
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్
ఒంగోలు టౌన్: ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రౌడీయిజానికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని, అందులో భాగమే ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు అని చెప్పారు.
జూపూడి గురువారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోసాని దొంగో, నేరస్తుడో కాదని, ఒక రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రజలకు అండగా నిలబడి మాట్లాడారని, ఆయన అరెస్టు అక్రమమేనని చెప్పారు.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై వ్యక్తిగత దూషణలు చేసిన చంద్రబాబు సంగతేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంతటి వారినైనా విమర్శిస్తారుగానీ.. ఆయన మీద విమర్శలు చేస్తే అరెస్టులు చేయిస్తారా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాలు, అణచివేతలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేస్తుందని జూపూడి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment