1/17
2/17
సేవా భారతి తెలంగాణ అద్వర్యంలో బాలికల సాధికారత, “కిషోరి వికాస్” కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 21/10/5 కిలో మీటర్ల విభాగాల్లో జరిగిన రన్ 9వ ఎడిషన్ గచ్చిబౌలి లో ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఇక్కడి స్టేడియం నుండి ప్రారంభమైన ఈ రన్ లో కార్పొరేట్‌లు, వారి కుటుంబాలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్థుల 11 వేలకు పైగా పాలుపంచుకున్నారు.
3/17
ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా హాజరైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు విజేతలకు మోమెంటోలను అందజేశారు. శాసనసభ్యులు ఆరిెకెపూడి గాంధీ, ఫ్రీడమ్ ఆయిల్ జి.యం చేతన్, గ్లోబల్ డెటా డైరెక్టర్ రాజీవ్ గుప్తా, పాల్టెక్ శ్యాంపాల్ రెడ్డిలు కూడా మంత్రి తో కలిసి వారిని అభినందించారు.
4/17
సమాజంలోని అభాగ్యుల వర్గాల అభ్యున్నతి కోసం సేవా భారతి తెలంగాణ చేస్తున్న కృషిని శ్రీధర్ బాబు ప్రశంసించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో ఆడపిల్లల సాధికారత కోసం ఉద్దేశించిన కార్యక్రమాల ప్రాముఖ్యతక గురించి కొనియాడారు. ఇప్పటికే సేవా భారతి 10,500 మంది బాలికల జీవితాలను ప్రభావితం చేసిందని, 2030 నాటికి 100,000 మంది లక్ష్యంతో ముందుకు సాగాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
5/17
జాతీయ ప్రధాన కార్యదర్శి పరాగ్ అభయాంకర్, సేవాభారతి తెలంగాణ అధ్యక్షుడు దుర్గారెడ్డి లు మాట్లాడుతూ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ వార్షిక కార్యక్రమం బాలికల అభ్యున్నతకి ఎంతో తోడ్పడుతుందన్నారు. ఫ్రీడమ్ ఆయిల్, గ్లోబల్డేటా, ఇన్ఫోసిస్, జీఈపీ, పాల్టెక్, బీడీఎల్, ఇన్నోవా సొల్యూషన్స్, ఫిల్టరేషన్ గ్రూప్, చబ్బ్, యూఎస్టీ గ్లోబల్, డిష్ టీవీ, ఈసీఐఎల్, ఎస్పీఎంసీఐఎల్, పెర్సెప్టివ్, కోటివిటి, పెగా సిస్టమ్స్, చబ్, టెక్వేవ్, సైలోటెక్, గ్లోబల్లాజిక్, టెక్వేదిక, సత్యనారాయణ జ్యువెలర్స్, స్ప్లాష్బీఐ, హ్యాపీ హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, హెచ్సీయూ, రన్ఫిట్ ప్రో, ఐబ్రిడ్జ్, AADHAN TV, TAL రేడియో, ఐబ్రిడ్జ్ సంస్ధలు తమ వంతు కృషిగా సేవా భారతికి మద్దతునిచ్చాయన్నారు.
6/17
ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సిఎస్ఆర్ హెడ్ వంశీపరం జ్యోతి, ఫిల్టరేషన్ గ్రూప్ సి.ఎఫ్.ఓ వినోద్, యూఎస్టీ గ్లోబల్ సిఎస్.ఆర్ హెడ్ తిరుమల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17