
టాలీవుడ్‌లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?
ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్‌గా జీవించడమంటే మామూలు విషయం కాదు.
సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్‌కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.
పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024
Comments
Please login to add a commentAdd a comment