
సాక్షి,గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో పోసానిపై మరో కేసు నమోదైంది. నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు.
ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళీపై మరో కేసు నమోదైంది. దీంతో ఆదోని త్రీటౌన్ పోలీసులు గుంటూరు జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోసానిని గుంటూరు నుంచి కర్నూలుకు తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment