Run
-
International women's day 2025: ఈ నెల 9న రన్ ఫర్ హర్
మాదాపూర్: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివైబ్ సీఈవో రఘవీణసజ్జ తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం రన్ ఫర్ హర్ పేరిట పరుగు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రన్‌ఫర్ హర్ కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రన్‌కు సంబందించిన బ్రోచర్, టీషర్టు, మెడల్స్‌ను ఆవిష్కరించారు. ఇందులో 3కె, 5కె, 10కె విభాగంలో ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీ పార్కు వద్ద పరుగును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి పైగా వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొననున్నట్టు తెలిపారు.డబుల్స్ డైవ్ చాలెంజ్‌కు పదేళ్లు సాక్షి, సిటీబ్యూరో: సింక్రోనీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘డబుల్స్ డైవ్ చాలెంజ్’ పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సింక్రోనీ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సింక్రోనీ సంస్థకు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ‘డబుల్స్ డైవ్ ఛాలెంజ్’లో భాగంగా.. ఉద్యోగులు పేద విద్యార్థుల విద్యకు అవసరమైన వనరులను రూపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు సహకారం అందిస్తారని సింక్రోనీలో ఇ–చాట్ వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ రీజినల్ ఎంగేజ్మెంట్ హబ్ లీడర్ రాజ్ కోలా తెలిపారు. యూ అండ్ ఐ ట్రస్ట్ ప్రయత్నంలో భాగంగా హ్యాండ్‌మేడ్ బుక్మార్క్లు, ఆకర్షణీయమైన పద శోధన మెటీరియల్స్‌తో పాటు విజ్ఞాన అంశాలను పెంపొందించే చాట్బోర్డులు, పుస్తకాలను అందిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామని, ఇందులో సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ తదితర అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక జట్టుగా పదేళ్ల పాటు కృషి చేయడం అభినందనీయమని వివరించారు. మహిళామణుల ఆరోగ్యం కోసం..సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రారంభించారు. వంద మందికిపైగా మహిళా ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వీరికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి చూపు, దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డా.ఎం.మాధవి, ఫైనాన్స్ సీజీఎం కేదారేశ్వరి, జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజ, జనరల్ సెక్రటరీ బిల్కిస్ భాను తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఫర్ హోప్ సామాజిక మార్పు కోసం కళను సాధనంగా మార్చాలనే సందేశంతో హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ‘ఆర్ట్ ఫర్ హోప్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా 50 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఎంపిక చేస్తున్నామని, వీరికి రూ.60 లక్షల మొత్తం గ్రాంట్‌గా అందిస్తున్నామన్నారు. ఎంపికైన చిత్రకారుల కోసం దేశ రాజధానిలో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. -
మూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!
తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సౌందర్యానికి ప్రతీక చీరకట్టు.. అలాంటి చీరకట్టులోని ఔన్నత్యాన్ని నలుదిశలా చాటిచెప్పేలా నగర నారీమణులు ఉత్సాహంగా శారీ రన్లో పాల్గొన్నారు. అద్భుతమైన చీరకట్టుకు తామే బ్రాండ్ అంబాసిడర్లమనేలా వివిధ రకాల చీరకట్టుతో హాజరయ్యారు. ఆదివారం ఉదయం ట్యాంక్ బండ్ వేదికగా నారీమణులు తెలుగు సంప్రదాయ చీరకట్టుతో పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ మీదుగా శారీ రన్లో పాల్గొని తిరిగి పీపుల్స్ ప్లాజా చేరుకున్నారు. సుప్రసిద్ధ బ్రాండ్ తనైరా, ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ శారీ రన్‌ను తనైరా సీఈఓ అంబుల్ నారాయణ్, జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ప్రారంభించారు. తనైరా శారీ రన్ ఐక్యత, స్ఫూర్తి చిహ్నంగా మహిళలలోని స్త్రీతత్వం, ఫిట్‌నెస్‌కు ప్రేరణగా నిర్వహించినట్లు అంబుల్ నారాయణ్ తెలిపారు. మహిళల ఆరోగ్యం, సమగ్రతను ప్రోత్సహించేందుకు మొదటి ఎడిషన్‌ను 2020లో పూణె, బెంగళూరు, హైదరాబాద్‌లో నిర్వహించామని రెండో ఎడిషన్‌ను మరోసారి హైదరాబాద్‌లో నిర్వహించినట్లు తెలిపారు. చదవండి: ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీచందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఉత్సాహంగా సాగిన శారీ రన్లో మహిళలు అందమైన చీరకట్టుతో హాజరుకాగా.. కొందరు బుల్లెట్లు తోలుతూ, మరికొందరు సైకిళ్లు తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున సాగర తీరంలో శారీ రన్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రన్లో పాల్గొన్న పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సుమారు మూడు వేల మందికిపైగా రన్లో పాల్గొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వీరంతా ఫినిషింగ్ పాయింట్లో సెల్పీలు, గ్రూఫ్ ఫొటోలు దిగారు. జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముందు వామ్ అప్ ఫిట్నెస్, జుంబా చేయించారు. -
హైదరాబాద్‌లో తనైరా శారీ రన్.. అందంగా ముస్తాబైన మహిళలు (ఫోటోలు)
-
బాలికా సాధికారత..పరుగుతో చేయూత !
-
టంపాలో నాట్స్ 5కె రన్ కు మంచి స్పందన
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేందుకు నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే టంపాలో నాట్స్ నిర్వహించిన 5కె రన్‌కి మంచి స్పందన లభించింది. ఈ ఆదివారం టంపా నాట్స్ విభాగం ఆధ్వర్యంలో లోపెజ్ పార్క్ వద్ద నుంచి ఈ 5కె రన్ ప్రారంభమైంది. టంపాలో ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ మాధవి శేఖరం జ్ఞాపకార్థం ఈ 5కెను నిర్వహించింది. దాదాపు వంద మందికి పైగా తెలుగువారు ఈ 5కె రన్లో పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్య అవశ్యకతను కూడా ఈ 5కె రన్ ప్రారంభంలో నాట్స్ నాయకులు వివరించారు. 5K రన్ తర్వాత తెలుగు వారు తమ కుటుంబం స్నేహితులతో కలిసి పుషప్‌లు, స్క్వాట్లు చేయగలిగారు. ఒలింపియన్, బోస్టన్, ఎన్ వైసీ మారథాన్ ఛాంపియన్ అయిన మెబ్ కెఫ్లెజిఘి ఈ 5కె రన్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అన్నింటికి కన్నా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైందని, ప్రతిరోజు నడక, పరుగు ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంపొందిస్తాయని మెబ్ తెలిపారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ రన్ పేరుతో నిర్వహించిన ఈ రన్‌పై మెబ్ ప్రశంసలు కురిపించారు. నాట్స్ ఇలాంటి రన్ ఏర్పాటు చేయడంపై ఈ రన్లో పాల్గొన్న తెలుగువారంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ రన్ని విజయవంతం చేసినందుకు నాట్స్ టంపా బే కోర్ వాలంటీర్లకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రన్‌కు మద్దతు ఇచ్చిన స్థానిక సంస్థలు ఎఫ్.ఐ.ఏ, మాటాలకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 5కె రన్‌కి మంచి స్పందన రావడంతోటంపా నాట్స్ విభాగం ప్రతి సంవత్సరం ఈ రన్ నిర్వహించాలని యోచిస్తోంది.నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాటా చాప్టర్ ప్రెసిడెంట్ టోనీ జన్ను, నాట్స్ మాజీ చైర్మన్, NATS సెలబ్రేషన్స్ 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ డి. మల్లాది, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/భాను భనుల లిప్కెటింగ్), రాజేష్ కాండ్రు, కోశాధికారి సుధీర్ మిక్కిలినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్ సుమంత్ రామినేని, అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, విజయ్ కట్టా, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, భార్గవ్ మాధవరెడ్డి, అనిల్ అరెమండ, భరత్ ముద్దన, మాధవి సుధీర్ మిక్కిలినేని, మర్ల గద్దారెడ్డి, మున్నంగి, ప్రసాద్ నేరళ్ల, రవి కలిదిండి, కిరణ్ పొన్నం, నవీన్ మేడికొండ తదితరులు ఈ రన్లో పాల్గొన్నారు. 5కె రన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారందరిని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళీ కృష్ణ మేడిచెర్ల, కిషోర్ నార్నె, వెబ్ టీమ్ రవికిరణ్ తుమ్మల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు) -
లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ 5కే వాక్‌థాన్‌కు మంచి స్పందన
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా లాస్ ఏంజిల్స్ సిమివ్యాలీలో 5కే వాక్‌థాన్ నిర్వహించింది. లాస్ ఏంజిల్స్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ వాక్‌థాన్‌కు మంచి స్పందన లభించింది. పద్మవిభూషణ్ రతన్ టాటా స్మారకార్థం నిర్వహించిన ఈ వాక్‌థాన్‌కు 100 మందికి పైగా స్థానిక తెలుగువారు, భారతీయులు పాల్గొన్నారు. రతన్ టాటా సేవా వారసత్వాన్ని కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని ఈ వాక్‌థాన్ ప్రారంభంలో నాట్స్ నాయకులు తెలిపారు. రతన్ టాటా గొప్పతనాన్ని, ఆయన సేవా భావాన్ని ఈ సందర్భంగా నాట్స్ నాయకులు గుర్తు చేశారు. ఈ వాక్‌థాన్‌కు సహకరించిన నాట్స్ బోర్డు సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్లు కిషోర్ గరికిపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్లకు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.లాస్ ఏంజిల్స్ నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళీ ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, అధ్యక్షులు సిద్ధార్థ కోల, శ్రీనివాస్ మునగాల, రాధ తెలగం, అరుణ బోయినేని, గురు కొంక లతో పాటు సహాధ్యక్షులు పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి, హరీష్ అందె, ముకుంద్ పరుచూరి తదితరుల సహకారంతో ఈ వాక్‌ధాన్ దిగ్విజయం అయింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ) -
చీర కట్టులో కూడా పరుగు పెట్టొచ్చు..!
చీరకట్టు చిరాకేం కాదు... చక్కదనానికి కేరాఫ్ అడ్రస్ అని నిరూపిస్తూ బెంగళూరులో శారీరన్ను నిర్వహించింది టాటా కంపెనీ ఎత్నిక్‌వేర్ విభాగం తనైరా. 2,500 మంది మహిళలు పాలుపంచుకున్న ఈ శారీ రన్లో వయసు తారతమ్యాలేవీ లేకుండా రంగు రంగుల, రకరకాల చీరలు ధరించిన మహిళామణులు చీరకట్టులోని సొగసును, పొందికను చీరకట్టు అందాన్ని గర్వంగా, హుందాగా ప్రదర్శించారు. బెంగళూరుకు చెందిన టాటా కంపెనీ ఎత్నిక్‌వేర్ విభాగం తనైరా, జేజే యాక్టివ్ సంస్థలు ఆదివారం సంయుక్తంగా ఈ శారీరన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్, జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ఈ కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ...‘చీరను స్త్రీత్వానికి, స్త్రీసాధికారతకు ముఖ్యంగా భారతీయతకు బలమైన, చైతన్యవంతమైన భావనకు ప్రతీకగా తనైరా భావిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని చీరను డిజైన్ చేయడం మాకెంతో ఆసక్తిని, ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ శారీరన్ కార్యక్రమం కేవలం చీర, చీరకట్టు రమ్యతను గురించి తెలియజేసేందుకు మాత్రమే కాదు అధునిక జీవన విధానానికి అనుగుణంగా మా నిబద్ధతను పునర్నిర్వచించుకోవడం కోసం కూడా. సంప్రదాయ చీరకట్టులోనూ చైతన్యవంతంగా, చురుగ్గా కనిపించవచ్చుననీ, తమ అస్తిత్వాన్ని వదులుకోకుండానే మనసుకు నచ్చినట్లుగా కూడా జీవించవచ్చునన్న సందేశాన్ని వ్యాప్తి చేయాలన్నదే ఈ శారీరన్ను నిర్వహించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. అలాగే చీరకట్టు అనేది సాంస్కృతిక వారసత్వానికి, శక్తి సామర్థ్యాలకు వెన్నుదన్ను అని మా విశ్వాసం, నమ్మకం కూడా. చిన్న స్థాయిలో స్థానికంగా మొదలైన మా కార్యక్రమం నేడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారటం సంతోషంగా ఉంది’’ అన్నారు అంబుజ్ నారాయణ్. (చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!) -
హైదరాబాద్‌లో సిద్స్ ఫార్మ్ ఆధ్వర్యంలో హెల్త్ రన్ (ఫోటోలు)
-
Rakshitha: కాళ్లే కళ్లయ్యి..
కళ్లు మూసుకొని నాలుగడుగులు వేయలేము. కళ్లు కనపడకుండా పరిగెత్తగలమా? ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు తేలేని బంగారు పతకం మన దివ్యాంగ క్రీడాకారులు తెస్తారని ఆశ. కర్ణాటకకు చెందిన అంధ అథ్లెట్ రక్షిత రాజు 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న తొలి భారతీయ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించనుంది. పతకం తెస్తే అది మరో చరిత్ర. రక్షిత రాజు పరిచయం.అక్టోబర్ 26, 2023.రక్షిత రాజుకు ఆనందబాష్పాలు చిప్పిల్లుతున్నాయి. కన్నీరు కూడా ఉబుకుతోంది. ఆమె హాంగ్జావు (చైనా) పారా ఆసియా గేమ్స్‌లో 1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. చాలా పెద్ద విజయం ఇది. ఈ విషయాన్ని ఆమె తన అమ్మమ్మతో పంచుకోవాలనుకుంటోంది. కాని పంచుకోలేక΄ోతోంది. కారణం? అమ్మమ్మకు వినపడదు. చెవుడు. మాట్లాడలేదు. మూగ. కాని ఆ అమ్మమ్మే రక్షితను పెంచి పెద్ద చేసింది. ఆమె వెనుక కొండలా నిలుచుంది. ఆ ఘట్టం బహుశా ఏ సినిమా కథకూ తక్కువ కాదు. నిజజీవితాలు కల్పన కంటే కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి.ఊరు వదిలేసింది..కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని చిన్న పల్లెకు చెందిన రక్షిత రాజు పుట్టుకతోనే అంధురాలు. ఆమెకు నాలుగు సంవత్సరాలు ఉండగా తల్లిదండ్రులు మరణించారు. దాంతో ఊరంతా రక్షితను, ఆమె చిన్నారి తమ్ముణ్ణి నిరాకరించారు. చూసేవాళ్లు ఎవరూ లేరు. అప్పుడు రక్షిత అమ్మమ్మ వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకుంది. ఆమె స్వయంగా చెవుడు, మూగ లోపాలతో బాధ పడుతున్నా మనవళ్ల కోసం గట్టిగా నిలుచుంది. మనవరాలిని చిక్‌బళ్లాపూర్‌లో అంధుల కోసం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ స్కూల్లో చదివించింది. అక్కడి హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు అమ్మమ్మ వచ్చి పలుకరిస్తే ధైర్యం తెచ్చుకునేది. అంధత్వం వల్ల భవిష్యత్తు ఏమీ అర్థం అయ్యేది కాదు. దిగులుగా ఉండేది.వెలుతురు తెచ్చిన పరుగు..ఆశా కిరణ్ స్కూల్లో మంజన్న అనే పీఈటీ సారు రక్షిత బాగా పరిగెత్తగలదని గమనించి ఆమెను ఆటల్లో పెట్టాడు. స్కూల్లో ఉన్న ట్రాక్ మీద పరిగెట్టడం ్రపాక్టీసు చేయించాడు. జైపూర్‌లో పారా గేమ్స్ జరిగితే తీసుకెళ్లి వాటిలో పాల్గొనేలా చేశాడు. అక్కడే రాహుల్ అనే కర్ణాటక అథ్లెట్ దృష్టి రక్షిత మీద పడింది. ఈమెను నేను ట్రెయిన్ చేస్తాను అని చెప్పి ఆమె బాధ్యత తీసుకున్నాడు. అప్పటివరకూ సింథెటిక్ ట్రాక్ అంటేనే ఏమిటో రక్షితకు తెలియదు. రాహుల్ మెల్లమెల్లగా ఆమెకు తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెట్‌గా తీర్చిదిద్దాడు.గైడ్ రన్నర్ సాయంతో..అంధ అథ్లెట్లు ట్రాక్ మీద మరో రన్నర్ చేతిని తమ చేతితో ముడేసుకుని పరిగెడతారు. ఇలా తోడు పరిగెత్తేవారిని ‘గైడ్ రన్నర్‘అంటారు. అంతర్జాతీయ ΄ోటీల్లో రాహులే స్వయంగా ఆమెకు గైడ్ రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. హాంగ్జావులో 1500 మీటర్లను రక్షిత 5 నిమిషాల 21 సెకన్లలో ముగించింది. ‘చైనా, కిర్గిజ్స్తాన్ నుంచి గట్టి ΄ోటీదారులు వచ్చినా నేను గెలిచాను. పారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’ అంటుంది రక్షిత.అదే సవాలు..అంధులు పరిగెత్తడం పెద్ద సవాలు. వారు గైడ్ రన్నర్ సాయంతోనే పరిగెత్తాలి. ‘మాతోపాటు ఎవరైనా పరిగెత్తొచ్చు అనుకుంటారు. కాని గైడ్ రన్నర్లకు, మాకు సమన్వయం ఉండాలి. మమ్మల్ని పరిగెత్తిస్తూ వారూ పరిగెత్తాలి. ఎంతోమంది ప్రతిభావంతులైన అంధ రన్నర్లు ఉన్నా గైడ్ రన్నర్లు దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. ఒకప్పుడు నా కళ్ల ఎదుట అంతా చీకటే ఉండేది. ఇప్పుడు పరుగు నాకు ఒక వెలుతురునిచ్చింది. పారిస్‌లో స్వర్ణం సాధించి తిరిగి వస్తాను’ అంటోంది రక్షిత. -
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
బిడ్డలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. మానసికంగా, శారీరంగా బలహీనంగా ఉన్నా, లోపాలతో పుట్టినా అపూరూపంగా సాదుకుంటారు. కానీ ఒక తండ్రి శాడిస్ట్‌లా ప్రవర్తించాడు. లావుగా ఉన్నాడంటు కన్న కొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తండ్రి క్రూరత్వంగా ఆరేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు. అమెరికాలోని న్యూజెర్సీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన వివరాలు..న్యూజెర్సీలో నివసించే క్రిష్టోపర్ గ్రెగర్ ఆరేళ్ల తన కుమారుడు కోరీ కొంచెం బొద్దుగా ఉండటంతో జిమ్‌కు తీసుకెళ్లాడు. కుమారుడితో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించాడు. బలవంతంగా ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించడంతో బాలుడు పరిగెత్త లేకపోయాడు. పదే పదే కిందపడిపోయాడు. అయినా ఏమాత్రం కనికరం లేకండా కర్కశంగా ప్రవర్తించాడు. క్రిష్టోపర్. ఉన్మాదిలో మారి మళ్లీ మళ్లీ ఒత్తిడి చేసి, చాలా వేగంగా కదులుతున్న ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తించాడు. దీంతో కోరీ డస్సి పోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాటలు తడబడటం, సంయమనం కోల్పోవడం, వికారం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాల కారణంగా కోరీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. తీవ్ర గాయాలు, గుండె, కాలేయ పల్మనరీ కంట్యూషన్, సంబంధిత కారణాలతో చనిపోయినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్లోతేలింది. కోరీ మూర్ఛ వచ్చి మరణించినట్టు సీటీ స్కాన్ రిపోర్ట్‌లో వెల్లడైంది.NEW: Mother breaks down in court as she watches her son’s father abuse her child by making him run on the treadmill because he was “too fat.”New Jersey father Christopher Gregor is accused of killing his 6-year-old son Corey Micciolo.New footage shows the boy repeatedly face… pic.twitter.com/aVKknkOGd5— Collin Rugg (@CollinRugg) May 1, 2024 ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ కోరీది హత్యగా నిర్ధారించారు. ఈ దారుణ ఘటన 2021, మార్చిలో అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్ ఫిటినెస్ సెంటర్లో జరిగింది. కన్నకొడుకును హత్య చేశాడన్న ఆరోపణలపై 2022 మార్చి 9న గ్రెగర్ను అరెస్టు చేశారు. బాండ్ లేకుండా ఓషన్ సిటీ జైలులో ఉంచారు. తాజాగా జరిగిన కోర్టు విచారణలో న్యూజెర్సీ ఓషన్ సిటీలోని సుపీరియల్ కోర్టులో ఈ చిన్నారికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్రదర్శించారు. ఈ దృశ్యాలు చూసిన తల్లి బ్రె మిక్కియోలో తల్లడిల్లిపోయింది. దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఓటును మించిన ఆయుధం లేదు
గచ్చిబౌలి (హైదరాబాద్): బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని, ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవా లని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే బాధ్యతగల పౌరులుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందుకు ‘సివిజిల్’ యాప్‌ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు అందిన వంద నిమిషాలలోపు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్ తెలిపారు. బ్యాలెట్ పవర్ గొప్పది: రోనాల్డ్‌రాస్ బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ చాలా గొప్పదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్‌లో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈనెల 15లోగా ఫారమ్–6 ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటుహక్కు పొందాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, పెద్దసంఖ్యలో యువత, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైటెక్స్ రోడ్‌లోని మెటల్ చార్మినార్ వరకు రన్ కొనసాగింది. -
హైదరాబాద్ : ఉత్సాహంగా అహింసా 2వ ఎడిషన్ రన్ (ఫొటోలు)
-
Hyderabad : పీపుల్స్ ప్లాజాలో మహిళల శారీ రన్ (ఫొటోలు)
-
IDC Run 2024: 28న ఇనార్బిట్ దుర్గం చెరువు రన్
మాదాపూర్: ఇనార్బిట్ దుర్గం చెరువు రన్– 2024కు సంబంధించిన రేస్ రూట్, అధికారిక టీ–షర్ట్, మోడల్‌ను గురువారం మాదాపూర్ వెస్టీన్ హోటల్లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి.వినీత్, ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు, వుమెన్ సేఫ్టీ డీసీపీ సృజన, కె రహేజా కార్ప్ సీఓఓ శ్రవణ్ గోనేలు వివరాలను వెల్లడించారు. ఇనార్బిట్ మాల్ సైబరాబాద్, , మైండ్ స్పేష్ బిజినెస్ పార్క్, ది వెస్టీన్ భాగస్వామ్యంతో ఈ నెల 28న రన్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీకి చెందిన సభ్యులతో పాటు ఈ రన్లో దాదాపు 100 మంది దివ్యాంగులు పాల్గొంటారన్నారు. మొత్తం రూ.6 లక్షల విలువైన బహుమతులను వివిధ విభాగాల్లోని 48 మంది రన్నర్లకు అందిస్తామన్నారు. 21, 10, 5 కి.మీ విభాగాల్లో పోటీ ఉంటుందన్నారు. పరుగులో పాల్గొనేందుకు ఈ నెల 21 చివరి తేదీ అని తెలిపారు. ఎల్జిబిటీక్యూ, వ్యక్తులకు విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను పొందేందుకు సహాయం చేయడానికి నిధులను సేకరిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి పాల్గొన్నారు. -
అసోంలో భూకంపం.. భయంతో జనం పరుగులు!
అసోంలోని ధుబ్రిలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అసోంలోని ధుబ్రిలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించినప్పుడు జనం గాఢ నిద్రలో ఉన్నారు. భూ ప్రకంపనలను గుర్తించిన వెంటనే జనం తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. భయంతో ఇళ్ల వెలుపలే చాలా సేపు ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం తెల్లవారుజామున 3.01 గంటలకు 17 కి.మీ లోతులో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. గత సోమవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, చంబా జిల్లాల్లో రిక్టర్ స్కేల్‌పై 2.8, 2.1 తీవ్రతతో తేలికపాటి భూకంపాలు సంభవించాయి. కాగా తాజాగా సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? Earthquake of Magnitude:3.1, Occurred on 01-10-2023, 03:01:33 IST, Lat: 26.08 & Long: 90.05, Depth: 17 Km ,Location: Dhubri, Assam, India for more information Download the BhooKamp App https://t.co/8bErjjuCfL@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/1mxvy1CAQ5 — National Center for Seismology (@NCS_Earthquake) September 30, 2023 -
Cancer : క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు "గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్"
హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవేర్నెస్ రన్ "గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2023" కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర టీ షర్ట్‌ను విడుదల చేశారు. ఫిజికల్, వర్చువల్ మోడ్ల ద్వారా 130 దేశాల నుండి లక్ష మంది పాల్గొనే ఈ రన్ అక్టోబర్ 8న జరగనుంది. ఈ ప్రయత్నంలో సైబరాబాద్ పోలీసులు రన్ నిర్వాహకులకు అండగా ఉంటారు. ఎప్పుడు : సెప్టెంబర్ 12, 2023 ఎక్కడ : క్షేత్ర స్థాయిలో గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్, దీంతో పాటు వర్చువల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన రన్ "క్వాంబియంట్ డెవలపర్స్ - గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2023" అక్టోబర్ 8న గచ్చిబౌలి స్టేడియంలో, నగరంలో జరగనుంది. ఈ నేపథ్యంలో, గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన సంక్షిప్త ఆవిష్కరణ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం దీనికి సంబంధించిన టీ-షర్ట్‌ను విడుదల చేశారు. గ్లోబల్ రన్ - నోబుల్ కాజ్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, "ఇది ఒక వైవిధ్యంతో నడిచే గొప్ప పరుగు" అని అన్నారు. "సైబరాబాద్ పోలీసులు గత సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా దీంట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇది స్పోర్ట్స్ ఈవెంట్ కాదు, ఇది గ్లోబల్ ఈవెంట్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 130 దేశాల నుంచి రన్నర్లు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌కు సహకరిండాన్ని సైబరాబాద్ పోలీసులు బాధ్యతగా భావిస్తున్నారు. ఇది మాకు గర్వకారణం. సైబరాబాద్ పోలీసులు నిర్వాహకులకు అన్ని విషయాల్లో సహకరిస్తారు" అని తెలిపారు. "'బీ లైట్' అనే థీమ్‌తో 6వ ఎడిషన్ రన్లో 130కి పైగా దేశాల నుండి లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొంటారు" అని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గ్రేస్ (గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్) క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి వెల్లడించారు. రన్ నిర్వహించబోయిన విధానం: రన్ మూడు వేర్వేరు విభాగాలలో జరుగుతుంది. 5K, 10K, 21.1K (హాఫ్ మారథాన్). గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో 25 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది. ఇది హైబ్రిడ్ పద్దతిలో భౌతిక పద్దతిలో, వర్చువల్ పద్దతిలో జరగనుంది. భారతదేశంలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో జరిగే ఏకైక రన్ బహుశా ఇదే. ఎడ్యుకేషన్, ఎర్లీ డిటెక్షన్, ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్, అత్యాధునిక పరిశోధనల ద్వారా క్యాన్సర్ భారాన్ని తగ్గించే సదుద్దేశంతో లాభాపేక్షలేని సంస్థగా "గ్రేస్" క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పడింది. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన దూరాన్ని పరిగెత్తడమే కాకుండా, తమ రిజిస్ట్రేషన్ ఫీజులో కొంత భాగాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన కోసం విరాళంగా ఇవ్వడం ద్వారా మంచి కార్యక్రమంలో పాలుపంచుకున్నట్టవుతారు” అని డాక్టర్ చినబాబు తెలిపారు. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు మరింత మేలు చేయడం, సమాజంలో క్యాన్సర్‌ను నిరోధించడానికి, ఎదుర్కోవడానికి శారీరక శ్రమను ప్రోత్సహించడం, ప్రజలు చురుకైన జీవనశైలిని అనుసరించడంలో సహాయపడటం, నిరుపేదలను వారి ఇంటి వద్దే ఉచితంగా పరీక్షించడానికి నిధులను సేకరించడానికి ఈ రన్‌ను నిర్వహిస్తున్నట్టు డాక్టర్ చినబాబు తెలిపారు. ఈ రన్ గురించి ప్రజలకు అవగాహన: "గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అట్టడుగు వర్గాలకు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయం చేస్తుంది. చాలా కణితులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే నయం చేయవచ్చు. అయితే, ప్రపంచవ్యాప్తంగా మారుమూల, మురికివాడల్లో నివసించే చాలా మందికి ఈ వాస్తవం గురించి తెలియదు. దురదృష్టవశాత్తు, వారు క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి, ఈ రన్ ద్వారా వారిని చేరదీసి, ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలనేది మా ప్రగాఢ కోరిక" అని ఆయన అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఏటా 9.5 మిలియన్ల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారనేది విస్మయం కలిగిస్తోంది. కాబట్టి, ఎక్కువ మంది దీని బారిన పడకుండా నిరోధించడానికి, ఫౌండేషన్ ఇప్పటివరకు 4 ఖండాలను కవర్ చేస్తూ 10 దేశాలలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు, క్యాన్సర్ అవగాహన చర్చలు ఇంకా క్యాన్సర్ రన్లను నిర్వహిస్తోంది. -
అంతర్జాతీయ క్రికెటర్లను చేయడమే లక్ష్యం
విజయవాడ స్పోర్ట్స్: ‘మన ఆంధ్రా–మన ఏపీఎల్’ సీజన్–2ను పురస్కరించుకుని ఏసీఏ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో నిర్వహించిన 3కే రన్ ఉత్సాహంగా సాగింది. వందలాది మంది క్రికెట్ అభిమానులతోపాటు ఏసీఏ కార్యదర్శి గోపీనా«థ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎ.రాకేష్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఎన్.గీత, కేవీ పురుషోత్తం, జితేంద్రనా«థ్శర్మ, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఏసీఏ మాజీ కార్యదర్శులు అరుణ్‌కుమార్, దుర్గాప్రసాద్, కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ చైర్మన్ టి.త్రినాథరాజు, కన్వినర్ రవిశంకర్, పలువురు కోచ్‌లు పాల్గొన్నారు. గోపీనాథ్‌రెడ్డి టార్చ్ వెలిగించి ఈ రన్‌ను ప్రారంభించారు. అనంతరం టార్చ్‌ను అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి ఎండీ షబనం, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యురాలు గీతకు అందజేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బందరు రోడ్డు, టిక్కిల్ రోడ్డు మీదుగా సిద్ధార్థ జంక్షన్ వరకు వెళ్లి, తిరిగి స్టేడియం వద్దకు ఈ రన్ చేరుకుంది. గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడమే ఏసీఏ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో విశాఖలో ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్–2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంద్రాగస్టు సందడి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం స్వాతంత్య్ర దిన వేడుకలకు ముస్తాబవుతోంది. పరేడ్ కోసం సాధన చేస్తున్న పోలీ సులు, వివిధ రకాల శకటాలు తయారు చేస్తున్న కార్మికులతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ -
దారుణం: గిరిజనునిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఓ గిరిజన వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధిత వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని పోలీసుల తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద వైశ్య.. సింగ్రౌలీ ఎమ్మెల్యే రామ్ లల్లూ వైశ్య కుమారుడు. ఓ గిరిజన వ్యక్తిపై గురువారం కాల్పులు జరిపాడని ఆరోపణలు వచ్చాయి. రోడ్డుపై వెళ్తుండగా.. స్థానిక గిరిజనులతో వివేకానంద వైశ్యాకి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వైశ్య.. వారిని బెదిరించడానికి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ బుల్లెట్టు స్థానిక గిరిజనుని అరచేతికి తగిలినట్లు వెల్లడించారు. అనంతరం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం వివేకానంద వైశ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఆచూకీ కోసం రూ.10 వేల రివార్డు కూడా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటికొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే.. రామ్ లల్లూ వైశ్య.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. వివేక్ దోషి అని తేలితే శిక్షించండని చెప్పారు. బాధిత గిరిజనుడు తన సొంత గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిపిన ఆయన.. ఈ విషయం తెలిసి బాధేసిందని చెప్పారు. గత ఐదేళ్లుగా వివేక్ తన కుటుంబంతో కలిసి ఉండటం లేదని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఈ ఘటనలో నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు. मध्य प्रदेश के भाजपा नेताओं में आदिवासी समुदाय पर अत्याचार करने की होड़ मची है। सीधी में आदिवासी युवक पर पेशाब करने की घटना को अभी ज्यादा समय नहीं हुआ है कि सिंगरौली में भाजपा विधायक रामलल्लू वैश्य के बेटे विवेकानंद वैश्य ने एक आदिवासी युवक को गोली मार दी। युवक गंभीर रूप से घायल… — Kamal Nath (@OfficeOfKNath) August 4, 2023 అయితే.. మధ్యప్రదేశ్‌లో వరుసగా గిరిజనులపై ఇలాంటి ఘటనలు జరగడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఫైరయ్యారు. గిరిజనులను, దళితులను పీడించడమే బీజేపీ పనా? అని ప్రశ్నించారు. నేరస్థులను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుడిపై యూరినేషన్ ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పారు. దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: నా కారునే ఆపుతావా.. టోల్గేట్ సిబ్బందిపై ఎంపీ దాడి -
5కే,10కే రన్ చేసేటప్పుడు దయచేసి ఇలాంటి తప్పులు చేయొద్దు
-
విజయనగరంలో ఘనంగా ఒలంపిక్ డే రన్
-
హైహిల్స్‌తో రన్నింగ్ చేసి..గిన్నిస్ రికార్డు సృష్టించాడు!
పరుగు పందెం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. కానీ హైహిల్స్‌తో హైస్పీడ్‌గా పరుగు తీయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి ఆ అడ్వెంచర్‌ని చాలా సునాయాసంగా చేసి ప్రపంచ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. వివరాల్లోకెళ్తే..స్పెయిన్‌కి చెందిన 34 ఏళ్ల సీరియల్ రికార్డ్ బ్రేకర్ క్రిస్టియన్ రాబర్టో లోపేజ్ రోడ్రిగ్జ్ ఈ రికార్డుని సాధించాడు. అతను సుమారు 2.76 అంగుళాల స్టిలెట్టో హీల్స్ ధరించి కేవలం 12.82 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తి ఈ రికార్డు సృష్టించాడు. గతంలో 2019లో 14.02 సెకన్లలో 100 మీటర్లని హైహిల్స్‌తో పరుగెత్తిన ఆండ్రీ ఓర్టోల్ఫ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు రోడ్రిగ్జ్. ఈ మేరకు అతను మాట్లాడుతూ..ఇలా పరుగెత్తడం తనకొక సవాలని, ఇలాంటి రేసులను ఎన్నో అవలీలగా సాధించానని చెబుతున్నాడు. అంతేగాదు తనలాంటి టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులు.. మధుమేహం లేని వ్యక్తుల కంటే అన్ని పనులు చురుగ్గా చేయగలరని నిరూపించేందుకే తాను ఈ రికార్డు సాధించినట్లు చెప్పుకొచ్చాడు. రోడ్రిగ్జ్ గతంలో కళ్లకు గంతలు కట్టుకని సుమారు 100 మీటర్లు ముందుకు, వెనుకకు వేగంగా పరుగెత్తి రికార్డు సృష్టించాడు కూడా. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని సుమారు 100 మీటర్లు వేగంగా పరిగెడుతూ.. అదే సమయంలో మూడు వస్తువులతో గారడీ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆలస్యం కానిదే ఏది కాదేమో! ఓ వ్యక్తి ఆన్లైన్ ఆర్డర్ పెడితే..ఏకంగా..) -
ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే!
సాధారణంగా ఎన్నికల్లో నామినేషన్ అంటే చుట్టూ జనాలు, పదుల సంఖ్యలో వాహనాలు.. ఓ వేడుకను తలపిస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా 22 కి.మీ పరిగెత్తుకుంటూ వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు. అయితే తాను ఈ పద్ధతినే ఎంచుకోవడం వెనుక ఓ కారణముందని చెబుతున్నాడు. అదేంటంటే.. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల 2023 నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకే 22 కి.మీ పరగు డార్జిలింగ్ జిల్లాలోని సొనాడ గ్రామ పంచాయతీకి చెందిన తుమ్సోంగ్ ఖాస్మహల్ నివాసి అయిన సనారా సుబ్బా ఈ సారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాడు. ఇక డార్జిలింగ్‌లో కొండ ప్రాంతంలోని గ్రామంలో రోడ్లు కూడా సరిగా ఉండవు, ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు. ఈ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో 22 కిలోమీటర్లు పరిగెత్తుతూ బీడీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశాడు. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఈ విధంగా నిరసన తెలిపాడు. తన గ్రామంలోని రోడ్ల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని.. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, అతన్ని పర్వత సానువులలో అనేక కిలోమీటర్లు స్ట్రెచర్‌పై తీసుకెళ్లి అంబులెన్స్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. రోడ్లు లేకపోవడంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అతను అభిప్రాయపడ్డాడు. పర్యావరణ కాలుష్యం పర్వతాలను కూడా ప్రభావితం చేసిందని.. దీంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా పెరిగిందని తెలిపాడు.ట్రాఫిక్ జామ్‌తో కొండవాలు, పర్యాటకులు కూడా నానా అవస్థలు పడుతున్నారని.. అయితే రాజకీయ పార్టీలకు వాటి గురించి ఆలోచించే సమయం లేదని వాపోతున్నాడు. చదవండి: తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం -
కేన్సర్‌పై అవగాహన రన్
ఖైరతాబాద్: కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఆదివారం నెక్లెస్ రోడ్డులో సూరజ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వాక్ పర్ హోప్ పేరుతో 5కే రన్ నిర్వహించారు. ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్ వైద్యులు, బసవతారకం కేన్సర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా, కిమ్స్, నిమ్స్, అపోలో హాస్పిటల్స్ వైద్యులతో పాటు వివిధ విభాగాల ఉన్నత స్థాయి ఇంజనీరింగ్, సామాజిక వాదులు కుటుంబ సమేతంగా రోజు రోజుకు పెరుగుతున్న కేన్సర్‌కి ప్రధాన కారణం అవగాహన లేకపోవడమేనన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో కేన్సర్‌ను గుర్తించి సరైన చికిత్స అందిస్తే మహమ్మారి నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్లో డాక్టర్లు మధుసూదన్, డాక్టర్ విశాల్, డాక్టర్ పల్లవి, డాక్టర్ అశ్విని, సత్యనారాయణ, శ్యాంనాయక్, జగన్ యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ బీచ్‌రోడ్‌లో మారథాన్ (ఫొటోలు)
-
Rishi Sunak: ఓటమి భయంతో..
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై అధికార కన్జర్వేటివ్ పార్టీలో నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన అధినాయకత్వంలో తిరిగి గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో.. చట్ట సభ్యులంతా ఆందోళనతో గందరగోళానికి తెర తీస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందుతామనే ఆందోళనలో కూరుకుపోయారు కన్జర్వేటివ్ సభ్యులు చాలామంది. ఈ నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారట చాలామంది. అంతేకాదు.. మరికొందరైతే వేరే చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పావులు కదుపుతున్నట్లు సమాచారం. రిషి సునాక్ నేతృత్వంలో ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా కొద్ది మందిలోనే నెలకొన్నట్లు పార్టీ అంతర్గత సమావేశాలు, పోల్స్ ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాలపై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత స్పందిస్తూ.. బహుశా ఎంపీలు హెలికాప్టర్లలో తమ తమ నియోజకవర్గాలను వెతుక్కుంటే బావుంటేదేమో అంటూ చమత్కరించారు. 90వ దశకంలో టోనీ బ్లేయర్ నేతృత్వంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ.. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓడిపోకుండా ఉండేందుకు సురక్షితమైన స్థానాల్లో పోటీ కోసం చేసిన ప్రయత్నాలను చికెన్ రన్‌గా అభివర్ణించాయి. అంటే కోళ్లు పరిగెత్తినట్లు హడావుడిగా తమ తమ సురక్షిత స్థానాల కోసం ఎంపీలు పరుగులు పెట్టారని ఎద్దేవా చేసింది. అప్పటి నుంచి ఆ పదం అలా బ్రిటన్ రాజకీయాల్లో స్థిరపడిపోయింది. -
డల్లాస్‌లో నాట్స్ 5కే రన్/1కే ఫన్ వాక్
టెక్సాస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్ లో 5కే రన్/1కే ఫన్ వాక్, ఫుడ్ డ్రైవ్ లను నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా మన తెలుగువారిలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తోంది. ఇందులో వారిని భాగస్వాములను చేసేందుకు ఈ కార్యకమాన్ని 2014 నుంచి నిర్వహిస్తూ వస్తుంది. డల్లాస్-ఫోర్టువర్తు మెట్రో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికి పైగా ఈ రేసులో పాల్గొన్నారు. ఫిటెనెస్ కోసం పరుగులు పెట్టే వారంతా 5కె రన్లో పాల్గొంటే.. ఆరోగ్యం కోసం 1కే ఫన్‌లో సరదాగా నడస్తూ ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ పరుగు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రేస్ బిబ్స్ ను అందించడం జరిగింది. దీని ఆధారంగా వారు 5K రన్ పూర్తి చేయటానికి తీసుకున్న సమయం, వారి వయోపరిమితి ఆధారంగా తీసుకోవడంతో పాటు మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారిని విజేతలుకు పతకాలను అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల ఈ రన్ విజయవంతం కావడానికి తన వంతు సహకారం అందించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలను అందిస్తున్న అందరికి చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామినేని ధన్యవాదాలు తెలిపారు. స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్, ఫార్మ్ 2 కుక్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, ఏజ్నిక్స్ ఫార్మాస్యూటికల్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాల్వేషన్ ఆర్మీ కోసం నాట్స్ ఫుడ్ డ్రైవ్ నాట్స్ ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్ కూడా డల్లాస్ నాట్స్ విభాగం ఈ 5కే రన్‌తో పాటు నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్ కి కూడా మన తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. దీని ద్వారా విరాళంగా వచ్చిన ఆహారాన్ని డల్లాస్‌లోని స్థానిక సాల్వేషన్ ఆర్మీకి విరాళంగా అందించారు. డల్లాస్ టీం క్రీడా విభాగ నాయకులు గౌతం కాశిరెడ్డి, నాట్స్ డల్లాస్ చాప్టర్ కో-కోర్డినేటర్ రవి తాండ్ర, డల్లాస్ టీం సభ్యులు శ్రీథర్ న్యాలమడుగుల, రవీంద్ర చుండూరు, శ్రీనివాస్ ఉరవకొండ, త్రినాథ్ పెద్ది, యషిత, రేహాన్, సందీప్ తాతినేనితో పాటు ఇతర సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన రన్, ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా క్రీడా విభాగ సభ్యులకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
అమానుషం: నన్నే ఆపుతారా అంటూ... కారుతో తొక్కించి....
ఇటీవల కాలంలో పలువురు వ్యక్తులు చిన్నవాటికే విసుగుపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడోక వ్యక్తి కూడా చిన్న గొడవకే ఆగ్రహంతో చాలా దారుణంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని అలీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... ఒక వ్యక్తి ఎస్యూవీ కారుతో ఒక ఇరుకైన గల్లీ గుండా వెళ్తున్నాడు. అక్కడే తన ముందు ఉన్న ఒక బైకర్‌తో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే చుట్టుపక్కల వాళ్లు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఐతే కారు డ్రైవర్ మాత్రం కోపంతో యాక్సిలరేటర్ నొక్కి ఒక్కసారిగా ప్రజలపైకి దూసుకుని పోనిచ్చి... ఇక ఆగకుండా అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు. దీంతో ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే సదరు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో వైరల్ అవుతోంది. (చదవండి: ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు) -
భారీ ట్రాఫిక్ జామ్.. పేషెంట్ కోసం డాక్టర్ పరుగులు
వైరల్: ట్రాఫిక్ నరకం.. అది బెంగళూరు వాసులకు నిత్యానుభవం. మామూలు రోజుల్లోనే ఆ ఐటీ నగరంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఎదురు చూడాల్సిన పరిస్థితి. అందునా తాజాగా కురిసిన వర్షాలతో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అయితే అలాంటి పరిస్థితుల్లో.. తన పేషెంట్ కోసం పరుగులు తీసిన ఓ డాక్టర్‌ను ఇప్పుడంతా ‘శభాష్’ అని అభినందిస్తున్నారు. మణిపాల్ హాస్పిటల్లో పనిచేసే గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ గోవింద్ నందకుమార్ ఎప్పట్లాగే ఆస్పత్రికి బయలుదేరారు. ఒక మహిళకు గాల్‌బ్లాడర్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విపరీతంగా ట్రాఫిక్ ఉండటంతో ఆయన ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో ఏం చేయాలో ఆయనకు తోచలేదు. ఎంతకీ ట్రాఫిక్ తగ్గకపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చేసి కారు దిగి అవతలి రోడ్డుకు చేరుకున్నారు. గూగుల్ మ్యాప్‌లో చూసేసరికి ఆ దూరం 45 నిమిషాలు చూపించింది. అయితే ఆయన అలస్యం చేయకుండా.. పరుగున మూడు కిలోమీటర్లలో ఆస్పత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో సదరు మహిళను అనుకున్న సమయానికే డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. @BPACofficial @BSBommai @sarjapurblr @WFRising @blrcitytraffic sometimes better to run to work ! pic.twitter.com/6mdbLdUdi5 — Govind Nandakumar MD (@docgovind) September 10, 2022 తన కోసం పేషెంట్ వెయిట్ చేస్తున్నారన్న ఆలోచనతో ఇంకేం ఆలోచించకుండా ఆస్పత్రికి పరుగుతీశానని డాక్టర్ గోవింద్ నందకుమార్ చెప్తున్నారు. ‘‘కన్నింగ్‌హామ్ రోడ్డు నుంచి సర్జాపూర్‌లోని మణిపాల్ ఆసుపత్రికి చేరుకోవాల్సి వచ్చింది. భారీ వర్షాలు, నీటి ఎద్దడి కారణంగా ఆస్పత్రికి కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నా పేషెంట్లు సర్జరీ పూర్తయ్యే వరకు భోజనం చేయడానికి అనుమతించనందున, ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు వేచి ఉండే సమయాన్ని వృథా చేయకూడదనుకున్నాను. నాకు డ్రైవర్ ఉన్నాడు, కాబట్టి, నేను కారును వెనుక వదిలి వెళ్ళగలిగాను. నేను క్రమం తప్పకుండా జిమ్ చేయడం వల్ల నాకు పరుగెత్తడం ఈజీ అయ్యింది. నేను ఆసుపత్రికి మూడు కిలోమీటర్లు పరిగెత్తాను. శస్త్రచికిత్సకు సమయానికి చేరుకోగలిగాను. రోగులు, వారి కుటుంబాలు కూడా డాక్టర్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాయి. అయితే.. అంబులెన్స్‌లో ఉన్న రోగి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి? అంబులెన్స్ వెళ్లేందుకు కూడా స్థలం లేదు అని గోవింద్ తన వీడియోను కర్నాటక ముఖ్యమంత్రికి ట్విటర్లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం డాక్టర్ గోవింద్‌పై సోషల్ మీడియాలో ఈయన చర్యపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: 61 సార్లు గెలిచిన గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఆ పెద్దాయన -
ఢిల్లీ మహిళ ప్రపంచ రికార్డు... కాలినడకనే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా..
Golden Quadrilateral Run: ఇంతవరకు మనం ఎంతో మంది సాధించిన ప్రపంచ రికార్డుల గురించి విన్నాం. తమదైన నైపుణ్యం, ప్రతిభను కనబర్చి సాధించినవారు కొందరూ. మరికొంతమంది వినూత్న ఆవిష్కరణలతో రికార్డులు సృష్టించారు. అచ్చం అలాంటి కోవకు చెందిందే ఢిల్లీకి చెందిన ఈ మహిళ. వివరాల్లోకెళ్తే...ఢిల్లీకి చెందిన సుఫియా అనే అల్ట్రా రన్నర్ డిసెంబర్ 16, 2020న దేశ రాజధాని నుంచి తన పరుగును ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలను కలిపే జాతీయ రహదారుల నెట్వర్క్ అయిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ (బంగారు చతుర్భుజం)ని చుట్టి వచ్చింది ఈ 35 ఏళ్ల అథ్లెట్. ఆమె 6 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని సుమారు 110 రోజుల 23 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేసింది. నిజం చెప్పాలంటే ఇది అత్యంత సాహసోపేతమైన ప్రయాణం. ఆమె ఒక దశలో ప్రయాణాన్ని విరమించుకోవాలనుకుంది. అంతేకాదు ఆమెకు ఈ ప్రయాణంలో ఎన్నో గాయాలయ్యాయని అయినప్పటికీ తన లక్ష్యం పైన దృష్టి కేంద్రీకరించానని చెబుతోంది. తాను ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పరుగును తన భర్త మద్దతుతోనే పూర్తి చేయగలిగానని చెప్పింది. అంతేకాదు ఈ ప్రయాణంలో తనతో దాదాపు అన్ని నగరాల్లోని రన్నర్లు, సైక్లిస్టులు చేరారని తెలిపింది. ఈ ప్రయాణంలో తనకి కొంతమంది ప్రజలు ఆతిధ్యం ఇచ్చారని, ఒక్కోసారి రోడ్డు పక్కన షెల్టర్‌లోనే పడుకోవలసి వచ్చిందని చెపింది. ఈ మేరకు ఆదివారం ఆమె గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్న తర్వాత ఈ రికార్డును ధృవీకరించారు. అంతేకాదు ఆమె గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా పరిగెత్తిన మహిళగా (87 రోజులు, 2 గంటలు, 17 నిమిషాలు; ఏప్రిల్ 25-జూలై 21, 2019) - తన పేరుతో మరొక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం సుఫియా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, పూర్తి సమయం అల్ట్రా రన్నింగ్‌లో మునిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. It a Guinness World Records and It's Officially Amazing!!🏆🏆🏆 SUFIYA KHAN is Fastest female to run along The Indian Golden Quadrilateral Road (6002km in 110 days 23 hours) Congratulations Sufiya Khan!!💪💪💪🥇🥇🥇 🇮🇳🇮🇳🇮🇳#guinessworldrecord#girlpower #womenpowerment pic.twitter.com/w88kJIOBpP — Mohammad Mohsin I.A.S (@mmiask) March 28, 2022 (చదవండి: విచిత్రమైన ఫిర్యాదు...మోదీ ఫోటో తీసేయమని బెదిరింపులు) -
తాతనుకున్నారా.. తగ్గేదేలే..
ఈయన పేరు కత్తెరశాల కొము రయ్య.. ఊరు ఖిలా వరంగల్.. శనివారం హనుమకొండలో జరిగిన 5కే రన్లో పాల్గొని.. ఏకంగా బంగారు పతకమే సాధించారు. ఇంతకీ ఇతని వయసు ఎంత నుకున్నా రు.. జస్ట్ 95 ఏళ్లు. ‘ఉదయం 5గంటలకు నా నడక ప్రారంభి స్తాను. 25 ఏళ్ల నుంచీ ఇదే నా దిన చర్య. వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా. ఇప్పుడీ వయసులో సొంతగడ్డపై జరిగిన ఈ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది’ అని కొమురయ్య అన్నారు. – వరంగల్ స్పోర్ట్స్ -
‘రన్’ అదిరిందిగా!
-
ఈ పదాన్ని 645 విధాలుగా ఉపయోగిస్తారు!
Run అనే ఆంగ్లపదంలో ఉన్నవి మూడు అక్షరాలే. కాని ఇది మోస్ట్ కాంప్లికేటెడ్, మల్టీ ఫేస్డ్ వర్డ్‌గా పేరు మోసింది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ఎడిటర్స్ చెబుతున్నదాని ప్రకారం ‘రన్’ను రకరకాల సందర్భాలను బట్టి 645 విధాలుగా ఉపయోగిస్తున్నారు. ‘కాంటెక్ట్స్ ఈజ్ ఎవ్రీ థింగ్’ కదా మరి! 'రన్' అనే పదానికి తెలుగులో పరుగు అనే అర్థం ఉంది. ‘రన్’కు క్రియాపదం అయిన ‘రన్నింగ్’కు మాత్రం సందర్భానుసారం అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి ‘రన్’ ఇంగ్లీషు భాషను నడిపిస్తుందంటే అతిశయోక్తి కాదని భాషా నిపుణులు అంటున్నారు. (Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?) -
ఎన్ఎండీసీ కేన్సర్ రన్ 2021
-
Shocking: కాటేసిన పాముతో ఆసుపత్రికి పరుగు.. భయపడిపోయిన వైద్యులు..
సాక్షి, కంప్లి(కర్ణాటక) : మెట్రి పంచాయతీ పరిధిలోని ఉప్పారహళ్లి గ్రామంలో కాడప్ప అనే యువకుడికి ఆదివారం నాగుపాము కాటేసింది. దీంతో కంగారు పడకుండా కాడప్ప చాకచక్యంగా పామును పట్టుకుని మెట్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఓ యువకుడి సాయంతో ద్విచక్ర వాహనంలో కంప్లి ఆస్పత్రికి చేరుకున్నాడు. పాము చేతపట్టుకుని ఆస్పత్రికి వస్తున్న కాడప్పను చూసి ఆస్పత్రికి వచ్చిన వారు భయపడ్డారు. వైద్యులు హుటాహుటిన ప్రాథమిక చికిత్స చేసి బళ్లారి విమ్స్‌కు తరలించారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
కాల్పుల కలకలం: ఎమ్మెల్యే పరుగో పరుగు
గౌహతి: తుపాకుల మోతతో భీతిల్లిన ఓ ఎమ్మెల్యే, ఆయన సిబ్బంది పరుగులు అందుకున్న ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. నాగాలాండ్‌తో సరిహద్దుగా ఉన్న జోర్హాట్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇది జరిగింది. అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి, ఆయన భద్రతా సిబ్బంది అక్రమ పనులను పర్యవేక్షిస్తుండగా ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినిపించింది. దీంతో ఎమ్మెల్యే పరుగులు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అస్సాం జిల్లాలైన చారిడియో, శివసాగర్, జోర్హాట్, గోలఘాట్, కర్బి అంగ్లాంగ్లు నాగాలాండ్‌తో సరిహద్దును కలిగివున్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాల్లో నాగాలాండ్ దురాక్రమణలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరియాని ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి తన సిబ్బంది, కొందరు మీడియా ప్రతినిధులతో దేసో వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్‌కు వెళ్లారు. అక్కడి ఆక్రమణలను పరిశీలిస్తున్న టైంలోనే తుపాకుల మోత వినిపించింది. తనను టార్గెట్ చేసే ఆ కాల్పులు జరిగాయని కుర్మి తెలిపారు. అయితే అదృష్టవశాత్తు తామంతా కాల్పుల నుంచి తప్పించుకున్నామని, సమస్యను పరిష్కరించేందుకు అస్సాం ప్రభుత్వం నాగాలాండ్ సర్కారుతో మాట్లాడటం లేదని కుర్మి ఆరోపించారు. కాగా, ఈ కాల్పుల్లు ముగ్గురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అస్సాం సీఎం స్పందన ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. వెంటనే అక్కడి పరిస్థితులపై పరిశీలించాలని సీనియర్ పోలీసు అధికారి జీపీ సింగ్‌ను ఆదేశించారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. నాగాలాండ్ భూభాగం నుంచే కాల్పులు జరిగినట్లు తెలుస్తోందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 తిరుపతిలో 5కె రన్
-
స్వచ్ఛ భారత్ కోసం రిలయన్స్ మెగా ప్లాగింగ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ను చెత్తరహిత దేశంగా మార్చేందుకు రిలయన్స్ కు చెందిన ఆర్ ఎలాన్ (ఫ్యాబ్రిక్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ) చేపట్టిన రన్ విజయవంతం అయింది. భారతదేశపు మొదటి ప్లాగర్ రిపు దామన్ భాగస్వామ్యంతో అటు పర్యావరణ పరిరక్షణ ఇటు ఫిట్నెస్ను సాధించే ఉమ్మడి లక్ష్యంతో చేపట్టిన ప్లాగింగ్ రన్‌ను గురువారం విజయవంతంగా ముగించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ గ్రాండ్‌ఫినాలేకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు కూడా హజరయ్యారు. 50 నగరాల ప్రజలు ఈ రన్లో పాల్గొన్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఆర్ఎలాన్ సంస్థ వెల్లడించింది. ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించేందుకు సెప్టెంబర్ 5న కొచ్చిలో ప్రారంభమైన ఈ రన్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పూర్తి అయిందని, ఈ సందర్భంగా తమకు ఘనస్వాగతం లభించిందని తెలిపింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా తదితర 50 నగరాల్లో సుమారు 1000 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ మెగా రన్లో సుమారు 2.7 టన్నుల ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. ‘రన్ టు మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ' కార్యక్రమంపై ప్లాగర్ దామన్ స్పందిస్తూ ఇది డ్రీమ్ రన్ అని పేర్కొన్నారు. తమ ప్రయత్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత క్రీడా అథారిటీ గుర్తించడం గర్వంగా ఉందని దామన్ అన్నారు. ఆర్ఐఎల్ పాలిస్టర్ బిజినెస్ సీఈవో గుంజన్ శర్మ మాట్లాడుతూ ఈ ప్లాగింగ్ రన్ దేశవ్యాప్తంగా లభించిన ఆదరణ తమకెంతో సంతోషానిచ్చిం దన్నారు. పర్యావరణంపై అవగాహనతోపాటు, పౌరులలో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పెంపొందింస్తామన్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్‌తో అద్భుతమైన దుస్తులను తయారుచేస్తామని వెల్లడించారు. కాగా రి లయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్ అద్భుతమైన వస్త్రాలను తయారు చేస్తుంది. ప్లాంట్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ లోని ప్లాంట్ ద్వారా ప్రతి ఏటా ఈ యూనిట్ 2.5 బిలియన్ పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేస్తుంది. దీన్ని పర్యావరణహితమైన గ్రీన్ గోల్డ్ ఫైబర్‌గా మారుస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ గ్లామర్ ఎంతో స్పెషల్
సాక్షి,సిటీబ్యూరో:ర్యాంప్‌పై మెరుపులు మెరిపిస్తుంది. మంచి మనసుతోనూ మురిపిస్తుంది. మంచిని పంచేందుకు ముందుంటుంది. సిటీ మోడల్ చందనా ప్రేమ్... సేవాలంటీర్‌గా సామాజిక కార్యక్రమాల్లో తన ఆలోచనల్ని పంచుకుంటోంది. కిడ్స్– మామ్స్ ఫ్యాషన్ రన్ వే 29న ఆ చిన్నారుల కోసం ఏమైనా పెద్ద సాయం చేయాలనే ఆలోచనతో నాకు పరిచయం ఉన్న ర్యాంప్‌ను వేదిక చేసుకున్నాను. అలా కిడ్స్ అండ్ మామ్ ఫ్యాషన్ రన్ వే కార్యక్రమం రూపుదిద్దుకుంది. దీనిలో భాగంగా స్పెషల్ చిన్నారుల డ్యాన్స్, లైవ్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్, తల్లులూ, పిల్లల ర్యాంప్ వాక్, స్పెషల్ చిల్డ్రన్ ర్యాంప్‌వాక్...వంటివి ఉంటాయి. ఈ నెల 29న కొండాపూర్‌లోని హార్ట్ కప్ కఫేలో దీన్ని నిర్వహిస్తున్నాం. ఇదో స్పెషల్ ప్రోగ్రామ్... ఐటి ఉద్యోగినిగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కాని చందనా ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ చాలా ప్రత్యేకమైనది. స్పెషల్ చిల్డ్రన్ గురించి ఎంత చేసినా తక్కువే. ఈ ఈవెంట్ సక్సెస్ అవడం అంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ గెలిచినట్టే. – సంగీత మోడలింగ్ ప్రొఫెషనల్‌లో బిజీగా ఉంటూనే లైఫ్‌స్కిల్స్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాను..కొంతకాలంగా సోషల్ యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యాను. అందులో భాగంగా శ్రీవిద్య సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ హోమ్‌కి వెళ్లాను. ఆ సెంటర్ తొలుత 8 మందితో మొదలై ఇప్పుడు 160 మంది íస్పెషల్ చిల్డ్రన్కు ఆశ్రయం ఇస్తోంది. అమాయకమైన పిల్లలను చూస్తుంటే బాధ, వాళ్ల గురించి ఏమైనా చేయాలనిపించింది. వీలున్నప్పుడల్లా స్నేహితురాలు సంగీతతో అక్కడికి వెళ్లొచ్చేదాన్ని. అక్కడి చిన్నారుల్లో ప్రతిభ ఉంది. దానికి వెలుగునిచ్చి, అదే చేత్తో వారికి కావాల్సిన అత్యాధునిక వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని అనుకున్నా. -
సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే..
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే రన్నింగ్ మారథాన్లు కేవలం క్రీడాకారులకే కాదు, పరుగంటే ఆసక్తి ఉన్నవారందరికీ పండుగ లాంటివి. ఆరోగ్యం కోసం ప్రారంభించిన పరుగు నుంచి స్ఫూర్తి పొంది ఏకంగా ఎవరెస్టును అధిరోహించారు రొమెల్ బర్త్వాల్. మారథాన్ రన్నర్ రోమిల్ బర్త్వాల్ ‘నేను ఢిల్లీ వాసినైనా..హైదరాబాద్ అంటే ఇష్టం. నా మారథాన్ విజయాలకు ఇక్కడే బీజం పడింది. మొదట హైదరాబాద్ రన్నర్ క్లబ్లో చేరాను. చేరిన మొదటి రోజునుంచే ఈ క్లబ్ వాళ్లు రిసీవ్ చేసుకున్న తీరు, వాళ్లు ఒక బిగినర్‌కి ఇచ్చే సలహాలు, సమాచారం ఎక్సలెంట్. నేను మొదటిసారి పీపుల్స్ ప్లాజాలో, తర్వాత సీబీఐటీ రన్లో పాల్గొన్నాను. అలా నా పరుగుల పరంపర మొదలైంది. చివరకు ఎవరెస్ట్ కూడా అధిరోహించాను. ఈ విజయాలకు నాంది హైదరాబాద్ కావడం నా అదృష్టం.’ అంటూ తన విజయగాథను వివరించారు ప్రముఖ మారథాన్ రన్నర్ రోమిల్ బర్త్వాల్. సాక్షి, హైదరాబాద్: రొమెల్ బర్త్వాల్ ఢిల్లీవాసి. ఉద్యోగం రీత్యా ప్రభుత్వ అధికారి. ఎన్నో మారథాన్లలో పాల్గొన్నారు. వీటి నుంచి స్ఫూర్తిని పొంది ఈ ఏడాది మేలో ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. బోస్టన్ మారథాన్, లేహ్ 111 కి.మీ. లాల్ట్రా 14 గంటల రికార్డును ఆయన నెలకొల్పారు. ఢిల్లీ స్టేడియంలో 24 గంటల పరుగు పోటీలో పాల్గొని 185 కి.మీలు పరిగెత్తి రెండో స్థానంలో నిలిచాడు. వీటితో పాటు వాటర్ రాఫ్టింగ్, బంజీ జంపింగ్, పారాగ్లైడింగ్, పారామోటార్స్ వంటి మరెన్నో సాహసయాత్రలు, రికార్డులు ఆయన సొంతం. ఏడవది ఈజ్ నాట్ ఈజీ.. రొమిల్ బర్త్వాల్ ఏడు పర్వతాలను అధిరోహించారు. అందులో ఏడవది మౌంట్ ఎవరెస్ట్. ఎటువంటి గాయాలు లేకుండా ఎవరెస్టు యాత్ర పూర్తి చేసుకున్న అరుదైన రికార్డుని రొమిల్ టీం సొంతం చేసుకుంది. ఏడాది పాటు కఠిన శిక్షణతోనే ఇది సాధ్యమైంని చెబుతారు రొమిల్. సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే.. అనేక రికార్డులు సొంతం చేసుకున్న రొమెల్ సాహస యాత్ర హైదరాబాద్‌లోనే మొదలైంది. ఇక్కడ ఐఐటీలో చదివేప్పుడు మారథాన్లపై ఆసక్తిని పెంచుకున్నా రు. ‘‘2012లో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు నా కల నిజమయ్యే అవకాశం కలిగింది. ఈ సిటీ నా ఫేవరెట్. హైదారాబాద్ రన్నర్ క్లబ్లో చేరాను. చేరిన మొదటిరోజు నుంచే ఈ క్లబ్ రిసీవ్ చేసుకున్న తీరు వాళ్లు ఒక బిగినర్‌కి ఇచ్చే సలహాలు, సమాచారం, చాలా మరిచిపోలేను’’ అని భావోద్వేగాని గురయ్యారు. పరుగు.. ఒక వ్యసనం మొదటి సారి పీపుల్స్ ప్లాజాలో, తర్వాత సీబీఐటీ రన్లలో పాల్గొన్నాను. ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు ప్రతి రోజూ చూసేవాడిని. అంతగా ఈ పరుగులలో పాల్గొనడానికి అడిక్ట్ అయిపోయాను. హైదరాబాద్ హెరిటేజ్ వాక్, హాఫ్ మారథాన్ (21 కి.మీ)కి ముందు చెయ్యగలనా లేదా అని సంశయించాను. కానీ ఇక్కడ ఆర్గనైజర్స్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. అలా ప్రారంభమైన పరుగుల పరంపర ఒక వ్యసనంలా మారింది ఎవరెస్ట్ అధిరోహణ అసాధ్యమేమీ కాదు.. ఉద్యోగం, చదువు పేరుతో బిజీగా ఉన్న వాళ్లు ఒక్క రోజులో ఫుల్ మారథాన్ పరిగెత్తడం, ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు. కానీ ప్రయత్నిస్తే తప్పకుండా సాధించగలరు. 2 కి.మీ. నడక నుంచి ప్రారంభించి, 5, 10 కి.మీ. పరుగుకు చేరుకోవచ్చు. 5 కి.మీలు నటక, పరుగు నుంచి ప్రారంభించటం వల్ల శారీరక స్థితి మెరుగవుతుంది. తర్వాత చిన్న చిన్న ట్రెక్కింగ్‌ను ప్రారంభించవచ్చు. ఆ తర్వాత తక్కువ ఎత్తున్న పర్వతాలను ఎక్కుతూ, ఎవరెస్ట్ అధిరోహణ శిక్షణ తీసుకోవడానికి సిద్ధం కావచ్చు. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్‌ను మరువలేను 2012 నుంచి క్లబ్లో మెంబర్‌గా ఉన్నాను. ఇక్కడి మారథాన్లలో నాలుగు సార్లు పాల్గొన్నాను. నేను పాల్గొన్న క్లబ్లన్నింటి కంటే హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ చాలా ప్రత్యేకం. ఇక్కడ చాలా దేశాల్లో మారథాన్‌లో పాల్గొన్న రన్నర్లు ఉన్నారు. వీరు చాలా ఈవెంట్ల గురించి వివరాలు తెలియజేస్తారు. సలహాలిస్తారు. ఇక వేరే నగరాల్లో ఇలాంటి గ్రూప్‌లు ఏర్పాటు అయి కొంతకాలానికి కనుమరుగవుతుంటాయి. ఈ గ్రూప్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. డిసిప్లిన్, హెల్ప్ఫుల్నెస్ హైదరాబాద్‌లో చాలా బాగుంటుంది. 2015లో నగరం వదిలినా ఈ క్లబ్‌ని, ఇక్కడి మిత్రులను కలవడం మాత్రం మానలేదు. -
17న ‘వీఆర్–1’ రన్
సాక్షి, సిటీబ్యూరో: ‘మహిళల భద్రత మన అందరి బాధ్యత’ అనే నినాదంతో హైదరాబాద్ షీ టీమ్స్ నిర్వహించ తలపెట్టిన ‘వీఆర్–1’ రన్ ఈనెల 17న ఆదివారం పీపుల్స్ ప్లాజా కేంద్రంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ షీ టీమ్స్ ఇంచార్జ్, అదనపు పోలీసు కమిషనర్ శిఖా గోయెల్ గురువారం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మహిళ భద్రతలో సిటీ పోలీసులు షీ టీమ్స్ తీసుకుంటున్న చర్యలతో దేశంలోనే హైదరాబాద్‌కు మహిళలకు రక్షణలో సురక్షితమైన నగరంగా గుర్తింపు వచ్చిందన్నారు. షీ టీమ్స్ 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వీఆర్–1 రన్‌తో మహిళల భద్రత మన అందరి బాధ్యత అని గుర్తుచేయడంతో పాటు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నగర వాసులు ఈ రన్లో పాల్గొనేందుకు భరోసా కేంద్రం, ఆన్లైన్లో శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు నెక్లెస్ రోడ్డులో రన్‌ను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి రేసు కిట్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు సినీ నటులు, సెలబ్రిటీలు పాల్గొంటారన్నారు. -
బాలికా.. నువ్వే ఏలిక
గచ్చిబౌలి: సేవా భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ పేరిట నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. కార్యకమాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల వికాసానికి తోడ్పాటు అందిస్తూ సేవా భారతి ప్రపంచానికి మంచి సందేశాన్ని అందిస్తోందని కితాబిచ్చారు. ‘బేటీ బచావో..బేటీ పడావో’ నినాదంతో ప్రదాని నరేంద్ర మోదీ బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నారని, స్త్రీ, పురుషుల మధ్యనున్న వ్యత్యాసాలను తగ్గించేందుకు సమాజంలో మరింత చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో 185 కిశోర్ వికాస్ కేంద్రాల ద్వారా బాలికలకు విద్య, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తోందన్నారు. తాను పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళతానని, పర్యావరణ పరిరక్షణకు అందరు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం రన్లో విజేతలకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్, జయేష్ రంజన్లు బహుమతులు ప్రదానం చేశారు. ఉత్సాహంగా రన్.. 10కే రన్‌ను సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ పి.అప్పారావు ప్రారంభించారు. 21కే రన్‌ను ఏఓసీ సెంటర్ కమాండెంట్, బ్రిగేడియర్ జేజేఎస్ బిందర్, ప్రముఖ జిమ్నాస్ట్ మేఘనారెడ్డి ప్రారంభించారు. రన్లో 400 మంది సైనికులతో పాటు వివిధ ఐటీ కంపెనీలకు చెందిన 8 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర కోసం రైతు పరుగుయాత్ర
హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు ఆత్మహత్యలను అరికట్టాలని కోరుతూ ఓ రైతుబిడ్డ చేపట్టిన రైతు పరుగుయాత్ర శనివారం ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో కనువిప్పు కలగాలని ఫణి అనే యువకుడు హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ నుంచి అమరావతిలోని ఏపీ అసెంబ్లీ వరకు ఈ యాత్ర చేపట్టాడు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ వనస్థలిపురం దగ్గర ఫణికి స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇవ్వడంలేదని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేవిధంగా ఫణి రైతు పరుగుయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఎస్పీ మీనయ్య, తెలంగాణ ప్రజల పార్టీ యువజన విభాగం నాయకులు కోట్ల వాసు తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ టు అసెంబ్లీ నిరసన పరుగు
సాక్షి, హైదరాబాద్: అన్నదాతకు మద్దతుగా ఓ రైతుబిడ్డ వినూత్న నిరసనకు సమాయత్తమవుతున్నాడు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ పరుగుకు శ్రీకారం చుట్టాడు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని అసెంబ్లీ నుంచి పరుగు మొదలు పెట్టనున్నాడు. ఇది ఈ నెల 19న అమరావతిలోని ఏపీ అసెంబ్లీ వద్ద ముగియనుంది. గిట్టుబాటు ధర కల్పించాలన్న లక్ష్యంతో పరుగు చేపట్టనున్నట్లు వెంకట ఫణీంద్రకుమార్ అనే యువకుడు ‘సాక్షి’కి తెలిపారు. కృష్ణా జిల్లా అప్పికట్లకు చెందిన ఫణీంద్ర గుడివాడలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్ఆర్బీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ సంస్థలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి నాగరాజు కౌలురైతు. గిట్టుబాటు ధర దక్కక ఏటా తన తండ్రి దిగాలు చెందేవాడని, 26 ఏళ్లుగా అదే పరిస్థితి అని పేర్కొన్నాడు. పంటలు బాగున్నప్పుడు ధరలు పతనమవుతున్నాయని, పంటలు బాగాలేనప్పుడు ధరలు పెరిగిపోతున్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కాలం బాగుందని అప్పు చేసి పత్తి, మినుములు, మిర్చి వంటి వాణిజ్య పంటలను రైతులు సాగుచేస్తున్నారు, తీరా పంటలు చేతికి అందే సమ యంలో దిమ్మతిరిగేలా ధరలు పడిపోతున్నాయి. దీంతో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు’అని పేర్కొన్నాడు. తన పరుగుతో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కనువిప్పు కలిగి అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాడు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశాడు. -
ఆదా చేస్తేనే అనుమతి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వాణిజ్య భవనాలు నిర్మించాలనుకునేవారు ఇకపై విధిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ)ను అనుసరించాల్సిందే. లేని పక్షంలో అనుమతులివ్వరు. ప్లాట్ ఏరియా వెయ్యి చదరపు మీటర్లకు మించిన.. లేదా బిల్టప్ ఏరియా 2 వేల చదరపు మీటర్లకు మించిన వాణిజ్య భవనాలకు దీనిని జీహెచ్ఎంసీ తప్పనిసరి చేసింది. ఈసీబీసీని తప్పనిసరి చేస్తూ అనుమతులివ్వడం దేశంలో ఇదే తొలిసారి. ఈసీబీసీకి మూడేళ్ల క్రితమే చట్టం చేసినా.. ఏ రాష్ట్రం ఇంతవరకు దీన్ని అమలు చేయడం లేదు. దీన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీయే కానుంది. జనవరి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. విద్యుత్ వినియోగం పెరగడంతో.. విద్యుత్ వినియోగం భారీస్థాయిలో పెరుగుతుండటంతో ఇంధన పొదుపు కీలకంగా మారింది. వాణిజ్య భవనాలకు వర్తించే ఈ నిబంధన ఫ్యాక్టరీలు, నివాస సముదాయాలకు వర్తించదు. హాస్పిటళ్లు, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు మొదలైనవి రెండు వేల చదరపు మీటర్ల లోపున ఉన్నా ఈసీబీసీని పాటించాల్సిందే. దీని వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్(ఎన్ఆర్డీసీ) సహకారంతో దీని అమలుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఈసీబీసీ వల్ల విద్యుత్ ఆదాతోపాటు వాతావరణ మార్పు సమస్యల్ని ఎదుర్కొనేందుకూ ఉపయుక్తంగా ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసీబీసీ అమలు చేస్తే.. ► గోడలు, రూఫ్‌లు, కిటికీలు వంటి వాటిని దీనికి లోబడి నిర్మించాలి. ► విద్యుత్ లైట్లు ఎన్ని పడితే అన్ని వాడటానికి వీల్లేదు. ఎంత విస్తీర్ణం గదికి ఎన్ని వాట్ల విద్యుత్ వాడాలనే నిబంధనలు పాటించాలి. ► ఎయిర్ కండిషనింగ్ కూడా పరిమిత స్థాయిలోనే ఉండాలి. ► ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, వాటర్‌పంప్ సిస్టం తదితరమైనవి సూపర్ ఎఫీషియెంట్‌గా ఉండాలి. ► హోటళ్లు, హాస్టళ్ల వంటి వాటిల్లో నీటిని వేడిచేసేందుకు 60 శాతం వరకు సోలార్ పవర్‌ను వినియోగించాలి. ► ఈసీబీసీ అమలుతో విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. సహజసిద్ధమైన వెంటిలేషన్ ఉంటుంది. సదరు కార్యాలయాల్లో పనిచేసే వారి ఆరోగ్యానికి అది మేలు చేస్తుంది. కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరుగుతుంది ఈసీబీసీ వల్ల విద్యుత్ వ్యయం తగ్గడమే కాక, సదరు భవనాల్లోని ఉద్యోగులకు సహజసిద్ధమైన గాలి, వెలుతురు అందే వీలుంది. తద్వారా వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి సదుపాయాలున్న చోట కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుంది. – ప్రొఫెసర్ రాజ్‌కిరణ్, ఆస్కి మొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఈసీబీసీని అమలు చేయనున్న మొదటి రాష్ట్రం తెలంగాణ.. మొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కానున్నాయి. భవనాల డిజైన్‌ను ఆమోదించేందుకు నిపుణుల ఎంప్యానెల్ ఉంటుంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల్ని డెవలప్మెంట్ పర్మిషన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఆన్లైన్లో జారీ చేస్తున్నాం. ఈసీబీసీ అమలుకు సాఫ్ట్‌వేర్‌ను తగినవిధంగా రూపొందించాం. – ఎస్.దేవేందర్‌రెడ్డి, చీఫ్ సిటీప్లానర్, జీహెచ్ఎంసీ -
23న ఒలింపిక్ రన్
- 24 ప్రాంతాల్లో నిర్వహణకు ఏర్పాట్లు భానుగుడి (కాకినాడ) : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న జిల్లాలోని 24 ప్రాంతాల్లో ఒలింపిక్ రన్ నిర్వహించనున్నట్లు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ పి.చిరంజీవినికుమారి తెలిపారు. ఐడియల్ డిగ్రీ కళాశాల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె ఈ వివరాలు తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, గొల్లవిల్లి, రాజోలు, రామచంద్రపురం, తుని, సామర్లకోట, పిఠాపురం, జగ్గంపేట, కిర్లంపూడి, దివిలి, అంబాజీపేట, మల్కిపురం, మండపేట, పెద్దాపురం, తాళ్ళరేవు, తాటిపాక, అన్నవరం, పెదపూడి, కాండ్రకోట, ర్యాలి, మామిడికుదురు, సఖినేటిపల్లి కేంద్రాల్లో ఆ రోజు ఈ ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జూన్ 20 నుంచి 22వ తేదీ వరకూ ఈ రన్ నిర్వహిస్తారని, జిల్లాలో 23న నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. రన్లో పాల్గొన్న అందరికీ ప్రశాంసా పత్రాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఒలింపిక్ రన్ బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోషియేషన్ ఇన్‌ఛార్జి కార్యదర్శి వి.రవిరాజు, అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన రికార్డు సాధించిన తెలంగాణ 'చిరుత' !
-
శుభ్రత కోసం పరుగు
కర్నూలు(హాస్పిటల్): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనాన్ని కాపాడాలన్న నినాదంతో ఎన్సీసీ కేడెట్లు శనివారం కర్నూలు నగరంలో పరుగు తీశారు. 68వ ఎన్సీసీ డే ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్ వద్ద ' గో గ్రీన్ గో క్లీన్' పేరుతో టు కే రన్ కార్యక్రమాన్ని కర్నూలు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ ప్రారంభించారు. పరుగు కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో 300 మంది ఎన్సీసీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఎన్‌సీసీతో క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని, ప్రతి విద్యార్థి ఎన్సీసీలో పాల్గొనాలని సూచించారు. అనంతరం ఆయన వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన ఎన్సీసీ కేడెట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ గౌస్‌బేగ్, ఎస్కే సింగ్, మధు, ఎన్సీసీ అధికారి పివి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేయింబవళ్లు ఏటీఎంల దగ్గరే..
-
ఉప్పు కోసం పరుగులు
-
సచిన్ పరుగు 353 కిలోమీటర్లు
రెండున్నర దశాబ్దాల క్రికెట్ కెరీర్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 353 కి.మీ.పరిగెత్తాడట. సచిన్ చేసిన పరుగులలో బౌండరీలు, సిక్సర్లను మినహాయి0చి కేవలం పరుగు తీసిన దూరాన్ని లెక్కించారు. ఇవన్నీ కేవలం మ్యాచ్‌లలో మాత్రమే. ప్రాక్టీస్‌లో ఇతరత్రా చేసిన పరుగు దీనికి అదనం. శిక్షణ, ఆట ఏదైనా ప్రతి రోజూ కనీసం 12 గంటల పాటు కష్టపడేవాడినని మాస్టర్ తెలిపాడు. -
హార్సిలీహిల్స్‌లో 2 కె రన్
హార్సిలీహిల్స్‌లో 2 కె రన్ బి.కొత్తకోట: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పర్యాట కేం ద్రం హార్సిలీహిల్స్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టూరి జం మేనేజర్ మురళి ఆధ్వర్యంలో టూరిజం, రెవెన్యూ, అటవీ, రైల్వే, పోలీసుశాఖలకు చెందిన అధికారు లు, సిబ్బంది 2కె రన్లో పాల్గొన్నా రు. గవర్నర్ బంగ్లా ప్రవేశ ద్వారం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వశాఖకు చెంది న సిబ్బంది, అధికారులతో ప్రైవేటు హోటళ్లు, అతిథి గృహాల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జాతీయ క్రీడాదినోత్సవ రన్
శ్రీకాకుళం న్యూకాలనీ: మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించిన జాతీయ క్రీడా రన్ ఆద్యాంతం కోలాహలంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కలెక్టర్ లక్ష్మీనరసింహంలు అంతర్జాతీయ క్రీడాకారిణిలు శాంతి(అథ్లెటిక్స్), లిఖిత(బాక్సింగ్)తో కలిసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పాతబస్టాండ్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు జంక్షన్ నుంచి కళింగారోడ్, వైఎస్సాఆర్ సర్కిల్, పాలకొండ రోడ్ మీదుగా అంబేడ్కర్ జంక్షన్‌వరకు ర్యాలీ సాగింది. అనంతరం పశుసంవర్ధకశాఖ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్, డీఎస్డీఓ, పీఈటీలు, తదితరులు మొక్కలునాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఉదయం 6.30 గంటలకు పొట్టిశ్రీరాములు జంక్షన్ వద్ద రోడ్డుపై వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బాక్సింగ్, తైక్వాండో, బాస్కెట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్ క్రీడాకారులు విన్యాసానాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో శాప్ మానటరింగ్ అధికారి సూర్యారావు, డీఎస్డీవో బి.శ్రీనివాస్‌కుమార్, డీఎస్ఏ కోచ్‌లు సాయిప్రసాద్, అప్పలనాయుడు, జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు, ఉపాధ్యాక్షులు ఎండి కాసీంఖాన్, జి.ఇందిరాప్రసాద్, పాపయ్య మాస్టారు, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షులు ఎం.వి.రమణ, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా జిల్లాకు చెందిన క్రీడల మంత్రి అచ్చెన్నాయుడు స్థానికంగా ఉన్నప్పటికీ జాతీయ క్రీడోత్సవ రన్‌కు మొహం చాటేయడాన్ని పలువురు తప్పుబట్టారు. -
కొన్ని సవరణల తర్వాత మాత్రమే టాల్గో రన్
న్యూఢిల్లీ: స్పానిష్ టాల్గో రైలు ట్రయిల్ రన్ విజయవంతమైందని రైల్వే శాఖ బుధవారం ప్రకటించింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే స్పెయిన్ రూపొందించిన హైస్పీడ్ టాల్గో ట్రెయిన్ కొన్ని స్వల్ప మార్పులతో తన సేవలను ప్రారంభించనుందని రైల్వే శాఖ తెలిపింది. కొన్ని సవరణల తర్వాత , ఆపరేషనల్ బేసిస్ గా టాల్గో సర్వీసులు అందుబాటులో ఉంచనున్నట్టు రైల్వే రోలింగ్ స్టాక్ సభ్యుడు హేమంత్ కుమార్ చెప్పారు. టాల్గో ట్రయిల్ రన్ విజయవంతమైనప్పటికీ తక్కువ వెడల్పు, ఎత్తు తక్కువ ఉన్న ఫూట్ బోర్డ్ తదితర అంశాల కారణంగా భారత రైల్వే సేవల్లో ఇపుడే చేరదని చెప్పారు. ముంబై ఢిల్లీ మధ్య గంటకు 150 కి.మీ వేగాన్ని అధిగమించే ట్రయిల్ రన్స్ నిర్వహిస్తున్నామని, ఫైనల్ రన్ ఆగస్ట్ 14 న ఉంటుందని చెప్పారు. తాజాగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ఢిల్లీ నుంచి ముంబైకి 1389 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల పది నిమిషాల్లో చేరుకుంది టాల్గో. ఇది రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే 3 గంటల 40 నిమిషాల సమయం తక్కువగా తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ మధ్య వేగవంతమైన రైలుగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ దూరాన్ని చేరుకోవడానికి 15 గంటల 50 నిమిషాల సమయం తీసుకుంటోంది. అయితే మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన టాల్గో రైలు బుధవారం తెల్లవారుఝామున 2.55 గంటలకు ముంబై చేరుకున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీ మధ్య ప్రయాణ సమయాన్ని 12 గంటలకే పరిమితం చేయాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు భావిస్తున్నారు. గతవారం అత్యధికంగా 130కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న టాల్గో.. ఇదే దూరాన్ని 12 గంటల 50 నిమిషాల్లో చేరుకుంది. కాగా మే 29 నుంచి ఈ రైలు ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. తొలి టాల్గో ట్రయల్ రన్ యూపీలోని బరేలి-మొరదాబాద్‌ల మధ్య గంటకు 115 కి.మీ వేగంతో జరగ్గా, పల్వాల్-మధుర మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. -
పట్టలెక్కనున్న మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్
-
మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ధర్నా
సూర్యాపేట మున్సిపాలిటీ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట బుధవారం ధర్నా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని విద్యార్థులు, సంఘం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ సూర్యాపేట డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పోలెబోయిన కిరణ్‌కుమార్, వీరబోయిన లింగయ్య పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఉదయ్, ప్రవీణ్, సతీష్, నవీన్, రాఘవేంద్ర, కల్పన, భార్గవి, స్వాతి, ఫాతిమా పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ పరుగులో 385 మందికి అర్హత
పోలీస్ కానిస్టేబుల్ నియామకం కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 800 మీటర్ల పరుగులో 385 మంది అర్హత సాధించారని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. తప్పనిసరి అర్హత సాధించాల్సిన 800 మీటర్ల పరుగు కోసం పురుష అభ్యర్థులు 558 మందికి హాజరు కాగా 328 మంది, మహిళా విభాగంలో 73 మంది అభ్యర్థులు హాజరు కాగా 57 మంది అర్హులయ్యారని పేర్కొన్నారు. వీరు అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు. వీరికి ధృవపత్రాల పరిశీలన, ఎత్తు, ఛాతి కొలతలు, బరువు, 100 మీటర్ల పరుగు, హై, లాంగ్ జంప్ తదితర ఈ వెంట్లు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా అదనపు ఎస్పీ వెంకన్న, సీఐలు శ్యామల వెంకటేశ్, శ్రీనివాసనాయుడు, లింగేశ్వర్, ఎస్సైలు రవీందర్‌రెడ్డి, నాగేశ్వర్రావు, మధు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది. -
డ్రైవర్ లేకుండా నడిచిన రాజధాని ఎక్స్ ప్రెస్!
మజ్ గావ్-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ కు సోమవారం భారీ ప్రమాదం తప్పింది. ఇంజన్ లో ఏదో లోపం తలెత్తడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర లోకో పైలట్ ఆపరేట్ చేయకుండా నడిచినట్లు సమాచారం. రత్నగిరి రైల్వే స్టేషన్ కు దగ్గరలోని ఓ సొరంగంలో సాయంత్రం 5.50 నిమిషాల సమయంలో ప్రయాణిస్తున్న రైలు ఇంజిన్ లో లోపం తలెత్తింది. దీంతో లోకో పైలట్ రైలును అక్కడికక్కడే నిలిపివేశాడు. రైల్వే టెక్నీషియన్లు లోపాన్ని సరిచేస్తున్న సమయంలో లోకో పైలట్ గార్డు క్యాబిన్ లోకి వెళ్లాడు. లోపాన్ని సరిదిద్దడం పూర్తికాక ముందే రైలు ఇంజిన్ ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభించింది. సొరంగం తర్వాత అంతా దిగువ భాగం కావడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర అలానే ప్రయాణించింది. దీంతో ఉలిక్కిపడిన లోకో పైలట్ ఎగువ భాగంలో రైలు నిదానంగా వెళ్తుడటంతో ఒక్కసారిగా గార్డు క్యాబిన్ నుంచి ఇంజన్ లోకి దూకి రైలును తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఇంజిన్ బ్రేక్స్ పాడవటం, పట్టాలు దిగువకు ఉండటంతో రైలు ముందుకు కదిలినట్లు చెబుతున్నారు. కాగా, రైలు స్లో అయిన తర్వాత పైలట్ రైలును నిలిపివేసి మరో ఇంజిన్ ను తెప్పించి పక్కనే ఉన్న చిప్లన్ స్టేషన్ లో రైలును ఆపినట్లు వివరించారు. దీనిపై స్పందించిన కొంకణ్ రైల్వే చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా రైలు ఇంజిన్ లోకో పైలట్ లేకుండా ముందుకు వెళ్లిందనే వార్తలను కొట్టిపారేశారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
హైదరాబాద్ రన్నర్స్..
-
గర్భిణులూ వ్యాయామం చేయొచ్చు!
లండన్ః క్రీడాకారులు ప్రతిరోజూ వ్యాయామం చేసి శరీరాన్ని ధృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే గర్భం దాల్చిన సమయంలో మహిళలు అటువంటి వ్యాయామాలు చేసేందుకు, పరుగు పెట్టేందుకు అనుమానిస్తారు. ప్రసవం అయ్యే వరకూ పరుగు వంటి వాటి జోలికి పోకుండా ఉండిపోతారు. అటువంటి మహిళలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. గర్భంతో ఉన్న మహిళలు సైతం పరిగెట్టవచ్చని, వ్యాయామం చేయొచ్చునని చెప్తున్నారు. గర్భిణులుగా ఉన్నపుడు క్రీడాకారిణులు వ్యాయామం చేయడం వల్ల ఎటువంటి పత్రికూల ప్రభావం ఉండదని ఇంగ్లాండ్ కు చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. అథ్లెటిక్ అయిన మహిళల్లో ఎటువంటి రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉండవని, వీరు వ్యాయామం చేయడంవల్ల గర్భిణికి గాని, లోపల పెరిగే బిడ్డకు గాని సమస్య ఉండదని నార్వైన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ ప్రొఫెసర్ కరి బో వెల్లడించారు. అంతేకాదు వీరు ఎక్సర్ సైజ్ చేయడంవల్ల రక్త ప్రసరణ మెరుగవ్వడంతోపాటు, గర్భంలోని పిండం, ప్లాసింటా ధృఢంగానూ, ఆరోగ్యంగాను తయారౌతాయని తెలిపారు. అయితే గర్భిణులు చేసే వ్యాయామం కాస్త తేలిగ్గా ఉండాలని, ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం తెలుస్తోంది. గర్భిణిలు తేలికపాటి వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి చేయడంవల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గడంతోపాటు, మానసిక స్థైర్యాన్ని కూడ కలుగజేస్తుందని చెప్తున్నారు. అయితే వ్యాయామం చేసేప్పుడు ఏమాత్రం కష్టంగా అనిపించినా చేయకుండా ఉండటం మంచిదని హెచ్చరిస్తున్నారు. కడుపులోని పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందేమోనని చాలామంది గర్భిణులు వ్యాయామం చేయడం మానేస్తుంటారని, అయితే వ్యాయామం చేసేప్పుడు బయటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా లేకుండా చల్లబాటున చేయడం ఉత్తమమని ప్రొఫెసర్ బో చెప్తున్నారు. అంతేకాక సరైన వ్యాయామం చేయడంవల్ల కడుపులోని పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాక, ప్రసవం కూడ సులభం అవుతుందని చెప్తున్నారు. -
జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా?
వాషింగ్టన్: మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే.. బూట్లు, చెప్పులు లేకుండా పరిగెత్తాల్సిందేనంటున్నారువర్సిటీ నార్త్ ఫ్లోరిడా ఫ్లోరిడా పరిశోధకులు. ‘ఈ విధంగా పరిగెడితే.. వారికి జ్ఞాపకశక్తి, కౌశలం బాగా పెరిగిన విషయాన్ని గుర్తించాం. ఇలా చేయటం వల్ల అరికాళ్లపై ఒత్తిడి పెరగటం, తగ్గటం జరుగుతుంది. ఇది మెదడులోని జ్ఞాపకశక్తి నాడులపై ప్రభావం చూపుతుంది’ అని పరిశోధన సారథి ట్రేసీ అలోవే తెలిపారు. -
ఖరీఫ్ నుంచి ఏకీకృత ప్యాకేజీ బీమా
రాష్ట్రంలోని ఒక జిల్లాలో కేంద్ర వ్యవసాయ బీమా పథకం అమలు సాక్షి, హైదరాబాద్: ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం (యూపీఐఎస్)ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు పంపించింది. దేశవ్యాప్తంగా 45 జిల్లాల్లో పెలైట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు. తెలంగాణలో ఒక జిల్లాను పెలైట్ ప్రాజెక్టుకు ఎంపిక చేస్తారు. ఏ జిల్లాను ఎంపిక చేయాలన్న అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. రెండు మూడ్రోజుల్లో జిల్లాను ఎంపిక చేయనున్నారు. అలాగే కొన్ని ప్రైవేటు వ్యవసాయ బీమా కంపెనీలనూ ఖరారు చేసి వాటిని కూడా అమలులో భాగస్వామ్యం చేస్తారు. యూపీఐఎస్ పథకంలో మొత్తం ఏడు సెక్షన్లు ఉన్నాయి. వాటిలో మొదటిది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)ను తప్పక ఎంపిక చేసుకోవాలి. మిగిలిన ఆరు సెక్షన్లలో కనీసం ఏవైనా రెండింటిని రైతులు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పంటలకు నష్టం వాటిల్లితే పీఎంఎఫ్‌బీవై పథకాన్ని వర్తింపజేస్తారు. మిగిలిన సెక్షన్లన్నీ రైతు ప్రమాదానికి గురైనా, అతని వ్యవసాయ యంత్రాలు, ఇతరత్రా నష్టం వాటిల్లినా వర్తింపజేస్తారు. -
ఆ రెండు గ్రామాల్లో సోలార్ వెలుగులు
ఆ గ్రామాల్లో సౌరశక్తి వెలుగులు విరజిమ్మనున్నాయి. ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసే రెండు మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సహాయంతో ఈ ఏడాది నుంచే పూర్తి శాతం సోలార్ విద్యుత్ వినియోగంలోకి రానుంది. దీంతో దేశంలోనే వందశాతం సోలార్ విద్యుత్తును వినియోగించే మొట్ట మొదటి గ్రామాలుగా ఆ రెండు గ్రామాలు గుర్తింపును తెచ్చుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్ ఏ జీ వై) ద్వారా ఆ రెండు గ్రామాలను తాను దత్తత తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళు, పెద మైనవానిలంక గ్రామాలు ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చెందనున్నాయి. సౌరశక్తిని వినియోగించి గ్రామాల్లో పూర్తిశాతం విద్యుత్ సరఫరా జరిపేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ డిస్కమ్ సహాయంతో రెండు మెగావాట్ల సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసి... గ్రామాల్లో పూర్తిశాతం సోలార్ విద్యుత్తును అందించేందుకు సంస్థ సిద్ధం చేస్తోంది. ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన 2 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఆంధ్ర ప్రదేశ్ తూర్పు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొనుగోలు చేసి గ్రామాలకు సరఫరా చేస్తుంది. సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం భూమిని కేటాయించగా.. ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కొనుగోలు చేసేందుకు ఏపీఈపీడీసీఎల్ అంగీకారం తెలిపింది. దీంతో ప్లాంట్ నిర్మాణం 2016 ఆగస్టు నాటికి పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో సామాజిక, సాంస్కృతిక అభివృద్ధే లక్ష్యంగా సంసద్ ఆదర్శ గ్రామయోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ లోని ప్రతి సభ్యుడు మూడు గ్రామాలను దత్తత చేసుకొని అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను అప్పగించారు. ముందుగా తమ స్వంత నియోజక వర్గాల్లోని ఒక గ్రామాన్ని దత్తత చేసుకొన్న సభ్యులు 2019 నాటికి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు నిబంధనల ప్రకారం అది వారి స్వంత గ్రామం గాని, అత్తింటివైపు వారి గ్రామం గాని అయి ఉండకూడదు. అనంతరం అదే పద్ధతిలో మరో రెండు లేదా మూడు గ్రామాలను కూడ సభ్యులు 2019 నాటికి అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. -
రూటు మార్చిన యంగ్ హీరో
రన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తిరిగి షూటింగ్‌లతో బిజీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో, ఇక పై ప్రయోగాత్మక చిత్రాలకు సై అంటున్నాడు. ప్రస్తుతం రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న 'ఒక్క అమ్మాయి తప్ప' అనే సినిమాలో నటిస్తున్నాడు. నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న, ఈ సినిమా అంతా ఓ ఫ్లై ఓవర్ మీద ఒక్క రాత్రిలో జరిగే ప్రేమకథ. ఈ సినిమాతో పాటు మరో కొత్త దర్శకుడితో 'మా నగరం' అనే సినిమాలో నటిస్తున్నాడు. రెజీనా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మూడు నాలుగు విభిన్న కథలను ఒకేసారి తెరమీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత పిజ్జా నిర్మాత సివి కుమార్ డైరెక్షన్లో మాయావన్ అనే సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌లో నటించడానికి అంగీకరించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను కూడ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు సందీప్. -
'రన్' మూవీ రివ్యూ
టైటిల్: రన్ జానర్ : కామెడీ థ్రిల్లర్ తారాగణం : సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్, బాబీ సింహా, బ్రహ్మాజీ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : అనీ కన్నెగంటి నిర్మాత : అనిల్ సుంకర వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా తరువాత హిట్ సినిమాను అందించటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న సందీప్ కిషన్, ఈసారి ఓ రీమేక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మళయాలం, తమిళ భాషలలో ఘనవిజయం సాధించిన నేరం సినిమాను రన్ పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. కేవలం ఒక్క రోజులో జరిగే కథను ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు రన్ టీం. మరి రన్ అయినా సందీప్ కిషన్ కెరీర్‌ను పరుగు పెట్టిస్తుందా..? కథ : సందీప్ కిషన్, ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పరిచయం అవుతాడు. తాను పనిచేసే కంపెనీలో సంక్షోంభం కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. దీంతో అవసరాల కోసం వడ్డీ వ్యాపారం చేసే బాబీసింహా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటాడు. అనుకున్న సమయానికి వడ్డీ డబ్బులు తిరిగి ఇవ్వలేకపోవడంతో బాబీ సింహా.. సందీప్ వెంట పడతాడు. అదే సమయంలో, ఉద్యోగం లేదని సందీప్ ప్రేమించిన అనీషా ఆంబ్రోస్ తండ్రి, వాళ్లిద్దరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఆ ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోతారు. అలా పారిపోయిన సందీప్.., బాబీ సింహా, అనీషా తండ్రి నుంచి ఎలా తప్పించుకున్నాడు. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడు అన్నదే మిగతా కథ. విశ్లేషణ : తన ప్రతీ సినిమాకు నటుడిగా మంచి పరిణతి కనబరుస్తున్న సందీప్ కిషన్, ఈ సినిమాలో కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్గా అనీషా తన పరిధి మేరకు ఆకట్టుకుంది. కీలక పాత్రలో కనిపించిన బ్రహ్మాజీ ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ పాత్ర, ఆ పాత్రను ఆయన పోషించిన తీరు సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. పోసాని కృష్ణ మురళి మరోసారి తన మార్క్ క్యారెక్టర్లో కనిపించాడు. ఒరిజినల్ వర్షన్లో నటించిన అదే పాత్రలో కనిపించిన బాబీ సింహా తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నాడు. అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య లాంటి ఫ్లాప్ సినిమాలు చేసిన దర్శకుడు అనీ కన్నెగంటి. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళయాల సినిమా నేరం రీమేక్‌గా తెరకెక్కిన రన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మళయాలం తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సినిమా కావటంతో దర్శకుడు తెలుగులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా ఒక్కరోజులో జరిగే థ్రిల్లర్ సినిమా కావటంతో నేటివిటీ సమస్య కూడా పెద్దగా కనిపించలేదు. ఒక్క రోజులో జరిగే సంఘటనలను రేసీ స్క్రీన్ ప్లే తో రాసుకున్న దర్శకుడు ఆడియన్స్ కట్టిపడేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. ముఖ్యంగా సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ప్లస్ పాయింట్స్ : కథ బ్రహ్మాజీ క్యారెక్టర్ సినిమా నిడివి మైనస్ పాయింట్స్ : హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ ఓవరాల్‌గా రన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ -
'రన్' మూవీ స్టిల్స్
-
‘తూర్పు’న ‘రన్’ సందడి
‘ఆదర్శ’ విద్యార్థులతో హీరో సందీప్ కిషన్ డాన్స్ ‘రన్’ జోడీ సందడి.. ఈ నెల 23న విడుదల కానున్న ‘రన్’ సినిమా హీరోహీరోరుున్లు సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ శనివారం జిల్లాలో సందడి చేశారు. చేబ్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో కలిసి చిందేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాలంతో ముడిపడ్డ విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం విజయవంతం కాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గొల్లప్రోలు : చిత్ర ప్రచారంలో భాగంగా రన్ చిత్రం యూనిట్ శనివారం జిల్లాలో సందడి చేసింది. యూనిట్ సభ్యులకు చేబ్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ బుర్రా అనుబాబు, అనురాధ దంపతులు ఘన స్వాగతం పలి కారు. చిత్రం హీరో, హీరోయిన్లు సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ విద్యార్థులతో హుషారుగా డాన్స్‌లు చే శారు. ్రపత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్‌పై హీరో సందీప్‌కిషన్ విద్యార్థులతో ముచ్చటిం చారు. తాను కూడా నాలుగేళ్లక్రితం మీ లాంటి విద్యార్థినేనని, ఎవరైనా సెలబ్రిటీ వస్తే కేరింతలు కొట్టే వాడినని తెలిపారు. ప్రస్తుతం తాను సెలబ్రిటీలా మీ ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. మంచి కథతో రన్ చిత్రం తీశామన్నారు. ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ప్రేమలో ఎదుర్కొన్న సంఘనలు ఈ సినిమాలో ఉన్నాయన్నారు. టైం పై ఆధారపడి సినిమా నడుస్తుందన్నారు. హీరోయిన్ అనీషా మాట్లాడుతూ సినిమాలో తన పాత్ర ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు. హీరో హీరోయిన్లను చూసి విద్యార్థులు కేరింతలు కొట్టారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. డెరైక్టర్ అనిల్ కనిగంటి, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర పాల్గొన్నారు. సరికొత్త కథతో ‘రన్’ కాకినాడ కల్చరల్ : సరికొత్త కథాంశంతో రూపొందించిన ‘రన్’ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేయాలని చిత్ర కథానాయకుడు సందీప్‌కిషన్ అన్నారు. స్థానిక సరోవర్ పోర్టుకో హోటల్లో చిత్ర యూనిట్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. కథానాయకుడు సందీప్‌కిషన్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నూతన కాన్సెప్ట్‌తో రూపొందించామన్నారు. మానవుని నిజ జీవితంతో ‘కాలం’ (టైమ్) ఏవిధంగా చెలగాటమాడుతుందనే ప్రధానాంశంతో ఈ చిత్రం తీశామన్నారు. హాస్యం, ఉత్కంఠతో కథ కొనసాగుతుందన్నారు. కథానాయిక అనితా అంబ్రోస్ చక్కటి నటనను ప్రదర్శించిందన్నారు. ఈ నెల 23న విడుదల కానున్న ఈ చిత్రం ముందస్తు ప్రభారంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తమ యూనిట్ త్వరలో ‘ఒక అమ్మాయితో’ అనే చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. -
అమ్మనాన్నకోసం 370 మైళ్ల పరుగు
బీజింగ్: త్వరలోనే తమ మాతృదేశానికి సంబంధించి జరగనున్న ఇయర్ వేడుకలు.. ఆ సమయంలో ఎలాగైనా తన తల్లిదండ్రులతో ఉండాలి. కానీ, చాలా దూరంగా ఉన్నాడు. టికెట్స్ బుక్ చేద్దామంటే ఎంతో రద్దీ. రైలు, బస్సులకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం లేదు. ఒక వేళ అలా బుక్ చేసుకున్నా.. సురక్షితంగా వెళతామా లేదా అన్న టెన్షన్.. ఏం చేసైనా ఆరోజు తన తల్లిదండ్రులతో గడపాలి. అప్పుడు ఆలోచించాడు. ఆ వెంటనే బ్యాగ్ సర్దుకుని భుజాన వేసుకున్నాడు. షూ కట్టుకొని ఇక రోడ్డెక్కాడు. తన కాళ్లకు పనిచెప్పి పరుగందుకున్నాడు. ఒకటి కాదు రెండు దాదాపు 370 మైళ్ల దూరంలో ఉన్న తన అమ్మనాన్నల చెంతకు పరుగు ద్వారా వెళుతున్నాడు. ఇది లండన్ నుంచి ఈడెన్ బర్గ్ కు మధ్య సాగే 14 మారథాన్లతో సమానం. ఏడు రోజులుగా సాగుతున్న అతడి ప్రయాణం మరో రెండు రోజుల్లో ముగియనుంది. గురువారం సాయంత్రానికి అతడు తన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఇదంతా చైనా ఇయర్ వేడుకలకు హాజరవుతున్న హువాంగ్ చాంగ్ యాంగ్ (33) సృష్టిస్తున్న రికార్డు కథ. షెంజెన్ ప్రాంతం నుంచి చెంజోవ్ కు 370 మైళ్ల దూరం పరుగెత్తుతున్నాడు. తమ దేశ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే చైనాలో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంత ప్రాంతాలకు క్యూకట్టారు. ఈ నేపథ్యంలో అన్ని ట్రాన్స్ పోర్ట్ మార్గాలు రద్దీగా మారాయి. దీంతో 2.9 బిలియన్ల మంది రద్దీని అధిగమించడంకోసం హువాంగ్ పరుగునే ప్రయాణ సాధనంగా ఎంచుకొని ముందుకు కదిలాడు. -
ఇంకా దొరకని IAF పరేడ్ హిట్ అండ్ రన్ నిందితుడు
-
9 నెలల గర్భంతో.. 5 కిలోమీటర్ల పరుగు
-
9 నెలల గర్భంతో.. 5 కిలోమీటర్ల పరుగు
కరీంనగర్ స్పోర్ట్స్ : మిషన్ కాకతీయ పథకానికి మద్దతుగా ఐదు కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తారు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి కామారపు లక్ష్మి. ‘గర్భంలోని శిశువును కాపాడండి... గ్రామంలో చెరువులు కాపాడండి’ అనే నినాదంతో ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో 30 నిమిషాల 20 సెకన్ల వ్యవధిలో 5 కిలోమీటర్లు పరుగెత్తారు. అంతకుముందు లక్ష్మి పరుగును జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సత్యవాణి, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యవర్గ సభ్యుడు గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. స్టేడియంలో 400 మీటర్ల ట్రాక్‌లో పన్నెండున్నర రౌండ్లు లక్ష్మి అలవోకగా పరుగెత్తి అందరినీ అబ్బురపర్చింది. అనంతరం తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు విజయభాస్కర్, రమేశ్ ఆమెకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఆదివారం పూర్తిచేసిన పరుగుపందెం రికార్డును గిన్నిస్ బుక్‌లో చోటు కోసం పంపనున్నట్లు వెల్లడించారు. గతంలో మారథాన్ పరుగును కెనడా దేశానికి చెందిన అమీ 6 గంటల 12 నిమిషాల్లో పూర్తి చేశారని.. 9 నెలల గర్భిణి ఎవరూ ఇలాంటి సాహసం చేయలేదని వారు చెప్పారు. గర్భిణుల్లో స్ఫూర్తి నింపడానికే: లక్ష్మి గర్భం దాల్చిన తర్వాతకాలు కదపకుండా విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, గర్భిణులకు వ్యాయమం తప్పని సరి. దీంతో పుట్టబోయే పాపకు సరైన ఆక్సిజన్ అందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో పాటు సుఖ ప్రసవం జరుగుతుంది అని తెలియజేయడంతో పాటు.. మహిళల్లో స్ఫూర్తి నింపడానికే ఈ సాహసం చేశా.. రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. -
ఏప్రిల్ 1 విడుదల
జాతీయ ఆహార భద్రతా పథకం.. దేశంలో అల్పాదాయవర్గాల వారికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకమిది. జాతీయ స్థాయిలో ఏప్రిల్ 1 నుంచి శ్రీకారం చుడుతున్న ఈపథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే అందరికి ఆహార భద్రతసాధ్యమయ్యేనా అనే అనుమానాలుతలెత్తుతున్నాయి. అదే సమయంలో బియ్యం అక్రమార్కులు మరింత రెచ్చిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఆహార భద్రత పథకం అమలుకు జిల్లా యంత్రాంగం గత నెలరోజులుగా ముమ్మర కసరత్తు చేస్తోం ది. గత నెల 26న ఉత్తరాంధ్ర జిల్లాల వర్కుషాపు కూడా ఈ అంశంపై విశాఖలో నిర్వహించింది. జీవీఎంసీ పరిధిలో 413, గ్రామీణ జిల్లా, ఏజెన్సీల పరిధిలో 1599 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో అల్పాదాయ వర్గాల వారికి తెల్లకార్డులు 10,45,838, ఏఏవై 75,889, అన్నపూర్ణ 1,035 కార్డులున్నాయి. వీటిపరిధిలో 39,15,217 మంది (యూనిట్స్) ఉండగా, మనుగడలో లేని 70 వేల కార్డులను తొలగించడం వల్ల వాటి పరిధిలో ఉన్న 5,03,961 యూనిట్లను తొలగించారు. ఇప్పటివరకు 33,59,667 యూనిట్లకు ఆధార్ సీడింగ్ పూర్తిచేశారు. మరో 61,254 యూనిట్లకు ఆధార్ సీడింగ్ చేయాల్సి ఉంది. అంటే సీడెడ్, అన్సీడెడ్యూనిట్లు కలిసి 33,56,137 మంది ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు 4కేజీల చొప్పున కుటుంబానికి గరిష్టంగా 20 కేజీలకు మించకుండా సరఫరా చేస్తున్నారు. జిల్లాలో తెలుపుకార్డుదారులకు 12974.188 మెట్రిక్‌టన్నులు, ఏఏవై కార్డుదారులకు 2652.445 ఎంటీలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 ఎంటీల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నారు. మహానేత సంకల్పమిదే..: ఒక కుటుంబంలో నలుగురుకు మించి కుటుంబ సభ్యులున్నా సరే ఆ కుటుంబానికి ఇప్పటివరకు 20కేజీలే లభించేవి. ఈ బియ్యం ఏ మూలకు సరిపోవన్న భావనతో ప్రతి కుటుంబానికి 30 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని దివంగత మహానేత నిర్ణయించారు. 2009 ఎన్నికల్లో ఈ ఒక్క హామీనే ఇచ్చారు. మహానేత హఠన్మరణం తర్వాత ఈ ప్రతిపాదన అటకెక్కింది. మహానేత ఆశయం ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తోందని చెప్పవచ్చు. ఆరుగురు అంతకంటే ఎక్కువ మందితో కూడిన ఉమ్మడి కుటుంబాలు జిల్లాలో మచ్చుకైనా కన్పించని పరిస్థితి. ఒక వేళ ఒకే ఇంట్లో ఉంటున్నా పెళ్లవగానే కొత్తకార్డులు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గర ఉంటున్నప్పటికీ వారికి ప్రత్యేకంగా కార్డులుంటున్నాయే తప్ప ఉమ్మడిగా అందరికి కలిపి ఒకేకార్డు ఉండే పరిస్థితిలేదు. మహా చూస్తే ఒక కార్డులో నలుగురు లేదా తల్లిదండ్రులు కలుపుకుంటే ఆరుగురు సభ్యులతో కూడిన కార్డులు మినహా అంతకుమించి ఎక్కువసభ్యులున్న కార్డులు జిల్లావ్యాప్తంగా నాలుగైదు శాతంకూడా ఉండవు. 20 శాతం పెరగనున్న కేటాయింపులు ప్రస్తుతం ఉన్న కార్డుల్లోని సీడెడ్ యూనిట్లను బట్టి చూస్తే జిల్లాకు 17,086.955 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని అంచనా. అంటే ప్రస్తుత కేటాయింపులకు అదనంగా మరో 1500 మెట్రిక్ టన్నుల బియ్యం సరిపోతాయని, అంటే 15 నుంచి 20 శాతం మేర కేటాయింపులు అదనంగా అవసరమవుతాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా నుంచే తొమ్మిది జిల్లాలకు సరిపడా కేటాయింపులు జరుపుతున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో బియ్యం కేటాయింపులు ఖరారు కానున్నాయని, 26 కల్ల్లా విశాఖ గొడౌన్‌కు చేరుకోనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇన్యాక్టివ్పేరుతో 70 వేల కార్డులను, ఐదు లక్షల యూనిట్లను తొలగించిన సర్కార్ ఆధార్ సీడింగ్ పేరుతో మరింత కోతకు సిద్ధమవుతోంది. అవసరమైతే నిజంగా బియ్యం, ఇతర నిత్యావసర సరకులు తీసుకుంటున్నవారందెరు? తీసుకోకుండా ఇతర అవసరాల కోసం కార్డులు తీసుకున్నవారెవరో గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. కేటాయింపులను కుదించడం ద్వారా భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోదన్న విమర్శలు కూడా మరో వైపు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు మరింత ఊతం! ఇప్పటికే సరఫరా అవుతున్న పీడీఎస్ బియ్యంలో కనీసం 40 శాతం పక్కదారి పడుతున్నట్టు అంచనా. రేషన్ బియ్యానికి పాలిష్ పెట్టి రిసైక్లింగ్ చేస్తూ మళ్లీ బహిరంగ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. కార్డుల్లో కనీసం 30 శాతం తనఖా పెట్టుకుని మరీ కొంతమంది డీలర్లు అక్రమార్కులకు గుట్టుచప్పుడు కాకుండా నేరుగా బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆహారభద్రత పుణ్యమాని పెరగనున్న బియ్యం కేటాయింపులు వీరికివరంగా పరిణమించే అవకాశం ఉంది. కొత్తగా అమలులోకి తీసు కొస్తున్న ఈ-పాస్ విధానం కొంతమేర చెక్ పెట్టే అవకాశాలున్నప్పటికీ కచ్చితమైన నిఘా.. సరైన పర్యవేక్షణ లేకుంటే ఈ అక్రమార్కులకు మరింత రెచ్చిపోయే అవకాశాలు లేకపోలేదని అధికారులే అంగీకరిస్తున్నారు. -
క్రయోలైపో చికిత్స ద్వారా మీరు కోరుకున్న శరీరాకృతి
బరువు తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల చికిత్సల వైపు పరుగులు పెడుతున్నారు. వీటిలో సహజంగా బరువు తగ్గేందుకు దోహదపడే సరైన పద్ధతులను ఎంచుకోవడం ముఖ్యం. వీటిని దృష్టిలో పెట్టుకుని అధునాతనంగా క్రయోలైపో చికిత్స ఇఖీూ క్లినిక్‌లో అందుబాటులో ఉంది. దుష్ర్పభావాలు లేని కొత్త చికిత్స : క్రయోలైపో. క్రయో అంటే చల్లని అని అర్థం. సురక్షితమైన పద్ధతుల్లో బరువు తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్లకు క్రయోలైపో మేలైన పద్ధతి. కొవ్వును ఘనీభవింపచేసే క్రయోలైపో విధానం (క్రయోలైపో ఫ్యాట్ ఫ్రీజింగ్ క్రయోలైపోసిస్) ఇఉ (కమిషన్ యూరోపియన్) ఆమోదం పొంది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందివున్న క్రయోక్లినిక్స్లో అందుబాటులో ఉంది. ఒకే ఒక్క సిటింగ్‌తో మీకు నచ్చే శరీరాకృతి కొవ్వు కణాలను - 3 నుంచి - 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర ఈ చికిత్స వల్ల శరీరంలోని అనేక భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించవచ్చు. కొన్ని వారాల వ్యవధిలోనే సహజమైన పద్ధతులలో మీ శరీరంలోని కొవ్వు కణాలు తొలగించబడ తాయి. ఇది నాన్ సర్జికల్ చికిత్స.... బరువు ఎక్కువగా ఉన్నారంటే ఊబకాయులనే కాదు. శరీరంలోని కొన్ని నిర్ధిష్టమైన చోట్ల మాత్రమే కొవ్వు పెరిగి లావుగా కనిపించవచ్చు. ఇలాంటప్పుడు సర్జరీల అవసరం అస్సలు ఉండదు. కాబట్టి ఈ పద్ధతులు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. అల్ట్రా సోనిక్ వేవ్స్ పంపించి థెరపీ చేస్తారు. టార్గెట్ భాగాల్లో కొవ్వు తొలగించడం... కొవ్వు పేరుకుపోయి వున్న భాగాలకు చికిత్స అందించడానికి క్రయోలైపో ఫ్యాట్ ఫ్రీజింగ్ ఉపయోగిస్తారు. ఫ్యాట్ బల్జెస్ తీసివేయడానికి ఇది సహాయపడుతుంది. సాధారణంగా పొట్ట, పక్కభాగాలు, భుజాలు, నడుము, తుంటి భాగాలు, తొడలు, మోకాళ్ళ భాగాలకు క్రయోలైపీ ద్వారా చికిత్స అందిస్తారు. డాక్టర్ జె.రాజేశ్వరి, MD, DVL కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మో-ఈస్థటిక్ సర్జన్, ఇఖీూ క్రయో క్లినిక్స్ హైదరాబాద్, విశాఖపట్నం. 964021 4020, 99894 89666 -
నవంబర్ 30న హైదరాబాద్ 10k రన్
-
సంక్షేమ ఫలాలు పేదలకు అందాలి
మనుబోలు: అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మడమనూరు, వీరంపల్లి గ్రామాల్లో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాకాణి మాట్లాడుతూ ఎవరి కోసమైతే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారో వారికి చేరినప్పుడే జన్మభూమి వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. కనుపూరు కాలువలో పూడిక తీయాలని తాను చాలా కాలంగా కోరుతున్నానన్నారు. సకాలంలో సాగు నీరు అందక ప్రతి ఏటా కెనాల్ పరిధిలో వేలాది ఎకరాల్లో పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి కూడా పంట ఎండిపోతే అందుకు అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. జిల్లాలో 54 వేల మంది పింఛన్లను తొలగించారన్నారు. అర్హులైన వారి పింఛన్లను పునరుద్ధరించే ప్రక్రియను అధికారులు చేపట్టాలన్నారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతానన్నారు. అనంతరం లబ్ధిదారులకు పిం ఛన్లు అందజేశారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వైద్యులు శిరీష, సుజాత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సత్యనారాయణ, తహశీల్దార్ కేవీ రమణయ్య, ఆర్ఐ సునీల్, ఎంపీడీఓ హేమలత, సీడీపీఓ శారద, ఏపీఎం విజయలక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, మడమనూరు సర్పంచ్ రాధయ్య, ఎంపీటీసీ శేషమ్మ, వీరంపల్లి సర్పంచ్ సురేంద్ర, నాయకులు మన్నెమాల సుధీర్‌రెడ్డి, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, పూండ్ల రామ్మోహన్‌రెడ్డి, వెందోటి భాస్కర్‌రెడ్డి, కసిరెడ్డి ధనంజయరెడ్డి, అడపాల శివకుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రెడీ రన్
వరుస మారథాన్లు నింపిన స్ఫూర్తో... ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న అవగాహనో... మొత్తానికి సిటీజనులు ‘రన్ మంత్రం’ జపిస్తున్నారు. తెలతెలవారుతుండగానే... నిద్దర వుత్తు వదిలించుకొని పరుగు పెడుతున్నారు. పార్కులు, స్టేడియూలు.. రహదారులు, నగరంలో ఇప్పుడు ఉదయుం వేళల్లో ఏ దిక్కు చూసినా రన్.. రన్. ఈ ఉత్సాహాన్ని వురింత పెంచి ఆరోగ్యానికి బాటలు వేస్తోంది ‘హైదరాబాద్ రన్నర్స్ క్లబ్’. ‘ఆరోగ్యం కోసం పరుగెత్తండి’... ఇదీ హైదరాబాద్ రన్నర్స్ నినాదం. చిన్నారుల నుంచి సీనియుర్ సిటిజన్ల వరకు రన్నింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ... ఏడేళ్లుగా వూరథాన్లో భాగస్వావుులు చేస్తోంది. పరుగెత్తాలనే కోరిక ఉంటే చాలు... ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. కేవలం ఆరోగ్యం కోసమే కాదు... పూర్తిస్థారుు అథ్లెట్లుగానూ వూర్చేందుకు వివిధ విభాగాల్లో తర్ఫీదునిస్తోంది. ప్రతి మంగళ, గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఈ శిక్షణ ఉంటుంది. ఇంటర్వెల్, స్టెప్స్, హిల్, టెంపో, బిగినర్స్, లాంగ్ రన్స్ ఇలా ఆరు విభాగాల్లో తర్ఫీదు ఉంటుంది. ఇంటర్వెల్ ట్రైనింగ్... ప్రతి మంగళవారం సికింద్రాబాద్‌లోని ఆర్ఆర్సీ గ్రౌండ్, గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్వెల్ ట్రైనింగ్ ఉంటుంది. క్రీడాకారులందరు ఉదయం 5.30 గంటలకు కలుసుకుంటారు. ఆ తర్వాత మైదానంలో పరుగు ప్రాక్టీసు చేయిస్తారు. 400, 1,600 మీటర్ల ట్రాక్‌పై పరుగెత్తుతారు. దీని వల్ల స్పీడ్ పెరుగుతుంది. స్టెప్స్ ట్రైనింగ్... ప్రతి గురువారం సికింద్రాబాద్‌లో కొహీమామ్ దర్గా వద్ద ఉదయం 5.45 గంటలకు స్టెప్స్ ట్రైనింగ్ ప్రాక్టీసు ప్రారంభిస్తారు. ఇదే రోజు విస్పర్‌వ్యాలీ (జూబ్లీహిల్స్ నుంచి టోలీచౌకి వెళ్లేదారిలో) వద్ద హిల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉదయం 5.30 గంటలకు రన్నర్లు కలుసుకుంటారు. మెట్లు ఎక్కడంతో పాటు ఎత్తరుున ప్రాంతాల్లో పరుగు పెట్టడం నేర్పిస్తారు. స్టామినా పెరిగేందుకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. టెంపో రన్... ప్రతి శుక్రవారం నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కులో టెంపోరన్ శిక్షణ ఉంటుంది. నిర్ధిష్ట సమయంలో ఎలా పరుగెత్తాలనే దానిపై శిక్షణ ఇది. మొదట రెండు కిలోమీటర్లు మెల్లగా పరుగెత్తి ఆ తర్వాత మూడు కిలోమీటర్లకు వేగం పెంచేలా క్లాస్‌లు (ఉదయుం 5.30 గంటలు) ఉంటాయి. స్పీడ్ పెంచుకొనేందుకు ఈ తర్ఫీదు ఉపయోగపడుతుంది. బిగినర్ రన్నర్స్... ప్రతి శనివారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో కొత్తగా పరుగు నేర్చుకునే వారికి శిక్షణ ఇస్తారు. ఉదయుం 5.30కి సెషన్ మొదలవుతుంది. ఇందులో సీనియర్లు అనుభవాలు పంచుకొంటారు. సలహాలు ఇస్తారు. దీంతోపాటు ఐదు కిలోమీటర్ల పరుగు ఉంటుంది. లాంగ్ రన్... ప్రతి ఆదివారం లాంగ్ రన్ ఉంటుంది. 20 నుంచి 30 కిలో మీటర్ల పరుగులో శిక్షణ ఇది. వారానికో లొకేషన్. వూరథాన్లో పాల్గొనాలనుకొనేవారికి ఈ రన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చేరాలంటే... ఔత్సాహికులు గూగుల్స్ గ్రూప్‌లోని హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్‌లో చేరాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడీకి ట్రైనింగ్ క్లాస్‌ల సమాచారం ఎప్పటికప్పుడు క్లబ్ ప్రతినిధులు పంపుతుంటారు. లాంగ్ రన్ లొకేషన్‌తో పాటు మరింత శిక్షణ సమాచారం కోసం https://www.facebook.com/HyderabadRunners, https://plus.google.com-/u/0/103766043627029140678/posts, https://twitter.com/ hydrunners లో అప్డేట్ పోస్ట్‌లు చూడవచ్చు. - వాంకె శ్రీనివాస్ -
గ్రాండ్ మారథాన్..
ఉత్సాహంగా సాగిన రన్ యువతదే పైచేయి విజేతగా నిలిచిన హర్యానా రైతు బిడ్డ హాఫ్ మారథాన్‌లో నెగ్గిన బాబూరామ్ 5కే రన్ విన్నర్‌గా కార్మికుడి కొడుకు సాక్షి, సిటిబ్యూరో: నగరంలో ఆదివారం నిర్వహించిన ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ సక్సెస్ అయింది. అన్ని వర్గాల వారు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. పరుగులో పాల్గొనేందుకు భారీగా తరలిరావడంతో నిర్వాహకులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఏటా ఇలాంటి రన్ నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు) సాగిందిలా... నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఐదు గంటలకు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ బస్‌స్టాప్, కేబీఆర్ పార్కు, దస్పల్లా హోటల్, హైటెక్ సిటీ, అస్కెండస్ సర్కిల్, క్వాలిటీ ఇన్ సర్కిల్, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, పోలారిస్ బిల్డింగ్, గోపన్నపల్లి జంక్షన్, హెచ్‌సీయూ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు)... నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్, శ్రీనగర్ కాలనీ బస్‌స్టాప్, న్యూ దస్పల్లా హోటల్, హైటెక్ సిటీ, అస్కెండస్ సర్కిల్, క్వాలిటీ ఇన్ సర్కిల్, ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది. 5 కే రన్... గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ కూడలి, ఇన్ఫోసిస్, విప్రో సర్కిల్ మీదుగా క్యూసిటీ నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగింది. ఇందులో ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రన్‌ను ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటులు రానా, సునీల్, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ మహంతి పరుగులు తీశారు. సత్తాచాటిన యువత.. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో యువత సత్తా చాటింది. 42.195 కిలోమీటర్లు పురుషుల ఫుల్మారథాన్ను హర్యానాలోని మహేందర్గడ్కు చెందిన 25 ఏళ్ల కరన్ సింగ్ 2 గంటల 24 నిమిషాల 57 సెకన్లలో పరుగెత్తాడు. ఈ ఏడాది జనవరిలో ముంబై మారథాన్‌లో ఇండియన్ మెన్స్ ఫుల్ మారథాన్ విజేతగా నిలిచిన కరన్ అదే స్ఫూర్తితో హైదరాబాద్ మారథాన్లోనూ సత్తా చాటాడు. ఇంటర్ వరకు చదువుకున్న హర్యానాలోని విలేజ్ దానిమనియాలికి చెందిన ఈ యువకుడు ప్రస్తుతం పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ యూనిట్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇతని తండ్రి శ్రీవికారమ్ రైతు. తల్లి సంతోషిణి గృహిణి. అథ్లెట్ కావడమే తన లక్ష్యమని కరన్‌సింగ్ తెలిపారు. ఇదే ఫుల్మారథాన్లో 2 గంటల 26 నిమిషాల 26 సెకన్లతో పుణె ఆర్మీకి చెందిన వీఐ డంగ్ ఐ, 2 గంటల 28 నిమిషాల 23 సెకన్లతో మూడో స్థానంలో రాజేశ్పాల్ సింగ్ నిలిచారు. మెన్ హాఫ్ మారథాన్‌లో.. మెన్ హాఫ్ మారథాన్‌లో హైదరాబాద్‌లోని ‘ఆర్మీ ఆర్టిలరీ సెంటర్’లో సోల్జర్‌గా పనిచేస్తున్న బాబూరామ్ గంటా 9 నిమిషాల 50 సెకన్లలో 21.1 కిలోమీటర్లను ఛేదించి విజేతగా నిలిచారు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఈయన హైదరాబాద్‌లోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్లో సోల్జర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే రన్నింగ్ అంటే ఇష్టమని చెబుతున్నారు. మూడేళ్లుగా నగరంలోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్లోనే రన్నింగ్ ప్రాక్టీసు చేస్తున్నారు. గతేడాది హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నారు. మంగళూరు నిఫ్ట్ హాఫ్ మారథాన్‌లో రన్ చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇదే స్ఫూర్తితో ఈసారి జరిగిన హైదరాబాద్ మారథాన్‌లో విజేతగా నిలబడ్డారు. దీనికి తమ స్నేహితుల సహకారం కూడా ఉందని చెబుతున్నారు. కాగా గంటా 13 నిమిషాల 52 సెకన్లలో నంజుడప్ప, గంటా 18 నిమిషాల 19 సెకన్లలో సతీశ్ కుమార్ రన్ చేసి మూడో స్థానంలో నిలిచారు. 5కే రన్లో.. 5 కే రన్లో కేరళకు చెందిన సందీప్ విజేతగా నిలిచారు. కేరళకు చెందిన ఈయన డిగ్రీ వరకు చదువుకున్నారు. 1,500 మీటర్ల మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌లో పాల్గొన్నారు. మారథాన్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. తొలి ఈవెంట్లోనే విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని సందీప్ చెబుతున్నారు. మహిళ విజేతలు వీరే... మహిళల ఫుల్మారథాన్లో షామిలీ సింగ్, రశ్మి, ఎం.సుధ వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. ఉమెన్ హాఫ్ మారథాన్‌ను జ్యోతి గెలిచింది. సీమ, కేఎం రంజన రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కార్పొరేట్ ట్రోఫీ యూహెచ్‌జీ కైవసం... ఈ ఈవెంట్లో యూనెటైడ్ హెల్త్ గ్రూపు కంపెనీకి చెందిన 800 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మారథాన్‌లో ఎక్కువ మంది ఉద్యోగులు పాల్గొన్నందుకు కార్పొరేట్ ట్రోఫీని యూహెచ్‌జీ కైవసం చేసుకుంది. ‘కేర్’ వైద్య సేవలు హ్యాపెనింగ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌కు కేర్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించినట్టు ఆ ఆస్పత్రి మీడియా మేనేజర్ ఎం.శివశంకర్ తెలిపారు. వైద్య సేవల్లో భాగంగా రన్ ప్రారంభమైన నెక్లెస్ రోడ్ నుంచి రన్ ముగిసిన గచ్చిబౌలి స్టేడియం వరకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక పాయింట్ చొప్పున ఏర్పాటు చేసి రన్లో పాల్గొన్న వారికి పెయిన్ రిలీఫ్ స్ప్రేలతోపాటు వారికి కావాల్సిన గ్లూకోస్లను అందించినట్టు చెప్పారు. మొబైల్ సర్వీసులను కూడా అందించినట్టు తెలిపారు. -
ఎయిర్టెల్ మారథాన్
సిటీ.. రన్‌కు సిద్ధమైంది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు మొదలయ్యే ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల రన్నర్లు, విదేశీయులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఎక్స్‌పోకు వేలాదివుంది తరలివచ్చారు. టీ షర్ట్లు, బూట్లు, గూడీ, బ్యాగ్‌లు తీసుకున్నారు. అనుభవజ్ఞులైన రన్నర్ల దగ్గర సలహాలు, సూచనలు తీసుకున్నారు. బ్లేడ్ రన్నర్స్ కూడా పరుగో పరుగు అంటున్నారు. వూరథాన్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,500 వుంది వాలంటీర్లు సేవలందించనున్నారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వురోవైపు ‘సోల్స్ ఫర్ సూల్స్’లో భాగంగా సేకరించిన బూట్లను హైదరాబాద్ రన్నర్స్ పంపిణీ చేశారు. ఫుల్ మారథాన్ (42.195 కి.మీ): నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర మొదలవుతుంది. సంజీవయ్యుపార్క్, ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్ రోడ్, శ్రీనగర్ కాలనీ బస్టాప్, బీకేఆర్ పార్క్, హైటెక్ సిటీ, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, పోలారిస్ బిల్డింగ్, హెచ్‌సీయూ మీదుగా సాగి గచ్చిబౌలి స్టేడియం దగ్గర వుుగుస్తుంది. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు): నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్, శ్రీనగర్ కాలనీ బస్‌స్టాప్, హైటెక్ సిటీ, ఐఐఐటీ జంక్షన్ మీదుగా సాగి గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. ఇక 5కే రన్ గచ్చిబౌలి స్టేడియుంలో ఉదయుం 8 గంటలకు మొదలవుతుంది. - వాంకె శ్రీనివాస్ -
ఫ్యామిలీతో రన్‌డి
ఆగస్టు.. మిగిలినవారికి పన్నెండు నెలల్లో మరో నెల కావచ్చు. కానీ సిటీలోని పరుగు వీరులకు మాత్రం ఇది ప్రత్యేకమైన నెల. ప్రపంచవ్యాప్తంగా మారథాన్ ఈవెంట్లు మొదలయ్యేది ఆగస్టు నుంచే. అందుకే, ఇప్పుడు పరుగు వీరులు పవర్‘ఫుల్’గా సమాయత్తమవుతున్నారు. సిటీలోనే కాదు.. దేశ విదేశాల్లో జరిగే మారథాన్లలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరి ఉత్సాహానికి నిర్వాహకుల ప్రోత్సాహం కూడా తోడవుతోంది. అందుకే.. మీరే కాదు, ఫ్యామిలీని కూడా తీసుకురండి అంటూ ఆహ్వానం పంపుతున్నారు. దీంతో చాలా ఫ్యామిలీలు కొత్త ట్రెండ్ వైపు పరుగు తీస్తున్నాయి. మేమిద్దరం.. మాకిద్దరు సిటీలో 2011లో జరిగిన మారథాన్‌లో వాలంటీరుగా సేవలందించాం. ఇదే స్ఫూర్తితో చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రాగ్ మారథాన్‌లో పిల్లలు మాయ (13), ఆదిత్య (9)తో కలసి పాల్గొని పతకాలు సాధించాం. హిమాలయాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండే సాంగ్లాలో మా పిల్లలు దాదాపు పది కిలోమీటర్ల మేర పరుగు తీశారు. అమెరికాలోని ఇండియానా పోలిస్ హాఫ్ మారథాన్లోనూ అందరం పాల్గొన్నాం. - విశ్వనాథ్, శ్రీలత పరుగులో అన్నా‘దమ్ము’లు కేవలం మూడు నెలల ప్రాక్టీసుతోనే హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నాం. తర్వాత ముంబై, పాండిచ్చేరిలోని అరోవిలే, కోయంబత్తూర్ మారథాన్లలో పాల్గొన్నాం. దేశంలో అతిపెద్ద మారథాన్‌లో దాదాపు 30 వేల మంది పాల్గొన్నారు. అక్కడ పరుగు తీసే సమయంలో ఒకే బ్రిడ్జి వస్తుంది. హైదరాబాద్‌లోనైతే ఎన్నో బ్రిడ్జిలు, కొండలు, వంపుల మధ్య పరుగు తీయాల్సి ఉంటుంది. అయితే, హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ దీనిని సమర్థంగా నిర్వహిస్తోంది. - నవీన్, జానకీరాం గ్రీకులు, పర్షియన్ల నడుమ మారథాన్‌లో జరుగుతున్న యుద్ధంలో.. గ్రీకుసేనల విజయవార్తను చేరవేసేందుకు ఒక గ్రీకు దూత మారథాన్ నుంచి ఏథెన్స్కు పరుగు పరుగున వచ్చాడు. ‘మనం గెలిచాం’ అని చెబుతూనే అతడు ప్రాణాలు విడిచాడు. అతడి జ్ఞాపకార్థం మారథాన్ ఈవెంట్ సంప్రదాయంగా మారింది. మారథాన్ పరుగు నిర్ణీత దూరం 42.195 కి.మీ. (26 మైళ్ల 218 గజాలు). దీనిని పూర్తి చేసేందుకు కనీసం 4 గంటల నుంచి గరిష్టంగా 6.30 గంటల వ్యవధి నిర్ణయిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 500 మారథాన్లు జరుగుతున్నాయి. బోస్టన్, న్యూయార్క్, బెర్లిన్, షికాగో, లండన్, లాస్ ఏంజెలిస్ వంటి నగరాల్లో జరిగే మారథాన్లు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. మన దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏటా మారథాన్లు జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రపంచస్థాయిలో టాప్-10 మారథాన్లను గుర్తించి, పురస్కారాలు కూడా ఇస్తున్నాయి. ఏడేళ్ల క్రితం.. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నగరంలో ఏడేళ్ల కిందట మారథాన్లకు శ్రీకారం చుట్టింది. ‘అప్పట్లో పాల్గొన్నవారి సంఖ్య వెయ్యికి లోపే. ఈ ఏడాది మేం పదివేల మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం’ అని సిటీలోని రన్నర్స్ క్లబ్ ప్రతినిధి జై భారతి అంటున్నారు. స్వల్పకాలంలోనే భారత్‌లో రెండో అతి పెద్ద మారథాన్‌గా పేరు సంపాదించింది హైదరాబాద్. సిటీలోనే కాదు, దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడ మారథాన్ ఈవెంట్ జరిగినా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే హాబీగా మారడం విశేషం. అలాగే నిర్వాహకులు కూడా సిటీ ఫ్యామిలీలకు ప్రత్యేక ఆహ్వానాలు కూడా పంపడం సంప్రదాయం. గిన్నిస్‌బుక్’లోకి దంపతుల రన్... నా భర్త కృష్ణప్రసాద్, నేను ఇరవైకి పైగా మారథాన్లలో పాల్గొని, నగరంలోనే అత్యధిక మారథాన్లలో పాల్గొన్న ఘనత దక్కించుకున్నాం. మంచుతో నిండిన ఉత్తర ధ్రువ ప్రాంతంలో నిర్వహించిన మారథాన్లోనూ పాల్గొన్నాం. ఏడు నెలల వ్యవధిలోనే ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ మారథాన్లలో పాల్గొన్నందుకు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకున్నాం. - చిగురుపాటి ఉమ, జూబ్లీహిల్స్ పతకాల కోసమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా... రెండేళ్ల కిందట హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నాం. అదే స్ఫూర్తితో చెన్నైలో పాల్గొన్నాం. ఆ తర్వాత నాసిక్ మారథాన్‌లో సెకండ్ రన్నర్స్‌గా నిలిచాం. గోవా, ఆరోవెల్లి, ముంబై మారథాన్లలోనూ పాల్గొన్నాం. మా అమ్మాయి తాన్యా గోవాలో జరిగిన 10కే రన్లో పాల్గొంది. పతకాల కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా మారథాన్‌లో పరుగు తీస్తున్నాం. - శర్వాణి, శ్యామ్ - ఎస్.సత్యబాబు/వాంకె శ్రీనివాస్ -
క్రీడాస్ఫూర్తిని నింపిన రన్
4వేల మంది హాజరు కిక్కిరిసిన కైకలూరు రహదారులు రన్లో పాల్గొన్న ఎంపీ మాగంటి కైకలూరు :అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కైకలూరులో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ రన్ క్రీడా స్ఫూర్తిని నింపింది. జిల్లా క్రీడాధికార సంస్థ, ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్లో పలు విద్యాసంస్థలకు చెందిన సుమారు 4వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం డిగ్రీ కాలేజీకి చెందిన ఒక బ్యాచ్‌ను ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఏలూరురోడ్డు వద్ద మరో బ్యాచ్‌ను మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. రెండు బ్యాచ్‌ల్లోని నాయకులు, విద్యార్థులు కాగడాలతో తాలూకా సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాధికారి రామకృష్ణ మాట్లాడుతూ కైకలూరులో స్టేడియం నిర్మాణానికి రూ.2.10 కోట్ల నిధులు మంజూరయ్యూయని చెప్పారు. స్థల సేకరణ జరిగితే పనులు ప్రారంభిస్తామన్నారు. జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి ప్రతీకలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ కైకలూరు నుంచి వడ్లమన్నాటి పాండురంగారావు, మండవల్లి నుంచి మార్తమ్మ వంటి వారు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారని, వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కేపీ రావు మాట్లాడుతూ 2018లో నిర్వహించే ఒలింపిక్ గేమ్స్‌ను మన రాష్ట్రంలో నిర్వహించాలంటూ బిడ్ వేయనున్నట్లు చెప్పారు. కైకలూరులో రాష్ట్రస్థాయి పోటీలు త్వరలో నిర్వహిస్తామన్నారు. స్థానిక ఒలింపిక్ నిర్వహణ కమిటీ సభ్యుడు కేవీఎన్‌ఎం నాయుడు మాట్లాడుతూ కైకలూరులో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారన్నారు. కైకలూరు కరాటే మాస్టర్ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో రన్లో పాల్గొన్నవారికి తాగునీరు, బిస్కెట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ రన్ నిర్వహణ కమిటీ సభ్యులు గురజాడ ఉదయశంకర్, ఎంఏ రహీమ్, పీఈటీలు లూయిస్, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, పీడీ సత్యనారాయణ, సర్పంచి నర్సిపల్లి అప్పారావు, జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, నాయకులు చలమలశెట్టి రామానుజయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ సామర్ల శివకృష్ణ, న్యాయవాది కారి శరత్‌బాబు, సయ్యపురాజు గుర్రాజు, నేషనల్, జాగృతి, భాష్యం, చైతన్య, హోలిక్రాస్, కేపీఎస్, భుజబలపట్నం, కానుకొల్లు, కైకలూరు ప్రభుత్వ బాలుర, బాలికల హైస్కూళ్లు, ఓరియంటల్ హైస్కూల్, వికాస్, విద్యాంజలి కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
బిట్స్ ఫిలానీ ఆధ్వర్యంలో10కే రన్
-
నెక్లెస్‌రోడ్‌లో 10కే రన్
-
నడకతోనే ఆరోగ్యం
నడకతోనే ఆరోగ్యం నేటి ఉరుకులు పరుగుల జీవనంలో మనిషి ఆరోగ్యం భిన్న సమస్యలకు గురవుతోంది. బీపీలు, షుగర్ వ్యాధి బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. దీంతో ఆరోగ్యవంతమైన సమాజం రానురాను కనుమరుగైపోతుందేమోననే భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అనారోగ్యం బారిన పడినవారు కొందరు ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు మరికొందరు.. ముందస్తు జాగ్రత్తలో ఇంకొందరు.. కారణాలు ఏమైనా.. పట్టణ వాసులు జీవనయానంలో ‘నడక’ను తప్పనిసరి చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉదయమో, సాయంత్రమో గంట నుంచి రెండు గంటల పాటు నడుస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పట్టణంలోని డీఏఆర్ కళాశాలలో గతంలో ఉదయం వాకర్లు పెద్దగా కనిపించేవారు కాదు. అయితే కొన్ని నెలలుగా రానురాను వాకింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉదయం పూట కళాశాల గ్రౌండ్లో 150 నుంచి 2 వందల మంది వరకు వాకింగ్ చేస్తున్నారు. మైలవరం రోడ్డు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, ముసునూరు రోడ్లతోపాటు జంక్షన్ రోడ్డు, విజయవాడ రోడ్డులలో వందలాది మంది నడుస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు ఇప్పటికే చాలామంది ఉదయాన్నే నడకబాట పట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా రు. ఈ నేపథ్యంలో వాకర్స్ అభిప్రాయాలు.. రోజంతా ఉత్సాహమే ఉదయం ఒక గంటసేపు వాకింగ్ చేస్తే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అలసట అనేది లేకుండా పని చేయగలుగుతున్నాను. అందరం కలసి అరగంట సేపు జోక్‌లు వేసుకుం టూ హాయిగా నవ్వుకుంటాం. కొత్త మిత్రులు పరిచయమవుతున్నారు. విజ్ఞా నం పెరుగుతోంది. 5 సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నా. - శ్యామ్ యాంత్రిక జీవనంలో అవసరం యాంత్రికంగా మారిన ప్రస్తుత జీవన విధానంలో నడక ఎంతో అవసరంగా మారింది. రోజురోజుకు బీపీ, చక్కెర వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. శ్రమ అవసరాన్ని ఇప్పుడిప్పుడే గుర్తించి అవగాహన పెంచుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తున్నా. - రమేష్ 20 ఏళ్లుగా వాకింగ్ చేస్తున్నా రోజులో రెండుగంటల పాటు చేస్తున్న వాకింగ్‌తో ఒత్తిడి లేకుండా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతోంది. వాకింగ్ చేసిన తరువాత అ - నౌడు నాగమల్లేశ్వరరావు అరగంట సేపు వ్యాయామం కూడా చేస్తాను. దాదాపు 20 ఏళ్లుగా వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్‌కు రానిరోజు ఏదో వెలితిగా ఉంటుంది. - రత్తయ్య వాకింగ్ ఎంతో అవసరం పట్టణాలలో ఒకరికొకరు సంబంధం లేకుండా జీవిస్తున్న నేపథ్యంలో వాకింగ్ కోసం గ్రౌండ్‌కు రావడం వల్ల ఆరోగ్యానికి హాయిగా ఉంటోంది. కొత్తకొత్త పరిచయాలు పెరుగుతున్నాయి. అలాగే రోగాలతో బాధపడేవారే సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శ్రమ అనేది ఎంతో అవసరం. - నౌడు నాగమల్లేశ్వరరావు -
ఈనెల 9న ‘సమైక్య’పరుగు
సాక్షి, ఏలూరు :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా జై సమైక్యాంధ్ర రన్‌ను నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఎంపీ, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. శనివారం సాయంత్రం ఏలూరు రెవెన్యూ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరు నగరంలోనూ జై సమైక్యాంధ్ర రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దాదాపు లక్ష మందితో స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఇండోర్‌స్టేడియం వరకూ 3 కిలోమీటర్ల సమైక్యాంధ్ర రన్ జరపనున్నట్లు ఆయన వివరించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చివరి వరకూ అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. సమైక్య ఉద్యమంలో ఉద్యోగులు, మీడియా పాత్రను లగడపాటి ప్రశంసించారు. నిరుత్సాహ పడి పోరాటాన్ని ఆపాల్సిన అవసరం లేదని, ఈ నెల 21న విజయోత్సవం చేసుకోవచ్చని రాష్ట్రం ఖచ్చితంగా విడిపోదని అన్నారు. 2004లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నానని, అనివార్య కారణాల వల్ల విజయవాడ నుంచి పోటీ చేశానని గుర్తుచేశారు. ఇక ముందు కూడా విజయవాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తన సీటు వేరొకరికి ఇచ్చినా రాష్ట్రం సమైక్యంగా ఉంచితే వారికి సహకరిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఎల్.సాగర్, జిల్లా కార్యదర్శి టి.యోగానందం, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బడేటి వెంకటరామయ్య, ఫ్లాష్ సంస్థ నిర్వాహకుడు యర్రంశెట్టి శ్రీనివాస్, ఏపీఎన్జీ సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, కె.రమేష్‌కుమార్ పాల్గొన్నారు.