Posani Krishna Murali
-
టాలీవుడ్ స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.2 వేల ఫోన్‌తోనే!
టాలీవుడ్లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్‌గా జీవించడమంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్‌కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024 -
చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియాపై పోసాని హాట్ కామెంట్స్ !
-
పోసానికి తిరకాసు సమాధానం
-
డింగ్ డాంగ్ 2.0 @ 16 November 2024
-
పోసాని కృష్ణ మురళి యొక్క డింగ్ డాంగ్ 2.0 ప్రోమో, ఈ రాత్రి @ 8.30pm
-
కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పలువురిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫిర్యాదుల పరంపర గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్‌పై పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవుగా పోలీసులు కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెండుచోట్ల కేసు నమోదు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రీరెడ్డిపై రెండు పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నటుడు పోసానిపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడులను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ, టీవీ–5లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని ఫిర్యాదుల్లో పార్టీల నేతలు, విలేకరులు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసానిపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్‌టౌన్, కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నటి శ్రీరెడ్డిపై.. సినీనటి శ్రీరెడ్డిపై విశాఖపట్నం టూ టౌన్, విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇద్దరికి రిమాండ్ తిరుపతి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్లపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు బుధవారం పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని గురువారం రాజమహేంద్రవరంలోని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. గుంటూరులో బుధవారం అరెస్టు చేసిన పి.రాజశేఖర్‌రెడ్డిని గురువారం ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంలో అతడిని జైలుకు తరలించారు. ఇద్దరి అరెస్టు కాకినాడ జిల్లా తొండంగి మండల ఉపాధ్యక్షుడు నాగం గంగబాబు, సోషల్ మీడియా కన్వీనర్ అడపా సురేష్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.సజ్జల భార్గవ్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసుజనసేన నేత ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత డిసెంబర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, లోకేశ్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని, ఈ విషయమై అడిగితే తనను కులం పేరుతో దూషించారని సిద్ధవటానికి చెందిన జనసేన నాయకుడు వాకమల్ల వెంకటాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, సిరిగిరి అర్జున్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పులివెందులకు బదిలీ చేసినట్లు సిద్ధవటం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
కొనసాగుతున్న అరాచకపర్వం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు.. ఎక్కడికి తీసుకెళుతున్నారు.. అనే విషయాలను కుటుంబసభ్యులకు కూడా చెప్పడంలేదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు అత్యుత్సాహంగా కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు.ఒకరిని అరెస్టుచేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన కాపారపు వెంకటరమణను అరెస్టు చేసిన సీఐ శ్రీనివాస్‌రావు కాకినాడ కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిలను మంగళవారం ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సబ్‌జైలుకు తరలించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన పఠాన్ అయూబ్‌ఖాన్, పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన అన్నంగి నరసింహస్వామి, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బకు చెందిన జనికుల రామాంజనేయులుపై కందుకూరులోను, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కురమయ్యగారి హనుమంతరెడ్డిపై నెల్లూరు జిల్లా సంగం పోలీస్‌స్టేషన్‌లోను కేసులు నమోదు చేశారు. రాయవరం ప్రాంతానికి చెందిన ఖండవిల్లి సునీల్‌కుమార్, కోరుకొండకు చెందిన లగవత్తుల శివసత్యకుమార్, కనిగిరికి చెందిన హరీశ్వర్‌రెడ్డి, కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కాకరపర్తి శ్రీనివాస్‌పై విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన ప్రసాద్‌రెడ్డిని బుధవారం మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అరెస్టు చేసిన నకిరేకల్‌కు చెందిన పి.రాజశేఖర్‌రెడ్డిని నూజివీడు తరలించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పశ్చిమగోదావరి జిల్లా కో–కన్వినర్లు పాటూరి దొరబాబు, కమతం మహేష్‌లకు 41ఏ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. శ్రీరెడ్డిపై కేసు నమోదుటీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా యాక్టివిస్ట్, సినీనటి మల్లిడి శ్రీరెడ్డిపై మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని బొమ్మూరు పొలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై అనకాపల్లి పోలీసులకు టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి మరో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్‌వర్మకు నోటీసులు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శివరామయ్య బుధవారం హైదరాబాద్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు అందించారు. ఈనెల 19న మద్దిపాడు స్టేషన్‌కు రావాల్సిందిగా అందులో కోరారు. వ్యూహం చిత్రం నిర్మించే సమయంలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్, బ్రాహ్మణిని అవమానించేలా పోస్టింగ్‌లు పెట్టారంటూ రెండురోజుల కిందట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కేసు నమోదు చేశారు. పోసానిపై ఫిర్యాదులుసినీనటుడు పోసాని కృష్ణమురళీ టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ నేతలు బాపట్ల సీఐ అహ్మద్జానీకి ఫిర్యాదు చేశారు. సీఎం తదితరులపై అసభ్య పోస్టులు పెట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు గుంటూరు, నరసరావుపేటల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు
ప్రముఖ నటుడు పోసానిపై జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో ఈయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇందులో పేర్కొన్నారు. పోసాని వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు.(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' మూవీ టీమ్‌పై పోలీస్ కేసు)బాడిత శంకర్ ఫిర్యాదుతో పోసానిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపైన కూడా టీడీపీ నేత కేసు పెట్టాడు. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాలెం పోలీసులు.. ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు) -
ఇవ్వండి ఫిర్యాదు.. పెట్టేద్దాం కేసు
సాక్షి నెట్వర్క్: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిన ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై రెచ్చిపోతోంది. ప్రభుత్వ తప్పిదాలను ప్రశి్నస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను సోషల్ మీడియాలో ప్రశి్నంచారని ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశి్నంచడంతో ప్రభుత్వం పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించింది. సోషల్ మీడియాలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కొందరి పేర్లను ఎంపిక చేసి పచ్చ పార్టీ కార్యకర్తల ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయిస్తోంది. ఫిర్యాదులు అందుకున్నదే తడవుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలో ముగ్గురిపై.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై రేపల్లె నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. షేక్ మహ్మద్ ఖాజా మొహిద్దీన్‌పై నగరం మండలానికి చెందిన ఐటీడీపీ కన్వీనర్ జుజ్జూరి బాలనరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపట్నం మండలం అడవులదీవికి చెందిన టీడీపీ నేత శొంఠి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు జింకల రామాంజనేయులుపై కేసు నమోదైంది. దిండికి చెందిన టీడీపీ నేత నాగకిశోర్ ఫిర్యాదు మేరకు నిజాంపట్నం పోలీసు స్టేషన్లో బత్తులపల్లి శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల అదుపులో సోషల్ మీడియా కన్వీనర్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కాపారపు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసరావును కలవగా.. రమణపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారని కుటుంబ సభ్యులు వివరించారు. దివ్యాంగుడి పైనా పోలీసు ప్రతాపం నరసాపురానికి చెందిన బుడితి సుజన్‌కుమార్ అనే దివ్యాంగుడు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ భీమవరం పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తుల సాయం ఉంటేనే గానీ అడుగు ముందుకు వేయలేని సుజన్‌కుమార్‌ను స్టేషన్‌కు రావాలంటూ పోలీసుల నుంచి పదేపదే ఫోన్లు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సుజన్‌కుమార్ తండ్రి తహశీల్దార్‌గా పనిచేసి రిటైరయ్యారు. తల్లి టీచర్. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సుజన్‌కుమార్‌కు పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. బాధితుడు సుజన్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకు భయపడి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. తనకు భీమవరం పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్సై ఫోన్ చేసి.. మీరు సోషల్ మీడియా కేసులో ఇరుక్కున్నారని చెప్పి స్టేషన్‌కు రావాలన్నారని తెలిపారు.స్థానికేతరులపై స్థానిక నేతల ఫిర్యాదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన స్థానికేతరులపై బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యద్దనపూడి గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీను విశాఖపట్నం జిల్లా యండాడ గ్రామానికి చెందిన బై జయంత్‌పై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మార్టూరు మండలం రాజుపాలెంకు చెందిన గొర్రెపాటి నాగదుర్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటకు చెందిన బూడి వెంకటేశ్‌పై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చినగంజాం గ్రామ సర్పంచ్, కూటమి నాయకుడు రాయని ఆత్మారావు, తుమ్మలపెంట సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన ఇందుకూరి శ్రీనివాసరాజుపై చినగంజాం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సత్యసాయి జిల్లా రొద్దం మండలం సోషల్ మీడియా కార్యకర్త ఎన్.బాలాజీరెడ్డి పోస్టులు పెడుతున్నారని నెల్లూరు టీడీపీ నాయకుడు షేక్ ముఫీద్ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆర్జీవీపై తుళ్లూరులో ఫిర్యాదు సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దున్నపోతులకు పవన్‌కళ్యాణ్, లోకేశ్ ఫొటోలు మారి్ఫంగ్ చేసి పెట్టడం, చంద్రబాబును పవన్‌కళ్యాణ్ ఎత్తుకున్నట్టు పెట్టిన పోస్టులపై తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి ఆయనకు నోటీసులు పంపినట్టు దర్యాప్తు అధికారి, ఒంగోలు రూరల్ సీఐ ఎన్.శ్రీకాంత్‌బాబు మంగళవారం తెలిపారు. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు విజయవాడ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం పోలీసుస్టేషన్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కనీ్వనర్ బాడిత శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళి గతంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని బాడిత శంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ప్రెస్‌మీట్ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీఆర్ నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదు?: పోసాని
సాక్షి, హైదరాబాద్: ప్రజల తరఫున టీవీ5, ఈనాడు, ఏబీఎన్ ప్రశ్నించడం మానేశాయని వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో అరాచక పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రచారం చేశాడు. ఇవ్వడం మానేశాడు. బస్సులు ఫ్రీ, ఆడపిల్లలకు 15 వేలు అన్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు. హమీల గురించి ప్రశ్నిస్తున్నవారిని అరెస్ట్‌లు చేయిస్తున్నాడు’’ అంటూ పోసాని నిలదీశారు.‘‘నేను రోడ్డు మీదకు వస్తే కార్యకర్తతో చంపించే లెవెల్లో టీవీ 5 కథనాలు ఉన్నాయి. నేను సైకో అని.. పార్టీలు మారతానని ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆరు వందల వాగ్ధానాలు చేశాడు. మేము ఎందుకు ప్రశ్నించకూడదు. నాలాంటి వాళ్లను తిట్టినందుకు టీవీ5 నాయుడికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. చంద్రబాబు కాళ్ల దగ్గరకు వెళ్లి డబ్బు సంపాదించుకున్నారు. బీఆర్ నాయుడు సినిమా ఇండస్ట్రీని తిట్టించాడు. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లను తిట్టించిన బీఆర్‌నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదు?’’ అని పోసాని ప్రశ్నించారు.‘‘పని చేయని ప్రభుత్వాన్ని తిట్టేవాళ్లతో ప్రమాదం లేదు. ఓట్లు వేయించుకుని హామీలు నెరవేర్చని వాళ్లతోనే ప్రమాదం. అమ్మాయిలకు ముద్దు పెట్టాలి లేదా కడుపు అయినా చేయాలన్న బాలకృష్ణపై ఎందుకు కేసులు పెట్టలేదు?. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు టీవీ5కి ఇది కనిపించలేదా?. నిజాయితీ గల జర్నలిజం అయితే ఎస్సీల తరపున ప్రశ్నిచావా?. పవన్ కల్యాణ్ తల్లిని లోకేష్ ఘోరంగా తిట్టించాడు. ఈ మాట పవన్ కల్యాణే స్వయంగా చెప్పాడు. మరి లోకేష్, ఆయన అనుచరుల మీద ఎవరైనా కేసులు పెట్టారా?. వైఎస్ జగన్‌ను టీడీపీ నేత తిట్టినప్పుడు టీవీ5 ఏమైంది?’’ ’ అని పోసాని మండిపడ్డారు. -
తిరకాసు ఇన్వెస్ట్‌గేషన్..
-
డింగ్ డాంగ్ 2.0 @ 09 November 2024
-
డింగ్ డాంగ్ 2.0
-
సాక్షి టీవీలో పోసాని సెటైరికల్ షో
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గతంలో సాక్షి టీవీలో నిర్వహించిన డింగ్ డాంగ్ అనే పొలిటికల్ సెటైర్ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది. తన స్టయిల్లో ప్రశ్నలు సంధిస్తూ.. పంచులు విసురుతూ ఆ కార్యక్రమాన్ని ఆయన రక్తి కట్టించారు.ఇప్పుడు అదే కాన్సెప్టుతో డింగ్‌డాంగ్ 2. 0 పేరిట ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్వహించబోతున్నారు. డైలాగ్ డెలివరీ, మేనరిజంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. ఇప్పుడు రాజకీయ నేతలకు చురకలు అంటించడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం సాక్షి టీవీలో ప్రతి శనివారం రాత్రి 8.30 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 8.30 గంటలకు ప్రసారం కానుంది. -
పోసాని కృష్ణ మురళి డింగ్ డాంగ్ 2.0 ప్రోమో
-
పోసాని కృష్ణ మురళి డింగ్ డాంగ్ 2.0
-
డింగ్ డాంగ్ 2.0 ప్రోమో
-
పోసాని 'సాక్షి' స్పెషల్
-
ABN రాధాకృష్ణ బెదిరింపులు..
-
ఏబీఎన్ రాధాకృష్ణ అండ్‌కో బెదిరిస్తోంది: పోసాని
సాక్షి, హైదరాబాద్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏబీఎన్ రాధాకృష్ణ అండ్‌కో.. ఇన్ డైరెక్ట్‌గా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కుటుంబాన్ని పవన్ అభిమానులు దూషించినా ఆయన కుటుంబాన్ని తానెప్పుడూ తిరిగి ఒక్క మాట కూడా అనలేదన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ను పవన్ కల్యాణ్ చాలా సార్లు విమర్శించారని పోసాని కృష్ణమురళి గుర్తు చేశారు.ఇదీ చదవండి: పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ -
అయ్యప్ప భక్తుల గురించి ఇంత ఘోరంగా..! ఇది చంద్రబాబు బాగోతం..!
-
అయ్యప్ప మాలేస్తే ఆదాయం తగ్గుతుందన్నాడుగా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనపై చంద్రబాబు చేస్తున్నరాద్దాంతంపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. తిరుమల పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్‌ను డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు పోసాని. హిందూ ధర్మా పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న బాబు.. ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు జరగడం లేదని ఘోరంగా వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు.మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నానని, ఇదే విషయాన్ని గతంలో మసీద్‌లోనే చెప్పాడని గుర్తు చేశారు.తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశాను అని బాబు చెప్పాడని తెలిపారు. మోదీ అంటే కేడీ.. కేడీ అంటే మోదీ అని ఘోరంగా తిట్టిన బాబు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి మోదీ.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను కూడా చూశామని ఎద్దేవా చేశారు. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.‘చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటాడనే అంబేద్కర్ చాలా బలమైన రాజ్యాంగం రాశారు. ఓట్ల కోసం క్రిస్టియన్, ముస్లింల ఇంటికి చంద్రబాబు వెళ్లలేదా?, నేను, నా భార్య కలిసి చర్చ్, మసీద్‌కు వెళ్లాం. మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ అఫిడవిట్ అడగలేదు. జగన్‌ది గ్రేట్ పాలిటిక్స్.. నీది డర్టీ పాలిటిక్స్ బాబూ’ అని ధ్వజమెత్తారు పోసాని -
మీ భూమి మీది కాదు అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు
-
బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చే వాడే.. కానీ తీసుకునేవాడు కాదని స్పస్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పేదల భూములు లాక్కుంటే తానే విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.తన మాటలను నమ్మాలని, కూటమి విష ప్రచారాన్ని నమ్మవద్దని హితవు పలికారు. చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోవద్దని కోరారు. మీ భూమి మీది కాదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని అన్నారు. రైతులకు వంశపారంపర్యంగా వచ్చే బూములు వారికి కాకుండాపోతాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చేయడానికి లేనిపోని పెంట రాసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సడెన్‌గా రామోజీ భార్య ఆయన భార్య కాకుండాపోతుందా అనిసెటైర్లు వేశారు.‘సీఎం జగన్‌ను తిట్టాలి అని చంద్రబాబు పిలుపు ఇవ్వగానే హైదరాబాద్ నుంి,ఇ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఒక పచ్చ మంద దిగుతుంది. ఒక్క రోజు కుిడా ఏపీలో లేనివారు ఇవాళ ఏపీ గురించి మాట్లాడతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్న పచ్చమంద ఎవరైనా వచ్చి సాయం చేశారా? అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కోవిడ్ కాలంలో బాబు హైదరాబాద్ మదీనాగూడలోని వందల ఎకరాల ఫాంమౌజ్‌లో ఉన్నాడు. కరోనా సమయంలో కనీసం పవన్ కల్యాణ్ వస్తాడేమో అని ఎదురు చూశారు. మరి కరోనా సమయంలో కాపులకు అయినా సహాయం చేశాడా పవన్?.కానీ సీఎం జగన్ ఒక్కడే రాష్ట్రంలో నిలబడి కరోనా లో ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాడు. నేను చెప్పాను అని కాదు జగన్‌ను మీరు కోల్పోతే మీకు ఒక్క పథకం దక్కదు. చంద్రబాబు అన్ని పథకాలు తీసేస్తాడు. ఒక్క పైసా కూడా పేదలకు రానివ్వడు. ప్రజలంతా ఒక్కసారి ఓటు వేసే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ప్రాణం ఉన్నంత వరకు పేదల ప్రాణాలకు అండగా నిలిచే జగన్‌కు మీరు మద్దతుగా ఉండండి’ అని పోసాని పేర్కొన్నారు. -
మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచారని, ఇంతకంటే అభివృద్ధి ఏముంటుందని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి చెప్పారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదని, మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్న విషయం అర్బన్ ఓటర్లు గుర్తించాలని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు సీఎం జగన్ నవరత్నాల సంక్షేమాన్ని పంచుతూ వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచి, విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రతతో కూడిన మంచి భవితను అందించారని తెలిపారు. హ్యూమన్ క్యాపిటల్ కంటే గొప్ప అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నించారు. అదే చంద్రబాబు దృష్టిలో పేదలంటే ఐదేళ్లకో సారి ఓట్లు అమ్ముకునే జీవచ్ఛవాల్లాంటి వారని చెప్పారు.సంపద సృష్టిస్తాం అనే చంద్రబాబు.. ఆయన సీఎం అయినప్పటి నుంచి దిగేవరకు ప్రతి బడ్జెట్లో రెవెన్యూ లోటు కనిపిస్తుందని, మరి సంపద ఎక్కడ సృష్టించాడని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మానవత్వానికి నిలువెత్తు రూపమైతే, మోసానికి మారుపేరు చంద్రబాబు అని అన్నారు. పోసాని బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పేదలకు ఇచ్చే స్కీములు పప్పుబెల్లాలు కావు. అవి హ్యూమన్ క్యాపిటల్. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఖజానా సొమ్మును పేదలకు పప్పుబెల్లాల్లా పంచడం ఎంతవరకు సబబు అని నన్ను కొందరు అడిగారు. సీఎం జగన్ ప్రభుత్వ ఖజానా ధనాన్ని పేద ప్రజలకు పంచకపోతే ఈ పాటికి చంద్రబాబులాంటి అవినీతిపరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనమైపోయుండేవారని నేను వారికి చెప్పాను.ఎందుకంటే.. చంద్రబాబుకు పేదవాళ్లను ఇంకా పేదవాళ్లుగా మిగల్చడమే తెలుసు. అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించేవారికి నా సమాధానం ఏమిటంటే.. ఎత్తైన సిమెంట్ స్తంభాలతో, పెద్ద పెద్ద బిల్డింగులతో అభివృద్ధి ఏమీరాదు. మానవాభివృద్ధి జరగాలి. మనిషనేవాడు జీవచ్ఛవం స్థాయి నుంచి తానొక మనిషిని అని రోడ్డు మీదకొచ్చి చెప్పుకోగలగాలి. ఈ పరిస్థితి చంద్రబాబుకు చేతగానిది. చంద్రబాబుకు తెలిసిందల్లా ఐదేళ్లకోసారి ఎన్నికలనగానే పేదలు, కూలీల దగ్గరకొచ్చి, వారి ఓటుకు విలువ కట్టి, ఓటుకు నోటు పంచడమే’ అని చెప్పారు. ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు పొడిచారు ‘ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పొలిటికల్ బిజినెస్‌మేన్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని అమ్మేసుకున్న బిజినెస్‌మేన్ కూడా ఆయనే. ఇప్పుడు తమ్ముడ్ని గెలిపించాలని ప్రజలనడిగే అర్హత చిరంజీవికి లేదు. ఆయనకు రాజకీయం, సినిమా ఒకటే. డబ్బు గానీ, అధికారం గానీ వస్తే చేద్దామని, లేకపోతే ఐదేళ్లు ఖాళీగా ఉండాల్సిన ఖర్మేంటని 18 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా అమ్మేసుకుని వెళ్లిపోయిన వ్యక్తి. తప్పు తెలుసుకోని రాజకీయ అనర్హుడు చిరంజీవి’ అని పోసాని దుయ్యబట్టారు.అర్బన్ ఓటర్లంతా బాబు మోసాల్ని గుర్తుంచుకోవాలి‘చంద్రబాబు చేసిన మోసాలను అర్బన్ ఓటర్లంతా గుర్తుంచుకోవాలి. సీఎం వైఎస్ జగన్ ఎవరినీ మోసం చేయరన్న విషయాన్ని గుర్తించాలి. ఆయన ఇప్పటివరకు ఎవరినీ దగా చేయలేదు. సీఎం జగన్ పేద, మధ్యతరగతి వర్గాలను అన్ని విధాలుగా పైకి తెచ్చారు. పెత్తందార్లకు సీఎం జగన్ నచ్చడేమో కానీ, పేదలపాలిట ఆయన దేవుడు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కూడా రైతులు, పేదల పట్ల దేవుడై నిలిచారు కదా? అధికారంలోకి రాగానే రైతుల్ని రుణ విముక్తులను చేశారు. అప్పుడు అందరూ ఆయన్ని అభినందించారు తప్ప పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని అనలేదు. ఇప్పుడు సీఎం జగన్ చేసిందీ అదే. ప్రభుత్వం ఉన్నది పేదలను ఆదుకోవడానికే అని నిరూపించారు. ధనవంతులు కొందరు వారి కులాల్లో పేదలను ఆదుకుంటుంటారు. వారి కులాల్లోని పేద పిల్లల చదువులకు డబ్బులిచ్చి ప్రోత్సహిస్తుంటారు. అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేసి, వారి బతుకులు మారుస్తున్నారు. కులం, మతం , ప్రాంతం, రాజకీయం అనేది చూడకుండా ప్రభుత్వ సొమ్మును పేదవాడికి పంచి వారి జీవనప్రమాణాల్ని పెంచడం మంచి సంప్రదాయం. ఓట్ల కోసమే సీఎం జగన్ పేదవాళ్లకు డబ్బులు అకౌంట్లలో వేశారనడం ముమ్మాటికీ తప్పు. గతంలో రూపాయిలో పావలానే పేదవాడికి చేరేది. మిగతాదంతా అవినీతిపరుల జేబుల్లోకి పోయేది. ఇప్పుడు పైసా అవినీతి లేదు. నాలాంటి ఎంతోమంది ధనవంతులకు పేదవాడిని ఆదుకోవాలనే మనసు రావడానికి సీఎం జగనే స్ఫూర్తి’ అని చెప్పారు.