
అమరావతి: ఏపీ సచివాలయంలో గనులశాఖ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వార్షిక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ.. గనుల తవ్వకాల్లో నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి, తిరుమల కొండల్లో తరచూ కొండచరియలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులకు తెలిపారు.
ఏపీలో గనుల అన్వేషణలో చేస్తున్న కృషిని ఎల్వీ సుబ్రహ్మణ్యానికి జీఎస్‌ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం.శ్రీధర్ వివరించారు. చిత్తూరు జిల్లా చింగూరు గుంటలో రూ.2470 కోట్ల విలువరైన బంగారు నిక్షేపాలను గుర్తించామని శ్రీధర్ తెలిపారు. జీఎస్‌ఐ అధికారులు రూపొందించిన గ్రింప్‌సెస్ ఆఫ్ జీఎస్‌ఐ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాన్ని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment