
సాక్షి, కర్నూలు : జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా బొత్స సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో ఎంఎస్ నంబరు 9 జారీ చేశారు. పురపాలకశాఖ, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా నియమితులయ్యారు. అదే విధంగా జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైఎస్‌ఆర్ జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment