సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు నిద్ర కరువైందని ఎద్దేవా చేశారు. టీడీపీని ప్రజలు తిరస్కరించినా.. ప్రజాతీర్పును హేళన చేస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాల పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శం కాబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. పాలనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయాలు దేశానికే ఆదర్శమని అన్నారు. ‘సీఎం జగన్ అందరివాడు’ అని జూపూడి పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని జూపూడి విమర్శించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌ను తప్పించే అధికారం సీఎంకు ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను అభాసుపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. మత్తయ్యను పావుగా వాడుకుని చంద్రబాబు లేఖలు రాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ఓటుకు కోట్లు కేసు’లో చంద్రబాబుతోపాటు మత్తయ్య కూడా నిందితుడేనని ఆయన గుర్తు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment