నేడు జిల్లాలో మంత్రుల పర్యటన  | Ministers Buggana And Botsa Tour in Kurnool | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన 

Published Wed, Aug 28 2019 8:02 AM | Last Updated on Wed, Aug 28 2019 8:27 AM

Ministers Buggana And Botsa Tour in Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు :  రాష్ట్ర పురపాలక శాఖ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి  బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. వీరు మంగళవారం రాత్రి 11.10 గంటలకు విజయవాడ నుంచి ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయలుదేరి బుధవారం ఉదయం 5.50 గంటలకు బేతంచెర్ల చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన కర్నూలుకు బయలుదేరి.. 6.40 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి వస్తారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌ చేరుకుని.. మధ్యాహ్నం రెండు గంటల వరకు డీఆర్‌సీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌ వెళతారు. బుగ్గన మాత్రం బుధవారంతో పాటు గురువారం కూడా జిల్లాలోనే ఉండి..వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement