incharge minister
-
TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. రాజకీయంగా పలు కీలక మార్పులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హైకమాండ్ నిర్ణయం మేరకు ఉమ్మడి పది జిల్లాకు ఇన్చార్జ్ మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇన్చార్జ్ మంత్రుల జాబితాను ప్రకటించింది. ► కరీంగనర్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమర్‌రెడ్డి ► మహబూబ్‌నగర్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా దామోదరం రాజనర్సింహ ► ఖమ్మం జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంటకరెడ్డి ► వరంగల్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ► హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ► మెదక్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా కొండా సురేఖ ► ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ధనసరి అనసూయ (సీతక్క) ► నల్గొండ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు ► నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ► రంగారెడ్డి జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా శ్రీధర్‌బాబును నియమించారు. చదవండి: ఖమ్మం ఎంపీ సీటు.. కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ ! -
ముగ్గురు మంత్రులు.. 3 జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ‘హైదరాబాద్– రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియో జకవర్గానికి చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్.. ప్రచార వ్యూహాన్ని పక్కాగా అమలు చేయడంపై దృష్టి సారించింది. ఎన్నికలు జరిగే మూడు జిల్లాలకు ముగ్గురు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించింది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో గంగుల కమలాకర్, రంగారెడ్డిలో హరీశ్‌రావు, మహబూబ్‌నగర్‌లో వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆ ముగ్గురు మంత్రులతో శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి.. ‘హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన ప్రచార, సమన్వయ వ్యూహంపై ఇన్చార్జి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. నేడు 43 నియోజకవర్గాల్లో సమావేశాలు పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాన్ని ఈ సమావేశాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు వివరిస్తారు. ఎన్నికల ఇన్‌చార్జీలుగా నియమితులైన ముగ్గురు మంత్రులు మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలకు అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించేలా శుక్రవారం రాత్రి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థి వాణీదేవి కూడా శనివారం జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కరోనా: మంత్రులు రోజూ ఆ పని చేయాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరించకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయితే క్వారంటైన్లో ఉన్న వారికి కల్పిస్తున్న ఆరోగ్యభద్రత, వారికి అందిస్తున్న చికిత్స, అలాగే సామాజిక దూరం పాటిస్తున్న విధానం, కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు, మాస్క్‌లు, శానిటైజర్ల కొరత తదితర అంశాలపై మానిటర్ చేయడానికి ప్రతి రాష్ట్రానికి ఒక్కరిద్దరు మంత్రులను కేంద్రప్రభుత్వం ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. ఈ వారంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చిన్న రాష్ట్రాలకు ఒక మంత్రిని ఇన్చార్జ్గా నియమించగా, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, పెద్ద రాష్ట్రాలకు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్టు మోదీ తెలిపారు. వీరు ప్రతిరోజు నమోదవుతున్న కరోనా కేసులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, సామాజిక దూరం, కార్వంటైన్‌లో ఉన్న వారికి కల్పిస్తున్న సదుపాయాలు, అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉన్న కమ్యూనిటీ కిచెన్లు, ఇతర పరిస్థితులు అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు ప్రధానమంత్రి కార్యాలయానికి అందించాలని ఆదేశించారు. జిల్లా మేజిస్ట్రేట్లు, జిల్లా కలెక్టర్లను అడిగి ప్రాథమిక స్థాయిలో సమాచారాన్ని తీసుకొని రిపోర్టును అందించాలని మంత్రులకు సూచించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తమ సొంత రాష్ట్రమైన బీహార్‌కి సంబంధించిన పరిస్థితిని ప్రతిరోజు తెలుసుకుంటూ రిపోర్టును అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ‘మంత్రులందరూ జిల్లా మేజిస్ట్రేట్లు, జిల్లా కలెక్టర్లను అడిగి కిందిస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలి. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేయాలి’ అని మంత్రులు పేర్కొన్నారు. -
సమర్థవంతంగా పని చేయండి
సాక్షి, అమరావతి: జిల్లా ఇన్చార్జి మంత్రులుగా నియమితులైన వారి పనితీరుపై ప్రతి ఆరు నెలలకొకసారి సమీక్ష జరుగుతుందని, వారి సామర్థ్యం ప్రాతిపదికగా మార్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో అధికారిక ఎజెండాలోని అంశాలు ముగిశాక, అధికారులు నిష్క్రమించిన అనంతరం ఆయన మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని, ఏవైనా రాజకీయ అంశాలుంటే పరిష్కరించాలని, ప్రతి నెలా తనకు జిల్లా పరిస్థితిపై ఇన్చార్జి మంత్రులు నివేదికలు ఇవ్వాలని జగన్ సూచించినట్లు తెలిసింది. తనకు ఎలాగూ నిఘా విభాగం నుంచి కూడా నివేదికలు వస్తాయని, నెలలో కనీసం రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఇన్చార్జి మంత్రులు తమకు నిర్దేశించిన జిల్లాలో బస చేయాలని చెప్పినట్లు సమాచారం. స్థానికులు కాని మంత్రులను ఇన్చార్జిలుగా నియమించడానికి ప్రధాన కారణం వారు నిష్పాక్షికంగా ఉంటారనే ఉద్దేశంతోనేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ‘ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను రాజకీయంగా బలోపేతం చేయాలి. వారు పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. పనితీరును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తాం. ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండండి మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదని ఎమ్మెల్యేలు, ఇతరుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అందువల్ల కచ్చితంగా వారు అందరికీ అందుబాటులో ఉండి తీరాలని జగన్ సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై చర్చ జరిగినప్పుడు ఆదివారం సెలవు కనుక నియోజకవర్గాలకు వెళ్తామని, సోమవారానికి సచివాలయానికి రావాలంటే ఇబ్బందిగా ఉంటుందని అందువల్ల మంగళ, బుధవారాల్లో అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తామని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారని తెలిసింది. దీంతో ఇకపై మంగళ, బుధవారాల్లో కచ్చితంగా మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలని సీఎం నిర్దేశించారని సమాచారం. నవంబర్‌లో మార్కెటింగ్ పదవుల నియామకం పూర్తి ‘నవంబర్ నెలాఖరుకు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, దేవస్థానం, ట్రస్టు పదవుల నియామకం పూర్తి కావాలని.. ఈ పదవుల్లో కచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పాటించి తీరాలి. ఆయా జిల్లాల్లో ఈ పదవుల నియామకం విషయంలో నిర్దేశించిన విధంగా అత్యంత వెనుకబడిన కులాల వారిని సైతం పరిగణనలోకి తీసుకోవాలి. నామినేటెడ్ పదవులన్నింటిలోనూ రిజర్వేషన్లు పాటించాల్సిందే. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు వల్ల దళారీ వ్యవస్థ మధ్యలో ఉండదు. దీంతో ఆ ఉద్యోగులకు మేలు జరుగుతుంది’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆశ్రమ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులపై ఏటా రూ. 15,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నందున వారిని ‘అమ్మ ఒడి’ పథకం నుంచి మినహాయించాలని ఓ మంత్రి సూచనను సీఎం తోసి పుచ్చినట్లు సమాచారం. ఇసుక కొరతపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలనే అభిప్రాయం మంత్రుల్లో వ్యక్తం అయిందని తెలిసింది. -
కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా అనిల్‌కుమార్
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పి.అనిల్‌కుమార్ నియమితులయ్యారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ప్రస్తుతం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. బొత్సను జూన్ 21న జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించగా.. ఇప్పటి వరకు ఆయన కొనసాగారు. ఇన్చార్జ్ మంత్రి హోదాలో స్వాతంత్య్ర దిన వేడుకలతో పాటు ఆగస్టు 28న జరిగిన జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశంలో పాల్గొన్నారు. సెప్టెంబరు 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు నంద్యాలలో పర్యటించి.. భారీ వర్షాలు, వరదల నష్టాన్ని పరిశీలించారు. బొత్సను ప్రస్తుతం అనంతపురం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించగా.. ఆయన స్థానాన్ని మంత్రి అనిల్‌కుమార్‌తో భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్‌కుమార్ జల వనరుల శాఖ మంత్రి కావడంతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి వీలు కలుగుతుందని ప్రజల్లో చర్చ సాగుతోంది. -
13 జిల్లాలకు కొత్త ఇంచార్జ్ మంత్రులు
సాక్షి, అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనా పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇప్పటివరకూ జిల్లా ఇంచార్జ్‌లుగా పనిచేస్తున్న మంత్రులకు కొందరికి స్థాన చలనం కల్పించిగా, మరికొందరికి కొత్తగా అవకాశం కల్పించారు.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ఆయా జిల్లాల వారీగా ఇంచార్జ్ మంత్రులను నియమించింది. 13 జిల్లాలకు 13 మంది మంత్రులను ఇంచార్జ్‌లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా ఇంచార్జ్ మంత్రుల వివరాలు శ్రీకాకుళం - కొడాలి నాని విజయనగరం - వెల్లంపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నం - కురసాల కన్నబాబు తూర్పుగోదావరి - మోపిదేవి వెంకటరమణ పశ్చిమగోదావరి -పేర్ని వెంకట్రామయ్య కృష్ణా - పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గుంటూరు - చెరుకువాడ రంగనాథరాజు ప్రకాశం - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నెల్లూరు - బాలినేని శ్రీనివాస రెడ్డి కర్నూలు - అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కడప - ఆదిమూలపు సురేష్ అనంతపురం - బొత్స సత్యనారాయణ చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి -
విశాఖ ఇక.. వెలుగు బాట..!
మోముపై చెరగని చిరునవ్వు.. తెలియని వారికి సైతం ఆత్మీయ పలకరింపు.. పాలనపై పట్టు.. ప్రజా సమస్యలపై అపారమైన అవగాహన.. ఇవన్నీ కలగలిసిన నేత మోపిదేవి వెంకటరమణ. రాష్ట్ర పశుసంవర్థక, మార్కెటింగ్, మత్స్యశాఖల మంత్రిగా ఉన్న ఆయన్ను విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి మోపిదేవిపై తనకున్న నమ్మకాన్ని.. విశాఖ అభివృద్ధిపై చిత్తశుద్ధిని పరోక్షంగా చాటారు. రాష్ట్రంలోనే పెద్ద నగరంగా.. ఆర్థిక రాజధానిగా విలసిల్లుతున్న విశాఖను గత ప్రభుత్వం గానీ.. ఇన్చార్జి మంత్రులుగా ఉన్నవారు గానీ.. పెద్దగా పట్టించుకోలేదు. ఉత్సవాలు, సంబరాలు, సదస్సుల పేరిట నిధుల దుబారా.. అట్టహాసాలు తప్ప విశాఖ జిల్లా అభివృద్ధికి నిర్ధిష్టంగా చేసిన కృషి ఏమీ లేదనే చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అన్ని వర్గాల్లో సంతోషం నింపుతున్నారు. ఆయన బాటలోనే జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇప్పటికే నిత్యం పర్యటనలు, సమీక్షలతో ప్రజలకు చేరవయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇన్చార్జి మంత్రి మోపిదేవి కూడా అనుభవశాలే కావడం విశాఖ ప్రగతికి మేలిమలుపు కాగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆయన సారథ్యంలో విశాఖ వెలుగులీనడం ఖాయమని అన్ని వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే పాలనను పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలతోపాటు ప్రజాసంకల్పయాత్రలో తాని చ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రజారంజక పాలన సాగిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మరోవైపు విశాఖ జిల్లాలో పాలన పరుగులు పెడుతూ అభివృద్ధిలో దూసుకుపోనుంది. గడిచిన ఐదేళ్ల పాటు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు నిలయంగా మారిన విశాఖ మళ్లీ గాడిలో పడనుంది. ఇప్పటికే జిల్లా సీనియర్ రాజకీయ నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు జిల్లా పాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలు కూడా సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పాలనపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయపరుస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అట్టడుగు వర్గాల వారికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అపారమైన అనుభవశాలి మోపిదేవి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాకు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావును ఇన్చార్జి మంత్రిగా సీఎం జగన్మోహన్రెడ్డి గురువారం నియమించారు. అత్యంత సీనియర్ మంత్రి అయిన మోపిదేవికి నవ్యాంధ్రలో ఏపీ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1989 నుంచి రాజకీయాల్లో ఉన్న మోపిదేవి ఎన్నో కీలక పదవులు చేపట్టారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూచిపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోపిదేవికి తన కేబినెట్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్స్ నేచురల్ గ్యాస్ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక 2009లో రేపల్లె నుంచి గెలుపొందిన మోపిదేవిని వైఎస్సార్ తన కేబినెట్లో లా అండ్ కోర్టులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు. మహానేత అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య కేబినెట్లో మోపిదేవికి మళ్లీ అవే శాఖలను అప్పగించారు. ఇక ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా దాదాపు పదేళ్ల పాటు అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగిన మోపిదేవిని విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించారు. జిల్లాలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పాలనాపరమైన వ్యవహారాలను ఇన్చార్జి మంత్రి పర్యవేక్షించనున్నారు. విశాఖను ఆదర్శ జిల్లా చేస్తా: ఇన్చార్జి మంత్రి మోపిదేవి జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. గతంలో మంత్రిగా, వైఎస్సార్సీపీ నేతగా జిల్లాలో చాలాసార్లు పర్యటించా. పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశానని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకొనిపోతానన్నారు. అర్ధవంతమైన సమీక్షలతో జిల్లా పాలనను గాడిలో పెట్టడంతోపాటు.. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ముకానీయనని మోపిదేవి అన్నారు. రాజధాని అమరావతి తర్వాత అత్యంత కీలకమైన విశాఖ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా తనను నియమించిన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలందరూ తనకు బాగా తెలుసునన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసునని అందర్ని సమన్వయపరుస్తూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా విశాఖను తీర్చిదిద్దుతానని మంత్రి చెప్పారు. జిల్లాపై పూర్తి అవగాహన రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు అవంతి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడుతో కలిసి సమీక్షలు నిర్వహిస్తూ జిల్లా పాలనపై పూర్తిస్థాయి పట్టు సాధిస్తూ పాలనను గాడిలో పెడుతున్నారు. తాజాగా పాలనలో అపారమైన అనుభవం కలిగిన మోపిదేవికి ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించడంతో జిల్లా పాలన మరింత వేగంగా పరుగులు పెట్టనుందని జిల్లా వాసులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తూ ఎలాంటి సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయపర్చడంలో మోపిదేవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్సార్సీపీలోకి వచ్చింది మొదలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వెన్నంటి ఉంటూ మత్స్యకార నేతగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ముఖ్యంగా బీసీ అధ్యయన కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలు పార్టీ పట్ల ఆకర్షితులయ్యేలా చేయడంలో మోపిదేవి పాత్ర ఎంతో ఉంది. ఇక విశాఖ జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. మంత్రిగా పనిచేసిన సమయంలో అనేకమార్లు జిల్లాలో పర్యటించడమే కాదు.. జిల్లాలో పలు సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో కృషిచేశారు. పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటపై టీడీపీ ముష్కరులు దాడి చేసి ఘటనలో పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ చైర్మన్‌గా మోపిదేవి గ్రామంలో పర్యటించి ఇరువర్గాలను సమన్వయపర్చడంలో ప్రత్యేక కృషి చేశారు. అంతేకాదు మత్స్యకారులను ఏస్టీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ ఎదుట మత్స్యకారులు చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. మత్స్యకారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన చంద్రబాబు తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇలా గతంలో మంత్రిగా, పార్టీ నేతగా జిల్లాపై మంచి అవగాహన, పట్టు ఉన్న మోపిదేవి వెంకటరమణ తాజాగా ఇన్చార్జి మంత్రి హోదాలో రానున్న ఐదేళ్లు జిల్లాలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించడంలో తనదైన ముద్ర వేస్తారనడంలో సందేహం లేదు. -
ఏపీలో జిల్లాల ఇన్చార్జి మంత్రులు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని సమీక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. జిల్లాల ఇంచార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి జిల్లా పేరు ఇంచార్జి మంత్రి పేరు శ్రీకాకుళం వెలంపల్లి శ్రీనివాసరావు – దేవదాయ శాఖ విజయనగరం చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు–గృహ నిర్మాణ విశాఖపట్టణం మోపిదేవి వెంకట రమణ–పశుసంవర్ధక, మత్య్స, మార్కెటింగ్ తూర్పుగోదావరి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)–డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం పశ్చిమగోదావరి పిల్లిసుభాష్ చంద్రబోస్–డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కృష్ణా కురసాల కన్నబాబు–వ్యవసాయ, సహకార గుంటూరు పేర్ని వెంకటరామయ్య–రవాణా, సమాచార అండ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకాశం పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్–జలవనరులు పొట్టి శ్రీరాములు నెల్లూరు మేకతోటి సుచరిత–హోం, విపత్తుల నిర్వహణ కర్నూలు బొత్స సత్యనారాయణ– మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి వైఎస్సార్ కడప బుగ్గన రాజేంద్రనాధ్– ఆర్థిక, ప్రణాళిక, శాసన సభ వ్యవహారాలు అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి–పంచాయతీ రాజ్–గ్రామీణాభివృద్ధి, గనులు చిత్తూరు మేకపాటి గౌతం రెడ్డి పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ -
జిల్లా ఇన్చార్జి మంత్రిగా కన్నబాబు
సాక్షి, విజయవాడ : జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబును ప్రభుత్వం నియమించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుపొంది మంత్రివర్గంలో స్థానం సాధించారు. డీఆర్సీ ఏర్పాటు చేసి సమీక్ష చేసే అధికారం ఉంది. ప్రతి మూడు నెలలకు డీఆర్సీ జరగాల్సి ఉంటుంది. పక్కా గృహాల మంజూరు, ఇతర పథకాల మంజూరుకు అవకాశం ఉంటుంది. పాత్రికేయుడిగా పనిచేసిన కన్నబాబుకు పలు అంశాలపై మంచి అవగాహన ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పేర్ని నానికి రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా ఇన్చార్జిగా, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. -
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బొత్స
సాక్షి, కర్నూలు : జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బొత్స సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో ఎంఎస్ నంబరు 9 జారీ చేశారు. పురపాలకశాఖ, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్చార్జీ మంత్రిగా నియమితులయ్యారు. అదే విధంగా జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైఎస్ఆర్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. -
13 జిల్లాలకు 13 మంది ఇన్ఛార్జ్ మంత్రులు
-
జిల్లా ఇన్చార్జి మంత్రి బుగ్గన
సాక్షి, కడప : జిల్లా ఇన్చార్జి మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆర్థికమంత్రి బుగ్గన టీడీపీ ప్రభుత్వంలో పీఏసీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఈయన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వైఎస్ఆర్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించారు. తద్వారా జిల్లాలో చేపట్టే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ ఆమోదం సులభంగా పొందే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
ఆశలు గల్లంతు!
► జిల్లాకు దక్కని రెండో మంత్రి పదవి ► మంత్రివర్గ విస్తరణలోప్రకాశానికి మొండిచేయి ► ఒకే ఒక్కడు శిద్దా రాఘవరావు ► మాగుంటకు మొండిచేయి ► ఫలించని దామచర్ల, డేవిడ్‌రాజుల ప్రయత్నాలు ► డీలా పడిన ఆశావహులు ► ఇన్చార్జి మంత్రి రావెలపై వేటు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తాజా మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాకు మొండిచేయి చూపారు. సమీకరణలు, కూడికలు.. తీసివేతల తర్వాత ఇన్నాళ్లూ జిల్లాను ఊరిస్తూ వచ్చిన రెండో మంత్రి పదవి చివరి నిమిషంలో చేజారి పోయింది. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ముఖ్యంగా పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, తీవ్రంగా ప్రయత్నించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు అమాత్య పదవికోసం తనవంతు ప్రయత్నాలు సాగించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజులకు చివరికు నిరాశ మిగిలింది. దీంతో వారి వర్గీయులు డీలా పడ్డారు. జిల్లాకు మరో మంత్రి పదవి దక్కకపోడంతో పార్టీ శ్రేణులు ఉసూరుమన్నారు. జిల్లా నుంచి మంత్రి శిద్దా రాఘవరావు కేబినెట్లో ఏక్ నిరంజన్‌గా మిగిలారు. ఫలించని ప్రయత్నాలు..: ప్రకాశం జిల్లాకు తాజా విస్తరణలో రెండో మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు భావించారు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రాగానే ప్రకాశం జిల్లాకు మంత్రి పదవిపై ఊహాగానాలు అధికమయ్యాయి. ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల తన సమీప బంధువైన కేంద్రమంత్రి ద్వారా మంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకూ ప్రయత్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతును సైతం కూడా గట్టి ఆయన గట్టి ప్రయత్నమే చేసినట్లు సమాచారం. మరోవైపు యర్రగొండుపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు కూడా ఎస్సీ కోటాలో మంత్రి పదవి చేజిక్కి తనవంతు ప్రయత్నాలు సాగించారు. చివరి నిమిషంలో బాబు వీరందరి ఆశల్ని గల్లంతు చేశారు. మాగుంట వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి..: ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి ఖాయమన్న సంకేతాలు వచ్చినప్పటికీ కుల సమీకరణల్లో భాగంగా చివరి నిమిషంలో ఆయనకు పదవి దక్కలేదని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో అదే జిల్లాకు చెందిన మాగుంటకు పదవి దక్కలేదు. ఒక దశలో సోమిరెడ్డికి మండలి చైర్మన్ పదవి కట్టబెట్టి మాగుంటకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తరువాత మాగుంటకు మండలి చైర్మన్ పదవి ఇచ్చి సోమిరెడ్డికి మంత్రి పదవి కట్టబెడతారన్న వార్తలు వెలువడ్డాయి. చంద్రబాబు సోమిరెడ్డి వైపే మొగ్గు చూపడంతో మాగుంట ఆశలకు గండి పడింది. దీంతో ఆయన వర్గీయులు నిరాశ చెందారు. అడగక పోయినా పదవి ఇస్తున్నట్లు ప్రచారం చేసిన అధిష్టానం చివరి నిమిషంలో మొండిచేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అనుకూలించని కుల సమీకణలు..: ఇక దామచర్ల గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉన్న కేంద్రమంత్రి వద్దకు తన అనుచరులు వెళ్లి తనకు మంత్రి పదవి వచ్చేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. సమీకరణలు అనుకూలించక పోవడంతో తన సామాజికవర్గానికి చెందిన దామచర్లకు పదవి ఇచ్చేందుకు బాబు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే డేవిడ్‌రాజు సామాజికవర్గం నుంచి రిజర్వుడు కోటాలో పోటీ ఎక్కువ ఉండడంతో ఆయన ఆశలూ ఫలించలేదు. ఒకే ఒక్కడు శిద్దా..: జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వక పోవడంతో ప్రస్తుత మంత్రి శిద్దా రాఘవరావు జిల్లాకు ఒకేఒక్క మంత్రిగా మిగిలారు. ప్రస్తుతం ఆయన పరిధిలో ఉన్న రవాణాశాఖ లేదా రోడ్ల భవనాలశాఖల్లో ఒక దానిని తప్పించి మరో శాఖ అప్పగించనున్నట్లు సమాచారం. జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెలకు ఉద్వాసన...: ఎట్టకేలకు జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు మంత్రి పదవి ఊడింది. రావెల పనితీరు పట్ల చాలా కాలంగా ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం ఉంది. తాజా విస్తరణలో రావెలను తప్పిస్తారన్న ప్రచారం జోరుగా జరిగింది. అనుకున్నట్టే చివరకు సీఎం ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించారు. -
అచ్చెన్నకు ‘సమన్వయ’ తలనొప్పి
– నియోజకవర్గాల సమావేశాలకు ముఖ్యనేతలు గైర్హాజరు – తూతూ మంత్రంగా సమన్వయ కమిటీ సమీక్ష – ఉపన్యాసంతో మమ అనిపించిన ఇంచార్జి మంత్రి – గోడ దూకినవారికే పట్టం కడతారా అంటూ కార్యకర్తల ఆవేదన కర్నూలు: జిల్లాలో తెలుగుతమ్ముళ్లను ఏకతాటిపై నడిపించడం ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడకు తలనొప్పిగా మారింది. ఇటీవల గోడదూకిన ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి. జిల్లాలోని శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, కోడుమూరు, కర్నూలు ఎమ్మెల్యేలు ఇటీవల టీడీపీలో చేరడంతో ఆధిపత్యపోరు మొదలైంది. జిల్లాలో నాయకులందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడుకు పార్టీ అధినేత అప్పగించారు. రెండు రోజుల పాటు నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి అందరిని సమన్వయం చేసేందుకు ‘అచ్చెన్న’ కర్నూలులో తిష్టవేశారు. మొదటి రోజు శుక్రవారం శ్రీశైలం, నంద్యాల, పత్తికొండ, కోడుమూరు,కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో స్థానిక మౌర్యాఇన్ హోటల్లోని దర్భార్ హాలులో సమన్వయ పేరుతో సమీక్ష నిర్వహించారు. పార్టీ జిల్లా ఇంచార్జి వర్లరామయ్య, రాష్ట్ర కమిటీ పరిశీలకులు గోవర్థన్‌రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యనేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో అచ్చెన్నాయుడుకు వ్యవహారం తలనొప్పిగా మారింది. ముఖ్యనేతల గైర్హాజరు సమన్వయ సమీక్షకు జిల్లాకు సంబంధించిన ముఖ్యనేతలు గైర్హాజరు అయ్యారు. హాజరైన వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో సమస్య మరింత జటిలమైంది. సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత అభివద్ధి చేయాలని ఇంచార్జి మంత్రి స్వయంగా ఆదేశించినప్పటికీ నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు ముఖ్యనేతలంతా గైర్హాజరు కావడంతో సమావేశం తూతూ మంత్రంగా సాగింది. శ్రీశైలం నియోజకవర్గ సమీక్షకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి హాజరైనప్పటికీ, పార్టీ ఇంచార్జి శిల్పా చక్రపాణిరెడ్డి గైర్హాజరు కావడంతో తూతూ మంత్రంగా సమావేశం సాగింది. అలాగే నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఇంచార్జి శిల్పా మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి హాజరు కాలేదు. జడ్పీ మాజీ చైర్మెన్ పీపీ నాగిరెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచనతో పాటు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే హాజరయ్యారు. పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి కేవలం 20 మంది కార్యకర్తలతో అరగంట వ్యవధిలో సమీక్షను ముగించారు. నిరుత్సాహం... కోడుమూరు నియోజకవర్గ సమావేశానికి ఎమ్మెల్యే మణిగాంధీతో పాటు ఇంచార్జి విష్ణువర్థన్‌రెడ్డి, తమ అనుచరవర్గంతో పెద్ద ఎత్తున హాజరైనప్పటికీ కార్యకర్తల సమస్యలు పట్టించుకోకుండానే సమావేశాన్ని ముగించడంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జిల గురించి మాత్రమే పట్టించుకుంటారా.. ఏళ్లతరబడి పార్టీని నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తల గురించి పట్టించుకోరా అంటూ కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన పలువురు ముఖ్య కార్యకర్తలు ఇంచార్జి మంత్రిని నిలదీశారు. దీంతో కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యకర్తల సమస్యల గురించి చర్చిద్దామంటూ ఇన్చార్జి మంత్రి దాటవేశారు. కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల సమావేశాలకు కేవలం పార్టీ ఫిరాయించిన వారి అనుచరవర్గం మాత్రమే ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా న్యాయం జరగడం లేదంటూ ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ సమన్వయంతో పనిచేయండి, సమస్యలు పరిష్కారమవుతాయంటూ తూతూ మంత్రంగా సమీక్ష సమావేశాలన్ని ముగించడంపై కార్యకర్తలు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వర్రావు యాదవ్, కేడీసీసీ చైర్మెన్ మల్లికార్జునరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నేడు 8 నియోజకవర్గాల సమీక్ష ఎమ్మిగనూరు, డోన్, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, బనగానపల్లె, పాణ్యం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు శనివారం నిర్వహిస్తున్నట్లు నాగేశ్వర్రావు యాదవ్ తెలిపారు. -
బదిలీల పైరవీలు
సిఫార్సులేఖలకు యమగిరాకీ ఎమ్మెల్యేలు..మంత్రుల చుట్టూ చక్కర్లు సాక్షి, విశాఖపట్నం : బదిలీల పైరవీలు మొదలయ్యాయి. జాబితాలు సిద్ధం కావడంతో బదిలీ తప్పదనుకునేవారంతా తాము కోరుకునే ప్రాంతాల కో సం పైరవీలు మొదలు పెట్టారు. ఇన్చార్జి మంత్రికి తుది నిర్ణయం కట్టబెట్టడంతో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బదిలీల్లో ఎక్కడా ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మౌఖికంగా అధికారులకు ఆదేశాలతో వీరిచ్చే సిఫారసు లేఖలకు డిమాండ్ ఏర్పడింది. కొంతమంది ఇదే అదనుగా పోస్టులను బట్టీ భారీగా వసూళ్లకు సైతం తెగబడుతున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. జిల్లాలో బదిలీలకు రంగం సిద్ధమైంది. సీనియార్టీ జాబితాలు కొలిక్కివచ్చాయి. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, విద్య, వైద్యఆరోగ్యశాఖల్లో బదిలీల అలజడి ఎక్కువగా కనిపిస్తోంది. విద్య, వైద్య ఆరోగ్యశాఖల్లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా 20 శాతం మించకుండా బదిలీలు చేపట్టాలని తాజా మార్గదర్శకాలు జారీ తో ఈ రెండుశాఖలు మినహా మిగిలిన శాఖల్లో మాత్రం గుబులు రేగుతుంది. నాన్‌గెజిటెడ్ పోస్టులకు కౌన్సెలింగ్ ద్వారా, గెజిటెడ్ స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్, ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో బదిలీలు చేపడతారు. పైకి పారదర్శకమంటూనే స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిల మాట మీద కానివ్వండంటూ ఉన్నతస్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల సిఫారసు లేఖలకు డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది పైరవీకారులు భారీగా వసూళ్లకు తెరలేపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. వారున్న చోట టీడీపీ ఇన్చార్జి లేఖలకు లేదా జిల్లా మంత్రుల లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిచ్చే లేఖలను మంత్రులు జిల్లా అధికారులకు పంపిస్తున్నారు. డివిజన్, జిల్లా స్థాయి పోస్టులకు జిల్లా మంత్రులే నేరుగా సిఫారసు లేఖలు ఇస్తున్నారు. బదిలీలకుగురయ్యేవారు ఈ లేఖల కోసం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నాలుగు కాసులొచ్చే సీటు ఎవరైనా ఎగరేసుకు పోతారేమోనన్న ఆరాటం..ఆతృత ఉద్యోగుల్లో పెరిగింది. లేఖల కోసం పైరవీలుసాగిస్తున్నారు.ఈ లేఖలతో ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారు తప్పనిసరిగా బదిలీలకు గురి కానుండడంతో వారిలో టెన్షన్ మొదలైంది. మరికొంతమందైతే.. తాము కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న సీటు పొందేందుకు పదోన్నతులను కూడా వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు రెవెన్యూ, జెడ్పీ, వైద్య ఆరోగ్యశాఖ, మైన్స్, పంచాయతీరాజ్, ఆర్ అండ్‌బీ, ఇంజినీరింగ్ తదితర శాఖల్లోని కీలకపోస్టులకు ఎక్కడా లేని డిమాండ్ నెలకొంది. కోరుకున్న పోస్టు కోసం జిల్లా మంత్రులతోనే కాదు..ఇతర మంత్రులు, పొరుగు జిల్లాలల ప్రజాప్రతినిధులతో కూడా జిల్లా ఇన్చార్జి మంత్రిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ జిల్లా కలెక్టర్ యువరాజ్ మాత్రం బదిలీలు సిఫారసులకు తావు లేనిరీతిలో పూర్తి పారదర్శకంగా జరుగుతాయని చెబుతున్నారు. జన్మభూమి మావూరు..నవనిర్మాణ దీక్ష..ఆర్థిక పరిపుష్టివంటి కార్యక్రమాల వల్ల బదిలీల గడువు పెంచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా సిఫార్సు లేఖల కోసం మాత్రం ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. -
ఇన్చార్జి మంత్రి సుడిగాలి పర్యటన
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య శనివారం తూర్పు, పశ్చిమ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి రచ్చబండలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఉదయం 10.30 గంటలకు బెల్లంపల్లికి చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి బెల్లంపల్లి మండ లం గురిజాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన రూ.13కోట్లతో తలపెట్టిన సాంఘిక సంక్షేమ బాలుర విద్యాలయం, రూ.3కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి గృహం, రూ.కోటితో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల వసతిగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. అనంతరం ఆసిఫాబాద్‌కు వెళ్లారు. రూ.40లక్షలతో నిర్మించిన అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్యశాల, కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేశారు. ఆసిఫాబాద్‌లో రూ.6.5 కోట్లతో ఫిల్టర్‌బెడ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.80 లక్షలతో ఆర్అండ్బీ రోడ్ నుంచి సాలెగూడకు బీటీ రోడ్డు నిర్మాణానికి, వాంకిడి మండలం కనర్గాంలో రూ.7.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి కెరమెరి మండలానికి చేరుకున్నారు. కెరమెరిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైనూర్, కెరమెరి మండలాల్లో రూ.1.35 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు భూమిపూజ చేశారు. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో మార్లవాయి, కంచెన్పల్లి, కోహినూర్ గ్రామాల్లో రూ.1.70 కోట్లతో పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తిర్యాణి మండలం రోంపల్లిలో రూ.40 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, వాంకిడి మండలం బంబరలో రూ.50 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, సిర్పూర్, జైనూర్ మండలాల్లో రూ.3 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. -
డీఆర్సీ ఎప్పుడు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మొదటి నుంచి కూడా డీఆర్సీ నిర్వహణపై ప్రజాప్రతినిధులకు చిన్న చూపు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్లలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, బస్వరాజు సారయ్య, సబితా ఇంద్రారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేశ్‌గౌడ్ కొనసాగుతున్నారు. శ్రీధర్‌బాబు హయాంలోనే డీఆర్సీ సమావేశాలు సజావుగా జరిగాయి. చివరగా 2012 ఫిబ్రవరి 10న సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 19 మాసాలు గడుస్తున్నప్పటికీ డీఆర్సీని ఏర్పా టు చేయాలన్న ధ్యాస అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు లేకుండా పోయింది. గత ఏడాది ఆగస్టులో ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి ముఖేశ్‌గౌడ్ ఇప్పటి వరకు జిల్లాలో అడుగు పెట్టలేదు. కనీసం డీఆర్సీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయకపోవడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి మాత్రం అడపాదడపా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిం చారు. అయినప్పటికీ సమస్యలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. నేతల అలసత్వం, నిర్లక్ష్యధోరణి జిల్లా ప్రగతికి అడ్డంకులవుతున్నా యి. రైతన్న అష్టకష్టాలు ఎదుర్కొంటుండగా, ప్రజలు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ ఉద్యమం పేరుతో ప్రజ లకు దూరంగా, ప్రజల బాగోగులు పట్టని విధంగా నేతలు వ్యవహరించారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ తెచ్చామన్న పేరుతో సం బరాలకు పరిమితమవుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టులపై శ్రద్ధ ఏదీ? జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపైనా ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండగా, చౌట్పల్లి హ న్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం మధ్యలోనే నిలిచిపోయింది. గోదావరిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న 14 ప్రాజెక్టులతో జిల్లాలోని గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టునకు చెందిన లక్ష్మీ కాలువ పరిధిలో మొత్తం 1.60 లక్షల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముం ది. ఇటీవల భారీ వర్షాలతో రైతుల పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు పంట నష్టపరిహారంపై ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదు. ప్రజాసమస్యలపై పట్టింపు లేదు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పను లు నత్తనడకన సాగుతున్నాయి. రూ. 96 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టగా ఇప్పటి వరకు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మాధవనగర్ (ధర్మారం) వద్ద రైల్వేఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. నగరం చుట్టూ అసంపూర్తిగా ఉన్న బైపాస్ రోడ్డును పూర్తి చేయాల్సి ఉంది. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ముందుకు సాగడం లేదు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎర్రజొన్న రైతులకు చెల్లిం చాల్సిన బకాయిలు రూ.10.83 కోట్లు పెం డింగ్‌లో ఉన్నాయి. ప్రైవేట్ ఆధీనంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని శాసనసభా సంఘం సూచన మేరకు ప్రభుత్వం స్వాధీనపరుచు కోవాల్సి ఉంది. కామారెడ్డి మంచినీటి పథకం పరిస్థితి కూడా అంతే. రూ. 140 కోట్ల వ్యయం తో 2008లో పనులు ప్రారంభించగా, సకాలంలో పూర్తి కాలేదు. ఫలితంగా అంచనా వ్య యం పెరిగి మరో రూ. 100 కోట్ల నిధుల అవసరం ఏర్పడింది. దీంతో ప్రజలకు తాగునీటిని అందించలేకపోతున్నారు. ఎడారి దేశాల్లో బతుకు పోరు జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు బతుకుదెరువుకో సం వెళ్లిన అనేక మంది ఆత్మహత్యలు చేసు కున్నారు. వారి గోడును పట్టించుకునే వారు కరువయ్యారు. కనీస వేతనాలు లేక బీడీ కార్మికుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. వేతనాల జీఓ అమలుపై ప్రజాప్రతినిధులు స్పందించిన దాఖలాలు లేవు.