సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని సమీక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.
జిల్లాల ఇంచార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి
జిల్లా పేరు | ఇంచార్జి మంత్రి పేరు |
శ్రీకాకుళం | వెలంపల్లి శ్రీనివాసరావు – దేవదాయ శాఖ |
విజయనగరం | చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు–గృహ నిర్మాణ |
విశాఖపట్టణం | మోపిదేవి వెంకట రమణ–పశుసంవర్ధక, మత్య్స, మార్కెటింగ్ |
తూర్పుగోదావరి | ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)–డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం |
పశ్చిమగోదావరి | పిల్లిసుభాష్ చంద్రబోస్–డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ |
కృష్ణా | కురసాల కన్నబాబు–వ్యవసాయ, సహకార |
గుంటూరు | పేర్ని వెంకటరామయ్య–రవాణా, సమాచార అండ్ పబ్లిక్ రిలేషన్స్ |
ప్రకాశం | పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్–జలవనరులు |
పొట్టి శ్రీరాములు నెల్లూరు | మేకతోటి సుచరిత–హోం, విపత్తుల నిర్వహణ |
కర్నూలు | బొత్స సత్యనారాయణ– మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి |
వైఎస్సార్ కడప | బుగ్గన రాజేంద్రనాధ్– ఆర్థిక, ప్రణాళిక, శాసన సభ వ్యవహారాలు |
అనంతపురం | పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి–పంచాయతీ రాజ్–గ్రామీణాభివృద్ధి, గనులు |
చిత్తూరు | మేకపాటి గౌతం రెడ్డి పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ |
Comments
Please login to add a commentAdd a comment