jupudi prabhakar
-
వంశీ అరెస్టుపై జూపూడి ఫైర్
-
సత్యవర్థన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వంశీపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని.. చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసులు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టలేరు. వంశీ 24 గంటల్లో బయటకు వస్తారు. కుట్రలతో చేస్తున్న మీ చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. టీడీపీ నేతలు గూండాల్లా బరి తెగిస్తున్నారు. వైఎస్సార్పీ కేడర్‌ను భయపెట్టాలని చూస్తున్నారు. సత్యవర్థన్ నిజం చెప్పినా తప్పుడు కేసులు పెడుతున్నారు. సత్యవర్థన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి?’’ అంటూ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు.‘‘తనతో తప్పుడు కేసు పెట్టించారని సత్యవర్ధన్ కోర్టులో జడ్జి ముందే చెప్పాడు. రాష్ట్రంలో రాతియుగం నాటి పాలన సాగుతోంది. కోర్టులు, చట్టాలు అంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. కొందరు పోలీసులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. వంశీ అరెస్టు అన్యాయం, అక్రమం. టీడీపీ ఆఫీసుపై దాడి చేసింది వారి పార్టీ కార్యకర్తలే. కానీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. సత్యవర్ధన్ ఎస్సీ అని ఆయన్ను వేధిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి వెయ్యి గొంతులు బయటకు వస్తాయి. అరెస్టులతో వైఎస్సార్సీపీ భయపెట్టలేరు. పాలకులు చట్టబద్దంగా వ్యవహరిస్తే మంచిది. అధికార దుర్వినియోగం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. చట్టమే ఉరితాడుగా మారి మీ గొంతులకు బిగిస్తుంది జాగ్రత్త. వంశీతో అరెస్టుతో కూటమి ప్రభుత్వం అధ:పాతాళానికి పోయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసు అంటే కూడా పోలీసులకు లెక్క లేకుండా పోయింది. బాధితుల మీదనే తిరిగి కేసులు పెట్టే దారుణమైన పరిస్థితి ఏర్పడిందిఅధికారం లేనందున వైఎస్సార్సీపీ నేతలంతా లొంగిపోతారనుకోవటం అవివేకం. అక్రమ కేసులు పెట్టటం నుండి సాక్ష్యం చెప్పించే వరకు ఎవరెవరు ఏ పని చేయాలో కూడా పోలీసులే నిర్ధారిస్తున్నారు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించండి’’ అని జూపూడి ప్రభాకర్ హితవు పలికారు. -
బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ..చంద్రబాబుపై జూపూడి ఫైర్
-
జగన్ పై కోపంతో పేద విద్యార్థుల జీవితాలు నాశనం... లోకేష్ పై జూపూడి ఫైర్
-
అంబేద్కర్ విగ్రహంపై ‘కూటమి’ కుట్ర: జూపూడి
సాక్షి, తాడేపల్లి: విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని చూస్తే కూటమి నాయకుల కడుపులు మండిపోతున్నాయని, ఎలాగైనా ఆ విగ్రహాన్ని తొలగించి స్వరాజ్ మైదాన్ ప్రాంతాన్ని లూలూ గ్రూప్‌కి ఇచ్చేయాలన్న కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగంతో పాలన జరుగుతుంటే ఏపీలో మాత్రం రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు.విగ్రహాన్ని తొలగించే కుట్రకు తెరలేపారా?ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ప్రపంచ మేధావి, పేద బడుగు వర్గాలకు మేలు చేసిన అంబేద్కర్ విగ్రహానికి కూడా కూటమి నేతలు నివాళులు అర్పించని విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పేరును దుండగలు తొలగించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తాజాగా రెండు రోజుల క్రితం అంబేద్కర్ పేరు కూడా తొలిగించి రాజ్యాంగ నిర్మాతను ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. విడతల వారీగా ఆయన విగ్రహాన్ని తొలగించే కుట్రకు తెరలేపారా అనే అనుమానాలు కలుగుతున్నాయని జూపూడి ఆందోళన వ్యక్తం చేశారు. మహనీయుడు అంబేడ్కర్ విగ్రహాన్ని అడవుల్లో పెట్టాలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ ఉదాసీనతే..గతంలో వైఎస్ జగన్ పేరును తొలగించినప్పుడే వైఎస్సార్సీసీపీ నాయకులు, అంబేద్కర్ వాదులు పోలీసులకు, నేషనల్ ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తే.. విగ్రహం ఏర్పాటు చేసిన వారి పేరునే ఉంచాలని ప్రభుత్వానికి చెప్పినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న కారణంగానే తాజాగా అంబేద్కర్ పేరును కూడా తొలగించే ధైర్యం చేశారని ఇది కచ్చితంగా ప్రభుత్వ ఉదాసీనతేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..!అంబేద్కర్ వ్యతిరేక విధానాలకు టీడీపీ, జనసేన వత్తాసుఅంబేడ్కర్ వ్యతిరేక.. బీజేపీ విధానాలకు జనసేన, టీడీపీ నాయకులు వత్తాసు పలుకుతూ ఆయన పేరును శాశ్వతంగా ప్రజల మనసు నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. విజయవాడ నడిబొడ్డున రాజ్‌భవన్, కలెక్టర్ కార్యాలయం పక్కనే ప్రభుత్వ కార్యాలయాల మధ్యన ఉన్న అంబేడ్కర్ విగ్రహం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటే.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే ఈ ఘటనకు కారణమైన ఆకతాయిలను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అంబేడ్కర్ వాదుల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
జగన్ మీకు త్వరలో చుక్కలు చూపించడం ఖాయం చంద్రబాబుకు జూపూడి హెచ్చరిక
-
జగనన్న జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు.
-
పెత్తందారీ వ్యవస్థపై జ'గన్'
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో పెచ్చరిల్లిన పెత్తందారీ వ్యవస్థను సీఎం జగన్ సమూలంగా పెకలించివేశారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అంటరానివారుగా చిత్రీకరించి పెత్తందార్ల కాళ్ల కింద ఉంచితే, సీఎం జగన్ అదే పేదలకు పట్టం కట్టారని తెలిపారు. కావలిలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు విపరీతమైన అహంకారంతో మత్స్యకారులను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు. మత్స్యకారుల తోకలు కత్తిరిస్తానని, ఎస్సీ, ఎస్టీలుగా ఎవరూ పుట్టాలని కోరుకోరని బహిరంగంగా అవమానించడంతో పాటు బీసీలు జడ్జీలుగా పనికిరారని ఏకంగా లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు అని తెలిపారు. ఆయన పదవీ కాలంలో పేదలకు, అట్టడుగు వర్గాలకు పనికివచ్చేలా ఒక్క పనీ చేయలేదన్నారు. జన్మభూమి కమిటీలనే అసాంఘిక శక్తులను పేదల నెత్తిన పెట్టి స్వైరవిహారం చేయించాడని అన్నారు. ప్రజలు బాబు పాలనను ఛీకొట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించిన తరువాత పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. రేషన్‌కార్డు, పింఛను, ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు ఏది కావాలన్నా అర్హత ఉంటే చాలు నేరుగా వలంటీర్లు ఇళ్ళ వద్దకు వెళ్ళి అందిస్తున్నారని, ఈ ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. కావలిలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం సామాజిక న్యాయానికి రోల్ మోడల్ జగన్ : ఎంపీ మస్తాన్‌రావు సామాజిక న్యాయానికి, సాధికారతకు సీఎం వైఎస్ జగన్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. ఎనిమది మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలు ఉన్నారన్నా, కేబినెట్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారంటే అందుకు జగన్మోహన్ రెడ్డి దార్శనికతే కారణమన్నారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దే: జూపూడి ప్రభాకర్ రాష్ట్రంలో అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని అందలం ఎక్కించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అధికార మదంతో అణగదొక్కితే.., సీఎం జగన్ మాత్రం ఈ వర్గాలను ఆదరించి, అభివృద్ధిలోకి తెస్తున్నారని తెలిపారు. జగన్‌తోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం సీఎం జగన్‌తోనే ప్రారంభమైందని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కనకపట్నంగా మారనున్న కావలి: ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి సీఎం వైఎస్ జగన్ పాలనలో కావలి కనకపట్నంగా మారనుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి అన్నారు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దామవరం ఎయిర్‌పోర్టులతో నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. పారిశ్రామిక ప్రగతి కూడా ఊపందుకుంటుందని వివరించారు. 21న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి అప్పలరాజు అన్నారు. ఈ హార్బర్ అందుబాటులోకి వచ్చిన తరువాత మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, సామాజిక సాధికార బస్సు యాత్రలకు వస్తున్న స్పందనను చూసి టీడీపీ, ఆపార్టీకి వంతపాడుతున్న పచ్చమీడియాకు నిద్రపట్టడం లేదన్నారు. పేదల సంక్షేమమే సీఎం జగన్ అజెండా: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు పేదల సంక్షేమమే ఏకైక అజెండాగా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తెలిపారు. రాష్ట్రంలో సామాజిక సాధికారతతో పాటు సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలంతా అండగా నిలిచి, రానున్న ఎన్నికల్లో 175 స్థానాలను బహుమానంగా అందించాలని ప్రజలను ఆయన కోరారు. వెనుకబడిన వర్గాలు ఎల్లవేళలా మంచిగా ఉండాలంటే మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావాలని హఫీజ్‌ఖాన్ అన్నారు. -
ఈనాడు పత్రిక శకుని పాత్ర.. రామోజీ తప్పుడు కథనాలు: జూపూడి
సాక్షి, తాడేపల్లి: దళితుల కష్టాలు టీడీపీ నేతలకు, రామోజీరావుకు తెలియవని, ప్రభుత్వ పథకాలపై రామోజీ తప్పుడు కథనాలను రాస్తున్నారని ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. దళితులకు చంద్రబాబు ఏనాడైనా మంచి చేశారా? అసైన్డ్ భూముల్లో రామోజీరావు ఫిల్మ్‌సిటీ కట్టారని దుయ్యబట్టారు. ‘‘ఈనాడు పత్రిక శకుని పాత్ర పోషిస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు పెట్టాలని రామోజీ చూస్తున్నారు. దళితుల కోసం వైఎస్సార్, సీఎం జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని జూపూడి అన్నారు. ‘‘చంద్రబాబు తన సామాజిక వర్గం కోసమే పనిచేస్తున్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. అవినీతికి అవకాశం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’’ అని జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. చదవండి: బుద్ధప్రసాద్‌కు షాకిచ్చిన దివిసీమ రైతులు -
మనిషి రూపంలో ఉన్న సైతాన్ చంద్రబాబు: జూపూడి ప్రభాకర్
సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం పార్టీని దళితులు నమ్మే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. దళిత నియోజకవర్గాల్లోనూ టీడీపీ దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే విషయం అందరికీ తెలుసని అన్నారు. దళితులు ఏం పీకారంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరితే రాళ్లదాడి చేస్తారా అని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీలో ఎక్కిడికి వెళ్లినా తమ నిరసన ఉంటుందని స్పష్టం చేశారు. ‘పేదలు, దళితుల వ్యతిరేకి చంద్రబాబు. దళితులను చంద్రబాబు ఊచకోత కోశారు. దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌పై దాడులు చేయిస్తావా? ప్రశ్నించిన మాపై దాడులు చేయటం ఏంటి? మరో కారంచేడును చేయాలని చూస్తున్నారా?. అమరావతిలో దళితులు ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసులు వేయించాడంటేనే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటాం. చంద్రబాబు మనిషి రూపంలో ఉన్న సైతాన్. దళితులను, ప్రాంతాలను, కులాలను విడదీసే నీచుడు చంద్రబాబు. 2024లోనూ దళితుల నియోజకవర్గాల్లో చంద్రబాబుకు నో ఎంట్రీ. రాష్ట్రవ్యాప్తంగా చంద్రాబాబుకు నిరసన సెగ తప్పదు. దళితులు ఎదిగే సమయంలో చంద్రబాబు అడ్డుకుంటున్నాడు. చంద్రబాబు, లోకేష్‌ను దళిత జాతి క్షమించదు.’ అని జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. చదవండి: దెబ్బకు దిమ్మతిరిగింది.. చంద్రబాబుకు ‘సర్వే’ షాక్ -
రామోజీ .. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
తాడేపల్లి: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను ప్రభుత్వం పొడిగించడం శుభ పరిణామమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. అదే సమయంలో సబ్ ప్లాన్‌పై ఈనాడు బొజ్జ రాక్షసుడు అసత్యాలు రాస్తున్నాడని రామోజీరావును ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు జూపూడి. సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు రామోజీకి లేదని, చంద్రబాబు హయాంలో దళితులకు ఏం చేశారో రామోజీ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు హయాంలో సబ్ ప్లాన్ నిధులను కూడా ఖర్చు చేయలేదుని, చంద్రబాబు అరాచకాలను రామోజీ ఎందుకు ప్రశ్నించలేదని జూపూడి నిలదీశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై రామోజీ చర్చకు సిద్ధమా అని జూపూడి చాలెంజ్ చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై కేంద్ర గణాంకాల్లో ఏపీకి తొలిస్థానం దక్కిందనే విషయం గ్రహాంచాలని యెల్లో మీడియాకు చురకలంటించారు. -
తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది : జూపూడి
-
బాబు, పవన్‌లకు ఎన్నికల్లో ఒక్క సీటూ రాదు : కంచె ఐలయ్య
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆంగ్లమాధ్యమాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటూ రాదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య బుధవారం వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రశంసించారు. దేశంలో ఇంతవరకు ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకున్నందుకు జగన్‌కు ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల పేద పిల్లల భవిష్యత్తే మారుతుందని, ఇంగ్లీష్‌లో చదవడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టమని అడిగితే ఒప్పుకోలేదని వెల్లడించారు. అమ్మ ఒడి వల్ల పేదల బతుకులు మారుతాయని, దీన్ని వ్యతిరేకిస్తున్నవారిని చీపుర్లతో తరిమికొట్టాలని తల్లులకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇంగ్లీష్ మీడియంను కార్పొరేట్ శక్తులే వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ‘అన్ని పార్టీల నాయకులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. మా పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌లో చదవకూడదా? లేక పేదపిల్లలు పెద్దల పిల్లలకు పోటీగా వస్తారని భయపడుతున్నారా’? అంటూ ప్రశ్నించారు. ఇంగ్లీష్ వల్ల తెలుగు భాషకు వచ్చిన ముప్పు ఏమీ లేదని, ఇప్పుడు మొత్తుకుంటున్న మేధావులు ప్రైవేట్ స్కూళ్లలో తెలుగు మీడియం పెట్టమని ఎందుకు అడగడం లేదని నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఏమి తెలుసని ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదని హెచ్చరించారు. అమ్మ ఒడి పథకానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల పిల్లల జీవితాలు బాగుపడడం చంద్రబాబు, పవన్‌లకు ఇష్టం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. పేదల బతుకులు మారాలని ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని కుహనా మేధావులే వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అప్పటి నుంచే బాబుకు నిద్ర కరువైంది’
సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు నిద్ర కరువైందని ఎద్దేవా చేశారు. టీడీపీని ప్రజలు తిరస్కరించినా.. ప్రజాతీర్పును హేళన చేస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాల పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శం కాబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకునే నిర్ణయాలు దేశానికే ఆదర్శమని అన్నారు. ‘సీఎం జగన్ అందరివాడు’ అని జూపూడి పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని జూపూడి విమర్శించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌ను తప్పించే అధికారం సీఎంకు ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను అభాసుపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. మత్తయ్యను పావుగా వాడుకుని చంద్రబాబు లేఖలు రాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ఓటుకు కోట్లు కేసు’లో చంద్రబాబుతోపాటు మత్తయ్య కూడా నిందితుడేనని ఆయన గుర్తు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. -
వైఎస్సార్ సీపీలోకి జూపూడి, ఆకుల
-
వైఎస్సార్ సీపీలోకి ఆకుల, జూపూడి
సాక్షి, అమరావతి : రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్, పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. అనంతరం ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మేనిఫెస్టోను పాలనకు గీటురాయిగా చేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారు. వాహన మిత్రతో ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలుపుకున్నారు. ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని పార్టీలో చేరా. మద్య నిషేధంపై గతంలో చాలా మంది హామీ ఇచ్చారు. సీఎం జగన్ మాత్రమే దాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నార’’ని అన్నారు. పొరపాట్లు నా వైపు ఉన్నాయి : జూపూడి మంచి పరిపాలన రావాలని, రాజన్న పాలన తెస్తాడని ప్రజలు సీఎం జగన్‌ను ఆశీర్వదించారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు. ఐదుగురు దళితులకు కేబినేట్లో సీఎం జగన్ స్థానం కల్పించారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకుందని అన్నారు. అసెంబ్లీలో పెట్టిన బిల్లులను రాజ్యాంగ బద్ధంగా తీర్చిదిద్దారని అన్నారు. సీఎం జగన్ పరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. పొరపాట్లు తన వైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని చెప్పారు. -
జూపూడి ప్రభాకర్ రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జూపూడి ప్రభాకర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన వారు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. చలనచిత్ర టీవీ నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ, బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య, వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు ఇప్పటికే తమ పదవులను వదులుకున్నారు. -
జూపూడి ఇంటి వద్ద డబ్బు సంచులు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వేళ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాక ర్రావు నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ ఎస్ శ్రేణులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి రావడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వెనుక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వెంబడించి ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పారిపోయారు. దొరికిన వ్యక్తిని, అతడి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు ఠాణాకు తరలించారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఓటర్లకు పంచేందుకే ఈ నగదు తీసుకొచ్చినట్లు వారు ఆరోపించారు. -
'లక్ష మంది ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ'
ఏలూరు: రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి, సంక్షేమం, ఐక్యత ప్రధాన అంశాలుగా వారి ఆర్థికాభివృద్ధికోసం భూమి కొనుగోలు పథకాన్ని మరింత మెరుగ్గా అమలుచేయాలని నిర్ణయించామని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. స్థానిక జెడ్పీ అతిథిగృహంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి కోసం అమలుచేస్తున్న భూమి కొనుగోలు పథకాన్ని ఇచ్చే రుణాన్ని రూ.5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచామని, తొలి విడతగా 1200 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో లక్ష మంది ఎస్సీ అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కార్యక్రమాలు రూపొందించామన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయాలని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని జూపూడి ఈ సందర్భంగా అన్నారు. -
'రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారు?'
-
రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారు ?
విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారంపై టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు ఆదివారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ... పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారని అడిగారు. డబ్బు ఇవ్వకుండా ఎవరైనా ఎన్నికల్లో గెలిచారా ? అంటూ జూపూడి వితండవాదం చేశారు. అయితే ఎన్నికల్లో ఓటర్లును డబ్బుతో ప్రలోభపెట్టడాన్ని సమర్థిస్తారా ? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జూపూడి నీళ్లునమిలారు. -
రెండేళ్ల పదవికి అనూరాధ నో
- నామినేషన్ వేసిన ప్రతిభా భారతి - సందిగ్ధంలో ఎమ్మెల్సీ సీటు - గవర్నర్ కోటా సీటుపై అనూరాధ ఆశ సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో రెండేళ్ల ఎమ్మెల్సీ కోటాకు పంచుమర్తి అనూరాధ నో చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ఎమ్మెల్సీగా గెలుపొందిన పాలడుగు వెంకట్రావు చనిపోవడంతో ఆయన స్థానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత జూపూడి ప్రభాకర్‌కు కేటాయించారు. అయితే, జూపూడికి మన రాష్ట్రంలో ఓటు లేకపోవడంతో ఆయన పోటీచేసే అవకాశం లేకుండాపోయింది. నామినేషన్‌కు గురువారం ఆఖరు రోజు కావడంతో ఆ పదవికి నామినేషన్ వేయమంటూ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. రెండేళ్ల పదవికి వద్దు రెండేళ్ల గడువు మాత్రమే ఉన్న ఈ స్థానానికి తాను పోటీ చేయబోనని అనూరాధ స్పష్టం చేసినట్లు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వాలంటే.. తొలుత నిర్ణయించినట్టుగా గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, రెండేళ్లకు మాత్రమే పరిమితమయ్యే పదవి తనకు వద్దని అనూరాధ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో మాజీ స్పీకర్ ప్రతిభా భారతితో హుటాహుటిన ఆ పదవికి నామినేషన్ వేశారు. దీంతో గవర్నర్ కోటాలో మరో మహిళకు అవకాశం కల్పించే కంటే మరొకరికి చాన్స్ ఇవ్వాలంటూ ఆశావహులు కోరుతున్నారు. అనూరాధను పక్కన పెడితే ఆ సీటు నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవీంద్రకు దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఉమా ఆశీస్సులతో బచ్చులకు.. పంచుమర్తి అనూరాధ నగర మేయర్‌గా పనిచేసే సమయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో చంద్రబాబు ఆమెకు అవకాశం కల్పించారు. అలాగే, తొండేపు దశరథ్ జనార్ధన్ హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలో పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేయడంతో చంద్రబాబుతో పాటు పార్టీలోని అనేకమంది సీనియర్ నేతలకు దగ్గరయ్యారు. దీంతో ఆయనకూ సీటు దక్కింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ సీటు పొందుతున్న బచ్చుల అర్జునుడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికల్లో నూజివీడు, బందరు సీట్లు ఆశించి భంగపడ్డారు. ఉమా సూచన మేరకు బచ్చులకు సీటు దక్కేందుకు మార్గం సుగమమైంది. కాగా, ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్ సర్పెంచిల సంఘానికి దీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈయన గత ఎన్నికల్లో పెనమలూరు సీటు ఆశించారు. చంద్రబాబుతో నేరుగా పరిచయాలు ఉండటంతో ఆయనకు మరోసారి అవకాశం లభిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఆరేళ్ల పదవిలో కొనసాగే అవకాశం ఉన్న సీటు బచ్చులకు దక్కుతుందా..? లేదా వైవీబీకి వరిస్తుందా..? అనేది తేలాల్సి ఉంది. గవర్నర్ కోటాలో సీటు వస్తుంది : పంచుమర్తి అనూరాధ తొలుత నిర్ణయించినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నరు కోటాలోనే తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని పంచుమర్తి అనూరాధ ’సాక్షి’కి చెప్పారు. తనకు సీటు తప్పనిసరిగా వస్తుందని, ఏవిధమైన ఇబ్బందులు ఉండబోవని ఆమె అభిప్రాయపడ్డారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ కు జూపూడి రాజీనామా!
-
అనైతిక పొత్తుల కోసం చంద్రబాబు పాట్లు: జూపూడి
-
సీమాంధ్రలో వ్యవసాయం ఏం చేస్తావు బాబూ?
-
'తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభిమానులు ఉన్నారు'
-
ప్యాకేజీ మాట్లాడుకొని తెలుగుజాతికి ద్రోహం చేసారు
-
మండలిలో బిల్లుపై చర్చ
-
టీడీపీ నేతలు వైఖరి ఎందుకు మార్చుకున్నారు:జూపూడి
-
సమైక్య తీర్మాణం చేసి చర్చించాలి : జూపూడి
-
సమైక్య తీర్మానానికే వైఎస్ఆర్సీపీ పట్టు
హైదరాబాద్ : ఓటింగ్, చర్చ, బిల్లు కన్న ముందు సమైక్య తీర్మానానికే వైఎస్ఆర్సీపీ పట్టుబడుతుందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. సమైక్య తీర్మానం చేసి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. తాము చెప్పినదాన్ని ఒప్పుకోకుండా బీఏసీ చెప్పినదాన్నే ఒప్పుకోమంటే దాన్ని వైఎస్ఆర్సీపీ ఖండిస్తుందన్నారు. మరోవైపు శాసనమండలి బీఏసీ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. -
సమైక్య దీక్షా ప్రాంగణంలో మాట్లాడుతున్నజూపుడి
-
బాధ్యత మరచి మాట్లాడుతున్న కెసిఆర్: జూపూడి
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. హైదరాబాద్‌లో ఈరోజు జరిగిన సకల జనభేరీ బహిరంగ సభలో కెసిఆర్ ప్రజలు, ప్రజాస్వామ్యం మీద గౌరవంలేకుండా మాట్లాడాన్నారు. జూపూడి సాక్షిటివీతో మాట్లాడుతూ సీమాంధ్రలో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని ఇంత చులకన చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని, ఎవరెవరు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసన్నారు. ఉద్యమాన్ని చులకన చేయడం మంచిదికాదన్నారు. యువనేత జగన్మోహన రెడ్డి జైలు నుంచి బయటకు వస్తుంటే జనం లక్షలాది మంది తరలి వచ్చారని చెప్పారు. జగన్ ఒక్కరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారన్న ఆశ, నమ్మకంతో వారు వచ్చారన్నారు. -
కాంగ్రెస్ పార్టీ మొండిగా వ్యవహరిస్తుంది: జూపూడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన దీక్షను వెంటనే విరమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఆ పార్టీ కేంద్రమండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు శుక్రవారం హైదరాబాద్‌లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఏదైనా పోరాడి సాధిద్దామని అన్నారు. రాష్ట ప్రజలంతా మీ వెంటే ఉన్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు మీడియా ద్వారా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దయచేసి దీక్ష విరమించాలని వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్‌రావు సూచించారు. వైఎస్ జగన్ ఆదివారం చేపట్టి ఆమరణ నిరాహర దీక్ష శుక్రవారం ఆరో రోజుకు చేరుకుంది. కాగా గత అర్థరాత్రి ఆయన్ని చంచల్‌గూడ జైలు నుంచి భారీ బందోబస్తు నడుమ జగన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైఎస్ జగన్ ఆసుపత్రిలో కూడా దీక్ష విరమించలేదు. ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో దీక్ష విరమించాలని ఉస్మానియా వైద్యులు చేసిన సూచనలను వైఎస్ జగన్ తోసిపుచ్చారు. దాంతో వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జూపూడి ప్రభాకర్‌రావు జగన్‌కు పై విధంగా సూచించారు.