LV Subrahmanyam
-
దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే!
అధికారంలో ఉన్నప్పుడు కళ్లు మూసుకుని, పదవీ విరమణ తర్వాత తగుదునమ్మా అంటూ టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఊరూరా తిరుగుతున్నారు. హింసలేని ఎన్నికలు, స్వేచ్ఛ అంటూ పెద్ద మాటలు చెబుతున్నారు. కాపాడే అధికారం ఉన్నప్పుడు ఏం చేశారని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.ఇటీవల కాలంలో ‘సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ’ (సీఎఫ్‌డీ) పేరుతో ఏపీ ఎన్నికల మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు సమా వేశాలతో హడావిడి చేస్తున్నారు. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ ప్రధాన లక్ష్యం స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్ని కల్లో ఓటు హక్కును ఉపయోగించుకోవడం అని ప్రకటించారు. ఇదే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న కాలంలో, స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయనీ, అలాగే నామినేషన్లు వేయనివ్వడం లేదనీ, దౌర్జన్యాలు నెరిగాయనీ పెద్ద ఎత్తున విపక్షాలు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిగా తొలగించడంతో ఆయనకు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లాంటివి గుర్తు కొస్తున్నాయి. ఈయన అప్రజాస్వా మికంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారనే విష యాన్ని మరిచిపోతే ఎలా? సీఈసీ విడుదల చేసిన వివరాల ప్రకారం 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 79.74 శాతం ఓట్లు పోలయ్యాయి. నరసరావుపేట పార్లమెంటరీ నియోజక వర్గంలో అత్యధికంగా 85.53 శాతం పోలయ్యాయి. అలాగే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో 74.64 శాతం ఓట్లు పోలయ్యాయి. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధికంగా 85.16 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే, రాష్ట్ర విభజన జరిగిన మొదటి ఐదేళ్లకే ఇక్కడి ప్రజల్లో కలిగిన చైతన్యం కారణంగా 2019 ఎన్నికల్లో చంద్ర బాబును ఇంటికి పంపడం కోసం, మరో ఐదు శాతం మంది కొత్తగా ఓటింగ్‌లో పాల్గొన్నారన్నమాట. ఇక్కడి గణాంకాలు ఇలా ఉన్నప్పుడు, ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మళ్ళీ ఓటు–హక్కు అంటూ, వీరి కసరత్తు ఎందుకు? ఈ ఐఏఎస్ అధికారులతో పీవీ రమేష్ అనే మరొక ఐఏఎస్ కలిశారు. వీరు కలిగించే చైతన్యం అంతా బెజ వాడ కేంద్రంగానే సాగడం గమనార్హం. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో నిమ్మగడ్డ బృందం నిర్వహిస్తున్న సభల్లో గెస్ట్ పాత్రల్లో పాల్గొంటున్నవారి విషయమై పౌరులు బాధపడుతున్నారు. రిటైర్ అయ్యాక కూడా ౖవై సీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పబోయి క్షతగాత్రు లైన ఈ ముగ్గురు అధికారులు తమకంటూ ఇక్కడ ఒక విలువ లేక, ‘మీడియా అటెన్షన్’ కోసం, మాజీ భారత ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్, కేబినెట్ సెక్రటరీ కె. పద్మనాభయ్యలను తమ పక్కన పెట్టుకుంటున్నారు. ఎందుకు ఈ మాజీ అధికారులను క్షతగాత్రులు అనవలసివచ్చిందో తెలియాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కేడర్‌లో ఏదో ఒక ప్రధాన శాఖలో కాకుండా, చంద్రబాబు కోసం తన సర్వీస్ చివరి రోజు వరకూ రాజ్ భవన్లో గవర్నర్ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్ర విభజనకు ముందు 4 నెలల పాటు రాష్ట్రపతిపాలన ఉండడం మనకు తెలిసిందే. అప్పట్లో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఆఫీస్ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల్లో అన్ని కీలక నిర్ణయాలకు కేంద్రం అయింది. ఇలా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం మొదటి నుంచి నిమ్మగడ్డకు కొత్తకాదు. అందుకే 2016లో రిటైర్ అయిన మరుసటి రోజు ఇతణ్ణి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్ట్‌లో చంద్రబాబు నియమించారు. అదే నెలలో ఆయన కుమార్తె నిమ్మగడ్డ లావణ్యను ఏపీ ‘ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్’లో సీనియర్ కన్సల్టెంట్‌గా నెలకు రూ 1.50 లక్షల జీతంతో నియమించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఉపాధి కోల్పోయి, పౌర వేదిక ముసుగులో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్థి తరహాలో ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారితే, మళ్ళీ ‘ఫ్యామిలీ ప్యాకేజి’ ప్రయోజ నాలు పొందడం ఆయన లక్ష్యం. అందుకోసం ‘ఈ ప్రభుత్వంలో సలహాదారులు ఎంతమంది? వీరు కేబినెట్ హోదాలో ఉంటూ రాజకీయాలు ఎలా మాట్లాడతారు?’ అంటూ రమేష్ టీడీపీ తరఫున విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇప్పటికంటే ఎక్కువమంది సలహా దారులు, ‘కన్సల్టెంట్లు’ ఉన్న విషయం తెలియనిది కాదు. ‘స్కిల్ స్కామ్’లో అరెస్టయిన ‘ఏ 1’ గంటా సుబ్బా రావు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్న ‘ఏ 2’ ఐఏఎస్ లక్ష్మీనారాయణలు ఇద్దరూ ఇదే తరహాలో బయట నుంచి ప్రభుత్వం ‘కన్సల్టెంట్స్’గా నియమించిన వారేకదా! ప్రభుత్వంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడ్డం నేరమా? లేక నమ్మకంగా ప్రభుత్వంలో ఉంటూ, దొంగ దారుల్లో నిధులు బయటకు పంపడం నేరమా? ఈ రెండింటిలో ఏది ప్రజాస్వామ్యానికి చేటు? అని రాష్ట్ర ప్రజలు ఈ నిమ్మగడ్డ బృందాన్ని నిలదీయొద్దూ? ‘రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం...’ అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లా డుతున్న నిమ్మగడ్డ, బెజవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీటులో కూర్చుని, తన తప్పుడు చర్యలకు తగిన శిక్ష నుంచి తప్పించుకోవడానికి క్రింది ఉద్యోగులతో‘కంప్యూటర్ హార్డ్ డిస్క్’లు ధ్వంసం చేయించడం ఏ స్ఫూర్తి అవుతుందో చెప్పగలరా? అసలు ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించడమే ఓ ప్రహసనం! ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు సీఎస్‌గా ఉన్న అనిల్ చంద్ర పునేఠా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ ఉండడంతో, భారత ఎన్నికల కమిషనర్ వెంటనే అయన్ని తొలగించి, క్రీడలు యువజన సర్వీసులు సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యంను సీఎస్ పోస్టులో నియమించింది. అయితే, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, సీఎం పరిపాలనా శైలి వేగాన్ని అందుకోలేని స్థితిలో ఉన్న ఎల్వీ స్థానంలో మరొకరిని సీఎస్ పోస్టులో నియమించారు. అదీ ఎల్వీ ఆక్రోశానికి కారణం. దాంతో, నిమ్మగడ్డ వెనుక తిరుగుతూ జగన్ ప్రభుత్వం మీద ముసుగు దాడికి దిగారు. ఇందులో ముఖ్యుల ఎంపిక ఎవరిదోగానీ, ఆసక్తి కరంగా ఉంది. అంబేడ్కరిస్టుల కుటుంబం నుంచి మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కొంచెం ఆలస్యంగా ఇందులోకి దిగారు. ‘స్కిల్ స్కామ్’ జరిగినప్పుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈయన కేస్ సమయంలో ‘మీడియా’ ముందు వివాదాస్పదంగా మాట్లాడి వార్తల్లో వ్యక్తి అయ్యారు. సర్వీసులో ఎక్కువకాలం పలుదేశాల్లో ‘వరల్డ్ బ్యాంక్’లో పనిచేశానని చెప్పుకునే రమేష్, ప్రస్తుతం‘ఇండియన్ బిజినెస్ స్కూల్’లో ‘ఫ్యాకల్టీ’గా పనిచేస్తూ, మధ్యలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బెజవాడ వస్తున్నారు. అయితే, ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం గురించి ఈయన ఒక్క మాటా మాట్లాడరు! వీరంతా ‘పొలిటికల్ జేఏసీ’గా ఏర్పడి, దానికి ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ అని పేరుపెట్టి ఏపీలో తటస్థ ఓటరును ప్రభావితం చేయాలనే రహస్య ‘ఎజెండా’తో పనిచేస్తున్నారు. వీరికి ‘మీడియా’ కవరేజి కోసం ‘బాబు మీడియా ఎటూ ఉండనే ఉంది. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే... ప్రజలు అంతా గమనిస్తున్నారు. తగిన సమ యంలో తగినవిధంగా స్పందిస్తారు. - వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే ‘ 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
‘అప్పటి నుంచే బాబుకు నిద్ర కరువైంది’
సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు నిద్ర కరువైందని ఎద్దేవా చేశారు. టీడీపీని ప్రజలు తిరస్కరించినా.. ప్రజాతీర్పును హేళన చేస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాల పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శం కాబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకునే నిర్ణయాలు దేశానికే ఆదర్శమని అన్నారు. ‘సీఎం జగన్ అందరివాడు’ అని జూపూడి పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని జూపూడి విమర్శించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌ను తప్పించే అధికారం సీఎంకు ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను అభాసుపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. మత్తయ్యను పావుగా వాడుకుని చంద్రబాబు లేఖలు రాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ఓటుకు కోట్లు కేసు’లో చంద్రబాబుతోపాటు మత్తయ్య కూడా నిందితుడేనని ఆయన గుర్తు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. -
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
సాక్షి: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. -
పది పాసైతే చాలు
సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్ల పోస్టుల కనీస విద్యార్హతను ఇంటర్ నుంచి పదవ తరగతికి ప్రభుత్వం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి వలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు కనీస విద్యార్హతగా మైదాన ప్రాంతంలో ఇంటర్, గిరిజన ప్రాంతంలో పదవ తరగతిగా ఉంది. అప్పట్లో మొత్తం 1,92,964 మంది గ్రామ వలంటీర్ల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1,83,290 మంది విధులలో చేరారు. మిగిలిన 9,674 పోస్టులను మైదాన, గిరిజన ప్రాంతం రెండింటిలోనూ పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేయడానికి అనుమతి తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీల సంఖ్య ఆధారంగా జిల్లాల వారీగా నవంబర్ 1న ఆయా జిల్లా కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా నవంబర్ పదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 16 నుంచి 20 మధ్య మండలాల వారీగా ఎంపీడీవో నేతృత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు 22వ తేదీ కల్లా సమాచారమిచ్చి, వారికి 29, 30 తేదీల్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. కొత్తగా ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి విధుల్లోకి చేరాల్సి ఉంటుంది. -
చిట్‌ఫండ్ మోసగాళ్లకు శిక్ష పడాల్సిందే
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ వంటి ప్రైవేటు ఆర్థిక సంస్థలు చేసే మోసాల కేసుల్లో అధికారులు సకాలంలో స్పందించి ఆర్థిక మోసగాళ్లకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో 17వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిట్‌ఫండ్ కంపెనీలు లేదా బ్యాంకింగ్ సేవల పేరిట ప్రజల నుంచి నగదు వసూలు చేసి మోసాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. ఈ విషయంలో సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజలను మోసం చేసేలా ఆయా సంస్థలు వివిధ మాధ్యమాల ద్వారా ఇస్తున్న ప్రకటనలపై నిఘా పెట్టాలన్నారు. అలాంటి ప్రకటనలను నిరంతరం పరిశీలించి చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. బ్యాంకులు, చిట్‌ఫండ్ కంపెనీలు, తదితర ఆరి్థక సంస్థల్లో ప్రజలు మదుపు చేసే సొమ్ముకు పూర్తి భరోసాను కలి్పంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి ఆర్థిక మోసాలను పూర్తిగా నివారించాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ రీజనల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ మాట్లాడుతూ ఆర్థిక మోసాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు ఆర్బీఐకి సహకారం అందించాలన్నారు. రహదారి భద్రతను పాఠ్యాంశంగా చేర్చాలి రహదారి భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఎనిమిదో తరగతి నుంచి రహదారి భద్రతను పాఠ్యాంశంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం సీఎస్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సీఎస్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో రహదారి భద్రత సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రత పరికరాల కోసం పోలీసులకు రూ.13 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రహదారి భద్రత నిధి కింద రూ.50 కోట్లను కేంద్రం ఈ ఏడాది కేటాయించిందని రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. రవాణాశాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు రహదారి భద్రతపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. -
'ఐఏఎస్ శంకరన్‌తో పనిచేయడం మా అదృష్టం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని లెనిన్ సెంటర్లో మంగళవారం ఏపీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి యస్. ఆర్.శంకరన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరన్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ. సుబ్రమణ్యం, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్. వీ. సుబ్రమణ్యం మాట్లాడుతూ.. శంకరన్ లాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం మాకు ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. జీవితంలో ఎదగాలి అనుకునేవారు శంకరన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శంకరన్ అధికారిగా పనిచేసే రోజుల్లో జిల్లాలో పర్యటించిన సందర్భాల్లో పరిష్కరించాల్సిన సమస్యలను డైరీలో నమోదు చేసేవారని గుర్తుచేశారు. ఆయన రాసిన వ్యాసాలు నేటి యువత అందరూ చదవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పేద వర్గాలకు అండగా నిలబడిన శంకరన్ లాంటి వ్యక్తి నిరాడంబరతకు నిలువెత్తు రూపం అని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కొనియాడారు. 'టాక్ లెస్ డూ మోర్' అన్నదే శంకరన్ గారి నినాదం అని సీపీఐ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు, ఫైనాన్స్ సెక్రటరీ యస్.యస్. రావత్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర ,టోబాకో బోర్డు సెక్రెటరీ సునీత , చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ దమయంతి తదితరులు పాల్గొన్నారు. -
జ్యుడీషియల్ ప్రివ్యూకు చకచకా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో టెండర్ల ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసి అవినీతిరహితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటైన ‘న్యాయపరమైన ముందస్తు సమీక్ష’కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీ మౌలిక సదుపాయాల(న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టాన్ని రాష్ట్రసర్కారు తీసుకురావడం, టెండర్ల న్యాయ పరిశీలన బాధ్యతలను హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు అప్పగిస్తూ ఆదేశాలివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బి.శివశంకరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జ్యుడీషియల్ ప్రివ్యూ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జికి అవసరమైన సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణుల జాబితాలను సంబంధిత శాఖలన్నీ తక్షణం పంపించాలని ఆదేశించారు. ఆ జాబితాల్లోని వారి గత రికార్డుపై విజిలెన్స్ నివేదికల్ని తీసుకోవడంతోపాటు ఎటువంటి మచ్చలేని వారితోనే జాబితాలను పంపాలన్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఏజెన్సీలు లేదా స్థానిక అధికారి రూ.100 కోట్లు.. అంతకుమించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ ప్రక్రియకు వెళ్లేముందు ఆయా పత్రాలన్నింటినీ న్యాయపరమైన సమీక్షకోసం ముందుగా న్యాయమూర్తికి సమర్పించాలని సంబంధిత శాఖలకు నిర్దేశించారు. ఒకసారి జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలన చేశాక సంబంధిత టెండర్ ప్రక్రియలో ప్రీబిడ్ నెగోషియేషన్స్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలన అనంతరం ప్రభుత్వానికి పంపాక దానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండబోవన్నారు. ‘స్పందన’కు ప్రామాణిక విధానాన్ని పాటించాలి ‘స్పందన’ కార్యక్రమం కింద వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు అన్ని శాఖలూ ఒకే ప్రామాణిక విధానాన్ని(స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్) పాటించాలని సీఎస్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ‘స్పందన’పై వర్క్‌షాప్ జరిగింది. ప్రజలనుంచి వచ్చే ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంలో అనుసరించాల్సిన ‘స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్’పై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ సూచనలిచ్చారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి నిర్దిష్ట కాలవ్యవధి పెట్టి ఆ గడువులోగా సదరు ఫిర్యాదును పరిష్కరించడంతోపాటు ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయాలని ఆదేశించారు. ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఆ వివరాల్ని ప్రణాళికా శాఖకు అందించాలని సూచించారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి శాఖలవారీగా రూపొందించిన కాలవ్యవధి(టైమ్ లైన్), స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ వివరాల్నీ అందించాలన్నారు. వచ్చే ప్రతి ఫిర్యాదును సకాలంలో సక్రమంగా పరిష్కరించడంపై అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతి ఫిర్యాదు ఆమోదానికి ముందు.. లబ్ధిదారు ఎంపిక అనంతరం సోషల్ ఆడిట్ తప్పనిసరన్నారు. -
నిర్ణీత సమయంలోగా విభజన పూర్తి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజ నకు సంబంధించిన పలు అంశాలపై దాదాపు ఏడాది తరువాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి దీనికి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చర్చలకు నేతృత్వం వహించారు. పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల సీనియార్టీ అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎస్సైలు, ఇన్స్పెక్టర్ల ప్రమోషన్లు జోన్ల ప్రకారం చేపడతారని, డీఎస్పీ స్థాయికి వెళ్తేనే కామన్ ప్రమోషన్ల కిందకు వస్తుందని, ఫ్రీజోన్‌లో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని, కేటాయింపుల ప్రకారం ప్రమోషన్లు ఇస్తామ న్న తెలంగాణ ప్రభుత్వ వాదనను కేంద్ర హోం శాఖ అంగీకరించలేదు. ఫ్రీజోన్ అనేది కొత్తగా వచ్చింది కాదని హోంశాఖ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీనియార్టీని నిర్ధారించాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో హోంశాఖ ఏకీభవించింది. ఆ మేరకు సీనియార్టీ నిర్ధారించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జాబితాపై ఏపీ స్పందన కోరిన కేంద్రం 9వ షెడ్యూల్లోని ఆస్తుల విభజనపై కూడా సమా వేశంలో చర్చ జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విభజన జరగాలని ఏపీ మొదటి నుంచి పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇద్దరు సీఎస్ల వాదనలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి విన్నారు. ఇదే సమయంలో 68 సంస్థలకు సంబంధించి విభ జనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక జాబితాను సమర్పించింది. ఈ జాబితాపై ఆంధ్రప్రదేశ్ స్పందన తెలియచేయాలని హోంశాఖ కార్యదర్శి కోరారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి కావాలి.. సింగరేణి కాలరీస్‌కి సంబంధించి విభజన చట్టంలోనే లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం హోంశాఖ దృష్టికి తెచ్చింది. షెడ్యూల్ 9 ప్రకారం సింగరేణి సంస్థను విభజించాలని, ఆస్తుల నిష్పత్తి ప్రాతిపదికన తెలంగాణకు బదలాయించాలని ఉందని తెలిపింది. చట్టప్రకారం ఏం చేయాలో పరిశీలించి తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఆస్తుల విభజన నిర్ణీత వ్యవధిలోగా జరగాలని హోంశాఖ అధికారులు ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపుపై సుముఖం తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాది తర్వాత పౌర సరఫరాల శాఖను ఏర్పాటు చేసుకుంది. ఈ కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే గ్యారెంటీలు, అప్పులు చెల్లించింది. ఈ నేపథ్యంలో దీని విలువ ఎంతో నిర్ధారించి ఆమేరకు ఏపీకి ఇవ్వాలని హోం శాఖ సూచించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇది రూ.1,700 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ బకాయిల విషయం లో కూడా భేదాభిప్రాయాలు లేవని ఇరు రాష్ట్రాలు హోంశాఖకు స్పష్టం చేశాయి. రూ.కోట్లలో ఉన్న బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. 10వ షెడ్యూల్‌కు సంబంధించి శిక్షణ సంస్థల విభజన విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్ర హోం శాఖ వివరణ ఉందని ఏపీ ప్రభుత్వం నివేదించింది. దీనిపై న్యాయ సలహా తీసుకుని మళ్లీ అభిప్రాయం తెలియజేస్తామంది. -
ప్లాస్టిక్‌ను తరిమేద్దాం..
పర్యావరణ పరిరక్షణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. దీనిలో భాగంగా రాజధాని నగరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చెత్త రీసైక్లింగ్‌పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాప్ ఎండీ కాటంనేని భాస్కర్, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు.ఈ మేరకు ఇంది ప్రజలతో ‘ప్లాస్టిక్ వాడం.. పర్యవరణాన్ని కాపాడుతాం..’ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ ఇంతియాజ్ ప్రతిజ్ఞ చేయించారు. సాక్షి, అమరావతి : ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది. ప్లాస్టిక్ వల్ల మనిషి తినే ఆహారంతో పాటు జిల్లాలో ఉన్న జలవనరులన్నీ కలుషితమైపోయి పర్యావరణానికి హాని కలుగుతోంది. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం ఏటా సగటున 100 కిలోల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తుందని సమాచారం. ఇది గ్రామాల్లో పోలిస్తే పట్టణాలు, పురపాలికల్లో ఎక్కువ. జిల్లాలో నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీల్లో రోజుకు సగటున 45 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అలాగే నగర పంచాయతీలైన ఉయ్యూరు, నందిగామ, తిరువూరు నగర పంచాయతీల్లోనూ రోజు సగటున 10 నుంచి 15 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో దాదాపు 20 శాతం అంటే 20 టన్నుల టన్నుల మేర నిత్యం ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. దీనిలో 40 శాతం వరకు సేకరణకు రాకుండా ఇళ్లలో, రహదారులపై ఉండిపోతోంది. మిగిలిన దాంట్లో కొంత కాల్చివేస్తుండగా.. ఎక్కువ శాతం సేకరించి పేర్చుతున్నారు. 15 నుంచి 20 శాతం మాత్రమే పునరుత్పత్తి జరుగుతోంది. అత్యధికంగా విజయవాడలోనే.. జిల్లాలో మొత్తం విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు 4 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజూ వెయ్యి టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతుంటే అందులో దాదాపు 100 టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. జిల్లాలో అత్యధికంగా విజయవాడ కార్పొరేషన్లో రోజూ 550 టన్నులు ఉత్పత్తి అవుతుండగా.. తర్వాత స్థానం మచిలీపట్నం కార్పొరేషన్లో దాదాపు వంద టన్నుల చెత్త ఉత్పన్నమవుతోంది. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాలు, హోటళ్లు, ఇతరత్రా వాటిల్లో 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించేలా చర్యలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. ‘స్వచ్ఛ విజయవాడ’కు శ్రీకారం.. ప్రపంచ వర్తక, వాణిజ్య రంగంలో ముఖ్య భూమిక పోషించిన విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తున్నాయి. నగరాన్ని అపరిశుభ్రంగా మార్చుతున్న నిర్లక్ష్యపు నీడల్ని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ విజయవాడ’కు శ్రీకారం చుట్టింది. బెజవాడలోని ప్రధాన వీధులు మినహా ఇతర వీధుల్లో ముక్కు మూసుకుని పోయే పరిస్థితికి కారణమవుతున్న డంపర్ బిన్లను తొలగించింది. ఇంటింటి నుంచి రోజూ చెత్త సేకరించాలనే ఉద్దేశంతో రూ.కోట్లు పెట్టి పుష్‌కార్ట్‌లు, చెత్త సేకరించే బుట్టలను తీసుకురావడమే కాకుండా.. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో నగరాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై దృష్టి సారించింది. ఇది కేవలం అధికారుల చర్యలతో కాదు.. ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుంది. ప్రతిజ్ఞ చేస్తున్న సీఎస్ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ ఇంతియాజ్, శాప్ ఎండీ భాస్కర్, జేసీ మాధవీలత తదితరులు చేయాల్సిందిదీ.. ► పాలు, మాంసం లాంటివి తీసుకురావడానికి బయటకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే ఓ టిఫిన్ బాక్సు తీసుకుపోవాలి. ► 40 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ సంచులను వాడినా వాటిని మన బాధ్యతగా పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చేలా ప్రయత్నించాలి. ► కూరగాయలు, ఇతరత్రా కొనేటప్పుడే భూమిలో కలిసి పోయే గుణమున్న చేతి సంచినే వినియోగించాలి. ► వ్యాపారులు, దుకాణాదారుల యజమానులు ప్లాస్టిక్‌ను ఇవ్వకుండా వినియోగదారులకు నచ్చజెప్పేలా మాట్లాడాలి. ప్లాస్టిక్ నీళ్ల సీసాలకు బదులుగా స్టీలు, రాగి వంటి సీసాలు ఉపయోగిస్తే మంచిది. ► పురపాలక సంఘ అధికారులు మొక్కుబడిగా కాకుండా ప్లాస్టిక్ నియంత్రణపై చిత్తశుద్ధి కనబర్చాలి. పురపాలికల్లో ఉన్న అన్ని దుకాణాలు, హోటళ్లు ప్లాస్టిక్‌ను నిషేధించేలా వారికి దశల వారీగా కౌన్సెలింగ్ కేంద్రాల ద్వార అవగాహన కల్పించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలి. ప్రతి ఒక్కరూ సహకరించాలి.. నగరంతో పాటు, జిల్లా అంతటా ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. నగరంతో పాటు జిల్లాల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వ్యాపార సంస్థలు, సూపర్ మార్కెట్లు, హోటళ్ల తదితరాల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. – ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ -
‘స్పందన’ అర్జీలను తక్షణమే పరిష్కరించాలి
సాక్షి, అమరావతి: స్పందన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విధానాన్ని తీసుకురావాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం సీఎస్ ఆధ్వర్యంలో స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించి వర్క్ షాపు నిర్వహించారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధింత కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు. 12 శాఖలు ద్వారా 92 శాతం స్పందన ఫిర్యాదులను స్వీకరిస్తునట్లు తెలిపారు. స్పందన అర్జీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని శాఖలు సకాలంలో బాధ్యతాయుతంగా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారాలపై అక్టోబర్‌లో ఎమ్మార్వో, ఎండీవోలకు జిల్లాస్థాయిలో సెన్సిటైటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎస్ వెల్లడించారు. -
సీఎం ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ నియమితులయ్యారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనను ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు ఐఏఎస్‌లను, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి అదనపు బాధ్యలను ప్రవీణ్ కుమార్‌కు అప్పగించారు. అటవీ అభివృద్ధి సంస్ధ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.ప్రతీప్ కుమార్‌కు పీసీసీఎఫ్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
‘రైతులకు, నిరుద్యోగులకు చేయూత కల్పించాలి’
సాక్షి, కృష్ణా : రైతులకు, నిరుద్యోగులకు చేయూత కల్పించి వారిని ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యం సూచించారు. పదమూడు జిల్లాల బ్యాంకు ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం గురువారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2022 నాటికి బ్యాంకింగ్ వ్యవస్దలో సమూల మార్పులు తీసుకు రావడానికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఎకానమీని పెంచడానికి బ్యాంకర్లందరు ఒక ప్రణాళిక రూపోందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులకన్నా బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగు పరచడానికి కొత్త పద్దతులను రూపొందించాలని పేర్కొన్నారు. ఆర్దికంగా ఎదుగుతున్నప్పుడు నష్టపోకపండా ఏవిధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై బ్యాంకర్లు దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుల రుణాల విషయంలో ఏవిధంగా సహాయం చేయగలుగుతామో బ్యాంకర్లకు వివరించినట్లు వెల్లడించారు. . రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లకు ఇచ్చే రాయితీల గురించి ఆయన చర్చించారు. -
సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా..
సాక్షి, విశాఖ సిటీ: విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి పులిపాటి కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2009 కేడర్‌కు చెందిన కోటేశ్వరరావు ఏపీపీఎస్ కార్యదర్శిగా, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్ జాబితాలో ఉన్నారు. వీఎంఆర్డీఏ కమిషనర్‌గా ఉన్న బసంత్‌కుమార్ టీటీడీ జేఈవోగా బదిలీ కాగా.. ఇన్చార్జి కమిషనర్‌గా ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్ జి.సృజన వ్యవహరిస్తున్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా.. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని వీఎంఆర్డీఏ కమిషనర్‌గా రానున్న కోటేశ్వరరావు తెలిపారు. చైర్మన్, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయంతో వీఎంఆర్డీఏను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. సంస్థను వివాదరహితంగా, పారదర్శకంగా నడిపించడమే తమ ధ్యేయమని అన్నారు. -
24న నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ గవర్నర్‌తో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అతిథులకు రాజ్‌భవన్ అధికారులు తేనీటి విందు ఏర్పాటు చేశారు. హరిచందన్ ఈ నెల 23 రాత్రికి రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. విజయవాడలోని ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయంలో రాజ్‌భవన్ ఏర్పాటు పనులను శనివారం ఆయన పరిశీలించారు. సీఎస్‌తో పాటు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, జీఏడీ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ మిషాసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కొత్త గవర్నర్ ఈ నెల 23న భువనేశ్వర్ నుంచి తిరుమల వెళ్లి, శ్రీవారి దర్శనం అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని తెలిపారు. అక్కడ రాష్ట్ర ప్రథమ పౌరుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, అధికారులు స్వాగతం పలకనున్నారని తెలిపారు. త్రివిధ దళాల స్వాగతం.. మొదటిసారిగా రాజధానికి రానుండడంతో గవర్నర్‌కు త్రివిధ దళాలు ఆర్మీ సెరిమోనియల్ స్వాగతం పలకనున్నాయి. తర్వాత హరిచందన్ కనకదుర్గమ్మ గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. గవర్నర్ సూచనమేరకు రాజ్‌భవన్‌కు అధికారులు తగిన మార్పులు చేస్తున్నారు. భవనం మొదటి అంతస్తులో గవర్నర్ నివాసాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. రాజ్‌భవన్‌కు నలువైపులా సెక్యురిటీ పోస్టులను ఏర్పాటు చేసి, లైటింగ్ పెంచాలని అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. శాసనసభ, మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి స్పీకర్, చైర్మన్లకు లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నామని సీఎస్ చెప్పారు. -
ఏపీలో జిల్లాల ఇన్చార్జి మంత్రులు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని సమీక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. జిల్లాల ఇంచార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి జిల్లా పేరు ఇంచార్జి మంత్రి పేరు శ్రీకాకుళం వెలంపల్లి శ్రీనివాసరావు – దేవదాయ శాఖ విజయనగరం చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు–గృహ నిర్మాణ విశాఖపట్టణం మోపిదేవి వెంకట రమణ–పశుసంవర్ధక, మత్య్స, మార్కెటింగ్ తూర్పుగోదావరి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)–డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం పశ్చిమగోదావరి పిల్లిసుభాష్ చంద్రబోస్–డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కృష్ణా కురసాల కన్నబాబు–వ్యవసాయ, సహకార గుంటూరు పేర్ని వెంకటరామయ్య–రవాణా, సమాచార అండ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకాశం పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్–జలవనరులు పొట్టి శ్రీరాములు నెల్లూరు మేకతోటి సుచరిత–హోం, విపత్తుల నిర్వహణ కర్నూలు బొత్స సత్యనారాయణ– మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి వైఎస్సార్ కడప బుగ్గన రాజేంద్రనాధ్– ఆర్థిక, ప్రణాళిక, శాసన సభ వ్యవహారాలు అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి–పంచాయతీ రాజ్–గ్రామీణాభివృద్ధి, గనులు చిత్తూరు మేకపాటి గౌతం రెడ్డి పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ -
వీడుతున్న చిక్కుముడులు!
సాక్షి, అమరావతి: విభజన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని పొరుగు రాష్ట్రమైన తెలంగాణాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై రాష్ట్ర అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సలహాదారు రాజీవ్‌శర్మతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగాయి. కొన్ని అంశాల్లో ఒక రాష్ట్రానికి ప్రయోజనం, మరికొన్ని విషయాల్లో మరో రాష్ట్రానికి ప్రయోజనం కలిగి ఉండవచ్చని అయితే వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపాలని, లేదంటే మరో రెండేళ్లయినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగానే ఉంటాయనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ప్రధానంగా విభజన చట్టం 9, 10వ షెడ్యూల్ సంస్థల్లోని ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు సాగాయి. తొమ్మిదవ షెడ్యూల్లోని 89 సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీకి సంబంధించి షీలాబిడే కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు సాగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఇందులో కొన్ని సంస్థల్లో ఏపీకి, మరికొన్ని సంస్థల్లో తెలంగాణాకు ప్రయోజనం ఉంటుందని, ఇరు రాష్ట్రాలకు సమన్యాయం జరిగే అవకాశం ఉన్నందున తొమ్మిదవ షెడ్యూల్లోని 89 సంస్థలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్నేహహస్తం చాపింది. దీనిపై తెలంగాణ అధికారులు కూడా సానుకూలంగానే స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 10వ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు పంపిణీపై కూడా విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలపై కూడా అధికారులు చర్చించారు. విద్యుత్తు బకాయిలపైనా చర్చ... తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన విద్యుత్ బకాయిలపై కూడా రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ ఒకసారి అకౌంట్స్ సరిచూసిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగుల పంపిణీపై కూడా చర్చ సాగింది. భీష్మించుకుని కూర్చోవడం వల్ల ఫలితం ఉండదని, పరిష్కారాలు కావాలని శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్ తెలంగాణ విద్యుత్ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల పంపిణీ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌పై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన ప్రతిపాదనలు చేసింది. ఇది రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా ఉన్నందున ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందనే ఉద్దేశం వ్యక్తమవుతోంది. ఏపీఎండీసీ ఆస్తులు రూ.1,200 కోట్లు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తమ సంస్థఆస్తుల విభజన ప్రక్రియ కూడా త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ది సంస్థ (ఏపీఎండీసీ) అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు. ఏపీఎండీసీకి సుమారు రూ. 1,200 కోట్ల ఆస్తులున్నాయి. తొమ్మిదో షెడ్యూలులో ఉన్న ఈ సంస్థ ఆస్తులను విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 52: 48 దామాషాలో పంచుకోవాలి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీఎండీసీకి రూ. 624 కోట్లకుపైగా వాటా రానుంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కి రూ.576 కోట్లు దక్కనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో జరిగే సమావేశంలోనే ఏపీఎండీసీ విభజన ప్రక్రియ పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖ లేదా తిరుపతిలో ఇద్దరు సీఎంల సమావేశం! రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సాగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయించారు. వారం రోజుల్లోగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు మరోసారి సమావేశమై సమస్యల పరిష్కారానికి నాంది పలకాలని నిర్ణయించారు. సాగునీటి రంగానికి చెందిన అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వారం పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. జూలై 11వతేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నందున ఆ లోగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విశాఖపట్టణం లేదా తిరుపతిలో సమావేశం నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. -
విజయసాయి రెడ్డికి కేబినెట్ హోదా
-
విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయసాయి రెడ్డికి కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ భవన్ కార్యాలయంగా విజయసాయి రెడ్డి విధులు నిర్వహించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా ఉంటూ సంస్థాగత నిర్మాణంలోనూ ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. ‘నవరత్నాలు’కు ప్రత్యేక అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నవరత్నాలు’ పథకం అమలుకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.శామ్యూల్ నవరత్నాల మానిటరింగ్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నవరత్నాలు అమలు శాఖలను సమీక్షించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా వ్యవహరించనున్న శామ్యూల్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. -
సీఎం జగన్‌ను కలిసిన రోజా, నారాయణస్వామి
సాక్షి,అమరావతి: తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలువురు ప్రముఖులు ఆయనను కలిశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దంపతులు, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, జి.శ్రీకాంత్ రెడ్డి, కాకాణి గోవర్దన్‌రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వాసు బాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు సీఎంని కలిసినవారిలో ఉన్నారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ...అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తొమ్మిదేళ్లుగా వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని.. రాష్ట్రానికి రాజన్న పాలన తీసుకురావాలన్న ఆలోచనతో తామంతా పని చేశామన్నారు. అంతేకానీ పదవుల కోసం కాదని రోజా స్పష్టం చేశారు. తమ నియోజవర్గ ప్రజలకు నవరత్నాలు అందించడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. బుజ్జగింపులు, అలకలు అనేవే లేవని, మీడియా అనవసరంగా దూరం పెంచొద్దంటూ ఆమె హితవు పలికారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తామంతా అయినట్లేనని రోజా అన్నారు. సమాచారశాఖ కమిషనర్‌గా విజయకుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా తుమ్మా విజయకుమార్‌రెడ్డిని నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) 1990 బ్యాచ్‌కు చెందిన విజయకుమార్‌రెడ్డి.. డెప్యుటేషన్‌పై రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించడానికి కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ స్థానంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా విజయకుమార్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విజయకుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి : రాష్ట్ర నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదిక సిద్ధమైంది. శనివారం ఉదయం 11.49 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభా వేదిక వద్ద ప్రత్యేకంగా గ్యాలరీలు, బారికేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై గుంటూరు జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం సంబంధిత అధికారులతో చర్చించారు. అక్కడ జరుగుతున్న పనులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. అత్యంత ప్రముఖులు, ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలు వారికి కేటాయించిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా బోర్డులను ఏర్పాటుచేశారు. సచివాలయం వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఆహ్వాన పత్రికలకు వెనుక భాగాన రూట్ మ్యాప్‌ను కూడా ముద్రించారు. కూర్చున్న చోటుకే అల్పాహారం కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ వారు కూర్చున్న ప్రాంతంలోనే అల్పాహారం, తాగునీరు అందించాలని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించేందుకు వీలుగా ప్రాంగణంలో ఎల్ఇడి తెరలను ఏర్పాటుచేశారు. 1500 మంది పోలీసులతో ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటుచేసింది. ఈ ఏర్పాట్లను డీజీపీ సవాంగ్, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా పర్యవేక్షించారు. మంత్రుల ప్రమాణ స్వీకార సభ ప్రాంగణం దిగువన నవరత్నాల చిహ్నాలు సిద్ధం చేస్తున్న సిబ్బంది -
సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన కల్లం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సచివాలయం తొలి బ్లాక్ మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ హోదాలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధిపతిగా వ్యవహరిస్తారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు అజేయ కల్లం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన (రాజకీయ వ్యవహారాలు) ముఖ్యకార్యదర్శి రామ్ ప్రకాశ్ సిసోడియా, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఇతర అధికారులు అజేయ కల్లంను కలిసి అభినందనలు తెలిపారు. -
బాధ్యతలు స్వీకరించిన కల్లం, శ్రీరామ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా అజేయ్ కల్లం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని బాధ్యతలు చేపట్టిన ఆయనకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు. అంతకు ముందు అజేయ్ కల్లం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజీగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం శ్రీరామ్ మరోవైపు ఆంధ్రపద్రేశ్ హైకోర్టు అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన తన ఛాంబర్లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడ్వొకేట్ జనరల్‌గా శ్రీరామ్‌ను నియమించాలని నిర్ణయించారు. శ్రీరామ్ 1969లో జన్మించారు. -
ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా శ్రీరామ్
-
అడ్వొకేట్ జనరల్‌గా శ్రీరామ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో టీడీపీ హయాంలో ఏజీగా వ్యవహరించిన దమ్మాలపాటి శ్రీనివాస్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం ఉదయం హైకోర్టులో ఏజీగా శ్రీరామ్ బాధ్యతలు స్వీకరిస్తారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడ్వొకేట్ జనరల్‌గా శ్రీరామ్‌ను నియమించాలని నిర్ణయించారు. శ్రీరామ్ 1969లో జన్మించారు. 1992 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆయన మొదట న్యాయవాది సి.వి.రాములు వద్ద పనిచేశారు. రాములు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తరువాత శ్రీరామ్ స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అనతి కాలంలోనే రాజ్యాంగపరమైన కేసులతో పాటు, సివిల్ కేసులు, సర్వీసు వివాదాల కేసులు, విద్యా రంగానికి సంబంధించిన కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2009 నుంచి 2011 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా శ్రీరామ్ వ్యవహరించారు. -
భారీగా అధికారుల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున బదిలీలు చేస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 50 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు సీఎం ముఖ్య సలహాదారుగా నియమించిన అజేయ కల్లంతో చర్చించి, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇస్తూ బదిలీలపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలలో భాగంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. సీఆర్డీఏ కమిషనర్, అదనపు కమిషనర్లను బదిలీ చేశారు. సీఆర్డీఏ కొత్త కమిషనర్‌గా లక్ష్మీనరసింహంను నియమించారు. జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఆదిత్యనాధ్ దాస్‌ను నియమించారు. శశిభూషణ్ కుమార్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్, జెన్కో మాజీ ఎండీతోపాటు పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీగా ఐఏఎస్ అధికారి జె.మురళిని నియమించారు. ఉభయ గోదావరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్టణం, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. -
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వైద్య శాఖను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాలు, 108 సర్వీసుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. వైద్య విధాన పరిషత్, వైద్య విభాగాల పని తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘమైన సమీక్షలో.. వైద్య రంగాన్ని మెరుగుపరచి ప్రతి పేదవారికి కూడా వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిని సహించేది లేదని, వైద్యశాఖను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి ఇందుకు సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అన్ని వ్యవస్థలను సమూలంగా మార్పు తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యవస్థీకృతంగా ఉన్న లోపాలను సరిదిద్దాలని సూచించారు. అలాగే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 వాహనాల నిర్వహణ గందరగోళంగా ఉన్న నేపథ్యంలో 108కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులతో చర్చించారు. ఎన్టీఆర్ వైద్యసేవ పేరును వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా అమలు చేయాలని సూచించారు. వైఎస్సార్ స్పూర్తికి అనుగుణంగా ఈ సర్వీసులు పనిచేయాలన్నారు. ప్రయివేట్ ఆస్పత్రులు కన్నా ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు ఆరోగ్య రంగ నిపుణల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు.. దీనిని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్ సీఎం కార్యాలయం తరఫున సమన్వయ పరుస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్సార్ అప్పట్లో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులు వంటి అనేక విధానాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తుచేశారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. పోస్టుల భర్తీ, ఆర్థిక అవసరాలు, మౌలిక అభివృద్ధిపై తక్షణమే నివేదిక రూపొందించాల్సిందిగా సూచించారు.. గతంలో రోగులను ఎలకలు కోరికేయడం, సెల్ ఫోన్ లైట్లతో శస్త్ర చికిత్స చేయడం వంటి ఘటనలపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మందులు, నాణ్యత లేని ఔషధాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 104 వాహనాలౖ నిర్వహణపై కూడా ముఖ్యమంత్రి చర్చ జరిపారు. రాష్ట్రంలో మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకురావాల్సిన మార్పులపై కూడా దృష్టి సారించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరి కాసేపట్లో జల వనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. -
కంభంపాటి రామ్మోహన్రావు రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు శనివారం తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో గత ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ మేరకు గత నెల 30న తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి పంపారు. 2014లో కంభంపాటిని అప్పటి టీడీపీ సర్కార్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయడం ఆనవాయితీ. అయితే పలువురు టీడీపీ నాయకులు మాత్రం ఇంకా పదవులు పట్టుకొని వేలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ప్రజలపై భారం మోపొద్దు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు అందరు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్క దిద్దడానికి సృజనాత్మక ఆలోచన విధానాలతో రావాలని ఆయన కోరారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ తన వాదన వినిపించాలని, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను వివరిస్తూ సమగ్రమైన నివేదిక తయారు చేసి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగు పరిచేలా చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అయితే సామాన్యునిపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. ఈ దిశగా హరిత పన్ను (గ్రీన్ టాక్స్), వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరయిన ఇసుక విధానం అమలు వంటి చర్యలు ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి దశలవారీగా మద్యపాన నిషేధం ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కేవలం ప్రత్యేక ఆదాయ వనరులుగా చూడకూడదని, ప్రతి పేదవారిలోనూ ఆనందం వెల్లివిరిసేందుకు బెల్ట్ షాపులను సమూలంగా తొలగించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. అవసరమైన పక్షంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి బెల్ట్ షాప్‌ల వ్యవస్థను నిర్ములించాలని సూచించారు. ఎక్కడయినా బెల్ట్ షాప్ కనిపిస్తే.. దానిపై చర్యలు తీసుకుంటూనే, దానికి మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ లైసెన్స్ రద్దు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ అక్రమాలు జరిగినా మరింత కఠినతరమైన నిబంధనలు అమలు చేయాలని, దశల వారి మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ పెట్టి, అప్పులు తీసుకుని, వాటిని దారి మళ్లించిన వైనాన్ని చూసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివ్వెరపోయారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వాడేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు, పీవీ రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి కె.ధనంజయ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజలపై భారం మోపకుండా రాష్ట్ర ఆదాయం పెంచాలని సూచన
-
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరు అవినీతి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన సాగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కలిసి టెండర్ల విధానం ప్రక్షాళనపై సమీక్ష నిర్వహించారు. టెండర్ల విధానంలో పారదర్శకత తీసుకురావాలని, అవినీతికి తావు లేకుండా సమూల మార్పులు చేయాలని పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ) ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ జరిగిప్పటికీ, అస్మదీయులకే కాంట్రాక్టులు దక్కేలా నిబంధనలు మార్చడం, అంచనా వ్యయాలు విపరీతంగా పెంచేసి, కమీషన్లు కొల్లగొట్టడం లాంటి బాగోతాలు ఇప్పటిదాకా యథేచ్ఛగా కొనసాగాయి. ఇకపై ఇలాంటి అక్రమాలకు చరమ గీతం పాడుతూ పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేని టెండర్ల విధానం తీసుకురావాలని సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఈ అంశంపైనే శుక్రవారం సీఎస్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. టెండర్ల విధానంలో సమూల మార్పులు ప్రస్తుతంఉన్న కమిషనర్ ఆఫ్ టెండర్స్‌కి(సీవోటీ) అధిపతిగా హైకోర్టును సంప్రదించి ఒక న్యాయమూర్తిని నియమించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సెంట్రల్ విజిలెన్స్ మార్గదర్శకాల ప్రకారం టెండర్లను ఆహ్వానించిన తరువాత కాంట్రాక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరుపరాదు. అయితే, అందుకు విరుద్ధంగా గతంలో అస్మదీయుల కోసం సంప్రదింపులు జరపడం, కావాల్సిన వారి కోసం అంచనాలను మార్చడం వంటివి జరిగాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేలా సంస్కరణలతో కూడిన టెండర్ల విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఒకసారి టెండర్లు ఆహ్వానించిన తరువాత ఎల్–1గా ఎవరు వస్తే వారికే కాంట్రాక్టును ఖరారు చేయడం, నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చకపోవడం వంటి సంస్కరణలు జగన్ మదిలో ఉన్నట్లు చెబుతున్నారు. సీవోటీలో అడ్మినిస్ట్రేటర్‌ను కూడా నియమించి, టెండర్ల ప్రక్రియ నిబంధనల మేరకు సాగిందా లేదా అనేది న్యాయమూర్తికి వివరించేలా చూడాలని ముఖ్యమంత్రి ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. ఆర్థిక, రెవెన్యూ రంగాలపై నేడు సీఎం సమీక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వాడేసుకున్న విషయం తెలిసిందే. పోలింగ్ పూర్తయిన తరువాత కూడా గత ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి బిల్లులు చెల్లింపులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎన్నికల ముందు గత ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన పనులు, పెండింగ్ బిల్లులు, నిధుల ఆర్జన, శాఖల పనితీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. పని వేళల్లోనే విధులు నిర్వహిస్తే చాలు పరిపాలన వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేందుకు కిందస్థాయి నుంచి పైస్థాయి దాకా సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచ బ్యాంకు సూచించిన ప్రొక్యూర్మెంట్ చట్టంలోని అంశాలను సైతం అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాంట్రాక్టర్లతో సంప్రదింపుల విధానానికి స్వస్తి పలికేలాగా టెండర్ల విధానం తీసుకురావాలని, న్యాయమూర్తి సమక్షంలో టెండర్లను ఖరారు చేసిన తరువాత ఎవరైనా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేయాలని నిర్ణయానికొచ్చారు. వీటికి త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఒక రూపం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఉద్యోగులు పని వేళల్లోనే కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అధికారులు, ఉద్యోగులు పని చేస్తే సరిపోతుందని, సెలవు రోజుల్లో విధులు నిర్వహించాల్సిన అవసరం లేదని సీఎం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. సాయంత్రం 6 గంటల తరువాత అధికార కార్యక్రమాలు ఉండవని కూడా అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. -
సీఎం జగన్ ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్ గురువారం జీవో జారీ చేశారు. కృష్ణమోహన్ రెడ్డి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా రిటైర్డ్ అయ్యారు. మరోవైపు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా అపాయింట్ చేస్తూ గవర్నర్ నరసింహన్ నోటీఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదనపు కార్యదర్శిగా కే. ధనుంజయరెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ధనుంజయ్ రెడ్డి గతంలో వ్యవసాయశాఖలో పనిచేశారు. శ్రీకాకుళం కలెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. -
అవినీతి నిర్మూలనకై వైఎస్ జగన్ తొలి అడుగు
-
అవినీతి నిర్మూలనలో తొలి అడుగు
అమరావతి: అవినీతి నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. కాంట్రాక్టుల్లో అవినీతి నివారణకు అన్ని శాఖలకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 1 నాటికి పనులు ప్రారంభం కాని కాంట్రాక్టులు రద్దు చేయాలని ఆదేశాలు పంపారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన బిల్లుల చెల్లింపునకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు. జీరో కరప్షన్ మోడ్‌తో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులున్న నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టుల్లో అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : అవినీతి నిర్మూలనకై వైఎస్ జగన్ తొలి అడుగు -
ప్రజలు సహకరించాలి
విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వైఎస్ జగన్ అభీష్టం మేరకు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు నిరాడంబరంగా చేసినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లను సీఎస్‌కు కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వివరించారు. సీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. కాబోయే సీఎం అభిప్రాయం మేరకు ఏర్పాట్లు నిరాడంబరంగా చేపట్టామని, ప్రజలు దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. సుమారు 30 వేల మంది వరకు స్టేడియంలో ప్రత్యక్షంగా ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసేందుకు వీలుందని చెప్పారు. పాస్‌లు లేని వారు కూడా స్టేడియంలోకి వచ్చి చూడవచ్చన్నారు. స్టేడియంలోకి రాలేని వారు నిరుత్సాహ పడవద్దని, స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. విజయవాడలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రెండు వేదికలు ఏర్పాటు ప్రమాణ స్వీకారోత్సవ ప్రధాన వేదికతో పాటు మరో ఉపవేదిక ఏర్పాటు చేసున్నట్లు సీఎస్ చెప్పారు. ప్రధాన వేదికపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎంతో ప్రమాణం చేయిస్తారని.. మరో వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో పాటు ఇతర ప్రధాన అతిథులు ఆసీనులవుతారని సీఎస్ తెలిపారు. -
నవరత్నాల అమలుపై వైఎస్ జగన్ కసరత్తు
-
సీఎస్ చెప్పినా పట్టించుకోని ఆర్థిక కార్యదర్శి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రారంభం కాని పనులన్నింటినీ రద్దు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆర్థికశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సర్కారు చివరి రోజుల్లో హడావుడిగా ఏ శాఖలో, ఏ విభాగంలో ఎంత విలువైన పనులను మంజూరు చేసింది? ప్రస్తుతం వాటి స్థితిగతులు ఏమిటి? అనే వివరాలను ఆర్థికశాఖ సేకరించింది. రాష్ట్రంలో అన్ని శాఖల్లో కలిపి చంద్రబాబు సర్కారు ఎన్నికల ముందు మంజూరు చేసిన పనుల విలువ ఏకంగా రూ.30 వేల కోట్లకుపైగా ఉన్నట్లు గణాంకాల్లో తేలింది. ఈ పనులన్నీ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో వీటిని రద్దు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 8,939 పనులు... సాగునీటిలో అత్యధికం గతంలో చంద్రబాబు సర్కారు కూడా 2014 ఎన్నికల ఫలితాల అనంతరం ఆర్నెల్ల ముందు మంజూరైన పనులన్నింటినీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్లకు బిల్లుల చెల్లింపులను కూడా నిలుపుదల చేసింది. అయితే ఇప్పుడు కేవలం ప్రారంభం కాని పనులను మాత్రమే రద్దు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లో చంద్రబాబు సర్కారు ఈ ఎన్నికలకు ముందు 8,939 పనులను ఆగమేఘాలపై మంజూరు చేసింది. ఈ పనుల విలువ అక్షరాలా రూ. 30,062.41 కోట్లు అని తేలింది. అత్యధికంగా సాగునీటి శాఖలో మంజూరైన పనుల విలువ రూ.10,278.72 కోట్లుగా ఉంది. ఆ తరువాత మున్సిపల్ శాఖలో అంటే సీఆర్డీఏతో కలిపి మొత్తం రూ.7,939.96 కోట్ల విలువైన పనులు మంజూరు చేశారు. వీటిని మంజూరు చేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను చెల్లించి కమీషన్లు కాజేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు హడావుడిగా మంజూరైన కొన్ని పనులకు టెండర్లను ఆహ్వానించలేదు. కొన్ని పనులకు ఒప్పందాలు చేసుకోలేదు. సీఎస్ ఆదేశించినా ఆర్థికశాఖ కార్యదర్శి తాత్సారం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రారంభించని పనులన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినా ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర తాత్సారం చేస్తుండటం పట్ల అధికార వర్గాలు విస్మయం చెందుతున్నాయి. ఈ పనుల రద్దుకు సంబంధించిన ఫైల్ తయారైనప్పటికీ ఆదేశాలు జారీ చేయడానికి రవిచంద్ర ఎందుకు వెనుకాడుతున్నారో అర్ధం కావడం లేదని, ఇక్కడ కూడా చంద్రబాబు ప్రయోజనాలను కాపాడాలనే ధోరణి కనిపిస్తోందని పేర్కొంటున్నాయి. నిశ్చయ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గవర్నర్ ప్రకటించినప్పటికీ రవిచంద్ర సీఎస్ ఆదేశాలను అమలు చేయకుండా జాప్యం చేయడంలో అర్ధం లేదని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గురువారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తరువాత చూడవచ్చులే అనే ధోరణిలో రవిచంద్ర వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నాయి. -
నవరత్నాల అమలుపై కసరత్తు చేస్తోన్న జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిశ్చయ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. నవరత్నాల అమలుపై ఆయన కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఆ పథకాల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్‌లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నవరత్నాల్లోని ప్రతీ పథకంపై ఈ సమీక్షలో చర్చించారు. బడ్జెట్ కేటాయింపులపై చర్చ నవరత్నాల్లో ఏ పథకానికి ఎంత నిధులు అవసరం, వచ్చే బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేయాల్సి ఉంటుందనే అంశాలపై చర్చించారు. అలాగే నవరత్నాల్లో ఏ పథకాన్ని ఏ శాఖ ద్వారా అమలు చేయించాలనే విషయంపైన కూడా ఈ సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా కేబినెట్ కూర్పు చేసి నవరత్నాల అమలుపై కీలక నిర్ణయాలను తీసుకోవాలనే ఆలోచనలో జగన్మోహన్రెడ్డి ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సాధ్యమైనంత త్వరగా నవరత్నాలను ప్రజలకు అందించాలనే తపన జగన్మోహన్రెడ్డిలో కనిపిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. లబ్దిదారుల గుర్తింపు... నవరత్నాల్లో ప్రతీ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా ఏర్పాట్లు చేసే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోడీని కలిసి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నవరత్నాల విషయంలో కూడా ఆయన అంతే స్పీడుతో ముందుకు సాగుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 18లోగా కొత్త అసెంబ్లీ వచ్చే నెల 18వ తేదీలోగా కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేసిన తరువాత అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వచ్చే నెల 18వ తేదీలోగా పూర్తి కావాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఏర్పడ్డాక బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. -
వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్..
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర సాయాన్ని వైఎస్ జగన్ కోరనున్నారు. కాగా రాష్ట్ర ఆర్థిక సమస్యలపై ఉన్నతాధికారులు ఇప్పటికే వైఎస్ జగన్‌కు నివేదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమస్యలే ప్రధాన అజెండాగా ప్రధానితో వైఎస్ జగన్ భేటీ అవుతున్నారు. కాగా వైఎస్ జగన్ ఈనెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఇలా.. ►రేపు ఉదయం 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టకు వెళ్తారు ►ఉదయం 7 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు ►ఉదయం 9.10 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు ►ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోదీతో భేటీ ►మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ భవన్ వెళ్తారు -
ఓటేయకుండా ఎస్సీలను అడ్డుకోవడం తీవ్రమైన అంశం
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలోని ఐదు కేంద్రాలలో రీ పోలింగ్‌కు సంబంధించి టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. ఈసీ అన్ని ఆధారాలను సరిచూసిన తరువాతే రీ పోలింగ్‌కు ఆదేశించిందని వివరించారు. చంద్రగిరిలో పోటీ చేస్తున్న అభ్యర్ధి ఏడు గ్రామాల్లో ఎస్సీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారని, ఎస్సీలను ఓట్లు వేయకుండా అడ్డుకోవడం తీవ్రమైన అంశమని సీఎస్ పేర్కొన్నారు. ఫిర్యాదులో తీవ్రత ఉన్నందునే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటం ఈసీతోపాటు అధికారుల బాధ్యతని చెప్పారు. తాను ఎన్నికల సంఘం నియమించిన సీఎస్‌నని, ఈ నేపథ్యంలో ఈసీ అప్పగించిన విధుల నిర్వహణ తన బాధ్యతని స్పష్టం చేశారు. ఫిర్యాదులపై సాక్ష్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకునేది కేంద్ర ఎన్నికల సంఘమేనని గుర్తు చేశారు. చూసీ చూడనట్లు వదిలేయలేం..: రీ పోలింగ్ విషయంలో తనను, అధికారులను తప్పుపట్టడం సరికాదని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. చూసీ చూడనట్లు వదిలేయలేమని, కిందిస్థాయి అధికారులు తప్పు చేస్తే వ్యవస్థ గుడ్డిగా పాలన సాగించదని సీఎస్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం సమన్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. టీడీపీ ఫిర్యాదులను పరిశీలించాలని సీఈవోకు సిఫారసు మరో ఏడు నియోజకవర్గాల్లో కూడా 18 చోట్ల రీ పోలింగ్ నిర్వహించేలా ఆదేశించాలంటూ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సిఫారసు చేశారు. దీనిపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది. -
నన్ను తప్పుపట్టడం సరికాదు: ఏపీ సీఎస్
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ అంశంలో తనపై వచ్చిన ఆరోపణలను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఖండించారు. రీ పోలింగ్ విషయంలో తనను తప్పుబట్టడం సరికాదని ఆయన అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 7 గ్రామాలకు చెందిన ఎస్సీలు ఓటు వేయలేదని ఫిర్యాదు అందిందని, ఫిర్యాదులో తీవ్రత ఉన్నందునే ఈసీకి పంపామన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూడటం అధికారులుగా తమ బాధ్యత అని అన్నారు. ఫిర్యాదుపై సాక్ష్యాలు చూసి నిర్ణయం తీసుకునేది ఎన్నికల సంఘమేనని సీఎస్ పేర్కొన్నారు. రీ పోలింగ్ విషయంలో తనను, అధికారులను తప్ప పట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చూసీ చూడనట్లుగా వదిలేయలేమని, అధికారులు న్యాయం చేయడానికే ఈ వ్యవస్థను రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం సమన్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులదేనని, పాలన గుడ్డిగా సాగే పరిస్థితి రానివ్వకూడదని సీఎస్ వ్యాఖ్యానించారు. చక్రబంధంలో రీపోలింగ్ చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మండలంలోని పులివర్తివారిపల్లి 104వ పోలింగ్‌కేంద్రంలో 19వ తేదీ రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అడిషనల్ ఎస్పీ సుప్రజ గురువారం పులివర్తివారిపల్లెను సందర్శించారు. ఇక్కడ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు సారధ్యంలో 13 మంది సీఐలు, 17 మంది ఎస్ఐలు, 50 మంది సివిల్ పోలీసులు, వంద మంది స్పెషల్ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. రీపోలింగ్ జరిగే రోజు వరకు ఇక్కడ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. రిగ్గింగ్‌కు యత్నిస్తే జిల్లా బహిష్కరణ చంద్రగిరి నియోజకవర్గం ఆర్సీ. పురం మండలంలో జరగనున్న రీపోలింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ తెలిపారు. ఆర్సీపురం మండలంలోని రీపోలింగ్ జరిగే వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, ఎన్ఆర్.కమ్మపల్లెల్లో గురువారం అర్బన్ ఎస్పీ పర్యటించారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. ఓటు హక్కు స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. రీపోలింగ్ రోజు హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిగ్గింగ్‌కు యత్నిస్తే, జిల్లా బహిష్కరణతో పాటు పీడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించా రు. సమస్యాత్మక గ్రామాలల్లో సాయుధ బలగాలను మోహరించామన్నారు. నిఘాతో పాటు షాడో పార్టీలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలానికి ఒక రక్షక్ మొబైల్, స్ట్రైకింగ్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ సమన్వయంతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలింగ్‌కేంద్రాల వద్ద క్యూల నిర్వహణ, ఈవీఎంల భద్రత కల్పించే బాధ్యత పోలీస్ అధికారులు, సిబ్బందిదే అన్నారు. బూత్‌లోపల, బయట ఎలాంటి సంఘటనలు జరిగినా బాధ్యులపై శాఖాపరమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
షరతులు వర్తిస్తాయి
-
మధ్యాహ్నం 2.30 గంటలకు క్యాబినెట్ భేటి
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) సోమవారం సాయంత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కరువు, ఫొని తుపాను సహాయక చర్యలు, మంచినీటి సరఫరా, ఉపాధిహామీ పనులపై సమీక్షించేందుకు మాత్రమే సమావేశం పరిమితం కావాలని స్పష్టం చేసింది. ఈ నాలుగు అంశాలపైనే సమీక్షించాలని, కొత్త నిర్ణయాలు ఏవీ తీసుకోరాదని, రేట్ల మార్పు, బకాయిల చెల్లింపులపై నిర్ణయాలు తీసుకోరాదని షరతు విధించింది. అంతేకాకుండా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కమిషన్ అనుమతి తీసుకున్న తరువాతే అమలు చేయాలని పేర్కొంది. కేబినెట్ నిర్ణయాలపై మీడియా సమావేశం నిర్వహించరాదని కూడా కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖలు పంపింది. కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఈసీ అనుమతించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. దీంతో కేబినెట్ భేటీ ఉంటుందా లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. తొలుత మంగళవారం ఉదయం 10.30 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం సోమవారం సాయంత్రానికిగానీ వెలువడకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. కేబినెట్ సమావేశానికి సీఎస్ ఎందుకు రారో చూస్తానంటూ అధికారులను బెదిరించే ధోరణిలో సీఎం మాట్లాడారు. తొలుత ఈనెల 10వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం ఈనెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నోట్ పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఎల్వీ సుబ్రహ్మణ్యం అదే రోజు స్పందిస్తూ ఏ అంశాలపై కేబినెట్ సమావేశం నిర్వహిస్తారో నోట్లో పేర్కొన లేదని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేబినెట్ సమావేశ నిర్వహణకు ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నోట్‌ను సీఎస్ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్‌కు పంపించారు. చివరకు ఈసీ నిబంధనలకు తలొగ్గి.. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలతో నోట్ పంపిస్తే స్క్రీనింగ్ కమిటీ అధ్యయనం తరువాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీ అనుమతి కోసం పంపిస్తామని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కమిషన్‌కు 48 గంటల ముందు అజెండాను పంపాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు. దీంతో ఈనెల 7వ తేదీన మనసు మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ భేటీని 14వ తేదీన జరపాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని సీఎం కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోట్ ద్వారా తెలిపింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి (రాజకీయ) ఎన్.శ్రీకాంత్ అదే రోజు సమావేశమై చర్చించారు. కోడ్ అమల్లో ఉన్నందున కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనని, కేబినెట్లో చర్చించే అంశాల అజెండాను కూడా పంపించాల్సి ఉంటుందని సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌కు సీఎస్ స్పష్టం చేశారు. దీంతో కరువు, ఫొని తుపాను సహాయ చర్యలు, మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పనులపై సమీక్షించనున్నట్లు సీఎం కార్యాలయం సీఎస్‌కు నోట్ పంపించింది. అందుకు అనుగుణంగా వివరాలు సిద్ధం చేయాలని ఆయా శాఖలను సీఎస్ ఈనెల 7వ తేదీనే ఆదేశించారు. అజెండాను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ నాలుగు అంశాలపై కేబినెట్ నోట్లను ఈ నెల 9వతేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు సాధారణ పరిపాలన శాఖకు పంపించాలని సీఎస్ ఆదేశించారు. కేబినెట్ నోట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఉన్నాయా లేదా? అనే విషయాన్ని అదే రోజు సీఎస్ నేతృత్వంలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. అనంతరం ఈ నాలుగు అంశాలపై కేబినెట్‌కు వివరించేందుకు అనుమతించాల్సిందిగా ఈసీని కోరాలని కమిటీ నిర్ణయించింది. స్క్రీనింగ్ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి ఈనెల 10వ తేదీన సీఎస్ పంపారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీ దీన్ని యధాతథంగా అదే రోజు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. ఈసీ నిర్ణయం ప్రకటించేందుకు 48 గంటల సమయం అవసరమని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఆదివారం సాయంత్రానికి వెలువడుతుందని భావించారు. అయితే ఆదివారం ఆరో దశ పోలింగ్ ఉండటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని సోమవారం సాయంత్రం తెలియజేసింది. సీఎంతో సీఎస్ రెండోసారి భేటీ కేబినెట్ సమావేశ నిర్వహణకు అనుమతించాలంటూ తాను పంపిన నివేదికపై తొలుత ఈసీ నిర్ణయం వెలువడకపోవటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ఇప్పటివరకు మంత్రివర్గ సమావేశ నిర్వహణకు ఈసీ నుంచి అనుమతి రాలేదని, సాయంత్రం లోపు రావచ్చేమోనని సీఎంకు ఆయన వివరించినట్లు తెలిసింది. ఒకవేళ ఈసీ అనుమతి రాకపోతే మంత్రివర్గ సమావేశం జరపటానికి వీలు కాదు కాబట్టి ఆయా శాఖల అధికారులతో మంగళవారం ఉదయం సమీక్షిద్దామని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అయితే అనుమతి రాని పక్షంలో సమీక్షను మధ్యాహ్నం తరువాత నిర్వహిద్దామని సీఎస్ సూచించగా అందుకు సీఎం అంగీకరించినట్లు తెలిసింది. వివాదాలకు తావివ్వకుండా.... మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వెళ్లి కలవడంతో వీరిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై సోమవారం మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ‘సీఎం చంద్రబాబు నోరు జారి లేనిపోని అభాండాలు, వ్యక్తిగత విమర్శలు చేసినా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించారు. ముఖ్యమంత్రి టీమ్ లీడర్. ఆయన ఎప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడతా. సీఎంను గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది. అని చెప్పడం ద్వారా ఎల్వీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ అయి నెల రోజులు దాటినా సీఎంను కలవలేదని చాలామంది అంటుంటారు. కొన్ని మీడియాల్లో కూడా అలాగే వార్తలు వచ్చాయి. అయితే అది వాస్తవం కాదు. సీఎస్‌గా నియమితులైన వెంటనే గత నెల 8వ తేదీన ఆయన మర్యాదపూర్వకంగా వెళ్లి ముఖ్యమంత్రిని కలసి వచ్చారు. ఇప్పుడు కేబినెట్ భేటీ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నేపథ్యంలో మరోసారి వెళ్లి సీఎంను కలసి అన్ని విషయాలు మాట్లాడి వచ్చారు..’ అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. -
ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం
-
సీఎస్‌కు విజయసాయి రెడ్డి లేఖ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు లేఖ రాశారు. లేఖలో సారాంశం... ‘విజయవాడకు చెందిన హోటల్ యజమాని ఐలాపురం రాజాను ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న ఇ.శ్రీరాంమూర్తి, ఐలాపురం రాజాలు టీడీపీ పార్టీ యాక్టివిస్టులు. ఇలాంటి వారిని ఆర్టీఐ కమిషనర్లుగా ఎలా నియమిస్తారు. ఆర్టీఐ యాక్ట్ 2005, సెక్షన్ 15 ప్రకారం నియామకాలు చేపట్టాలి. ఆర్టీఐ యాక్ట్ 2005 సబ్ సెక్షన్ 5 ప్రకారం స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టేవారికి తగిన అర్హతలు ఉండాలని తెలియజేస్తోంది. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చూస్తే..లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం, మాస్ మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తులనే ఆ పదవులకు ఎంపిక చేయాలి. దానికి భిన్నంగా టీడీపీ యాక్టివిస్టులను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించారు. అంతేకాకుండా ఈ పదవులకు ఎంపిక అయ్యే వ్యక్తులు ఎంపీలు కానీ, రాష్ట్ర శాసనసభల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆదాయం వచ్చే పదవుల్లో, వ్యాపారాల్లోనూ ఉండకూడదు. ఎలాంటి పార్టీలతోనూ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకూడదని ఆర్టీఐ యాక్ట్ తెలియజేస్తోంది. అయితే, ఓ హోటల్ యజమాని, మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న వ్యక్తులను ఎలా ఎంపిక చేశారు. ఏ ప్రాతిపధికన సీఎం, సీనియర్ కేబినెట్ మినిస్టర్ వీళ్ల పేర్లు సిఫార్సు చేయటం జరిగింది?. వీరిలో ఐలాపురం రాజా పేరును గవర్నర్ ఆమోదించారు. శ్రీరాంమూర్తి పేరును గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరాంమూర్తికి సామాజిక సేవతో సంబంధాలు ఉన్నాయా?. ఎన్నికల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బిజీగా ఉన్న సమయంలో కమిటీని ఏర్పాటు చేసి సిఫార్సు చేశారు. ఈ ఆర్టీఐ కమిషనర్ నియామకాలు అన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడినవి. 4 ఏళ్ల పాటు సాగదీసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ నియామకాలు చేయటంలో ఆంతర్యం ఏమిటి?. 2017లో ఆరుగురును ఆర్టీఐ కమిషనర్లుగా నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండటంతో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికైనా ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలి’ అని విజయసాయి రెడ్డి కోరారు. -
కేబినెట్ అజెండాపై నేడు స్క్రీనింగ్ కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన నిర్వహించ తలపెట్టిన మంత్రి మండలి సమావేశం అజెండాపై పరిశీలనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదించిన మంత్రివర్గ సమావేశం అజెండాలోని అంశాలపై సవివరమైన నోట్స్ పంపాలని ఆయా శాఖలకు సీఎస్ బుధవారం యువో నోట్ జారీ చేశారు. సవివరమైన నోట్ పంపాలని శాఖలకు ఆదేశం ఫొని తుపాను సహాయక చర్యలపై సవివరమైన కేబినెట్ అజెండా నోట్‌ను రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు పంపాలని రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్), ఆర్టీజీఎస్లను సీఎస్ ఆదేశించారు. తాగునీటిపై సవివరమైన కేబినెట్ అజెండా నోట్ సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, కరువు, ఉపాధి హామీకి సంబంధించి కేబినెట్ అజెండా నోట్ పంపాలని ఆయా శాఖలకు సూచించారు. ‘కోడ్’ ఏం చెబుతోందంటే... ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఈసీ ఆదేశాలకు అనుగుణంగా కేబినెట్ అజెండా అంశాలను అధ్యయనం చేసేందుకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు సంబంధిత శాఖల ముఖ్యకార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. కేబినెట్ అజెండా అంశాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉన్నాయా లేదా? అనే విషయాన్ని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే బిజినెస్ రూల్స్, నిబంధనల మేరకు కేబినెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఆ అంశాలకు ఉందా లేదా అనేది కూడా స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తి రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి సంబంధిత ఉన్నతాధికారులు, సీఎస్‌తో సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చని ఎన్నికల ప్రవర్తన నియమావళి స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ అజెండాను సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపనున్నారు. ఈనెల 14న కేబినెట్ సమావేశం ఉంటుందా లేదా? అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయంపైన ఆధారపడి ఉంటుందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. స్క్రీనింగ్ కమిటీ పంపే అజెండా నోట్‌పై సందేహాలుంటే ఈసీకి వివరణ పంపాల్సి ఉంటుందని తెలిపారు. -
ఈసీ దారికి రావాల్సిందే..!
-
కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, అమరావతి: ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నందున ఈనెల పదో తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యంకాదని తేలిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ భేటీని నాలుగు రోజులపాటు వాయిదా వేసుకుని 14వ తేదీన జరపాలని నిర్ణయించారు. ఆ రోజు ఉ.10.30 గంటలకు కేబినెట్ సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారని, ఇందుకు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శి సాయిప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్మణ్యంకు మంగళవారం లేఖ పంపారు. ఈ అంశం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉందా? లేదా? అని సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నిస్తే.. అనుమానమేనని, ఈ అంశం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ‘నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాల్సినంత అత్యవసర పరిస్థితులేమీ లేవు. అయితే, సీఎం మాత్రం ఎలాగైనా సమావేశం జరపాలని పట్టుదలతో ఉన్నారు. ఈనెల 10వ తేదీన కేబినెట్ నిర్వహణకు ఏర్పాట్లుచేయాలంటూ సీఎంఓ పంపిన నోట్లో అజెండా లేకుండా ఉన్నందున అది పనికిరాదనే ఉద్దేశంతో తాజాగా అజెండాతో 14వ తేదీకి వాయిదా వేసుకున్నట్లు లేఖ పంపింది. కరువు, ఫొని తుపాను అంశాలను చర్చించాలంటూ అజెండాలో చేర్చడం ఇందులో భాగమే. వాస్తవానికైతే ప్రస్తుతం వీటిపై కేబినెట్ చర్చించి చేసేదేమీ ఉండదు. సీఎం రాజకీయం కోసం పట్టుబడుతున్నారు. ఏమవుతుందో చూడాలి. ఇదంతా ఎందుకు.. అనుమతిస్తే పోతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తే తప్ప వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన అయితే కేబినెట్ నిర్వహించాల్సిన పరిస్థితి లేనేలేదు’ అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ‘సాక్షి’తో అన్నారు. ఆయా శాఖలు ఏ నివేదికలు ఇస్తాయో? కాగా, సీఎస్ నుంచి నోట్ తమకు చేరగానే ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖకు సంబంధించిన అజెండాలోని అంశాలపై కేబినెట్లో ప్రస్తుతం చర్చించాల్సినంత అవసరం ఉందా? లేదా అనే దానిపై నిర్ణయానికి రావాలి. దీనిని సంబంధిత శాఖ మంత్రికి పంపించి వారి ఆమోదంతో సీఎస్‌కు పంపించాలి. అలాగే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా ఏమి చేయాలన్నా ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కోడ్‌కు సంబంధంలేని అంశమని ఈ కమిటీ భావిస్తే అమలుకు అనుమతిస్తుంది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అంశాలైతే ఈ కమిటీనే ఏయే కారణాలవల్ల వీటి అమలుకు అనుమతించాలో వివరిస్తూ సీఈసీకి నివేదిస్తుంది. అలాంటి అత్యవసరంలేదని కమిటీ భావిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపే పరిస్థితే ఉత్పన్నం కాదు. అయితే, సాధారణంగా ఈ కమిటీ సీఎంఓ పంపిన నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోవచ్చని ఒక ఉన్నతాధికారి తెలిపారు. సీఈసీ ఆమోదమే ఫైనల్ కాగా, మోడల్ కోడ్ నుంచి మినహాయింపునిచ్చి కేబినెట్ నిర్వహణకు అనుమతించాల్సినంత అత్యవసర పరిస్థితి ఉందని కమిటీ పేర్కొన్న అంశాలు సీఈసీకి నమ్మకం కలిగించాలి. కానీ, లేదని కమిషన్ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వ వినతిని తిరస్కరిస్తుంది. ఒకవేళ సీఎస్ నుంచి వచ్చిన విజ్ఞాపన సహేతుకమై, అత్యవసరమైనదేనని భావిస్తే మాత్రం అనుమతిస్తుంది. ఇలా అనుమతిస్తే మాత్రం కేబినెట్ నిర్వహించడానికి మార్గం సుగమమవుతుంది. లేదంటే వీలు కాదు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏమీలేవు. అందువల్ల కేబినెట్ నిర్వహణకు సీఈసీ అనుమతిచ్చే అవకాశాలు చాలా తక్కువే’ అని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి వివరించారు. కేబినెట్‌కు ఈసీ అనుమతి ఉండాల్సిందే : సీఎస్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టంచేశారు. కేబినెట్ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలనుకుంటున్న అజెండాను ముఖ్యమంత్రి కార్యాలయం పంపితే దాన్ని ఎన్నికల సంఘం అనుమతికి పంపుతామన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన పలువురు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ఈ అజెండాను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల సంఘం 48 గంటల సమయం కోరుతోందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకుని ముందుకెళ్తామని సీఎస్ చెప్పారు. అంతకుముందు కేబినెట్ సమావేశ నిర్వహణపై ఎల్వీ.. ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ శ్రీకాంత్‌తో చర్చలు జరిపారు. -
కేబినెట్ సమావేశం 14కు వాయిదా
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 10న నిర్వహిస్తామన్న మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ మీటింగ్‌ను 14 (మంగళవారం)న నిర్వహిస్తామని సీఎంవో వెల్లడించింది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలను సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు పంపించామని తెలిపింది. ఫొని తుపాన్, కరువు, నరేగా (జాతీయ ఉపాధి హామీ పథకం) కూలీలకు నిధుల విడుదలపై తలెత్తిన అడ్డంకులపై చర్చ మొదలగు అంశాలను అజెండాలో చేర్చామని పేర్కొంది. కాగా, సీఎంవో ఇచ్చిన అజెండా ప్రకారం ఆయా శాఖల కార్యదర్శులకు సీఎస్ సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ అజెండాను పరిశీలించి ఈసీకి పంపనుంది. ఇక ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహిస్తామని సీఎస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అజెండాను పంపించిన తర్వాత.. దానిని పరిశీలించేదుకు ఈసీ కనీసం 48 గంటల సమయం కోరుతోందని, ఈ విషయంలో సీఎం అభిప్రాయం తీసుకొని ముందుకు వెళతామని ఆయన చెప్పారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా సీఎం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని పట్టుబట్టడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘించేందుకే.. చంద్రబాబు మంత్రిమండలి సమావేశానికి నిర్ణయించారని విమర్శిస్తున్నారు. -
కేబినెట్ భేటీకి బాబు నిర్ణయం.. ఛాన్సే లేదు!
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 10.35 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్మహ్యణ్యంకు నోట్ వచ్చింది. దీనిని ఆయన సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లికి పంపించారు. ఈ అంశం సచివాలయంలోని అఖిల భారత సర్వీసు (ఐఏఎస్) సీనియర్ అధికారుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడం సహేతుకమేనా? అసలు ఈ సమావేశం జరుగుతుందా? జరగదా? అనే అంశాలు ప్రస్తుతం ఐఏఎస్‌ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 10న కేబినెట్ సమావేశం జరుగుతుందా? జరగదా? అని సీనియర్ ఐఏఎస్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా జరిగే అవకాశం లేనేలేదని కుండబద్దలు కొట్టారు. సీఎం తీసుకున్న నిర్ణయం సమంజసమైనది కాకపోవడం, నిబంధనలను పాటించకపోవడమే ఇందుకు కారణాలని వారు విశ్లేషిస్తున్నారు. మంత్రివర్గ సమావేశం పెట్టాలంటే.. సాధారణ పరిస్థితుల్లో కేబినెట్ సమావేశాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం పెట్టుకోవచ్చు. సీఎం ఆదేశం ప్రకారం ఫలానా తేదీన కేబినెట్ సమావేశానికి చర్యలు తీసుకోవాలని సీఎంఓ నోట్ పంపితే.. సీఎస్ దానిని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి పంపుతారు. జీఏడీ అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు పంపించి అజెండా కోరాలి. ఆ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు అజెండా రూపొందించి సంబంధిత మంత్రులకు పంపాలి. ఆర్థికపరమైన అంశాలు ఉంటే ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. ఇలా వచ్చిన ప్రతిపాదనలను సీఎం ఆమోదం నిమిత్తం పంపుతారు. ఇది సాధారణ పరిస్థితుల్లో జరిగే ప్రక్రియ. అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ సమావేశం పెట్టాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ముందస్తు అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం కోడ్ ఉన్న సమయంలో అత్యవసరమై కేబినెట్ సమావేశం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? దీని ఉద్దేశాలేమిటి? ఏయే అజెండా అంశాలు పెట్టదలిచారో వివరంగా పేర్కొనాలి. అందులో ఏయే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు? అనే వివరాలను కూడా వివరిస్తూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి లేదా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. సీఎంఓ నుంచి వచ్చిన నోట్ ప్రకారం జీఏడీ నివేదిక రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాలి. సీఎస్ దానిని రాష్ట్ర సీఈఓ లేదా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాలి. దీనిని కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వినతి సహేతుకమని, అత్యవసరంగా కేబినెట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని కమిషన్ భావిస్తే అనుమతిస్తుంది.. లేదంటే తిరస్కరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం (సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి) నుంచి వచ్చే లేఖను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి సీఈసీ కనీసం 48 గంటలు అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ లేఖ చేరిన తర్వాత కమిషన్ సభ్యులంతా కూర్చుని అందులోని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర సర్కారు నుంచి వచ్చిన వినతికి అదనపు సమాచారం అవసరమైతే ఆ వివరాలు పంపాలని కూడా కమిషన్ కోరవచ్చు. అత్యవసరంగా కేబినెట్ పెట్టాల్సిన అవసరంలేదని భావిస్తే రాష్ట్ర సర్కారు విజ్ఞప్తిని తిరస్కరించవచ్చు. సీఎంఓ నోట్లో ఏముంది? ‘ఈ నెల 10న కేబినెట్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు చేయండి.. అని మాత్రమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎంఓ పంపిన నోట్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం పెట్టాల్సిన అత్యవసరం ఏమిటి? ఏఏ అంశాలు చర్చించాలి? కేబినెట్లో ఏఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు? అనే వివరాలు రేఖామాత్రంగా కూడా అందులో లేవు. అందువల్ల కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపడానికి వీలుగా జీఏడీ నివేదిక రూపొందించాలంటే ఈ నోట్ ప్రకారం వీలుకాదు. ఇందులోని అంశాల ప్రకారమే జీఏడీ లేఖ పంపితే సీఎస్ ఆమోదించి కమిషన్‌కు పంపినా కమిషన్ ఆమోదించే ప్రశ్నే ఉండదని ఎన్నికల నిబంధనలపై సాధికారత ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడంలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. ఎందుకు సమావేశం పెట్టాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావడంలేదు. సీఎం మాటలను బట్టి చూస్తే అధికారులను బెదిరించడానికే పెట్టాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కేబినెట్ సమావేశం పెడతా? ఎవరు అడ్డుకుంటారో? చూస్తా. సమావేశానికి రాని అధికారులపై బిజినెస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటా’ అంటూ సీఎం బెదిరింపు ధోరణిలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనాలని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ‘సాక్షి’తో అన్నారు. రాజ్యాంగబద్ధమైన సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ఎన్నికల కమిషన్‌ను చులకన చేసేలా, అధికారులను బెదిరించేలా మాట్లాడటం ఏమాత్రం వాంఛనీయం కాదని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ సమావేశం పెట్టదు. ఇలా పెట్టిన సంప్రదాయం మన రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. పైపెచ్చు ఇలాంటి అత్యవసరం కూడా ఉత్పన్నం కాలేదు. అయినా సీఎం పట్టుబట్టి సమావేశం నిర్వహించాలనుకోవడం వెనుక ఏదో రహస్య అజెండా ఉన్నట్లుంది’.. అని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులేవి? ‘తుపానులు, కరువు కాటకాలు వంటి విపత్తులు సంభవిస్తే తప్ప ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించరాదు. ఒకవేళ సీఎం ఆహ్వానించినా అధికారులు సమావేశాలకు హాజరుకారాదు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో నిబంధనలు విస్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం పెడతామంటే ఎన్నికల కమిషన్ ఎలా ఆమోదిస్తుంది’ అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా అసాధారణ పరిస్థితులు లేవు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఫొని తుపాను సంభవించినా.. అక్కడ రెండో రోజునే సీఎస్ నేతృత్వంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అని ఆయన గుర్తుచేశారు. -
బాబు బెదిరింపులపై ఐఏఎస్ అధికారుల ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులపై ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. నిన్న రాత్రి విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో పలు శాఖలకు చెందిన అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చంద్రబాబు బెదిరింపుల వ్యవహారంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఈఓ గోపాల ద్వివేదీని బెదిరించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినేట్‌కి రాకపోతే అధికారుల సంగతి చూస్తానన్న బాబు బెదిరింపులపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై నిరసనగా అధికారులు కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. కొద్ది రోజుల్లో మళ్లీ సమావేశమవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కేబినేట్ మీటింగ్ పెడితే కార్యాచరణ మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. -
బాబు బెదిరింపులపై ఐఏఎస్ అధికారుల ఆగ్రహం
-
ప్రజలను అప్రమత్తం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వడగాలుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్మహ్మణ్యం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని తాగునీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఆదివారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫునే కాకుండా ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా వాటిని ప్రోత్సహించాలని సీఎస్ అన్నారు. ఆస్పత్రులు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. ఇంకా నెలపాటు ఎండల తీవ్రత ఉండే ప్రమాదం ఉన్నందున ఎక్కడ ఎవరికి సేవలు అవసరమైనా అందించేందుకు మందులు, అంబులెన్సులతోపాటు వైద్య బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అంతేకాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అవసరమైన మేరకు అన్ని ఆస్పత్రుల్లో ఉంచాలని ఆదేశించారు. పశువుల దాహార్తిని తీర్చడానికి నీళ్లు నింపిన తొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. వడగాలుల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన సూచనలపై మీడియా ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించాలన్నారు. వడదెబ్బ మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చలివేంద్రాలు, బస్టాపుల్లో నీడ కోసం షెల్టర్ల ఏర్పాటు, వైద్య సేవలు అందించడం లాంటి పనులను పారిశ్రామిక సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో నిర్వహించాలని కోరారు. ఈ దిశగా ఆయా సంస్థలు ముందడుగేసేలా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. -
ఎండల తీవ్రతపై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎండల తీవ్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచి జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతస్థాయిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, తాగునీటితో పాటు, మజ్జిగ కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలను చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. ఆస్పత్రులు, దేవాలయాలు, చర్చ్‌లు, మసీదులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో తాగునీటి వసతి కల్పించాలని, ప్రజలకు అందుబాటులో ఉండేలా మందులు, అంబులెన్సులతో వైద్యబృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. పశువుల కోసం నీళ్లు నింపిన తొట్టెలు ఏర్పాటు చేయాలని, వేసవి కాలంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ప్రజలకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సీఎస్ సూచనలు చేశారు. కాగా రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారిన విషయం తెలిసిందే. పలుచోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం పాత కోరంగిలో వడదెబ్బ తగిలి వృద్ధ దంపతులు మృతి చెందారు. నిన్న వ్యవసాయ పనులకు వెళ్లిన గుబ్బల కామరాజు, సుభద్రమ్మ వడదెబ్బకు గురయ్యారు. ముందుగా భార్య, అనంతరం భర్త మృతి చెందాడు. -
అలర్ట్‌తో తప్పిన ముప్పు..!
-
‘ఫొని’ నష్టం రూ.58.61 కోట్లు
సాక్షి, అమరావతి : ఫొని తుపాను కారణంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో రూ.58.61 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఇది ప్రాథమిక అంచనా అని ఆయన చెప్పారు. తుపాను సహాయక చర్యలపై శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ సిన్హా రాష్ట్రంతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన నష్టం, తీసుకున్న చర్యలను సీఎస్ ఆయనకు వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో అత్యధికంగా 19.7 సెంమీల వర్షపాతం నమోదైందన్నారు. ఇదే జిల్లాలోని నాలుగు మండలాల్లో 2 లక్షల 74వేల మంది తుపానుకు ప్రభావితమయ్యారన్నారు. 304 ఇళ్లు దెబ్బతినగా, వాటిలో 168 ఇళ్లు పాక్షికంగాను, 19 పక్కా ఇళ్లు.. 35 కచ్చా ఇళ్లు పూర్తిగాను దెబ్బతిన్నాయని సిన్హాకు సీఎస్ వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 15,460 మందిని 139 పునరావాస కేంద్రాలకు, విజయనగరం జిల్లాలో 2వేల మందిని 15 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. బాధితుల కోసం 348 వైద్య శిబిరాలను నిర్వహించామని తెలిపారు. 958 హెక్టార్లలో పంటలకు నష్టం కాగా, తుపాను కారణంగా ఈ రెండు జిల్లాల్లో 958 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఎల్వీ చెప్పారు. 214 హెక్టార్లలో వరి, 743 హెక్టార్లలో వేరుశనగ, పత్తి, జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలకు నష్టం కలిగిందన్నారు. సుమారు 10 వేల కొబ్బరి చెట్లు నేలకూలగా 1,991 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 229 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయని ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వివరించారు. అలాగే, రోడ్లు, భవనాల శాఖకు రూ.21.57 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రహదారులకు రూ.20.05 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.9.75 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.4.09 కోట్లు, మున్సిపల్ పరిపాలనా శాఖకు రూ.1.82 కోట్లు, గ్రామీణ రక్షిత మంచినీటి విభాగానికి రూ.42.68 లక్షలు, గృహ నిర్మాణానికి రూ.85.35 లక్షలు, పశు సంవర్థక శాఖకు రూ.3.94 లక్షలు కేటాయించామన్నారు. కాగా చేనేత జౌళిశాఖ సహా పలు రంగాలకు సంబంధించి ప్రాథమిక నష్టం అంచనాలను కూడా రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు 2,100 తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 14 మండలాల్లో 733 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ చెప్పారు. 33 కేవీ ఫీడర్లు 19, 11 కేవీ ఫీడర్లు 101, 11/33 కేవీ ఫీడర్లు 45 దెబ్బతినగా సుమారు 2,100 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు. అన్ని మండల కేంద్రాలకు ఇప్పటికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. మరో 74 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. దెబ్బతిన్న స్తంభాలన్నింటితోపాటు.. లక్షా 73 వేల వ్యవసాయేతర విద్యుత్ సర్వీసులను పునరుద్ధరించామన్నారు. గ్రామీణ మంచినీటి సరఫరా, మున్సిపల్ పరిపాలన, ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. సమావేశంలో సిన్హా మాట్లాడుతూ.. నష్టం అంచనాలను త్వరితగతిన అంచనా వేసి పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఒడిశాకు రాష్ట్రం చేయూత రాష్ట్రం నుంచి రెండు లక్షల టార్పాలిన్ ప్లాస్టిక్ షీట్లు, 12 లక్షల మంచినీటి ప్యాకెట్లు, యాంత్రిక రంపాలను హెలికాప్టర్ ద్వారా ఒడిశాకు పంపిస్తున్నట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి తెలిపారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా ఎల్వీ మాట్లాడారు. అవసరాన్ని బట్టి వీటిని యుద్ధప్రాతిపదికన పంపించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి వరప్రసాద్‌ను సీఎస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీ, ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్, ఆర్టీజీఎస్ సీఈఓ బాబు పాల్గొన్నారు. -
సీఎస్ మార్గనిర్దేశంతో తగ్గిన ఆస్తి నష్టం
సాక్షి, అమరావతి: ఎలాంటి హడావిడి లేకుండా అధికార యంత్రాంగాన్ని తమ పని తాము చేసుకోనిస్తే అద్భుత ఫలితాలుంటాయనడానికి ‘ఫొని’ తుపాను సందర్భంగా జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ‘రేయింబవళ్లు సమీక్షలు లేవు.. అది చేయండి.. ఇది చేయండి.. ఇలా కాదు.. అలా కాదు.. అనే సీఎం చంద్రబాబు హడావిడి అసలే లేదు.. మంత్రులు, సీఎం పర్యటనలు లేవు.. తుపాను సన్నద్ధత, బాధితులకు సహాయ కార్యక్రమాలను గాలికొదిలి సీఎం బాబు కోసం నిరీక్షణ అంతకన్నా లేదు.. వెరసి ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎవరి బాధ్యతలు వారు పక్కాగా నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో, పునరావాస ప్రాంతాల్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? సన్నద్ధత ఎలా ఉండాలి? అనే అంశాలపై వివిధ కీలక హోదాల్లో పని చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్యణ్యంకు ఉన్న అనుభవం ఇప్పుడు ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తరాంధ్ర అధికార యంత్రాంగానికి బాగా ఉపయోగపడింది. ‘తుపాను ప్రభావం చూపడానికి రెండు మూడు రోజుల ముందే సీనియర్ అధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముందే తెలిసినందున జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇలా అన్ని అంశాలపై అధికారులకు తన అనుభవంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం మార్గనిర్దేశం చేశారు. సంబంధిత అధికారులంతా అంకిత భావంతో పనిచేశారు. దీంతో ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా సహాయ కార్యక్రమాలన్నీ సజావుగా సాగాయి. హడావిడి మాటే లేదు. ఎక్కడెక్కడ ఏయే పనులు చేయాలో అవన్నీ యథా ప్రకారం జరిగిపోయాయి. తుపాను తీరం దాటిన రెండో రోజుకే ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. మార్గనిర్దేశం బాగుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి’ అని క్షేత్ర స్థాయి అధికారులతోపాటు ఐఏఎస్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విపత్తు నియమావళి చెప్పిందదే.. ‘విపత్తులు సంభవించినప్పుడు క్షేత్ర స్థాయి అధికారులను ఎవరి పని వారు చేసుకోనివ్వాలి. వీఐపీలు, ప్రజా ప్రతినిధులు వెళ్లి హడావిడి చేస్తే బాధితులకు సేవలు పక్కన పెట్టి అధికారులు, వీరి వెంట పరుగులు తీయాల్సి వస్తుంది. ఇది సహాయ కార్యక్రమాలకు ప్రతికూలంగా మారుతుంది. అందువల్ల విపత్తులు సంభవించినప్పుడు ప్రజా ప్రతినిధులు, వీఐపీలు సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతాల పర్యటనలు పెట్టుకోరాదు’ అని విపత్తు నిర్వహణ నియమావళి స్పష్టంగా చెబుతోంది. సీఎం చంద్రబాబు ప్రచార యావతో దీనికి విరుద్ధంగా వ్యవహరించడం రివాజుగా మారింది. 2014 అక్టోబర్‌లో హుద్ హుద్ తుపాను సందర్భంగా చంద్రబాబు విశాఖలో మకాం వేసి సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. గత ఏడాది అక్టోబర్‌లో ‘తిత్లీ’ తుపాను సందర్భంగానూ ఇలాగే హడావిడి చేశారు. అధికారులంతా ఆయన వెంట తిరిగేందుకు ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. దీంతో వారాల తరబడి నిత్యావసర సరుకులు, తాగునీరు సైతం అందక బాధితులు ధర్నాలకు దిగడం తెలిసిందే. ఐఎండీపై ఐక్యరాజ్యసమితి ప్రశంసల జల్లు ‘ఫొని’ తుపాను ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనే విషయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అత్యంత కచ్చితమైన ముందస్తు అంచనాతో భారత ప్రభుత్వం చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగిందని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. చక్కటి అంచనాలతో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టం బాగా తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటనలో కొనియాడింది. తుపాను.. తీరం ఎక్కడ దాటుతుంది? ఈ సమయంలో ఎంత వేగంతో గాలులు వీస్తాయి? దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందనే అంశాలన్నింటినీ చాలా ముందుగా అత్యంత కచ్చితంగా ఐఎండీ అంచనాలు వేసిందని, అందువల్లే ప్రభుత్వం 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయగలిగిందని ప్రశంసించింది. ఈ మేరకు ఐఎండీకి లేఖ పంపినట్లు తమకు సమాచారం అందిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేష్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల్లో హర్షం ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని తుపాన్ వల్ల రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పెనుగాలులకు స్తంభాలు వంగిపోవడం, వైర్లు తెగిపోవడం లాంటి కారణాలవల్ల 740 గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయినా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి శనివారం ఒక్కరోజే అత్యధిక గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించారు. గాలుల వేగం ఎలా ఉంటుంది? వర్షం ఏ మోతాదులో కురుస్తుందనే అంశాలపై ఐఎండీ ఇచ్చిన అంచనాల మేరకు సీఎస్ మార్గనిర్దేశం వల్ల పెద్దగా నష్టం చేకూరలేదు. రెండు మూడు రోజుల్లోనే సాధారణ పరిస్థితి ఏర్పడనుంది. పంట నష్టపోయిన వారికి పెట్టుబడి సాయం తర్వాత అందిస్తారు’ అని విపత్తు నిర్వహణపై అపారమైన అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
ఫొని ఎఫెక్ట్ : కేంద్రానికి నివేదిక పంపిన ఎల్వీ
సాక్షి, అమరావతి : ఫొని తుపాన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపారు. దీనిలో తుపాన్ ప్రభావం వల్ల 2 వేల విద్యుత్ స్థంభాలు, 117 సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి 733 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని నివేదికలో పేర్కొన్నారు. 553 హెక్టార్లలో పంటలు.. 520 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఫొని తుపాన్ వలన ఎలాంటి ప్రాణ నష్టం సంభంవిచలేదని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. -
టీటీడీ బంగారంపై చీకట్లో నివేదిక!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి బంగారంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఇచ్చిన విచారణ నివేదిక ఏమైందనే ప్రశ్న అధికార వర్గాలు, కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో చర్చనీ యాంశంగా మారింది. టీటీడీ బంగారం తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అసలు అది టీటీడీకి చెందిన బంగారమేనా? లేక మరొకరిదా? అనే సందేహాలు కలుగుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి బంగారం తరలింపు గురించి తనకు తెలియదని తొలుత టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించడం వీటికి బలం చేకూర్చుతోంది. బంగారం తరలింపుపై ప్రత్యేక సీఎస్ మన్మోహన్సింగ్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ గత నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపడం తెలిసిందే. వారం గడుస్తున్నా చర్యలేవి? బంగారం తరలింపుపై ఉన్నతాధికారులిచ్చిన నివేదిక చంద్రబాబుకు వద్దకు చేరి వారం గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బుధవారం సీఎం నిర్వహించిన మీడియా సమావేశంలోసీఎస్ విచారణకు ఆదేశించడాన్ని తప్పుబట్టడం గమనార్హం. సీఎస్ ఓవర్ యాక్షన్ చేశారంటూ నిందించారు. ఏదో జరిగిపోయిందంటూ విచారణకు అదేశించడం ఏమిటంటూ సీఎం ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలను గమనిస్తే ఇందులో కచ్చితంగా ఏదో గోల్మాల్ జరిగి ఉంటుందనే అనుమానం బలపడుతోందని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీఎస్‌పై చంద్రబాబు చిందులు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలకు వెల్లడించకుండా అసలు సీఎస్ విచారణకు ఆదేశించడమే తప్పు అన్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రవర్తించడంపై పలు సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయని మరో సీనియర్ అధికారి పేర్కొన్నారు. చైన్నై బ్యాంకు నుంచి టీటీడీకి చెందిన బంగారాన్ని తిరుమలకు తరలిస్తుంటే ఆ విషయం తనకు తెలియదని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించారని, సీఎస్ విచారణకు ఆదేశించిన మరుసటి రోజే హడావుడిగా ఈవో విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించారనేది అనుమానాలకు తావు ఇస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈవో చెబుతున్న విషయాలనే ముఖ్యమంత్రి కూడా మీడియాతో ప్రస్తావిస్తున్నారంటే ఇందులో ఏదో మతలబున్నట్లు బోధపడుతోందని పేర్కొంటున్నారు. బంగారం తరలింపును సీఎం చాలా తేలిగ్గా కొట్టిపారేయడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈవో తప్పిదాలను ప్రస్తావించిన నివేదిక టీటీడీ బంగారం వివాదానికి సంబంధించి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వాదన సరికాదని, బ్యాంకుతోపాటు ఈవో నిబంధనలు పాటించలేదని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ స్పష్టం చేశారు. ఈమేరకు సీఎస్‌కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. బంగారం తరలింపులో లోపాలను అందులో ప్రస్తావించారు. బంగారం టీటీడీకి చేరే వరకు తనకు సంబంధం లేదని ఈవో పేర్కొనడం సరికాదన్నారు. గడువు తీరిన బంగారాన్ని బ్యాంకు నుంచి టీటీడీ ట్రెజరీకి తరలించే సమయంలో ఈవో లేఖ ఇవ్వకపోవడం ఉద్దేశపూర్వకంగానేనా? అనే విషయంలో సందేహాలున్నాయని నివేదికలో పేర్కొన్నారు. బ్యాంకులో బంగారం భద్రపరచిన తేదీతోపాటు గడువు తీరాక ఎంత జమ చేయాలో కూడా లేఖలో ప్రస్తావిస్తూ తరలించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఈవో అవేమీ పాటించలేదని నివేదికలో స్పష్టం చేశారు. స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన బంగారు ఆభరణాలను పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారని, అయితే తాజా ఉదంతంతో గడువు తీరాక అదంతా తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న తరుణంలో పోలీసుల తనిఖీల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ఆభరణాల బంగారాన్ని కరిగించే ముందు విలువైన స్టోన్స్ ఎక్కడ భద్రపరుస్తున్నారో కూడా విచారించాలనే అభిప్రాయాన్ని నివేదికలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరింత పారదర్శకంగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. -
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఫొని తుపాను రేపు (3న) ఒడిశాలోని గోపాల్పూర్, చాంద్బలీల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో తీవ్ర ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఫొని తుఫానుపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి తదితర కోస్తా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు తీర ప్రాంతం వెంట గంటకు 90 నుంచి 120 కి.మీల వేగంతో బలమైన గాలులు వీయడంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను పంపుతున్నామని, అలాగే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి వనరులకు, విద్యుత్‌కు అంతరాయం కలిగితే సకాలంలో నీరందించేందుకు వీలుగా ట్యాంకర్లను, జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాల్లో కావాల్సిన సౌకర్యాలను కల్పించాలన్నారు. కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందించేందుకు కృషి చేయాలన్నారు. నిత్యావసర సరుకులను, మందులను, మంచినీటి ప్యాకెట్లను, కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఫోన్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ విద్యుత్‌కు అంతరాయం కలిగితే తక్షణం పునరుద్ధరించడానికి వీలుగా ప్రతి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో 500 విద్యుత్ స్తంభాలు, రెండు జేసీబీలు, ఇతర మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్లవన్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి డి.వరప్రసాద్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఆర్టీజీఎస్ సీఈవో బాబు సహాయక చర్యలను వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుంచి మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. 3వ తేదీ సాయంత్రం 5గం.ల 35 నిమిషాల సమయంలో ఒడిశాలోని గోపాల్పూర్, చాంద్‌బలీ ప్రాంతాల మధ్య తుపాన్ తీరాన్ని దాటొచ్చన్నారు. దీని ప్రభావం ఒడిశా తీరంపై అధికంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. ఈ ప్రాంతాల్లో కచ్చా గృహాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన పునరావాసం కల్పించాలని సీఎస్‌ను ఆదేశించారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామన్నారు. తుపాన్ ఎఫెక్ట్... పవర్ సెక్టార్ అలర్ట్ ‘ఫొని’ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అప్రమత్తమయింది. తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రలో, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ చూపనుంది. దీంతో గతంలో హుద్‌హుద్, తిత్లీ తుపాన్లు సృష్టించిన పెనుబీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస, టెక్కలి, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి, వజ్రపుకొత్తూరు, కంచిలి, సంతబొమ్మాళి, పోలాకి, గార, నందిగామ మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ వల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోడానికి ఐదు వేల మంది కార్మికులను శ్రీకాకుళం జిల్లాకు తరలించారు. అలాగే తుపానుకు విద్యుత్ స్తంభాలు కూలిపోయిన పక్షంలో వాటి స్థానంలో అమర్చడానికి 12 వేల స్తంభాలను ఆ జిల్లాకు పంపారు. వాటిని పాతడానికి అవసరమైన 30 పోల్ డ్రిల్లింగ్ మిషన్లు, 70 పవర్ రంపాలు, క్రేన్లను సిద్ధం చేశారు. తగినన్ని ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు (విద్యుత్ తీగలు), ఇన్సులేటర్లను అందుబాటులో ఉంచారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల సిబ్బందిని శ్రీకాకుళం జిల్లాకు పంపారు. నాలుగు మండలాలకు ఒక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)ను, మూడు సబ్ స్టేషన్లకు ఒక జనరల్ మేనేజర్, ఒక్కో సబ్‌స్టేషన్‌కు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఫీడర్‌కు ఒక ఏఈఈ చొప్పున ఇన్చార్జులను నియమించినట్టు ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ బొడ్డు శేషుకుమార్ చెప్పారు. ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపనయ్య బుధవారం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. తుఫాన్ తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు ఆయన అక్కడే ఉండి అవసరమైన సహాయ, పునరావాస పనులను సమీక్షిస్తారు. సమాచారం కోసం శ్రీకాకుళం (94906 12633), విశాఖపట్నం (0891–2853854)కంట్రోల్ రూంలలో సంప్రదించాలని ఆపరేషన్స్ డైరెక్టర్ శేషుకుమార్ కోరారు. -
ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యం
సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్ ఫలితాలు మే 3వ వారంలో వెల్లడి కానున్నాయి. ఇంటర్మీడియెట్ మార్కులు లేకపోవడంతో ఎంసెట్ ఫలితాల వెల్లడిపై సందిగ్ధత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఎంసెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఇంటర్ మార్కులు ఇవ్వాలని ఏపీ ఇంటర్ బోర్డుకు సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్ కోసం మార్కులు ఇవ్వాలని సీఎస్ స్పష్టం చేశారు. ఇక మార్కులు రహస్యంగా ఉంచుతారా? బహిరంగంగా వెల్లడిస్తారాన అనే దానిపై సాయంత్రంలోగా స్పష్టత రానుంది. కాగా గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో గ్రేడింగ్‌తో ఎంసెట్ వెయిటేజీ ఎలా ఇవ్వాలనే దానిపై అధికారులు తంటాలు పడుతున్నారు. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంతోనూ ఏపీ ఎంసెట్‌కు తంటాలు వస్తున్నాయి. సుమారు 20వేలమంది తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ స్పష్టత లేకపోవడంతో రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎంసెట్ పలితాలు ఎలా ఇవ్వాలో అధికారులకు అంతు చిక్కడం లేదు. దీంతో సీఎస్ సమీక్షతో నిర్వహణ అనంతరం తెలంగాణ ఇంటర్ ఫలితాలు తేలి మార్కులు అందాకే ఎంసెట్ ర్యాంకులు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
పర్యావరణ కలుషితం హత్య లాంటిదే..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితం పేరుతో నదీ పరివాహక ప్రాంతాల్లో బోర్లు వేసినట్టు ఇసుక తవ్వకాలు జరిగితే ఎలా అని ప్రశ్నించింది. పర్యావరణాన్ని కలుషితం చేయడం హత్య లాంటిదేనని అభిప్రాయపడింది. పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, భారీ జరిమానాలు విధించాలని, అది చూసి తప్పు చేయాలనుకొనే వారు భయపడాలని సూచించింది. నూతన రాజధాని రూపుదిద్దుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ, వాయు, జల కాలుష్య నివారణకు గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై ఎన్జీటీ శుక్రవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఢిల్లీ పిలిపించుకొని చర్చించింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ కె.రామకృష్ణన్, జస్టిస్ డా. ఎన్.నందలతో కూడిన బెంచ్ ముందు సీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలుష్య నివారణకు పలు సూచనలు చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల విషయమై ఈ నెల 4న జరిమానా విధించామని గుర్తు చేసింది. నష్ట పరిహారం వసూలు జరగడం లేదు.. పర్యావరణాన్ని కలుషితం చేయడం కూడా నేరమేనని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ‘ఒక హత్య వల్ల ఒక మనిషి చనిపోతాడు. పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల అనేక మంది చనిపోతున్నారు. ఇది కూడా మర్డర్ లాంటిదే’ అని పేర్కొంది. కానీ పర్యావరణానికి జరుతున్న నష్టానికి సమానంగా నష్టపరిహారం వసూలు జరగడం లేదంది. అసలు పర్యావరణానికి జరిగిన నష్టాన్ని తిరిగి పూడ్చలేమని వ్యాఖ్యానించింది. నదులను ఇష్టానుసారం తవ్వేయడం వల్ల ప్రవాహ దిశలు మారిపోవడం, వరదలు రావడం, నీటి ఎద్దడి, భూగర్భ జలాలు అడుగంటడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. తద్వారా ప్రజలు తమ హక్కులను కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సరైన ప్రణాళికతో వెళ్లడం లేదని, వారి వద్ద ఉన్న నిధులను సరిగ్గా ఖర్చు పెట్టకపోవడం వల్ల వందల కోట్లు మిగిలిపోతున్నాయని తెలిపింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఈ రోజుల్లో సరిగ్గా అంచనా కూడా వేయలేకపోతున్నామని, కొన్ని విషయాల్లో ఎలాంటి పర్యావరణ నష్టం జరగలేదని రాష్ట్ర స్థాయి కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇస్తే.. తద్భిన్నంగా తాము పంపే కమిటీలు నివేదికలు ఇస్తున్నాయని వివరించింది. సీఎస్ వచ్చినా హాజరుకాని ఏజీ, ప్రభుత్వ న్యాయవాది.. ఎన్జీటీలో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరైనా అడ్వకేట్ జనరల్ (ఏజీ) మాత్రం హాజరు కాలేదు. కనీసం ఢిల్లీలో నియమించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కూడా ట్రిబ్యునల్‌తో సమావేశానికి వెళ్లకపోవడం గమనార్హం. మీరే దగ్గరుండి పర్యవేక్షించండి.. పర్యావరణ పరిరక్షణ అన్నది తమ ప్రధాన ఎజెండా అని, అది దేశంలోనైనా, ఆంధ్రప్రదేశ్‌లోనైనా ఒక్కటే అని బెంచ్ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనే చర్చించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావించి పిలిపించినట్టు తెలిపింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా ఉందని, విశాఖలో వ్యర్థాలన్ని సముద్రంలో కలుస్తున్నాయని, కొల్లేరు 14 రకాల హానికారక క్రిములతో నిండి ఉందని, తూర్పుగోదావరి, శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉందని వివరించింది. దీనిపై దృష్టి సారించాలని, పర్యావరణ పరిరక్షణను దగ్గరుండి పర్యవేక్షించాలని సీఎస్‌కు సూచించిన ట్రిబ్యునల్.. దీని కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలంది. సీఎస్ స్పందిస్తూ తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానని, నిబంధనల మేరకు అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక క్లçస్టర్లు ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి మరో ఆరు నెలల తరువాత సమావేశమవుదామని తెలిపింది. -
అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరించండి
ఢిల్లీ: ఏపీలో చోటుచేసుకుంటున్న ఇసుక అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యహరించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ధర్మాసనం సూచించింది. కాలుష్య నియంత్రణ చర్యలతో పాటు పలు అంశాలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఎన్జీటీ శుక్రవారం సమావేశం అయింది. ఈ సందర్భంగా ఎన్జీటీ, ఏపీ సీఎస్‌కు సమావేశంలో పలు సూచనలు చేసింది. అక్రమ తవ్వకాలకు పాల్పడినవారిపై భారీ జరిమానాలు విధించాలని, వాటిని చూసి మరెవరు అక్రమ తవ్వకాలు పాల్పడకుండా ఉండాలని చెప్పింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని, కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని నేరుగా సీఎస్ పర్యవేక్షించాలని ఎన్జీటీ ఆదేశించింది. ఆరు నెలల్లో మరోసారి సమావేశమవుదామని, ఆ తర్వాత స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని సూచించింది. కాలుష్య నియంత్రణ చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి స్టేటస్ రిపోర్టు కూడా ఎన్జీటీ తీసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇసుక తవ్వకాలు, మైనింగ్, జల, గాలి కాలుష్యం నియంత్రణకు తీసుకోవాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. -
టీడీపీకి ఉలికిపాటు ఎందుకు?: ఉదయ్ కిరణ్
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షలు నిర్వహిస్తే టీడీపీకి ఉలికిపాటు ఎందుకని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు డేరంగుల ఉదయ్ కిరణ్ సూటిగా ప్రశ్నించారు. నాంపల్లిలోని హోటల్‌రాజ్ ఇంటర్నేషనల్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష చేసే అధికారం సీఎస్‌కు ఉందన్నారు. ఎన్నికల కౌంటింగ్‌పై సీఎస్ మాట్లాడితే తప్పేమిటని అన్నారు. ఎన్నికల గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే మాట్లాడాలా.? సీఎస్‌కు మాట్లాడే అధికారం లేదా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించే టీడీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులపై ఒత్తిడి చేసి అక్రమ మార్గంలో పనులను చక్కబెట్టుకుంటున్నట్లు విమర్శించారు. మాజీలయిప్పటికీ అధికారం చలాయించాలనే భ్రమలో టీడీపీ నాయకులు ఉండటం సిగ్గుచేటన్నారు. సీఎస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన టీడీపీ నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎస్ సమీక్షలపై అధికార పక్షం విమర్శలు సంధిస్తున్న సమయంలో ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు?.ఎవరిని కలవబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఎన్టీటి (జాతీయ హరిత ట్రిబ్యునల్) విచారణ కోసమే సీఎస్ ఢిల్లీ వెళ్లినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ పర్యటనపై అటు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై రేపు (శుక్రవారం మధ్యాహ్నం) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో జరిగే విచారణకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరు కానున్నారు. దేశ వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమవడంపై ఎన్జీటీలో విచారణ జరుగుతోంది. ప్రధానంగా పురపాలక సంఘాలు, అటవీ శాఖలు విఫలమవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం, అటవీ చట్టాల ఉల్లంఘనపై ఎన్జీటీ రాష్ట్రాల వారీగా సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్జీటీలో జరిగే విచారణకు సీఎస్‌తో పాటు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఢిల్లీ వెళ్లారు. మరోవైపు కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి 100కోట్ల రుపాయలు నెల రోజుల్లోగా డిపాజిట్ చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏప్రిల్ 4న ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. దీనిపై గడువు దాటితే 12.5శాతం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ బృందం వాదనలు వినిపించనుంది. మరోవైపు హస్తిన పర్యటనలో ప్రధాన కార్యదర్శి ఎవరెవరిని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎన్జీటీ విచారణకు పరిమితమవుతారా, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇతర ఢిల్లీ పెద్దలను కలుస్తారనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. ఇప్పటికే సీఎస్ టార్గెట్‌గా టీడీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరిస్తారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. -
ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 23వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయం నుంచి కౌంటింగ్ ఏర్పాట్లు, తాగునీరు తదితర అంశాలపై ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది, డీజీపీ ఠాకూర్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వక పోవడం వల్ల అక్కడక్కడ ఈవీఎంలు సరిగా పని చేయలేదని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కౌంటింగ్ నిర్వహణలో అలాంటి ఫిర్యాదులకు ఎంతమాత్రం ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్లకు సూచించారు. ఓట్ల లెక్కింపునకు నెల రోజులు సమయం ఉన్నందున ఏర్పాట్లపై కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, కౌంటింగ్ టేబుళ్లు, సీటింగ్ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో మెరుగైన శిక్షణ ఇచ్చే విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై, కౌంటింగ్ రోజున, ఆ తర్వాత అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు కల్పించాలని ఎస్పీలను ఆదేశించారు. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించవద్దని, పార్టీలకతీతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తమకున్న విస్తృత అధికారాలను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. మంచి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో తాగు నీరు, పశుగ్రాసం వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కలెక్టర్లు వెంటనే స్పందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. నిధుల సమస్యలుంటే ఆర్థిక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని చెప్పారు. నీటి ఎద్దడి నుంచి ఉద్యాన పంటలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్యపై రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే తాను ఉన్నతాధికారులతో సమీక్షించానని, జిల్లా స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు రోజువారీ పరిస్థితిని సమీక్షించి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా : ద్వివేది జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కొనియాడారు. ఎన్నికల్లో 65 శాతం పైగా దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రాంతాల్లో సైతం పోలింగ్ శాతం పెరగడం ఇందుకు నిదర్శనమన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను రోజూ ఎవరెవరు సందర్శిస్తున్నారనేది ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు. వినియోగించని, రిజర్వుడు ఈవీఎంలను కూడా సక్రమంగా భద్ర పరిచామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారుల ఫోన్ నంబర్లను అక్కడ ప్రదర్శించామని చెప్పారు. మే మొదటి వారంలో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇస్తామని చెప్పారు. సిబ్బందికి మూడు దశల్లో శిక్షణ ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లకు ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేయాలని, లోపలికి మొబైల్ ఫోన్ల అనుమతి లేనుందున వాటిని బయట భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్. అనురాధ, శాంతి భద్రతల అదనపు డీజి రవిశంకర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, అదనపు సీఈవో సుజాతా శర్మ, సంయుక్త సీఈవో డి.మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అల్లర్లు తలెత్తకుండా చర్యలు : ఠాకూర్ తక్కువ పోలీస్ ఫోర్సు ఉన్నప్పటికీ 2014 ఎన్నికలతో పోలిస్తే స్వల్ప ఘటనలు మినహా ప్రస్తుత ఎన్నికలను సజావుగా నిర్వహించారని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ అభినందించారు. పోలింగ్ అనంతరం ఘటనలకు బాధ్యులైన వారిని చాలా వరకు అరెస్టు చేశామని చెప్పారు. కౌంటింగ్ అనంతరం కూడా అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. రీపోలింగ్ జరగనున్న కేంద్రాల్లో పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
సీఎఫ్ఎంఎస్ పనితీరు ఇలాగేనా?
సాక్షి, అమరావతి: సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) పనితీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతోపాటు ఉద్యోగులకు వేతనాలు ఇంకా అందలేదని ఫిర్యాదులు రావడంతో వారం రోజుల వ్యవధిలోనే సీఎస్ రెండోసారి మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించడం, తరుచూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడంపై సీఎస్ ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరం తొలి మాసంలోనే ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం తదితర అంశాలపై సమీక్షించారు. తరుచూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బిల్లుల చెల్లింపులో వివక్ష వద్దు తొలుత ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని, అలాగే రీపేమెంట్లు సకాలంలో చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 22వ తేదీ నాటికి రూ.17,413 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్ పేర్కొన్నారు. అత్యవసర బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలోనే బిల్లులు చెల్లించాలని, ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపరాదని తేల్చిచెప్పారు. సీఎఫ్ఎంఎస్ సమస్య వల్ల బిల్లులు అందడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పనితీరు ఇలాగేనా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలని, సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. -
మే 23న కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ దిశానిర్దేశం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 13 జిల్లాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ,సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ ఈ సందర్భంగా మే 23న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగినంత శిక్షణ లేకపోవడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో సరిపుచ్చడంతో పోలింగ్ సందర్భంగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, కౌంటింగ్ సమయంలో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం... జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉందని కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన టేబుల్స్, సీటింగ్ వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఈ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని సీఎస్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజున లేదా కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన బలగాలు.. ఈ సమావేశంలో పాల్గొన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ... 2014తో పోలిస్తే తక్కువగా పోలీస్ ఫోర్సు ఉన్నా కలెక్టర్లు,ఎస్పీలు టీం వర్క్‌తో చిన్నపాటి సంఘటనలు మినహా ఎన్నికలను సజావుగా నిర్వహించారని వివరించారు. పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలపై వాటికి బాధ్యులైన వారిని చాలా వరకూ అరెస్టు చేశామన్నారు. కౌంటింగ్ తర్వాత కూడా హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. రీపోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన పోలీస్ బలగాలను తరలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లుతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని వివరించారు. కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో సీసీ టీవీలతో నిఘా సార్వత్రిక ఎన్నికల్లో 65శాతం పైగా దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైతం పోలింగ్ శాతం పెరగడం సిబ్బంది కృషికి నిదర్శనమని సీఈఓ ద్వివేది అన్నారు. రాష్ట్రంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడు అంచెల పటిష్టమైన బందోబస్తు ఉందని, సీసీ టీవీల నిఘాతో కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో నిరంతరం కొనసాగుతోందని, స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఆర్వోలు రోజూ తనిఖీ చేసి నివేదికలు సమర్పిస్తున్నారని చెప్పారు. స్ట్రాంగ్ రూముల భద్రతపై ఎవరికి అనుమానాలు అవసరం లేదని, ఎవరెవరు సందర్శిస్తున్నారనేది రికార్డ్ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి మూడు దశల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేనందున వాటిని తీసుకుని భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
గనుల తవ్వకాల్లో నిబంధనలు పాటించండి: సీఎస్
అమరావతి: ఏపీ సచివాలయంలో గనులశాఖ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వార్షిక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ.. గనుల తవ్వకాల్లో నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి, తిరుమల కొండల్లో తరచూ కొండచరియలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులకు తెలిపారు. ఏపీలో గనుల అన్వేషణలో చేస్తున్న కృషిని ఎల్వీ సుబ్రహ్మణ్యానికి జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం.శ్రీధర్ వివరించారు. చిత్తూరు జిల్లా చింగూరు గుంటలో రూ.2470 కోట్ల విలువరైన బంగారు నిక్షేపాలను గుర్తించామని శ్రీధర్ తెలిపారు. జీఎస్ఐ అధికారులు రూపొందించిన గ్రింప్సెస్ ఆఫ్ జీఎస్ఐ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాన్ని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. -
టీటీడీ బంగారం తరలింపుపై విచారణ పూర్తి
అమరావతి: టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ విచారణ పూర్తి చేశారు. తిరుపతిలో టీటీడీ ఈవో, విజిలెన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులను మన్మోహన్ విచారించారు. అనంతరం ఏపీ సచివాలయంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మన్మోహన్ భేటీ అయ్యారు. తిరుమల శ్రీవారి నగల తరలింపు ఆరోపణలపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నివేదికను మన్మోహన్ సింగ్ అందజేశారు. బంగారం తరలింపు ఆరోపణలపై తన విచారణలో వెల్లడైన అంశాలను మన్మోహన్ సింగ్, సీఎస్‌కు వివరించారు. టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై పలు అనుమానాలు కలగడంతో ఈ నెల 21న ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించి ఈ నెల 23వ తేదీలోగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు పంపిన విషయం తెల్సిందే. -
ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు
సాక్షి, అమరావతి : మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డీజీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఆయన వైదొలగాల్సి వచ్చింది. ఎన్నికలు ముగియడంతో ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు జీవో నెంబర్ 882ను విడుదల చేశారు. గత నెల 26న కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయాలని ఆదేశించడంతో తొలుత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 716 జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా జీవో లు విడుదల చేయటం వివాదాస్పదమైంది .అంతటితో ఆగక ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరిండచడంతో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ తర్వాత, డీజీపి ఠాకూర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. శాంతిభద్రతలతో పాటు, అవినీతి నిరోధకశాఖ డీజీగా ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తించేవారు. అదనపు బాధ్యతల నుంచి ఠాగూర్‌ను ఈసీ తప్పించింది. ఏసీబీ బాధ్యతలను శంఖ బ్రత బాగ్చికి అప్పగించారు. ఇంటెలిజెన్స్ బాధ్యతలను కుమార్ విశ్వజిత్‌కు అప్పగించారు. గత నెల 29నుంచి విధులకు దూరంగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఏసీబీ డీజీగా నియమిస్తూ ఇప్పుడు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల విధులతో సంబంధం లేని పోస్టింగ్ అప్పగించాలని నిబంధన ఉండటంతో అవినీతి నిరోధక శాఖ బాధ్యతలు అప్పగించారు. కాగా ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ‘ఓటుకు కోట్లు’ వివాదంలో చంద్రబాబు అడ్డంగా బుక్కైపోవడంతో అప్పటి ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనురాధను తప్పించి.. ఆ స్థానంలో ఏబీవీని కూర్చోబెట్టారు. అప్పట్నుంచీ ఏబీవీ హవా జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నిఘా విధులు వదిలి పూర్తిగా చంద్రబాబు, టీడీపీ సేవలో ఏబీవీ తలమునకలయ్యారనేది బహిరంగ రహస్యం. ఒక దశలో ఆయన వీఆర్ఎస్ తీసుకుని తన స్వస్థలమైన నూజివీడు లేదా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారనే బలమైన ప్రచారం జరిగిందంటే అధికారపార్టీతో ఏబీవీకున్న అనుబంధం ఏపాటితో అర్థమవుతుంది. -
టీటీడీ బంగారం తరలింపుపై సీఎస్ విచారణకు ఆదేశం
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1381 కేజీల బంగారం వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించారు.ఈ నెల 23వ తేదీలోగా దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తిరుమలకు వెళ్లి విచారణ జరపాలని సీఎస్ ఆదేశించారు. టీటీడీ బంగారం తరలింపులో భద్రతా లోపాలపై వస్తున్న వదంతులపై విచారణ చేయాలని, టీటీడీ, విజిలెన్స్ అధికారులు సమర్ధవంతంగా వ్యవహరించారా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలని సూచించారు. చదవండి....పట్టుబడిన బంగారం టీటీడీదేనా? కాగా శ్రీవారికి చెందిన 1,381 కిలోల నగలను చెన్నై ప్రయివేట్ బ్యాంకు నుంచి తిరుపతికి తీసుకొస్తుండగా ఈ నెల 17న తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. ఆ నగలకు సంబంధించిన పత్రాలను బ్యాంకు అధికారులు గానీ, టీటీడీ అధికారులుగానీ తరలింపు వాహనంలో ఉంచుకోకపోవడంతో పోలీసులు అనుమానించి సీజ్ చేశారు. ఈ విషయమై మీడియాల్లో కథనాలు రావడంతో స్పందించిన బ్యాంకు, టీటీడీ అధికారులు నగలకు చెందిన పత్రాలను తమిళనాడు పోలీసులకు చూపించిన నాలుగు రోజుల అనంతరం శనివారం తిరుపతికి తీసుకు వచ్చారు. అయితే నిన్న బాగా చీకటిపడ్డాక ఆ నగలను టీటీడీ పరిపాలనా భవనానికి తీసుకురావడం, కనీస భద్రత లేకుండా తరలించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. -
సీఎస్‌పై మంత్రి యనమల విమర్శలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సీఎస్ నియామకాన్ని, నిర్ణయాలను ఓ ప్రకటనలో ఆయన తప్పుబట్టారు. ఆర్థిక శాఖలో వ్యవహారాలపై సీఎస్ సూచనలను యనమల విభేదించారు. నిధుల సమీకరణ, విడుదలలో మంత్రివర్గ నిర్ణయమే ఫైనల్ అని అభిప్రాయపడ్డారు. ప్రధాన కార్యదర్శి సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారని విమర్శించారు. సీఎస్ మంత్రివర్గానికి సబార్డినెట్ అని అలాంటిది ఆయన మంత్రివర్గ నిర్ణయాలను ఎలా ప్రశ్నిస్తారనే వాదనను లేవనెత్తారు. కాగా ఇటీవలే ఆర్థికశాఖలోని అడ్డగోలు వ్యవహారాలపై సీఎస్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ప్రాధాన్యత క్రమం లేకుండా చెల్లింపులు చేయడంపై ఆయన...అధికారులను వివరణ కోరారు. సీఎస్ సమీక్షతో నేపథ్యంలో ఉలిక్కిపడ్డ మంత్రి యనమల ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
బిల్లుల చెల్లింపుల్లో ఏమిటీ వివక్ష?
సాక్షి, అమరావతి:వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన బిల్లుల చెల్లింపుల్లో వివక్ష చూపడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆర్థిక శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతంతో వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేటాయింపులు లేని అంశాలకు బిల్లులు చెల్లిస్తూ కేటాయింపులున్న రంగాలకు నిలిపివేయడంపై ప్రశ్నించారు. చివరి మూడు నెలలు ఇష్టారాజ్యం.. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఓట్ల పథకాలు / కమీషన్లు వచ్చే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లకు మాత్రమే ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించడాన్ని ‘సాక్షి’ గతంలోనే వెలుగులోకి తేవడం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన విధంగా కాంట్రాక్టులు, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడ్డ బిల్లులు మాత్రమే చెల్లిస్తూ మిగతావాటిని ఆర్థిక శాఖ నిలిపివేస్తోంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సకాలంలో బిల్లులు సమర్పించలేదంటూ రెగ్యులర్ ఉద్యోగుల వేతనాలను సైతం నిలుపుదల చేసింది. ఉద్యోగ సంఘాలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వేతనాలు నిలిపివేయడంపై వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీఎస్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక ఏడాది ముగిసే చివరి మూడు నెలలు అంటే జనవరి నుంచి మార్చి వరకు ఇష్టానుసారంగా బిల్లుల చెల్లింపులు జరిగాయని, ప్రాధాన్య అంశాలను విస్మరించారని సీఎస్ తప్పుబట్టారు. రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడంతో భారీ నష్టం ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా ఇతర రంగాలకు నిధులు మళ్లించడంపై ఆర్థిక శాఖ అధికారులను సీఎస్ నిలదీశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో భారీగా నిధులు కోల్పోవాల్సి వచ్చిందని, ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారంటూ సీఎస్ ఆర్థిక శాఖ అధికారులను నిలదీశారు. తాత్కాలిక ప్రాతిపదికన బిల్లులు చెల్లించడంతోపాటు పక్షపాతంతో చెల్లింపులు జరపడంపై ఆర్థికశాఖను సీఎస్ వివరణ కోరారు. తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులను కూడా నిలుపుదల చేయడం అంటే పరిస్థితిని ఎంత దిగజార్చారో అర్థం అవుతోందా? అని సీఎస్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజకీయాలతో సంబంధం లేకుండా నిబంధనల మేరకు ప్రాధాన్యత ప్రకారం బిల్లులు చెల్లించే ఆనవాయితీకి ఎందుకు తిలోదకాలు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ అధికారులను సీఎస్ ప్రశ్నించారు. ఉద్యోగుల వేతనాలకు ఎసరు ఓట్ల పథకాలు, కమీషన్లు వచ్చే బిల్లులు చెల్లించడం కోసం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంది. ఫలితంగా రెండు నెలలుగా అందులో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లో ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన బిల్లులు పాసైనప్పటికీ చెల్లింపులు జరగకుండా నిలిచిపోయినవి రూ.11,108.61 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో వేతనాలతోపాటు కార్పొరేషన్లు, ఇతర ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన బిల్లులున్నాయి. చెల్లింపుల్లో తేడాకు కారణాలేంటి? బిల్లుల చెల్లింపులో వ్యత్యాసాలకు కారణాలను రికార్డు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. చట్టబద్ధంగా చేయాల్సిన చెల్లింపులకు, జీఎస్టీ, ఆదాయపు పన్ను, జ్యుడీషియరీ డిపాజిట్, టీఆర్ఆర్–27, రుణాల రీ పేమెంట్స్, వడ్డీల రీ పేమెంట్స్, వేతనాలు, పెన్షన్లు, అంతర్ ప్రభుత్వం అండ్ ఏజీ పేమెంట్స్, సీపీఎస్, స్థానిక సంస్థల నిధులు, డైట్ చార్జీలు, రేషన్, మెడిసిన్, మెడికల్ చికిత్సల బిల్లులు, మంచినీరు, ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రాధాన్య క్రమంలో చెల్లించాలని సీఎస్ పేర్కొన్నారు. పనుల బిల్లులను క్షుణ్నంగా అధ్యయనం చేసిన తరువాతే విడుదల చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపుల జరిగితే వాటిని నమోదు చేయడంతో పాటు ఆడిట్ నిర్వహించాలని సూచించారు. తొలుత వేతనాలకు చెందిన బిల్లులన్నింటినీ చెల్లించాలని సీఎస్ ఆదేశించారు. -
తెలుగుదేశం శకం ఇక ముగిసింది..
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, టీడీపీని జనం పరిగెత్తించేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. తెలుగుదేశం శకం ఇక ముగిసిందని, వచ్చేది రాజన్న రాజ్యమేనని ఆయన అన్నారు. కొద్దిరోజుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో మంచి సంక్షేమ ప్రభుత్వం రాబోతుందని బొత్స అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కుట్రలు ఆపకుంటే ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు. చంద్రబాబుకు మాత్రం ఇంకా అధికారం మీద, సీఎం కుర్చీ మీద యావ తగ్గలేదని ఎద్దేవా చేశారు. ఇదే ధోరణి ఫలితాల తర్వాత కూడా ఉంటే ప్రమాదమన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు పదవీ వ్యామోహం పోలేదు. ఆయన ఇంకా అధికార భ్రమలోనే ఉన్నారు. చంద్రబాబుకు ఎన్నికల సంఘంపై ఏమాత్రం గౌరవం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అధికారులతో ఎలా సమీక్షలు నిర్వహిస్తారు. చంద్రబాబు రాష్ట్రానికి ఉపయోగపడే సమీక్షలు జరపడం లేదు. అవినీతి కార్యక్రమాలను చక్కబెట్టే పనిలో ఉన్నారు. పాత బకాయిల కోసమే సీఎం సమీక్షలు చేస్తున్నారు.చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానాలు వస్తున్నాయి. రాజ్యాంగానికి లోబడే అందరూ ఉండాలి, అందుకు ఎవరూ అతీతులు కాదు. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే అంత తమాషాగా ఉందా? న్యాయం, ధర్మానిదే అంతిమ విజయం. ఎన్నికలనోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత చంద్రబాబు 18 కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ చేశారు. అన్ని త్వరలోనే బయటకు వస్తాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థ వెనుక పెద్ద కుట్ర ఉందని ఆనాడే చెప్పాం. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు ముందుంటారు. పోలీస్ వ్యవస్థను కూడా ఆయన భ్రష్టు పట్టించారు. ఇంటెలిజెన్స్ శాఖ ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసింది. ఏడాదిగా నా ఫోన్ ట్యాపింగ్‌లో ఉంది. కాదని చెప్పమనండి?. ఎన్నికల సంఘం కూడా తన మాట వినాలని చంద్రబాబు అనుకోవటం అవివేకం. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం. ఇక ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు 2014 ఎన్నికలలో బీజేపీతో కలిసి వెళ్లినప్పుడు ఈవీఎంలు కరెక్టు, ఇప్పుడు తప్పా?. వ్యవస్థలు అన్ని చంద్రబాబు తన చెప్పుచేతల్లో ఉండాలని అనుకుంటున్నారు. ఆయనను చూస్తే జాలి వేస్తోంది.’ అని అన్నారు. -
తెలుగుదేశం శకం ఇక ముగిసింది
-
ఏపీ సీఎస్‌కు విజయసాయిరెడ్డి లేఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా ఇజ్రాయెల్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ తీసుకునేందుకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అంగీకరించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, వారి అనుచరులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫోన్ల ట్యాపింగ్‌కు ఇజ్రాయెల్ కంపెనీ సాఫ్ట్వేర్, పరికరాలను ఉపయోగిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరికరాల కొనుగోలు వెనక ఉన్న దురుద్దేశం బహిర్గతం కావాల్సి ఉందని, అందుకనే ఇజ్రాయెల్ కంపెనీకి చెల్లించాల్సిన రూ.12.5 కోట్ల బిల్లును నిలిపి వేయాలని కోరారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ సీఎస్‌కు రాసిన లేఖ -
సీఎం చంద్రబాబు సమీక్షలకు సీఎస్ దూరం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దూరంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు మేరకు సీఎస్ ...ముఖ్యమంత్రి సమీక్షలకు హాజరు కాలేదు. కాగా పోలింగ్ ముగిసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చే నెల 27వ తేదీ వరకు అమల్లో ఉంది. అప్పటి వరకు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించరాదని ఎన్నికల నియావళి స్పష్టం చేస్తోంది. కేవలం ప్రకృతి వైపరీత్యాల సంభవించిన సమయంలో లేదా శాంతి భద్రతలకు విఘాతం సంభవించడం వంటి అత్యవసర పరిస్థితిల్లో చక్కపెట్టేందుకు మాత్రమే సీఎం వ్యక్తిగత పర్యవేక్షణ, సమీక్ష చేయవచ్చునని, మిగతా ఎటువంటి సమీక్షలు చేయరాదని ఎన్నికల ప్రవర్తనా నియామవళి స్పష్టం చేస్తోంది. అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ఇప్పుడు నియావళిని తుంగలో తొక్కుతూ నిన్న (బుధవారం) పోలవరం ప్రాజెక్టుపై ప్రజావేదిక నుంచి సమీక్ష నిర్వహించగా గురువారం ఏకంగా సచివాలయానికి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుని మరీ సీఆర్డీఏ పనులపై సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షలకు అధికారులు హాజరు కాకూడదు. అలాగే ముఖ్యమంత్రి కూడా అధికారులను ఆహ్వానించరాదు. అయితే చంద్రబాబు అధికారులను ఇరకాటంలో పెడుతూ తనకు కావాల్సిన వారికి ఖాజానా నుంచి బిల్లుల చెల్లించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు సమీక్షల పేరుతో హడావిడి చేస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈసీ మరోసారి స్పష్టం చేయడంతో చంద్రబాబు నాయుడు హోంశాఖ సమీక్షను రద్దు చేసుకున్నారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ రిటైర్డ్ ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నికల అధికారిపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను రిటైర్డ్ ఐఏఎస్ బృందం కోరింది. ఈ మేరకు విశ్రాంత ఐఏఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, గోపాల్ రావు, భట్టాచార్య తదితరులు గవర్నర్‌ను కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. చదవండి : సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి, చీఫ్ సెక్రటరీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్నికల అధికారిని బెదిరించడం దారుణమన్నారు. తాము ఆత్మప్రభోదం ప్రకారమే పని చేస్తామని, తమ చర్యల వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని స్పష్టం చేశారు. తాము(ఐఏఎస్‌లు) నిజాయితీగా పనిచేయడం వల్లే వ్యవస్థ సక్రమంగా నడుస్తోందన్నారు. రాజకీయ లబ్థి కోసమే చంద్రబాబు నాయుడు అధికారులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సీఎస్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు గర్హనీయం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఈసీకి లేఖ రాశారు. చంద్రబాబు.. ఎల్వీని సహ నిందితుడిగా, కోవర్టుగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘం పునేఠాను తప్పించి ఎల్వీని సీఎస్‌గా నియమించిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీపై చేసినట్టుగానే భావించాలన్నారు. సీఎం వ్యాఖ్యలతో ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు ఐఏఎస్‌ల ప్రతిష్టకు భంగం కలిగిందని లేఖలో పేర్కొన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్– 324 ప్రకారం ఈసీకి సంక్రమించిన అధికా రాలను అవహేళన చేసిన ట్టేనన్నారు. ఎన్నికల సంఘం అధికారాలను అంగీకరించనట్టయితే భవిç ష్యత్తులో చట్టబద్ధంగా ఈసీ తీసుకునే నిర్ణయాలను రాజకీయ నేతలు, పార్టీలు ఇష్టపడరని వివరించారు. ఎన్నికల వేళ ఈసీ నిర్ణయాలు, ఆదేశాలను పదేపదే వ్యతిరేకించే అవకాశమూ ఉంటుందన్నారు. ఈసీ ఆదేశాలను పాటించిన ప్రభుత్వోద్యోగులు చంద్రబా బులాంటి వారి చేతుల్లో బాధితులయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈసీ తక్షణమే బాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని శర్మ తన లేఖలో కోరారు.