సాక్షి: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment