు కావాలని నిర్ణయించామన్నారు. మంత్రి దామోదర సంఘీభావం డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో సంఘీభావం తెలిపారు. డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. ఇందిరా పార్కు వద్ద నేడు ధర్నా సుల్తాన్‌బజార్: మహిళా వైద్యురాలిపై అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు డాక్టర్ జె.విజయరావులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కూడా ధర్నాను విజయవంతం చేయాలన్నారు.నల్లబ్యాడ్జీలు ధరించి నేడు నిరసన వ్యక్తం చేయాలన్న నర్సుల సంఘంఉత్తరాఖండ్లో నర్సింగ్ ఆఫీసర్‌పై అత్యాచారం, హత్య, షాద్‌నగర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్‌పై జరిగిన దాడితోపాటు కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తెలంగాణ ప్రభుత్వ నర్సుల సంఘంప్రధాన కార్యదర్శి మరియమ్మ తీవ్రంగా ఖండించారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ తమ షిఫ్ట్ డ్యూటీలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రైవేటుపరం..! బాబు, పవన్ వాటాలు బయటపడ్డ నిజాలు
-
బాబు నిర్వాకం.. ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ప్రై‘వేటు’పరం!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నాయి. ఏపీలోని ఆసుపత్రులను అన్నింటినీ పీపీపీ విధానంలోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.కాగా, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు మరో షాకిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గంలో పీపీపీ పద్దతిలో ఆసుపత్రి ఉండాలని చంద్రబాబు.. వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సమీక్షలో చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో, పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దూరం కానుంది. వైద్యం మెత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది.ఇక, ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్వహించేందుకు ‘గుజరాత్ పీపీపీ మోడల్’ను అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులను పీపీపీ పద్దతిలో పెట్టాలని నిర్ణయించారు. -
పిల్లే కదా అనుకుంటే..
శివమొగ్గ: ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కరవడంతో రేబిస్ వ్యాధి బారిన పడి మహిళ మరణించిన ఘటన జిల్లాలోని శికారిపుర తాలూకా తరలఘట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గృహిణి గంగీబాయి (44) అనే మహిళ రెండు నెలల క్రితం ఇంట్లో చూసుకోకుండా పిల్లి తోకపై కాలు వేసింది.అప్పుడు పిల్లి ఆమె కాలుపై కరిస్తే, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. రేబిస్ సోకుండా ముందు జాగ్రత్తగా ఐదు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజెక్షన్‌ను మాత్రమే తీసుకుని ఏమీ కాదులే అని ఊరుకుంది. పది రోజుల క్రితం ఆమె ఉన్నఫళంగా అనారోగ్యం బారిన పడటంతో శికారిపుర తాలూకా ఆస్పత్రిలో, ఆపై శివమొగ్గలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృత్యువాత పడినట్లు జిల్లా సీజనల్ వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్ మల్లప్ప తెలిపారు. పెంపుడు జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని యాంటిబయాటిక్ ద్రవం, లేదా సబ్బుతోనైనా శుభ్రంగా కడగాలన్నారు. తరువాత సమీప ఆస్పత్రికి వెళ్లి నెల రోజుల్లో నాలుగు రేబిస్ ఇంజెక్షన్లను వేయించుకోవాలని, అప్పుడే రేబిస్ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. పిల్లి, కుక్క వంటి జంతువుల కాట్లపై నిర్లక్ష్యం వద్దని ప్రజలకు సూచించారు. -
‘ఆపరేషన్’ సిజేరియన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సహజ ప్రసవాలను పెంచేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కాగా, 2023–24లో రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా ప్రసవాలు జరగ్గా, వీటిలో 4.48 లక్షల ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేశారు. వీటిలో 50 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అవసరం లేకపోయినా చేసిన సిజేరియన్ ఆపరేషన్లే. ఇలాంటి ప్రసవాలు చేసిన ఆస్పత్రులపై వైద్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.ఇందులో భాగంగా వంద శాతం సిజేరియన్లు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోని 104 నెట్వర్క్ ఆస్పత్రులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటికి ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. సాధారణ ప్రసవం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో గర్భిణులు ఆస్పత్రులకు రావడం వల్లే సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్లు అన్ని ఆస్పత్రులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అదే విధంగా తొలి కాన్పు సిజేరియన్ ఉండటం వల్ల రెండో కాన్పు కూడా సిజేరియన్ చేశామన్నారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలను వైద్య శాఖ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. కర్నూలులో అత్యధికంగా సిజేరియన్లు 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షలు సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. సిజేరియన్ ఆపరేషన్లలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 23,500 సిజేరియన్లు జరగ్గా, వీటిలో 16,678 ప్రైవేటు ఆస్పత్రుల్లో చేశారు. 20,059 సిజేరియన్లతో పశి్చమ గోదావరి రెండో స్థానంలో, 19,855తో అనంతపురం మూడో స్థానంలో ఉన్నాయి.45 శాతం అనవసరమే సిజేరియన్ ప్రసవాలను నియంత్రించడంలో భాగంగా 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మ«ధ్య రాష్ట్రవ్యాప్తంగా 62 ఆస్పత్రుల్లో 278 ఆపరేషన్లపై వైద్య శాఖ ఆడిట్ నిర్వహించింది. వీటిలో 155 సిజేరియన్లు ( 55 శాతం) గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలతో అవసరం మేరకే చేసినట్లు తేలింది. మరో 72 కేసుల్లో (26 శాతం) అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్టు ఆధారాలతో తేలింది.. మిగిలిన 53 కేసుల్లో (19 శాతం) సిజేరియన్‌కు అవసరమైన ఆధారాలు ఏమీ లేనట్టు తేలింది. అంటే 45 శాతం సిజేరియన్లు అవసరం లేకుండానే చేసినట్లు తేలింది.⇒ ప్రైవేట్ ఆస్పత్రులు సిజేరియన్ల వైపు మొగ్గు చూపడానికి కారణాలు ⇒ సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఇస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం ⇒ సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు.⇒ సాధారణ ప్రసవానికి ప్రయతి్నస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీíÙయా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ⇒ యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు చేయడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ⇒సిజేరియన్ ప్రసవం వల్ల కలిగే సమస్యలను వివరించి, సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా గర్భిణి, కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
ఢిల్లీలో ప్రైవెట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
అవసరానికి మించి సిజేరియన్లు..
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్‌కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్ఓ, గుంటూరు -
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
● ఆస్పత్రిలో బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన ● పోలీసుల జోక్యంతో విరమణ మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
కడుపు కోతకు చెక్..!
సాక్షి, రాజమహేంద్రవరం: బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అదీ సహజ పద్ధతిలో జరిగితే తల్లీ, బిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహం అమ్మ కడుపును కోసేస్తోంది.. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్లు యథేచ్ఛగా చేసేస్తున్నారు. గర్భిణి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే శస్త్ర చికిత్స తప్పుకాదు. కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా శ్రస్త్ర చికిత్సలనే ప్రోత్సహిస్తున్నారు. సిజేరియన్‌కు రూ.40 వేల నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి(కోత కనబడని శస్త్ర చికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రుతలకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్ర చికిత్సలే చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ దుస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్య శాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్ల వల్ల కలిగే అనర్ధాలు, సహ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు పోత్రహించేందుకు ‘సీ–సేఫ్’ విధానాన్ని రూపకల్పన చేసి అమలుకు శ్రీకారం సన్నద్ధమవుతోంది. ఇదీ సంగతి జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 300కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రాజమహేంద్రవరం జీజీహెచ్, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, కడియం పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వైద్య శాఖ గణాంకాల ప్రకారం 50 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటిలో 80 శాతం శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే 50 శాతానికి పైగా అపరేషన్లు జరుగుతున్నాయి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండటంతో బాలింతలకు ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి మార్చి 22 వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 22,648 ప్రసవాలు జరిగాయి. అందులో ప్రైవేటులో అత్యధికంగా 15,804, అందులో 10,433 సిజేరియన్లు జరిగాయి. 5,370 సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,844 జరగ్గా.. కేవలం 3,552 శస్త్ర చికిత్సలు మాత్రమే చేశారు. అదీ హైరిస్క్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. 3,763 సాధారణ ప్రసవాలు జరిగాయి. నర్సులకు శిక్షణ సహజ ప్రసవాలు పెంచే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్ వైఫరీ(ఎన్‌పీఎం) కోర్సులో శిక్షణ అందించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళలకు అవసరమైన వైద్యం ఎలా అందజేయాలో వివరించారు. హైరిస్క్‌లో ఉన్న గర్భిణులను గుర్తించడం, వారికి అందించాల్సిన వైద్యం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డులో పరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. సీ–సేఫ్ అంటే.. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియనుల చేయాలన్నదే ‘సీ–సేఫ్’ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాతృశిశు మరణాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తుంది. సాధారణ కాన్పులే మేలు నవమాసాలు మోస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో శస్త్రచికిత్సలను ప్రోత్సహించడం తగదని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. నార్మల్ డెలివరీ జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితిని బట్టి రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్ర చికిత్స చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్‌ను ప్రోత్సహిస్తున్నారు. వైద్యుల్లో సైతం వేచి చూసే ధోరణి ఉండాలి. రోగుల ఒత్తిడి మేరకు శస్త్ర చికిత్సలను ప్రోత్సహించడం తగదు. గర్భం దాల్చినప్పటి నుంచి తేలికపాటి వ్యాయామాలు చేస్తే కాన్పు సమయంలో ఇబ్బందులు పడాల్సి అవసరం ఉండదని సూచిస్తున్నారు. జిల్లాలో మూడు నెలలుగా శస్త్ర చికిత్సలు, నార్మల్ డెలివరీలు ఇలా.. ఆస్పత్రి నెల సిజేరియన్లు నార్మల్ డెలివరీ ప్రభుత్వ జనవరి 236 251 ఫిబ్రవరి 253 250 మార్చి 215 244 ప్రైవేటు జనవరి 916 389 ఫిబ్రవరి 631 345 మార్చి 599 292 గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అవసరం లేకుండా చేపట్టే జిసేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకు గాను ప్రతి పీహెచ్సీ, గ్రామాల్లో గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నా.ం ఈ క్రమంలో సీ–సేఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం... – డాక్టర్.కె. వెంకటేశ్వరరావు,జిల్లా వైద్య శాఖాధికారి -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
ఐదు రోజులు మృత్యువుతో పోరాటం
వరంగల్ : ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కింద పడిన ఓ విద్యార్థిని ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే హసన్పర్తికి చెందిన లిక్కి శంకర్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు అక్షయ(13), కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గొల్లపల్లి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. నగరంలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో అక్షయ 8వ తరగతి చదువుతోంది. ఈనెల 21న అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అవయవాల దానం అక్షయ అవయవాలను దానం చేశారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యసిబ్బంది నేత్రాలతో పాటు ఇతర అవయవాలను సేకరించారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య అక్షయ అంతిమయాత్ర సాగింది. పార్థివదేహం ఇంటికి చేరుకున్న సమాచారం అందుకున్న పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్షయ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో తెలివి గల విద్యార్థినిగా ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు. అనంతరం హసన్çపర్తిలో శ్మశాన వాటికలో అక్షయ అంత్యక్రియలు నిర్వహించారు. -
వీర్యం తారుమారు చేసినందుకు రూ.1.5 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించడమే ఇందుకు కారణం. అసిస్టెట్ రిప్రొడక్టివ్ టెక్నిక్(ఏఆర్టీ) విధానంలో సంతానం కోసం దంపతులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత 2009 జూన్‌లో వారికి కవలలు జని్మంచారు. శిశువులకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా, వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్లు స్పష్టమయ్యింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ దర్యాప్తు వారికి అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్ఏ ప్రొఫైల్‌ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. -
రూపాయికే కార్పొరేట్ వైద్యం.. డాక్టర్ హర్షవర్ధన్ గొప్ప మనసు
ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే భావనతో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తరువాత ఇల్లెందులో సొంత క్లినిక్ పెట్టారు. ఈలోగా ఇల్లెందు వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ అప్‌గ్రేడ్ చేశారు. హర్షవర్ధన్‌కు ఆ ఆస్పత్రిలో సర్జన్‌గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆ ఆస్పత్రిలో ఈఎన్టీ విభాగంలో డాక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం... ఖాళీ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రి. సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మథనం మొదలైంది. పుచ్చలపల్లి సోదరుడే స్ఫూర్తి.. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ పేరిట రూ.10 ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకే చెందిన హర్షవర్ధన్... రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లెందు ఆంబజార్‌లో పెట్టిన సొంత క్లినిక్‌లో రూపాయి ఫీజుకే వైద్యం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు పూర్తయ్యాక, సాయంత్రం క్లినిక్‌లో సేవలందిస్తున్నారు. ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స కూడా చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాలు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు.. మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు, నడుము, మెడనొప్పి, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు అత్యాధునిక పద్ధతిలో వైద్యమందించారు. మోకాలు చిప్ప మార్పిడి చేశారు.. నడవడం ఇబ్బందిగా ఉండడంతో ఓ డాక్టర్ వద్ద పరీక్ష చేయించుకున్నా. మోకాలు చిప్ప అరిగిపోయిందని, మార్చాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఇల్లెందులో ప్రజా వైద్యం అందిస్తున్న హర్షవర్ధన్‌ను సంప్రదించాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాలి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నా. – వి.బాయమ్మ, మామిడిగూడెం, ఇల్లెందు మండలం పేదలను ఆదుకోవాలని..డాక్టర్ జి.హర్షవర్ధన్, ఆర్థోపెడిక్ సర్జన్ ప్రస్తుత వైద్యం అత్యంత ఖరీదైంది. సామాన్యులను అందకుండాపోతోంది. అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నా. ప్రభుత్వ వైద్యులుగా నాకు, నా భార్యకు వచ్చే వేతనం మా కుటుంబానికి సరిపోతుంది. అందుకే క్లినిక్‌లో నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తున్నా. -
ఆరోగ్యానికి వై‘ఎస్సార్’.. ప్రైవేటుకు దీటుగా వైద్యం
కాకినాడ సిటీ: చిన్న జబ్బు చేసి, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రోజుకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 ఖర్చు చేయాల్సిందే. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి తరచూ రక్త పరీక్ష, మందుల ఖర్చు సరేసరి. ఇటువంటి పరిస్థితుల్లో జబ్బు చేసిందంటే పేదవారు ఆర్థికంగా ఇబ్బందులు పడక తప్పేది కాదు. ఈ దుస్థితి నుంచి వారిని బయట పడేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యరంగంపై ఫోకస్ పెట్టారు. పక్కా భవనాలు, నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది, అన్ని సౌకర్యాలతో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు (యూహెచ్‌సీ) ఏర్పాటు చేశారు. ఇవి పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా ఇస్తున్నాయి. కాకినాడ, పెద్దాపురం, తుని, సామర్లకోట, పిఠాపురం వంటి పట్టణాల్లో శివారు ప్రాంతాల నుంచి సైతం 10 నిమిషాల్లో కాలినడకన చేరుకునేలా యూహెచ్‌సీలు ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండగా, వీటితో పాటు జిల్లాలో కొత్తగా 23 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో యూహెచ్‌సీకి రూ.80 లక్షల చొప్పున వెచ్చించారు. ప్రభుత్వ సాయం మరువలేం పిల్లలు, వృద్ధులకు చిన్నపాటి జబ్బు చేస్తే.. ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. చాలా దూరం కావడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లడానికి ఎంతో సమయం పట్టేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి సత్వరమే ఉచిత వైద్యం అందిస్తోంది. ప్రభుత్వ సాయాన్ని పేద ప్రజలు ఎప్పటికీ మరువలేరు. – డి.జితేంద్రసింగ్, స్వర్ణాంధ్ర కాలనీ, కాకినాడ అన్ని రకాల చికిత్సలూ అందిస్తున్నాం వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లో పేదలకు అన్ని రకాల వైద్య చికిత్సలూ అందిస్తున్నాం. ముఖ్యంగా ల్యాబ్ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి, దీర్ఘకాలిక రోగులకు ఎప్పటికప్పుడు ఉచితంగా మందులు అందజేస్తున్నాం. కొంత ఇబ్బందికరంగా ఉన్న రోగులను పర్యవేక్షణలో ఉంచుకుని, వైద్యం అందించేందుకు 10 పడకలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పడిప్పుడే వీటికి అవసరమైన పరికరాలు వస్తున్నాయి. రోగులకు అవసరమైన స్థాయిలో సిబ్బంది ఉండటంతో సత్వరం వైద్య సేవలందిస్తున్నాం. వారంలో ఒక రోజు ఇద్దరు, ముగ్గురు స్పెషలైజేషన్ చేసిన వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. – డాక్టర్ వి.మహేష్, పర్లోవపేట, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్, కాకినాడ ఇవీ సౌకర్యాలు ► ఒక్కో అర్బన్ హెల్త్ సెంటర్‌ను 10 గదులతో నిర్మించారు. ► ప్రతి భవనంలో 10 పడకలు, ఓపీ–1, ఓపీ–2, లేబర్ రూము, మైనర్ ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, యోగా గది, ఫార్మా గది, మినీ వార్డులు ఉన్నాయి. ► ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక వైద్యాధికారి వైద్య సేవలు అందిస్తారు. వీరితో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, అటెండర్ అందుబాటులో ఉంటారు. ► ప్రతి సోమవారం ఒక స్పెషలైజేషన్ వైద్యుడి సేవలు అందిస్తున్నారు. ► బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగులు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగనవసరం లేకుండా అర్బన్ హెల్త్ సెంటర్లోనే రక్త పరీక్షలు చేస్తారు. ► అనంతరం వైద్యులు ఆ రిపోర్టులు చెక్ చేసి, ఉచితంగా మందులు అందజేస్తారు. ► ల్యాబ్‌లో అన్ని రకాల వైద్య పరీక్షలూ ఉచితంగా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► ఎవరికైన రోగ తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ–సంజీవని యాప్ ఆయా స్పెషలైజ్డ్ డాక్టర్ల సలహా తీసుకుని, చికిత్స చేసి, మందులు అందజేస్తారు. శివారు ప్రాంతాలకు ఎంతో మేలు డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు పట్టణాల్లోని శివారు ప్రాంత ప్రజలకు వరంలా ఉన్నాయి. కాకినాడ నగరంలోని దుమ్ములపేట, పర్లోవపేట, సంజయ్‌నగర్, సాంబమూర్తినగర్, రేచర్లపేట కొత్త కాకినాడ, జగన్నాథపురం, నరసింహా రోడ్డు, పప్పుల మిల్లు, పద్మనాభ నగర్, ఏటిమొగ, ముత్తానగర్, మహాలక్ష్మి నగర్, రణదీప్ నగర్, నాయకర్ నగర్, జె.రామారావుపేట, ఏసువారి వీధి, చినమార్కెట్ తదితర శివారు ప్రాంతాలకు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ శివారు కాలనీల్లోని ప్రజలు గతంలో ఏదైనా చిన్నపాటి జబ్బు చేస్తే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్)కి వెళ్లడానికి చాలా వ్యయప్రయాసలు పడేవారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లతో చేరువలోనే సత్వర వైద్య సేవలు అందుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా...
-
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు
-
కుమార్తె సీమంతం.. గంటల్లోపే మృత్యు ఒడికి తండ్రి
కళ్యాణదుర్గం: కుమార్తె సీమంతం ఘనంగా జరిపిన 24 గంటల్లోపే ఆ ఇంట విషాదం నెలకొంది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన గంగవరం గంగన్న (52) ఒక్కగానొక్క కుమార్తె జయంతి సీమంతం వేడుకను బుధవారం బంధువుల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. రాత్రి పొద్దుపోయాక గంగన్న ఛాతినొప్పితో విలవిల్లాడుతుంటే కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న అతను ఛాతి నొప్పి రావడంతో మృతి చెందినట్లు అల్లుడు ప్రవీణ్ తెలిపారు. కాగా, గంగన్న గతంలో ఆర్డీటీ ఉపాధ్యాయుడిగా, ఆయన భార్య హంపమ్మ గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించారు. (చదవండి: విజయవాడలో దారుణం.. స్నేహితు పనేనా..?) -
ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై..
విజయనగరం ఫోర్ట్: రక్తపరీక్షల కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన మహిళపై ఆస్పత్రి ఉద్యోగి మంగళవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళకు ఈసీజీ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో ఆమె ఈసీజీ గది లోకి వెళ్లగా అక్కడి ఉద్యోగి లైంగికదాడికి యత్నించినట్లు తెలిసింది. చదవండి: వాట్సాప్ కాల్ చేయమంది, అంతలోనే.. దీంతో ఆమె బయటకు పరిగెత్తుకుని వచ్చి బంధువులకు విషయం తెలపడంతో వారు డయల్ 100కు ఫోన్ చేశారు. లైంగిక దాడి యత్నానికి గురైన బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఉద్యోగిని చితకబాదినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే వన్‌టౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టగా సదరు బాధితురాలు ఇక్కడ ఎటువంటి సంఘటన జరగలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం గమనార్హం. -
ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జబల్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసినపడిన మంటలకు 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మిగిలిన వార్డుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జబల్పూర్, దమోనాకా ప్రాంతంలోని న్యూలైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ సిద్ధార్థ్ బహుగుణా తెలిపారు. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు చెప్పారు. ఆసుపత్రిలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఆసుపత్రిలో అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. #WATCH | Madhya Pradesh: Fire breaks out at Jabalpur Hospital. Further details awaited pic.twitter.com/RdjjqARKIY — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 1, 2022 ఇదీ చదవండి: చిన్నారిని బలితీసుకున్న చైన్ స్నాచర్.. నీటి సంపులో పడేయడంతో.. -
సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..?
-
విషాదం: పుట్టిన కొన్ని గంటలకే శిశువు.. ఆ వెంటనే తల్లి..
సాక్షి. ఆదిలాబాద్: శుభవార్త కోసం వేచిచూస్తున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.. మొదటి కాన్పు కావడంతో పుట్టింటి, నెట్టింటివారు గర్భి ణిని ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్న మగ శిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. అయితే వారి సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో శిశువు మృతిచెందగా, సాయంత్రం 5 గంటలకు బాలింత తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సయ్యద్ అక్బర్అలీ, షాకెర సుల్తానాకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల షాకెరా సుల్తానా గర్భం దాల్చింది. మంగళవారం ఉదయం 8 గంటలకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని శారద నర్సింగ్ హోమ్‌కు తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ఉదయం 11.30 గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. 2.30 గంటల ప్రాంతంలో మగ బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే శిశువు శ్వాస సరిగా తీసుకోవడంలేదని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించడంతో కుటుంబీకులు అంత్యక్రియలు జరిపారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బాలింత కూడా మృతిచెందిందని వైద్యురాలు చైతన్య స్రవంతి కుటుంబ సభ్యులకు తెలిపారు. మొదట బాలింత పరిస్థితి ఏ విధంగా ఉందని అడగగా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పినా ఇక్కడే వైద్యం అందిస్తామని వైద్యురాలు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: తెలంగాణ: ఒక్కరోజే ఆరుగురి మృతి.. దాంతో ఆటలోద్దు! డాక్టర్ నిర్లక్ష్యంతోనే.. వైద్యురాలి నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ మృతిచెందారని బంధువులు, కుటుంబీకులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో జనాలు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆస్పత్రిలోనికి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసేందుకు యత్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలిపై కేసు నమోదు చేసి ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావ్, వన్‌టౌన్ సీఐ, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అయినా ఆందోళన కొనసాగించారు. ఆస్పత్రిలో ఉన్న ఆందోళనకారులను పోలీసులు బయటకు తీసుకురావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఓ వైద్యుడు సాధారణ కాన్పు జరిగిందని, బీపీ ఎక్కువై ఫిట్స్ రావడంతో బాలింత మృతిచెందిందని తెలిపారు. ఈ విషయమై వైద్యులను ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. -
ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
కొత్తూరు: ప్రమాదవశాత్తు ఐదేళ్ల విద్యార్థికి మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. ఎంఈవో కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇమామ్, షభానాబేగంలకు ముజామిల్ (5)తో పాటు మూడేళ్ల వయస్సున్న కూతురు ఉంది. ముజామిల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్తున్న క్రమంలో 9.30 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ పక్కన విద్యార్థికి మంటలు అంటుకోవడాన్ని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు మంటలను ఆర్పేసి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, షాద్‌నగర్ ఆర్డీఓ రాజేశ్వరితో పాటు ఎంఈవో కృష్ణారెడ్డి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. పాఠశాల సమీపంలో చెత్తకు పెట్టిన నిప్పు వద్ద బాధిత విద్యార్థితో పాటు మరో బాలుడు ఆడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఎంఈవో తెలిపారు. -
ఒక్కరోజే 2,484 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఆదివారం 65,263 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,484 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.61 లక్షలకు చేరుకుంది. తాజాగా 4,207 మంది కోలుకోగా, మొత్తంగా 7.18 లక్షలమంది రికవరీ అయ్యారు. ఆదివారం కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు 4,086 మంది బలయ్యారు. ప్రస్తుతం 38,723 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిలో 3,214 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 843 మంది ఐసీయూలో, 1,319 మంది ఆక్సిజన్, సాధారణ పడకలపై 1,052 ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. -
ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే కన్నుమూత
పుణె (ముంబై): ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే (67) అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఆయన గత కొద్దికాలంగా బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య ఒక కుమారుడు, కుమార్తె, తల్లి ఉన్నారు. ఇండియన్ లా సొసైటీ నుంచి లా పట్టాను పొందిన షివాడే బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు, షినే అహుజాపై రేప్ కేసులను వాదించారు. వీటితోపాటుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, షీనాబోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీ తరఫున కేసును, వజ్రాల వ్యాపారి భరత్షా కేసులను షివాడే కోర్టులో వాదించారు. చదవండి: (మొబైల్ మింగేశాడు.. ఎండోస్కోపీతో..) -
బయోగ్యాస్ ప్లాంట్‌లో పుర్రెలు, పిండాల ఎముకలు
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఆవరణలో కనీసం 11 పుర్రెలు 54 పిండాల ఎముకలను పోలీసులు వెలికి తీశారు. ఈ మేరకు పోలీసులు అక్రమ అబార్షన్ కేసును విచారిస్తున్నప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దీంతో ఆ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ రేఖా కదమ్, నర్సుని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...13 ఏళ్ల బాలికకు బలవంతంగా అబార్షన్ చేయించుకోమని బాలికతో సంబంధం పెట్టుకున్న మైనర్ బాలుడి తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈక్రమంలో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆ బాలికను అబార్షన్ చేయించుకోకపోతే నీ పరువు తీస్తామని బెదిరించారు. అంతేకాదు ఆమెకు అబార్షన్ చేయించేందుకు వైద్యులకు డబ్బులు కూడా ఇచ్చారు. ఒక బాలికకు బలవంతంగా అబార్షన్ చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేయడం ప్రారంభించాం. అప్పుడు ఆర్వీ తహసీల్‌లోని కదమ్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్‌ను తనీఖీ చేస్తుండగా పిండాలు, ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఆ మైనర్ బాలుడి తల్లితండ్రులను, వైద్యుడిని, నర్సుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాం అని పోలీసులు తెలిపారు. (చదవండి: ఏంటా దూకుడు!... బ్రేక్ వేసుండకపోతే పరిస్థితి....) -
కువెంపు కోడలు రాజేశ్వరి కన్నుమూత
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): జాతీయ కవి కువెంపు కోడలు, కవి కే.పీ.పూర్ణచంద్ర తేజస్వి సతీమణి రాజేశ్వరి (84) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి అనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. చికిత్స ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె కోరిక మేరకు దేహాన్ని ఓ ఆస్పత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: డిజిటల్ కరెన్సీకి తుది మెరుగులు!.. సెబీకి అప్పగిస్తే ఏం చేద్దాం? -
హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆ వార్తలపై క్లారిటీ..
Samantha Falls Sick And Tested In Private Hospital: స్టార్ హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకొని వెళ్లింది. గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన సమంత ప్రస్తుతం జర్వం, జలుబుతో బాధపడుతోంది. దీంతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంది. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. అయితే సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆమె మేనేజర్ మహేంద్ర స్పందించారు. సామ్ ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థత కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని పేర్కొన్నారు. -
నాలుగేళ్ల క్రితం వివాహం.. పురుగులమందు తాగిన వివాహిత
సాక్షి, బెజ్జంకి(మెదక్): పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వివాహిత మృతిచెందింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని గుండారం గ్రామానికి చెందిన ఎలుకంటి గురువారెడ్డి, లక్ష్మీల కూతురు శిరిషను నాలుగేళ్ల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన నాగెల్లి రజనీకాంత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి కూతురు వినీక్ష ఉంది. ఆరు నెలల క్రితం రజనీకాంత్‌కు ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో శిరీషను గుండారంలోని తల్లిగారింట్లో వదిలి వెళ్లాడు. పెళ్లికి ముందు నుంచి ఫిట్స్‌తో బాధపడుతున్న శిరీష తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో మనస్తాపం చెంది ఈనెల 6న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చదవండి: Hyderabad: సెల్‌ఫోన్ చోరుల కొత్త పంథా -
‘రహెనుమా–ఎ– దక్కన్’ చీఫ్ ఎడిటర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/దూద్‌బౌలి: ప్రముఖ ఉర్దూ దినపత్రిక రహెనుమా–ఎ–దక్కన్ చీఫ్ ఎడిటర్ సయ్యద్ వికారుద్దీన్(82) గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. హోంమంత్రి మహమూ ద్ అలీ తదితరులు వికారుద్దీన్ నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళి అర్పించారు. శుక్రవా రం ఉదయం ఆయన నివాసం నుంచి భౌతికకాయాన్ని జనాజేకీ నమాజ్ (అంతిమ ప్రార్థనలు) కోసం మక్కా మసీదుకు తీసుకొచ్చారు. ఈ ప్రార్థనల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఎంబీటీ, ఎంఐఎం పార్టీల నేతల తోపాటు ముస్లిం మతపెద్దలు, అభిమానులు పాల్గొన్నారు. మక్కా మసీదు నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర లాడ్‌బజార్, ముర్గీచౌక్, మూసాబౌలి మీదుగా హుస్సేనీ ఆలంలోని మూసా ఖాద్రీ దర్గా వరకు సాగింది. తర్వాత అంత్యక్రియలు నిర్వ హించారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీలో డిగ్రీ చదివిన ఆయన 65 ఏళ్లుగా రహెనుమా–ఎ– దక్కన్ పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా సేవలు అందిస్తున్నారు. ఇటీవలే ఆ పత్రిక వందేళ్లు పూర్తిచేసుకుంది. ముస్లిం దేశాల సమైక్యత కోసం ఆయన ఇండో–అరబ్ లీగ్ సంస్థను స్థాపించారు. ఆయన కృషి వల్లే ఆ సంస్థకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించింది. పాల స్తీనాపై ఇజ్రాయిల్ దురాక్రమణను ఆయన తీవ్రంగా నిరసించేవారు. పాలస్తీనా విమోచనాయోధులు యాసర్ అరాఫత్, మహమూద్ అబ్బాస్, అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌లతో సంబంధాలుండేవి. భారత్– అరబ్ దేశాల మైత్రి కోసం చేసిన కృషికి 22 అరబ్బు దేశాల లీగ్ సంస్థ ఆయనకు పురస్కా రాన్ని అందజేసింది. స్టార్ ఆఫ్ జెరూసలేం అవార్డునూ అందుకున్నారు. ఆయన మృతికి భారతదేశంతోపాటు అరబ్బు దేశాల దౌత్య కార్యాలయాలు సంతాపం తెలిపాయి. వికారుద్దీన్ మృతిపట్ల సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
2 ఆస్పత్రుల్లో 2 సర్జరీలు.. మృతదేహానికి పోస్టుమార్టం!
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.గోల్కొండ పోలీసులు తెలిపిన మేరకు.. పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీకి చెందిని షేక్ అబ్దుల్ రహీం లక్డీకపూల్లో మిరాకిల్ గ్లాస్ ట్రేడర్ పేరు షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 2వ తేదీ సాయంత్రం తన వీపు పై భాగంలో నొప్పిగా ఉందని, అక్కడ కురుపు లాగా ఉందని రహీమ్ కొడుకు షేక్ జునేద్ (21) తండ్రికి తెలిపాడు. దీంతో తండ్రి షేక్ అబ్దుల్ రహీమ్.. జునేద్‌ను పుప్పాలగూడలోని ప్రో లైఫ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్‌కు పరీక్షలు నిర్వహించి క్లినిక్‌లోకి తీసుకువెళ్లి షేక్ అబ్దుల్ రహీమ్‌ను అడగకుండానే మైనర్ సర్జరీ చేసి కురుపును తొలగించాడు. సర్జరీ విషయం తెలిసిన జునైద్ తండ్రి ఎటువంటి పరీక్షలు లేకుండానే, తన అనుమతి లేకుండానే ఎందుకు చేశావని నిలదీశాడు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో షేక్ జునేద్‌కు నొప్పి బాగా పెరిగింది. అక్కడరక్తస్రావమైంది. గమనించిన డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్‌ను వెంటనే టోలిచౌకిలోని ఆపిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడ షేక్ జునేద్‌కు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు నేరుగా ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. కురుపు వద్ద మైనర్ సర్జరి చేసే సమయంలో సూది జునైద్ శరీరంలోనే ఉండిపోయిందని డాక్టర్ సజ్జాద్ తెలిపారు. ఇదిలా ఉండగా 3వ తేదీ తెల్లవారు జామున షేక్ జునైద్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆపిల్ ఆస్పత్రిలో కూడా అనుమతి లేకుండా సర్జరీ చేశారని షేక్ అబ్దుల్ రహీం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదును గోల్కొండ పోలీసులు బుధవారం స్వీకరించి కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి విజ్ఞప్తి మేరకు గురువారం ఉస్మానియా వైద్యులు ఖననం చేసిన షేక్ జునైద్ మృతదేహాన్ని వెలికితీసి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కాగా సెవెన్ టూంబ్స్ సమీపంలోని స్మశానవాటిలో పోస్టుమార్టం నిర్వహించే సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..
నిజామాబాద్ అర్బన్: దళిత విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. సామూహిక అత్యాచారం కేసు వివరాలను గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన నవీన్‌కుమార్‌కు, బాధిత విద్యార్థినితో పరిచయం ఉంది. మంగళవారం నవీన్, మరో ఇద్దరు కలసి ఆమెను తీసుకుని నగర శివారుతోపాటు అంకాపూర్ తదితర ప్రాంతాల్లో తిరిగారు. అక్కడ ఆమెకు బిర్యాని తినిపించడంతోపాటు మభ్యపెట్టి మద్యం తాగించారు. అర్ధరాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మర మ్మతులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అక్కడే ఎదురుగా ఉన్న షాపింగ్‌మాల్ సెక్యూరిటీ గార్డ్ గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సెక్యూరిటీ గార్డు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి విద్యార్థినిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నవీన్‌తో పాటు గంజి చంద్రశేఖర్, తుమ్మ భానుప్రకాశ్, సిరిగాద చరణ్, షేక్ కరీం, పి.గంగాధర్ పాల్గొన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో ఐదుగురిని బుధవారం అరెస్టు చేయగా, ఒకరిని గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం
-
‘సర్వేపల్లి’ మనుమడు కేశవ్ దేశిరాజు కన్నుమూత
సాక్షి,చెన్నై/బాపట్ల: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు (కుమార్తె కుమారుడు), విశ్రాంత ఐఏఎస్ అధికారి కేశవ్ దేశిరాజు (66) చెన్నైలో ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. తన తాత రాధాకృష్ణన్ జయంతి రోజునే ఆయన తనువు చాలించడం విచారకరం. కేశవ్ పూర్వీకులు బాపట్లలోని దేశిరాజు వారి వీధిలో నివసించారు. ఇప్పటికీ చాలామంది దేశిరాజు కుటుంబాల వారు అక్కడ ఉన్నారు. 1978 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కేశవ్.. కేంద్ర ఆరోగ్య శాఖ, వినియోగదారుల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. తన తాత సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తిని అణువణువునా పుణికిపుచ్చుకున్న కేశవ్ దేశిరాజు అనేక పుస్తకాలు రాశారు. కేశవ్ దేశిరాజు మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ సంతాపం తెలిపారు. -
‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పాడు.. తీరా చూస్తే!
సాక్షి, పంజగుట్ట: సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు మృతిచెందాడని సమాచారం ఇచ్చారు. తీరా శ్వాస తీసుకోవడం గమనించి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పల్స్ చెక్ చేయగా 95 చూపించింది. వారు నిర్ఘాంతపోయి ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బాధితుల కథనం మేరకు సనత్‌నగర్‌కు చెందిన మహేందర్ అనే వ్యక్తి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతన్ని మొదట ఈసీఐఎల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్ చేసుకోలేదు. అక్కడ నుంచి సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం అడ్మిట్ చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా చికిత్స కోసం వారు అప్పటికే రూ.3.5 లక్షలు చెల్లించారు. శనివారం మధ్యాహ్నం మహేందర్ చనిపోయాడని చెప్పి వెంటిలేటర్ తొలగించి బయటకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు రోధిస్తూ వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా మహేందర్ శ్వాస తీసుకోవడాన్ని గమనించి వెంటనే పల్స్ చూడగా బతికే ఉన్నాడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బతికున్న రోగిని చనిపోయాడని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ధర్నాకు దిగి ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి మహేందర్‌ను తిరిగి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. చదవండి: Hyderabad Rains: మళ్లీ కుమ్మేసిన వాన.. ఎక్కడ ఏమైందంటే! -
అదనపు కట్నం కోసం వేధింపులు.. ఎనిమిది నెలల నిండు గర్భిణి పై..
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన ఎనిమిది నెలలకే మరో వివాహిత తనువు చాలించింది. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా.. అత్తింటివారు హత్య చేశారని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కారణాలేవైనా ఇద్దరు గర్భిణులు ఆత్మ హత్య చేసుకోవడం స్థానికులను కలిచివేసింది. సాక్షి, భీమారం(ఆదిలాబాద్): అత్తింటి వేధింపు తాళలేక మండలంలోని నర్సింగాపూర్(బి) గ్రామానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణి దుర్గం రమ్య (20) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ మండలం ఓత్కులపల్లి గ్రామానికి చెందిన జుమ్మడి లక్ష్మి, రాజలింగు దంపతుల కుమార్తె రమ్యకు 2020 జూన్ 26న భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం రాజ శేఖర్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో ఒప్పుకున్న ప్రకారం కట్నంతోపాటు 10 గుంటల భూమి ఇచ్చారు. ఆ భూమి అమ్మి డబ్బులు తీసుకురావాలని భర్తతోపాటు అత్తమామలు రమ్యపై ఒత్తిడి తెస్తున్నారు. మరో రూ.50వేలు అదనపు కట్నం తీసుకురావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో అదనపు కట్నం తెచ్చేందుకు ఆమె నిరాకరించడంతో గర్భిణి అని కనికరం చూపకుండా శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో వేధింపులు తాళలేక రమ్య శుక్రవారం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం భీమారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రమ్య మృతిచెందినట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. మృతురాలి భర్త రాజశేఖర్, అత్తమామలు శశక్క, భూమన్న, మరిది రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని అన్నారు. చదవండి: పెళ్లయిన ఎనిమిది నెలలకే అఘాయిత్యం -
పోలీస్‌నంటూ వైద్యుడిని బెదిరించి రూ.75 లక్షలు కాజేయబోయిన కిలాడి దొంగ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రముక ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం ఆ వైద్యుడి వద్ద మహేశ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేశాడు. ఆ సమయంలోనే ఆ వైద్యుడికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి అతను సేకరించాడు. ఈ విషయం తెలిసుకున్న ఆ వైద్యుడు అతన్ని పనిలో నుంచి తీసేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి మహేశ్ ఓ ప్రైవేటు సంస్థలో హెచ్ఆర్గా పని చేస్తున్న గౌతం నాయర్ వద్ద డ్రైవర్‌గా చేరాడు. అయితే మహేశ్ తన జల్సాల కోసం గౌతం నాయర్ వద్ద నుంచి మొత్తం రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు చెల్లించ లేని మహేశ్ తప్పుడు మార్గంలో అధిక మొత్తం సంపాదంచే ఓ ప్రణాళికను గౌతం నాయర్‌కు చెప్పాడు. గతంలో తాను ఓ వైద్యుడి వద్ద పని చేశానని, వైద్యుడు తన భార్యను చంపుతానని మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి తన వద్ద ఉందని దానిని ఆసరాగా చేసుకొని ఆ వైద్యుడిని బెదిరించి డబ్బు సంపాదిద్దామని గౌతం నాయర్‌కు ప్లాన్ చెప్పాడు. మహేశ్ మాటలు విని ఈ నెల 14న గౌతం నాయర్ వైద్యుడికి ఫోన్ చేసి తాను ఖమ్మం సీఐనని మీ ఆడియో క్లిప్ ఒకటి తన వద్ద ఉందని రూ.75 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించాడు. దీంతో ఆ వైద్యుడు వెంటనే పోలీస్‌లను ఆశ్రయించాడు. కేసు నమొదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ వైద్యుడితో గౌతం నాయర్‌కు రూ.75 లక్షలు కాదని రూ.20 లక్షలు చెల్లిస్తానని తన ఆడియో క్లిప్ తనకి ఇవ్వవలసిందిగా పోలీసులే దగ్గరుండి ఫోన్ చేయించారు. అలాగే డబ్బులు తీసుకోడానికి బంజారాహిల్స్‌లోని ఓ ప్రముక ఆలయం వద్దకు రావాల్సిందిగా సూచించారు. అయితే గౌతం నాయర్ పోలీస్ స్టిక్కర్ వేసిన కారులో ఆలయానికి వచ్చాడు. అప్పటికే పోలీసులు ఆ ఆలయం వద్ద కాపు కాశారు. ఈ క్రమంలోనే ఆ వైద్యుడితో గౌతం నాయర్ మాట్లాడుతుండగానే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో ప్రధాన నిందితుడు మహేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. ఇక అనంతరం పోలీసులు మాట్లాడుతూ ఇలా ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే భయపడకుండా ధైర్యంగా తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. -
వైద్యుల నిర్వాకం.. చికిత్సకోసం వెళితే.. కరెంట్‌షాకులు..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లోని ప్రశాంతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన కిషన్ (38) మానసిక సమస్యతో ప్రశాంతి హాస్పిటల్లో చికిత్సకోసం పది రోజుల క్రితం చేరాడు. చికిత్స పొందుతున్న కిషన్ మంగళవారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. అయితే పేషెంట్ పరిస్థితిని అంచనా వేయకుండా వైద్యులు అడ్డగోలుగా కరెంట్ షాక్‌లు, ఓవర్‌డోస్ మందులు ఇవ్వడం మూలంగానే చనిపోయాడని ఆరోపిస్తూ బుధవారం ఉదయం మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. టూటౌన్ పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం మృతుడి బంధువులతో చర్చించి సయోధ్య కుదుర్చుకున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ విషయమై సైకియాట్రిస్టు డాక్టర్ పి.కిషన్‌ను వివరణ కోరగా, సదరు పేషెంట్‌కు ట్రీట్మెంట్ పూర్తిచేసి డిశ్చార్జ్ చేసే సమయంలో గుండెపోటు రావడంతో మృతిచెందాడని తెలిపారు. వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. కాగా ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు. -
పెళ్లైన 23 ఏళ్లకు తల్లి అయ్యింది.. అంతలోనే ప్రాణాలొదిలింది
కోరుట్ల: పెళ్లి అయిన 23 ఏళ్లకు మాతృత్వపు ఆశలు తీరినా 15 రోజులకే అవి ఆవిరయ్యాయి. ఇద్దరు మగశిశువులకు జన్మనిచ్చి కన్నుమూసింది ఓ తల్లి. తనివితీరా బిడ్డలను చూసుకోకముందే తనువు చాలించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్‌కు చెందిన పొన్నం స్వరూప (42), అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు. పెళ్లి అయి 23 ఏళ్లు అయినా వారికి సంతానంలేదు. సంతానం కోసం ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం ఫలించి పది నెలల క్రితం స్వరూప గర్భం దాల్చింది. జూలై 19న ఆమె మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్ద రు మగ శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో పుట్టిన వెంటనే వారిద్దరినీ అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో మెట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన స్వరూప మూడు రోజుల క్రితం పిల్లలను చూసేందుకు హైదరాబాద్ వెళ్లింది. తన పిల్లలతో ఆనందంగా గడపకముందే ఇన్ఫెక్షన్తో అనారోగ్యం పాలైంది. హైదరాబాద్‌లోనే మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. -
మంత్రి పువ్వాడ సీరియస్.. డబ్బు వాపస్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రి
సాక్షి, ఖమ్మం: కరోనా చికిత్స పేరిట పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నాయి. కొవిడ్ రోగుల భయాలను ఆసరా చేసుకుని ఇష్టానుసారంగా లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. ఇటీవలే కోవిడ్ బారిన పడి మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబం నుంచి అధిక బిల్లులను వసూళ్లు చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై మంత్రి పువ్వాడ అజయ్ కూమార్ సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో బాధిత కుటుంబం కట్టిన 5 లక్షల అధిక బిల్లులను ఆసుపత్రి యాజమాన్యం తిరిగి చెల్లించింది. వివరాలు.. ఖమ్మం పట్టణానికి చెందిన అలీమ్ కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటంబ సభ్యులు చేర్పించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించటంతో అలీమ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయన కుటుంబం నుంచి సదరు ఆస్పత్రి యాజమాన్యం చార్జీల రూపంలో 6 లక్షల 40 వేలు వసూలు చేసింది. అయితే ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ దృష్టికి మృతుని కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లడంతో ఆసుపత్రి యాజమాన్యంపై ఆయన మండిపడ్డారు. అధికంగా వసూలు చేసిన బిల్లులను వెనక్కి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో 5 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం చెల్లించింది. చదవండి: Khammam: మధిర ఎస్సీ కాలనీలో దారుణం.. భర్త చేత భార్య పన్ను పీకించి -
TS: కరోనా చికిత్స, టెస్ట్ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా రాష్టవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్ట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్సల ఛార్జీలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది. కోవిడ్ సోకి సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4 వేలు, ఐసీయూ గదిలో రోజుకు గరిష్టంగా రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ.9 వేలు, పీపీఈ కిట్ ధర రూ.273కి మించరాదని ఆస్పత్రుల ఛార్జిలను ఖారారు చేసింది. హెచ్ఆర్ సీటీ రూ.1995, డిజిటల్ ఎక్స్ రే రూ.1300, ఐఎల్6 రూ.1300 మాత్రమే ఛార్జ్ చేయాలని పేర్కొంది. అదే విధంగా డీ డైమర్ రూ.300, సీఆర్పీ రూ.500, ప్రొకాల్ సీతోసిన్ రూ.1400, ఫెరిటీన్ రూ.400, ఎల్డీహెచ్ రూ.140 ఛార్జీలను నిర్ణయించింది. సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలుగా, ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలుగా ధరలను ప్రభుత్వం ఖారారు చేసింది. చదవండి: CM KCR: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్నా.. -
Coronavirus: ‘ప్రైవేటు’లో టీకాల జోరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాల పంపిణీ జోరు పెరిగింది. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తుండటం, కొద్దినెలల్లో కరోనా మూడోవేవ్ రావొచ్చనే అంచనాల నేపథ్యంలో.. టీకాలకు డిమాండ్ పెరిగింది. పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీలవారికే వ్యాక్సిన్లు వేస్తుండటంతో జనం ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ (పీసీవీసీ)లను ఆశ్రయిస్తున్నారు. ఇవి చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నా.. రద్దీ విపరీతంగా ఉంటోంది. 656 ప్రభుత్వ.. 29 ప్రైవేటు కేంద్రాలు రాష్ట్రంలో 656 ప్రభుత్వ కేంద్రాలు, 29 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లతో పాటు హైరిస్క్ కేటగిరీలో ఉన్న వారికి, 45 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇస్తున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో టీకాల పంపిణీ ఉచితం కాగా.. ప్రైవేటు కేంద్రాల్లో చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటులో రోజూ 2 వేల మందికిపైనే.. రాష్ట్రవ్యాప్తంగా 29 ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రోజుకు సగటున 2వేల మందికిపైనే టీకాలు ఇస్తున్నారు. గురువారం ఒక్కరోజే 29 ప్రైవేటు కేంద్రాల్లో 57,922 మందికి టీకాలు వేశారు. అదే 656 ప్రభుత్వ కేంద్రాల్లో 1,23,020 మందికి ఇచ్చారు. ఈ లెక్కన ప్రభుత్వకేంద్రాల్లో రోజుకు సగటున 2 వందల కంటే తక్కువ మందికి టీకాలు ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తం గా ఇప్పటివరకు 73,99,241 టీకాలు ఇవ్వగా.. ఇందులో ప్రభుత్వకేంద్రాల్లో ఇచ్చినవి 60,71,872, ప్రైవేటు కేంద్రాల్లో ఫీజులు చెల్లించి తీసుకున్నవి 13,27,369 డోసులు కావడం గమనార్హం. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆగింది! కొవిన్ యాప్ ద్వారా ముందస్తు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ముందుకు సాగడం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. వ్యాక్సిన్ కేంద్రం సమాచారం, స్లాట్ బుకింగ్ ఆప్షన్లు కనిపించడమే లేదు. ప్రైవేటు కేంద్రాల వివరాలు కూడా ఉండటం లేదు. దీనితో ముందస్తు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పై పెద్దగా ఎవరూ దృష్టిపెట్టడం లేదు. ప్రైవేటు కేంద్రాల వద్ద అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసి టీకా ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుతోపాటు సర్వీసు చార్జీ కింద మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ► ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వారం రోజుల నుంచి టీకాల పంపిణీ జోరు పెరిగింది. అంతకుముందు రోజూ పది వేల వరకు టీకాలు పంపిణీ చేయగా.. ప్రస్తుతం రోజూ 50–60 వేల వరకు ఇస్తున్నారు. ► ప్రభుత్వ టీకా కేంద్రాల్లో హైరిస్క్, ఫ్రంట్ లైన్ కేటగిరీలు, 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నారు. ఈ కేటగిరీల్లో లేని 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి టీకా తీసుకుంటున్నారు. ► సగటున ఒక్కో ప్రైవేటు సెంటర్లో రోజూ 2 వేల మందికిపైనే వ్యాక్సిన్లు తీసుకుంటుండగా.. ప్రభుత్వ కేంద్రాల్లో రోజుకు సగటున 2 వందల మందికే వేస్తున్నారు. ► ప్రైవేటు కేంద్రాల్లో టీకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువగా తీసుకుంటున్నారని.. సర్వీస్, ఇతర చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. అవగాహన పెరగడంతోనే.. ప్రజల్లో వ్యాక్సిన్ అవగాహన పెరిగింది. టీకాల కోసం ఎక్కువమంది ముందుకొస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీల్లోని వారికే టీకాలు వేస్తుండటంతో.. ప్రైవేటుకు వచ్చే వారి సంఖ్య కొద్దిరోజులుగా పెరిగింది. మేం టీకా కేంద్రానికి వచ్చిన వారికే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వ్యాపార సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు కోరితే.. ఆయా చోట్ల ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు ఇస్తున్నాం. నిర్ధేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా టీకాలు పంపిణీ చేస్తున్నాం. –సి.భార్గవ ప్రసాద్, జనరల్ మేనేజర్, సిటీన్యూరో సెంటర్ చదవండి: కోవిడ్ తీవ్రతకు ఆ డీఎన్ఏకు లంకె -
ఇనోదయ ఆసుపత్రి పశ్చాత్తాపం .. డబ్బు వెనక్కు..
సాక్షి, తూర్పుగోదావరి : ఆరోగ్య శ్రీ ద్వారా కరోనాకు వైద్యం చేస్తూ రోగి బంధువుల నుండి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసిన ఇనోదయ ఆసుపత్రి పశ్చాత్తాపం చెందింది. ఆసుపత్రి యాజమాన్యం రోగి నుండి వసూలు చేసిన రూ.4.50 లక్షలు కలెక్టర్ సమక్షంలో తిరిగి బాధితుని బంధువులకు అందచేసింది. ఇనోదయ ఆసుపత్రి ఇటీవల పెద్దాపురంకు చెందిన ఒక కరోనా రోగికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేస్తూ..వారి బంధువుల నుండి అక్రమంగా రూ.4.50 లక్షలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని బాధితులు ఆశ్రయించడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇనోదయ ఆసుపత్రిని డి నోటిఫై చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి రూ.22,50,000 పెనాల్టీ విధించారు. -
అధిక ఫీజులపై ఏం చర్యలు తీసుకున్నారు
-
ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. ఠాగూర్ సినిమా సీన్‌ను తలపించారు
సాక్షి, చెన్నై: ఠాగూర్ సినిమాలోని ఆస్పత్రి సీన్‌ను తలపించారు తెరుప్పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు. విషమంగా ఉన్న రోగి కోలుకుంటున్నాడని చెప్పి రూ.19 లక్షలు వసూలు చేసిన ఆస్పత్రి నిర్వాకంపై కుటుంబ సభ్యులు తిరుప్పూర్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి తీసుకోవాల్సిన ఫీజులపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే అనేక ఆస్పత్రులు దోపిడే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్‌లోని ఓ ఆస్పత్రి లీలపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వివరాలు...తిరుప్పూర్‌కు చెందిన సుబ్రమణ్యం (62) మే 3న కరోనా బారినపడ్డారు. ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచారు. మే 23న ఆస్పత్రి సిబ్బంది సుబ్రమణ్యం తనయుడు కార్తికేయన్‌తో మాట్లాడి బిల్లు చెల్లించాలని కోరారు. బిల్లు కట్టించుకుని.. సుబ్రమణ్యం ఆరోగ్యంగా ఉన్నట్టు, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నట్టు పేర్కొనడంతో రూ. 19 లక్షలను కార్తికేయన్ చెల్లించాడు. అయితే, ఆ మరుసటి రోజు రాత్రే సుబ్రమణ్యం ఆరోగ్యం విషమించినట్టు, పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందించలేని పరిస్థితి ఉందని ఆస్పత్రి వర్గాలు హడావుడి సృష్టించాయి. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాయి. ఆగమేఘాలపై మరో ఆస్పత్రికి తరలించగా సుబ్రమణ్యం మరణించాడు. అయితే తొలుత చికిత్స పొందిన ఆస్పత్రిపై అనుమానం కలగడంతో మంగళవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. కంప్యూటరైజ్డ్ బిల్లు కాకుండా చేతితో రాసిన బిల్లులు ఇచ్చి ఉండటం గమనార్హం. జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. చదవండి: భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్ వైరల్: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు! -
కరోనా పేషెంట్లకు రూ.10 లక్షలు చెల్లించండి
ముంబై: కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి.దీంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు కరోనావైద్యం పేరుతో డబ్బులు దండుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడాను ఝులిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న 92 మంది బాధితులకు రూ.10 లక్షలు తిరిగి చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహరాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధితులకు కరోనా టెస్ట్ లు చేసి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి) అధికారులు ట్రీట్మెంట్ చేసినందుకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని అన్నీ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదు. ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్ఎంసి అదనపు కమిషనర్ జలాజ్ శర్మ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అధారంగా రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లో రేడియన్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న కరోనా బాధితులు, లేదంటే వారి బంధువులకు రూ .10,32,243 తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శర్మ ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకు డబ్బు చెల్లించే విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని అన్నారు. అంటువ్యాధి మరియు విపత్తు నిర్వహణ చట్టం కింద ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జలాజ్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రాష్ట్రాలకు నాస్తి.. ప్రైవేటుకు జాస్తి
సాక్షి, అమరావతి: దేశంలో అర్హులందరికీ సకాలంలో ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యానికి ‘ప్రైవేటు సరఫరా’ గండికొడుతోంది. ఉత్పత్తి అవుతున్నవ్యాక్సిన్లలో పావు వంతు గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు రంగానికి తరలిపోతున్నాయి. వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు సతమతమవుతుంటే.. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు దండుకుంటున్నాయి. ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ల సరఫరా నిలిపేయాలని ప్రధాని నరేంద్రమోదీకి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం సూచనకు నిపుణుల నుంచి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. రోజుకు 27 లక్షల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీ కలిపి రోజుకు 27 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. సీరం ఇన్‌స్టిటూŠయ్‌ట్ నెలకు 6.50 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, భారత్ బయోటెక్ నెలకు దాదాపు 2 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. దీని ప్రకారం.. మేలో దేశంలో 8.50 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. రాష్ట్రాలను విస్మరించి ప్రైవేటుకు తరలింపు మేలో దేశంలో 8.50 కోట్ల డోసులు ఉత్పత్తి అయితే.. అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కలిపి 5 కోట్ల డోసులే వేయనున్నాయి. మిగిలిన 3.50 కోట్ల డోసులను ప్రైవేటు సెక్టార్‌కు తరలిస్తున్నట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ముందుగానే ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెబుతుండటం గమనార్హం. ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు వేసే రాష్ట్రాల అవసరాలను విస్మరించి మరీ ప్రైవేటు రంగానికి ఇవ్వడం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు కరోనా విజృంభణతో ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి ఏకంగా రూ.25 వేల వరకు వసూలు చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఇంత అత్యధిక ధరకు దేశంలో బడా కార్పొరేట్ సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులకు వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇలా ఒక్కమేలోనే 3.50 కోట్ల డోసుల వ్యాక్సిన్లకు ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డాయన్నది ఊహకే అంతు చిక్కడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే టీకా.. దేశంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టీకాలు వేసే ప్రక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే సాగాలని.. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్లు సరఫరా చేయొద్దని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఒక్కో డోసుకు ప్రైవేటు ఆస్పత్రులు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి భారీగా పెరిగే వరకు టీకాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే వేయాలని.. అంతవరకు ప్రైవేటు రంగానికి సరఫరా నిలిపివేయాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి తగినంత సరఫరా లేక.. మేలో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి, రాష్ట్రాలు వేస్తున్న వ్యాక్సిన్ల గణాంకాలను పరిశీలిస్తే.. వాస్తవ పరిస్థితి బోధపడుతుంది. కేంద్ర ప్రభుత్వ కోవిన్ పోర్టల్ ప్రకారం.. అన్ని రాష్ట్రాలు మే మొదటి మూడు వారాల్లో రోజుకు సగటున 16.2 లక్షల డోసుల చొప్పున వ్యాక్సిన్లు వేశాయి. వ్యాక్సిన్ల కొరతతో ముందు 45 ఏళ్లు దాటినవారికే వ్యాక్సిన్లు వేస్తున్నాయి. కేంద్రం నుంచి తగినంతగా వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడంతో మే 22 నుంచి సగటున రోజుకు 13 లక్షల వ్యాక్సిన్లే వేస్తున్నారు. పోనీ రోజుకు సగటున 16.2 లక్షల డోసుల లెక్కన తీసుకున్నా.. మే 31 నాటికి దేశంలో గరిష్టంగా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్లు మాత్రమే వేయగలరని తేలింది. -
ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు
-
ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు
సాక్షి, తూర్పు గోదావరి: ప్రభుత్వ నిబంధనలను పాటించని ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇటీవల పెద్దాపురానికి చెందిన కరోనా రోగి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేస్తూ రూ.4.50 లక్షలను ఆస్పత్రి సిబ్బంది వసూలు చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యంపై సర్పవరం పీఎస్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యింది. ఆస్పత్రిపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇనోదయ ఆస్పత్రిని డీ నోటిఫై చేశారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిలిపివేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి రూ.15-20 లక్షల జరిమానా కూడా విధించారు. ఆస్పత్రి యాజమాన్యంకు సహకరించిన ఆరోపణలపై ఆరోగ్య మిత్ర నాగమణిని విధుల నుంచి తొలగించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. చదవండి: ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే -
‘ఈ ఆస్పత్రులను క్షమిస్తే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లే’
-
రూ. 20లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లండి!
-
ఏం వైద్యం చేశారు.. మందులేం వాడారు?
హైదరాబాద్: ‘మా పేషెంట్‌కు ఏం వైద్యం చేశారు.. మందులేం వాడారు? మొన్నటి వరకు ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి.. శవాన్ని అప్పగిస్తారా’అంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ (40)కు కరోనా సోకి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 9న విరించి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సల నిమిత్తం రూ.11 లక్షలు చెల్లించారు. మొదట్లో ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు భరోసా ఇచ్చారు. అయితే.. 22న వంశీకృష్ణ మృతి చెందాడని, మిగిలిన డబ్బులు కట్టకున్నా పర్వాలేదు మృతదేహాన్ని తీసుకెళ్లండని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వంశీకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది తీరుపై అనుమానం రావడంతో గురువారం మృతుడి బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి తమ పేషెంట్‌కు ఏం మందులు వాడారు.. ఏం చికిత్స చేశారో చెప్పాలని అడిగారు. ఆ వివరాలిస్తే తమ కుటుంబంలో ఉన్న వైద్యులకు చూపించుకుంటామని పేర్కొన్నారు. అయితే, సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. హైడోస్ మందులు వాడటం వల్లే వంశీకృష్ణ మృతి చెందాడని, అతని మృతికి ఆస్పత్రి వర్గాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి వారిని సముదాయించడానికి ప్రయత్నించినా.. ఫలితం కనిపించలేదు. దీంతో 16 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. (చదవండి: జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం..స్టైఫండ్ పెంపు) -
ఎంజీఎంలో ఇంటిదొంగలు!
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా సరఫరా చేసిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఆస్పత్రిలో రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు మాయం ఘటనలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తు న్నారు. అయితే, ఎంజీఎం మాజీ పరిపాలనాధికారి ఇంజెక్షన్లను బయటకు తరలించారని, దీనిపై ఆరోగ్యశాఖ మాజీ మంత్రిని సైతం తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారి ఎంజీఎం ఆస్పత్రికి ప్రభుత్వం కేటాయించిన రెమ్‌డెసివిర్‌లను ప్రైవేట్ క్లినిక్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఆ క్లినిక్ కాంపౌండర్ కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. కమిటీ వేశాం: సూపరింటెండెంట్ ఈ ఘటనపై విచారణ కోసం సీనియర్ ప్రొఫెస ర్లతో కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. సదరు కమిటీ రెండు నెలలుగా ఆస్పత్రికి వచ్చిన ఇంజక్షన్లు, వినియో గంపై ఆరా తీస్తుందన్నారు. ఇక ఎంజీఎం ఆస్ప త్రిలో ఫ్లోమీటర్లు కూడా చోరీకి గురయ్యాయని పరి పాలనాధికారులు నిర్ధారణకు వచ్చారు. చోరీ బాధ్యులను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. -
చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు
బంజారాహిల్స్/ లింగాలఘణపురం: చేయి విరిగిందని ఆస్పత్రికి వెళ్తే అక్షరాల రూ.25లక్షల బిల్లు వేశారు.. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తమ వద్ద ఉన్న డబ్బులతోపాటు కొంత అప్పు చేసి సుమారు రూ.9లక్షల వరకు చెల్లించారు. అయినా చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నాగరాజు (32)కు ఈనెల 7వ తేదీన లింగాలఘన్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం అదే రోజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స నిమిత్తం బంధుమిత్రులంతా తలా కొంత పోగు చేసుకొని రూ.9లక్షల దాకా చెల్లించారు. ఈక్రమంలో అక్కడ అందుతోన్న చికిత్సతో కోలుకుంటున్నాడని అందరూ భావించారు. రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో అడిగినంత డబ్బు చెల్లిస్తూ వచ్చారు. అయితే శుక్రవారం ఉదయం నాగరాజు మృతి చెందాండంటూ ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. రెండు రోజుల క్రితం కూడా తమతో మాట్లాడిన వ్యక్తి ఎలా చనిపోతాడంటూ బంధుమిత్రులు పెద్దసంఖ్యలో శుక్రవారం ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆందోళన తీవ్రం కావడంతో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రి వద్దకు బంధువులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చేయి విరిగిందని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25 లక్షల బిల్లు వేశారని ఇప్పటికే రూ.9 లక్షలు చెల్లించామని ఇంకో రూ.15 లక్షలు చెల్లించి బాడీ తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడి రోదనలు అక్కడున్నవారందరిని కంటతడి పెట్టించాయి. మూడు గంటల పాటు గ్రామస్తులంతా ఆస్పత్రి ఆవరణలో బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో బకాయి బిల్లు లేకుండానే మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయంత్రానికి మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించగా ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో ఆస్పత్రి వర్గాలు బాధితకుటుంబానికి రూ.2 లక్షలు అందజేసినట్లు సమాచారం. చదవండి: చెరువులో విషప్రయోగం.. చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. -
కాసుల కోసం కక్కుర్తి: బిల్లు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
మలక్‌పేట(హైదరాబాద్): ... అయినా ప్రైవేట్ ఆస్పత్రుల తీరు మారలేదు. అదే ధోరణి.. కాసుల కోసం అదే కక్కుర్తి.. బకాయి బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని తెగేసి చెప్పింది. మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన, అధికార పార్టీ ఎమ్మెల్సీ చొరవతో ఆఖరికి ఆస్పత్రి యాజమాన్యం దిగొచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... అది దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయూష్ ఆస్పత్రి. అందులో ఈ నెల 5న మహబూబాబాద్ జిల్లాకు చెందిన యెర్నం శ్రీధర్(37) అనే కరోనా రోగి చేరారు. వైద్యులు 12 రోజులపాటు చికిత్స అందించారు. సోమవారం ఉదయం కూడా శ్రీధర్ ఆరోగ్యంగానే ఉన్నారు. కుటంబసభ్యులతో బాగానే మాట్లాడారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఊపిరి వదిలారు. తమ కుటుంబసభ్యుడు చనిపోయాడనే బాధలో ఉండగానే బిల్లు చెల్లించాలంటూ యాజమాన్యం బాధితులపై ఒత్తిడి చేసింది. చేసేదేమీలేక వారు రూ.8 లక్షలు చెల్లించారు. అయినా మృతదేహాన్ని వారికి అప్పగించలేదు. అదేంటని అడిగితే మరో రూ.3 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే అప్పు చేశామని, ఇక ఏమాత్రం చెల్లించలేమని బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకొని వచ్చిన మలక్‌పేట ఎస్ఐ వీరబాబు వారిని సముదాయించారు. బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్ముకునే విధంగా ఆస్పత్రి యాజమాన్యం రెమిడిసివిర్ జంక్షన్లకు ఒక్కో దానికి రూ.50 వేలు, ప్లాస్మాకు రూ.30 వేలు వసూలు చేస్తోందని మృతుడి సోదరుడు, జర్నలిస్టు సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాకుండా ప్రజల ప్రాణాలను అడ్డం పెటుకుని దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేయడంతో ఎట్టకేలకు మృతహదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు ‘మృతుడి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. బకాయి ఉన్న బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని అనలేదు. మిగిలిన బిల్లు కట్టాలని చెప్పాం. కోవిడ్‌తో బాధపడుతున్న శ్రీధర్‌కు సరైన చికిత్స అందించాం, కార్డియో ఎటాక్ కావడం వల్ల మృతి చెందారు’అని ఆయుష్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రమోద్ తెలిపారు. ∙ కాసుల కోసం దిల్సుఖ్నగర్ ఆయూష్ ఆస్పత్రి కక్కుర్తి -
మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే
సాక్షి, హైదరాబాద్: అక్కడ మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే. కరోనా రోగి కదా అన్న కరుణాలేదు.. చేసిందే చికిత్స.. వేసిందే బిల్లు! కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మొన్న నాగోల్‌లోని ఓ ఆస్పత్రి కరోనా రోగి నుంచి ఏకంగా రూ.23 లక్షల బిల్లు వసూలు చేయగా, నిన్న బీఎన్‌రెడ్డి నగర్‌లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులు రోజుకు రూ.లక్ష చొప్పున దండుకున్నాయి. తాజాగా మాదాపూర్‌లోని మరో కార్పొరేట్ ఆస్పత్రి చేయని చికిత్సలకు భారీ బిల్లు వేసి ఇద్దరు రోగుల జేబులకు చిల్లులు పెట్టింది. లబోదిబోమంటూ బాధితులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలకు అదనంగా పైసా కూడా తీసుకోవద్దని వైద్య, ఆరోగ్య వాఖ హెచ్చరికలు జారీ చేసినా కార్పొరేట్ ఆస్పత్రులు వాటిని పెడచెవిన పెడుతూ అందినకాడికి దోచుకుంటున్నాయి. అసలు విషయం ఏంటంటే... ఇద్దరికి ఒకే గది.. బిల్లు మాత్రం.. ఓయూ కాలనీకి చెందిన రవికుమార్, ఆయన సతీమణి రజనికి ఇటీవల కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. సాచురేషన్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుండటంతో తెలిసిన వైద్యుడి సహాయంతో తొలుత మణికొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రిలో ఐసీయూ వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో ఈ నెల 4న మాదాపూర్‌లోని మరో కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. భార్యభర్తలిద్దరూ ఒకే గదిలో ఉండి చికిత్స పొందారు. భర్తకు బెడ్ కేటాయించగా, భార్యను మాత్రం బెడ్‌సైడ్ సోపాలోనే ఉంచి చికిత్స అందించారు. అయితే వీరిని వేర్వేరు గదుల్లో ఉంచి చికిత్సలు అందించినట్లు యాజమాన్యం బిల్లు వేసింది. ఒక్కొక్కరి నుంచి రోజుకు రూ.8,500 చొప్పున ఐదు రోజులకు మొత్తం రూ.42,500 వసూలు చేసింది. మందుల్లోనూ మాయాజాలమే... నిజానికి వీరిద్దరూ సదరు ఆస్పత్రిలో చేరక ముం దే వేరే ఆస్పత్రిలో ఒకరు రెండు, మరొకరు మూ డు చొప్పున రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తీసుకున్నా రు. కానీ, ఆ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం తమవద్దే ఒకరు ఆరు, మరొకరు ఐదు ఇంజక్షన్లు తీసుకున్నట్లు వాటికి కూడా కలిపి బిల్లు జారీ చేయడం గమనార్హం. అంతేకాదు రూ.900 విలువ చేసే పీపీఈ కిట్టుకు రూ.మూడు వేల చొప్పున బిల్లు వేసింది. ఇలా మొత్తం రూ.6.50 లక్షల బిల్లు వసూలు చేసింది. కోలుకోవడంతో ఈ నెల 12న డిశ్చార్జై ఇంటికి చేరుకున్న బాధితులు బిల్లును చూసి అవాక్కయ్యారు. అందించిన సేవలకు మిం చి మెడికల్ బిల్లు వసూలు చేసినట్లు గుర్తించారు. సదరు కార్పొరేట్ ఆస్పత్రి దోపిడిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యా దు చేశారు. బాధితుల ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్ స్పందించి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
పాజిటివ్ బాధితుల ‘పడక’ పాట్లు..!
కోవిడ్ బారిన పడ్డ హన్మకొండకు చెందిన రాజారావుకు నాలుగు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో సంప్రదిస్తే జనరల్ బెడ్లు తప్ప ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు అందుబాటులో లేవు. దీంతో రాజారావు కొడుకు 60 కిలోమీటర్ల దూరాన ఉన్న తొర్రూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. కూకట్‌పల్లికి చెందిన జి.అనసూయకు రెండ్రోజులుగా ఆక్సిజన్ స్థాయిలు 91కి పడిపోయాయి. ఆక్సిజన్ పెట్టించాలని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రుల్లో ప్రయత్నించినా ఎక్కడా బెడ్ అందుబాటులో లేదు. దీంతో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని ఓ ఆస్పత్రిలో బెడ్ దొరకడంతో అడ్మిట్ చేశారు. రోజుకు రూ.40వేల చొప్పున బెడ్ చార్జీలు చెల్లిస్తున్నట్లు సమాచారం. సాక్షి, హైదరాబాద్: సెకండ్ వేవ్‌లో కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేస్తే తీవ్రఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేకం. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే గొంతు, ఊపిరితిత్తులు, పొట్టలో తీవ్ర ప్రభావాన్ని చూపి అనారోగ్య సమస్యలను వేగంగా పెంచుతోంది. దీంతో బాధితులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతున్నా.. మెరుగైన వైద్యం దొరుకుతుందన్న ఉద్దేశంతో రోగులు ముందుగా ప్రైవేట్ వైపు చూస్తున్నారు. బెడ్ల కొరత... రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 54,832. వైద్యా రోగ్య శాఖ గణాంకాల ప్రకారం వీరిలో 28,825 (52.55 శాతం) మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 50.5 శాతం మంది ఆక్సిజన్ బెడ్లపై ఉండగా.. 29.47 శాతం మంది ఐసీయూ ల్లో ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని కరోనా బెడ్ల సంఖ్య ప్రకారం.. యాక్టివ్ కేసులన్నింటిలో 96 శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించొచ్చు. అంతేకాదు ఈ బెడ్లలో సగం ఖాళీగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతోంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం బెడ్లు ఖాళీగాలేవంటూ బాధితులను తిప్పిపంపిస్తున్నాయి. గత్యంతరంలేక కొందరు ఆక్సిజన్ సిలిండర్లు బుక్ చేసుకుని ఇంటివద్దే ఊపిరి పీలుస్తుండగా.. మరికొందరు ఆస్పత్రుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక, ప్రాణవాయువు దొరక్క మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వసతుల్లేకనే ‘ప్రైవేట్’కు... కోవిడ్ బారినపడుతున్న వారిలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిమ్స్ (తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను ఏర్పాటు చేసింది. ఇందులో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఆస్పత్రి ప్రారంభించి ఏడాది కావొస్తున్నా.. రక్త పరీక్ష చేసే పరిస్థితి లేదు. సమీపంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు నమూనాలను పంపి పరీక్షలు చేయిస్తున్నారు. ఇలా సరైన వసతులు లేకపోవడంతోనే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నట్లు పలువురు చెబుతున్నారు. సగం బెడ్లు ఖాళీగా ఉన్నాయట... రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల లభ్యతను ప్రజలకు వివరించాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా బెడ్ అవైలబిలిటీ డాష్‌బోర్డును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వారీగా మొత్తం పడకలు, భర్తీ అయినవి, ఖాళీగా ఉన్నవి... అనే వివరాలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని కేటగిరీల్లో ఉన్న బెడ్లు 53,782. వీటిలో 28,825 బాధితులతో భర్తీ కాగా, 24,957 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లోని బెడ్లలో 46.4 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు డాష్‌బోర్డు సమాచారం చెబుతోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 46.22 శాతం ఖాళీగా ఉండగా... ప్రైవేట్ ఆస్పత్రుల్లో 46.47 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. బెడ్ అవైలబులిటీ డాష్‌బోర్డు ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రై వేటు ఆస్పత్రుల్లో బెడ్ల పరిస్థితి ఇది మొత్తం భర్తీ ఖాళీ శాతం జనరల్ బెడ్లు... ప్రభుత్వ 5,473 1,228 4,245 77.56 ప్రైవేట్ 15,884 4,534 11,350 71.45 ఆక్సిజన్ బెడ్లు.. ప్రభుత్వ 7,560 5,311 2,249 29.74 ప్రైవేట్ 13,425 9,257 4,168 31.04 ఐసీయూ బెడ్లు ప్రభుత్వ 2,170 1,636 534 24.60 ప్రైవేట్ 9,270 6,859 2,411 26.00 ఇన్ని ఆంక్షలెందుకు...? వైద్య,ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన డాష్‌బోర్డు సమాచారం ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు సగం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితుల రాకపై ఆంక్షలు విధించడం, రాష్ట్రంలో కోవిడ్ బారిన పడ్డ వారు హోం ఐసోలేషన్‌లో మాత్రమే ఉండాలని సూచించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. (చదవండి: England: లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలా..వద్దా!) -
గురువు రుణం తీర్చుకున్నాడు
కేయూ క్యాంపస్ (వరంగల్): పాతికేళ్ల గురు శిష్యుల అనుబంధం వారిది.. అయితే ఆ అనుబంధాన్ని కోవిడ్ చిదిమేసింది. కోవిడ్ కారణంగా గురువు చనిపోవడంతో శిష్యుడే అంత్యక్రియలు పూర్తిచేసి గురువు రుణం తీర్చుకున్నాడు. మాజీ వీసీ పశుల సాంబయ్య బుధవారం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందగా ఆయన మృతదేహాన్ని పరకాల మండలం నాగారానికి తీసుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కుమారుడు వరుణ్‌కు ఇటీవల కరోనా సోకి తగ్గినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కుమార్తె ప్రణయ గర్భవతి కావడంతో అంత్యక్రియలు పూర్తిచేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం వరుణ్ చేయి పట్టుకుని తలకొరివి పెట్టిద్దామదనుకున్నా ఆయన నీరసించి నిలబడలేని స్థితికి చేరడంతో సాంబయ్య శిష్యుడు డాక్టర్ బండి శ్రీను గురువు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆచార్య సాంబయ్యతో తనకు పాతికేళ్ల అనుబంధం ఉందని, తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనలోనే తండ్రిని చూసుకుంటున్నానని,ఆయన పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసిన తాను ఇలా రుణం తీర్చుకున్నానని వెల్లడించారు. (చదవండి: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా: నలుగురు మృతి) -
డబ్బు ఇస్తేనే మృతదేహం
కేయూ క్యాంపస్ (వరంగల్): నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు, వరంగల్‌కు చెందిన పసుల సాంబయ్య(67) కరోనాతో కన్నుమూశారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన ఆయన హన్మకొండలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. గత నెలలో మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న సాంబయ్య ఇటీవల కరోనా సోకగా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ 15రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కరోనాతో పోరాడే క్రమంలో చివరికి నెగెటివ్ వచ్చినా గుండెపోటుతో రావడంతో ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు. బిల్లు చెల్లిస్తేనే మృతదేహం సాంబయ్య కరోనా చికిత్స పొందుతున్న విషయాన్ని పలువురు జిల్లా నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆస్పత్రి బిల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతలోనే ఆయన మృతి చెందారు. మొత్తం రూ.10.50లక్షల బిల్లులో ఇప్పటి వరకు రూ.4 లక్షలు చెల్లించారు. మిగతాది చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేయగా.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బిల్లు వస్తుందని ఓ ప్రజాప్రతినిధి, వైద్య ఆరోగ్యశాఖలోని ఉన్నతాధికారి సైతం యాజమాన్యానికి ఫోన్లో చెప్పినా ఒప్పుకోలేదు. సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కు రాకపోతే మిగతా రూ.6.50లక్షలు చెల్లిస్తానని సాంబయ్య శిష్యుడు డాక్టర్ బండి శ్రీను ఇచ్చిన హామీ పత్రంతో మృతదేహాన్ని సాయంత్రం అప్పగించారు. అనంతరం సాంబయ్య మృతదేహాన్నిస్వగ్రామమైన నాగారానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
తల్లీకొడుకులను బలితీసుకున్న కరోనా
కేశంపేట: కరోనాతో తల్లీ కొడుకులు మూడు రోజుల వ్యవధిలోనే మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొండారెడ్డిపల్లికి చెందిన శంకర్ (55)కు పది రోజుల క్రితం కరోనా రావడంతో మహబూబ్‌నగర్‌లోని ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. శంకర్ తల్లి చంద్రమ్మ (75) కూడా మూడు రోజుల క్రితం కరోనాతోనే మృతి చెందింది. తల్లి కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. (చదవండి: హైదరాబాద్‌లో కిక్కిరిసిపోతున్న ఐసోలేషన్ కేంద్రాలు) -
మృతదేహం ఇచ్చేందుకు రూ.5 లక్షల డిమాండ్
గుంటూరు ఈస్ట్: కోవిడ్ బారినపడి చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఇచ్చేందుకు సుమారు రూ.5 లక్షలు డిమాండ్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యంపై గుంటూరు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశా రు. ఎస్‌హెచ్‌వో రాజశేఖరరెడ్డి కథనం మేరకు.. యడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన యనమదల ప్రసాద్ సమీప బంధువులైన పి. బాబు, శివపార్వతి దంపతులు కొద్దిరోజుల కిం దట గుంటూరులోని నారాయణ సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్లో కోవిడ్ చికిత్స నిమిత్తం చేరారు. కరోనా నుంచి కోలుకున్న శివపార్వతి డిశ్చార్జి అయ్యారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి బాబు మృతిచెందారు. ఆస్పత్రి యాజమాన్యం రూ.4,98,558 చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించింది. డబ్బులు చెల్లించలేకపోతే మృతదేహాన్ని కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులకు అప్పగిస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని యనమల ప్రసాద్.. ఆస్పత్రిలో తనిఖీ చేసేందుకు వచ్చిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.కిషోర్‌కు తెలిపారు. దీంతో డాక్టర్ కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేట పోలీసులు విచారించి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. -
విజిలెన్స్ దాడులు.. ఆరు ఆస్పత్రులపై కేసులు
విజయవాడ: ఏపీలో వరుసగా పలు ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులలో పలు ఆసుపత్రులపై కేసులను నమోదు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేర్కొన్నారు. కాగా ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 ఆసుపత్రులపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు 6 ఆస్పత్రులపై కేసులను నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఒక ఆస్పత్రిపై అధిక ఫీజులు వసూలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పుత్తూరు సుభాషిణి ఆస్పత్రిపై ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి నిరాకరించినందుకు కేసును నమోదు చేశారు. విజయవాడలోని వేదాంత ఆస్పత్రి , శ్రీకాకుళం లోని సూర్యముఖి ఆస్పత్రులు పేషెంట్లు స్వంతంగా రెమిడిసివర్ తెచ్చుకోవాలని పట్టుబట్టడంతో వాటిపై కూడా కేసులను బుక్ చేశారు. కాగా కడప జిల్లా సిటీ కేర్ ఆస్పత్రి కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసింది. పైగా వాటికి బిల్లులు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదులు అందిన ప్రతి ఆస్పత్రులపై కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
ప్రైవేటు ఆసుపత్రిలో పాజిటివ్.. ప్రభుత్వ ఆసుపత్రిలో నెగెటివ్..
సాక్షి, వేములవాడ(సిరిసిల్ల): పట్టణంలోని మల్లారం రోడ్డులో ఉన్న మాతృశ్రీ అనే ఆసుపత్రిలో కరోనాపై తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. చిట్టి మంగమ్మ అనే పేషెంట్ స్వల్ప లక్షణాలతో ఆసుపత్రికి చేరుకోవడంతో కరోనా టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిందని అడ్మిట్ చేసుకున్నారు. ఇందుకు రూ.లక్షన్నర కావాలని చెప్పడంతో తన వద్ద డబ్బులు లేవని పేర్కొంటూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరోసారి కరోనా టెస్టు చేయించగా ఆమెకు నెగెటివ్ రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెగటివ్ రిపోర్టు ఆధారంగా ఆమె ఫిర్యాదు మేరకు మాతృశ్రీ ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకుని విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి
కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రి కేఎస్ కేర్‌లో శనివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం నిర్వహణ వైఫల్యంతో ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. వీరిలో కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఆర్ఎస్ పెండేకల్‌కు చెందిన మద్దిలేటి (40), డోన్‌కు చెందిన అనంతయ్య (70), ఎమ్మిగనూరు మండలం నందవరం గ్రామానికి చెందిన హంపమ్మ(65)తోపాటు వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన రఘునాథరెడ్డి(40), కడపకు చెందిన జైనాబీ (53) ఉన్నారు. మరొకరు వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అయితే ఆక్సిజన్ అందకపోవడమే మరణాలకు కారణమని చెప్పలేమని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్‌కు కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం రాత్రి మరో ముగ్గురు మృతి! ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌కు చికిత్స అందిస్తున్న కేఎస్ కేర్ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి కూడా ముగ్గురు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా.. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్న విషయం తెలుసుకున్న మిగిలిన రోగుల బంధువులు వారిని హుటాహుటిన ఇతర ఆస్పత్రులకు తరలించారు. తమవారిని కాపాడుకునేందుకు ప్రైవేటుగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి.. వారికి అమర్చి కాపాడుకునే ప్రయత్నం చేశారు. అనుమతులు లేకుండానే.. కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి కేఎస్ కేర్ హాస్పిటల్ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ కోసం నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నా.. ఫైర్ సేఫ్టీ లేదని అధికారులు అనుమతి నిరాకరించారు. అయితే నిబంధనలను పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ రోగులను చేర్చుకుని రెండు వారాలుగా చికిత్స అందిస్తోంది. యాజమాన్యంపై క్రిమినల్ కేసు అనుమతి లేకుండా కోవిడ్ వైద్యం అందించిన కేఎస్ కేర్ ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఎండీ డాక్టర్ లాల్‌బహుదూర్ శాస్త్రిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు. కలెక్టర్ వీరపాండియన్‌తో కలిసి ఆయన ఆస్పత్రికి చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రిపై అధికారుల దాడులు గుంటూరు రూరల్: అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌కు చికిత్స చేస్తూ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిపై శనివారం అధికారులు దాడులు చేశారు. వివరాల్లోకెళ్తే.. గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరులోని ప్రవీణ్ ఆస్పత్రి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌కు చికిత్స అందిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆస్పత్రికి ఒక వలంటీరును పంపి కోవిడ్ పరీక్ష చేయించారు. దీనికి ఆస్పత్రిలోని ల్యాబ్ అసిస్టెంట్ రూ.3,500 వసూలు చేశాడు. పరీక్ష రసీదును తీసుకున్న వలంటీర్ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఆస్పత్రిలో 12 మంది కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తుండటాన్ని గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యం ఒక్కో రోగి వద్ద కోవిడ్ పరీక్షకు రూ.3,500, రోజుకు ఒక బెడ్‌కు రూ.30 వేలు, ఇతర ఇంజక్షన్లు, చికిత్స నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఇప్పటికే ఇక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం అధికారుల దృష్టికొచ్చింది. దీంతో డాక్టర్ ప్రవీణ్‌తోపాటు మరో వైద్యుడిపై కేసు నమోదు చేసి, ఆస్పత్రి రికార్డులను సీజ్ చేశారు. -
కర్నూలులో విషాదం
-
ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి
సాక్షి, కర్నూలు: కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. అనుమతి లేకుండానే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ సంఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు కర్నూలు కలెక్టర్ తెలిపారు. కర్నూలులోని కేఎస్ కేర్ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు అనుమతి లేదు. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి చెందారు. అనుమతి లేకుండానే కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కేఎస్ కేర్ ఆస్పత్రిలో కోవిడ్ వైద్యానికి అనుమతి లేదు కలెక్టర్ స్పష్టం చేశారు. ఘటనపై డీఎంహెచ్ఓ విచారణ చేస్తున్నారు. కోవిడ్ ఆస్పత్రిగా నోటిఫైడ్ చేయని కేఎస్కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోయారనితెలుసుకుని డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య విచారణ మొదలు పెట్టారు. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. కేఎస్కేర్ ఆస్పత్రిలో ఉన్న బాధితులందరినీ అంబులెన్స్‌లో కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్‌ను అడ్మిట్ చేసుకుని అనధికారికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రి యజమాన్యంపై క్రిమినల్ కేసు బుక్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వం/జిల్లా యంత్రాంగం అనుమతి లేకుండా అనధికారికంగా కోవిడ్ ఆస్పత్రులు లేదా కోవిడ్ కేర్ సెంటర్స్ నడిపితే క్రిమినల్ కేస్ పెడతాం... సీజ్ చేయిస్తామని కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు. చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం చదవండి: ఈటల మాట ఎత్తకుండానే టీఆర్ఎస్ ప్రెస్‌మీట్ -
ఆన్లైన్ పేమెంట్‌కు ఒప్పుకోని ఆస్పత్రి యాజమాన్యం
రాజాం సిటీ: శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రి తీరు ఓ కరోనా రోగి పాలిట శాపంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం మండలంలోని పెంటఅగ్రహారం గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనాతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు బుధవారం రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. రోగికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో ముందుగా డబ్బు చెల్లించాలని ఆస్పత్రి వారు చెప్పారు. అయితే డబ్బు రూపంలో మాత్రమే ఫీజు చెల్లించాలని, ఆన్లైన్ పేమెంట్లు అంగీకరించబోమని ఆస్పత్రి యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం కోసం మూడు గంటల పాటు పట్టణమంతా తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. వారు తిరిగి వచ్చేసరికి మహిళ పరిస్థితి విషమించి ఆస్పత్రి ఎదుట రోడ్డుపైనే మృతి చెందింది. ఆస్పత్రి యాజమాన్యం వ్యాపారాత్మక ధోరణే తమ తల్లి మృతికి కారణమని బాధిత మహిళ కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. ముందు వైద్యం చేయాలి గానీ, డబ్బుల రూపంలో ఫీజు కడితేనే జాయిన్ చేసుకుంటామని అనడం ఎంత వరకు సమంజసమని వాపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నా కానీ ఎలాంటి సహకారం అందించలేదని స్థానికులు తెలిపారు. రాజాం ప్రెస్‌క్లబ్ సభ్యులు, రెడ్‌క్రాస్ సభ్యులు ఏర్పాటు చేసిన వాహనంలో మృతదేహాన్ని తరలించారు. -
ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
-
ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. థానెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు రోగులు సజీవదహనం అయ్యారు. ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఐసీయూలోని ఆరుగురు రోగులతో సహా మరో 20 మంది రోగులను మరో ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందినవారిని యస్మీన్ జెడ్ సయ్యద్(46), నవాబ్ ఎం షేక్ (47), హలీమా బి.సల్మనీ (70)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మృతుల కుటుంబానికి రూ. ఐదు లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక, ఇటీవల ముంబైకి సమీపంలోని విరార్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. పాల్ఘర్ జిల్లా విరార్‌లోని విజయ్ వల్లబ్ ఆసుపత్రిలో రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో పేలుడు సంభవించి మంటలు చెలిరేగిన విషయం తెలిసిందే. ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో ముగ్గురు రోగులు బయటికి వెళ్లగలిగారు. కానీ మిగతా 14 మంది కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల వారందరు సజీవదహనమయ్యారు. చదవండి: మహారాష్ట్రలో మరో ఘోరం.. ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ ‘యాక్షన్ ప్లాన్ ’ -
దారుణం: రూ.6.50 లక్షలు డబ్బు కట్టు.. శవాన్ని తీసుకెళ్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి శవాన్ని రూ.6.5 లక్షలు కడితేనే అప్పగిస్తామన్న ఆస్పత్రి యాజమాన్యం.. మూడురోజుల పాటు మృతదేహాన్ని ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన దారుణ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. హైదరాబాద్ నాగోలు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (41) కరోనా లక్షణాలతో ఈ నెల 17వ తేదీన నాగోలు ప్రధాన రహదారిపై ఉన్న ఒక ఆస్పత్రిలో చేరాడు. చేరే సమయంలో రూ.1.40 లక్షలు, ఆ తర్వాత పరీక్షలంటూ రూ.53,800, మందుల పేరిట అదనంగా వసూలు చేశారు. ఇంతజేసినా ఫలితం దక్కలేదు. ఈ నెల 25వ తేదీన అతను మరణించినట్లు కుటుంబసభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. దీంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు రాగా, తమకు ఇంకా రావాల్సిన రూ.6.5 లక్షలు కడితే కానీ మృతదేహం అప్పగించబోమని తేల్చిచెప్పింది. తమ వద్ద ఇప్పుడు అంత డబ్బులు లేవని, మృతదేహాన్ని ఇస్తే రెండురోజుల్లో సర్దుబాటు చేస్తామని ఆ ఉద్యోగి కుటుంబసభ్యులు చెప్పారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వినిపించుకోలేదు. డబ్బులు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని స్పష్టం చేసింది. దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి వెళ్లిపోగా ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని బాక్సులో పెట్టి హాస్పిటల్ సెల్లార్లో ఉంచారు. డబ్బుల కోసం ప్రయత్నించినా.. తెలిసిన వారి దగ్గర డబ్బుల కోసం విఫల ప్రయత్నం చేసిన కుటుంబసభ్యులు మంగళవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని తాము చేసిన ప్రయత్నాలు వివరించారు. మృతదేహాన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఆస్పత్రి యాజమాన్యం కనికరించకపోవడంతో బంధువులతో పాటు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పారు. హాస్పిటల్ నిర్వాహకులతో మాట్లాడి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పచెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ వర్గాలు నిరాకరించాయి. మానవత్వం మరిచిపోయారు మృతదేహాన్ని మూడురోజులు ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన యాజమాన్యం మానవత్వం మరిచి వ్యవహరించిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి యజమానిని కోల్పోయిన తాము, మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో మరింత మనోవేదనకు గురయ్యామని వాపోయారు. రోగులను ఆదుకోవాల్సిన హాస్పిటల్ నిర్వాహకులు కేవలం డబ్బుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఐసీయూలో పది మంది కరోనా పేషెంట్లకు ఒకే నర్స్ చికిత్స చేస్తోందని తెలిపారు. సరైన చికిత్స చేయకపోగా, రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. చదవండి: పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్: రెండు ప్రాణాలు బలి చదవండి: మదనపల్లె హత్య: నిందితులకు బెయిల్ -
పోయేటప్పుడు ఏం తీసుకుపోం కదా: సుచరిత
గుంటూరు : కరోనా నియంత్రణపై హోంమంత్రి మేకతోటి సుచరిత కలెక్టర్, డాక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కరోనా పేరుతో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన రేట్లు మాత్రమే అమలు చేయాలి అని తెలిపారు. పేషెంట్ ఆస్పత్రిలో చేరగానే వెంటనే మూడు లక్షలు కట్టండి.. నాలుగు లక్షలు కట్టండి అని ఒత్తిడి చేస్తే ఎలా అంటూ సుచరిత అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి అని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటాం.. పోయేటప్పుడు కూడా తీసుకు వెళ్ళం కదా అన్నారు సుచరిత. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించండి: వెల్లంపల్లి సాక్షి విజయవాడ: కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ ఆసుపత్రులపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రత్యేక అధికారి సునీత, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం 50 శాతం బెడ్స్ కేటాయించాలి అన్నారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్‌పై కఠినంగా వ్యవహరించండి అని మంత్రి వెల్లంపల్లి అధికారులకు సూచించారు. చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..! -
కరోనా: బయటపడ్డ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రజల నిర్లక్ష్యంతో కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,500కుపైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా.. ప్రైవేటు ఆసుప్రత్రులు మాత్రం బెట్స్ ఖాళీగా లేవని చెబుతున్నాయి. కోవిడ్ బెడ్స్‌కు సంబంధించి ‘సాక్షి’ చేసిన పరిశోధనలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. కానీ తీరా సాక్షి ప్రతినిధి అక్కడికి వెళ్లి కరోనా బెడ్స్ కోసం ఆరా తీయగా ఖాళీ లేవని వైద్యులు చెబుతున్నారు. అంతేగాక ఎప్పుడు ఖాళీ అవుతాయో కూడా చెప్పలేమని చేతులెత్తేస్తున్నారు. అయితే స్థానిక సెక్యూరిటీని కదిలిస్తే.. ‘మహారాష్ట్ర నాందేడ్ నుంచి పేషెంట్లు వస్తున్నారని, వారితోనేబెడ్స్ నిండిపోయాయి సార్’ అంటూ బాంబు పేల్చాడు. పైగా ఇక్కడ ఖాళీ లేవు కానీ తనకు తెలిసిన ఆస్పత్రిలో ఫ్రెండ్ పని చేస్తాడట... అక్కడ కాస్త కాసులు ఎక్కువ పెడితే బెడ్ దొరికిపోతుందని ఉచిత సలహా ఇస్తున్నాడు. ఆ కథేంటో... కార్పొ‘రేటు’ ఆసుపత్రుల ఆటలు ఏవో మీరే చూడండి..