రాష్ట్రంలో అవసరం లేని సిజేరియన్ ఆపరేషన్ల కట్టడికి వైద్య శాఖ చర్యలు
విచ్చలవిడిగా సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై దృష్టి
సగానికి పైగా సిజేరియన్లు అవసరం లేనివని తేల్చిన అధికారులు
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోని 104 ఆస్పత్రులకు నోటీసులు
నోటీసులకు వివరణ ఇచ్చిన ఆస్పత్రులు
ఈ ఆసుపత్రులపై చర్యలకు ఉపక్రమిస్తున్న అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సహజ ప్రసవాలను పెంచేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్‌లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కాగా, 2023–24లో రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా ప్రసవాలు జరగ్గా, వీటిలో 4.48 లక్షల ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేశారు. వీటిలో 50 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అవసరం లేకపోయినా చేసిన సిజేరియన్ ఆపరేషన్లే. ఇలాంటి ప్రసవాలు చేసిన ఆస్పత్రులపై వైద్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.
ఇందులో భాగంగా వంద శాతం సిజేరియన్లు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోని 104 నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటికి ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. సాధారణ ప్రసవం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో గర్భిణులు ఆస్పత్రులకు రావడం వల్లే సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్లు అన్ని ఆస్పత్రులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అదే విధంగా తొలి కాన్పు సిజేరియన్ ఉండటం వల్ల రెండో కాన్పు కూడా సిజేరియన్ చేశామన్నారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలను వైద్య శాఖ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు.
కర్నూలులో అత్యధికంగా సిజేరియన్లు
2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షలు సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. సిజేరియన్ ఆపరేషన్లలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 23,500 సిజేరియన్లు జరగ్గా, వీటిలో 16,678 ప్రైవేటు ఆస్పత్రుల్లో చేశారు. 20,059 సిజేరియన్‌లతో పశి్చమ గోదావరి రెండో స్థానంలో, 19,855తో అనంతపురం మూడో స్థానంలో ఉన్నాయి.
45 శాతం అనవసరమే
సిజేరియన్ ప్రసవాలను నియంత్రించడంలో భాగంగా 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మ«ధ్య రాష్ట్రవ్యాప్తంగా 62 ఆస్పత్రుల్లో 278 ఆపరేషన్లపై వైద్య శాఖ ఆడిట్ నిర్వహించింది. వీటిలో 155 సిజేరియన్‌లు ( 55 శాతం) గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలతో అవసరం మేరకే చేసినట్లు తేలింది. మరో 72 కేసుల్లో (26 శాతం) అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్టు ఆధారాలతో
తేలింది.. మిగిలిన 53 కేసుల్లో (19 శాతం) సిజేరియన్‌కు అవసరమైన ఆధారాలు ఏమీ లేనట్టు తేలింది. అంటే 45 శాతం సిజేరియన్లు అవసరం లేకుండానే చేసినట్లు తేలింది.
⇒ ప్రైవేట్ ఆస్పత్రులు సిజేరియన్ల వైపు మొగ్గు చూపడానికి కారణాలు
⇒ సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఇస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం
⇒ సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందు
బాటులో ఉండరు.
⇒ సాధారణ ప్రసవానికి ప్రయతి్నస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీíÙయా వైద్యుడు అందుబాటులో లేకపోవడం.
⇒ యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు చేయడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం.
⇒సిజేరియన్ ప్రసవం వల్ల కలిగే సమస్యలను వివరించి, సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా గర్భిణి, కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం.
Comments
Please login to add a commentAdd a comment