సాక్షి, కర్నూలు : ఉగాది పండుగ రోజున ఇళ్లు లేని వారికి ఇంటి పట్టాలను అందజేస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నవరత్నాలను అమలు చేసేందుకు ప్రతి అధికారి విధిగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ కే.ఈ ప్రభాకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment