సాక్షి, విజయవాడ : జిల్లా ఇన్‌చార్జిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబును ప్రభుత్వం నియమించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుపొంది మంత్రివర్గంలో స్థానం సాధించారు. డీఆర్‌సీ ఏర్పాటు చేసి సమీక్ష చేసే అధికారం ఉంది. ప్రతి మూడు నెలలకు డీఆర్‌సీ జరగాల్సి ఉంటుంది. పక్కా గృహాల మంజూరు, ఇతర పథకాల మంజూరుకు అవకాశం ఉంటుంది. పాత్రికేయుడిగా పనిచేసిన కన్నబాబుకు పలు అంశాలపై మంచి అవగాహన ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పేర్ని నానికి రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా ఇన్‌చార్జిగా, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment