
గుంటూరు, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ దక్కడంతో.. గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారని ఆయా పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో.. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వ ఆదేశాలతో.. వివిధ పోలీస్ స్టేషన్‌లకు.. కోర్టులకు.. జైళ్లకు.. తిప్పుతూ ఇబ్బంది పెట్టారు.
వివిధ జిల్లాల్లో కేసుల నుంచి ఊరట లభించిందని అనుకునేలోపు.. అనూహ్యంగా సీఐడీ కేసు తెర మీదకు వచ్చింది. అయితే ఈ కేసులోనూ ఆయన నిన్న(శుక్రవారం మార్చి 21) ఊరట దక్కింది. సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే..
జిల్లా జైలుకు చేరిన రిలిజింగ్ ఆర్డర్స్ చేరడం ఆలస్యమైంది. ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడం.. ప్రక్రియలన్నీ ఈ ఉదయాన్నే పూర్తవటంతో.. రిలీజ్ ఆర్డర్స్ ఆలస్యమైంది. మరోవైపు కోర్టుకు చేరుకున్న పోసాని న్యాయవాదులు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.

పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.
అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్‌ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.
- అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్
- పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్
- ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్
- కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్
- హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్
- సీఐడీ పెట్టిన కేసు.. బెయిల్ మంజూరు
Comments
Please login to add a commentAdd a comment